Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telangana issue. Show all posts
Showing posts with label Telangana issue. Show all posts

Saturday, December 29, 2012

Delhi gang-rape victim succumbs to injuries

The 23-year-old girl, who was gang-raped and brutally assaulted in a Delhi bus nearly a fortnight ago, died at a hospital in Singapore early Saturday. 

The girl who was admitted on Thursday morning at the multi-organ speciality facility, Mount Elizabeth Hospital, in an extremely critical condition here, died at 4:45 AM local time (2:15 AM Indian time), the hospital said in a statement. 

The hospital chief executive officer Dr Kelvin Loh said: “We are very sad to report that the patient passed away peacefully at 4.45 AM on 29 Dec 2012 (Singapore time). 

Her family and officials from the High Commission of India were by her side. 

The Mount Elizabeth Hospital team of doctors, nurses and staff join her family in mourning her loss,” Dr Loh added.

Read more...

తెలంగాణపై నెలలోగా తేలుస్తాం

నెలలోగా తేలుస్తాం

shindeybolji
తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షం.. అందరూ సత్వర నిర్ణయం కోరారు
యువత శాంతియుతంగా ఉండాలి.. తీసుకునే నిర్ణయం మంచిదే అవుతుంది
అన్ని పార్టీలూ అభివూపాయాలు చెప్పాయి.. వాటిని నోట్ చేసుకున్నా.. కేంద్రానికి నివేదిస్తా
ఏపీ ప్రజల సమస్యను అర్థం చేసుకున్నా.. పార్టీల అభివూపాయాలు ఇక్కడ చెప్పలేను
అఖిలపక్షం అనంతరం షిండే వ్యాఖ్యలు
నెల గడువు ప్రస్తావనలేని పీబీఐ కథనం.. నేతలే నెల గడువు సూచించారని వెల్లడి
ఏమీ తేల్చలేదు.. నెలపాటు ధూం తడాఖే
కాంగ్రెస్‌కు తెలంగాణ ఉద్యమ హెచ్చరిక


న్యూఢిల్లీ, హైదరాబాద్, డిసెంబర్ 28 (): న్యూఢిల్లీ, హైదరాబాద్, డిసెంబర్ 28 (టీ మీడియా): రాష్ట్రంలో దీర్ఘకాలంగా నలుగుతున్న తెలంగాణ అంశంపై నెలలోపు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ ఎనిమిది రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీల అభివూపాయాలను తాను జాగ్రత్తగా విన్నానని చెప్పారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులు తెలంగాణపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలిపారు. కొందరు నెలలో నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. ‘‘నేను అన్ని పార్టీల ప్రతినిధుల అభివూపాయాలను జాగ్రత్తగా విన్నాను. ఈ సమావేశం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాను. ఒక నెలలోపు మేం ఒక ఫలితంతో వస్తాం.

నెలలోపు ఒక నిర్ణయం ఉంటుంది’’ అని షిండే చెప్పారు. అయితే.. తెలంగాణ విషయంలో నాన్చుడు ధోరణులకు, సాగదీత వ్యవహారాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేదిలేదని, అది ప్రకటించిన నెలగడువులోనూ మునుపెన్నడూ చూడని ఉధృత ఉద్యమాన్ని చవిచూపిస్తామని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. దాదాపు మూడేళ్లుగా కాంగ్రెస్ దోబూచులాటలను గమనిస్తున్నామని, ఇంకా మోసపోయే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఈ చివరి దశలోనూ మోసం చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా.. పీఐబీలో ఉంచిన అఖిలపక్ష సమావేశం వివరాల నోట్ కలకలం రేపింది. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని పదే పదే షిండే తన విలేకరుల సమావేశంలో ఉద్ఘాటించగా.. పీఐబీ పోస్ట్ చేసిన కథనంలో ఆ ప్రస్తావనే లేకుండాపోయింది. ఒక దశలో షిండే తన మాట మార్చారని కూడా వాదనలు వచ్చాయి.

సాధారణంగా పీఐబీ కేంద్ర మంత్రుల మాటలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రకటన వెలువరిస్తుంటుంది. అయితే.. కీలకమైన ఈ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలుగా ఉన్న ‘నెల రోజుల్లోపు నిర్ణయం ఉంటుంది’ అన్న వాక్యాన్ని ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఇదెలా ఉన్నప్పటికీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై జరుగుతున్న ఉద్యమంతో గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రవూపదేశ్ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని షిండే విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలోని యువత శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘యువత శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను. ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిదే ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు ఏం చెప్పారో వెల్లడించేందుకు హోం మంత్రి తిరస్కరించారు.


‘‘జరిగినది ఇన్‌కెమెరా(బహిరంగం కాని) సమావేశం. ఆ వివరాలు చెప్పేందుకు ఇది వేదిక కాదు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభివూపాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని తెలిపారు. తెలంగాణ అంశంపై ఇదే చివరి అఖిలపక్ష సమావేశమని ఆయన అన్నారు. సుహృద్భావపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని చెప్పారు. అన్ని పార్టీలూ తమ అభివూపాయాలను చెప్పాయని హోం మంత్రి తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఎంత మంది ప్రజలు సంతృప్తి చెందుతారన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది సంతృప్తి చెందుతారు. కొంతమందిలో అసంతృప్తి ఉంటుంది’’ అని బదులిచ్చారు. సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు చెప్పిన అభివూపాయాలను తాను రాసుకున్నానని తెలిపారు. నిర్ణయం తీసుకోబోయే ముందు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
నెలలోపు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని చెప్పాను కదా.. అన్నారు. పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని చెబుతూ వాటిని అభినందించారు. అన్ని పార్టీలూ సంతృప్తితో సమావేశం నుంచి వెళ్లాయని చెప్పారు.

పదహారు మంది ప్రతినిధులు
రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల నుంచి పార్టీకి ఇద్దరు చొప్పున 16 మంది ప్రతినిధులు తెలంగాణపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం పదిగంటలకు హోం మంత్రి షిండే కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లోని సమావేశ మందిరంలో అఖిలపక్షం మొదలైంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌డ్డి(తెలంగాణ ప్రాంతం), సీనియర్ నేత గాదె వెంకటడ్డి(సీమాంధ్ర ప్రాంతం) హాజరయ్యారు. టీడీపీ నుంచి సీనియర్ నేత కడియం శ్రీహరి(తెలంగాణ), మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు(సీమాంధ్ర) వచ్చారు. సీపీఐ ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గుండా మల్లేష్ పాల్గొన్నారు.

సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి రంగాడ్డి హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఎంవీ మైసూరాడ్డి(సీమాంధ్ర), కేకే మహేందర్‌డ్డి (తెలంగాణ) హాజరుకాగా.. ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, మరో ప్రతినిధిగా జీవీజీ నాయుడు వచ్చారు. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, సీనియర్ నేత నాయిని నర్సింహాడ్డి పాల్గొన్నారు. హోం మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అఖిలపక్ష సమావేశానికి ప్రత్యేకంగా హాజరయ్యారు.

Read more...

Thursday, December 27, 2012

28 డెత్‌లైన్ - కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం


Ttime
-కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం
-దోబూచులకు ఇక ఫుల్‌స్టాప్.. వైఖరి చెప్పడంపైనే భవిష్యత్ ఉనికి
-సాగదీతలు సహించలేని స్థితిలోఉరుముతున్న తెలంగాణం
-పార్టీల్లో అఖిలపక్షం గుబులు

హైదరాబాద్, డిసెంబర్ 26 ):ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను రాష్ట్రంలో సున్నితమైన సమస్యగా చిత్రీకరిస్తుందొక పార్టీ! ఈ సమస్య వల్లే పాలనలో అనిశ్చితి నెలకొందని తీర్మానిస్తుంది మరో పార్టీ! ఈ సమస్య తొలగిపోతే అభివృద్ధి పట్టాలకెక్కుతుందని ఆరాటపడేది ఇంకో పార్టీ! తెలంగాణపై వైఖరి చెప్పని అన్ని పార్టీలూ పలికే పలుకుల సారాంశం ఒకటే.. అదే తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం! ఇప్పుడు ఆ పార్టీల ఆవేదన తొలగిపోయే అవకాశం వస్తోంది! రాష్ట్రంలో అనిశ్చితి మటుమాయం అయ్యేందుకు తరుణం ఆసన్నమవుతోంది! అదే కేంద్రం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం! దానికి ముందు ఇది డెత్‌లైన్!! తెలంగాణపై వైఖరి తేల్చడానికి టీజేఏసీ పెట్టిన ఈ డెత్‌లైన్ దాటి ముందుకు పోయే పార్టీలు ఏం నిర్ణయించుకుని అఖిలపక్షానికి వెళతాయన్నదే ఇప్పుడు ప్రశ్న! అఖిలపక్షంలో ఏం మాట్లాడుతాయన్నదే సందేహం! అవి చెప్పే వైఖరిపైనే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీల మనుగడ! ఏం జరుగుతుంది? ఆ పార్టీలు తెలంగాణలో మనుగడ సాగిస్తాయా? ఉనికి నిలుపుకుంటాయా? వాటి అస్తిత్వం తెలంగాణలో నిలబడుతుందా? అఖిలపక్షంతో తేలిపోనుందనేది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీలు దురదృష్టవశాత్తూ మాటలకే పరిమితమవుతున్నాయి.

తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరే పార్టీలే.. సమస్యను ఎప్పటికప్పుడు మరింత జటిలం చేస్తూ పోతున్న వైచివూతికి రాష్ట్ర రాజకీయాలు అద్దంపడుతున్నాయి. వైఖరి చెప్పేసిన పార్టీ లు బిందాస్. ప్రత్యేక రాష్ట్ర సాధనకే పుట్టిన టీఆర్‌ఎస్ వైఖరి విస్పష్టంగా ఉంది. సమైక్యవాదం నుంచి జై తెలంగాణ నినాదం అందుకున్న సీపీఐ.. రాష్ట్ర సాధన సమరంలో దూసుకుపోతున్నది. పార్లమెంటులో బిల్లు పెడితే ఆమోదం పొందేందుకు బేషరతు సహకారానికి బీజేపీ సై అంది. హైదరాబాద్ సహిత తెలంగాణ లేదా రాయల తెలంగాణ అని ఎంఐఎం తేల్చి చెప్పింది. తాను సమైక్యవాదినేనని సీపీఎం కుండబద్దలు కొట్టేసింది! ఇక మిగిలింది మూడు పార్టీలే. తెలంగాణపై ఆది నుంచి దోబూచులాడుతున్న ఆ పార్టీలకే ఇప్పుడు సంకట స్థితి. అందుకే ఈసారి జరిగే అఖిలపక్ష సమావేశం ఆ మూడు పార్టీల్లో గుబులురేపుతున్నది. తెలంగాణ రాష్ట్రం విషయంలో ‘డిసెంబర్ 9’ ప్రకటన శిలాశాసనంగా యావత్ తెలంగాణ ప్రాంతం విశ్వసిస్తున్నది. ఏనాడో సిద్ధించిన రాష్ట్రాన్ని ఆచరణలోకి తేవడమే మిగిలిన ఎజెండాగా భావిస్తున్నది. ఈ క్రమంలోనే అడ్డుపడుతున్న పార్టీలకు అల్టిమేటాలు జారీ అవుతున్నాయి.

తెలంగాణ విషయంలో దోబూచులను నమ్మబోమని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ తీర్పులు వెలువరించారు. వరుస ఉప ఎన్నికల్లో తెలంగాణవాదానికి పట్టంగట్టారు. వ్యతిరేక పార్టీల శవపేటికలకు ఒక్కో ఉప ఎన్నికలో ఒక్కో మేకు దించుతూ వచ్చారు. ఇక పతాక సన్నివేశం!! అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అనేక మతలబులను తెలంగాణ సమాజం చూసింది. కేంద్రంలో తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఎఫ్‌డీఐల ఓటింగ్ గండం నుంచి గట్టెక్కేందుకే ఈ అఖిలపక్షం హామీ వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అఖిలపక్షంతో సాధించేది ఏమీ లేదని, ఇది కేవలం కొత్త హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ తేల్చిపారేశారు. ఈ సమావేశం ఉత్తుత్తిదేనని హోం శాఖ వర్గాలు లీకులు కూడా ఇచ్చాయి.

అయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు.. ఈ సమావేశం తెలంగాణవాదానికి ఒక మూలమలుపుగా కూడా మారనుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్నాయి. టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి.. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అందులోనే తమ అభివూపాయం చెబుతామని ప్రకటనలు చేసింది. ఇప్పుడు సమయం వచ్చింది. తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న వాదననైనా ఆ పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వైఖరి చెప్పకపోతే తెలంగాణ ప్రాంతంలో ఈ మూడు పార్టీలను సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తెలంగాణ ఉద్యమక్షిశేణులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఉన్నాయి. ముసుగులో గుద్దులాటలను ఇక విశ్వసించే స్థితిలో ఈ ప్రాంతం ప్రజలు లేరని వెల్లడైపోయింది. అందుకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకు రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే.. తమ వైఖరి చెప్పకుండా తప్పించుకునేందుకు మార్గాన్వేషణ చేస్తున్న ఈ మూడు పార్టీలు.. నెపాన్ని ఎదుటివారిపైకి నెట్టేసే ఆలోచన చేస్తున్నాయని ఆయా పార్టీల నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమ వుతోంది.

మొత్తంగా టీడీపీ, వైఎస్సార్సీపీలు కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సమస్య మూలాలను తెలుసుకునేందుకు షిండే ఈ సమావేశం ఏర్పాటు చేశారని భావించే పరిస్థితి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలుగా అవి తెలంగాణపై ఏ దృష్టితో ఉన్నాయో తెలుసుకోవడం ఈ ‘అవగాహన’ సమావేశం ఉద్దేశంగా చెబుతున్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలు తమ వైఖరిని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ సమావేశం ఆ మూడు పార్టీలకు జీవవన్మరణ సమస్యగానే మారుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేయడంతో, ఈ సమావేశంలో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆ మూడు పార్టీలపై ఉంది. బాధ్యత నెరవేరుస్తాయా? భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటాయా? అనేది ఆ పార్టీలు వెల్లడించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుందనేది నిపుణుల విశ్లేషణ. వ్యతిరేకం కాదన్న మాటనే స్పష్టగా చెప్పి.. తెలంగాణ ఏర్పాటుకు అడ్డం తప్పుకోవాలనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష! పార్టీ వైఖరిని తేల్చి.. తెలంగాణ ప్రాంతంలో మనుగడకు అవకాశం కల్పించాలనేది ఆ మూడు పార్టీల్లోని తెలంగాణ నేతల ఆశ! అందుకే అందరి దృష్టీ అఖిలపక్షంపైనే!!


Read more...

Tuesday, January 17, 2012

తెలంగాణ కాంగ్రెస్ పెద్దల దొంగాట



CMpostlist telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema -నాలుకలు మడతేస్తున్న నేతలు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు

ఈ నేతలకు రెండు నాల్కలే కాదు.. రెండు ముఖాలు కూడా! తెలంగాణ ఉద్యమం విషయంలో నాల్కలు మడతేయడమే కాదు.. ముఖాలూ మార్చేయగల నైపుణ్యం వీరి సొంతం! ఒక నాలుక తెలంగాణ ఉద్యమం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది! మరో నాలిక పార్టీ అధిష్ఠానం వద్ద వక్రభాష్యాలు చెబుతుంది! ఒక ముఖం ఉద్యమ శ్రేణుల ఎదుట వీర గంభీరంగా కనిపిస్తుంది.. మరొకటి నాలుగు గోడల మధ్య.. పార్టీ పెద్దల ముందు ముడుచుకుని కూర్చొంటుంది! అధికారం వీరి పరమావధి! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇందుకు వారధి! పదవులు ఓ లెక్క కాదంటారు.. కానీ వారి లెక్కలన్నీ పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి! సచివాలయం దరిదాపులకు వెళ్లేది లేదని భీకర వచనాలు చెబుతారు.. కానీ.. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని సీఎం మెప్పు పొందేలా సంతకాలు బరికేస్తారు! ఉద్యమంలో దూకుతామంటారు.. ఇచ్చేది.. తెచ్చేదీ తమ పార్టీయేనంటారు.

నిర్ణయాత్మక దశలో మాత్రం పత్తా లేకుండాపోతారు! ఉద్యమ శ్రేణులు సెగ పెట్టినా తట్టుకుంటారు.. కానీ.. అధిష్ఠానానికి ఆ సెగ తీవ్రతను చెప్పడానికి ఇష్టపడరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలని ఒకసారి, అమ్మకు ఒంట్లో బాలేదని ఒకసారి, పండుగలు పబ్బాలని మరోసారి, ఆజాద్ చర్చిస్తున్నారని ఇంకోసారి, ఇదిగో కోర్ కమిటీ సమావేశం అదిగో సీడబ్ల్యూసీ భేటీ.. అంటూ ఎప్పటికప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల బూచిని ముందుకు తెస్తూ అధిష్ఠానం దోబూచులాడుతుంటే.. నిలువరించే సత్తా లేక.. అధిష్ఠానా నికే జీ హుజూర్..
అంటూ సాష్ఠాంగపడిపోయిన నేతలు! ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ వాళ్లను మోసం చేయడం.. తెలంగాణ ప్రాంత నేతలుగా తమకు తెలిసినంత మరెవరికీ తెలియదని ఢంకా బజాయించి మరీ చెప్పగలిగే నేతాక్షిగేసరులు! వీరిలో కొందరిది మరీ అత్యాశ! ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే వీరి కన్ను! సీఎం కుర్చీ అప్పగిస్తే ఉద్యమం అణచివేతలో తడాఖా చూపిస్తామని అధిష్ఠానం వద్ద తొడలు కొడతారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ను మార్చేస్తారన్న ఊహాగానాలతో.. ఉద్యమం ముసుగులో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుని.. కలలు కంటున్నారు! పదేళ్లుగా ఈ నేతల తీరిదే. ప్రత్యేకించి గత రెండేళ్లుగా మహోధృతంగా సాగుతున్న మలి విడత తెలంగాణ పోరాటంలో వీరిది ప్రతినాయక పాత్రే! ఇదీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకుల ద్రోహ చరిత్ర! అనేకానేక మంది నేతలు.. ఎన్నదగినవారు కొందరు! జానాడ్డి, జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, జే గీతాడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య! వీరు మచ్చుకే! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ రాజకీయ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన పెద్దలు! సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కయి.. ఉద్యమాన్ని నాశనం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్న ద్రోహచింతన గల నేతలు! ఉద్యమం గుండెలపై తన్ని.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న టీ కాంగ్రెస్8 నేతలు ఎందరో! ఇది సకల తెలంగాణం చేస్తున్న విమర్శ!

ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్8 అధిష్ఠాన పెద్దలు. ఎన్నికలయిపోయి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడ్డాయి. ఆ తర్వాత సోనియాకు ఆరోగ్యం బాగోలేదు.. ఆమె విదేశాల నుంచి వచ్చాక నిర్ణయం అన్నారు. ఆమె తిరిగి వచ్చేశారు. దీపావళి, బక్రీద్ పండుగల సాకు చెప్పారు. ఆ తర్వాత ఆ మాట ఎవరన్నారని ప్రశ్నించారు. ఆజాద్ మాట్లాడుతున్నారని మరోసారి చెప్పారు. అజాద్ మాట్లాడేశారు. నివేదికలు ఇచ్చేశారు. జాతీయ స్థాయి నేతల అభివూపాయాలన్నారు. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. కోర్‌కమిటీ భేటీలన్నారు. మినీ కోర్‌కమిటీ అని చెప్పారు. ఇదుగో సీడబ్ల్యూసీ అన్నారు. తెలంగాణ అంశం గుండ్రంగా ఉంటుందని నిరూపించాలని భావించినట్లున్నారు.. ఇప్పుడు మళ్లీ మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలను బూచిగా చూపిస్తున్నారు! ఈ మాటల మాయాజాలం సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగింది.

పల్లెలు పట్టాలపైకెక్కి ఢిల్లీకి ఉద్యమ తీవ్రతను కూతవేసి చాటాయి. వంటావార్పుతో పొయ్యిల మంటతో జనం సెగ తగిలించారు. అన్నింటికీ మించి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష బలాన్ని చాటిచెప్పారు. రోజువారీ ఆందోళనలు, నిరసనలు సరేసరి! ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బలమైన విమర్శలు వస్తున్నాయి.

CMpostlist_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్)ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా, 4కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకులు.. ఆ పని చేయకపోగా.. ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డారని ప్రత్యేకవాదులు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని నేతలు ఆచరణలో రుజువు చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. కేసీఆర్ దీక్షనేపథ్యంలో డిసెం బర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన, దానిని సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం,జేఏసీ ఆవిర్భావం, ఉద్యమాలు, ఆయా సమయాల్లో జరిగినపరిణామాల్లో టీ కాంగ్రెస్8 నేతల తీరుతెన్నులు వారిని ద్రోహులుగా నిలబెడుతున్నాయని విమర్శలు వెల్లు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది మేమే అంటూ నినదించిన టీ కాంగ్రెస్8 నేతలు.. నేడు తెలంగాణవాదంపై మౌనం వహిస్తూ.. ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైగా ‘‘ఉన్నత పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి. తెలంగాణవూపజలను మేమే పకడ్బందీగా భ్రమల్లో పెడుతాం. ఆ కళ మాకే తెలుసు. 4దశాబ్దాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాం. మా ప్రాంత ప్రజలను ఎలా మోసం చేయాలో మాకే ఎక్కువ తెలుసు’’ అంటూ అధిష్ఠానం వద్ద మహజరులు సమర్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ అంటూ మాట్లాడిన జానాడ్డి లాంటి సీనియర్‌లు నేడు ప్రేక్షకపాత్ర వహించడమే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కుర్చీ నుంచి కిరణ్‌కుమార్‌డ్డిని అధిష్ఠానం తప్పిస్తుందన్న అంచనాలో కొందరు టీ కాంగ్రెస్8 నేతలున్నారు.ఉద్యమం పేరుతో ఈ నేతలు సీఎం కుర్చీపై కన్నేసినట్లు తెలుస్తోంది.

సమైక్యరాష్ట్రానికి తమను సీఎంగా చేస్తే తెలంగాణవాదాన్ని ఎదుర్కొంటామని అధిష్ఠానం వద్ద నమ్మబలుకుతున్న వారిలో జానాతో పాటు జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, గీతాడ్డి, రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నట్లు వినిపిస్తోంది. దీనికోసం హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. సీఎం కుర్చీ కోసం తెలంగాణ కోటాలో కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. కిరణ్‌ను మార్చాల్సివస్తే ఈసారి తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చినప్పుడు టీ మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతోనే సరిపెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. తెలంగాణలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి 42 రోజుల పాటు సకలజనుల సమ్మెకు దిగడం, తెలంగాణ కోసం త్యాగాలు చేయడం, అడ్వాన్స్‌లు తప్ప ఇప్పటి వరకు వారి జీతాలపై నిర్ణయం జరగకపోవడం, విద్యార్థులు చదువులు కోల్పోవడం, రవాణా వ్యవస్థ స్తంభించి పోయి తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే టీ మంత్రులు మాత్రం దర్జాగా హోదాలు, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తూ గడిపారే తప్ప, తెలంగాణ కోసం ఉద్యమకారులతో కలిసిరాలేదనివారు విమర్శిస్తున్నారు.

సచివాలయ నాటకం..
మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేదనే కానీ.. మేం అసలు సచివాలయానికి వెళ్లడం లేదని గప్పాలు కొట్టిన మంత్రుల నాటకం సీఎం వ్యాఖ్యలతోనే బయటపడింది. సచివాలయానికి వెళ్లని మంత్రులు.. ఫైళ్లను ఇంటికి తెప్పించుకుని చకచకా సంతకాలు లాగించేశారు. మంత్రులు సచివాలయానికి రాని కాలంలోనే ఎక్కువ ఫైళ్ళు పరిష్కారమయ్యాయని అప్పట్లో సీఎం చెప్పడం తెలంగాణపై టీ మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో చాటిచెప్పింది. ‘‘పదవులు, హోదాలు పోతే ఎవరూ పట్టించుకోరు. తొందరపడి రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ ఉండదు. తెలంగాణపై పోరాడుతున్నట్లు నటిస్తూనే మీ పనులు మీరు చూసుకోండి’’ అంటూ టీ మంత్రుల జోరుకు సీఎం బ్రేకు వేశారన్న ప్రచారం ఉంది. దీంతో బుగ్గకారు, హోదా, పీఎస్8, పీఎలు పోతారని, సర్కార్ పరంగా లభిస్తున్న సౌకర్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుందని భావించే టీ అమాత్యులు తెలంగాణవాదాన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం
టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం పని చేసిందని విమర్శలున్నాయి. ‘‘నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పనులు కేటాయిస్తాను. పదవుల్లో ఉండి హాయిగా పనులు చేసుకోండి. భవిష్యత్తులో మీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా’’ అనే రీతిలో సీఎం వారికి భరోసా కల్పించడమే కాకుండా ప్రలోభాలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. టీ కాంగ్రెస్ ఎంపీలది మరో కథ. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ కేకే నేతృత్వంలో టీ కాంగ్రెస్8 ఎంపీలు దీక్షలు చేపట్టారు. రాజీనామా చేశామంటూ పార్లమెంట్ సమావేశాలకు మొదట్లో దూరం పాటించినా, తరువాత సమావేశాలకు హాజరై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు పట్టి కొంత హంగామా చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులతో పోల్చితే.. వారు అధిష్ఠానంతో కొంత ఘర్షణవైఖరిని, పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ.. చివరాఖరుకు వారూ మెత్తబడ్డారు.

నిరసన సెగలతో స్వరం పెంచిన నేతలు
తెలంగాణవాదం రోజురోజుకూ బలపడుతూ రాజకీయ నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలుస్వరాన్ని పెంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శవాల వద్దకు వెళ్ళి తెలంగాణ తెచ్చే వరకు తాము వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల నుంచి నిరసనలు పెరగడంతో తప్పనిసరై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాలని, తెలంగాణ సాధన కోసం కలిసి ఉద్యమించాలని టీ కాంగ్రెస్8 ప్రజావూపతినిధులు, మంత్రులు నిర్ణయించుకున్నారు. టీ కాంగ్రెస్8 స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలానికే దాని పస తేలిపోయింది. కమిటీ చైర్మనే దాని నిర్ణయాలను పాటించని దుస్థితి. ఎట్టకేలకు రాజీనామాలు చేసినా.. పై నాయకత్వం చక్రం తిప్పడంతో రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయన్న వాదన ఉంది. టీడీపీ టీ ఫోరం, టీఆర్‌ఎస్8, సీపీఐ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్8కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండ్‌తో రెండవ సారి రాజీనామా చేశారు. వీరితో పాటు రాజీనామాలు చేయడానికి టీ కాంగ్రెస్8మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ససేమిరాఅన్నారు.

మరో వైపు నాగం జనార్దన్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, టీ రాజయ్య తదితరులు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. వారి తరహాలోనే మిగతా టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాల కోసం పట్టుబడితే తప్పకుండా ఆమోదం పొందడమో లేక కేంద్రం దిగిరావడమో జరిగేది. కానీ తెలంగాణ జన ఆకాంక్షలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, సీమాంధ్ర పాలకుల ప్రలోభాలకు లొంగి, తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని నాయకులపై ఉద్యమ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఉద్యమాన్ని బలహీనపర్చే కుట్ర!
పదవులు, హోదాలు, పనులు, పైరవీల కోసం టీ కాంగ్రెస్8 నేతల మధ్య నెలకొంటున్న అంతర్గత కుమ్మలాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలహీనం చేయడానికి దోహదపడుతున్నాయనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్8 నేతల అనైక్యతను ఆసరా చేసుకుని కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా తన ఆట కొనసాగిస్తున్నారంటున్నారు. సెలక్షన్ కమిటీ హస్తినలో ఉందని నమ్మబలికిస్తూ గులాం నబీ ఆజాద్, సోనియాల వద్ద మార్కులు కొట్టేసేలా సీఎం తన స్కోరును పెంచుకుంటున్నారని అంటున్నారు. బలహీనమైన బౌలింగ్‌గా ఉన్న తెలంగాణ అగ్రనేతల కుమ్మలాటలతో, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో క్రికెటర్‌గా సీఎం దీటైన షాట్లతో అధిష్ఠానం వద్ద, రాష్ట్రంలో తన స్కోరు మరింత పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం కేంద్రం తరఫున ప్రకటించారు. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో... సీమాంధ్ర కాంగ్రెస్8 నేతలు మిగతా పార్టీల నేతలను ఉసిగొల్పి పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా వచ్చే తెలంగాణను అడ్డుకున్నారు. తదనంతరం తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. తెలంగాణ కోరుతూ ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థులు సైతం తెలంగాణ కోసం కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కొక్కరుగా 700 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కానీ.. టీ కాంగ్రెస్8 నేతల ద్రోహచింతనలో ఏమాత్రం మార్పు రాలేదని ఉద్యమకారులు వాపోతున్నారు.

Take By : T News

Read more...

Saturday, December 17, 2011

జైపాల్ దూరాశ!



jaipal-reddy-caricature talangana patrika telangana culture telangana politics telangana cinema-సొంత గడ్డపై కనిపించని రాజకీయ భవిష్యత్
-అయితే సమైక్యం.. లేదంటే తెలంగాణ కోటా పదవులు
-కాలం కలిసొస్తే ఉపరాష్ట్రపతి పీఠం దక్కేలా వ్యూహం

హైదరాబాద్, డిసెంబర్ 16 ():తెలంగాణవాదాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పదవుల వల విసురుతుంటే మరో వైపు తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని మన నేతలు అందలమెక్కేందుకు అర్రులు చాస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తుది అంకానికి చేరుకున్న దశలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు, హోదాల ఆశలు చూపించి వారిని చల్లార్చిన హైకమాండ్, తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి జైపాల్‌డ్డిపైనా పదవుల బాణం విసిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణంలో జైపాల్‌ను మరో ఏడాదిలో ఖాళీకానున్న ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించనున్నట్లు ప్రచారం మొదలైంది. ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఇప్పుడు జైపాల్ పేరును తెరమీదికి తీసుకురావడం వెనుక అధిష్ఠానం మతలబు ఏమిటో స్పష్టమవుతోందని మేధావులు, తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌ను ఉపరాష్ట్రపతిని చేస్తున్నామంటూ ప్రచారం సాగిస్తూనే ప్రత్యేక రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌లో కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని జైపాల్‌డ్డి కూడా పదవీ సోపానం ఎక్కే ప్రయత్నంలో ఉన్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో జైపాల్‌కు వచ్చిన బెర్త్ కూడా తెలంగాణ ప్రాంత కోటాలోనే వచ్చింది.

కేబినెట్ హోదాగల ఏకైక కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం 2004, 2009లో అవకాశం కల్పించింది. రాజకీయ అనుభవం, మంచి పార్లమెం అధిష్ఠానంతో దగ్గరి సంబంధాలు కలిగి విశ్వాస పాత్రుడిగా పేరు... వంటివి జైపాల్‌కు అర్హతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత నేతగానే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో గుర్తింపు లభించిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తీసుకురావడానికి తెలంగాణనే అర్హతగా, ప్రామాణికంగా అధిష్ఠానం గుర్తించినట్లు వినిపిస్తోంది. ఉప్పెనలా, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడిచినా, సుదీర్ఘకాలంపాటు రాష్ట్రంలో సకలజనుల సమ్మె కొనసాగినా, పార్టీలకు అతీతంగా ప్రజావూపతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించినా కూడా కేంద్ర కేబినెట్‌లో ఉంటూ జైపాల్‌డ్డి ఎక్కడ కూడా, ఏనాడు కూడా తెలంగాణ విషయంలో స్పష్టంగా మాట్లాడక పోవడం, కేంద్ర మంత్రికి కొన్ని పరిమితులు ఉంటాయంటూ ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర విషయంలో డొంకతిరుగుడు వైఖరి ప్రదర్శిస్తు వచ్చినందుకే ప్రతిఫలంగా అధిష్ఠానం జైపాల్‌కు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలని, పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు జైపాల్‌డ్డిపై గతంలో ఒత్తిడి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తామని కూడా వారు జైపాల్ వద్ద పేర్కొన్నారు.

ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకున్న సమయంలో కూడా జైపాల్ హైకమాండ్‌కు నమ్మినబంటుగా ఉఁటూ మౌనం పాటించారు. తెలంగాణవాదం బలపడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే భయం జైపాల్‌ను వెంటాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని జైపాల్ భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. తనకంటూ సొంత నియోజకవర్గం లేకుండా ఆయన ఇప్పటికి నాలుగు చోట్ల తిరిగారు. రాజకీయ చివరి అంకంలో ఎన్నికల్లో ఓడిపోయి తెరమరుగు కావడం కంటె రాజకీయాల్లో రిటై్మంట్ కావడమే మంచిదన్న ఆలోచనతో జైపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వారు ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా దక్షిణాది వారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉందని జైపాల్ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పెద్దగా లాబీయింగ్ లేక పోయినా తెలంగాణ కోటాలో ఉపరాష్ట్ర పతి పదవిపై జైపాల్ కన్నేసినట్లు మరో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కనీసం మద్దతుగా మాట్లాడక పోగా తాను ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదిని కాదని, జాతీయ వాదినని ప్రకటించుకుంటూ జైపాల్ తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణ పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరించి సమైక్యవాదుల సరసన జైపాల్ నిలిచారని టీ వాదులు నేటికి మండిపడుతుంటారు. సమైక్యవాదం వైపు మొగ్గుచూపుతూనే తెలంగాణ కోటాలో అందలమెక్కుతూ వచ్చిన జైపాల్‌కు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కూడా అదే ఖాతాలో వస్తుందేమోనని పార్టీ నేతలు కొందరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

 Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP