Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label AP News. Show all posts
Showing posts with label AP News. Show all posts

Wednesday, April 24, 2013

శీలం ఖరీదు రూ.5 వేలు!

కుభీర్, ఏప్రిల్ 23 (: ఆడపిల్ల అంగడి సరుకైంది. మృగాడిలా ప్రవర్తిస్తున్న మగాడి ఎదుట బలి పశువవుతోంది. డబ్బున్న వాళ్ల చేతిలో మహిళ ‘పే అండ్ యూజ్’గా మారిపోతోంది. అత్యాచారంపై దేశరాజధాని వీధుల్లో ఆందోళనకారులు ఆగ్రహంతో రగిలిపోతుంటే.. ఆదిలాబాద్ పల్లెల్లో మాత్రం అమానుషం రాజ్యమేలుతోంది. అత్యాచార బాధితురాలి శీలానికి గ్రామ పెద్దలే వెలకట్టి అబలను అపహాస్యం చేస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయించకుండా, అతడికే వత్తాసు పలికారు. ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి, సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి ఓ గిరిజన కుటుంబం వలస వచ్చిం ది. భర్త పాలేరుగా, భార్య కూలీ పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు.

ఈనెల 20న ఉదయం 9గంటల ప్రాంతంలో భర్త పనుల కోసం వెళ్లా డు. గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజావూపతినిధి వారి ఇంట్లోకి చోరబడి గిరిజన మహిళ (33)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని ఇరుగుపోరుగు అక్కడకు చేరుకునేలోపే అతగాడు పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పిన భార్య భోరున విలపించింది. అత్యాచా రం చేసిన వ్యక్తి.. గ్రామంలోని నలుగురు పెద్దమనుషులను ఆశ్రయించాడు. తనను గట్టెక్కించాలని రాయబా రం నడిపాడు. దీంతో సోమవారం బాధితురాలి భర్తకు మద్యం తాగించి పంచాయతీ పెట్టారు. బాధితురాలి శీలానికి వెల కట్టారు. జరిమానాగా రూ. 5వేల విధించగా, రూ.35వేలు అక్కడికక్కడే చెల్లించారు. మిగతా రూ.50 వేలు 29న చెల్లించాలని ఆదేశించారు. బాధిత మహిళ సంఘటన జరిగిన నాటినుంచి కుమిలిపోతుండడంతో ఆమెను స్థానిక మహిళలు ఓదార్చుతున్నారు. బాధను దిగమింగేందుకు ఆమె భర్తకు ప్రతిరోజు మద్యం తాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై గ్రామస్తులను ఆరా తీయగా ఘటన వాస్తమేనని చెప్పారు. కుభీర్ ఎస్‌ఐ తోట సంజీవ్‌ను వివరణ కోరగా అత్యాచారం ఘటన తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని సెలవిచ్చారు.

Read more...

Sunday, January 13, 2013

నిత్యం తోడేళ్ళు సంచరిస్తుండే లోకంలో చెల్లీ ! జర జాగ్రత్త !



roadఢిల్లీ ఉదంతం తర్వాత దేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. చదువుకునే లేదా ఉద్యోగాలు చేసే తమ బిడ్డలు ఎంత సురక్షితంగా ఉన్నారన్న సందేహం వారిని వెంటాడుతోంది. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పరిసరాలు ఎంత పదిలమో పరిశీలించుకునేందుకు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ అందిస్తున్న సూచనలు.

క్రూర మృగాలుండే దట్టమైన అడవుల్లో కూడా ఒకే చక్కటి నిబద్ధత ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఈ క్రూరమృగాలు అనవసరంగా బలహీన జంతువులను తమ వినోదం కోసం చంపవు. చిన్న ప్రాణుల ప్రాణాలతో ఏ క్రూరమృగం చెలగాటాలు ఆడవు. మరి ఇదే నిబంధన మన సభ్య సమాజానికి వర్తిస్తుందా? ఢిల్లీలో మొన్న జరిగిన కిరాతకం, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇంకా ఎన్నో సంఘటనలు, మనల్ని మరోలా ఆలోచించేట్టు చేస్తున్నాయి.

ఈ కాలంలో ఇటు అమ్మాయిలూ, అటు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయిల భవిష్యత్తు బంగారు బాటగా మారేట్టు జాగ్రత్త పడాలి. అమ్మాయిలను సమస్యల వలయంలో చిక్కుకోకుండా కాపాడుకోవాలి. అమ్మాయిలు కూడా తమను తాము నియంత్రించుకోవాలి. అలాగని ఇంతవరకు జరిగిన విపత్తులకు అమ్మాయిలే బాధ్యులు అని అనుకోవడం, అతిపెద్ద పొరపాటు. అమ్మాయిల జీవితాలు సవ్యంగా ఉండేలా, వాళ్ళు సవ్యంగా ఎదిగి, వాళ్ళ జీవితం మూడుపువ్వులు, ఆరు కాయలు కావడా నికి, వాళ్ళేమి చేయాలి? అమ్మానాన్నల బాధ్యతలేమిటి? అన్న విషయాలను చర్చించు కోవడం సమంజసమే.

చదువు పైనే ధ్యాస
విద్యార్థినులు ఐడిల్‌గా ఉండకూడదు. చదువుతూ పోవాలి. ప్రఖ్యాత సైంటిస్ట్ ఇజాక్ న్యూటన్ కదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుందని, చలనం లేని వస్తువు నిశ్చలంగానే ఉంటుందని తెలిపాడు. ఇది చదువుకూ వర్తిస్తుంది. శ్రద్ధతో చదువుతున్న విద్యార్థి చదువుతూ ఉంటే, పుస్తకమే ముట్టని వాళ్ళు, యధాతధంగా ఉండిపోతారు. అందుకే అమ్మాయిలూ ఎప్పుడూ చదువుతూ పోవాలి. వాళ్ళెప్పుడు చదువు గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఆలోచనలు ప్రవర్తనల కింద మారుతాయి. ఈ ప్రవర్తన అలవాటు కింద మారుతుంది. అప్పుడు సినిమాలు, షికార్లు, బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచనలు మనసులో మెదలాడవని మనకు తెలుసు. అలాగని అమ్మాయిలు సినిమాలు చూడ కూడదని, షికార్లకు వెళ్లకూడదని అనుకోకూడదు. చదువుకుంటూ అవన్ని చేయవచ్చు. కానీ వాళ్ళు బాయ్‌ఫ్రెండ్స్‌తో సమయం వెళ్ళబుచ్చుతూ, తీసు కోవలసిన జాగ్రత్తల్ని మాత్రం మరవొద్దు.

మంచి స్నేహం ఒక కవచం
పాత కాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు యోధులు కవచాన్ని ధరించేవారు. ఈ కవచం శత్రువుల కత్తిపోట్ల నుంచి యోధుణ్ని రక్షించేది. స్నేహం కూడా ఈ కవచంలాంటిదే. కవచం శరీరాన్ని కాపాడితే, స్నేహం మనస్సును గాయపడకుండా కాపాడుతుంది. స్నేహం కేవలం మనస్సును బాధలతో తట్టుకునేట్టు కాపాడడమే కాకుండా, మనిషి జీవితం లోనే ఒక సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది. అందుకే ‘ఏనాయిస్ నిన్’ అనే ప్రముఖ విద్యావేత్త ఉద్దేశ్యం ప్రకా రం ప్రతి మిత్రుడు మనకొక కొత్త ప్రపంచం. మిత్రుడు తారసపడే వరకు మనకు ఈ ప్రపంచమే లేదు. వాళ్ళను కలుసుకున్న తక్షణమే ఈ కొత్త ప్రపంచం ఎల్లలు మనసు స్పర్శిస్తాయి.

హెన్రీ స్టాక్ సుల్లివాన్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ మిత్రత్వానికి ఎక్కువ ప్రముఖ్యత ఇస్తాడు. విద్యార్థుల మానసిక మెరుగుదల, ఎదుగుదల మిత్రుల పైననే ఆధారపడి ఉంటుందంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు అడాలిసెంట్స్, ప్రధమం గా మిత్రులతోనే చెప్పుకుంటారని, పార్లీ అనే సైకాలజిస్ట్ చెబుతాడు. మంచి స్నేహితురాలు విద్యార్థినికి ఒక కొత్త స్పూర్తిని ఇస్తుంది. ఒక చక్కటి గమ్యాన్ని నిర్ణయించుకొనేందుకు సహకరిస్తుంది. అల్లరి చిల్లరగా తిరుగుతూ, ప్రస్తుత కోరికల సంతృప్తికే ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి స్నేహితు రాలుగా దొరికితే మాత్రం ఒక సమస్యగా మారుతుంది. తాజెడిన కోతి, వనమెల్ల చెరిచింది అనే సామెత మాదిరి, ఈ అమ్మాయి స్నేహం వలన మిగతా పిల్లలు కూడా ఇదే వంతు పాట పాడుతారు. అప్పుడు అమ్మాయిలు ప్రమాదాల్ని ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకే అమ్మాయి స్నేహితులు ఎలాంటి వాళ్ళు అన్నది అమ్మానాన్నలు గమనించాలి. అలాగని అమ్మాయిల పైన మరీ పోలిసీంగ్ కూడా చెయ్యకూడదు.

తెలివితేటలు దేవుడిచ్చిన బహుమానం
మనం ఒక మిత్రుని పుట్టిన రోజు పార్టీకి వెళ్లామని అనుకుందాం. అతనికి మనమొక చక్కటి బహుమానం తీసుకెళ్ళతాము. ఈ బహుమానాన్ని మిత్రునికి ఇచ్చినప్పుడు, అతని దాన్ని దగ్గరున్న చేత్త బుట్టలోకి విసిరేస్తే, మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. లాగి లెంపకాయ కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. మనమిచ్చిన బహుమానాన్ని అవమానపరిస్తే,మనల్ని అవమానపరచినట్టు బాధ పడతాం. మరి తెలివితేటలు దేవుడు మనకి చ్చిన బహుమానం.ఈ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించి మనం ఎదగకపోతే, దేవున్నే అవ మానపరిచినట్టు అవుతుంది కదా? ఈ విషయాన్ని అమ్మాయిలు గుర్తుంచుకోవాలి. ఒకవేళ అమ్మాయి లు మరచి పోతే అమ్మానాన్నలు గుర్తు చేయ్యాలి.

నాకెలాంటి ప్రమాదం వాటిల్లదు
మరణం పట్ల అందరికుండే ఆలోచన మనందరికి తెలుసు. మరణం ఖాయమైనప్పటికి, ‘ఇది నాకు వర్తించదు మిగతా వాళ్ళకే ఇది పరిమితం. నేను చనిపోను. అని ప్రతి వ్యక్తి అనుకుంటాడు’ అని జొనాధన్ బ్రూనెస్టీన్ అనే ప్రముఖ ఫిజిషియన్ అంటాడు.

దీన్నే సైకాలజీలో ఎస్కేపిజం అని అంటాము. ఇలాంటి ఎస్కేపిజం మనం అడోలిసెంట్స్ దశలో గమనిస్తాం. ఈ దశలో ఉన్న పిల్లలు, అమ్మాయిలైన, అబ్బాయిలైనా చాలా రాష్‌గా ప్రవర్తిస్తారన్ని మనకు తెలిసిందే. నాకెలాంటి ప్రమాదం వాటిల్లదు, అనే ఆలోచన వీరిది. ఈ దశలో వీళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ఈ వయస్సులో మరణించడం జరిగితే, 40శాతం పైగా మోటారు ప్రమాదాల్లో జరుగుతుందని సర్వేలు తేలిపాయి. కేవలం మోటార్ సైకిల్స్, కార్లు వేగంగా నడపడమే కాదు, వీళ్ళ జీవితమే ఫాస్ట్‌లేన్‌లో ఉంటుంది. సెన్సేషన్ -సీకింగ్ వీళ్ళ వేదాంతం. అందుకే ఈ వయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు అనవసరమైన రిస్క్ తీసుకుంటారు. చీకటిపడ్డా ఒంటరిగా పోవాలను కుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి సమయాన్ని పట్టించుకోకుండా ఇంటికి రావాలనుకుంటారు. నాకేమీ జరగదులే అని భావిస్తారు. అమ్మానాన్నలు, అమ్మాయిలను ఇలా ప్రవర్తించకుండా నియంత్రిం చాలి. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న వ్యవహారాలు మనందరి కళ్ళు తెరిపించాలి.

ప్రేమ ఒక ఎండమావి ఈ కాలంలో కొంతమంది అమ్మాయిల సమస్యల్లా, ప్రేమలో పడ్డామని భ్రాంతి పడడం. ఈ భ్రాంతి వీళ్లను , అబ్బాయిలైతే స్వేచ్ఛగా తిరిగేట్టు ప్రేరేపిస్తుంది. ప్రేమించాను అని అనుకున్న అబ్బాయిలైతే సినిమాలు, షికార్లు మొదలవుతాయి. అప్పుడు అమ్మానాన్నల మాటలు నీటి మూటలనిపిస్తాయి. చదువు కాస్తా చట్టబండలౌతుంది. నిజం చెప్పాలంటే ఈ వయస్సులోని అమ్మాయిల్లో చెలరేగే శారీరక ఉత్తేజాన్ని ప్రేమ అని నిర్వచించడం పొరపాటు. ఇది కేవలం ఈవయస్సులో శరీరాల్లో విడుదలవుతున్న హార్మోన్స్ ప్రభావం వల్ల, వీళ్ళలో కలిగే శారీరక ఉత్తేజం అని , ప్రేమ కాదని తెలుసుకోవాలి. అందుకే వీళ్ళు ప్రేమ అనుకునే ఈ మానసిక స్థితి ఎక్కువ కాలం నిలవదు. సైకాలజిస్ట్‌ల సర్వేల ప్రకారం అడోల్‌సెంట్స్ లో ప్రేమనుకొని దగ్గరయ్యేవాళ్ళు, అతి త్వరలోనే మళ్ళీ దూరమవుతారని తేలిపోయింది. అందుకే ప్రేమని భ్రమపడి, కొంతకాలం రాసుకొని,పూసుకొని తిరిగిన అమ్మాయిలు త్వరలోనే తెలుసుకొని, అబ్బాయిలనుండి విడిపోతారు. ఇటు అబ్బాయేమో, ‘మనసు పారేసుకున్నాను,సినిమాలకు, షికార్లకు ఈమెను తిప్పి నా మొత్తం డబ్బు తగలేసాను.

అయినప్పటికి ఈమె నాకు చెయ్యిచ్చింది.’ అనుకొని బాధపడతాడు. ఈ అబ్బాయి కాస్తా పోకిరి వాడైతే లేదా దుష్ట స్వభావం కలవాడైతే అమ్మాయికి ప్రమాదమే. ఇలాంటి అబ్బాయిలు యాసిడ్ దాడులు చేయ్యొచ్చు. ఇంకేదైనా దుష్ట చేష్టలు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే, వయస్సులో ఉన్న అమ్మాయిలు ఎక్కువ సమయం అబ్బాయిలతో ఒంటరిగా కలిసి తిరుగకూడదు. గ్రూప్‌లో అందరితో కలిసి మాత్రమే మెలగాలి. అలాకాకుండా అమ్మాయి ఒంటరిగా అబ్బాయితో కలిసి తిరుగుతూ సమయం గడుపుతుందంటే, అమ్మానాన్నలు తెలుసుకుని తక్షణం రంగంలోకి దూకాలి. పనుల్లో మునిగి, ఆలస్యం చేయకూడదు.

Read more...

Thursday, December 27, 2012

Muslim women on top in the battle against premarital sex: US Study

Hyderabad, December 26:
The burqa really works. When you cover your women head to toe with cloth to keep them from being viewed by men outside their family, and you keep them strictly segregated from men throughout their growing years until they get married, you’re going to have less premarital sex.

That was the Rev Paul Sullins’ reaction to a new study on sex outside marriage. Sullins is a sociologist at the Catholic University of America.

With their “True Love Waits” jewelry, conferences and T-shirts, Christians may be the face of the abstinence movement, but Muslims are more likely to abstain from premarital sex.

Of all the world's major religious groups, Muslims are the least likely to have sex outside of marriage, new research found. And as a country's Muslim population grows, the rate of premarital sex declines for all residents, even non-Muslims, according to the study.

Researchers analyzed the responses of over 620,000 people (ages 15-59) who were interviewed as part of the Demographic and Health Surveys in 31 mostly developing nations from 2000 to 2008. Most countries included in the sample had either a Muslim or Christian majority, except India and Nepal, which have Hindu majorities, and Cambodia which has a Buddhist majority. (The United States was not included in the study.)

That’s the conclusion of a new study in the American Sociological Review, which also found that Muslims and Hindus — at least in the developing world — are more likely than Christians and Jews to refrain from extramarital sex.

“All major world religions discourage sex outside of marriage, but they are not all equally effective in shaping behavior,” said Amy Adamczyk of the John Jay College of Criminal Justice, who co-authored the study with John Jay doctoral student Brittany E. Hayes.

Adamczyk said the study evolved from another study she was doing that found countries with large Muslim populations have very low rates of HIV and AIDS. “I was trying to figure out why that would be,” she said. One reason she considered was lower rates of sex outside of marriage.

“In many countries around the world — but in Muslim countries specifically, there’s just much less interaction between the sexes,” said Adamczyk. “It’s just going to be much less likely that they’re going to meet a potentially romantic partner.”

Drawing on the Demographic and Health Surveys funded by the U.S. Agency for International Development, the study included data from 31 developing nations collected between 2000 and 2008. The authors focused on individuals’ responses to questions on religious affiliation, marital status, and sexual behavior outside of marriage.

The authors hypothesized that the larger the proportion of Muslims and Hindus in a country, the lower the rates of premarital and extramarital sex.

Adamczyk and Hayes found that 94 percent of Jews in the nations they studied reported having premarital sex, compared to 79 percent of Christians, 65 percent of Buddhists and 43 percent of Muslims.

As for extramarital sex, 4 percent of Jews reported having sex outside of marriage, compared to 3 percent of Christians. Less than one percent each of Muslims, Hindus and Buddhists reported having extramarital sex.

Suzy Ismail, a marriage and divorce counselor and the author of several books on Muslim marriage, said low rates of premarital and extramarital sex among Muslims are rooted in the religion.

Read more...

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాలు


appadakalu

appadakalu1

appadakalu2

Read more...

28 డెత్‌లైన్ - కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం


Ttime
-కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం
-దోబూచులకు ఇక ఫుల్‌స్టాప్.. వైఖరి చెప్పడంపైనే భవిష్యత్ ఉనికి
-సాగదీతలు సహించలేని స్థితిలోఉరుముతున్న తెలంగాణం
-పార్టీల్లో అఖిలపక్షం గుబులు

హైదరాబాద్, డిసెంబర్ 26 ):ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను రాష్ట్రంలో సున్నితమైన సమస్యగా చిత్రీకరిస్తుందొక పార్టీ! ఈ సమస్య వల్లే పాలనలో అనిశ్చితి నెలకొందని తీర్మానిస్తుంది మరో పార్టీ! ఈ సమస్య తొలగిపోతే అభివృద్ధి పట్టాలకెక్కుతుందని ఆరాటపడేది ఇంకో పార్టీ! తెలంగాణపై వైఖరి చెప్పని అన్ని పార్టీలూ పలికే పలుకుల సారాంశం ఒకటే.. అదే తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం! ఇప్పుడు ఆ పార్టీల ఆవేదన తొలగిపోయే అవకాశం వస్తోంది! రాష్ట్రంలో అనిశ్చితి మటుమాయం అయ్యేందుకు తరుణం ఆసన్నమవుతోంది! అదే కేంద్రం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం! దానికి ముందు ఇది డెత్‌లైన్!! తెలంగాణపై వైఖరి తేల్చడానికి టీజేఏసీ పెట్టిన ఈ డెత్‌లైన్ దాటి ముందుకు పోయే పార్టీలు ఏం నిర్ణయించుకుని అఖిలపక్షానికి వెళతాయన్నదే ఇప్పుడు ప్రశ్న! అఖిలపక్షంలో ఏం మాట్లాడుతాయన్నదే సందేహం! అవి చెప్పే వైఖరిపైనే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీల మనుగడ! ఏం జరుగుతుంది? ఆ పార్టీలు తెలంగాణలో మనుగడ సాగిస్తాయా? ఉనికి నిలుపుకుంటాయా? వాటి అస్తిత్వం తెలంగాణలో నిలబడుతుందా? అఖిలపక్షంతో తేలిపోనుందనేది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీలు దురదృష్టవశాత్తూ మాటలకే పరిమితమవుతున్నాయి.

తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరే పార్టీలే.. సమస్యను ఎప్పటికప్పుడు మరింత జటిలం చేస్తూ పోతున్న వైచివూతికి రాష్ట్ర రాజకీయాలు అద్దంపడుతున్నాయి. వైఖరి చెప్పేసిన పార్టీ లు బిందాస్. ప్రత్యేక రాష్ట్ర సాధనకే పుట్టిన టీఆర్‌ఎస్ వైఖరి విస్పష్టంగా ఉంది. సమైక్యవాదం నుంచి జై తెలంగాణ నినాదం అందుకున్న సీపీఐ.. రాష్ట్ర సాధన సమరంలో దూసుకుపోతున్నది. పార్లమెంటులో బిల్లు పెడితే ఆమోదం పొందేందుకు బేషరతు సహకారానికి బీజేపీ సై అంది. హైదరాబాద్ సహిత తెలంగాణ లేదా రాయల తెలంగాణ అని ఎంఐఎం తేల్చి చెప్పింది. తాను సమైక్యవాదినేనని సీపీఎం కుండబద్దలు కొట్టేసింది! ఇక మిగిలింది మూడు పార్టీలే. తెలంగాణపై ఆది నుంచి దోబూచులాడుతున్న ఆ పార్టీలకే ఇప్పుడు సంకట స్థితి. అందుకే ఈసారి జరిగే అఖిలపక్ష సమావేశం ఆ మూడు పార్టీల్లో గుబులురేపుతున్నది. తెలంగాణ రాష్ట్రం విషయంలో ‘డిసెంబర్ 9’ ప్రకటన శిలాశాసనంగా యావత్ తెలంగాణ ప్రాంతం విశ్వసిస్తున్నది. ఏనాడో సిద్ధించిన రాష్ట్రాన్ని ఆచరణలోకి తేవడమే మిగిలిన ఎజెండాగా భావిస్తున్నది. ఈ క్రమంలోనే అడ్డుపడుతున్న పార్టీలకు అల్టిమేటాలు జారీ అవుతున్నాయి.

తెలంగాణ విషయంలో దోబూచులను నమ్మబోమని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ తీర్పులు వెలువరించారు. వరుస ఉప ఎన్నికల్లో తెలంగాణవాదానికి పట్టంగట్టారు. వ్యతిరేక పార్టీల శవపేటికలకు ఒక్కో ఉప ఎన్నికలో ఒక్కో మేకు దించుతూ వచ్చారు. ఇక పతాక సన్నివేశం!! అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అనేక మతలబులను తెలంగాణ సమాజం చూసింది. కేంద్రంలో తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఎఫ్‌డీఐల ఓటింగ్ గండం నుంచి గట్టెక్కేందుకే ఈ అఖిలపక్షం హామీ వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అఖిలపక్షంతో సాధించేది ఏమీ లేదని, ఇది కేవలం కొత్త హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ తేల్చిపారేశారు. ఈ సమావేశం ఉత్తుత్తిదేనని హోం శాఖ వర్గాలు లీకులు కూడా ఇచ్చాయి.

అయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు.. ఈ సమావేశం తెలంగాణవాదానికి ఒక మూలమలుపుగా కూడా మారనుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్నాయి. టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి.. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అందులోనే తమ అభివూపాయం చెబుతామని ప్రకటనలు చేసింది. ఇప్పుడు సమయం వచ్చింది. తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న వాదననైనా ఆ పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వైఖరి చెప్పకపోతే తెలంగాణ ప్రాంతంలో ఈ మూడు పార్టీలను సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తెలంగాణ ఉద్యమక్షిశేణులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఉన్నాయి. ముసుగులో గుద్దులాటలను ఇక విశ్వసించే స్థితిలో ఈ ప్రాంతం ప్రజలు లేరని వెల్లడైపోయింది. అందుకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకు రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే.. తమ వైఖరి చెప్పకుండా తప్పించుకునేందుకు మార్గాన్వేషణ చేస్తున్న ఈ మూడు పార్టీలు.. నెపాన్ని ఎదుటివారిపైకి నెట్టేసే ఆలోచన చేస్తున్నాయని ఆయా పార్టీల నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమ వుతోంది.

మొత్తంగా టీడీపీ, వైఎస్సార్సీపీలు కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సమస్య మూలాలను తెలుసుకునేందుకు షిండే ఈ సమావేశం ఏర్పాటు చేశారని భావించే పరిస్థితి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలుగా అవి తెలంగాణపై ఏ దృష్టితో ఉన్నాయో తెలుసుకోవడం ఈ ‘అవగాహన’ సమావేశం ఉద్దేశంగా చెబుతున్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలు తమ వైఖరిని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ సమావేశం ఆ మూడు పార్టీలకు జీవవన్మరణ సమస్యగానే మారుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేయడంతో, ఈ సమావేశంలో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆ మూడు పార్టీలపై ఉంది. బాధ్యత నెరవేరుస్తాయా? భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటాయా? అనేది ఆ పార్టీలు వెల్లడించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుందనేది నిపుణుల విశ్లేషణ. వ్యతిరేకం కాదన్న మాటనే స్పష్టగా చెప్పి.. తెలంగాణ ఏర్పాటుకు అడ్డం తప్పుకోవాలనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష! పార్టీ వైఖరిని తేల్చి.. తెలంగాణ ప్రాంతంలో మనుగడకు అవకాశం కల్పించాలనేది ఆ మూడు పార్టీల్లోని తెలంగాణ నేతల ఆశ! అందుకే అందరి దృష్టీ అఖిలపక్షంపైనే!!


Read more...

Tuesday, December 25, 2012

చల్లారిన ఢిల్లీ

 rape 

-ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ విచారణ
-ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు
-భద్రత కల్పిస్తాం: ప్రధాని మన్మోహన్
-ఆందోళనకారులను మావోయిస్టులతో పోల్చిన షిండే
-4న డీజీపీలు, సీఎస్‌లతో భేటీ
-మహిళలమీద నేరాలపై సమీక్ష
-ఢిల్లీ దిగ్బంధం.. తీవ్ర ఆంక్షలు.. భారీగా బలగాలు.. ఆందోళనల కట్టడి
-బాధితురాలి ఆరోగ్యం విషమం
-గ్యాంగ్ రేప్ కేసులో వారంలోగా చార్జిషీట్: పోలీసులు
-ఆందోళనకారులను రెచ్చగొట్టారంటూ రాందేవ్, వీకే సింగ్‌పై కేసులు
-చట్టాల సమీక్షపై జస్టిస్ వర్మ కమిటీ పని ప్రారంభం

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజాక్షిగహానికి కారణమైన యువతి సామూహిక అత్యాచార ఘటనపై సత్వర విచారణకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్యాంగ్ రేప్ ఘటనతోపాటు ఇతర అత్యాచారాల కేసుల విచారణకు ఢిల్లీలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మురుగేశన్ ధ్రువీకరించారు. ఇందుకు జనవరి 2 తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది. యువతి గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందవద్దని, మహిళల భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ‘‘ముగ్గురు కుమ్తాలకు తండ్రిగా నేనూ మీలాగే ఆందోళన చెందుతున్నా. ఈ కిరాతక నేరానికి బాధితురాలిగా మారిన యువతి పట్ల నా భార్య, కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది’’ అని చెప్పారు. ఇండియాగేట్ వద్ద హింసాత్మక ఆందోళనలకు దిగిన నిరసనకారులను హోం మంత్రి షిండే మావోయిస్టులతో పోల్చే ప్రయత్నం చేశారు.

ఇండియా గేట్ వద్ద మావోయిస్టులు వచ్చి ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించాలా? అని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఏసీపీలపై ఢిల్లీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీలో సోమవారం ఎక్కడ చూసినా భద్రతా వలయాలు కనిపించాయి. ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.

at-Jantar-Mantar-in-New-Delగ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ!
-ఢిల్లీలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు
-జనవరి 2 తర్వాత విచారణ
-గ్యాంగ్ రేప్‌పై చర్యలకు ఉపక్షికమించిన ప్రభుత్వం
-ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు
-వారంలోగా చార్జిషీట్: పోలీసులు
-చట్టాల సమీక్షపై జస్టిస్ వర్మ కమిటీ పని మొదలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24:యువతి సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాక్షిగహం వెల్లు నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్షికమించింది. ఈ కేసులో సత్వర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఫాస్ట్‌వూటాక్ కోర్టుల ఏర్పాటు విషయమై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సోమవారం చీఫ్ జస్టిస్ మురుగేశన్‌తో భేటీ అయి చర్చించారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో హస్తినలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ప్రారంభం కానున్నాయని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీ మురుగేశన్ మీడియాకు ధ్రువీకరించారు. ఇటీవలి గ్యాంగ్ రేప్ ఘటన సహా.. అత్యాచార కేసుల్లో రోజువారీ విచారణ జరిపేందుకు ఈ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. సెలవుల అనంతరం హైకోర్టు జనవరి 2న తిరిగి ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫాస్ట్‌వూటాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ నెల 16న నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై జరిగిన కిరాతక సామూహిక అత్యాచారం ఘటనపై ఢిల్లీ సహా, దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ తేజిందర్ కన్నా తన పర్యటనను అర్ధాంతరంగా కుదించుకొని, నగరానికి చేరుకున్నారు. ఆ వెంటనే సీనియర్ పోలీసు అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. దేశ రాజధానిలో మహిళల భద్రతకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో వారం రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని తెలిపారు. ఆదివారం నాటి హింసాత్మక ఆందోళనకు సంబంధించి పోలీసులు నాలుగు కేసులు నమోదుచేశారు. అలర్లకు ప్రోత్సహించారని, హింసకు ప్రేరేపించారనిఆర్మీ మాజీ చీఫ్ వీకేసింగ్,బాబా రాందేవ్‌పై కేసులు పెట్టారు.

జస్టిస్ వర్మ కమిటీ పని మొదలు
లైంగిక దాడుల కేసుల్లో సత్వర న్యాయం, దోషులకు శిక్ష పెంపుదల విషయమై ప్రస్తుతమున్న చట్టాలను సమీక్షించడానికి ఏర్పాటైన ముగ్గురు న్యాయకోవిదులతో కూడిన జస్టిస్ వర్మ కమిటీ సోమవారం తన పనిని ప్రారంభించింది. ఈ అంశంపై జనవరి 5న ప్రజాభివూపాయాన్ని తెలియజేయాలని కమిటీ నోటీసును జారీచేసింది.

కానిస్టేబుల్ పరిస్థితి విషమం :
ఢిల్లీ గేట్ వద్ద నిరసనల సందర్భంగా చెలరేగిన ఘర్షణలోగాయపడిన పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్ సౌకర్యం కొనసాగుతోందని వైద్యులు సోమవారం తెలిపారు.

ఆపదలో ఆదుకునే ‘167’
అత్యాచార నిరోధానికి ఢిల్లీలో ఓ హెల్ఫ్‌లైన్ ప్రారంభంకాబోతోంది. 167 నంబర్‌తో ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఆ నెంబర్‌కు ఫోన్ చేయగానే క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని వారి రక్షించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విజ్ఞప్తి మేరకు టెలికంశాఖ మూడు అంకెల హెల్ఫ్‌లైన్‌ను కేటాయించిందని సోమవారం కేంద్ర టెలికం శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

manmohan-singhభద్రత కల్పిస్తాం.. ఆందోళన వద్దు
-ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్
యువతి గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందవద్దని, మహిళల భద్రత సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ముగ్గురు కుమ్తాలకు తండ్రిగా నేనూ మీలాగే ఆందోళన చెందుతున్నా. ఈ కిరాతక నేరానికి బాధితురాలిగా మారిన యువతి పట్ల నా భార్య, కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది’ అని చెప్పారు. ఈ ఘోరమైన ఘాతుకానికి సంబంధించి జరిగిన జాప్యంపై పరిశీలన జరుపుతామని, మహిళల భద్రతకు సంబంధించి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.


SUSHILఆందోళనకారులు.. మావోయిస్టులు!
-ఇద్దరికీ పోలిక పెట్టిన షిండే
-ఇండియా గేట్‌కు వెళ్లి.. చర్చలు ఎందుకు నిర్వహించాలి
-కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు
-4వ తేదీన అన్ని రాష్ట్రాల డీజీపీ, సీఎస్‌లతో భేటీ
-మహిళలపై నేరాలపై సమీక్ష

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: గ్యాంగ్‌రేప్ ఘటనపై రగిలిపోయి ఉద్యమిస్తున్న ఆందోళనకారులను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాగేట్ వద్ద ఆగ్రహంతో దాడులకు దిగిన ఆందోళనకారులను మావోయిస్టులతో పోల్చారు. గ్యాంగ్ రేప్ ఘటనపై వెల్లు ప్రజాక్షిగహాన్ని అర్థం చేసుకోలేక రాజకీయపార్టీలు సతమతమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ హోంమంత్రి ఇండియా గేట్ దగ్గరికెళ్లి.. చర్చలు జరపాలని చెప్పడం చాలా సులువు. రేపొద్దున్న ఏదైనా పార్టీ కూడా ప్రదర్శన నిర్వహిస్తే..అప్పుడు కూడా హోంమంత్రి వెళ్లాల్సిందే. రేపొద్దున్న కాంగ్రెస్, బీజేపీ కూడా ఇక్కడ ప్రదర్శనలు నిర్వహిస్తాయి. మావోయిస్టులు కూడా ఆయుధాలతో ప్రదర్శనలు నిర్వహిస్తారు’’ అని ఆయన వివిధ ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ‘‘ఈ పరిస్థితి రేపొద్దున్న ఏ ప్రభుత్వానికైనా రావచ్చు. ప్రభుత్వం ఎందుకు వెళ్లాలి?’’ అని ప్రశ్నించారు. ఆందోళనకారులను మావోయిస్టులతో పోలుస్తున్నారా? అని ప్రశ్నించగా ‘‘శాంతి భద్రతల నుంచి దీనిని వేరు చేయలేరు. ఆందోళన మొదలైననాటి నుంచి నిరసనకారుల ప్రతినిధులతో నేను మాట్లాడుతూనే ఉన్నాను.

వారు న్యాయం కోరుతున్నారు. ఏ రకమైన న్యాయం మేమివ్వగలం’’ అని అన్నారు. ఇండియా గేట్ వద్ద ఆదివారం జరిగిన హింసాత్మక ఆందోళన వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. జనవరి నాలుగున అన్ని రాష్ట్రాల డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి.. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై చర్చిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఢిల్లీలో యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి లేదా, అఖిలపక్షం భేటీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఆయన సోమవారం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. ఇటీవల గ్యాంగ్ రేప్ ఘటనతోపాటు మహిళలపై లైంగిక దాడులపై విచారణకు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తిచేశారు. అత్యాచారాలపై సత్వర విచారణ, శిక్ష పెంపు విషయమై ప్రస్తుతమున్న చట్టాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి నివేదిక సమర్పించడానికి నెల రోజులపాటు గడువు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులపై పోలీసుల అణచివేతను షిండే సమర్థించారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు.

Ajmer 

అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం
-ఆగని అంతర్గత రక్తవూసావం
-ఇంకా కృత్రిమ శ్వాసలోనే : వైద్యులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ‘గ్యాంగ్ రేపుకు గురైన పారామెడికల్ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి సోమవారం మరింత దిగజారింది. ఆమె ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు’ అని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆ యువతి మానసికంగా దృఢంగానే ఉన్నారని తెలిపాయి. నిన్నటికన్నా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని ఆమెకు వైద్యం అందిస్తున్న సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ తెలిపారు. అంతర్గతంగా రక్తవూసావం అధికమైందన్నారు. అది గడ్డకట్టి కొత్త సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు. గత రాత్రికూడా విపరీతంగా రక్తవూసావం జరిగిందన్నారు.

ప్రస్తుతం ఆమెకు ఇంకా కృత్రిమంగానే శ్వాసను అందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో గ్యాంగ్ రేపు ఘటన తర్వాత ఈ పారా మెడికల్ విద్యార్థినిని (23) వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పవూతిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఆ ఆమ్మాయి ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని వెల్లడించారు. ఉష్ణోక్షిగత 102 నుంచి 104 డిగ్రీల మధ్య ఉంటోందన్నారు. బైలిర్బిన్ లెవల్ 5.5 శాతానికి తగ్గిందన్నారు. ప్లెట్‌పూట్స్ కూడా తగ్గాయని చెప్పారు. ఇది ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా అవయవాలు సాధారణంగానే పని చేస్తున్నాయని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నాయని వివరించారు. ఆమెకు సైకాలాజీ కౌన్సెలింగ్ ఇంకా కొనసాగుతోందని సైకాలాజీ విభాగం డాక్టర్ రస్తోగీ చెప్పారు. అంతర్గతంగా ఎన్నిగాయాలైనా ఆమె మాత్రం ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు గురికావడంలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ యువతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ప్రమాదం నుంచి బయటపడలేదని ఐసీయూ ఇన్‌చార్జి డాక్టర్ పీకే వర్మ తెలిపారు. ఆమె పరిస్థితి అలాగే కొనసాగుతోందని వివరించారు. కాగా, ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని బాధితురాలి తండ్రి సోమవారం విజ్ఞప్తి చేశారు

Read more...

Sunday, December 23, 2012

రాజుల సొమ్ము..కేసుల పాలు (వారసత్వ పోరులో నలుగుతున్న వేల కోట్ల నిజాం ఆస్తులు)

ఆస్తులపై ఎవరి వాదనలు.. వారివే..
తమకే చెందుతాయంటూ ముందుకొచ్చిన 500 మంది..
ఒకరిపై ఒకరు వ్యాజ్యాలు.. కేసులు..
ముకరం జా ఆస్తుల్లో వాటాల కోసం భార్యా పిల్లల పోటీ

వేల ఎకరాల్లో భూములు.. ఒక్క హైదరాబాద్‌లోనే 630 ప్యాలెస్‌లు.. దేశంలో అనేక చోట్ల భవంతులు.. క్వింటాళ్ల కొద్ది వజ్ర, వైఢూ ర్యాలు... ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకప్పటి నంబర్ వన్, చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్తుల చిట్టా ఇదీ! హైదరాబాద్ కేంద్రంగా 37 సంవత్సరాల సుదీర్ఘ పాలనతో దక్కన్‌లో ఆధునికతకు బాటలు వేసి, ఆపరేషన్ పోలోతో భారత సైన్యాలకు తలవంచిన ఈ నిజాంకు చెందిన అపార సంపద అంతా వివాదాలమయం!!

సాక్షి, హైదరాబాద్: కళ్లు బైర్లుకమ్మే ఆభరణాలు, ఆస్తులు నిజాం కుటుంబానికే చెందుతాయంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ 1947, నిజామ్స్ ట్రస్ట్ వాలిడేషన్ యాక్ట్ 1950) నిజాం పరివారంలో వెలుగులు నింపినా.. ‘వారసత్వ పోరు’తో అవి కాస్త మసకబారాయి. ఆ ఆస్తులకు వారసులం తామంటే.. తామంటూ వారసులు అమీతుమీకి సిద్ధమయ్యారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్(1886-1964) అనంతరం ఆయన కుమారులు ఆజం జా, మోజం జాల తరం వరకు గుట్టుగా జీవనం సాగించిన నిజాం వారసులు.. ఆస్తుల వివాదంతో మరోసారి తెరపైకొచ్చారు. ఆజం మొదటి కుమారుడు 8వ నిజాం హైదరాబాద్ ప్రిన్స్ ముకరం జా (79)... తన భార్యలు, వారి పిల్లలతో ఆస్తి వివాదాల్లో మునిగి తేలుతుండగా.. ఆజం మరో కుమారుడు ముఫకం జా తన తోబుట్టువులు, వారి పిల్లలతో పంచాయతీల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ అలీఖాన్.. ఆయన వారసులు-వివాదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...


హైదరాబాద్ విలీనం సమయంలో ఏం జరిగింది..?

1911 నుండి 1948 వరకు హైదరాబాద్ కేంద్రంగా రాచరిక పాలన చేసిన ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను ఓ స్వతంత్య్ర రాజ్యంగానే ఉండాలని కోరుకున్నారు. కానీ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత సైన్యాలు చేసిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయక తప్పలేదు. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనానికి ప్రతిఫలంగా అలీఖాన్ భారత ప్రభుత్వంతో ఒప్పందం (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు. నిజాంకు చెందిన ఆస్తుల జోలికి వెళ్లమని, తన సొంతమని భావించే ఆస్తులకు సంబంధించి చట్టపరమైన రక్షణలు ఇస్తామని నాడు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఇందులో భాగంగానే నిజాం సమర్పించిన తన ప్రైవేటు ఆస్తుల చిట్టా ‘బ్లూ బుక్’ను ఆమోదిస్తూ 1950 జనవరి 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూరా ఉన్న 23 వేల ఎకరాల (సర్ఫెఖాస్) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, మహేబలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న 630 భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ వెంకటాచారి ఉత్తర్వులు వెలువరించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చౌమహల్లా, ఫలక్‌నుమ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా, ఫెర్న్ విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ప్లజెంట్ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర , వైఢూర్యాలు నిజాం కుటుంబం సొంతమయ్యాయి. అయితే ఈ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా చేర్చింది. ఫలితంగా 28 రకాల ట్రస్ట్‌లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, నిజాం కుటుంబ సభ్యులతో పాటు మాజీ సివిల్ సర్వీసు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

వారసులు వచ్చారిలా..

నిజాంకు సంబంధించి దాదాపు 90 శాతం ఆస్తులు న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయి. తాజాగా 8వ నిజాం ముకరం జా (ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఆజం జా మొదటి కొడుకు) మూడో మాజీ భార్య మనోల్యా ఒనూర్, ఆమె కూతురు నీలోఫర్‌లు.. చిరాన్ ప్యాలెస్ తమకే వస్తుందని ప్రకటించారు. మరోవైపు తన వాటా కింద ముఫకం జా ట్రస్ట్ అధీనంలో ఉన్న మౌంట్‌ప్లజెంట్ (ముఫకం జా కాలే జీ) వస్తుందంటూ ముఫకం జా (ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు) కోడలు సఫియా సఖీనా కోర్టును ఆశ్రయించారు. దక్షిణ ముంబై మలబార్‌హిల్స్‌లోని రూ.400 కోట్ల విలువ చేసే 5,000 గజాల స్థలానికి వారసులం తామేనంటూ జమీన్ అలీఖాన్, కుద్రత్, ఫిర్సాత్ అలీఖాన్‌లు ముంబై కలెక్టర్‌కు ఇటీవలే లేఖ రాశారు. ఇందుకు తీవ్ర అభ్యంతరం చెబుతూ 8వ నిజాం ముకరం జా కలెక్టర్‌కు మరో లేఖ సంధించారు. ఇవిగాకుండా నిజాం ప్రైవేటు ఆస్తిగా పేర్కొనే సర్ఫేఖాస్ భూములపై వేల సంఖ్యలో కేసులు సిటీ న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. నిజాం ఆస్తులకు వారసులం తామంటే.. తామని అనేక మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే ముకరం జా కొడుకు అజ్మత్ జా తాజాగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. ఆస్తుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఏడో నిజాం తర్వాత.. ఎవరికి వారే యమునా తీరే!

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తర్వాత.. నిజాం కుటుంబం ఎవరికి వారే విడిపోయారు. తామే నిజాం వారసులమంటూ ఇప్పటిదాకా ఐదు వంద మందికిపైగా ముందుకు రావడం విశేషం. ఎనిమిదో నిజాంగా ప్రకటించుకున్న ముకరం జా అధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టాలు అందుకున్న ఈ హైదరాబాద్ ప్రిన్స్ విలాసాలకు చిరునామా. ఈయన తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959-75), తర్వాత ఎయిర్ హోస్టెస్ హెలెన్ (1980-90)ను ,ఆపై అప్పటి మిస్ టర్కీ మనోల్యా ఒనోర్‌ను (1990-96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాక్’ చెప్పేశారు. ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్‌లతో కలిసి ఉంటున్నారు. మొత్తంగా చూస్తే ఈయనకు మొదటి భార్య ద్వారా ఇద్దరు (కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడో భార్య ద్వారా కూతురు (నీలోఫర్), నాలుగో భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు.

ఆస్తుల అన్యాక్రాంతం సరికాదు: న్యాయనిపుణుడు వెంకట రమణ

‘‘రాజభరణాల రద్దు తర్వాత నిజాం కుటుంబానికి ఎలాంటి ప్రత్యేక హోదాలు, హక్కులు లేవు. అయినా వారి పేర్లపై వందల ఎకరాల భూములు, ఆస్తులు, అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయి. వారు ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తుల అన్యాక్రాంతం చేస్తున్న దృష్ట్యా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ట్రస్ట్‌ల తీరుపై వెంటనే విచారణ చేపట్టాలి.’’

నిజాం సంతానం ఇదీ...

ఉస్మాన్ అలీఖాన్-దుల్హన్ పాషా దంపతులకు ఇద్దరు కొడుకులు ఆజం జా, మోజం జా, ఓ కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం. ఆజంజా టర్కీకి చెందిన దురేషెవార్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముఖరంజా, ముఫకం జా ఇద్దరు కొడుకులు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బతికి ఉండగానే తన వారసునిగా అంటే 8వ నిజాంగా ముకరం జాను ప్రకటించాడు. మోజం జా తొలుత నీలోఫర్ (టర్కీ)ను పెళి ్లచేసుకున్నాడు. విడాకుల అనంతరం రజియాబేగం, ఆ తర్వాత అన్వర్ బేగంలను పెళ్లాడాడు. వీరిలో ఆయనకు రజియాబేగం ద్వారా ఫాతిమా, అమీనా, ఓలియా కుల్సుం ముగ్గురు కూతుళ్లు కలిగారు. చివరి భార్య అన్వర్ బేగం ద్వారా కొడుకు శ్యామత్ అలీఖాన్ జన్మించాడు.

చిరాన్ ప్యాలెస్ నాకే రావాలి

నాన్నను చూడక రెండేళ్లవుతోంది. కలుసుకునేందుకు ప్రయత్నించినా కొందరు అడ్డుకుంటున్నారు. అందుకే నాన్న (ముకరం జా) ఆస్తిలో వాటా కోసం నేనిప్పుడు అమ్మ ఓనూర్‌తో కలిసి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం కొడుకులకు రెండు వంతులు, ఆడ పిల్లకు ఒక వంతు ఆస్తి ఇవ్వాల్సిందే. నాన్నను చూసేందుకు న్యాయ పోరాటం చేస్తా. లెక్క ప్రకారం కేబీఆర్ పార్కు పరిసరాల్లోని చిరాన్ ప్యాలెస్ పూర్తిగా నాకే రావాలి.
- నిలోఫర్ (ముకరం జా మూడో భార్య మనోల్యా ఓనూర్ కూతురు)

లాయిడ్స్ బ్యాంక్‌లో తేలని వివాదం
1947లో ఆపరేషన్ పోలో సమయంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ ద్వారా అప్పట్లో లక్షా ఎనిమిది వేల (ప్రస్తుత విలువ రూ.240 కోట్లు) పౌండ్లను లాయిడ్ బ్యాంక్ ఆఫ్ లండన్‌లో డిపాజిట్ చేయించిన వివాదం ఇంకా సమసిపోనేలేదు. 1947 అనంతంర భారత్, పాకిస్థాన్ విడిపోవటం, లాయఖ్ అలీ తాను పాక్ జాతీయుడిగా పేర్కొనటంతో ఆ మొత్తం ఎవరికి చెందుతుందన్న అంశం 65 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. అయితే 2003 నుంచి భారత ప్రభుత్వం ఈ మొత్తం తమకే చెందుతుందని వాదిస్తోంది. ఈ మొత్తం భారత్‌కు వస్తే అందులోనూ నిజాం వారసులకు వాటా వచ్చే అవకాశం ఉంది.

లండన్‌లో ముఫకం జా..


మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు ముఫకం జా. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు.

Read more...

Wednesday, December 19, 2012

ఇవి మంచి పెయిన్ కిల్లర్లు


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..

ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు. ఓసారి మనమూ ట్రై చేద్దామా..!

curd
పెరుగుతో పొట్ట క్షేమం
మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

FreeGreatPicture
హెర్బల్ టీ
తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.

cherries
చెర్రీతో కీళ్లు భద్రం
చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.

pasupu
పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..
ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.

alllam
ఆర్థరైటిస్‌కి అల్లం
జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

fish
నడుంనొప్పికి చేప
మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read more...

Sunday, December 16, 2012

డాడీనే మమ్మీ

 chaild1
‘పిల్లల్ని పెంచడం’ అనే బాధ్యత గురించి మాట్లాడుకున్న ప్పుడు సాధారణంగా తల్లిదండ్రుల బాధ్యత, తల్లి బాధ్యత అనేవే ప్రము ఖంగా ప్రస్తావనకు వస్తాయి. పిల్లల్ని నాన్న పెంచడం అనేది నిజ జీవితంలో అరుదుగా, సినిమాల్లో అందంగా కనిపిస్తుంటుంది. కానీ రోజు లు మారాయి. బాధ్యతలు కూడా మారాయి, ఇది వరకటి రోజుల్లో అయితే అమ్మ ఎప్పుడూ ఇంట్లో నే ఉండేది కాబట్టి పిల్లల సంగతి మొత్తం అమ్మే చూసుకునేది. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా పిల్లల్ని తీసుకునే వెళ్ళిపోయేది. తండ్రి మాత్రం మహరాజులా పిల్లల బాధ్యత లకు దూరంగానే ఇంతకాలం ఉంటూ వచ్చాడు.ఇప్పుడు అమ్మ కూడా ఉద్యోగం చేస్తోంది. టూర్లు వెళ్తోంది. అయినా ఏ ఆఫీసు పనీ లేకపోయినా, అమ్మకి కూడా తన స్నేహితురాళ్ళతో కలిసి అలా ఏ అవుటింగ్‌కి అయినా వెళ్ళి రావా లని ఉండదా? ఇలా మారిన ఆధునిక వాతావరణంలో పిల్లల్ని పెంచే బాధ్యతను తండ్రి కూడా నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది. మరి ఇంతకాలంగా అలవాటు లేని పనిని నాన్న సరిగా నిర్వహించగలడా? పిల్లల్ని పొద్దున్నే నిద్రలేపడం, బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, స్కూలుకి తయారుచేయడం, టిఫిను బాక్సులు సర్దిపెట్టడం, తినిపించడం వీటన్నింటికి తోడు వీరు చేసే అల్లరిని భరించడం, సముదా యించడం ఇలా ఒక తల్లి ఎంతో నేర్పుగా, ఓర్పుగా చకచకా చేసే పనులను తండ్రి ఎంత సమర్థవంతంగా చేయగలడు? ఈ ప్రశ్నకు జవాబు ఏదైనా సరే తప్పనిసరిగా ఇప్పుడు తండ్రి అవన్నీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలియక పోయినా తెలుసుకొని, నేర్చుకొని ఈ బాధ్యతలను తండ్రి నిర్వహించవలసిందే. ఇప్పటికే చాలా మంది నాన్నలు ఈ పనులు చక్కగా చేస్తున్నారు కూడా.

డాడీ పెంపకం ఎందుకు కష్టం?
మన సమాజ సంసృ్కతిలో పిల్లల్ని పెంచడం లో ప్రధాన పాత్ర అమ్మదే. అమ్మకి ప్రకృతి సహజంగా ఉండే ఓర్పు, చాకచక్యం యాదృచ్ఛికం గానే వచ్చేస్తాయి. పిల్లలకి ఎప్పుడు ఏం కావాలో? ఏంచెయ్యాలో? ఎవరికి ఏది ఇష్టమో? ఎవరి మనస్తత్వం ఎలాంటిదో? ఎవర్ని ఎలా దారికి తేవాలో? అన్నీ అమ్మకి తెలిసినట్లుగా, నాన్నకి తెలియవు. దీనికి తోడు అమ్మ దగ్గర లేకపోయే సరికి పిల్లలు మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు.. అమ్మ ఎప్పుడొస్తుంది? అని పదేపదే అడుగుతుంటారు. వారి ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులిస్తూ, వాళ్ళని మానసికంగా ఉత్సాహంగా ఉంచడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ పిల్లలు కాస్త అల్లరి వారు, మొండివారు అయితే ఇక ఆ తండ్రి పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి పరిస్థితులలో పొద్దున్న లేచిన దగ్గర్నుండి అమ్మ ఎప్పుడు ఏంచేస్తుందో ప్రతిరోజూ నిశితంగా గమనించిన పిల్లలు, నాన్న అలా చేయకపోవడంతో ఇబ్బందిగా ఫీలవుతారు. నాన్న కి ఏం తెలీదనే అనుకుంటారు. పిల్లలు ఒకరికొ కరు చెప్పుకొని నవ్వు కుంటారు. ‘అలా కాదు డాడి అంటూ తండ్రికి పిల్లలే సలహాలు ఇస్తుంటారు.

తండ్రి పెంపకంలో తల్లి బాధ్యత
పిల్లల్ని తండ్రి ఒక్క డే పెంచవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అందులో ఎంటువంటి ఒడిదుడు కులు రాకుండా ఉండ డానికి తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తాను ఊరికి వెళు తున్నట్టుగా, కొన్ని రోజు లు పాటు ఉండననే విషయాన్ని పిల్లలకి ముందే చెప్పి వాళ్ళని మానసికంగా సిద్ధం చేయాలి. ఎప్పుడంటే అప్పుడు ఫోన్లో మాట్లాడ వచ్చని చెప్పాలి.
పిల్లల అలవాట్లు, దినచర్య, ఎప్పుడు ఏం చేయాలి అనే విషయా లను భర్తకు పూర్తిగా వివరించాలి. అవసరమైతే ఒక కాగితం మీద రాసి ఇవ్వాలి.
పిల్లలకు ఆరోగ్యం గురించిన విషయాలు, ముఖ్యంగా ఇవ్వవలసిన మందులు, పిల్లలకు పడని ఆహారం మొదలైనవి భర్తకి చెప్పాలి.
ఊరు వెళుతున్నందుకు తల్లే ముందుగా బెంగ పడిపోకూడదు. ‘మీరు ఎలా ఉంటారో, ఏమో? అనే మాటలు అసలు మాట్లాడకూడదు.
పిల్లలు తండ్రికి ఎలా సహకరించాలో, వాళ్ళు స్వయంగా ఏయే పనులు చేసుకోవాలో చెప్పాలి. అలా ఉంటే ఊరినుంచి వచ్చేటప్పుడు ఏయే బహుమానాలు తెస్తారో చెప్పాలి.

ఎవరికి వారే !

పిల్లల వ్యక్త్తిత్వం, మనస్తత్వం రూపుదిద్దుకోవడంలో తల్లిదండ్రులిద్దరి ప్రభావా లు వేరువేరుగా ఉంటాయి. ‘పెంపకం’ అనే పదం ఒకరికి సంబంధించినది కాదు. పిల్లలు కేవలం ఒక్క తల్లి పెంపకంలోనే పెరిగినప్పుడు తండ్రి నుంచి నేర్చుకోవలసిన అంశాలను కోల్పోతాడు. అలాగే తండ్రి ఒక్కడే పెంచిన ప్పుడు తల్లి నుండి సంక్రమించే గుణాలను కోల్పోతారు. అమ్మ, నాన్న ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచినప్పుడే అది సంపూర్ణ పెంపకం అవుతుంది. అయితే పరిస్థితుల ప్రభావం వలన తండ్రి ఒక్కడే పిల్లల్ని పెంచవలసిన అవసరం ఏర్పడితే ముందుగా ఈ విషయానికి సంబంధించి పిల్లల మనసులో తలెత్తే అనేక సందేహాలను పూర్తిగా తీర్చడం అత్యంత ముఖ్యమైనది. పిల్లలు ఒక క్లారిటీకి వచ్చేట్లుగా చేయవలసిన బాధ్యత పెద్దలదే. దీని వలన తమని ఒక్కరే పెంచుతున్నారనే విష యంలో పిల్లల్లో కలిగే మానసిక సంఘర్షణ కొంత తగ్గుతుంది.
chaild
-తల్లి గెర్హాజరుతో తండ్రే పిల్లల్ని పెంచవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అది తండ్రికి, పిల్లలకి ఒక చక్కని అనుభవంగా ఉండాలంటే అందుకు తండ్రికి కొంత ప్రిపరేషన్ అవసరం.
-కుటుంబంలో భార్య కూడా ఉద్యోగస్తురాలైనప్పుడు, లేదా మరే ఇతర కారణాల వలన అయిన తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు పిల్లల్ని పెంచవలసిన అవసరం ఏర్పడుతుందనే విషయాన్ని ముందుగానే గ్రహించి, అందుకు తగినట్టుగా ముందునుంచే పెంపకంలో తాను కూడా పాలు పంచుకోవాలి. తండ్రి పెంపకం పిల్లలకు అలవాటయ్యేలా చూడాలి.
-అమ్మ దగ్గర లేకపోయినా నాన్న పెంపకం, నాన్నతో గడిపే సమయం తమకు అద్భుతంగా ఉంటుందని పిల్లలు భావించేలా తండ్రి వర్ణించి చెప్పాలి.
- ఇంట్లో ఉన్నంతసేపూ వాళ్ళతోనే ఆడుతూ, పాడుతూ, డ్యాన్స్‌చేస్తూ గడపాలి. లేకపోతే వాళ్ళకు ఖాళీ దొరికితే అమ్మకోసం ఏడ్చే ప్రమాదం ఉంది.
-పిల్లల ఇష్టాయిష్టాలు, దినచర్య, ఆరోగ్య విషయాలు మొత్తం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తండ్రిలా గంభీరంగా, కోపంగా ఉండకూడదు. పిల్లల్ని బెదిరించకూడదు.
- పిల్లల్ని పెంచడంతో భార్య పద్ధతిని అనుకరించకుండా, తనకంటూ ఒక ప్రత్యేక పద్ధతిని భర్త రూపొందించుకోవాలి. అది పిల్లలకు నచ్చి ‘డాడీ సూపర్’ అనిపించేలా ఉండాలి. అయితే ఈ ప్రక్రియలో పిల్లలు ముందు భార్యని తక్కువ చేసి మాట్లాడకూడదు.
-భోజనం విషయంలో ముందు పిల్లల్ని తినేయమని చెప్పకూడదు. పిల్లలతో కలిసి భోంచేస్తే తండ్రి పెంపకానికి మార్కులు పడతాయి.
-అల్లరి పిల్లలు, మొండి పిల్లల్ని హేండిల్ చేసేటప్పుడు తండ్రికి కూడా భూదేవి అంతటి సహనం ఉండాలి. అప్పుడే ఈ పరీక్షలో తండ్రి గెలవగలడు.
-పిల్లల అల్లరి భరించలేక వారి కోరికలన్నీ తండ్రి తీర్చేయకూడదు. బోలెడన్నీ తిను బండరాలు, బొమ్మలు తెచ్చేయడం, సినిమాలకి ,హోటళ్ళకి తీసుకెళ్ళడం వంటివి చేయకూడదు.
- పొద్దున్నే లేచి పిల్ల్లలు తమ పని తాము చేసుకుంటుంటే పొగుడుతూ ఉండాలి.
- పిల్లల పెంపకంలో తల్లికి, తండ్రికి మధ్య ప్రధాన తేడా పిల్లల ఆకలి, ఆహార విషయంలో కనిపిస్తుంది. వారు వద్దన్నా తినిపించే అమ్మగుణం నాన్న కూడా అలవర్చుకోవాలి.
ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే డాడీ పెంపకంలో పిల్లలు అనేది అటు తండ్రికి, ఇటు పిల్లలకి ఒక మధురమైన అనుభూతిగా ఉంటుంది.

అది తీరని లోటే !
తల్లి తమని విడిచి పెట్టి ఉద్యోగం కోసం దూరంగా ఉండడం పిల్లలకు ఏ మాత్రం నచ్చదు. నాకు తెలిసిన ఒక పాప వాళ్ళమ్మ ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళో ఉంటుంటే- అమ్మమ్మా నువ్వు ఉద్యోగం చేయకుండానే మా అమ్మన్ని పెంచావు కదా, మరి అమ్మ ఎందుకు ఉద్యోగం చేస్తోంది. అని అమ్మమ్మని అడిగిం దంట దానికి అమ్మమ్మ మనవరాలికి సర్థిచెప్పే ఉద్దేశ్యంతో ‘‘నీకోసం పెద్ద టివి కొనడానికి డబ్బులు కావాలిగా అందుకోసం’’ అని చెప్పిదంట. అప్పుడు ఆ పాప వెంటనే ‘నాకు పెద్ద టివి అక్కర్లేదు అమ్మని వచ్చేయమనండి’ అని అందట. నాన్న లేదా ఇంట్లోని ఇతర పెద్దలు ఎంత ఆప్యాయంగా లోటు లేకుండా పెంచినా అమ్మ దగ్గర లేదనే భావన పిల్లల వ్యక్తిత్వ,మనో వికాసంపై ప్రతి కూల ప్రభావం చూపిస్తుంది.

Read more...

Monday, November 19, 2012

16రీళ్ల తెలుగు సినీమాయ!


Cinema44
కోస్తా మిగులు సంపద సృష్టించిన కోట్లు
గతం వైభవం.. నేడు దిగజారుడే నైజం
కొన్ని సామాజికవర్గాలదే ‘డైరెక్షన్’
కొందరు తెరపైనే కథానాయకులు.. వేషం తీస్తే ఫక్తు వ్యాపారవేత్తలు.. కబ్జాకోరులు
రాజధానిలో వందల ఎకరాలు స్వాహా
స్టూడియోల పేరుతో భూములు కట్ చేస్తే మల్టీప్లెక్సుల వ్యాపారాలు
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వంనమస్తే తెలంగాణ
రీళ్ల డబ్బాల్లోకి కోస్తా సంస్కృతి..అదే రాష్ట్ర సంస్కృతిగా ‘షాట్’

మద్రాస్ నుంచి తరలి వచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగావేసిన సీమాంధ్ర సినీ పెద్దలు.. తెలుగు సినిమా రంగాన్ని దిగజార్చిన తీరుపై.. హైదరాబాద్‌ను గుప్పిటపట్టిన వైనంపై.. తెర అసలు స్వరూపాలపై నమస్తే తెలంగాణ సంధిస్తున్న అక్షర శస్త్రాలు.. రేపటి నుంచి..

నిన్న మొన్నటి సినిమా అంటే.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి!ఇది పదహారు రీళ్ల తెలుగు సినీమాయా ప్రపంచం! పుష్కలంగా పారే నీళ్లతో మూడు పంటలూ పండగా పేరుకున్న మిగులు సొమ్ముతో కామందులు ఆక్రమించిన కళా సామ్రాజ్యం!! నలుపు-తెలుపు కాలం నుంచి.. సప్తవర్ణాల దాకా..! మూకీ.. టాకీల నుంచి.. డాల్బీ డిజిటల్ సరౌండ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌ల దాకా! పౌరాణికాల నుంచి జానపదాలకు ఎదిగి.. సాంఘిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ.. అభ్యుదయాన్ని కాంక్షించి.. విప్లవనాదాలు చేసి.. ఫక్తు వ్యాపార ధోరణికి జారి.. బూతును, ఆడపడుచు అర్ధ నగ్న అందాలను వెండితెరపై అమ్మకానికి పెట్టే దిగజారుడు స్థాయికి పడిపోతున్న నాలుగు ఆటల.. మూడు గంటల దందా! మాఫియా, మత్తుమందుల వ్యాపారాలతో ఇప్పుడు మరింత పాతాళంలోకి! కళను నమ్ముకున్న కొందరు దర్శక నిర్మాతలు.. వారు తీసిన కొన్ని ప్రగతిశీల సినిమాలకు మినహాయింపు! ఎక్కువ మందికి సినిమా పెట్టిన పెట్టుబడికి..

అంతకు రెట్టింపు.. వీలైతే పదింతలు సంపాదించుకునే యావే! అందుకే వారికేమీ పట్టవు! సమాజం పట్ల కొరవడిన బాధ్యత.. ఉపాధ్యాయులంటే హాస్యగాళ్లు.. పురోహితులంటే అర్భకులు.. సామాజిక వర్గాలంటే చులకన భావం.. బడుగు జీవులంటే అవహేళన.. అస్తిత్వ ఉద్యమాలంటే ఎక్కడలేని అలుసు! మద్రాస్ నుంచి వస్తూ.. అనేక రాయితీలు తెచ్చుకుని, చట్టాలు మార్పించేసుకుని, హైదరాబాద్‌లో మకాం వేశారు! అంతా ఒక ప్రాంతం వారే! వారు తీసిందే సినిమా.. వారు చూపిందే బొమ్మ! రాష్ట్రం మొత్తం చూసే సినిమా! కానీ.. ఒక ప్రాంతంలో ఒకటిండు సామాజికవర్గ కుటుంబాల భావనలే కథాంశాలు! ఒకే ఒక్కడు.. హీరో! ఎక్కడో కోనసీమ పల్లెల నుంచి వచ్చి.. వంద మందిని ఒకేసారి మట్టికరిపించేస్తాడు! ఒకప్పుడు పాత్రల్లో జీవించేవారు.. ఇప్పుడు నటించడం మానేశారు! గొంతు బాగాలేకపోతే.. డబ్బింగ్.. ఫేస్‌లో హీరో చార్మ్ లేకుంటే ప్లాసిక్ సర్జరీ! అంతా బ్లూస్క్రీన్ మాయ! నాటి తారలు మృదు మధుర శృంగారభావనలను హావభావాలతో ఒలికిస్తే.. నేడు ఒక్కటే సూత్రం ఎక్స్‌పోజింగ్! ఒకప్పుడు సినిమారంగం అంటే కళాపోషణ! ఇప్పుడు ‘కళ’ తప్పి.. పోషణే మిగిలింది! ఆ పోషణ కుటుంబం గడిచేందుకు కాదు.. తరతరాలు గడించకపోయినా.. ఇబ్బంది లేకుండా! నిన్న మొన్నటి సినిమా అంటే..

ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి! స్థానిక డిస్ట్రిబ్యూటర్లు.. దుకాణాలు మూసేసుకోవాల్సిందే! థియేటర్లు రాసిచ్చేయాల్సిందే! కార్మిక నాయకుడిగా కదనరంగాన దూకిన కథానాయకులు..

వేషం తీసేస్తే ఇక్కడ కబ్జాకోరులు! తెరపై హీరోయిన్‌కు కన్నుగీటి.. ప్రేమను బకెట్ల కొద్దీ కురిపించే హీరోలు.. తెర వెనుక కాసుల లెక్కల్లో మునిగితేలుతుంటారు! మానవతావాదాన్ని చాటే మహానటులు.. నిజ జీవితంలో నటులే! హీరోయిన్ బొడ్డు అందంగా చూపడంపై ఎంత శ్రద్ధ పెడతారో.. నగరం నడిబొడ్డున భూములు కొట్టేయడానికీ అంతే తపన! రీళ్ల డబ్బాలు కురిపించిన నోట్ల కట్టలతో జూబ్లీ.. బంజారా గుట్టలను భక్షించి.. మయసభలు కట్టుకున్న సినీమాంవూతికులు! ఇప్పుడు ఆ గుట్టల పరిరక్షణే ధ్యేయం! అందుకే అస్తిత్వ ఉద్యమాలంటే వారికి అసహ్యం.. ఉద్యమాలు విజయం సాధిస్తే తాము కట్టుకున్న కోటలు ఎక్కడ కూలిపోతాయోనని! తెలంగాణ జీవనశైలి అంటే అదేదో పరాయి దేశపుదన్న ఆలోచన! తెలంగాణ యాస అంటే రౌడీలు గూండాలు, అనాగరికులు, లేబరోళ్లు మాట్లాడే భాషగా నిర్ణయం.. ఈ ప్రాంతంలో ఉండేది వారేనని ఒక తీర్మానం! కోస్తా జిల్లాల సంస్కృతే రాష్ట్ర సంస్కృతిగా చిత్రీకరణ.. ఒకటి కాదు.. వంద కాదు.. వేల రీళ్లు తిరిగినా ఇదే దృశ్యం! ఇడ్లీ సాంబారు ప్రస్తావనలే తప్ప.. జొన్న రొట్టెలు, అంబలి కనిపించవు! పండుగల్లోనూ అదే తీరు! ఒకానొక కాలంలో సంక్రాంతి పండుగ ప్రస్తావన లేని సినిమాల్లేవంటే ఆశ్చర్యమే! ఇప్పటికీ అదే తీరు! రాష్ట్రంలో సగభాగం ఎంతో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ పండుగ పేరే ఇటీవలి కాలంవరకూ రాష్ట్రంలోని ఏ సినిమా హాల్‌లోనూ వినిపించలేదంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో వివక్ష! జమీందారు అకృత్యాలపై హీరో పోరాటాలే తప్ప.. రజాకార్లపై తెలంగాణ రైతులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు వెండితెర వేల్పులకు కనిపించలేదు. ఇక వామపక్ష అభ్యుదయ, విప్లవ భావజాలాలను ఏం చేస్తారు? తీసే సినిమాల్లోనూ వాస్తవాల వక్రీకరణలు..

ఒక ప్రాంతంపై దూషణభాషణలు! అదే సొంత ప్రాంతమైతే.. పాత్రలకు అత్యున్నత శిఖరాలు! అందుకే వారికి కొమురం భీమ్ పోరాటం కనిపించదు! మన్యంవీరుడెవరంటే అల్లూరి సీతారామరాజే! నటశేఖరుడు చెప్పాడుగా మరి! ఖాకీ నిక్కరు చొక్కా వేసుకుని.. యోగిలా జీవితం గడుపుతూ గిరిజనులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు.. కాషాయ వస్త్రాలతో.. విల్లంబులతో వెండితెరపై కొత్త.. నాగరిక ముద్ర వేసుకుంటాడు! కొమురం భీం సినిమా విడుదలకు ఏళ్లు పడుతుంది.. నైజాం నవాబును గడగడలాడించిన కొమురం భీం మన్యంవీరుడంటే వాళ్ల మనసు నచ్చదు! ఆ యోధుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే మళ్లీ ఆ ప్రాంతపువాడే తలపెట్టాలి! జీవన శైలిలోనూ అదే తీరు. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు..అంటూ భార్యాభర్తలు సాగునీటి కాల్వల నుంచి నీళ్లు చేదుతున్న పాటల దృశ్యాలే! ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగని తెలంగాణ రైతు కష్టాన్ని పాట సినిమా కథలో తేవాలంటే మళ్లీ తెలంగాణ కలమే రావాలి! ఇప్పుడు పైత్యం మరింత ముదిరింది. మొన్నటిదాకా తెలంగాణపై పరోక్షంగా విషం కక్కిన దర్శకాక్షిగేసరులు.. ఇక నేరుగా యుద్ధం చేస్తున్నారు. తెలంగాణవాదంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే! సినిమా ఒకనాడు వినోదం, కళ.. తదుపరి వినోదం, అభ్యుదయం.. కొన్నాళ్లకు వినోదం, వ్యాపారం..కాలం గడిచే కొద్దీ ఆస్తుల సేకరణ.. ఇప్పుడు ఆస్తుల రక్షణ! తెలుగు సినిమా పరివర్తనా క్రమమిది!

- T News

Read more...

Friday, November 16, 2012

స్వామిగౌడ్ నాకు కుడి భుజం: కేసీఆర్


Voice2telangana.blogspot.com





హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఇవాళ కొత్తగా చేరిన కొత్త గులాబీ టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్యమంలో స్వామిగౌడ్ తనతో వెన్నంటి ఉన్నారని, తనకు కుడి భుజంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికలకు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా కూడా స్వామిగౌడ్‌ను ఆహ్వానిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. స్వామిగౌడ్‌ది రాజీ పడని మనస్తత్వం అని అన్నారు. స్వామిగౌడ్‌కు ఉద్యమాభివందనాలు తెలుపుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. స్వామిగౌడ్ నేతృత్వంలో జరిగిన సకల జనుల సమ్మె ఒక అపూర్వ ఘట్టమని కేసీఆర్ పేర్కొన్నారు.

Read more...

Tuesday, November 13, 2012

Charminar under police siege for 3rd day

Hyderabad, November 13:
Charminar, the monument which symbolizes Hyderabad, remained under police siege for the third straight day Tuesday with all the markets surrounding it still shut.

A curfew-like situation prevailed around Charminar as police and paramilitary forces were deployed in large numbers to prevent any untoward incident.

Police, however, allowed devotees to pray at the Bhagyalakshmi temple abutting Charminar, the row over which has led to tension in the old city.

All routes leading to the 400-year-old monument were sealed with barbed wires and steel barricades but the devotees were allowed to visit the temple.

Long queues of men and women were seen outside the temple to perform 'puja' on the occasion of Diwali.

Policemen were not allowed any vehicle to proceed towards the monument and only devotees were permitted to walk up to the temple, where erection of a canopy in alleged violation of high court orders Sunday triggered a huge row.

The Majlis-e-Ittehadul Muslimeen (MIM) withdrew its support to the United Progressive Alliance (UPA) government in New Delhi and the Congress government in Andhra Pradesh.

Police said the situation in the old city was peaceful.

The Charminar area, thronged by thousands of shoppers and tourists on any given day, resembled a fortress with armed policemen deployed all over the deserted streets.

Additional forces were mobilized Tuesday to maintain law and order in view of the large number of devotees visiting the temple.

The famous bangles and cloth markets, jewelerly and pearl shops, hotels and eateries were closed for the third day, dampening Diwali festivities for the residents of the old city.

People living in areas surrounding Charminar complained that police were not allowing them to come out of their houses even to buy the essentials.

People were not permitted to go to Nizamia Tibbi Hospital close to Charminar. Relatives of patients admitted to the hospital were furious.

Read more...

Saturday, November 10, 2012

అజర్‌కు ఊరట - Andhra high court lifts life ban on Azharuddin


మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడంతో ఆయనకే కాదు, ఆయన అభిమానులకు కూడా ఊరటనిచ్చింది. పన్నెండేళ్ళపాటు నడిచిన ఈ కేసులో ఎన్ని మలుపులు ఉన్నప్పటికీ, చివరకు తనకు న్యాయం లభించిందనే సంతృప్తి అజరుద్దీన్‌కు మిగిలిం ది. న్యాయస్థానం తీర్పును పరిశీలిస్తున్నామని బీసీసీఐకి చెందిన పెద్ద ఒకరు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఒక అజరుద్దీన్‌కే పరిమితం చేయకుండా ఇంకా విస్తృతంగా పరిశీలించాలె. 

సమకాలీన క్రికెట్ క్రీడలో అజరుద్దీన్ ఉన్నత శిఖరాలకు చేరిన ఆటగాడనడంలో సందే హం ఎవరికీ లేదు. క్రీడాకారుడిగా కానీ, జట్టు కెప్టెన్‌గా కానీ ఆయన సేవలు అత్యుత్తమమైనవి. హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అజరుద్దీన్, తమ కండ్ల ముందే సైకిల్‌కు ప్యాడ్‌లు కట్టుకుని మైదానానికి వెళ్ళే హుషారైన పిల్లగాడు క్రికెట్‌లో సాధించిన విజయాలు స్థానికులను ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.

 అజర్ తొలి సెంచరీలను నాటి బ్లాక్ అండ్ వైట్ టీవీలలో చూసిన జ్ఞాపకం మధ్యతరగతి క్రికెట్ అభిమానుల కు మరిచిపోలేనిది. గవాస్కర్ కాలం తరువాత కొత్త తరానికి కపిల్ దేవ్‌కు, సచిన్‌కు మధ్యకాలంలో ఎదిగిన అజర్ యువతకు అభిమాన క్రీడాకారుడుగా వెలిగిపోయాడు. అజరుద్దీన్ టెస్టు క్రికెట్‌లోకి వచ్చీ రావడంతోనే ప్రభంజనం సృష్టించాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 

ఆ వెంటనే ఆడిన రెండు టెస్టుల్లోనూ సెంచరీ కొట్టాడు. ఇట్లా వరుసగా మూడుటెస్టుల్లోనూ మూడు సెంచరీలు కొట్టడం ఇప్పటికీ రికార్డే. అజర్ రికార్డుకు మురిసిపోయిన ఒక స్థానిక రాజకీయపక్షం హైదరాబాద్ నగరంలోని బషీరుబాగ్ చౌరస్తాలో ‘అజర్, అజర్, అజర్ కంగ్రాజులేషన్స్’ అంటూ కట్టిన బ్యానర్ ఆనాడు విశేషంగా యువతను ఆకర్షించింది. అజరు క్రికెట్ రంగంలో అడుగుపెట్టడంతోనే వేగంగా నిలదొక్కుకున్నాడు.

ఓ దశలో అజర్ ప్రభంజనం కారణంగానే విశ్వనాథ్ అప్పట్లో రిట్మైంట్ ప్రకటించాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయంటే ఆయన ఆటతీరు ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ‘బ్యాటింగ్‌లో మణికట్టు మాయాజాలంతో ఆకట్టుకోవడంలో అజరుద్దీన్ తర్వాతే సచిన్ కానీ ఎవరైనా..’ అని మాజీ కెప్టెన్, అంతర్జాతీ య అంపైర్ వెంకవూటాఘవన్ అప్పట్లో ప్రశంసలు కురిపించాడు.

 అప్పట్లో ఇంగ్లండ్ జటు పై అజర్ విజృంభణను చూసి సంబురపడ్డ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత జాన్ వుడ్‌కాక్- ‘అజర్ లార్డ్స్ మైదానంలో ఆడితే అతడు కొట్టిన బంతిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ దళాలను మోహరించాలేమో..’ అని ప్రశంసించాడు. బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ అజరుద్దీన్ విశిష్టత కాదనలేనిది. అన్నిటికీ మించి భారత జట్టు కెప్టెన్‌గా అజరుద్దీన్ చేసిన సేవ దేశం మరిచిపోలేనిది. అప్పటి వరకు భారత జట్టుకు గెలుపుపై ధీమా ఉండకపోయేది. అంతర్జాతీయ పోటీల్లో మనమూ గెలవగలమనే ధీమా అందించిన కెప్టెన్ అజరుద్దీన్. దేశానికి 14 విజయాలతో జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని అందించాడు.


ఇదంతా ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన సందర్భం, ఔచిత్యం ఉన్నది. తన క్రీడా జీవితమంతా క్రీడకు, దేశానికి సేవలందించిన ఆటగాళ్ళ పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అనే ఆవేదన కలుగుతున్నది. క్రికెట్ క్రీడల్లో ఉత్తమ సేవలందించిన వారంతా దోషులు కారని చెప్పలేము. ఉన్నతస్థాయి క్రీడాకారులలోఎందరో మ్యాచ్ ఫిక్సింగ్‌లకు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారు ఉండే ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆటతీరు పరిశీలిస్తే కచ్చితంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. అటువంటి వారిని గుర్తించి ఏరివేయాల్సిందే. ఇప్పుడు క్రీడారంగాన్ని పీడిస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు.

దానిని ప్రక్షాళన చేయాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కానీ నూనూగు మీసాల వయసు నుంచి ఆటనే ప్రాణంగా బతికి, జీవిత కాలమం తా సేవలందించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్న క్రీడాకారుల పట్ల ఆరోపణలు వచ్చినప్పుడు తొందరపాటుతో వారి ప్రతిష్టకు భంగం కలగకుండా క్రీడారంగంలోని పెద్దలు వ్యవహరించాలె. ఈ విషయం ఇతరుల కన్నా క్రీడారంగంలోని పెద్దలకు ఎక్కువగా తెలిసి ఉండాలె. ఇంత సున్నితమైన విషయంలో అంత మొరటుగా నిర్ణయాలు తీసుకోకూడదు. పరువు ప్రతిష్టలను కాపాడుకునే హక్కు సాధారణ ప్రజలకైనా, క్రీడాకారులకైనా ఉంటుంది. 


అజరుద్దీన్ మీద బీసీసీఐ ఆనాడు నిషేధం విధించనట్టయితే అప్పటి వరకు 99 టెస్టుల్లో ఆడిన ఆయన మరో టెస్టుతో వంద పూర్తి చేసుకునేవాడు. వందకు చేరి రికార్డు సృష్టించాలనేది ఏ క్రీడాకారుడికైనా ఉండే కల. నిషేధం విధించిన నాటి నుంచి అజర్ కళంకితుడిగా గడపాల్సి వచ్చింది. ఆయన పొందిన నష్టాన్ని గణించడానికి ఏ కొలమానాలు సరిపోవు. తాను 99 టెస్టులు మాత్రమే ఆడాలనేది విధి రాత కావచ్చునని, తనకు ఎవరిపై ఆగ్రహం లేదని, బీసీసీఐపై కూడా న్యాయం కోసం పోరాడబోనని అజర్ నిర్వికారంగా వ్యాఖ్యానించడంలోనే ఆయనలోని ఆవేదన కనిపిస్తున్నది.

అజర్ ఆటలో ఏ ఒత్తిళ్ళకు లొంగినట్టు ఆధారాలు లేవని న్యాయస్థానం అభివూపాయపడింది. ఆయనపై జీవిత కాల నిషేధం విధించడానికి తగిన ఆధారాలను బీసీసీఐ చూపలేక పోయిందని కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ ఏకపక్షంగా వ్యవహరించిందని కూడా పేర్కొంది. దీనిని బట్టి బీసీసీఐ ఆటగాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెలిసిపోతున్నది. మ్యాచ్ ఫిక్సింగ్‌తో పాటు అనేక రూపాల అవినీతి క్రీడా వ్యవస్థను పీడిస్తున్నది.

 ఆరోపణలు వచ్చినప్పుడు ఆటగాళ్ళపై వేటు వేస్తూ, అతిగా స్పందించినట్టు కనిపిస్తున్నదే తప్ప బీసీసీఐ వ్యూహాత్మకంగా మ్యాచ్ ఫిక్సింగ్‌ను కట్టడి చేయడానికి, ఇతర విధాల అవినీతిని నిర్మూలించడానికి పూనుకోవడం లేదు. అజర్‌పై రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా బీసీసీఐ తనను సంస్కరించుకోవాలె. క్రీడావ్యవస్థను ప్రక్షాళన చేసి దోషులను గుర్తించడంలో తగిన విధానాలను రూపొందించుకోవాలె. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తనకు బాధ్యత ఉందని గ్రహించాలె.

Read more...

‘HSBC arranged for opening of accounts abroad and withdrawal from Delhi itself’

India Against Corruption (IAC) released on Friday “the modus operandi” for transfer of undisclosed funds to Swiss banks as disclosed in the statements of three persons who had opened accounts in Dubai, Zurich and Geneva with HSBC Bank. They were named in a list of 700, which was shared by the French government in a compact disc with the Indian government last year. 

The names of the 10 VIPs, including the Ambanis, Congress MP Anu Tandon, Jet Airways chief Naresh Goyal and the Burman brothers of the Dabur Group, were among the 700 whose names were not revealed by the government. The accounts held by them pertained to 2006.

IAC members Arvind Kejriwal and Prashant Bhushan said Parminder Singh Kalra and Praveen Sawhney, who gave their statements, were based in Delhi, while the third person, Vikram Dhirani, was from Ghaziabad.


The persons, who were questioned under Section 132 (4)/133A of the Income Tax Act, 1961, revealed the modus operandi of the “underground banking” system or the ‘hawala’ network (money transferred but not moved).


As per the papers released by IAC at a press conference here, Mr. Dhirani said in his deposition that he had opened an account with HSBC in Dubai in 2005 and closed it in 2006. A bank representative came to him in Delhi to open an account. He did not travel to Dubai for opening or operating it. The formalities was completed in Delhi. He agreed that a person authorised by bank officials would collect the cash from him, which would show up in his HSBC account in Dubai. After the money was deposited, Mr. Dhirani was given a confirmation. However, no document was given.

IAC said the statement revealed that Mr. Dhirani told income tax officials that he had deposited about Rs. 12 crore in alleged unaccounted income in the Dubai account over a period of time. The account was closed in 2006, and the money was withdrawn and given to him in Delhi. Neither did he go to Dubai to collect the cash, nor did he arrange for his representative to take the cash on his behalf. “The bank officials arranged for delivery of cash… in India.”

According to IAC, Mr. Kalra opened an account with HSBC, Zurich, on the advice of a Swiss investment consultant based in Zurich. To make deposits of undisclosed money to the tune of Rs. 8 crore-Rs. 9 crore, he gave the cash in instalments to a person in Delhi. Every time, a different person came to collect the cash for being remitted in the Zurich branch of HSBC. The account was closed in 2008-09 even while he remained in Delhi.

“The statement shows,” Mr. Kejriwal said, “that bank officials are providing illegal channels for transfer of cash from their client account-holder in Delhi to Zurich and vice versa.”

He said Mr. Sawhney, who had opened an account with HSBC, Geneva, told income tax officials that his father had transferred $ 1.8 million to this account. “Regarding the modus operandi for withdrawal of money, Mr. Sawhney said he used to call the bank officials in Geneva who would arrange for delivery of cash in India through their agents in the hawala channel. All discussions with the bank officials were on the phone. Every time he asked for cash, a different person used to come to deliver it and he knew none of them.” 

- The Hindu News

Read more...

Wednesday, October 31, 2012

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతిని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డంటూ కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ను, మహారాష్ట్ర నీటి పారుదల కుంభకోణంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీని కేజ్రీవాల్ బయటకు తెలిసిన విషయం తెలిసిందే.

- T News

Read more...

Tuesday, October 30, 2012

Cyclone Nilam stationary, to cross TN coast tomorrow

Cyclonic storm Nilam remained practically stationary and lay centred at about 450 km south-southeast of Chennai and 130 km North-northeast of Trincomalee at 2.30 p.m. on Tuesday, the Met department said. 

A deep depression over the Bay of Bengal, which would further intensify into a cyclonic storm, on Tuesday brought heavy rains in many parts of Tamil Nadu, especially in coastal areas, prompting the government to declare a holiday for schools. 

Chennai, Kancheepuram, Cuddalore and Villupuram received heavy rains in the morning, inconveniencing commuters. The cyclonic storm would cross between Nagapattinam and Nellore tomorrow, Met Department said. 

“The deep depression over southwest Bay of Bengal moved westwards, and lay centred at 1800 UTC of yesterday over southwest Bay of Bengal near latitude 9.00N and longitude 82.00E, about 500 km south-southeast of Chennai and 100 km east-northeast of Trincomalee (Sri Lanka).” 

“The system would intensify further into a cyclonic storm and move westwards for some more time and come very close to Sri Lanka coast and then move northwestwards and cross north Tamil Nadu and adjoining south Andhra Pradesh coast between Nagapattinam and Nellore by tomorrow afternoon,” the Met Department said. 

It forecast “heavy to extremely heavy rainfall” upto 25 cm or more besides squally winds reaching upto 45—55 kmph of speed and gusting upto 65 kmph off north Tamil Nadu, Puducherry and adjoining south Andhra Pradesh coasts during next 12 hours”, it said. 

“The wind speed would gradually increase thereafter as the system comes closer to coast. Sea condition will be very rough to high along and off north Tamil Nadu, Puducherry and adjoining south Andhra Pradesh coasts during next 48 hours. 

Fishermen along north Tamil Nadu, Puducherry and adjoining south Andhra Pradesh coasts are advised not to venture into the sea,” the department said. 

- The Hindu News

Read more...

Monday, October 29, 2012

Tourism Ministry - Chinranjeevi Images



Read more...

మూడు వ్యక్తిత్వాల కలయిక

సినీ రంగంలో మూడు దశాబ్దాల జైత్రయాత్ర.. సామాజిక సేవారంగంలో తనదైన పాత్ర
పాలిటిక్స్‌లో మెరిసిన రాజకీయ ధీరుడు.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..

ఆడాడు.. ఆడించాడు..! పాడాడు.. పాడించాడు..! నవ్వాడు.. నవ్వించాడు..! నడిచాడు... నడిపించాడు! ఆయన వేసిందే డాన్స్.. ఆయన చేసిందే స్టంట్! సూపర్‌స్టార్ కృష్ణలా పదునుగా డైలాగ్‌లు చెప్పగల స్వరం.. నటరత్న ఎన్టీఆర్‌లా హావభావాలు ఒలికించగల కౌశలం.. నట సామ్రాట్ ఏఎన్నార్‌ను మరిపించేలా స్టెప్పులు వేసే తుంటరితనం! అంతెందుకు.. నవరసాలనూ తన నటన ద్వారా వెండితెరపై చిలకరించగల అరుదైన నటుడాయన! చంటబ్బాయ్.. ఇంద్ర.. ఆపద్భాందవుడు.. స్వయం కృషి.. ఠాగూర్.. గ్యాంగ్ లీడర్.. హిట్లర్.. ఆరాధన.. అభిలాష.. మంచు పల్లకీ.. జగదేక వీరుడు అతిలోక సుందరి!! సినిమా ఏదైనా.. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగిపోవడమే తెలిసిన అతికొద్ది మంది నటుల్లో ఒకరు! భిన్నమైన పాత్రలను విభిన్నంగా పోషించిన దిట్ట! మూడు దశాబ్దాల విజయవంతమైన సినీజీవితంలో అశేష ప్రజాభిమానం సొంతం చేసుకుని.. సామాజిక సేవారంగంలో విశిష్ఠపాత్ర పోషిస్తూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతమై.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు! విజయానికి మారుపేరుగా నిలిచాడు! సినిమా.. సామాజిక సేవ.. రాజకీయం!! మూడు రంగాల్లోనూ ఎగసిన కెరటం! ఒకే మనిషిలో ముగ్గురు మొనగాళ్లను నింపుకున్న వ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం పేరే... చి..రం..జీ..వి..!

చిరంజీవి అసలు పేరు శివ శంకర వరవూపసాద్. నర్సాపురం సమీపంలోని చిన్న పల్లెటూరైన మొగల్తూరులో 1955 ఆగస్ట్ 22 న జన్మించారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివిన చిరంజీవి.. నర్సాపురంలోని వైఎన్‌ఆర్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. తర్వాత సినిమాల్లో చేరాలని భావించినప్పుడు ఆయన తండ్రి ముందు చదువుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఉభయతార కం అన్నట్లు మద్రాస్ వెళ్లి ఐసీడబ్ల్యూ కోర్సులో చేరిన చిరంజీవి.. సమాంతరంగా నటనలో శిక్షణ పొందారు. 1976లో ఆయన మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. పునాదిరాళ్లు సినిమాలో దర్శకుడు రాజ్‌కుమార్ అవకాశం ఇవ్వడంతో మొదటిసారి చిరంజీవి మొఖానికి రంగు వేసుకున్నారు. ఆ నిర్మాత క్రాంతికుమార్ కే వాసు దర్శకత్వంలోని ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం ఇ చ్చారు. తొలి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ.. ప్రాణం ఖరీ దు మొదట విడుదలైన సినిమా. తొలి సినిమాకు ఆయనకు లభించింది వెయ్యి నూటపదహార్లు. కుటుంబంలో ఆంజేయస్వామిని పూజించేవారు. దాంతో స్క్రీన్‌నేమ్‌గా తల్లి సలహా మేరకు చిరంజీవి అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాలే కాకుండా పలు తమి ళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 149సినిమాల్లో నటించిన చిరంజీవి.. అనేక విభిన్నమైన పాత్రలను పోషించారు. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు, విలన్ పాత్రలు వేసిన చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఖైదీ సినిమా పూర్తిగా మార్చివేసింది.
reel
చిరంజీవి ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సుప్రీం హీరోగా మొదలైన ఆయ న ప్రస్థానం.. మెగాస్టార్‌కు చేరుకుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేసరికే ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజాలు యూత్ కారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో సైతం తన సత్తా నిరూపించుకున్నాడు చిరంజీవి. వారందరి ఉత్తమ మేళవింపుగా తెలుగు సినీ రంగానికి అందివచ్చాడు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు కమల్‌హాసన్. మాస్ స్టైల్ కింగ్ రజనీకాంత్.. ఆ ఇద్దరినీ తనలో నింపుకున్న నటుడని సీనియర్ దర్శకుడు కే బాలచందర్ చేసిన వ్యాఖ్య చిరంజీవి నటనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిపోతుంది. ఫిలింఫేర్ మ్యాగజీన్ చిరంజీవిని ఉద్దేశించి.. బిగ్గర్ దేన్ బచ్చన్ అని సంబోధించినా.. ది వీక్ మ్యాగజైన్ ఆయనను న్యూ మనీ మిషన్ అని అభివర్ణించినా.. అది ఆయన ప్రజాదరణనే చాటుతుంది.

1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవికి వివాహం జరిగింది. అప్పటికి చిరంజీవి చేసిన సినిమాలు 11 మాత్రమే. మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సందర్భంగా చిరంజీవిని చూసిన అల్లు.. అప్పుడే ఆయనను అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరి వివాహానికి ఎన్టీరామారావు ముఖ్య అతిథిగా వచ్చారు. వీరికి కుమ్తాలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్ తేజ ఉన్నారు. రాంచరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన హీరోగా ఎదుగుతున్నాడు. చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా సినీరంగంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇం డస్ట్రీలో అత్యధిక పరిహారం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.

బాపూ దర్శకత్వంలో రూపొందిన మనవూరి పాండవులు చిత్రంతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. ఐ లవ్ యూ, ఇది కథ కాదు, 47 రోజులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. 1979లో ఎనిమిది సినిమాలు చేసిన చిరంజీవి.. మ రుసటి సంవత్సరం 14 సినిమాలు చేశారు. 1981లో న్యాయం కావాలి సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అభిలాష వంటి సినిమాలతో మళ్లీ కథానాయకుడిగా తెరపైకి వచ్చారు. ఇంట్లో రామయ్య, వీధి లో కృష్ణయ్య సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1982లో కే విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన శుభలేఖ చిత్రానికిగాను చిరంజీవికి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి సినీ ప్రస్థానం దిశను మార్చివేసింది. సిల్వెస్టర్ స్టల్లోన్ హీరోగా వచ్చిన హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ సినిమా ఆధారంగా తీసిన ఖైదీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. చిరంజీవికి యాక్షన్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. 1983 చివరి నాటికి ఆయన చేసిన సినిమాలు 60కి చేరుకున్నాయి.

 ఆ తర్వాత మూడేళ్ల కాలంలో క్రమక్షికమంగా అగ్రహీరోగా ఎదిగాడు చిరంజీవి. అందు కు మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, చాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి సినిమాలు ఇందుకు దోహదం చేశాయి. విజేత సినిమా కోసం 1985లో ఆయన తన మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 1987లో పసివాడి ప్రాణం సినిమా హిట్ తో చిరంజీవి స్టార్‌డమ్ అందుకున్నారు. ఈ సినిమాతో కొత్త నృత్య ఒరవడి ‘బ్రేక్ డ్యాన్స్’ను చిరంజీవి చేశారు. ఈ తరహా డ్యాన్స్‌కు ఆయన పెట్టింది పేరుగా మారారు. అంతకుముందే దొంగ సినిమా కోసం మైఖేల్ జాక్సన్ ఆల్బం థ్రిల్లర్‌లోని నృత్యాన్ని చేశారు. అది ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. 1987లో స్వయం కృషి సినిమాకు గాను ఆయన తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటికే స్టార్‌డమ్ అందుకున్న సుప్రీం యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవి ఒక లోప్రొఫైల్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం విశేషం. తాను ఎలాం టి పాత్రనైనా చేయగలనని ఈ సినిమా ద్వారా చిరంజీవి నిరూపించుకున్నారు.

ఖైదీ తర్వాత అయన అనేక హిట్లు కొట్టారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ, కొదమసింహం, రాజా విక్రమార్క, గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు వంటి భారీ హిట్లు నమోదు చేశారు. పది కోట్లకు మించిన రెవెన్యూ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘరానా మొగుడు రికార్డు సృష్టించింది. శ్రీదేవితో జతకట్టిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అద్భుతమైన సోషియోఫాంటసీ సినిమాగా నిలిచిపోయిం ది. చిరంజీవి సినిమాల్లో ఒకానొక అత్యుత్తమమైన సినిమాగా ఇప్పటికీ చెక్కుచెదరని స్థానం పొందింది. చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసేనాటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులకు విపరీతమైన ప్రజాదరణ ఉండేది. ఆ సమయంలో చిరంజీవి తనదైన శైలిలో స్టెప్పులు వేయడం, మునుపు చూడని పద్ధతుల్లో సాహసోపేతమైన స్టంట్స్ చేయడం ఆయనకు క్రమేణా అగ్రస్థానం కల్పించింది. సంఘర్షణ చిత్రం షూటింగ్ సమయంలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంటిగుట్టు సినిమాలో ట్యూబ్‌లైట్ పట్టుకుని పోరాడే సమయంలో కూడా గాయపడ్డారు. దొంగ సినిమాలో 11అంతస్తుల భవనం గోడపై నిలబడి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తాయి. బావగారు బాగున్నారా చిత్రం కోసం ఒక టీనేజ్ పిల్లాడి మాదిరిగా బంగీజంప్ చేసి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు ఆయన తెలుగు సినీరంగంపై ఏకఛవూతాధిపత్యం వహించారనడంలో సందేహం లేదు. చిరంజీవి సహ నిర్మాతగా రూపొందిన రుద్రవీణ చిత్రం జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు అందుకుంది.

అవార్డులు కోకొల్లలు

చిరంజీవికి అవార్డులు కోకొల్లలు. తెలుగులో ఏ సినీ హీరోకూ లభించని స్థాయిలో పది ఫిలింఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

ప్రతిఘటన సినిమాకు రీమేక్‌గా హిందీలో ప్రతిబంధ్ (1990) ద్వారా హిందీలోనూ విజయం సాధించారు చిరంజీవి. ఆజ్‌కా గూండారాజ్ (గ్యాంగ్‌లీడర్), జెంటిల్మన్ సినిమాలతో బాలీవుడ్‌లోనూ తనకు అభిమానం ఉందని రుజు వు చేసుకున్నారు. ఆపద్భాంధవుడు సినిమాలో నటనకు గాను ఆయనకు రెండో సారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించింది. 1990వ దశకంలో కొన్ని అపజయాలు ఎదురైనా.. తిరిగి నిలదొక్కుకున్న చిరంజీవి.. 1997లో హిట్లర్‌తో తెలుగు సినీ రంగానికి రారాజు తానేనని నిరూపించుకున్నారు. మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వంటి సినిమాలు ఆయన నటనా కౌశలాన్ని చాటాయి. 1999లో హాలీవుడ్‌లో కూడా చిరంజీవి అడుగుపె ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా సెట్లపైకి వెళ్లినా.. తెలియని కారణాలతో నిలిచిపోయింది.

చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్య సినిమాతో పునఃవూపారంభమైంది. ఈ సినిమా సూపర్‌హిట్ కొట్టింది. 2002లో వచ్చిన ఇంద్ర సినిమా అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడోసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. సామాజిక కోణంలో వచ్చిన ఈ సినిమా తర్వాత ఇదే కోణంలో ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ వంటి సినిమాలు చిరంజీవి స్థానం ఎవరూ కదల్చలేనిదని నిరూపించాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ఆయనకు ‘లెజెండ్’ పురస్కారం అందజేసి.. తెలుగు సినీ పరిక్షిశమ తనను తాను గౌరవించుకుంది. పెద్ద సినిమా కుటుంబ నేపథ్యం, గాడ్‌ఫాదర్‌లు లేకుండానే చిరంజీవి సాధించిన విజయాలు.. నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో ఒక హీరో అలా ఎదగడాన్ని కనీసం ఊహించలేం.

- T News

Read more...

Thursday, October 25, 2012

చిరుకు టూరిజం


chiru
కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయం.. రాష్ట్రానికి మొత్తం రెండు పదవులు
వీలు చిక్కితే మరోటి వచ్చే చాన్స్.. ఉన్నవారిలో కొందరికి ప్రమోషన్?
నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ విస్తరణ.. సీమాంధ్ర కోటాలో చిరంజీవి.. తెలంగాణ నుంచి రేసులో వీహెచ్, సర్వే, అంజన్ లాబీయింగ్‌లో కావూరి, కోట్ల.. మంత్రి పదవులపై రాష్ట్ర ఎంపీల ఆశలు

హైదరాబాద్, అక్టోబర్ 23 ():కష్టకాలంలో పార్టీని విలీనం చేసి ప్రభుత్వాన్ని కాపాడిన చిరంజీవి త్యాగానికి గుర్తింపు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నెలాఖరులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి బెర్తు ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనకు పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరొకరికి కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తుది కూర్పులో వీలు చిక్కితే ఆంధ్రవూపదేశ్‌కు మరో బెర్తు లభించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న కొందరికి ప్రమోషన్‌లు కూడా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఖాయంగా కనిపిస్తున్న రెండు బెర్తుల్లో ఒకటి చిరంజీవికి పోను.. మిగిలినది తెలంగాణ ప్రాంతానికి దక్కుతుందని అంటున్నారు. ఈ స్థానం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నేత వీ హన్మంతరావు, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చాలా కాలం నుంచి కేంద్ర కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి సైతం వారి ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నెలాఖరులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తథ్యమని మస్తిన నుంచి బలమైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పదవులపై రాష్ట్ర ఎంపీలు ఆశలు పెట్టుకుంటున్నారు. అవకాశం ఉన్నది రెండు ఖాళీలకే అయినా ఆశావహులు మాత్రం భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మూడో మంత్రిని కూడా రాష్ట్రం నుంచి తీసుకోవాలని భావించిన పక్షంలో రాయలసీమ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించే అదృష్టం లేక పోలేదంటున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం జరిపిన ఢిల్లీ పర్యటనలో సైతం రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకునే వారి పేర్లపై పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. దసరా వేడుకలు ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం నుంచి హస్తినకు చేరుకోగానే కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ
వర్గాల సమాచారం.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ జైపాల్‌డ్డి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేబినెట్ మంత్రులుగా, పళ్లం రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి సహాయ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్‌డ్డి ఒకరే కేబినెట్‌లో ఉండగా మిగతా నలుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఈసారి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఒకరిద్దరికి కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కల్పించే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. వీరిలో పళ్ళం రాజు, పురంధేశ్వరిలలో ఒకరికి ప్రమోషన్ ఖాయమని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలను అందించిన ఆంధ్రవూపదేశ్ నుంచి కేంద్రంలో కేవలం ఐదుగురు మంత్రులే ప్రాతినిధ్యం వహించడం, వారిలో ఇద్దరు మాత్రమే కేబినెట్ హోదా కలిగి ఉండటం కూడా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

సీమాంధ్ర కోటాలో మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కచ్చితంగా ఉంటారని, మరో పదవిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉందని పీసీసీ అగ్రనేత ఒకరు స్పష్టం చేశారు. జగన్ దెబ్బతో కష్టాల్లో పడిన కిరణ్ ప్రభుత్వాన్ని ఆదుకుని, అవిశ్వాస తీర్మానంలో నెగ్గించడమే కాకుండా, ఆపదలో ఉన్నప్పుడు పార్టీకి ఆపద్భాంధవుడిలా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి నేనున్నాంటూ అభయమిచ్చినందుకు ప్రతిఫలంగా పూర్వ పీఆర్పీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యనేత, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వాలనే పట్టుదలతో అధిష్ఠానం పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పీఆర్పీ విలీనం సమయంలోనే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన అభయాల మేరకు ఆయన్ని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని అంటారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో అవకాశం కల్పిస్తారని ఈ ఏడాది మార్చ్ నుంచి కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మార్చ్ నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు ప్రధాని తన కేబినెట్లో మార్పులు, చేర్పులు చేసినప్పటికీ చిరుకు అవకాశం లభించ లేదు. అయితే కేంద్ర కేబినెట్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు ఇటీవల రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకోవడం, వివిధ కారణాల రీత్యా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం, మరో కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృతి చెందడం, మరికొందరు అదనపు బాధ్యతల్లో కీలక శాఖలు నిర్వహిస్తుండడంతో ఈసారి ఎక్కువ మందినే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా, ముగ్గురిని ఈసారి కేంద్ర కేబినెట్‌లోకి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవికి పర్యాటక శాఖ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన్ని అందుబాటులో ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ నుంచి ముగ్గురి పేర్లు!
తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు, మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ, సికింవూదాబాద్ ఎంపీ ఎం అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. వీహెచ్ మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్, సోనియా కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడిగా, పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. చిరంజీవికి మంత్రిపదవి ఇచ్చిన పక్షంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌ను కేంద్రంలో తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే చిరంజీవి సీమాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, తెలంగాణ ప్రాంతం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌కు కూడా అవకాశం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. వీహెచ్ సీనియారిటీ కూడా కేంద్ర మంత్రి పదవికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మంగళవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ పరిస్థితులు, రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలించాలని కూడా వీహెచ్ ఈ సందర్భంగా అధినేవూతికి విన్నవించినట్లు తెలిసింది.

వీహెచ్ కాని పక్షంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. ఆయన కూడా పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి, హైకమాండ్ గీసిన గీత దాటని నేతగా ముద్రపడ్డారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన పనబాక లక్ష్మి మంత్రిగా ఉన్నందున, తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. హైకమాండ్‌తో సఖ్యతగా మెలుగుతూ, తెలంగాణ కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమా బాట పట్టినా సర్వే సత్యనారాయణ కలిసిరాలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. కేంద్ర మంత్రిపదవిపై ఆయన ఆశపెట్టుకోవటమే దీనికి కారణమనే వాదన ఉంది. వీరిద్దరు కాని పక్షంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్ పేరును అధిష్ఠానం పరిశీలిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాదవ్ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు, తెలంగాణలో తమకు నమ్మినబంటుగా ఉంటాడనే సమీకరణలతో అంజన్‌ను మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కాగా ముగ్గురికి అవకాశం కల్పించే పరిస్థితి వస్తే సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావు (ఆంధ్ర), కోట్ల సూర్యవూపకాష్‌డ్డి (రాయలసీమ)లలో ఒకరికి చాన్స్ ఉంటుందంటున్నారు. కావూరి చాలా కాలంగా కేంద్రంలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆయన్ని తీసుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో కనిపించారు. అంతే కాకుండా చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగినప్పుడు.. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం కల్పించడం సమంజసం కాదని చిరంజీవిని ఉద్దేశించి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా రాయలసీమ నుంచి గతంలో కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న సాయివూపతాప్ రాజీనామా అనంతరం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

ఈ లోటును పూడ్చడానికి కర్నూలు నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన కోట్ల సూర్యవూపకాష్‌డ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్యవూపకాష్‌డ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌డ్డి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే ఆంశంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి విస్తరణలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

- T News

Read more...

Wednesday, October 24, 2012

సద్దికట్టిన తెలంగాణ


kavi_6558

 

kavi3_9811

 
గంగమ్మను చేరిన గౌరమ్మ..
సంబురంగా సద్దుల బతుకమ్మ
 
 ఎంగిలిపూలతో వెలిగిన బతుకమ్మ తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మగా అవతారమెత్తి గంగమ్మను చేరడంతో తెలంగాణ పూల జాతర ముగిసింది. మంగళవారం తెలంగాణవ్యాప్తంగా తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ గంగమ్మను చేరే తొమ్మిదోనాడు మిగతా ఎనిమిది రోజుల కంటే పవివూతంగా ఆరాధనాభావంతో చూస్తారు. తెల్లవారుజామునే పూలు సేకరించి ఒక్కపొద్దులతో నిష్ఠగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ అంత్రానికోపాట (బతుకమ్మ వరుస)పాడుకుంటూ పేర్చారు. ఇంటింటిలో తల్లీబిడ్డలుగా భావించి జంట బతుకమ్మలను పేర్చారు. పెద్ద బతుకమ్మపైన పసుపు ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ తలపైన ప్రతిష్ఠించారు. పూజగదిలో దేవుని (లక్ష్మిదేవీ) చిత్రపటం వద్ద ప్రత్యేకంగా పూజలు చేశారు. కొత్త పంటలతో చేసిన పిండివంటలతో సద్దులు కట్టారు. నువ్వులు, మొక్కజొన్న, పజ్జొన్న, కొబ్బరిబెల్లాలు, పెరుగన్నంతో చేసిన ముద్దలతో కొత్తబట్టతో సద్ది కట్టి నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం కొత్తబట్టలు ధరించి సామూహికంగా బతుకమ్మను డప్పుచప్పుళ్లతో ఊకుగింపుగా స్థానిక చెరువుగట్టుకు చేరుకున్నారు.

మహిళలంతా గుమికూడి ఒకరు పాట అందుకుంటే మిగితావాళ్లు కోరస్‌గా చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ పాటలు పాడుతూ చెరువుగట్లన్నీ కోయిల గుంపు వలె పాటలతోటలయ్యాయి. చెరువునీళ్లలో బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత ముత్తైదువలు ఒకరికొకరు కుంకుమ బొట్టుపెట్టుకొని మాంగల్యాన్ని పదికాలాలపాటు కాపాడాలంటూ పుస్తెలకు పసుపుగౌరమ్మను అద్దుకున్నారు. తెచ్చుకున్న సద్దులను పంచిపెట్టుకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని పద్మాక్షిగుండం, భద్రకాళి చెరువుగట్టు, ఉర్సు రంగలీలా మైదానం, వడ్డేపల్లి చెరువు, ఖిలా వరంగల్ మెట్టుకోట, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. పరకాల, భూపాలపల్లి, గణపురం, చెల్పూరు తదితర కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

సద్దుల్లో ఉద్యమం: సద్దుల బతుకమ్మ సంబురంలో తెలంగాణ ఆత్మగౌరవ ఆకాంక్ష ప్రతిధ్వనించింది. ఊరూవాడా ఏకమై ముక్తకం జై తెలంగాణ అంటూ నినదించారు. తెలంగాణ ఆకాంక్షకు అద్దంప మహిళాలోకం బతుకమ్మలపైనా జై తెలంగాణ నినాదాల జెండాలను ఏర్పాటు చేశారు. మా తెలంగాణ మాగ్గావాలి..మా నీళ్లు మాకు కావాలి.. మా రాష్ట్రం మాకు కావాలి అంటూ నినాదాలు రాసుకొని ఆకాంక్షను చాటారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP