Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telanga News (Telugu). Show all posts
Showing posts with label Telanga News (Telugu). Show all posts

Monday, October 29, 2012

Tourism Ministry - Chinranjeevi Images



Read more...

Thursday, October 25, 2012

చిరుకు టూరిజం


chiru
కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయం.. రాష్ట్రానికి మొత్తం రెండు పదవులు
వీలు చిక్కితే మరోటి వచ్చే చాన్స్.. ఉన్నవారిలో కొందరికి ప్రమోషన్?
నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ విస్తరణ.. సీమాంధ్ర కోటాలో చిరంజీవి.. తెలంగాణ నుంచి రేసులో వీహెచ్, సర్వే, అంజన్ లాబీయింగ్‌లో కావూరి, కోట్ల.. మంత్రి పదవులపై రాష్ట్ర ఎంపీల ఆశలు

హైదరాబాద్, అక్టోబర్ 23 ():కష్టకాలంలో పార్టీని విలీనం చేసి ప్రభుత్వాన్ని కాపాడిన చిరంజీవి త్యాగానికి గుర్తింపు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నెలాఖరులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి బెర్తు ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనకు పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరొకరికి కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తుది కూర్పులో వీలు చిక్కితే ఆంధ్రవూపదేశ్‌కు మరో బెర్తు లభించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న కొందరికి ప్రమోషన్‌లు కూడా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఖాయంగా కనిపిస్తున్న రెండు బెర్తుల్లో ఒకటి చిరంజీవికి పోను.. మిగిలినది తెలంగాణ ప్రాంతానికి దక్కుతుందని అంటున్నారు. ఈ స్థానం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నేత వీ హన్మంతరావు, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చాలా కాలం నుంచి కేంద్ర కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి సైతం వారి ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నెలాఖరులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తథ్యమని మస్తిన నుంచి బలమైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పదవులపై రాష్ట్ర ఎంపీలు ఆశలు పెట్టుకుంటున్నారు. అవకాశం ఉన్నది రెండు ఖాళీలకే అయినా ఆశావహులు మాత్రం భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మూడో మంత్రిని కూడా రాష్ట్రం నుంచి తీసుకోవాలని భావించిన పక్షంలో రాయలసీమ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించే అదృష్టం లేక పోలేదంటున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం జరిపిన ఢిల్లీ పర్యటనలో సైతం రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకునే వారి పేర్లపై పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. దసరా వేడుకలు ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం నుంచి హస్తినకు చేరుకోగానే కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ
వర్గాల సమాచారం.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ జైపాల్‌డ్డి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేబినెట్ మంత్రులుగా, పళ్లం రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి సహాయ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్‌డ్డి ఒకరే కేబినెట్‌లో ఉండగా మిగతా నలుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఈసారి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఒకరిద్దరికి కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కల్పించే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. వీరిలో పళ్ళం రాజు, పురంధేశ్వరిలలో ఒకరికి ప్రమోషన్ ఖాయమని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలను అందించిన ఆంధ్రవూపదేశ్ నుంచి కేంద్రంలో కేవలం ఐదుగురు మంత్రులే ప్రాతినిధ్యం వహించడం, వారిలో ఇద్దరు మాత్రమే కేబినెట్ హోదా కలిగి ఉండటం కూడా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

సీమాంధ్ర కోటాలో మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కచ్చితంగా ఉంటారని, మరో పదవిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉందని పీసీసీ అగ్రనేత ఒకరు స్పష్టం చేశారు. జగన్ దెబ్బతో కష్టాల్లో పడిన కిరణ్ ప్రభుత్వాన్ని ఆదుకుని, అవిశ్వాస తీర్మానంలో నెగ్గించడమే కాకుండా, ఆపదలో ఉన్నప్పుడు పార్టీకి ఆపద్భాంధవుడిలా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి నేనున్నాంటూ అభయమిచ్చినందుకు ప్రతిఫలంగా పూర్వ పీఆర్పీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యనేత, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వాలనే పట్టుదలతో అధిష్ఠానం పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పీఆర్పీ విలీనం సమయంలోనే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన అభయాల మేరకు ఆయన్ని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని అంటారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో అవకాశం కల్పిస్తారని ఈ ఏడాది మార్చ్ నుంచి కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మార్చ్ నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు ప్రధాని తన కేబినెట్లో మార్పులు, చేర్పులు చేసినప్పటికీ చిరుకు అవకాశం లభించ లేదు. అయితే కేంద్ర కేబినెట్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు ఇటీవల రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకోవడం, వివిధ కారణాల రీత్యా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం, మరో కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృతి చెందడం, మరికొందరు అదనపు బాధ్యతల్లో కీలక శాఖలు నిర్వహిస్తుండడంతో ఈసారి ఎక్కువ మందినే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా, ముగ్గురిని ఈసారి కేంద్ర కేబినెట్‌లోకి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవికి పర్యాటక శాఖ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన్ని అందుబాటులో ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ నుంచి ముగ్గురి పేర్లు!
తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు, మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ, సికింవూదాబాద్ ఎంపీ ఎం అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. వీహెచ్ మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్, సోనియా కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడిగా, పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. చిరంజీవికి మంత్రిపదవి ఇచ్చిన పక్షంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌ను కేంద్రంలో తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే చిరంజీవి సీమాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, తెలంగాణ ప్రాంతం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌కు కూడా అవకాశం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. వీహెచ్ సీనియారిటీ కూడా కేంద్ర మంత్రి పదవికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మంగళవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ పరిస్థితులు, రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలించాలని కూడా వీహెచ్ ఈ సందర్భంగా అధినేవూతికి విన్నవించినట్లు తెలిసింది.

వీహెచ్ కాని పక్షంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. ఆయన కూడా పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి, హైకమాండ్ గీసిన గీత దాటని నేతగా ముద్రపడ్డారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన పనబాక లక్ష్మి మంత్రిగా ఉన్నందున, తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. హైకమాండ్‌తో సఖ్యతగా మెలుగుతూ, తెలంగాణ కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమా బాట పట్టినా సర్వే సత్యనారాయణ కలిసిరాలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. కేంద్ర మంత్రిపదవిపై ఆయన ఆశపెట్టుకోవటమే దీనికి కారణమనే వాదన ఉంది. వీరిద్దరు కాని పక్షంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్ పేరును అధిష్ఠానం పరిశీలిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాదవ్ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు, తెలంగాణలో తమకు నమ్మినబంటుగా ఉంటాడనే సమీకరణలతో అంజన్‌ను మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కాగా ముగ్గురికి అవకాశం కల్పించే పరిస్థితి వస్తే సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావు (ఆంధ్ర), కోట్ల సూర్యవూపకాష్‌డ్డి (రాయలసీమ)లలో ఒకరికి చాన్స్ ఉంటుందంటున్నారు. కావూరి చాలా కాలంగా కేంద్రంలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆయన్ని తీసుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో కనిపించారు. అంతే కాకుండా చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగినప్పుడు.. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం కల్పించడం సమంజసం కాదని చిరంజీవిని ఉద్దేశించి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా రాయలసీమ నుంచి గతంలో కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న సాయివూపతాప్ రాజీనామా అనంతరం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

ఈ లోటును పూడ్చడానికి కర్నూలు నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన కోట్ల సూర్యవూపకాష్‌డ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్యవూపకాష్‌డ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌డ్డి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే ఆంశంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి విస్తరణలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

- T News

Read more...

Monday, June 18, 2012

వేలంపాటకు చుక్కరాలదు లాటరీ లక్కే


నేడే నూతన ఎక్సైజ్ పాలసీ
ఆదాయం కోసం ఐదు శ్లాబుల నుంచి ఏడు శ్లాబులకు
మున్సిపాలిటీల్లో లైసెన్స్ ఫీజు పైపైకి
ఏసీబీ సహా ఏ కేసులున్నా అనర్హులే.. తెల్లరేషన్‌కార్డుదారులూ అంతే
ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
ఎకై ్సజ్ పాలసీ ఇక ఏడాదికే పరిమితం

హైదరాబాద్, జూన్ 17 () కొత్త ఆబ్కారీ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేయనుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఎక్సైజ్ కొత్త విధానం అమలు చేయాల్సి ఉన్నందున గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు ఈ కొత్త విధానంపై చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ఎక్సైజ్ కొత్త పాలసీలో ఇప్పటి వరకు ఉన్న బహిరంగ వేలం విధానానికి స్వస్తిపలికి స్థిర లైసెన్సు రుసుము(ఫిక్స్‌డ్ లైసెన్సు ఫీజు), లాటరీ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి కొత్త ఎక్సైజ్ పాలసీపై సోమవారం సాయంవూతానికి ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. ఈనెల 23వ తేదీన లాటరీ పద్ధతిలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

కొత్త పాలసీ అమలు, మద్యం షాపుల ఎంపిక, తదనంతర నిబంధనల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ఆదివారం ఎక్సైజ్ కమిషనరేట్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త పాలసీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని ఆన్‌లైన్ ద్వారానే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ప్రస్తుతం విద్యార్థ్ధులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా వ్యాపారులు మద్యం షాపుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే భర్తీచేయడం, సంబంధిత జిల్లా అధికారులు కూడా ఆన్‌లైన్‌లోనే వాటిని పరిశీలించే అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఏసీబీ దాడులు జరిపి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కొత్త పాలసీ నోటిఫికేషన్‌లో అలాంటి కేసులున్న వ్యక్తులను అనర్హులుగా ప్రకటించడంతోపాటు తెల్లకార్డుదారులను కూడా మద్యం షాపు లు నడిపేందుకు అనర్హులుగా ప్రకటించనున్నారు.

మద్యం వ్యాపారం కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నందున ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు రెండు సంవత్సరాలకు పరిమితమైన ఎక్సైజ్ పాలసీని ఇకపై ఒక ఏడాదికే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని మద్యం షాపులను రిజర్వు చేయాలన్న ప్రతిపాదన ఆదిలోనే అటకెక్కింది.

 2001 జనాభా లెక్కల ఆధారంగా మద్యం షాపులసంఖ్యను నిర్ధారించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6596 మద్యం షాపులుండగా, వాటిలో కొన్ని మద్యం షాపులను ప్రయోగాత్మకంగా ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో వేలం పాటల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం చేకూరింది. కొత్త పాలసీ ద్వారా లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఆదాయం అంతంతమావూతంగానే వచ్చే అవకాశం ఉంది.

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న ఐదు శ్లాబుల సంఖ్యను ఏడు శ్లాబులకు పెంచే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో లైసెన్సు ఫీజులను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎక్సైజ్ విధానం వల్ల ఎమ్మార్పీ రేట్లు ఖాతరు చేయని వ్యాపారులు, మద్యం సిండికేట్లతో రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టను కూడగట్టుకోవడం ఒక ఎత్తయితే, ఏకంగా హైకోర్టు నుంచి అక్షింతలు కూడా వేయించుకుంది. మరోవైపు ప్రస్తుత ఎక్సైజ్ విధానాన్ని ‘కాగ్’ కూడా తప్పుపట్టింది. దీంతో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.

అయితే ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను వాన్‌పిక్ భూముల కేటాయింపులో సీబీఐ అరెస్టుచేయడంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం కిరణ్ ఎక్సైజ్ శాఖ బాధ్యతలను విద్యాశాఖ మంత్రి పార్ధసారధికి అప్పగించారు. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదాను ఖరారు చేసింది.

Take By: T News

Read more...

Tuesday, December 20, 2011

రోజూ ఒక్క పూట బడే..?

 ఆత్మకూర్.ఎస్)పాఠశాల భవనంలో కళాశాలను నిర్వహించడం వల్ల విద్యార్థులు వలసలు వెలుతున్నా అధ్యాపకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ కళాశాల భవనం నిర్మించి ఎనిమిది నెలలైనా ఉపాధ్యాయులు, లెక్చరర్లు కుమ్మకై్క కళాశాలను తరలించకుండా ఒక్క పూట చదువు చెప్పి తప్పించు కుంటున్నారు. దాదాపు 550మంది విద్యార్థులున్న నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో నేడు 200ల మంది కూడా మిగలలేదు. ఒక పూట పాఠశాల మరోక పూట కళాశాల కారణంగా బోధన కష్టమవుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు, కలెక్టర్‌కు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నూతన కళాశాలలో వసతులు ఉన్నప్పటికీ ఎదో ఒక్కటి సాకు చెప్పి ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ కళాశాలను తరలించకుండా అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.

కళాశాల తరలిస్తే లెక్చరర్లు, ఉపాధ్యాయులు రెండు పూటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాపారాలకు అలవాటు పడిన అధ్యాపక బృందం విధులు నిర్వహించడం కష్టమౌ తది. అందుకే కళాశాల తరలింపును వారు అంతర్గతంగా అడ్డుకొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కళాశాల తరలించకపోవడం వలన ఒక పూట పాఠశాల చదువుతో న్యాయం జరగడం లేదని ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇతర పాఠశాలలకు వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో వందకుపైగా ఉన్న విద్యార్థులు వలసల కారణంగా ఇప్పుడు 27 మంది మిగిలారు. కళాశాలలోను ఇదే తంతు జరుగుతోంది. నాణ్యమైన విద్య అందించలేని కళాశాల అధ్యాపక బృందం పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారు. దాని కారణంగా ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్ అధ్వాన్నంగా మారుతోంది.

కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్‌లు అమర్చడంతో ఇటీవల కళాశాల భవనం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ జి.మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి పనులు మరోసారి చేశారు. కళాశాలను నూతన భవణంలోకి మార్చాలని రెండు పూటలా పాఠశాల, కళాశాల నడపాలని కొంతమంది జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే కళాశాలను తరలించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

 Take By: T News

Read more...

Monday, December 19, 2011

గ్రూప్-1 ఫలితాలపై అనుమానాలు!

- వరంగల్ కేంద్రం నుంచి 11మంది మాత్రమే ఎంపిక
- చిత్తూరు నుంచి 120 మందికి పైగా ...
- పేపర్‌లీక్ అయిందని కొందరి అభ్యర్థుల ఆరోపణ
- నేడు ఏపీపీఎస్సీ అధికారులను కలుస్తామని వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 18 (): గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో వరంగల్ కేంద్రం నుంచి పరీక్ష రాసిన వారిలో కేవలం 11 మందిని మాత్రమే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసిందని, అదే చిత్తూరు నుంచి సుమారు 120 మంది పైగా ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.h

పరీక్షా సమయంలో తిరుపతి కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకయిందని, అందుకే ముఖ్యమంత్రి జిల్లా చెందిన చిత్తూరు అభ్యర్థులు ఎక్కువగా ఇంటర్వ్యూలకు ఎంపికయి ట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆదివారం పలువురు గ్రూప్-1 అభ్యర్థులు ‘టీ న్యూస్’తో మాట్లాడారు. వీరు వ్యక్తం చేసిన అనుమానాలకు పరీక్షా సమయంలో జరిగిన సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. మెయిన్స్ పరీక్ష సందర్భంగా తిరుపతిలోని ఓ పరీక్షా కేంద్రంలో కొంత మంది అభ్యర్థులు జవాబు పత్రం (బుక్‌పూట్) ఇవ్వగానే బుక్‌పూట్‌లోని రఫ్ పేపర్లో సుమారు 10 ప్రశ్నలకు సంబంధించి జవాబులు రాశారు. ఒక్కో అభ్యర్థి ఒక్కో ప్రశ్నకు జవాబు రాశారు.

ఇది గమనించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారి వద్ద నుంచి జవాబు పత్రాలు తీసుకుని కొత్తవి ఇచ్చారు. తిరుపతి పరీక్షా కేంద్రంలో అబ్జర్వర్‌గా ఉన్న ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు చంద్రశేఖర్.. ప్రశ్నా పత్రం ఇవ్వకుండానే రాసిన జవాబులకు, ఇవ్వబోయే ప్రశ్నాపవూతంలోని ప్రశ్నలను పరిశీలిస్తే అవి అందులో ఉన్నట్టుగా నిర్దారించారు. దీంతో ముందస్తుగా పేపర్ లీక్ అయిందని గమనించిన ఏపీపీఎస్సీ..

ఆ జిల్లా కలెక్టర్‌తో విచారణ చేయించినట్లు సమాచారం. కానీ ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను వాల్యువేషన్ చేశారా? లేదా అన్న విషయాన్ని ఏపీపీఎస్సీ వెల్లడిస్తే తప్పా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. కాగా, పేపర్ లీకేజీతో పాటు, తెలుగు మీడియం విద్యార్థులకు జరిగిన అన్యాయంపై సోమవారం ఏపీపీఎస్సీ అధికారులను కలువనున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు.

Take By: T News

Read more...

Sunday, December 18, 2011

The Shadows of Modernity

New Delhi, December : WHAT IS the big deal about modernity in India? In everyday conceptions, modernity is considered as the condition of being modern that originated in the West and then transferred to the ‘ rest’. We become modern in simple terms as the West remains a nagging, essential presence in our post- colonial predicaments.

The question of being modern can be answered as simply and seductively we can imagine.

But living as we do in such different ways, is it that simple? There are innumerable conditions, insurmountable limitations and unforeseen possibilities of modernity.

The idea of modern remains at once simple, yet elusive.

Saurabh Dube’s Modern Makeovers meanders into the abyss of modernity in South Asia. Not a conventional book that seeks to question modernity, this work recognises modernity as a concept and entity, and maps the divergent spaces where modernity enacts its uncanny dark script and powers.

The volume’s main intent is to establish that there’s no monolithic condition of being modern, and that the contradictory histories of modernity lie at the cusp of the universal claims of discourses of modernity.

The grand saga of its progress is frequently interrupted by its social subjects through textures of beliefs, structures of sentiments and the multilayered experience.

In an intriguing introduction, Dube goes down many rabbit holes to arrive at various articulations of modernity. With a diverse range of interesting, exciting essays, Modern Makeovers unfolds the multiple ways modernity follows a contested and contradictory trajectory in modern times.

The contributors cover a galaxy of themes, probing an interplay of the individual and collective, the popular and political, the global and particular, the public and private, the impersonal and personal.

Mrinalini Sinha works around the non- linear histories of anti- colonial nationalism and imperial subjecthood.

Bodhisattva Kar evocatively unravels the complex interface of empire and nation through a focus on the province of Assam and its claims to a national identity. Rohan Deb Roy probes the crooked paths by which the imperial order, medicine and malaria intertwined to shape colonial modernity. Atig Ghosh’s essay goes beyond the idea of ‘ colonial modern’ in his sensitive unfolding of ‘ Kangal’ Hatinath Majumdar’s life.

A set of interesting articles focus on political modernity. Anupama Rao engages with the figure of the Dalit and the political predicament Bhimrao Ramji Ambedkar in liberal politics. Ajay Skaria explores M. K. Gandhi’s religion. For Gandhi, says Skaria imaginatively, faith not opposed to reason.

F aisal Devji reads the Satanic Verses ( 1989) and the Jyllands- Posten ( 2005) affairs to underscore the limits of liberal democracy in the context of globalisation of Islam.
Ian Bedford discusses how a rigid, conservative Pakistani state identity was put in place under General Zia.

In the section on ‘ Critical Cultures’, Anand Pandian draws on historical and ethnographic materials from the Cumbum Val- ley and examines the issue of ‘ maturation’ in relation to Tamil pakkuvam or ‘ ripening’ in the agrarian and environmental contexts of his fieldwork. Veronique Benei enters the worlds of citizens and subjects, education and nation, and the school and state in western India. 
   
Kalpana Ram’s lively engagement with ‘ activist modernity’, via the woman’s body, explores the coercion of the state through oppressive policies of family planning. Townsend Middleton delves behind the rhetoric of affirmative action to reveal the complicated status of a ‘ Scheduled Tribe’ and the centrality of ethnological knowledge in the modern world.

Lastly, Dube takes us to the farrago of art and culture. Arvind Rajagopal looks at the development of advertising in the 20th century. The last two pieces are bold and irreverent. Jaideep Chatterjee moves from the scientifically rational world of design to jugaad and its expressions. Sanjukta Sunderason recreates an imaginative narrative of the modern and modernism in Indian art, especially in the works of Somnath Hore and Tyeb Mehta.

In the afterword, Prathama Banerjee raises provocative questions, and considers the volume as post- national in its intent. In her flights of creative imagination, Banerjee implicitly asks: What’s the big deal about modernity? This is a volume that excites you but leaves you asking for more. A surfeit of Foucault. Time to look inwards? Acritical collection.
To wrest different histories away from their encasement within national narratives. 

A chapter on sexuality would have been welcome. The last word to Ian Bedford: “ Modernity is easier to pursue than define.” Is that the big deal? — The writer teaches History at Miranda House, University of Delhi.

Take By: Siasat News :  http://www.siasat.com/english/news/shadows-modernity

Read more...

ఓడ రేవులలో ప్రభుత్వం భారీ పెట్టుబడులు

చ్నై, డిసెంబర్ : దేశ వ్యాప్తంగా ఓడ రేవులను వృద్ధిపరచడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకోంది. వచ్చే పది సంవత్సరాలలో ఓడరేవలు కెపాసిటీని పెంచడానికి రూ.2.77 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి జీకే వాసన్ తెలిపారు. ఈ పెట్టుబడితో కార్గొ కెపాసిటీని 3.13 బిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బిలియన్ టన్నుల స్థాయిలో ఉందన్నారు.

చ్నైలో మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2011 జనవరిలోనే బిలియన్ టన్నుల కెపాసిటీకి చేరుకున్నట్లు చెప్పారు.

2010-11 సంవత్సరంలో 870 మిలియన్ టన్నులు. అలాగే 2020 వరకు 2495 మిలియన్ టన్నుల అంచనావేస్తున్నట్లు చెప్పారు. అలాగే చ్నై - ఎన్నోర్ ఫోర్టు రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తవుతున్నాయని, దీంతో ఎన్నోర్ రేవు నుంచి సరుకుల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎన్నోర్ రేవు కెపాసిటీ 6.5 మిలియన్ టన్నులకు చేరుకోనుందన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 39.73 శాతం అధికం.

Take By: T News

Read more...

మరో 1200 మంది నోటరీల నియామకం

హైదరాబాద్, డిసెంబర్ 17 (: రాష్ట్రంలో మరో 1200 మంది నోటరీలను నియమించాలని స్టాంప్స్ అండ్ రిజివూస్టేషన్స్ శాఖ నిర్ణయించింది. గతంలో రాష్ట్రం మొత్తం మీద సుమారు 700 మంది మాత్రమే నోటరీలు ఉండేవారు. దీనివల్ల తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవలే 1200 మంది నోటరీలను నియమించింది. ఇప్పుడు కొత్తగా మరో 1200 మందిని నియమించేందుకు రూపొందించిన ఫైలుపై సంబంధిత శాఖ మంత్రి సంతకం కూడా చేశారు. ప్రజలకు ఎక్కువ మంది అందుబాటులో ఉండేందుకు త్వరలో మరికొన్ని నియామకాలు చేపట్టే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఫలితంగా రాష్ట్రంలో మూడు వేలకుపైగా నోటరీలు ప్రజలకు అందుబాటులోకి రానున్నారు.

Read more...

తెలంగాణ ఉద్యోగులపై సర్కారు కుట్ర

- సమ్మెను సక్సెస్ చేసినందుకు కక్షసాధింపు
- ఒప్పందానికి విరుద్ధంగా 240 జీవో జారీ
- 3 నుంచి 4 వేల మందికి పెన్షన్ల నిలిపివేత
- వేలాదిగా ఆగిపోతున్న పదోన్నతులు
- అసలు విషయం తేల్చని సర్కారు
- చోద్యం చూస్తున్న తెలంగాణ మంత్రులు


One105-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్,: తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ఇచ్చిన హామీలపై మాట తప్పింది. సమ్మె తర్వాత సర్కారు జారీ చేసిన 240 జీవో పుణ్యమాని వేలాది మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ద్వంద్వ వైఖరి కారణంగా తెలంగాణలో సుమారు 45వేల పైచిలుకు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. నాలుగైదు వేల మందికి పెన్షన్లు అగిపోయాయి. ఆర్హత ఉన్నా పదోన్నతులు అందకుండా పోతున్నాయి. జీవోను సవరించి ఇచ్చిన మాట నిలుపుకోవాలని.. ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించాలని పలుమార్లు సంఘాల నేతలు కోరుతున్నా సర్కారు స్పందించడం లేదు.

ప్రభుత్వ దమననీతితో పది జిల్లాల్లోని వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తి, రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల్లో తెలంగాణ ఉద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగే ప్రమాదముంది. టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

ఒప్పందం వేరు.. ఇచ్చిన జీవో వేరు
తెలంగాణ సాధనే ధ్యేయంగా సెప్టెంబర్ 13 నుంచి ఆక్టోబర్ 24వరకు 42 రోజుల పాటు నిర్విరామంగా సాగిన సకల జనుల సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా 42 రోజుల సమ్మెకాలాన్ని ఆర్ధ వేతన సెలవుగా పరిగణించి మంజూరు చేస్తామని లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ఉద్యోగ సంఘాలు ఆయిష్టంగానే సమ్మతించాయి. సర్వీస్ బ్రేక్ కాకుండా ఉండటం, పెన్షన్, ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు ప్రతిబంధకాలు ఉండవన్న ఒకే ఒక కారణంతో ఉద్యోగ సంఘాల జేఏసీలు దీనికి అంగీకారం తెలిపాయి. అయినా ప్రభుత్వం ఇక్కడా మోసమే చేసింది.

లిఖిత పూర్వక ఒప్పందం ప్రకారం జీవోలు జారీ కావాల్సి ఉన్నా.. అసలు విషయాన్ని పక్కన పెట్టింది. ఒప్పందానికి సంబంధించి 28-10-2011న జీవోనంబర్ 240 విడుదలచేసింది. జీవోలో ఎక్కడా ‘అర్ధవేతన సెలవు’ అంశాన్ని పొందుపరచలేదు. ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

అగిన ఇంక్రిమెంట్లు.. నిలిచిపోతున్న పెన్షన్లు
42 రోజుల సమ్మెకాలాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంతో తెలంగాణ ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంక్రిమెంట్లు, పెన్షన్ల మంజూరు, పదోన్నతులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏడాదికోమారు వార్షిక ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఏడాది పూర్తికాగానే ఉద్యోగి ఖాతాలో అటోమెటిక్‌గా ఇంక్రిమెంట్ కలుపుతారు. ఈ లెక్కన తెలంగాణ జిల్లాల్లో సుమారు ప్రతి నెలా సుమారు 10 నుంచి 15వేల మందికి ఇంక్రిమెంట్ కలుస్తుంది. సమ్మె కాలాన్ని సర్కారు తేల్చకపోవడంతో అక్టోబర్1, నవంబర్ 1, డిసెంబర్ 1న కలువాల్సిన ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలోనే 6,200 పైచిలుకు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. పది జిల్లాల్లో సుమారు 45వేల పైచిలుకు ఇంక్రిమెంట్లు ఆగిపోయినట్లు సమాచారం.

ప్రతి నెలలో తెలంగాణలోని ఒక్కో జిల్లాలో 100 నుంచి 120 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరికి పెన్షన్ మంజూరు చేసి డబ్బుల కోసం అకౌటెంట్ జనరల్ కార్యాలయానికి ఫైల్ పంపిచాలి. కానీ ఇక్కడ కూడా 42 రోజుల సమ్మె కాలాన్ని ఎటూ తేల్చకపోవడంతో 42 రో జులను సర్వీసులో ఎలా తీసుకోవాలో తెలియక ఫైళ్లను పెడింగ్‌లో పెడుతున్నారు. దీం తో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3 నుంచి 4వేల పైచిలుకు ఉద్యోగుల పెన్షన్ల మం జూరు నిలిచిపోయింది. బాధిత ఉద్యోగులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నా ప్రభుత్వం నుంచి ఎటుంటి స్పష్టత రాలేదని ఉద్యోగులుచెబుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో అన్ని శాఖల్లోనూ నెలవారీ పదోన్నతులు ఉంటాయి. అవి కూడానిలిచిపోయాయి. మొత్తంగా వేలాదిగా పదోన్నతులు నిలిచిపోతున్నాయి.

రాష్ట స్థాయి కేడర్‌లో అన్యాయం జరిగే ప్రమాదం
ప్రధానంగా ఎంపీడీవో, ఎంఆర్‌ఓ, అసిస్టెంట్ డైరెక్టర్ హోదా గల పోస్టులను రాష్ట కేడర్‌గా గుర్తిస్తారు. ఈ విషయంలో సర్వీస్ ఒకే రకంగా ఉన్నా సమ్మెకాలం తేలకపోతే, ఆంధ్రా ఉద్యోగులు ముందకు దూసుకెళ్తారు. తెలంగాణ ఉద్యోగులు వెనుకపడే ప్రమా దం పొంచి ఉంది. తద్వారా ఉన్నత పదవుల పదోన్నతుల్లో భారీగా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగనుంది. సమ్మెకాలానికి సరిపోయేలా సెలవుల్లో పనిచేయాలని ఉపాధ్యాయ వర్గానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోందనే విమర్శలు వెల్లు టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

మంత్రులు స్పందిస్తేనే సమస్యకు మోక్షం
ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేల్చిచెప్పకపోతే మున్ముందు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అస్కారం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసేలా ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు ఒత్తిడి తేవాలని పలువురు కోరుతున్నారు.

Take By: T News

Read more...

Saturday, December 17, 2011

జైపాల్ దూరాశ!



jaipal-reddy-caricature talangana patrika telangana culture telangana politics telangana cinema-సొంత గడ్డపై కనిపించని రాజకీయ భవిష్యత్
-అయితే సమైక్యం.. లేదంటే తెలంగాణ కోటా పదవులు
-కాలం కలిసొస్తే ఉపరాష్ట్రపతి పీఠం దక్కేలా వ్యూహం

హైదరాబాద్, డిసెంబర్ 16 ():తెలంగాణవాదాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పదవుల వల విసురుతుంటే మరో వైపు తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని మన నేతలు అందలమెక్కేందుకు అర్రులు చాస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తుది అంకానికి చేరుకున్న దశలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు, హోదాల ఆశలు చూపించి వారిని చల్లార్చిన హైకమాండ్, తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి జైపాల్‌డ్డిపైనా పదవుల బాణం విసిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణంలో జైపాల్‌ను మరో ఏడాదిలో ఖాళీకానున్న ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించనున్నట్లు ప్రచారం మొదలైంది. ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఇప్పుడు జైపాల్ పేరును తెరమీదికి తీసుకురావడం వెనుక అధిష్ఠానం మతలబు ఏమిటో స్పష్టమవుతోందని మేధావులు, తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌ను ఉపరాష్ట్రపతిని చేస్తున్నామంటూ ప్రచారం సాగిస్తూనే ప్రత్యేక రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌లో కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని జైపాల్‌డ్డి కూడా పదవీ సోపానం ఎక్కే ప్రయత్నంలో ఉన్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో జైపాల్‌కు వచ్చిన బెర్త్ కూడా తెలంగాణ ప్రాంత కోటాలోనే వచ్చింది.

కేబినెట్ హోదాగల ఏకైక కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం 2004, 2009లో అవకాశం కల్పించింది. రాజకీయ అనుభవం, మంచి పార్లమెం అధిష్ఠానంతో దగ్గరి సంబంధాలు కలిగి విశ్వాస పాత్రుడిగా పేరు... వంటివి జైపాల్‌కు అర్హతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత నేతగానే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో గుర్తింపు లభించిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తీసుకురావడానికి తెలంగాణనే అర్హతగా, ప్రామాణికంగా అధిష్ఠానం గుర్తించినట్లు వినిపిస్తోంది. ఉప్పెనలా, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడిచినా, సుదీర్ఘకాలంపాటు రాష్ట్రంలో సకలజనుల సమ్మె కొనసాగినా, పార్టీలకు అతీతంగా ప్రజావూపతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించినా కూడా కేంద్ర కేబినెట్‌లో ఉంటూ జైపాల్‌డ్డి ఎక్కడ కూడా, ఏనాడు కూడా తెలంగాణ విషయంలో స్పష్టంగా మాట్లాడక పోవడం, కేంద్ర మంత్రికి కొన్ని పరిమితులు ఉంటాయంటూ ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర విషయంలో డొంకతిరుగుడు వైఖరి ప్రదర్శిస్తు వచ్చినందుకే ప్రతిఫలంగా అధిష్ఠానం జైపాల్‌కు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలని, పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు జైపాల్‌డ్డిపై గతంలో ఒత్తిడి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తామని కూడా వారు జైపాల్ వద్ద పేర్కొన్నారు.

ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకున్న సమయంలో కూడా జైపాల్ హైకమాండ్‌కు నమ్మినబంటుగా ఉఁటూ మౌనం పాటించారు. తెలంగాణవాదం బలపడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే భయం జైపాల్‌ను వెంటాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని జైపాల్ భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. తనకంటూ సొంత నియోజకవర్గం లేకుండా ఆయన ఇప్పటికి నాలుగు చోట్ల తిరిగారు. రాజకీయ చివరి అంకంలో ఎన్నికల్లో ఓడిపోయి తెరమరుగు కావడం కంటె రాజకీయాల్లో రిటై్మంట్ కావడమే మంచిదన్న ఆలోచనతో జైపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వారు ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా దక్షిణాది వారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉందని జైపాల్ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పెద్దగా లాబీయింగ్ లేక పోయినా తెలంగాణ కోటాలో ఉపరాష్ట్ర పతి పదవిపై జైపాల్ కన్నేసినట్లు మరో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కనీసం మద్దతుగా మాట్లాడక పోగా తాను ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదిని కాదని, జాతీయ వాదినని ప్రకటించుకుంటూ జైపాల్ తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణ పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరించి సమైక్యవాదుల సరసన జైపాల్ నిలిచారని టీ వాదులు నేటికి మండిపడుతుంటారు. సమైక్యవాదం వైపు మొగ్గుచూపుతూనే తెలంగాణ కోటాలో అందలమెక్కుతూ వచ్చిన జైపాల్‌కు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కూడా అదే ఖాతాలో వస్తుందేమోనని పార్టీ నేతలు కొందరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

 Take By: T News

Read more...

Wednesday, February 23, 2011

మధు (యాష్కి) మస్తి!

మదన్న నిన్న లాయర్స్ సమర భేరిలో ఇష్టం వచ్చినట్టు కూసిండు ! సభలో మిత్రుడొకాయన రాజీనామా ఎందుకు చేయలేదంటే రోషమొచ్చింది, నువ్వెంత? నీ బతుకెంత? తెలంగాణాకి నువ్వు ఎం చేసినవ్ ? అని కళ్ళెర్ర చేసుకొని కోపం అయిండు. కడుపు మండి మిత్రుడు అడిగిన ప్రశ్నల ఏమైనా తప్పుందా చెప్పుండ్రి? దానికి అంత ఫీల్ గావాలన? అన్న నువ్వు ఇన్ని రోజులు తెలంగాణాకి చేసింది ఏందీ చెప్పు..కుక్కిన పెను లెక్ఖ పడి ఉండటం పనా? లేకపోతె డిల్లి కి ఊకే ఫాషన్ పరేడ్ చేయడం పనా?

ఇక్కడ జరిగే పోరాటానికి మొహం చూపలేక ఆడ బోయి దాక్కున్తున్రని మాకు తెల్వదానే! మరి మేము అంత పిచ్చోల్లం గాదు అన్నల్లార! ఇగ మా అక్కలు ఏడున్నరో పాపం , నోరు తెరవరు, సప్పుడు కాకుండా పదవులు ఎంజాయ్ చేస్తారు, తల్లుల్లారా ఒక్కసారి ఈశ్వరి బాయి, సదాలక్ష్మి , మల్లు స్వరాజ్యం ని గురుతు తెచ్చుకోండి, మీరు ఆడోల్లకు ఆదర్శంగా ఉంటారంటే, అది లేకపాయే, మిమ్మల్ని గెలిపించింది తెలంగాణాకు ఎమన్నా చేస్తారని , ఆడోల్లు కదా కనీసం మీకన్నా బాధలు అర్థం అయితే అనుకుంటే , అది మా పిచ్చి అని తెల్చేసిన్రు! అంతా మా దరదృష్టం! ఎవరిని ఏమి అనలేము..


పాపం చాల మందికి తెలవని విషయం ఒకటుంది, ఉసరేల్లుల కథ! అన్ని పార్టీల ఉన్న మోసగాళ్ళు , రంగులు మార్చే మొనగాళ్ళు చాల డేంజర్, పాపం చంద్ర బాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం , రేడు నాల్కల సిద్ధాంతం అట్టర్ ఫ్లాప్ , అయినా ఆయనని వీడరు మనవాళ్ళు, నిను వీడని నీడను నేను అని ఇంకా డుఎట్ పాడ్తనే ఉంటారు, అసలు పార్టీ సంబంధాలు కాక వీరి మధ్య ఇంకేమైనా ఉన్నాయా అని మనం అడగడం అంత బాగోదు..కాని కామన్ సేన్స్సు ఉంటె ఎవరికైనా దౌబుట్ రాక తప్పదు. ఏంచేస్తాం తమ్మి !

కలి కాలం! ఎవడిని నమ్మల్నో ఎవడిని నమ్మోద్దో తెలిస్తే కదా! చిరంజీవి లాంటి వాళ్ళతో మనకు పెద్ద బాద లేదు, సినిమా అయన కదా, ఆయన ‘కాట్ వాక్’ వస్తది కదా, సక్సేస్ అయిండు, జై కాంగ్రెస్ అని నమ్ముకున్నోల్లని గంగల ముంచిండు. మంత్రి పదవికి అంత దమ్ముంటది మరి! అయినా వాడు అన్ద్రోడే కదా దేన్నైనా తాకట్టు పెడతాడు , పైసా కోసం, పదవి కోసం , పేరు కోసం, గీల్ల తోన్ని దోస్తాని చేసి మావోల్లు పూరితిగా సెడి పోయిన్రు కాదె! కాంగ్రెస్ అనగా మనకు శత్రువు అని తెలుసు, అంటే మళ్లీ ఆంధ్ర కాంగ్రెస్ , తెలంగాణా కాంగ్రెస్, అందులో కోమటి రెడ్డి లాంటి వాళ్ళు , బహిరంగంగా కనపడతారు , మధు యాష్కి లాంటివోల్లు న ఆటు, న ఇటు లెక్క ఉంటారు.

.కొద్ది మందికి జర అన్నంటే ప్రేమ, మా కులపోడని , మంచోడని, ఏమి మంచి చేసిందో జర తెలిస్తే చెప్ప్పున్రి, మా యాదయ్య సచ్చినట్టు ఎమన్నా సావమంటున్నామే , జర ఒక కాగితం మీద రాజీనామా సంతకం గియి అన్న అన్నం, వంద మాటలు చెప్తారు గాని, ఆ వొక్కటి అడక్కు! అది తక్క ఏమైనా కోరుకో! ఇంకేముంది కోరుకోనికి , మీరు మాకున్న పరువు అంతః పార్లమెంట్ గల్లిలో పడేసి వస్తిరి..ఒక్కడికన్న సోనియమ్మా అప్పాయింట్మెంట్ ఇయక పాయె, సిగ్గు శరం మీకు ఎందుకు దేవుడు పెట్టలేదో అన్న ..మేము మాత్రం తలెత్తుకోలేక పోతున్నాం.

మళ్లీ అందులో సప్పుడు చడి చేయనోల్లు ఉంటారు. పొద్దున్న లేస్తే మా మధు యాష్కి నీ వెంటే నేను అంటడు ..మా కులపోడు, ప్రాంతపోడు అని మనం ఆవేశంగా ప్రేమిస్తాం , చూస్తె ఏముండదు, సూదిలో దారం. ఆవేశంగా మాట్లాడతారు..డిల్లి కి పొతే మాత్రం గల్లి లీడర్లంత పని కూడ చేయలేరు. అమ్మ దర్శనం దొరకదు, మీడియాల రెండు ముక్కలు చెపుతారు..ఇగోస్తది తెలంగాణా, అగోస్తది, అమ్మ బొమ్మ సో ‘నియమ్మా’ ఇస్తది అని చిలక పలుకులు చెప్తారు. మంచిగయింది , ఇయాల ఎవరు కథల్ చెప్తే ఇననీకి సిద్దంగా లేరు.


మిమ్మల్ని నమ్మకం తో గెలిపించినందుకు ప్రజలకు బాద్యత వహించాలి, వాళ్ళ ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి కాని, అంత ఉల్టా చేస్తారెందే అన్న, ఇక్కడ వోల్ట్లు వేసి గెలిపిస్తే అక్కడ సోనియమ్మ పాట పాడితే ఎట్లా చెప్పున్రి ..మీరు చేసిన పనికి, సంవత్సర కాలం నష్ట పోఇనం, ఎన్నో విలువైన పానాలు పోగొట్టుకున్నాం, ఈ హత్యలన్ని మీరు చేసినయె, మీ చాతగాని తనానికి పసి పోరగాల్లు, దైర్యం లేనోళ్ళు గుండె పలిగి సచ్చిన్రు ..మాకు తెలుసు, మీకు నోరు పెగలదు..

ఆస్తులు పోయేతోడు జర బయట పడతారు, మీకు ఆటు అవ్వ గావలె, బువ్వ గావలె, మాకు ఇంక ఓపిక లేదన్న,ఏమనుకోకున్ద్రి ..ఇపుడు మీరు రాజేనామ చేయలేదని ఎవరైనా అన్న, ఎందుకు మా పోరగాల్లని పొట్టనబెట్టుకున్నారని ఒక దేబ్బెసిన సప్పుడు చేసే అధికారం మీకు లేదు.

.ఐతే నోర్ముసుకు పడి ఉన్డున్రి, లేకపోతె అన్ద్రోల్ల సోపతి పట్టి , జగన్ గాని ఎంకనో, లగడపాటి ఎంకనో పొండ్రి..సహాయ నిరాకరణ వద్దని చెప్తాడు ఒక్కో నాయకుడు..జర దేల్వక అడుగుత మీదేం సొమ్ము పోతుందే ! అందరు మంచిగానే సంపాయించుకొని బంగ్లాలు గట్టుకున్నారు , పోయి డిల్లిల కూసున్నరు..కష్టమైనా , నష్టమైన మాకే కదా..తెలంగాణా రాని బిడ్డా! ఒక్కొక్కని ఆస్తులు అన్ని బయట పెడతము, అపుడు గాని తెల్వది ఈ వ్యూహాత్మక మౌనం వెనక అర్థం.


ఇంగ తెలుగు దేశం నాయకులని చూస్తె లేదా ఒక్కతీర్గ బాద ఐతది, బిడ్డలు ఏడ్వలేక , నవ్వలేక, పార్టి లోపల ఉండలేక, బయటికి రాలేక ఒకటే హైరానా పడుతున్నారు. ఎం భక్తి అన్న! కళ్ళు చేమరుస్తున్నై, ఆడికి సోనియమ్మ, నీకు చంద్రన్న ! మా గోస ఎందుకు పట్టి లేదే మీకు. ఇపుడేదో ఉద్యమంల రాకపోతే బాగుండదని జర వోర్లుతున్రు గాని, లేకపోతె నువ్వు చేస్తే , నేను చేస్తా అని పోటీలు పెట్టుకోలేద? ఇగ ఆటు ఇటు గాని బాపతి మా జెపి గాడు..వాడి తెలివి సల్లంగుండ, మాకెవరికి దిమాక్ లేదు అనుకుంటాడు గాని, ఆఖరుకి మా మల్లెషన్న చేతిలో బలి అయిపాయె..మాకు ఇంగ్లీష్ చదువులు ,
మాయల మరాఠి మాటలు సేవున బడతలేవువు..తెలంగాణా ఇస్తే ఇయున్రి, లేకపోతె ఇయ్యర మయ్యార దంచి ఎట్లా తెచ్చుకోవాలని మాకు తెలుసు..పరేషాన్ కాకుండ్రి.

ఇంతకీ చెప్పొచ్చేది ఏందంటే, కాంగ్రెస్ఒళ్ళు రాజీనామా చేస్తారంట , ఎపుడు.. ఇపుడు ఉద్యమం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి, ఇన్ని పానాలు పోయినాయ్ రేపు వాళ్లై కూడ పోతాయి అని భయం పట్టుకుందేమో ..ఒక్క మాట ఇనుండ్రి బిడ్డ! సనిపొఇన పతోక్క బిడ్డ సాక్షిగా చెపుతున్నాం. మీరు అంత తెలంగాణా ద్రోహులు. మీరు ఇపుడు ఎన్ని మంచి పనులు చేసిన ఏమి లాభం లేదు..

ఇపుడు తెస్తే మీకు బర్కతి ఉంటది లేకపోతె మీ రాజకీయ జీవితం కి నూకలు చెల్లినట్లే. ఏ పని అయినా చేసే టైం ల చేయాలే.. మీరు ఇపుడు తప్పదని కదిలిన్రు లేకపోతె మల్ల ఎలక్షన్ల దాక కదుల్తున్తిర కాని..ఎవడన్న ప్రజలని ఒక్క మాట అంటే అది కూడ ఏ పార్టీ రాజ కీయ నాయకుడు ఐన , ఊరికిచ్చి కొడతాం! ఒక నాయకుడు తల్వార్లతో తరుముతం అన్నడు, ఏమైంది గతి..దెబ్బకు లోపటినుంచి అన్నల వార్నింగ్ వచ్చింది , సప్పుడు కాకుండా డిల్లిల బడ్డదాక పోయిండు. ఖబడ్దార్ !

వళ్ళు దగ్గర బెట్టుకొని మర్యాదగా మాట్లాడున్ద్రి. అసలు వీళ్ళని పిలిచినోడిది బుద్ది తక్కువ , ఇంక ఎం చేస్తారని వీళ్ళని నమ్ముతారో నాకు ఇప్పటికి సమజ్ అయితలేదు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి /

ఇప్పుడు కాక పొతే తెలంగాణా ఎప్పటికి రాదు, మరొక టునిషియా, ఈజిప్టు కాకముందే ఇస్తే మంచిది , ఇయ్యకున్న మంచిదే ..దంచుడే, లడై చేసుడే, తెగించి కొట్లాడుడే ..

లాస్టుకి అన్న కెసిఆర్ అన్న కూడ డిల్లి పోతున్దంతా , ఏమ్చేస్తారో చూద్దాం ..అన్న ఏది చేసినా జర పంచ్ ఉంటది..పంజా ఉంటది , అది సొంత అజెండా కావొచ్చు, ప్రజల అజెండా కావొచ్చు..ఎవరు చేసిన , చేయక పోయిన తెలంగాణాని ఆపే దమ్ము ధైర్యం ఎవనికి లేదు , ఇపుడు రాక పొతే,

న ఘర్ కా నా ఘాట్ కా..అందరం అరబ్ దేశాలకు పోయి ఉద్యమం పాటాలు నేర్చుకొని రావాలి..అంత లేదనుకుంటా, వాళ్ళకే మన పోరాటం ఆదర్శం..

జై తెలంగాణా!

Thanks సుజాత సూరేపల్లి for sharing

Read more...

ఒక్క రోజే ఆర్టీసీకి రూ. 2 కోట్లు నష్టం


MGBSsహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ బంద్‌ ప్రభావం ఆర్టీసిపై తీవ్రంగా పడింది. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు జరిగిన బంద్‌ వల్ల తెలం గాణలోని పది జిల్లాల్లో మొత్తం 6500 బసు సర్వీ సులను ఆర్టీసి రద్దు చేసింది. దీనివల్ల ఒక్క రోజు లోనే రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెల్ల వారుజామున కొన్ని సర్వీసులను నడిపిం చినా, పోలీసుల సలహాతో వాటిని రద్దు చేశారు. హైదరా బాద్‌లో మాత్రం 20 శాతం బస్సుల రాకపోకలు సాగించాయి. కొన్ని ప్రధాన మార్గాల్లో పాత బస్సు లను రోడ్డుపైకి తెచ్చి, నడిపించారు. ఉదయం పూట తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయ కులు బస్‌డిపోల ముందు బైఠాయిం చి, నినాదా లు చేశారు. డిపో గ్యారేజీలకు తాళం వేశారు. ఆర్టీసికి చెందిన జెఎసి నాయకులు కూ డా వారికి మద్దతు పలకడంతో బస్సులు కదల్లేదు.

బంద్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే అప్రమత్తం కావడంతో ఎక్కడా ప్ర యాణికులు ఇబ్బందులు పడిన సమాచారం లేదు. హైదరా బాద్‌లో ఉదయం నుంచీ కొన్ని ప్రధాన మార్గాల్లో ఒకటి, రెండు చొప్పున సిటీ బస్సులు నడిచాయి. పాత సిటీ ఆర్డినరీ బస్సులను అధికారులు రోడ్లపై కి తెచ్చారు. పోలీసుల హెచ్చ రికలతో కొన్నింటిని డిపోలకు మళ్లించినా, అనం తరం పరిస్థితిని బట్టి బస్సులను నడిపించారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగ వచ్చని తెలుస్తోంది.రైళ్లనూ అడ్డుకున్నారు. కొన్ని మార్గా ల్లో జేఏసీ నాయ కులు రైల్‌రోకో నిర్వహించారు.

Read more...

బిల్లు పెట్టండి


kcf-vijayaన్యూఢిల్లీ, మేజర్‌న్యూస్‌: తెలంగాణపై బయట మాట్లాడ టమే తప్ప సాధికార చట్టసభ అయిన లోక్‌సభలో ఏనాడూ ప్రస్తావించని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చిట్టచివరకు గళమెత్తారు. పార్ల మెంటు ప్రస్తుత సమావేశాలలో బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ కేసీఆర్‌ మంగళవారం లో్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ కోరినప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహారంపై ప్రభు త్వం సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేస్తు న్నట్టు ప్రకటించనున్నందువల్ల జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని స్పీకర్‌ మీరా కుమార్‌ చెప్పారు. అయితే ఇది కేవలం ప్రస్తావించి ముగించే అంశం కాదనికచ్చితంగా చర్చ జరగాల్సి ఉన్నందున తాను ఆ అవకాశం వాడుకోదలచలేదని కేసీఆర్‌ ఆ తర్వా త లోక్‌సభ వెలుపల పత్రికల వారికి చెప్పారు.

బైఠాయింపు నేడు...
బుధవారం మరోసారి తెలంగాణ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని, చర్చకు అనుమతించ కపోతే పోడియం ముందు బైఠా యింపు జరిపేందుకు వీలుగా నిర్ణయాన్ని వాయి దా వేసుకున్నామన్నారు. ఈ లోగా తెలంగాణపట్ల సానుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలన్నిటితోనూ చర్చిస్తామన్నారు. డిసెంబర్‌ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఏదో ఒక సమాధానం రాబట్టటానికి తెలంగాణ అంశాన్ని సభలో ప్రస్తావించామని, బుధవారం ఈ విషయమే పట్టు పడతామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల బంద్‌ ప్రారంభమై విజయవంతంగా సాగు తున్నా, ఇక్కడ కేంద్రానికి కానీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టయినా లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ బిడ్డలు 600 మందికి పైగా ఆత్మహ త్యలు చేసుకున్నారని, ఇంతటి దారుణ పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ, అదేదో కేంద్రమే చూసుకుంటుంది లెమ్మని ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర పోషించటం మంచిది కాదన్నారు. ఆయనే చొరవ తీసుకుని కేంద్రంతో సంప్రదింపు లు జరపాలని డిమాండ్‌ చేశారు.

గొంతెమ్మ కోరిక కాదు...
తెలంగాణ ఏర్పాటు అనేది గొంతెమ్మకోరిక కాదని, అది కోట్లాది ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు.ఆ ఆకాంక్షను గుర్తించినందుకే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదిక సమర్పించి రెండు నెలలు అయిపోయిన దృష్ట్యా ప్రధాని వెంటనే ఏదో ఒకటి తేల్చాలని, సోనియా గాంధీ మాట నిలబెట్టుకోవాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇప్పటికే అగ్నిగోళంగా మారిందని, న్యాయ, శాసన వ్యవస్థలు స్తంభించిపోయాయ న్నారు.

ఈ నేపథ్యంలో ఫలానా సమయంలోగా తెలంగాణ ఏర్పాటు దిశగా ఫలానా చర్యలు చేపడతామని చెబితే ప్రస్తుత పరిస్థితి కాస్త అయినా చల్లబడుతుందన్నారు. బుధవారం కేంద్రం షరా మామూలుగా చూస్తాం... చేస్తాం...అని తప్పించు కునే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత జరిగే జేఏసీ సమావేశంలో ఏమి చేయా లో నిర్ణయించు కుంటామని కేసీఆర్‌ తేల్చి చెప్పా రు. ఆయన వెంట మెదక్‌ ఎంపీ విజయశాంతి, మాజీ ఎంపీ ఎ.పి.జితేందర్‌రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Read more...

Monday, February 21, 2011

తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య

అల్లాదుర్గం,ఐడిఏబొల్లారం,మేజర్‌న్యూస్‌:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతుందని తనకు ఉద్యోగం రాదని, జగ్గారెడ్డి అనుచరుల బెదిరింపులు తాళలేక మరో విద్యార్థి కుసుమం రాలిపోయింది. స్థానికులు సుసైడ్‌ నోట్‌ వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామానికి చెందిన గార్లపల్లి యాదగిరి( 22) శనివారం రాత్రి తన స్వగృహంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో బిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యాదగిరి తెలంగాణ ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడు. ఇప్పటి వరకు తెలంగాణ తొందరలోనే వస్తుందని భావిం చాడు.ఇక తెలంగాణ రాదేమోనని ఆత్మస్థైర్యం కోల్పోయి స్వంత గ్రామానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో ముస్లాపూర్‌ గ్రామంలో శోకసంద్రంలో మునిగింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ేసీఆర్‌ సదాశివపేటలో నిర్వహించిన సభకు వెళుతు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫెక్సి బోర్డులను ధ్వంసం చేశాడు. దీంతో జగ్గారెడ్డి అనుచరులు తారా కళాశాలకు వచ్చి తనను హెచ్చరించి భయబ్రాంతులకు గురి చేసినట్లు తన సుసైడ్‌ నోట్‌లో రాశాడు. యాదగిరి ఆత్మహత్యతో ముస్లాపూర్‌ గ్రామంలో తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది. తన అంత్యక్రియలకు హరీశ్‌రావు, కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, కవితలు పాల్గొని జయప్రదం చేయాలని కోరాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న యాదగిరి రాసిన సుసైడ్‌ నో ట్‌ ముస్లాపూర్‌ గ్రామస్తులను, తెలంగాణ ఉద్యమ కారులను కంటతడిపెట్టించింది.

పూజ్యులైన అమ్మకు నమస్కారం... అమ్మా నన్ను కన్నందుకు నీ పాదాలకు నమస్కారం నాన్న లేకున్నా నన్ను చదివించి ఇంత వాడిని చేశావు. ఉద్యోగం రాదు దానికి కారణం సీమాంద్ర నాయకులు రానివ్వరు అందుకోసమే చనిపోవా లనుకున్నా. నీవు మాత్రం బాధపడకూడదు. నీకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ లు అండగా ఉంటారు. నీవు ఒంటరి కాదు నీ పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. నీవు మాత్రం తముళ్లను బాగా చూసుకో. ఇలా వెళుతున్నందుకు నన్ను క్షమించు అనే రాతలు ఉద్యమకారులను, గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. తెలంగాణ కోసం చేపడుతున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని సంగారెడ్డి వెళ్లి అటు నుండి సదాశివపేటలో జైబోలో తె లంగాణ సినిమా చూసినట్లు సుసైడ్‌ నోట్‌లో తెలిపాడు. ఉద్యమంలో భాగంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫ్లెక్సి బోర్డులను చింపి వేసి జగ్గారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆయన అనుచరులు మరు సటి రోజు కళాశాలకు వచ్చి బెదిరించినా తాను భయపడ లేదని సుసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

యాదగిరి విద్యాబ్యాసం
మొదటి తరగతి నుండి యాదగిరి చదువుల్లో చురుకైన విద్యార్థిగా పేరొందాడు. 10వ తరగతి వరకు హత్నూరలో, ఇంటర్మీడియట్‌ నల్లవాగులో, డిగ్రీ సంగారెడ్డి తార కళాశాలలో విద్యనబ్యసిస్తున్నాడు.సంగారెడ్డిలోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంతలోనే అసువులు బాశాడు.

అంత్యక్రియలకు హాజరైన హరీష్‌రావ్‌
తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ యాదగిరి అంత్యక్రియలకు ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌ రావ్‌, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి అంత్యక్రియలకు హాజరైన నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

యువకుడి అత్మహత్యాయత్నం
జిన్నారం మండలం బోల్లారం పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని కోత్తబస్టాండులో ఓ వ్యక్తి కిరోసిన పోసుకోని నిప్పంటించుకోన్న సంఘటన బోల్లారంలో చోటుచేసుకోంది. ఆదివారం రాత్రి ఎడున్నరగంటల సమయంలో బోల్లారంకు చేందిన ఎండి ము స్తాప్‌ కిరోసిన్‌ సోసుకోని నిప్పుంటించుకోవటంతో శరీరం పూర్తిగా కాలి పోయింది.జై తెలంగాణ జైజై తెలంగాణ అంటు నినాదలు చేస్తు కుప్పకూలడంతో స్థానికులు మంటలు అర్పె ప్రయత్నం చేశారు.ఎండి ముస్తాప్‌ సుధీర్ఘమైన నాలు గు పేజిలలో తెలంగాణ గురించి దాని అంశం తెలంగాణ బిల్లు పార్లమెంటులో పేట్టాలని నా మరణం అంతంలేదు తెలంగాణ అరంబం అంటు రాశాడు.అతని స్థానిక అస్పత్రికి తరలించారు.


take By: Suryaa.com

Read more...

Saturday, February 19, 2011

దెబ్బ పడింది-గుండె మండింది

ఎముకలు కుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులార ! చావండి!
నెత్తురు మండే ,
శక్తులు నిండే
సైనికులారా రారండి !…

ఏడనో చదివిన ‘రగలని జీవితం లో మిగిలేదేముంది’, రగులుతుంది తెలంగాణా, మీ మేక వన్నె పులి ఏసం చూసి, కుతంత్రాలు చూసి .. భాష ప్రావీణ్యం అంతా ఇవాళ పేపర్లలో కనబరచిన్రు మావోల్లు, అన్నల్లార మీ తెలివికి జోహార్లు! ఎంత తెలివి, ఎంత మేధా సంపద, అన్త్ర్హ మామిదనే, ఎక్కడి దృతరాష్ట్ర కౌగిలి ఒకడు ‘దౌర్జన్యం’ అంటడు, ఇంకొకకడు ‘చీకటి రోజు’, ‘సిగ్గు సిగ్గు’, ‘రౌడి అసెంబ్లీ’,

ఇంక టివి చానళ్లల్ల పండగ, చూపిచ్చిందే చూపించి, ఎసిందే ఎసి, ఎం దెబ్బ తమ్మి! బాసా ఒకటి కొడితే వంద కొట్టినట్టు – మా మల్లేష్ అన్న , డ్రైవర్ కావొచ్చు, కాదు కాదు, జార్జ్ బుష్ మీద బూటు విసిరిన ‘జెడి’ ఇప్పటినుంచి! నీకు తెలంగాణాల ఉద్యమంల ఒక పేజి ఉన్నది మల్లెషన్న! మల్లోకసారి మా కళ్ళకు మరొక వికృత రూపం చూపించి నందుకు.. తెగించి కొట్లాడుడే అని రక్తంల ఉన్నది, పదవులు, చచ్చు పరువు గురించి ఆలోచించలేదు! నీ యబ్బ! ఎం జిందగీ రా భై, జీవితాంతం కండ్లు తెరుచుకుంటూనే ఉంటాయ్, ఇంత దౌర్బాగ్యం ఏడ లేదనుకుంటా! పొద్దునే ఒక మిత్రుడు ఫోన్ చేసి ‘చీకటి రోజు’ అని టైటిల్ పెట్టినందుకు, ఇవాల్టినుంచి ఈనాడు పేపర్ బందు పెడ్తున్న అన్నడు! అది విజయం, గుండె రగిలింది అన్నకు..అదే ఇప్పుడు కావాల్సింది . ఒక తుగ్లక్ గాడు గవర్నర్ ఉంటాడు, వాడు మాట్లేది మనం వినాలే అంటడు, ఇంకొక దగుల్బాజీ గాడు ‘సత్తా’ లేని దద్దమ్మ,

అవినీతి కి వ్యతిరేకంగా అని, పూర్తిగా అవినీతిలో మునిగే మేక వన్నె పులి గాడికి మీడియా వత్తాసు. హరిషన్న, రాజెందరన్న అందరికి ఇవాళ దెబ్బ పడింది, గౌరవ మర్యాదలు, విలువలు అంటు చిలువలు పలవలుగా పేలుతున్న సీమంద్రా నాయకులను చూస్తుంటే ఇన్ని రోజులు దాచుకున్న , అణచి వేసుకున్న పౌరుషం బయట పడ్డది, ఒక దెబ్బ పండింది. ఇపుడైనా శాంతి మంత్రాలూ పలికే , న్యాయ అన్యాలు పలికే మావోల్లకి తెలవాలే, కడుపు మండితే ఏమైతదో..దమ్మున్నోడు కొడుతాడు, తిడతాడు, చేతకానోడు, బడ బరిన్చాలేనోడు చస్తాడు..గంతే అన్న!
ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు..ఎంత సహనం ఇంకెంత సహనం,

ఏది హింస, ఏది ప్రజాస్వామ్యం? అర్థాలు మార్చిన ఆంధ్రోల్ల దౌర్జన్యం ఎన్నడు కనపడని మేధావులు ఎన్ని రోజులు మామీద మీ జులుం, అన్న! ఎంత మంచి మనసు నీకుందని తెలవక ఎంత సోచయిన్చినం? నీకు ఒక్క దెబ్బ ఇంత దిమ్మ తిరుగుతదని, ఇంత స్పందించే హృదయం నీకుందని తెల్వక పాయె గదనే! ఒక్క దెబ్బనే నీకు ఇంత మండితే, మాకు ఎన్ని దెబ్బలు, ఎన్ని చావులు, ఎన్ని నష్టాలు, కష్టాలు, నవ్వులపాలు అయిన బతుకులు..ఇవన్ని నీకు ఎన్నడు ఎందుకు కాన రాలే? నిన్నటికి నిన్న , మా కరీంనగర్ మడంపల్లి ల, మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూన్న ఆడోల్ల మీద , హత్య , అత్యాచారం, కుల దూషణ చేసి, ఆడోళ్ళను భయపెట్టి , ఆస్తి నష్టం చేసిన్రని ఊరంతా అర్రెస్ట్ చేసి , 34 మంది పై నాన్ బైలబుల్ కేసులు 400 వందల మంది పోలిసోల్లు, 14 మంది ఎస్సైలు , 4 సిఐలు , ఒక డిఎస్పి ఊరు మీద పడ్డారు, అంతా పెద్ద పోరాటం , అది కూడ చదువు కొని ఆడోల్లు చేస్తూన్న పోరాటం,

మా నీళ్ళు బోతున్నై, భూమి పోతుందీ అని రోడ్డున పడితే మీకు వార్త కాదు..జిల్లా పేజీల ఒక చిన్న న్యూస్, మా వోల్లు , రైళ్ళ కింద బడి, విషం తిని, కాలి పోయి, అలసి పోయి సొలసి పొతే మీకు మొదటి పేజి వార్త కాదు ..ఎం డిస్క్రిషన్ అన్న, ఒక్క పాలి చేప్తివంటే మా అజ్ఞానాన్ని మేము మల్ల మర్చి పోయి, మీ గొప్పతనానికి సన్మానం చేస్తాం, ఒక సారి మరొక కొత్త పాటం నేర్సుకున్టం. ఆశలు మిమ్మల్ని చూస్తె చాల బాదేస్తది, ఛీ, తూ, నీయవ్వ, అబ్బ , లుచ్చ , లఫన్గే( ఇంక ఎక్కువ తిట్టలేను..సభా మర్యాద..క్షమించున్ద్రి) అన్నంక కూడ దిక్కులేకుండా మా మీద పడి, మా జాలి దయ మీద బతుకుతున్నారు, ఇంత సిగ్గులేని బెకార్గాల్లతోని ఇన్ని ఏండ్లు ఉన్నామంటే మా మీద మాదే అసహ్యం ఎస్తుంది..మీకు వంత పాడే మా వోళ్ళని కూడ ఇవ్వాల్టి నుంచి జాతి బహిష్కరణ చేస్తున్నాం, మీ ఆంధ్రోల్ల కాడికి తీస్క పొండ్రి, మా బిడ్డలైన సరే, దేశ ద్రోహులని భరించే శక్తి, మంచి తనం మాకు లేదు! మమ్మల్ని జర వదిలేయుండ్రి .. మీ కళ్ళళ్ళ భయం చూస్తున్నాం, ఇది మా విజయం! భయ పడి చావండి , క్షణ క్షణం చావండి, మీరు తినే అన్నం మేతుకులలో మా పిల్లల రక్తం నిండి ఉంది, జలగల్లాగా పట్టి పీడిస్తున్న మీకు ..నిన్న బడ్డది ఒక సాంపిల్ మాత్రమె..భయమున్నోడే ఎక్కువ ఆవేశ పడతాడు, ఎక్కువ వేషాల్ ఎస్తాడు, మైండ్ పని చేయక అడ్డగోల్ పని చేస్తడు,

ఏడనో దొరికి పోతాడు ..మీకు దిమాక్ పని చేస్తలేదని చెప్పనికి ఇంత కంటే వేరే సాక్షం అక్కర్లేదు, మాకు తెలుసు..పొల్లు పొల్లు గొట్టి తన్ని తరిమేసే దాక మీరు పోరని, ఆ పరిస్తితి మీరే మాకు కల్పిస్తున్నందుకు మీకు ధన్య వాదాలు..ఎం చేయాల్రా భై! మీ అంతా నీచులం కాదు,

కమీనే కుత్తేలం గాదు, మా రక్తంల లేదు, ఒకడో అరనో, కల్తి గాడు ఎడైనా ఉంటాడు అనుకో, ఇగ బోతరు , ఆగ బోతరు అని చూస్తుంటే, ఒక్క అడుగు కూడ కదుల్తలేర్ర బై, నీ జాతి! సిగ్గు సిగ్గు! ఇంక ఎం మిగిలుందిరా వెధవల్లారా! దోసుకున్నంత దోసుకున్నారు! మా బొక్కలు, ఆస్థి పంజరాలు ఉన్నాయి, వాటితోటి కూడ ఏమైనా కొత్త వ్యాపారం చేస్తున్ర? ఎంత కైనా సమర్థులు తమ్మి! ప్రేమలు అమ్మగలరు, అమ్మలను తాకట్టు పెట్ట గలరు, నమ్మకాలను వేలం వెయ గలరు..కానియ్ , మాకు ఇపుడిపుడే సమజ్ అయితుంది..కండ్లు తెరుసుకున్తున్నాయి..మర్యాద మీతో మాత్రం చెల్లది! అయిన మనుషులైతే మర్యాద కదా! జంతువులు అనటానికి కూడ మనసోప్పుతలేదు..ఎం బతుకులురా మీయి, తిడతానికి కూడ తిట్లు లేవు, పోలుస్తానికి జంతువులు కూడ సిగ్గు పడుతున్నాయి.. ఇన్ని రోజులు మీతో కలిసున్నందుకు ఎన్ని పాపాలు చుట్టూ కున్నాయో ఏమో..తెలంగాణాల ఉన్న చెరువుల, నదుల్ల అన్నిట్లల్ల మునిగి పాపాలు కడుక్కోవాలే..

అయిన ఈ పని ఎపుడో చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది కదా! ఇపుడిపుడే రక్తం సాల సాల కాగుతుంది కదా..
ఇపుడు శ్రీ శ్రీ లు కావాలి, ఉదం సింగ్ లు , భగత్ సింగ్ లు రావాలి, కావాలి కొదమ సింహాలు కొమరం భీమ్లు, ఐలవ్వలు, యాదగిరిలు, బందగీలు..అపుడే అపుడే తెలంగాణా సాద్యం..కమిటీలు కథలు చూసినం, రాజకీయ చతురతలు చూసినం, ఇంక మిగిలింది ఒకటే పోరాటం, ప్రత్యక్ష పోరాటం..ఎవడికి చేతనైంది వాడు చేయాలే ..శ్రీ శ్రీ లు కావాలె, సింహాలు కావాలె ..
ఏవో
ఏవేవో ఏవేవో
ఘోషలు వినబడ్తున్నై
గుండెలు విడి పోతున్నాయ్
ఎవరో
ఎవరివో ఎవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు – భయో
ద్విగ్నంగా నర్తిస్తున్నారు
అవిగో
అవిగవిగో అవిగవిగో
ఇంకిన – తెగిపోయిన-మరణించిన
క్రొన్నెత్తురు -విపంచికలు-యువయోధులు
నేడే
ఈనాడే ఈనాడే
జగమంత బలివితర్ది
నరజాతికి పరివర్తన
నవజీవన శుభసమయం, అభ్యుదయం ..
తెలంగాణా విముక్తి..తెగిమ్పుతోనే సాధ్యం..
Thanks సుజాత సూరేపల్లి for sharing


take BY: Simplytelangana

Read more...

రోడ్డుపైనే విద్యార్థులకు తెలంగాణ పాఠాలు

సిద్దిపేట,మేజర్‌న్యూస్‌: నలుగురు నడిచే రోడ్డే తరగతి గదిగా మారింది.ఉపాధ్యాయులు అక్కడే విధులను నిర్వహించి విద్యార్థులకు తెలంగాణ పాఠాలను బోధించారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ నెల 17 నుంచి టీటీ జాక్‌ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సహా య నిరాకరణలో భాగంగా శుక్రవారం నాడు లింగారెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సహాయ నిరాకరణలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రోడ్డుకు అడ్డంగా బో ర్డును,తెలంగాణ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలం గాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం,త్యాగాలు,ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు వివరిం చారు.

గ్రామ ఎంపీటీసీ బండి రంగయ్య తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకేనని చెప్పారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ వర్కింట్‌ కమిటీ సభ్యులు మేర్గు మహేష్‌ మాట్లాడుతూ ఇక నుంచి అన్ని రకాల పలకరింపులు జై తెలంగాణ అనే సాగుతాయన్నారు. రోడ్డు పైనే విద్యార్థులకు తెలంగాణ పాఠాలను బోధించటంతో సిద్దిపేట-చిన్నకోడూరు రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి.ఈ సందర్భంగా విద్యార్థుల తెలంగాణ నినాదాలు,తెలంగాణ గేయాలతో ఆ ప్రాంత మంతా దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి.అశోక్‌, మురళీ, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు.

Read more...

ఈసారికి తెలంగాణ బిల్లు లేదు


Bansalన్యూఢిల్లీ, సూర్య ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం లేనేలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో తనకు కలిసిన తెలంగాణ నేతలను ఆయన తీవ్రంగా మందలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అతి సున్నితమైన తెలంగాణ అంశంపై సంచలన ప్రకటనలు గుప్పించడం, ప్రధా నిని తప్పుపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని ప్రక టించినప్పటికీ రాత్రికి రాత్రి హామీ కావాలని పట్టుబట్టడం అధిష్ఠా నాన్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించమే అవుతుం దని బన్సాల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

పార్లమెంటులో బిల్లు పెట్టా లంటే అందుకు 15 రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి వుంటుందని, అదీకాక సభ కార్యకలాపాల జాబితా ఇప్పటికే ఖరారైందని, ఈ సాంకేతికాంశాలు తెలిసి కూడా హడావుడి చేస్తే సహించేది లేదని బన్సాల్‌ హెచ్చరించారు. ఢిల్లీలో మకాం చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలపై అధిష్ఠానం కూడా అగ్గిమీద గుగ్గిలం అయింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, పార్టీ వ్యవ హారాలలో మేడం తలమునకలై వున్నారని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీకి రావడమే కాకుండా.. తెలంగాణ ఏర్పాటు హామీ లభించే వరకు ఇక్కడనుంచి కదిలేది లేదని ప్రకటిం చడమేమిటని మందలించినట్లు తెలిసింది.


politicas
రాష్ట్రంలో ప్రజాసమస్య లు చర్చించకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఢిల్లీలో మకాం వేయడం మంచిది కాదని పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ద్వారాహెచ్చరించినట్లు తెలిసింది. హుటాహుటిన హైదరాబాదు రావాలని శుక్రవారం ఉదయం ఆయన పార్టీ నేతలకు ఫోన్‌ చేసి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తెలంగాణకు చెందిన 24 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు నిరాశతో హైదరాబాద్‌ వెనుదిరిగారు. అటు మేడం దర్శనం లభించక, ఇటు తెలంగాణపై ఎలాంటి హామీ సాధించలేక భిక్కమొఖంవేసి వారు తిరుగుముఖం పట్టారు.

5 రోజులు ఏం చేశారు...?
సోమవారం ఢిల్లీ వచ్చిన వీరంతా రోజుకు ఒకరిద్దరు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించడం, సాయంత్రానికి మీడియా ముందు తాము తెలంగాణకోసం కృషి చేస్తున్నామని, మేడం రేపో మాపో అపాయింట్‌మెంటు ఇస్తారని కబుర్లు చెప్పడం మినహా చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు అధిష్ఠానంలోని ప్రధాన నాయకుల నుంచి ఏ హామీ లభించిందని విలేకరులు ప్రశ్నించగా... మేము కోరాం అందుకు సానుకూలంగా స్పందించారనే దాటవేత దోరణిని అవలంభించారు. కొందరు నాయకులు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చాటేశారు.

కొందరైతే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇచ్చే విందులకు హాజరై సుష్టుగా అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశారు. ఈ పర్యటన మూడు విందులు, రెండు భేటీలతో పరిసమాప్తం అయ్యింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నాయకులు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, రక్షణ మంత్రి ఎకె. ఆంటోని, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్పమెయిలీ, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, హోంశాఖ మంత్రి చిదంబరం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌లతో భేటీ అయ్యారు.

Read more...

Friday, February 18, 2011

జై తెలంగాణ అన్న విద్యార్ధిపై ఉపాధ్యాయురాలి దాడి

తూప్రాన్, ఫిబ్రవరి17 : తెలంగాణలో జై తెలంగాణ అనే స్వేచ్ఛలేకుండా పోతుంది. సహాయనిరాకరణ ఉద్యమంలో తరగతి గదిలో జై తెలంగాణ అన్నందుకు దెబ్బలు తి నాల్సి వచ్చింది. ఆంధ్ర ఉపాధ్యాయురాలు కొట్టిన దెబ్బకు కన్ను వద్ద గా యం అయ్యింది. ఈ సంఘటనతో రెచ్చిపోయిన తెలంగాణవాదులు పాఠశాలలో నిరసన వ్యక్తం చేశారు. ఆ ఉ పాధ్యాయురాలిని నిలదీసి దాడి చేసినంత పని చేశారు. టీఆర్ఎస్ నాయకు ల రాకతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారిపోయింది. దాంతో విద్యార్థులు రోడ్డెక్కి హైవేపై రాస్తారోకో చేశారు.

ఈ సంఘటన తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని గురుకుల పాఠశాలలో గు రువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న సహాయనిరాకరణలో భాగంగా మండలంలోని అల్లాపూర్ శివారులో ఉన్న బాలుర గురుకుల పాఠశాలలో సైతం సహాయనిరాకరణను ఉపాధ్యాయులు పాటించారు. విద్యార్థులకు పా ఠాలు చెప్పడం మానేసి తెలంగాణ పాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. గు రుకుల పాఠశాలకు సమీపంలో ఉన్న హైవే టోల్‌గేట్ వద్ద పలువురు ఆందోళన చేస్తు తెలంగాణకు జైకొట్టారు. ఆ సంఘటనలను చూసిన విద్యార్థులు తరగతి గదుల్లోనే జై తెలంగాణ అంటు నినాదాలు చేశారు.

8వ తరగతిలో విద్యార్థులు కల్వకుంటకు చెందిన వెంకటేశ్, మరో విద్యా ర్థి భరత్‌లు జై తెలంగాణ అంటూ నినాదా లు చేశారు. ఆ తరగతిలోకి వచ్చిన ఆంధ్ర ఉపాధ్యాయురాలైన సహాయ ప్రిన్సిపాల్ శారద కర్రతో విద్యార్థులను కొట్టింది. దాం తో వెంకటేశ్‌కు ఎడమ కన్ను వద్ద గాయమై, కొంచెంలో ప్రమాదం తప్పింది. అలాగే 9వ తరగతికి చెందిన చరణ్‌సాయిరెడ్డి, కె. సాయికిరణ్‌లను సైతం కొట్టినట్లు చె ప్పారు. మధ్యాహ్న భోజన విరామ స మయంలో బయటకు వచ్చిన విద్యార్థులు టోల్‌గేట్ వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ జేఏసీ నాయకులకు చెప్పడంతో జేఏసీ నాయకులు అక్కడకు వెళ్లి దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలిని నిలదీశారు.

విద్యార్థులు జేఏసీ నాయకులు ఎదుటే ఆందోళన చేస్తూ, జై తెలంగాణ అంటు నినాదాలు చేశా రు. ఆంధ్ర ప్రాంతం వారిక్కడ పనిచేయరాదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు అక్కడకు చేరుకొని గురుకుల పాఠశాలలో ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఉపాధ్యాయురాలిని ఎందుకు దాడి చే శారని ప్రశ్నించారు. గొడవ చేస్తే కొట్టినట్లు తెలిపింది. విషయం తెలుసుకు న్న ఎస్ఐ జగదీశ్వర్ అక్కడకు చేరుకుని టీఆర్ఎస్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. జై తెలంగా ణ నినాదాలు చేస్తు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి44వ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.

టీఆర్ఎస్ నాయకుడు దోమల ఆంజనేయులు రోడ్డుపై నృత్యం చేయగా, విద్యార్థులు అతడిని అనుసరించారు. ఎస్ఐ జగదీశ్వర్ ఉపాధ్యాయురాలితో క్షమాపన చెప్పిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఎస్ఐ జగదీశ్వర్ ఉపాధ్యాయురాలు శారదను తీసుకువచ్చి తెలంగాణ విషయంలో కొట్టలేదని చెప్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, హరికిషన్‌రెడ్డి, పాండురంగారావు, మధుసూదన్‌రావు, బాలనర్సింహారెడ్డి, శంకర్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మానిక్‌రావు, చంద్రారెడ్డి, శ్రీశైలంగౌడ్, నాగరాజు, నాయక్‌లు పాల్గొన్నారు. 

Take By: Andrajyohti

Read more...

కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

సిద్దిపేట,మేజర్‌న్యూస్‌:టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 57వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు స్థానిక సాయిబాబా దేవాలయంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు మాట్లాడుతూ తెలంగాణ రా ష్ర్ట ఏర్పాటుకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతున్న కేసీఆర్‌కు భగవంతుడు ఆయు రారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు.తెలంగాణ ఉద్యమం నేడు చివరి దశకు చేరు కుందని,పుట్టిన పసిపాప నుంచి వృద్ధుడి వరకు తెలంగాణ అని నినదిస్తున్నారంటే అది కేసీఆర్‌ పోరాటమేనన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లి కార్జున్‌,కూర బాల్‌రెడ్డి,కరాటే కృష్ణ,సాకి గాంధీ,శివాజీ,ఆంజనేయులు,బుస్స రమణ,మల్లికా ర్జున్‌, గుండ్ల యోగీ, కిషన్‌రావు, చిప్ప ప్రభాకర్‌, టైగర్‌ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read more...

చంద్రబాబు వల్లే ఇవ్వలేకపోయాం

bharths
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడు రాష్ట్రాలతో పాటు తెలం గాణను సైతం ఇవ్వాలని ఉన్నప్పటికీ అప్పట్లో తమ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు అభ్యంతరం వల్లనే సాధ్యం కాలేదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ తేల్చి చెప్పారు. అప్పట్లో టీడీపీ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని బలపరచటం, ఆ పార్టీ సీనియర్‌ నేత లోక్‌సభ స్పీకర్‌గా ఉండటం, చంద్రబాబు తో తమకు సత్సంబంధాలు ఉండటం వంటి కారణాల రీత్యా తెలంగాణ సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. నిజామ్‌ కాలేజీ మైదానంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురు వారం జరిగిన ఎన్డీయే కూటమి మహా పోరాటం సభను ఉద్దేశించి అద్వానీ ప్రసంగించారు. చంద్రబాబు విషయం లో తాము సంకీర్ణ ధర్మాన్ని పాటించామని, అందుకే ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను మాత్రమే ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

మన్మోహన్‌దే ఆ ఘనత...
దేశంలో ఇంత అవినీతి తాండవించేందుకు కారణమైన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందన్నారు. స్వా తంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అవినీతి ఏ పాలనలోనూ జరగలేదన్నారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ప్రధాని అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించటం దేశ చరిత్రలో ప్రథమం అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు గతంలోనూ ఉన్నాయని, మొరార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాలూ సంకీర్ణాలే అని, ఏనాడూ అవినీతికి పాల్పడ లేదన్నారు. ఆదర్శ్‌, 2జీ, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేసేందుకు కేంద్రం అంగీకరించనున్నట్టు తెలిసిందని, అయితే అంత మాత్రా న అవినీతిపై తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు.

దేశం లో అన్ని అనర్థాలకూ కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అమె రికా, జర్మనీ లాంటి దేశాలు విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న తమ దేశస్థుల పేర్లను తెప్పించుకుని చర్య తీసుకున్నాయని, మన సర్కార్‌ మాత్రం అందుకు వీల్లేదని చెబుతున్నదన్నారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బుధవారం ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ చూస్తే జాలి వేస్తుంది తప్ప కోపం రాదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ ఇస్తామని అద్వానీ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ విశ్వాస ఘాతుకం...గడ్కరీ
తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ ఆరో పించారు. శ్రీకృష్ణ కమిటీ పేరిట కాలయాపన చేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరాన్ని కుంభకోణాల సంవ త్సరంగా ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా ఢిల్లీలో ఒక్క స్టేడియం నిర్మాణానికి కేవలం రూ.100 కోట్లు అవసరమైతే రూ.950 కోట్లు ఖర్చు చేయటమే ఈ అవినీతికి ఉదాహరణ అన్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో రాజాను చాలాకాలం పాటు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తన కింది మంత్రులు ఏమి చేస్తున్నారో తెలియని ప్రధాని ఆ కుర్చీలో ఎందుకు కూర్చు న్నారని ప్రశ్నించారు. బీజేపీ దేశ భవిష్యత్తును మారుస్తుం దని, దోపిడీ నుంచి దేశాన్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అతివృష్టి కారణంగా అతలా కుతలం అయితే పరామర్శించటానికి ప్రధాని, సోనియా, ఢిల్లీలోని ఆంధ్ర మంత్రులకు తీరిక లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ దొంగల పార్టీ...శరద్‌ యాదవ్‌
కాంగ్రెస్‌ పార్టీ దొంగలపార్టీ అని ఎన్డీయే కన్వీనర్‌ శరద్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అక్రమ సంపాదనను వెలికి తీయాలని డిమాండ్‌ చేశారు. తన ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి విషయం తనకు తెలి యదని చెప్పే రాజును గద్దె దించాలని చాణక్యుడి సిద్ధాం తం చెబుతున్నదని, ప్రధాని విషయంలో ఇది వర్తిస్తుంద న్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ దొంగాట ఆడుతు న్నదని ధ్వజమెత్తారు. చిదంబరం తెలంగాణ అంటే ప్రధా ని శ్రీకృష్ణ కమిటీ అంటున్నారని, ఆ పార్టీ ఇలాగే వ్యవహ రిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటీవల బీహార్‌లో వచ్చిన ఫలి తాలే వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధి కారంలోకి రాగానే అవినీతిని అంతం చేస్తామని, దోషు లను జైలుకు పంపి తీరుతామని యాదవ్‌ స్పష్టం చేశారు.

సీఎంల మార్పుతో సమస్య తీరదు...వెంకయ్య
crwosరాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పులతో సమస్యలు తీర వని జాతీయ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రస్తుతం అవినీతి, అస్తవ్యస్త, అరాచక, అధిక ధరలను అదుపు చేయలేని ప్రభుత్వ పాలన సాగుతున్న దని ఎద్దేవా చేశారు. యూపీఏకు దశా దిశా లేవన్నారు. ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నా ప్రధాని మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నల్లధనం దాచుకున్న వారి పేర్లు చెప్పాలని అడిగితే ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పెళ్ళికూతుళ్ళలా సిగ్గు పడుతున్నారని చమత్క రించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ కపట నాటకం ఆడుతున్నదని, 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని లబ్ధి పొంది తర్వాత గాలికి వదిలేసిందన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అని వెంకయ్య స్పష్టం చేశారు.

మేమే ప్రత్యామ్నాయం...కిషన్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారటం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము కేంద్రంలో అధికారంలో ఉండగా మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, అక్కడ ఇప్పుడు బీజేపీయే అధికారంలో ఉంద న్నారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి రావటం ఖాయం, తెలంగాణ ఇవ్వటం ఖాయమన్నారు. అప్పుడు తెలంగాణలో బీజేపీయే బలపడుతుందని, మజ్లిస్‌ భయానికి అదే కారణమన్నారు. సీనియర్‌ నేతలు బండా రు దత్తాత్రేయ, సీహెచ్‌.విద్యాసాగరరావు, ఎన్‌.ఇంద్రసేనా రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.లక్ష్మణ్‌, సినీ నటుడు కోట శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

భారీగా జనం...
బీజేపీ అనేక రోజుల నుంచి కష్టపడి భారీగా జన సమీకరణ చేయటంతో నిజామ్‌ మైదానం కిటకిట లాడింది. మహిళలు సైతం అధిక సంఖ్యలో రావటం విశేషం. సభ సందర్భంగా తెలంగాణ కళాకారులు పాడిన పాటలు, నృత్యాలు అందరినీ అలరించాయి.

take BY: Suryaa.com

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP