Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

Sunday, February 3, 2013

పేరెంట్స్ పెంపకానికి ‘పరీక్షా’


‘సారీ అండీ... పెళ్ళికి రావడం కుదరదు. మా పిల్లలకి పరీక్షలు’, ‘నెల రోజులు లీవ్ కావాలండీ ... మా వాడికిప్పుడు బోర్డ్ ఎగ్జామ్..’ దగ్గరుండి చదివించాలి’

‘ఇదిగో అబ్బాయ్.. ఈ మూడు నెలలు కేబుల్ కనెక్షన్ వద్దు... పిల్లలకి పరీక్షలు’
సంక్రాంతి సెలవుల సరదా ఇంకా పూర్తిగా దిగకముందే ఆ సరదాలను పటాపంచలు చేస్తూ ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులకీ ఆందోళన కలిగించేలా అడుగులు వేస్తూ తను వైపే వస్తూ కనిపించే భూతం... పరీక్షలు.
Childప్రస్తుత పోటీ ప్రపపంచంలో ఆర్థికంగా, సామాజికంగా ఒక భద్రతా పూర్వకమైన స్థాయిలో జీవితంలో స్థిరపడడానికి, మంచి విద్యార్హతలు ఉంటేనే సాధ్యపడుతుందనే భావన ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంది. తమ పిల్లలు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేయాలని భావించే తల్లిదండ్రుల శాతం గత పదేళ్ళలో 35 శాతం పెరిగి, ప్రస్తుతం అలా భావించే అమ్మానాన్నల సంఖ్య మొత్తం కుటుంబాలలో 75 శాతం ఉంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు, ఉద్యోగాల మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు పిల్లలమీద తీవ్రస్థాయిలో ఒత్తిడిని పెంచేస్తున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఒత్తిడి పరీక్షల సమయంలో పరాకాష్టను చేరి అనేక అనర్థాలకు దారితీస్తోంది.

పరీక్షలు దగ్గరకొస్తున్నాయనగానే తల్లిదండ్రు లు తాము ఆందోళన పడిపోయి పిల్లలను కూడా ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నారు. పరీక్షలలో తమ పిల్లలు మంచి మార్కులు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పిల్లలని అనేక విధాల కట్టడి చేస్తుంటారు. ఎన్నో నియమాలు విధిస్తుంటారు. నిరంతరం హెచ్చరిస్తుంటారు. ఒకప్పుడు ఈ పరీక్షల హడావిడి కేవలం 7,10 వంటి పబ్లిక్ పరీక్షల సమయాల్లోనే ఉండేది. ఇప్పుడు ఒకటవ తరగతి పిల్లలకి కూడా పరీక్షల ఒత్తిడిని కలిగిస్తున్నారు తల్లిదండ్రులు.

పరీక్షల సమయంలో పిల్లల పెంపకం అనేది ఎంతో సున్నితమైన, కీలకమైన అంశం. అసలు ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నారా? అంటే అధిక శాతం లేదనే చెప్తున్నాయి సర్వేలు. ఈ అంశంపై ఎన్నో శాస్త్రీయమైన సూచనలను మానసిక నిపుణులు చేసి వాటిని పాటించడం వలన మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయని హామీ ఇస్తున్నారు.

పిల్లలే సమస్తం
పిల్లలకు తాము బాగా చదవాలని, పరీక్షలు బాగా రాయాలని మంచి మార్కులతో పాసవ్వాలని తెలుసనే విషయం తల్లిదండ్రులు నమ్మాలి. వారికి ప్రత్యేకంగా చదవమని ఒత్తిడి చేయనవసరం లేదు. అయితే పిల్లలు తమ లక్ష్యాలను సాధించే దిశగా తల్లిదండ్రులు సహకరించడం, తగిన వాతావరణాన్ని కల్పించడం, అండగా నిలబడడం చేయాలి.

పరీక్షల గురించి మాట్లాడాలి. ఏఏ సబ్జక్టులు కష్టమైనవి, ఏవి సులభమైనవో అడిగి తెలుసుకోవాలి. కష్టమైన వాటిని ఎందుకు కష్టమైనవో చర్చించాలి. వాటిని సులభంగా చేసే కొన్ని చిట్కాలు చెప్పాలి.
సమయంలో పిల్లలే ఇంట్లో విఐపిలుగా భావించాలి. వారికి తగ్గట్టుగానే ఇంట్లో అన్ని పనులు జరుగుతుండాలి. తనకి ఇంట్లో ఎంతో ప్రాముఖ్యత లభిస్తోందనే విషయం పిల్లలు ఫీలవ్వాలి.
సమయంలో పిల్లలో కలిగే అనేక భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలగడం చాలా ముఖ్యం.
దానికి తల్లిదండ్రులే చొరవ తీసుకొని మాట్లాడాలి.

ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ‘నువ్వు బాగా చదువుతావు. నీకు ఆసక్తి ఉంది. నీకు తేలికగా మంచి మార్కులు వస్తాయి’ అనే పాజిటివ్ సంకేతాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అందాలి.

పోషక విలువలుగల వారికి ఇష్టమైన ఆహారపదార్ధాలను చేసిపెట్టాలి. వాళ్ళు సరిగ్గా తినేలా, సరిగ్గా నిద్రపోయేలా చూడాలి.

భయం పొగొట్టడానికి పిల్లలు తేలిగ్గా జవాబులు రాయగల కొన్ని ప్రశ్నాప్రతాలను తయారుచేసి వారితో రాయించాలి. వాటితో సాధించే మంచి మార్కులు పిల్లల ఒత్తిడిని తగ్గిస్తాయి.

ప్రిపరేషన్ సమయంలో పిల్లలు ఉత్సాహ భరితంగా ఉండడం చాలా అవసరం. అందుకు తల్లిదండ్రులు చిన్న చిన్న బహుమానాలు, కొత్త వస్తువులు కొని ఇస్తుండాలి.

ప్రిపరేషన్‌కు అవసరమైన చిన్నచిన్న నోట్స్ రాసిపెట్టడం, రివిజన్‌లో సహాయపడడం, చదువుకోవడానికి టైమ్ తయారుచేయడం వంటివి చేయాలి.

సమయంలో పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళాలి. చదువనేది నిర్విరామంగా ఉండకూడదు.
సాధారణంగా ఎలా చదవాలో సరైన అవగాహన లేకుండా చదువుతుంటారు. దానివలన అదేపనిగా చదవడం, ఒకటే సబ్జెక్టు చదవడం వలన ఆసక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత ఉండకపోవడం, శారీరకంగా అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కొన్ని ప్రిపరేషన్ టెక్నిక్స్ తెలుసుకొని పిల్లల్ని కూడా అలాగే చదివిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ రకమైన చర్యలతో తల్లిదండ్రులు పిల్లలలో పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, తాము కూడా ఎంతో రిలాక్స్‌డ్‌గా ఉండవచ్చు. దీని ప్రభావం పిల్లల పరీక్షా ఫలితాలపై కూడా పాజిటివ్‌గా ఉంటుంది. పిల్లలకు పరీక్షలలో మంచి మార్కులు రావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ మార్కులు, పిల్లల జీవితాల కన్నా, వ్యక్తిత్వాల కన్నా గొప్పవి కావనే విషయం తల్లిదండ్రులు గ్రహిస్తే ఈ పరీక్షాకాలం అందరికీ ఆహ్లాదకాలంగా గడిపేయవచ్చు.
- డి. వేణుగోపాల్

ఇలా చేయండి..!
పరీక్షల టైమ్‌టేబుల్ వచ్చిన ఒక రెండు మూడు రోజుల తర్వాత పిల్లలతో ఒక చర్చా కార్యక్రమం పెట్టాలి.
వెళ్ళి టీచర్‌ని కలిసి పిల్లల పరిస్థితి ఏమిటో, సబ్జక్టులలో ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకోవాలి.
ప్రిపరేషన్‌కి ఒక 60 లేదా 30 రోజుల టైమ్ తయారుచేయాలి. ఏఏ సబ్జక్టులు ఎప్పుడు, ఎంత చదవాలనే దానిపై ఒక విశ్లేషణ చేసుకొని దానికి తగ్గట్టుగా టైమ్‌టేబుల్ తయారుచేసుకోవాలి.

అదే పనిగా గంట సమయం కన్నా ఎక్కువ సేపు చదవనీయకండి.
ప్రశ్నాపత్రాలు తయారుచేసి మాక్ టెస్ట్‌లు పెట్టండి. దానికి బహుమతులు ఇవ్వండి.
వారానికోసారి బయటకు తీసుకువెళ్లండి. అప్పుడప్పుడు ఆటకి, టీవీకి అనుమతి ఇవ్వండి.
చదివితే ఏమవుతుందో దృశ్యపరంగా వివరించి చెప్పండి. వారికి ఇష్టమైన సినిమా హీరోలు, క్రీడాకారుల చదువు గురించి చెప్పాలి.

ఇలా చేయవద్దు..!
టైమ్ రాగానే ‘ఇక ఆటలు టీవీలు బంద్‌చేసి చదువు’ అని భయపెట్టకండి
టార్గెట్ పెట్టకండి. ఇతర పిల్లల మార్కులతో పోల్చి ‘అన్ని మార్కులు రాకపోతే’ అని హెచ్చరికలు జారీ చేయకండి.

సందేహాలు వచ్చి అడిగితే విసుక్కోకండి.
మంచి మార్కులు రాకపోతే ‘చదువు మాన్పించేస్తానని, ఎవరింట్లోనైనా పనికి పెట్టేస్తానని’ బెదిరించకండి.
సిలబస్ పూర్తి కాకపోవడం, టీచర్ చెప్పడం బాలేకపోవడం వంటి సమస్యలు పిల్లలు చెప్పినప్పుడు ఏవో సాకులు చెప్తున్నారని, విసుక్కోకూడదు.

చదువుమీద బోలెడంత ఖర్చు చేశాం’ అని ఆ డబ్బు తేవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అప్పులు చేశారో పిల్లల ముందు ఏకరవు పెట్టకూడదు.

మీద నిఘా పెట్టకూడదు. మాటిమాటికీ చదువుతున్నారో లేదో వెళ్ళి చూడకూడదు. ఆ విషయం సులభంగా గ్రహించగలరు.

Read more...

Saturday, December 29, 2012

తెలంగాణపై నెలలోగా తేలుస్తాం

నెలలోగా తేలుస్తాం

shindeybolji
తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షం.. అందరూ సత్వర నిర్ణయం కోరారు
యువత శాంతియుతంగా ఉండాలి.. తీసుకునే నిర్ణయం మంచిదే అవుతుంది
అన్ని పార్టీలూ అభివూపాయాలు చెప్పాయి.. వాటిని నోట్ చేసుకున్నా.. కేంద్రానికి నివేదిస్తా
ఏపీ ప్రజల సమస్యను అర్థం చేసుకున్నా.. పార్టీల అభివూపాయాలు ఇక్కడ చెప్పలేను
అఖిలపక్షం అనంతరం షిండే వ్యాఖ్యలు
నెల గడువు ప్రస్తావనలేని పీబీఐ కథనం.. నేతలే నెల గడువు సూచించారని వెల్లడి
ఏమీ తేల్చలేదు.. నెలపాటు ధూం తడాఖే
కాంగ్రెస్‌కు తెలంగాణ ఉద్యమ హెచ్చరిక


న్యూఢిల్లీ, హైదరాబాద్, డిసెంబర్ 28 (): న్యూఢిల్లీ, హైదరాబాద్, డిసెంబర్ 28 (టీ మీడియా): రాష్ట్రంలో దీర్ఘకాలంగా నలుగుతున్న తెలంగాణ అంశంపై నెలలోపు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ ఎనిమిది రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీల అభివూపాయాలను తాను జాగ్రత్తగా విన్నానని చెప్పారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులు తెలంగాణపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలిపారు. కొందరు నెలలో నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. ‘‘నేను అన్ని పార్టీల ప్రతినిధుల అభివూపాయాలను జాగ్రత్తగా విన్నాను. ఈ సమావేశం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాను. ఒక నెలలోపు మేం ఒక ఫలితంతో వస్తాం.

నెలలోపు ఒక నిర్ణయం ఉంటుంది’’ అని షిండే చెప్పారు. అయితే.. తెలంగాణ విషయంలో నాన్చుడు ధోరణులకు, సాగదీత వ్యవహారాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేదిలేదని, అది ప్రకటించిన నెలగడువులోనూ మునుపెన్నడూ చూడని ఉధృత ఉద్యమాన్ని చవిచూపిస్తామని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. దాదాపు మూడేళ్లుగా కాంగ్రెస్ దోబూచులాటలను గమనిస్తున్నామని, ఇంకా మోసపోయే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఈ చివరి దశలోనూ మోసం చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా.. పీఐబీలో ఉంచిన అఖిలపక్ష సమావేశం వివరాల నోట్ కలకలం రేపింది. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని పదే పదే షిండే తన విలేకరుల సమావేశంలో ఉద్ఘాటించగా.. పీఐబీ పోస్ట్ చేసిన కథనంలో ఆ ప్రస్తావనే లేకుండాపోయింది. ఒక దశలో షిండే తన మాట మార్చారని కూడా వాదనలు వచ్చాయి.

సాధారణంగా పీఐబీ కేంద్ర మంత్రుల మాటలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రకటన వెలువరిస్తుంటుంది. అయితే.. కీలకమైన ఈ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలుగా ఉన్న ‘నెల రోజుల్లోపు నిర్ణయం ఉంటుంది’ అన్న వాక్యాన్ని ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఇదెలా ఉన్నప్పటికీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై జరుగుతున్న ఉద్యమంతో గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రవూపదేశ్ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని షిండే విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలోని యువత శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘యువత శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను. ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిదే ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు ఏం చెప్పారో వెల్లడించేందుకు హోం మంత్రి తిరస్కరించారు.


‘‘జరిగినది ఇన్‌కెమెరా(బహిరంగం కాని) సమావేశం. ఆ వివరాలు చెప్పేందుకు ఇది వేదిక కాదు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభివూపాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని తెలిపారు. తెలంగాణ అంశంపై ఇదే చివరి అఖిలపక్ష సమావేశమని ఆయన అన్నారు. సుహృద్భావపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని చెప్పారు. అన్ని పార్టీలూ తమ అభివూపాయాలను చెప్పాయని హోం మంత్రి తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఎంత మంది ప్రజలు సంతృప్తి చెందుతారన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది సంతృప్తి చెందుతారు. కొంతమందిలో అసంతృప్తి ఉంటుంది’’ అని బదులిచ్చారు. సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు చెప్పిన అభివూపాయాలను తాను రాసుకున్నానని తెలిపారు. నిర్ణయం తీసుకోబోయే ముందు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
నెలలోపు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని చెప్పాను కదా.. అన్నారు. పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని చెబుతూ వాటిని అభినందించారు. అన్ని పార్టీలూ సంతృప్తితో సమావేశం నుంచి వెళ్లాయని చెప్పారు.

పదహారు మంది ప్రతినిధులు
రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల నుంచి పార్టీకి ఇద్దరు చొప్పున 16 మంది ప్రతినిధులు తెలంగాణపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం పదిగంటలకు హోం మంత్రి షిండే కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లోని సమావేశ మందిరంలో అఖిలపక్షం మొదలైంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌డ్డి(తెలంగాణ ప్రాంతం), సీనియర్ నేత గాదె వెంకటడ్డి(సీమాంధ్ర ప్రాంతం) హాజరయ్యారు. టీడీపీ నుంచి సీనియర్ నేత కడియం శ్రీహరి(తెలంగాణ), మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు(సీమాంధ్ర) వచ్చారు. సీపీఐ ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గుండా మల్లేష్ పాల్గొన్నారు.

సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి రంగాడ్డి హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఎంవీ మైసూరాడ్డి(సీమాంధ్ర), కేకే మహేందర్‌డ్డి (తెలంగాణ) హాజరుకాగా.. ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, మరో ప్రతినిధిగా జీవీజీ నాయుడు వచ్చారు. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, సీనియర్ నేత నాయిని నర్సింహాడ్డి పాల్గొన్నారు. హోం మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అఖిలపక్ష సమావేశానికి ప్రత్యేకంగా హాజరయ్యారు.

Read more...

Thursday, December 27, 2012

28 డెత్‌లైన్ - కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం


Ttime
-కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం
-దోబూచులకు ఇక ఫుల్‌స్టాప్.. వైఖరి చెప్పడంపైనే భవిష్యత్ ఉనికి
-సాగదీతలు సహించలేని స్థితిలోఉరుముతున్న తెలంగాణం
-పార్టీల్లో అఖిలపక్షం గుబులు

హైదరాబాద్, డిసెంబర్ 26 ):ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను రాష్ట్రంలో సున్నితమైన సమస్యగా చిత్రీకరిస్తుందొక పార్టీ! ఈ సమస్య వల్లే పాలనలో అనిశ్చితి నెలకొందని తీర్మానిస్తుంది మరో పార్టీ! ఈ సమస్య తొలగిపోతే అభివృద్ధి పట్టాలకెక్కుతుందని ఆరాటపడేది ఇంకో పార్టీ! తెలంగాణపై వైఖరి చెప్పని అన్ని పార్టీలూ పలికే పలుకుల సారాంశం ఒకటే.. అదే తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం! ఇప్పుడు ఆ పార్టీల ఆవేదన తొలగిపోయే అవకాశం వస్తోంది! రాష్ట్రంలో అనిశ్చితి మటుమాయం అయ్యేందుకు తరుణం ఆసన్నమవుతోంది! అదే కేంద్రం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం! దానికి ముందు ఇది డెత్‌లైన్!! తెలంగాణపై వైఖరి తేల్చడానికి టీజేఏసీ పెట్టిన ఈ డెత్‌లైన్ దాటి ముందుకు పోయే పార్టీలు ఏం నిర్ణయించుకుని అఖిలపక్షానికి వెళతాయన్నదే ఇప్పుడు ప్రశ్న! అఖిలపక్షంలో ఏం మాట్లాడుతాయన్నదే సందేహం! అవి చెప్పే వైఖరిపైనే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీల మనుగడ! ఏం జరుగుతుంది? ఆ పార్టీలు తెలంగాణలో మనుగడ సాగిస్తాయా? ఉనికి నిలుపుకుంటాయా? వాటి అస్తిత్వం తెలంగాణలో నిలబడుతుందా? అఖిలపక్షంతో తేలిపోనుందనేది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీలు దురదృష్టవశాత్తూ మాటలకే పరిమితమవుతున్నాయి.

తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరే పార్టీలే.. సమస్యను ఎప్పటికప్పుడు మరింత జటిలం చేస్తూ పోతున్న వైచివూతికి రాష్ట్ర రాజకీయాలు అద్దంపడుతున్నాయి. వైఖరి చెప్పేసిన పార్టీ లు బిందాస్. ప్రత్యేక రాష్ట్ర సాధనకే పుట్టిన టీఆర్‌ఎస్ వైఖరి విస్పష్టంగా ఉంది. సమైక్యవాదం నుంచి జై తెలంగాణ నినాదం అందుకున్న సీపీఐ.. రాష్ట్ర సాధన సమరంలో దూసుకుపోతున్నది. పార్లమెంటులో బిల్లు పెడితే ఆమోదం పొందేందుకు బేషరతు సహకారానికి బీజేపీ సై అంది. హైదరాబాద్ సహిత తెలంగాణ లేదా రాయల తెలంగాణ అని ఎంఐఎం తేల్చి చెప్పింది. తాను సమైక్యవాదినేనని సీపీఎం కుండబద్దలు కొట్టేసింది! ఇక మిగిలింది మూడు పార్టీలే. తెలంగాణపై ఆది నుంచి దోబూచులాడుతున్న ఆ పార్టీలకే ఇప్పుడు సంకట స్థితి. అందుకే ఈసారి జరిగే అఖిలపక్ష సమావేశం ఆ మూడు పార్టీల్లో గుబులురేపుతున్నది. తెలంగాణ రాష్ట్రం విషయంలో ‘డిసెంబర్ 9’ ప్రకటన శిలాశాసనంగా యావత్ తెలంగాణ ప్రాంతం విశ్వసిస్తున్నది. ఏనాడో సిద్ధించిన రాష్ట్రాన్ని ఆచరణలోకి తేవడమే మిగిలిన ఎజెండాగా భావిస్తున్నది. ఈ క్రమంలోనే అడ్డుపడుతున్న పార్టీలకు అల్టిమేటాలు జారీ అవుతున్నాయి.

తెలంగాణ విషయంలో దోబూచులను నమ్మబోమని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ తీర్పులు వెలువరించారు. వరుస ఉప ఎన్నికల్లో తెలంగాణవాదానికి పట్టంగట్టారు. వ్యతిరేక పార్టీల శవపేటికలకు ఒక్కో ఉప ఎన్నికలో ఒక్కో మేకు దించుతూ వచ్చారు. ఇక పతాక సన్నివేశం!! అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అనేక మతలబులను తెలంగాణ సమాజం చూసింది. కేంద్రంలో తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఎఫ్‌డీఐల ఓటింగ్ గండం నుంచి గట్టెక్కేందుకే ఈ అఖిలపక్షం హామీ వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అఖిలపక్షంతో సాధించేది ఏమీ లేదని, ఇది కేవలం కొత్త హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ తేల్చిపారేశారు. ఈ సమావేశం ఉత్తుత్తిదేనని హోం శాఖ వర్గాలు లీకులు కూడా ఇచ్చాయి.

అయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు.. ఈ సమావేశం తెలంగాణవాదానికి ఒక మూలమలుపుగా కూడా మారనుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్నాయి. టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి.. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అందులోనే తమ అభివూపాయం చెబుతామని ప్రకటనలు చేసింది. ఇప్పుడు సమయం వచ్చింది. తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న వాదననైనా ఆ పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వైఖరి చెప్పకపోతే తెలంగాణ ప్రాంతంలో ఈ మూడు పార్టీలను సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తెలంగాణ ఉద్యమక్షిశేణులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఉన్నాయి. ముసుగులో గుద్దులాటలను ఇక విశ్వసించే స్థితిలో ఈ ప్రాంతం ప్రజలు లేరని వెల్లడైపోయింది. అందుకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకు రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే.. తమ వైఖరి చెప్పకుండా తప్పించుకునేందుకు మార్గాన్వేషణ చేస్తున్న ఈ మూడు పార్టీలు.. నెపాన్ని ఎదుటివారిపైకి నెట్టేసే ఆలోచన చేస్తున్నాయని ఆయా పార్టీల నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమ వుతోంది.

మొత్తంగా టీడీపీ, వైఎస్సార్సీపీలు కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సమస్య మూలాలను తెలుసుకునేందుకు షిండే ఈ సమావేశం ఏర్పాటు చేశారని భావించే పరిస్థితి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలుగా అవి తెలంగాణపై ఏ దృష్టితో ఉన్నాయో తెలుసుకోవడం ఈ ‘అవగాహన’ సమావేశం ఉద్దేశంగా చెబుతున్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలు తమ వైఖరిని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ సమావేశం ఆ మూడు పార్టీలకు జీవవన్మరణ సమస్యగానే మారుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేయడంతో, ఈ సమావేశంలో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆ మూడు పార్టీలపై ఉంది. బాధ్యత నెరవేరుస్తాయా? భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటాయా? అనేది ఆ పార్టీలు వెల్లడించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుందనేది నిపుణుల విశ్లేషణ. వ్యతిరేకం కాదన్న మాటనే స్పష్టగా చెప్పి.. తెలంగాణ ఏర్పాటుకు అడ్డం తప్పుకోవాలనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష! పార్టీ వైఖరిని తేల్చి.. తెలంగాణ ప్రాంతంలో మనుగడకు అవకాశం కల్పించాలనేది ఆ మూడు పార్టీల్లోని తెలంగాణ నేతల ఆశ! అందుకే అందరి దృష్టీ అఖిలపక్షంపైనే!!


Read more...

Tuesday, December 25, 2012

చల్లారిన ఢిల్లీ

 rape 

-ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ విచారణ
-ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు
-భద్రత కల్పిస్తాం: ప్రధాని మన్మోహన్
-ఆందోళనకారులను మావోయిస్టులతో పోల్చిన షిండే
-4న డీజీపీలు, సీఎస్‌లతో భేటీ
-మహిళలమీద నేరాలపై సమీక్ష
-ఢిల్లీ దిగ్బంధం.. తీవ్ర ఆంక్షలు.. భారీగా బలగాలు.. ఆందోళనల కట్టడి
-బాధితురాలి ఆరోగ్యం విషమం
-గ్యాంగ్ రేప్ కేసులో వారంలోగా చార్జిషీట్: పోలీసులు
-ఆందోళనకారులను రెచ్చగొట్టారంటూ రాందేవ్, వీకే సింగ్‌పై కేసులు
-చట్టాల సమీక్షపై జస్టిస్ వర్మ కమిటీ పని ప్రారంభం

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజాక్షిగహానికి కారణమైన యువతి సామూహిక అత్యాచార ఘటనపై సత్వర విచారణకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్యాంగ్ రేప్ ఘటనతోపాటు ఇతర అత్యాచారాల కేసుల విచారణకు ఢిల్లీలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మురుగేశన్ ధ్రువీకరించారు. ఇందుకు జనవరి 2 తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది. యువతి గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందవద్దని, మహిళల భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ‘‘ముగ్గురు కుమ్తాలకు తండ్రిగా నేనూ మీలాగే ఆందోళన చెందుతున్నా. ఈ కిరాతక నేరానికి బాధితురాలిగా మారిన యువతి పట్ల నా భార్య, కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది’’ అని చెప్పారు. ఇండియాగేట్ వద్ద హింసాత్మక ఆందోళనలకు దిగిన నిరసనకారులను హోం మంత్రి షిండే మావోయిస్టులతో పోల్చే ప్రయత్నం చేశారు.

ఇండియా గేట్ వద్ద మావోయిస్టులు వచ్చి ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించాలా? అని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఏసీపీలపై ఢిల్లీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీలో సోమవారం ఎక్కడ చూసినా భద్రతా వలయాలు కనిపించాయి. ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.

at-Jantar-Mantar-in-New-Delగ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ!
-ఢిల్లీలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు
-జనవరి 2 తర్వాత విచారణ
-గ్యాంగ్ రేప్‌పై చర్యలకు ఉపక్షికమించిన ప్రభుత్వం
-ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు
-వారంలోగా చార్జిషీట్: పోలీసులు
-చట్టాల సమీక్షపై జస్టిస్ వర్మ కమిటీ పని మొదలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24:యువతి సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాక్షిగహం వెల్లు నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్షికమించింది. ఈ కేసులో సత్వర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఫాస్ట్‌వూటాక్ కోర్టుల ఏర్పాటు విషయమై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సోమవారం చీఫ్ జస్టిస్ మురుగేశన్‌తో భేటీ అయి చర్చించారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో హస్తినలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ప్రారంభం కానున్నాయని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీ మురుగేశన్ మీడియాకు ధ్రువీకరించారు. ఇటీవలి గ్యాంగ్ రేప్ ఘటన సహా.. అత్యాచార కేసుల్లో రోజువారీ విచారణ జరిపేందుకు ఈ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. సెలవుల అనంతరం హైకోర్టు జనవరి 2న తిరిగి ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫాస్ట్‌వూటాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ నెల 16న నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై జరిగిన కిరాతక సామూహిక అత్యాచారం ఘటనపై ఢిల్లీ సహా, దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ తేజిందర్ కన్నా తన పర్యటనను అర్ధాంతరంగా కుదించుకొని, నగరానికి చేరుకున్నారు. ఆ వెంటనే సీనియర్ పోలీసు అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. దేశ రాజధానిలో మహిళల భద్రతకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో వారం రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని తెలిపారు. ఆదివారం నాటి హింసాత్మక ఆందోళనకు సంబంధించి పోలీసులు నాలుగు కేసులు నమోదుచేశారు. అలర్లకు ప్రోత్సహించారని, హింసకు ప్రేరేపించారనిఆర్మీ మాజీ చీఫ్ వీకేసింగ్,బాబా రాందేవ్‌పై కేసులు పెట్టారు.

జస్టిస్ వర్మ కమిటీ పని మొదలు
లైంగిక దాడుల కేసుల్లో సత్వర న్యాయం, దోషులకు శిక్ష పెంపుదల విషయమై ప్రస్తుతమున్న చట్టాలను సమీక్షించడానికి ఏర్పాటైన ముగ్గురు న్యాయకోవిదులతో కూడిన జస్టిస్ వర్మ కమిటీ సోమవారం తన పనిని ప్రారంభించింది. ఈ అంశంపై జనవరి 5న ప్రజాభివూపాయాన్ని తెలియజేయాలని కమిటీ నోటీసును జారీచేసింది.

కానిస్టేబుల్ పరిస్థితి విషమం :
ఢిల్లీ గేట్ వద్ద నిరసనల సందర్భంగా చెలరేగిన ఘర్షణలోగాయపడిన పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్ సౌకర్యం కొనసాగుతోందని వైద్యులు సోమవారం తెలిపారు.

ఆపదలో ఆదుకునే ‘167’
అత్యాచార నిరోధానికి ఢిల్లీలో ఓ హెల్ఫ్‌లైన్ ప్రారంభంకాబోతోంది. 167 నంబర్‌తో ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఆ నెంబర్‌కు ఫోన్ చేయగానే క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని వారి రక్షించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విజ్ఞప్తి మేరకు టెలికంశాఖ మూడు అంకెల హెల్ఫ్‌లైన్‌ను కేటాయించిందని సోమవారం కేంద్ర టెలికం శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

manmohan-singhభద్రత కల్పిస్తాం.. ఆందోళన వద్దు
-ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్
యువతి గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందవద్దని, మహిళల భద్రత సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ముగ్గురు కుమ్తాలకు తండ్రిగా నేనూ మీలాగే ఆందోళన చెందుతున్నా. ఈ కిరాతక నేరానికి బాధితురాలిగా మారిన యువతి పట్ల నా భార్య, కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది’ అని చెప్పారు. ఈ ఘోరమైన ఘాతుకానికి సంబంధించి జరిగిన జాప్యంపై పరిశీలన జరుపుతామని, మహిళల భద్రతకు సంబంధించి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.


SUSHILఆందోళనకారులు.. మావోయిస్టులు!
-ఇద్దరికీ పోలిక పెట్టిన షిండే
-ఇండియా గేట్‌కు వెళ్లి.. చర్చలు ఎందుకు నిర్వహించాలి
-కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు
-4వ తేదీన అన్ని రాష్ట్రాల డీజీపీ, సీఎస్‌లతో భేటీ
-మహిళలపై నేరాలపై సమీక్ష

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: గ్యాంగ్‌రేప్ ఘటనపై రగిలిపోయి ఉద్యమిస్తున్న ఆందోళనకారులను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాగేట్ వద్ద ఆగ్రహంతో దాడులకు దిగిన ఆందోళనకారులను మావోయిస్టులతో పోల్చారు. గ్యాంగ్ రేప్ ఘటనపై వెల్లు ప్రజాక్షిగహాన్ని అర్థం చేసుకోలేక రాజకీయపార్టీలు సతమతమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ హోంమంత్రి ఇండియా గేట్ దగ్గరికెళ్లి.. చర్చలు జరపాలని చెప్పడం చాలా సులువు. రేపొద్దున్న ఏదైనా పార్టీ కూడా ప్రదర్శన నిర్వహిస్తే..అప్పుడు కూడా హోంమంత్రి వెళ్లాల్సిందే. రేపొద్దున్న కాంగ్రెస్, బీజేపీ కూడా ఇక్కడ ప్రదర్శనలు నిర్వహిస్తాయి. మావోయిస్టులు కూడా ఆయుధాలతో ప్రదర్శనలు నిర్వహిస్తారు’’ అని ఆయన వివిధ ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ‘‘ఈ పరిస్థితి రేపొద్దున్న ఏ ప్రభుత్వానికైనా రావచ్చు. ప్రభుత్వం ఎందుకు వెళ్లాలి?’’ అని ప్రశ్నించారు. ఆందోళనకారులను మావోయిస్టులతో పోలుస్తున్నారా? అని ప్రశ్నించగా ‘‘శాంతి భద్రతల నుంచి దీనిని వేరు చేయలేరు. ఆందోళన మొదలైననాటి నుంచి నిరసనకారుల ప్రతినిధులతో నేను మాట్లాడుతూనే ఉన్నాను.

వారు న్యాయం కోరుతున్నారు. ఏ రకమైన న్యాయం మేమివ్వగలం’’ అని అన్నారు. ఇండియా గేట్ వద్ద ఆదివారం జరిగిన హింసాత్మక ఆందోళన వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. జనవరి నాలుగున అన్ని రాష్ట్రాల డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి.. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై చర్చిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఢిల్లీలో యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి లేదా, అఖిలపక్షం భేటీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఆయన సోమవారం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. ఇటీవల గ్యాంగ్ రేప్ ఘటనతోపాటు మహిళలపై లైంగిక దాడులపై విచారణకు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తిచేశారు. అత్యాచారాలపై సత్వర విచారణ, శిక్ష పెంపు విషయమై ప్రస్తుతమున్న చట్టాలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి నివేదిక సమర్పించడానికి నెల రోజులపాటు గడువు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులపై పోలీసుల అణచివేతను షిండే సమర్థించారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు.

Ajmer 

అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం
-ఆగని అంతర్గత రక్తవూసావం
-ఇంకా కృత్రిమ శ్వాసలోనే : వైద్యులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ‘గ్యాంగ్ రేపుకు గురైన పారామెడికల్ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి సోమవారం మరింత దిగజారింది. ఆమె ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు’ అని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆ యువతి మానసికంగా దృఢంగానే ఉన్నారని తెలిపాయి. నిన్నటికన్నా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని ఆమెకు వైద్యం అందిస్తున్న సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ తెలిపారు. అంతర్గతంగా రక్తవూసావం అధికమైందన్నారు. అది గడ్డకట్టి కొత్త సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు. గత రాత్రికూడా విపరీతంగా రక్తవూసావం జరిగిందన్నారు.

ప్రస్తుతం ఆమెకు ఇంకా కృత్రిమంగానే శ్వాసను అందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో గ్యాంగ్ రేపు ఘటన తర్వాత ఈ పారా మెడికల్ విద్యార్థినిని (23) వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పవూతిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఆ ఆమ్మాయి ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని వెల్లడించారు. ఉష్ణోక్షిగత 102 నుంచి 104 డిగ్రీల మధ్య ఉంటోందన్నారు. బైలిర్బిన్ లెవల్ 5.5 శాతానికి తగ్గిందన్నారు. ప్లెట్‌పూట్స్ కూడా తగ్గాయని చెప్పారు. ఇది ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా అవయవాలు సాధారణంగానే పని చేస్తున్నాయని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నాయని వివరించారు. ఆమెకు సైకాలాజీ కౌన్సెలింగ్ ఇంకా కొనసాగుతోందని సైకాలాజీ విభాగం డాక్టర్ రస్తోగీ చెప్పారు. అంతర్గతంగా ఎన్నిగాయాలైనా ఆమె మాత్రం ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు గురికావడంలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ యువతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ప్రమాదం నుంచి బయటపడలేదని ఐసీయూ ఇన్‌చార్జి డాక్టర్ పీకే వర్మ తెలిపారు. ఆమె పరిస్థితి అలాగే కొనసాగుతోందని వివరించారు. కాగా, ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని బాధితురాలి తండ్రి సోమవారం విజ్ఞప్తి చేశారు

Read more...

Monday, December 24, 2012

Here's a look at world's biggest pvt jet of Saudi royals

It was earlier reported that Saudi Prince Alwaleed bib Talal al-Saud is about to take delivery of an Airbus A380, the world’s biggest private jet. Here is an interior view of the Airbus A380.

The same model is used by Singapore Airlines and Emirates and can fly 800 passengers 8,000 miles ( 12,874 km) before refuelling. 

But the Saudi prince doesn’t need 800 seats, so he will have them removed to make room for an opulent, marble- finished Turkish bath and a parking space for his Rolls- Royce.
Saudi billionaire soon take delivery of the world's first customised A380 superjumbo, dubbed "the flying palace" for its luxury.

Alwaleed, estimated to be worth around $26 billion, has reportedly paid $485 million for the world's biggest private jet expected for delivery next year.

The A380 jumbo is believed to include four-poster beds, a Turkish bath, storage space for a Rolls-Royce, a boardroom, a concert hall, five suites with king-size beds, a prayer room featuring "computer generated prayer mats" which face Makkah and a lift between floors on all three levels.

Airbus Middle East president Habib Fekih confirmed on the sidelines of an aviation conference in Dubai that the aircraft would be delivered to the Saudi billionaire next year. "The A380 is planned for next year 2013," he said.


This is currently the only A380 luxury business jet on order but Fekih said he expected interest to grow.

Read more...

Sunday, December 23, 2012

రాజుల సొమ్ము..కేసుల పాలు (వారసత్వ పోరులో నలుగుతున్న వేల కోట్ల నిజాం ఆస్తులు)

ఆస్తులపై ఎవరి వాదనలు.. వారివే..
తమకే చెందుతాయంటూ ముందుకొచ్చిన 500 మంది..
ఒకరిపై ఒకరు వ్యాజ్యాలు.. కేసులు..
ముకరం జా ఆస్తుల్లో వాటాల కోసం భార్యా పిల్లల పోటీ

వేల ఎకరాల్లో భూములు.. ఒక్క హైదరాబాద్‌లోనే 630 ప్యాలెస్‌లు.. దేశంలో అనేక చోట్ల భవంతులు.. క్వింటాళ్ల కొద్ది వజ్ర, వైఢూ ర్యాలు... ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకప్పటి నంబర్ వన్, చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్తుల చిట్టా ఇదీ! హైదరాబాద్ కేంద్రంగా 37 సంవత్సరాల సుదీర్ఘ పాలనతో దక్కన్‌లో ఆధునికతకు బాటలు వేసి, ఆపరేషన్ పోలోతో భారత సైన్యాలకు తలవంచిన ఈ నిజాంకు చెందిన అపార సంపద అంతా వివాదాలమయం!!

సాక్షి, హైదరాబాద్: కళ్లు బైర్లుకమ్మే ఆభరణాలు, ఆస్తులు నిజాం కుటుంబానికే చెందుతాయంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ 1947, నిజామ్స్ ట్రస్ట్ వాలిడేషన్ యాక్ట్ 1950) నిజాం పరివారంలో వెలుగులు నింపినా.. ‘వారసత్వ పోరు’తో అవి కాస్త మసకబారాయి. ఆ ఆస్తులకు వారసులం తామంటే.. తామంటూ వారసులు అమీతుమీకి సిద్ధమయ్యారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్(1886-1964) అనంతరం ఆయన కుమారులు ఆజం జా, మోజం జాల తరం వరకు గుట్టుగా జీవనం సాగించిన నిజాం వారసులు.. ఆస్తుల వివాదంతో మరోసారి తెరపైకొచ్చారు. ఆజం మొదటి కుమారుడు 8వ నిజాం హైదరాబాద్ ప్రిన్స్ ముకరం జా (79)... తన భార్యలు, వారి పిల్లలతో ఆస్తి వివాదాల్లో మునిగి తేలుతుండగా.. ఆజం మరో కుమారుడు ముఫకం జా తన తోబుట్టువులు, వారి పిల్లలతో పంచాయతీల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ అలీఖాన్.. ఆయన వారసులు-వివాదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...


హైదరాబాద్ విలీనం సమయంలో ఏం జరిగింది..?

1911 నుండి 1948 వరకు హైదరాబాద్ కేంద్రంగా రాచరిక పాలన చేసిన ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను ఓ స్వతంత్య్ర రాజ్యంగానే ఉండాలని కోరుకున్నారు. కానీ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత సైన్యాలు చేసిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయక తప్పలేదు. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనానికి ప్రతిఫలంగా అలీఖాన్ భారత ప్రభుత్వంతో ఒప్పందం (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు. నిజాంకు చెందిన ఆస్తుల జోలికి వెళ్లమని, తన సొంతమని భావించే ఆస్తులకు సంబంధించి చట్టపరమైన రక్షణలు ఇస్తామని నాడు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఇందులో భాగంగానే నిజాం సమర్పించిన తన ప్రైవేటు ఆస్తుల చిట్టా ‘బ్లూ బుక్’ను ఆమోదిస్తూ 1950 జనవరి 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూరా ఉన్న 23 వేల ఎకరాల (సర్ఫెఖాస్) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, మహేబలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న 630 భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ వెంకటాచారి ఉత్తర్వులు వెలువరించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చౌమహల్లా, ఫలక్‌నుమ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా, ఫెర్న్ విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ప్లజెంట్ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర , వైఢూర్యాలు నిజాం కుటుంబం సొంతమయ్యాయి. అయితే ఈ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా చేర్చింది. ఫలితంగా 28 రకాల ట్రస్ట్‌లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, నిజాం కుటుంబ సభ్యులతో పాటు మాజీ సివిల్ సర్వీసు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

వారసులు వచ్చారిలా..

నిజాంకు సంబంధించి దాదాపు 90 శాతం ఆస్తులు న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయి. తాజాగా 8వ నిజాం ముకరం జా (ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఆజం జా మొదటి కొడుకు) మూడో మాజీ భార్య మనోల్యా ఒనూర్, ఆమె కూతురు నీలోఫర్‌లు.. చిరాన్ ప్యాలెస్ తమకే వస్తుందని ప్రకటించారు. మరోవైపు తన వాటా కింద ముఫకం జా ట్రస్ట్ అధీనంలో ఉన్న మౌంట్‌ప్లజెంట్ (ముఫకం జా కాలే జీ) వస్తుందంటూ ముఫకం జా (ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు) కోడలు సఫియా సఖీనా కోర్టును ఆశ్రయించారు. దక్షిణ ముంబై మలబార్‌హిల్స్‌లోని రూ.400 కోట్ల విలువ చేసే 5,000 గజాల స్థలానికి వారసులం తామేనంటూ జమీన్ అలీఖాన్, కుద్రత్, ఫిర్సాత్ అలీఖాన్‌లు ముంబై కలెక్టర్‌కు ఇటీవలే లేఖ రాశారు. ఇందుకు తీవ్ర అభ్యంతరం చెబుతూ 8వ నిజాం ముకరం జా కలెక్టర్‌కు మరో లేఖ సంధించారు. ఇవిగాకుండా నిజాం ప్రైవేటు ఆస్తిగా పేర్కొనే సర్ఫేఖాస్ భూములపై వేల సంఖ్యలో కేసులు సిటీ న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. నిజాం ఆస్తులకు వారసులం తామంటే.. తామని అనేక మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే ముకరం జా కొడుకు అజ్మత్ జా తాజాగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. ఆస్తుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఏడో నిజాం తర్వాత.. ఎవరికి వారే యమునా తీరే!

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తర్వాత.. నిజాం కుటుంబం ఎవరికి వారే విడిపోయారు. తామే నిజాం వారసులమంటూ ఇప్పటిదాకా ఐదు వంద మందికిపైగా ముందుకు రావడం విశేషం. ఎనిమిదో నిజాంగా ప్రకటించుకున్న ముకరం జా అధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టాలు అందుకున్న ఈ హైదరాబాద్ ప్రిన్స్ విలాసాలకు చిరునామా. ఈయన తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959-75), తర్వాత ఎయిర్ హోస్టెస్ హెలెన్ (1980-90)ను ,ఆపై అప్పటి మిస్ టర్కీ మనోల్యా ఒనోర్‌ను (1990-96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాక్’ చెప్పేశారు. ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్‌లతో కలిసి ఉంటున్నారు. మొత్తంగా చూస్తే ఈయనకు మొదటి భార్య ద్వారా ఇద్దరు (కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడో భార్య ద్వారా కూతురు (నీలోఫర్), నాలుగో భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు.

ఆస్తుల అన్యాక్రాంతం సరికాదు: న్యాయనిపుణుడు వెంకట రమణ

‘‘రాజభరణాల రద్దు తర్వాత నిజాం కుటుంబానికి ఎలాంటి ప్రత్యేక హోదాలు, హక్కులు లేవు. అయినా వారి పేర్లపై వందల ఎకరాల భూములు, ఆస్తులు, అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయి. వారు ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తుల అన్యాక్రాంతం చేస్తున్న దృష్ట్యా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ట్రస్ట్‌ల తీరుపై వెంటనే విచారణ చేపట్టాలి.’’

నిజాం సంతానం ఇదీ...

ఉస్మాన్ అలీఖాన్-దుల్హన్ పాషా దంపతులకు ఇద్దరు కొడుకులు ఆజం జా, మోజం జా, ఓ కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం. ఆజంజా టర్కీకి చెందిన దురేషెవార్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముఖరంజా, ముఫకం జా ఇద్దరు కొడుకులు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బతికి ఉండగానే తన వారసునిగా అంటే 8వ నిజాంగా ముకరం జాను ప్రకటించాడు. మోజం జా తొలుత నీలోఫర్ (టర్కీ)ను పెళి ్లచేసుకున్నాడు. విడాకుల అనంతరం రజియాబేగం, ఆ తర్వాత అన్వర్ బేగంలను పెళ్లాడాడు. వీరిలో ఆయనకు రజియాబేగం ద్వారా ఫాతిమా, అమీనా, ఓలియా కుల్సుం ముగ్గురు కూతుళ్లు కలిగారు. చివరి భార్య అన్వర్ బేగం ద్వారా కొడుకు శ్యామత్ అలీఖాన్ జన్మించాడు.

చిరాన్ ప్యాలెస్ నాకే రావాలి

నాన్నను చూడక రెండేళ్లవుతోంది. కలుసుకునేందుకు ప్రయత్నించినా కొందరు అడ్డుకుంటున్నారు. అందుకే నాన్న (ముకరం జా) ఆస్తిలో వాటా కోసం నేనిప్పుడు అమ్మ ఓనూర్‌తో కలిసి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం కొడుకులకు రెండు వంతులు, ఆడ పిల్లకు ఒక వంతు ఆస్తి ఇవ్వాల్సిందే. నాన్నను చూసేందుకు న్యాయ పోరాటం చేస్తా. లెక్క ప్రకారం కేబీఆర్ పార్కు పరిసరాల్లోని చిరాన్ ప్యాలెస్ పూర్తిగా నాకే రావాలి.
- నిలోఫర్ (ముకరం జా మూడో భార్య మనోల్యా ఓనూర్ కూతురు)

లాయిడ్స్ బ్యాంక్‌లో తేలని వివాదం
1947లో ఆపరేషన్ పోలో సమయంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ ద్వారా అప్పట్లో లక్షా ఎనిమిది వేల (ప్రస్తుత విలువ రూ.240 కోట్లు) పౌండ్లను లాయిడ్ బ్యాంక్ ఆఫ్ లండన్‌లో డిపాజిట్ చేయించిన వివాదం ఇంకా సమసిపోనేలేదు. 1947 అనంతంర భారత్, పాకిస్థాన్ విడిపోవటం, లాయఖ్ అలీ తాను పాక్ జాతీయుడిగా పేర్కొనటంతో ఆ మొత్తం ఎవరికి చెందుతుందన్న అంశం 65 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. అయితే 2003 నుంచి భారత ప్రభుత్వం ఈ మొత్తం తమకే చెందుతుందని వాదిస్తోంది. ఈ మొత్తం భారత్‌కు వస్తే అందులోనూ నిజాం వారసులకు వాటా వచ్చే అవకాశం ఉంది.

లండన్‌లో ముఫకం జా..


మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు ముఫకం జా. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు.

Read more...

Sunday, December 9, 2012

డ్రగ్స్ తరలిస్తూ దొరికిపోయిన నటుడు


abhishek- అభిషేక్, అతడి అనుచరుడు అరెస్ట్
- కారులో పది గ్రాముల కొకైన్ పట్టివేత.. టాలీవుడ్‌లో కలకలం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 : అతడో నటుడు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా డు. ఆ గుర్తింపు వెనుక ఓ గ‘మ్మత్తు’ రహస్యం దాగి ఉంది! నటుడిగా స్థిరపడేందుకు అతగాడు మాదక ద్రవ్యాల దందా ఎంచుకున్నాడు! నాలుగేళ్లుగా సాగిస్తున్న ఈ దందాను ఎట్టకేలకు పోలీసు లు ఛేదించారు. వివరాలను పశ్చిమ మండలం డీసీపీ సుధీర్‌బాబు తన కార్యాలయం లో విలేకరులకు వెల్లడించారు. ఉత్తరవూపదేశ్‌కు చెందిన అభిషేక్ కుమార్(31) డిగ్రీ వరకు చదువుకున్నాడు. 1998లో తండ్రి మరణించడంతో అతడి కుటుంబం ఉత్తరవూపదేశ్ నుంచి హైదరాబాద్‌కు వలసవచ్చింది. ఈ కుటుంబానికి గోవాలో హోటల్ వ్యాపారం ఉంది. 

సినిమాల్లో నటించాలన్న ఆశతో చిత్ర పరిక్షిశమ, క్లబ్, పబ్‌లు తిరిగిన అభిషేక్‌కు 2007లో గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించే మల్హోత్ర (2008లో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు)తో పరిచయం ఏర్పడింది.

అప్పటినుంచి అభిషేక్ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. చిత్ర పరిక్షిశమకు చెందిన మరో ఇద్దరు నటులు భరత్, రఘు (వూపముఖ హీరో రవితేజ సోదరులు) అభిషేక్‌కు మంచి స్నేహితులు. చిత్ర పరిక్షిశమలో డ్రగ్స్ తీసుకునేవారి వివరాలు సేకరించిన అభిషేక్... గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి సరఫరా చేసేవాడు. అతడు ‘ఎలా చెప్పను’, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘డేంజర్’, ‘శశిరేఖ పరిణయం’, ‘గాయం’, ‘కాళిదాస్’, ‘గగనం’ వంటి పలు చిత్రాల్లో నటించాడు. గతనెల 29న అభిషేక్, అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు(24) గోవా వెళ్లారు. తిరిగి ఈనెల 2న హైదరాబాద్‌కు వచ్చి.. నేరుగా ఎస్‌ఆర్‌నగర్‌లోని అభిషేక్ నివసిస్తున్న తిరుమల అపార్టుమెంట్‌కు వెళ్లారు. 

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్కోడాకారులో ఇంటి నుంచి అభిషేక్, శ్రీనివాసులు బయలుదేరారు. వారు కొకైన్‌తో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ తన టీమ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున ధరమ్ ఖరమ్ రోడ్డులో అభిషేక్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో ఒక్కో గ్రాము చొప్పున పది కొకైన్ పాకెట్లు (పది గ్రాములు) దొరికాయి. దీంతో పోలీసులు.. అభిషేక్‌ను, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో అభిషేక్ కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిక్షిశమలో చాలా మంది ప్రముఖులకు నాలుగేళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతడు ఒప్పుకున్నట్లు సమాచారం.

గ‘మ్మత్తు’ టాలీవుడ్!
హైదరాబాద్, డిసెంబర్ 8 (టీ మీడియా): టాలీవుడ్.. డ్రగ్స్‌కు మధ్య సంబంధం మరోసారి బయటపడింది. ఇన్నాళ్లూ మాదకవూదవ్యాలు కొంటూ టాలీవుడ్ స్టార్లు పట్టుబడగా ఈసారి ఏకంగా చిత్ర పరిక్షిశమలోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నటుడు అభిషేక్ తన అనుచరుడితో దొరికిపోవడంతో చిత్రసీమలో కలకలం రేగింది. అతడు ఎవవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

 గడిచిన రెండున్నరేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో పోలీసులు 25కు పైగా డ్రగ్స్ గ్యాంగులను అరెస్టు చేసి, వారి నుంచి రెండున్నర కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదకవూదవ్యాలను వినియోగిస్తున్నవారి సంఖ్య టాలీవుడ్‌లో పదుల్లోనే ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అయితే, విచారణలో నిందితులు టాలీవుడ్ నటుల పేర్లు చెప్పినంత మాత్రాన అవతలివారిని అరెస్టు చేయలేమని పోలీసు అధికారులు అంటున్నారు. హీరో రవితేజ సోదరులు రఘు, భరత్‌లు డ్రగ్స్ ఉపయోగిస్తారని సమాచారం ఉన్నా వాళ్లు కొకైన్‌ను కొంటున్నపుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాతే కేసులు పెట్టిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు.

 అభిషేక్ కొకైన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నేపథ్యంలో టాలీవుడ్‌కు చుట్టుకున్న డ్రగ్స్ గుట్టు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు డ్రగ్స్ కొంటూ దొరికినవారు మాత్రమే ఉన్నారని, ఈ సారి ఏకంగా టాలీవుడ్‌లోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నటుడు తమ చేతికి చిక్కాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Read more...

Saturday, November 10, 2012

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతీయుల నల్లధనం 6 వేల కోట్లు!

తాజా బాంబు పేల్చిన కేజ్రీవాల్ బృందం
700 మందికి ఆ బ్యాంకులో ఖాతాలున్నాయని ఆరోపణ..
జెనీవా బ్యాంకులో గుప్త సొత్తుల గుట్టురట్టు
అవినీతికి ప్రభుత్వ ప్రోత్సాహం.. మండిపడిన కేజ్రీవాల్
- అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు
- మొటెక్ సాఫ్ట్‌వేర్ సంస్థ (రిలయన్స్ గ్రూప్) ఖాతాలో రూ.2100 కోట్లు
- కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్ ఖాతాల్లో రూ.125 కోట్లు
- డాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 9: కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు! అధికార, ప్రతిపక్ష నేతల బండారాలు బయటపెట్టిన కేజ్రీవాల్... తాజాగా దేశంలోని ప్రముఖ వ్యాపారవర్గాల గుప్త సొత్తుల గుట్టురట్టు చేశారు. స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని హెస్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతదేశానికి చెందిన 700 మంది ఆరువేల కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్నారని సంచలన ఆరోపణ చేశారు! దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన అంబానీ సోదరులు మొదలుకుని జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, డాబర్ ప్రమోటర్లకు ఈ బ్యాంకులో రహస్య ఖాతాలు ఉన్నాయని బయటపెట్టారు. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించడం వల్లే విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయుల అవినీతి ధనం గుట్టలు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బడా వ్యాపారవేత్తలకు తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. హవాలాను ప్రోత్సహిస్తున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎస్‌బీఐలో కన్నా.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం చాలా సులభమని అన్నారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు సైతం ఇదే మాట చెప్పారు.

దేశంలోని బడా నేతల అవినీతి భాగోతాలను బయటపెడుతున్న ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నల్లధన కుభేరులపై విరుచుకుపడ్డారు. దేశంలో నల్ల ధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనంపై చర్చ జరుగుతోందికానీ, దాన్ని వెనక్కి రప్పించడంలో ఏ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించలేదని విమర్శించారు. నల్లడబ్బును దాచిన నేతల వివరాలు తెలిసి కూడా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో 700 మంది భారతీయులకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఖాతాల్లో మొత్తం రూ.6000 కోట్ల డబ్బు మూలుగుతోందని సంచలనాత్మక ఆరోపణ చేశారు. భారత్‌లో నల్లధనాన్ని హెచ్‌ఎస్‌బీసీ ప్రోత్సహిస్తోందన్నారు.
kejriwal
ఆ బ్యాంకులో ఖాతాలు కలిగిన వారిలో అంబానీ సోదరులు, జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేశ్‌గోయల్, కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీ కోర్ గ్రూప్ సభ్యురాలు అనూటాండన్‌లు ఉన్నారని చెప్పారు. వారు భారీ ఎత్తున ఆ బ్యాంకులో నల్ల ధనాన్ని దాచారని ఆరోపించారు. ఈ వివరాలను శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో కలిసి కేజ్రీవాల్ విలేకరులకు వెల్లడించారు. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో రహస్య అకౌంట్లు కలిగిన బడా వ్యక్తుల వివరాలు ఇంకా తమ వద్ద ఉన్నాయన్నారు. వందల కోట్లు దాచిన వారిపై ఈగ కూడా వాలనీయకుండా, చిన్నవారిపై దాడులు చేస్తోందని ఆరోపించారు. అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు ఉన్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. వారి తల్లి కోకిలా బెన్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. యశోవర్ధన్ బిర్లా ఖాతాలో కూడా జీరో బ్యాలెన్స్ ఉందని, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మొటెక్ సాఫ్టవేర్ సంస్థ ఖాతాలో రూ.2100 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్‌కు చెందిన ఖాతాల్లో రూ.125 కోట్లు.. దాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని కేజ్రీవాల్ వివరించారు. ఈ వివరాలన్నీ 2006లో సేకరించినవిగా వెల్లడించారు.

కొత్త ఆరోపణలేంకాదు: ప్రభుత్వ వర్గాలు
నల్లధనంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను యూపీఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘ఆయన చేసిన ఆరోపణల్లో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు. పైగా వాటికి సరైన ఆధారాలను కూడా ఆయన చూపడంలేదు’ అని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం రాత్రి పేర్కొన్నాయి. ‘ఆదారాల్లేని ఆరోపణలపై నేను స్పందించను’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో తమకు ఎలాంటి అక్రమ ఖాతాలు లేవని.. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అంబానీ సోదరులు తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఐఎల్ నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల వల్ల ఎన్నో బ్యాంకులతో సంబంధాలు ఉన్నాయని.. అందులో హెచ్‌ఎస్‌బీసీ ఒకటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని స్వార్థపూరిత శక్తుల వల్లే కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. హెచ్‌ఎస్‌బీసీలో నల్లధనాన్ని బయటపెట్టాలని బీజేపీ నేత అద్వానీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ అనూటాండన్, జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్‌గోయల్, దాబర్ ప్రమోటర్స్ బర్మన్స్ సోదరులు ఖండించారు. హెచ్‌ఎస్‌బీసీ కూడా ఆరోపణలను ఖండించింది.

ఇంటి నుంచే హెచ్‌ఎస్‌బీసీ ఖాతా ఓపెన్.. నిర్వాహణ
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతా తెరవాలంటే జెనీవా వెళ్లనక్కర్లేదని, ఆ బ్యాంకు ప్రతినిధులే ఇంటికి వస్తారని కేజ్రీవాల్ చెప్పారు. డబ్బులు కూడా వారికే అప్పగించొచ్చునన్నారు. శ్రమ లేకుండా ఆన్‌లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చన్నారు. అవసరమైనప్పుడు సంప్రదించడానికి కాంటాక్ట్ నెంబర్ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో హెచ్‌ఎస్‌బీసీ వల్ల హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌బీఐతో పోలిస్తే స్విస్ బ్యాంకులో ఖాతా తెరవడం చాలా సులభమన్నారు. హెచ్‌ఎస్‌బీసీ విధానాల వల్ల ఉగ్రవాదులకు మేలు జరుగుతోందన్నారు. పాకిస్థాన్‌లో ఉండి భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు, నేరస్తులకు ఈ బ్యాంకు ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం సులభమన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశ ద్రోహం, భారత్‌పై యుద్ధం ప్రకటన వంటి కేసులను నమోదు చేసి, ఆ బ్యాంకు అధికారులను అరెస్టు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆ బ్యాంక్ హవాలా దందా చేస్తుందనడానికి ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలన్నారు.హెచ్‌ఎస్‌బీసీలో 700 మందికి ఖాతాలు ఉంటే 125 మందిపైనే దాడులు నిర్వహించడానికి కారణం ఏమిటని కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
voice2telangana.blogspot.com
నల్ల కుబేరులకు ప్రణబ్‌అండ: కేజ్రీవాల్
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలున్న 700 మంది బడా నేతలకు కాపాడ్డానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రయత్నించారని కేజ్రీవాల్ ఆరోపించారు. వారి నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి వాలెంటరీ డిస్‌క్లోజర్ ఆఫ్ ఇన్‌కం స్కీం (వీడీఐఎస్)ను ప్రవేశపెట్టారని చెప్పారు. విపక్షాల విమర్శలకు జడిసి దాన్ని విరమించుకున్నారన్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా ముఖర్జీ ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం బడా వ్యక్తులకు అమ్ముడుపోయిందన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం వారికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఈ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారి వివరాలు అధికారికంగా నిరూపించడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి దక్కించుకున్న ఓ కాంగ్రెస్ నేత చెప్పిన వివరాల ప్రకారమే తాము ఈ పరిశోధన చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసి రికార్డు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే మరింత కూపీలాగి ఈ ఖాతాల వివరాలను సేకరించామని చెప్పారు.

న్యాయవ్యవస్థే తదుపరి లక్ష్యం
రాజకీయ నేతలు, పారిక్షిశామికవేత్తలపై ఆరోపణలు చేసిన సంచలనం సృష్టించిన కేజ్రీవాల్ తదుపరి ఆరోపణలు ఎవరిపై అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి ఆయన శుక్రవారం సమాధానం ఇచ్చారు. దేశంలోని న్యాయవ్యవస్థే తమ తదుపరి లక్ష్యమన్నారు. దేశంలోని అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసులు ఏళ్ల తరబడి తీర్పుకు నోచుకోకుండా వాయిదాలు పడ్డం వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఆధారాలతో మీరు కోర్టుకు ఎందుకు వెళ్లరు అన్న ప్రశ్నకు సమాధానంగా.. మేం కోర్టును ఆశ్రయిస్తే.. ప్రభుత్వం అక్కడ మేనేజ్ చేస్తుందని వ్యాఖ్యానించారు.


- T News

Read more...

Monday, October 29, 2012

మూడు వ్యక్తిత్వాల కలయిక

సినీ రంగంలో మూడు దశాబ్దాల జైత్రయాత్ర.. సామాజిక సేవారంగంలో తనదైన పాత్ర
పాలిటిక్స్‌లో మెరిసిన రాజకీయ ధీరుడు.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..

ఆడాడు.. ఆడించాడు..! పాడాడు.. పాడించాడు..! నవ్వాడు.. నవ్వించాడు..! నడిచాడు... నడిపించాడు! ఆయన వేసిందే డాన్స్.. ఆయన చేసిందే స్టంట్! సూపర్‌స్టార్ కృష్ణలా పదునుగా డైలాగ్‌లు చెప్పగల స్వరం.. నటరత్న ఎన్టీఆర్‌లా హావభావాలు ఒలికించగల కౌశలం.. నట సామ్రాట్ ఏఎన్నార్‌ను మరిపించేలా స్టెప్పులు వేసే తుంటరితనం! అంతెందుకు.. నవరసాలనూ తన నటన ద్వారా వెండితెరపై చిలకరించగల అరుదైన నటుడాయన! చంటబ్బాయ్.. ఇంద్ర.. ఆపద్భాందవుడు.. స్వయం కృషి.. ఠాగూర్.. గ్యాంగ్ లీడర్.. హిట్లర్.. ఆరాధన.. అభిలాష.. మంచు పల్లకీ.. జగదేక వీరుడు అతిలోక సుందరి!! సినిమా ఏదైనా.. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగిపోవడమే తెలిసిన అతికొద్ది మంది నటుల్లో ఒకరు! భిన్నమైన పాత్రలను విభిన్నంగా పోషించిన దిట్ట! మూడు దశాబ్దాల విజయవంతమైన సినీజీవితంలో అశేష ప్రజాభిమానం సొంతం చేసుకుని.. సామాజిక సేవారంగంలో విశిష్ఠపాత్ర పోషిస్తూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతమై.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు! విజయానికి మారుపేరుగా నిలిచాడు! సినిమా.. సామాజిక సేవ.. రాజకీయం!! మూడు రంగాల్లోనూ ఎగసిన కెరటం! ఒకే మనిషిలో ముగ్గురు మొనగాళ్లను నింపుకున్న వ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం పేరే... చి..రం..జీ..వి..!

చిరంజీవి అసలు పేరు శివ శంకర వరవూపసాద్. నర్సాపురం సమీపంలోని చిన్న పల్లెటూరైన మొగల్తూరులో 1955 ఆగస్ట్ 22 న జన్మించారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివిన చిరంజీవి.. నర్సాపురంలోని వైఎన్‌ఆర్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. తర్వాత సినిమాల్లో చేరాలని భావించినప్పుడు ఆయన తండ్రి ముందు చదువుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఉభయతార కం అన్నట్లు మద్రాస్ వెళ్లి ఐసీడబ్ల్యూ కోర్సులో చేరిన చిరంజీవి.. సమాంతరంగా నటనలో శిక్షణ పొందారు. 1976లో ఆయన మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. పునాదిరాళ్లు సినిమాలో దర్శకుడు రాజ్‌కుమార్ అవకాశం ఇవ్వడంతో మొదటిసారి చిరంజీవి మొఖానికి రంగు వేసుకున్నారు. ఆ నిర్మాత క్రాంతికుమార్ కే వాసు దర్శకత్వంలోని ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం ఇ చ్చారు. తొలి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ.. ప్రాణం ఖరీ దు మొదట విడుదలైన సినిమా. తొలి సినిమాకు ఆయనకు లభించింది వెయ్యి నూటపదహార్లు. కుటుంబంలో ఆంజేయస్వామిని పూజించేవారు. దాంతో స్క్రీన్‌నేమ్‌గా తల్లి సలహా మేరకు చిరంజీవి అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాలే కాకుండా పలు తమి ళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 149సినిమాల్లో నటించిన చిరంజీవి.. అనేక విభిన్నమైన పాత్రలను పోషించారు. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు, విలన్ పాత్రలు వేసిన చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఖైదీ సినిమా పూర్తిగా మార్చివేసింది.
reel
చిరంజీవి ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సుప్రీం హీరోగా మొదలైన ఆయ న ప్రస్థానం.. మెగాస్టార్‌కు చేరుకుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేసరికే ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజాలు యూత్ కారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో సైతం తన సత్తా నిరూపించుకున్నాడు చిరంజీవి. వారందరి ఉత్తమ మేళవింపుగా తెలుగు సినీ రంగానికి అందివచ్చాడు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు కమల్‌హాసన్. మాస్ స్టైల్ కింగ్ రజనీకాంత్.. ఆ ఇద్దరినీ తనలో నింపుకున్న నటుడని సీనియర్ దర్శకుడు కే బాలచందర్ చేసిన వ్యాఖ్య చిరంజీవి నటనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిపోతుంది. ఫిలింఫేర్ మ్యాగజీన్ చిరంజీవిని ఉద్దేశించి.. బిగ్గర్ దేన్ బచ్చన్ అని సంబోధించినా.. ది వీక్ మ్యాగజైన్ ఆయనను న్యూ మనీ మిషన్ అని అభివర్ణించినా.. అది ఆయన ప్రజాదరణనే చాటుతుంది.

1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవికి వివాహం జరిగింది. అప్పటికి చిరంజీవి చేసిన సినిమాలు 11 మాత్రమే. మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సందర్భంగా చిరంజీవిని చూసిన అల్లు.. అప్పుడే ఆయనను అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరి వివాహానికి ఎన్టీరామారావు ముఖ్య అతిథిగా వచ్చారు. వీరికి కుమ్తాలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్ తేజ ఉన్నారు. రాంచరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన హీరోగా ఎదుగుతున్నాడు. చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా సినీరంగంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇం డస్ట్రీలో అత్యధిక పరిహారం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.

బాపూ దర్శకత్వంలో రూపొందిన మనవూరి పాండవులు చిత్రంతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. ఐ లవ్ యూ, ఇది కథ కాదు, 47 రోజులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. 1979లో ఎనిమిది సినిమాలు చేసిన చిరంజీవి.. మ రుసటి సంవత్సరం 14 సినిమాలు చేశారు. 1981లో న్యాయం కావాలి సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అభిలాష వంటి సినిమాలతో మళ్లీ కథానాయకుడిగా తెరపైకి వచ్చారు. ఇంట్లో రామయ్య, వీధి లో కృష్ణయ్య సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1982లో కే విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన శుభలేఖ చిత్రానికిగాను చిరంజీవికి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి సినీ ప్రస్థానం దిశను మార్చివేసింది. సిల్వెస్టర్ స్టల్లోన్ హీరోగా వచ్చిన హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ సినిమా ఆధారంగా తీసిన ఖైదీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. చిరంజీవికి యాక్షన్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. 1983 చివరి నాటికి ఆయన చేసిన సినిమాలు 60కి చేరుకున్నాయి.

 ఆ తర్వాత మూడేళ్ల కాలంలో క్రమక్షికమంగా అగ్రహీరోగా ఎదిగాడు చిరంజీవి. అందు కు మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, చాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి సినిమాలు ఇందుకు దోహదం చేశాయి. విజేత సినిమా కోసం 1985లో ఆయన తన మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 1987లో పసివాడి ప్రాణం సినిమా హిట్ తో చిరంజీవి స్టార్‌డమ్ అందుకున్నారు. ఈ సినిమాతో కొత్త నృత్య ఒరవడి ‘బ్రేక్ డ్యాన్స్’ను చిరంజీవి చేశారు. ఈ తరహా డ్యాన్స్‌కు ఆయన పెట్టింది పేరుగా మారారు. అంతకుముందే దొంగ సినిమా కోసం మైఖేల్ జాక్సన్ ఆల్బం థ్రిల్లర్‌లోని నృత్యాన్ని చేశారు. అది ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. 1987లో స్వయం కృషి సినిమాకు గాను ఆయన తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటికే స్టార్‌డమ్ అందుకున్న సుప్రీం యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవి ఒక లోప్రొఫైల్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం విశేషం. తాను ఎలాం టి పాత్రనైనా చేయగలనని ఈ సినిమా ద్వారా చిరంజీవి నిరూపించుకున్నారు.

ఖైదీ తర్వాత అయన అనేక హిట్లు కొట్టారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ, కొదమసింహం, రాజా విక్రమార్క, గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు వంటి భారీ హిట్లు నమోదు చేశారు. పది కోట్లకు మించిన రెవెన్యూ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘరానా మొగుడు రికార్డు సృష్టించింది. శ్రీదేవితో జతకట్టిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అద్భుతమైన సోషియోఫాంటసీ సినిమాగా నిలిచిపోయిం ది. చిరంజీవి సినిమాల్లో ఒకానొక అత్యుత్తమమైన సినిమాగా ఇప్పటికీ చెక్కుచెదరని స్థానం పొందింది. చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసేనాటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులకు విపరీతమైన ప్రజాదరణ ఉండేది. ఆ సమయంలో చిరంజీవి తనదైన శైలిలో స్టెప్పులు వేయడం, మునుపు చూడని పద్ధతుల్లో సాహసోపేతమైన స్టంట్స్ చేయడం ఆయనకు క్రమేణా అగ్రస్థానం కల్పించింది. సంఘర్షణ చిత్రం షూటింగ్ సమయంలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంటిగుట్టు సినిమాలో ట్యూబ్‌లైట్ పట్టుకుని పోరాడే సమయంలో కూడా గాయపడ్డారు. దొంగ సినిమాలో 11అంతస్తుల భవనం గోడపై నిలబడి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తాయి. బావగారు బాగున్నారా చిత్రం కోసం ఒక టీనేజ్ పిల్లాడి మాదిరిగా బంగీజంప్ చేసి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు ఆయన తెలుగు సినీరంగంపై ఏకఛవూతాధిపత్యం వహించారనడంలో సందేహం లేదు. చిరంజీవి సహ నిర్మాతగా రూపొందిన రుద్రవీణ చిత్రం జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు అందుకుంది.

అవార్డులు కోకొల్లలు

చిరంజీవికి అవార్డులు కోకొల్లలు. తెలుగులో ఏ సినీ హీరోకూ లభించని స్థాయిలో పది ఫిలింఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

ప్రతిఘటన సినిమాకు రీమేక్‌గా హిందీలో ప్రతిబంధ్ (1990) ద్వారా హిందీలోనూ విజయం సాధించారు చిరంజీవి. ఆజ్‌కా గూండారాజ్ (గ్యాంగ్‌లీడర్), జెంటిల్మన్ సినిమాలతో బాలీవుడ్‌లోనూ తనకు అభిమానం ఉందని రుజు వు చేసుకున్నారు. ఆపద్భాంధవుడు సినిమాలో నటనకు గాను ఆయనకు రెండో సారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించింది. 1990వ దశకంలో కొన్ని అపజయాలు ఎదురైనా.. తిరిగి నిలదొక్కుకున్న చిరంజీవి.. 1997లో హిట్లర్‌తో తెలుగు సినీ రంగానికి రారాజు తానేనని నిరూపించుకున్నారు. మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వంటి సినిమాలు ఆయన నటనా కౌశలాన్ని చాటాయి. 1999లో హాలీవుడ్‌లో కూడా చిరంజీవి అడుగుపె ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా సెట్లపైకి వెళ్లినా.. తెలియని కారణాలతో నిలిచిపోయింది.

చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్య సినిమాతో పునఃవూపారంభమైంది. ఈ సినిమా సూపర్‌హిట్ కొట్టింది. 2002లో వచ్చిన ఇంద్ర సినిమా అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడోసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. సామాజిక కోణంలో వచ్చిన ఈ సినిమా తర్వాత ఇదే కోణంలో ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ వంటి సినిమాలు చిరంజీవి స్థానం ఎవరూ కదల్చలేనిదని నిరూపించాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ఆయనకు ‘లెజెండ్’ పురస్కారం అందజేసి.. తెలుగు సినీ పరిక్షిశమ తనను తాను గౌరవించుకుంది. పెద్ద సినిమా కుటుంబ నేపథ్యం, గాడ్‌ఫాదర్‌లు లేకుండానే చిరంజీవి సాధించిన విజయాలు.. నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో ఒక హీరో అలా ఎదగడాన్ని కనీసం ఊహించలేం.

- T News

Read more...

Tuesday, October 23, 2012

రగిలిన రాజోలి

-బాబుకు అడుగడుగునా నిరసనసెగ
-ఉద్రిక్తంగా మారిన ‘వస్తున్నా మీకోసం’
-కోదండరాం, స్వామిగౌడ్ తదితరుల అరెస్టు
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు
-అరెస్టులపై మండిపడిన తెలంగాణవాదులు
-బాబు వెంట 300 వాహనాల్లో ప్రైవేటు సైన్యం
-పొరుగు జిల్లాల నుంచి భారీగా సమీకరణలు


రాజోలి రగిలింది. తెలంగాణపై వైఖరి చెప్పని చంద్రబాబుకు.. ప్రత్యేక సెగను అంటించింది. తెలంగాణ పోరు పౌరుషాన్ని మరోసారి చాటింది. చంద్రబాబు పాదయావూతను అడుగడుగునా అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తన సీమాంధ్ర బుద్ధి చాటుకున్న సర్కారు.. సంప్రదాయం ప్రకారం సీమాంధ్ర నేత పర్యటనకు తెలంగాణలో నీడలా ఉండి భద్రత కల్పించడమే కాకుండా.. పాదయావూతకు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసింది. బాబు యాత్రకు అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. దానికితోడు చంద్రబాబు పర్యటన కోసం 300 వాహనాల్లో పొరుగు జిల్లాల నుంచి తరలించిన ప్రైవేటు సైన్యం అండగా నిలిచింది. దాంతో చంద్రబాబు రాజోలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

బాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీజేఏసీ నేతలు కోదండరాం, స్వామిగౌడ్ తదితరులను రాజోలికి చేరుకోకముందే వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై జిల్లావ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారిని విడుదల చేయాలని జిల్లాలో ఆందోళనలు జరిగాయి. 44వ నంబరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేశారు. చివరకు సాయంవూతానికి నేతలను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటలపాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

( మహబూబ్‌నగర్) :వస్తున్నా మీకోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసన సెగలు తాకాయి. ఆయన పర్యటనను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు పాదయావూతకు ఆటంకాలు లేకుండా చూసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్నది. సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా జిల్లాలో ప్రవేశించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని చంద్రబాబుకు నిరసన తెలియజేస్తామని టీ జేఏసీ నేతలు, తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే తెలంగాణవాదులను బయటకు వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు. చంద్రబాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు మాదిగ దండోర నాయకులు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సమయంలో పోలీసులు దండోరా నాయకులను చెదరగొట్టారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరాంతో సహా జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. జై తెలంగాణ, చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా జిల్లాలో వామనపాదం మోపేందుకు వస్తున్న చంద్రబాబునాయుడిని అడ్డుకోమని, కేవలం నిరసనలు, నిలదీతలు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణపై మోసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబును నిలదీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. నిరసన తెలిపేందుకే రాజోలి వెళుతున్న తమను అడ్డుకోవడం సీమాంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ రాకుండాపోదని కోదండరాం చెప్పారు. రోడ్డుపై బైఠాయించిన జేఏసీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం డీసీఎంలో ఉంచి మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని ప్రకటించారు.

కానీ కొత్తకోట మీదుగా ఆత్మకూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై కోదండరాం ఉన్న డీసీఎంను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూర్ తీసుకెళ్ళాల్సిన పోలీసులు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, వేదకుమార్, టీఎస్ జేఏసీ నాయకుడు కరాటే రాజు మరి కొందరిని కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ నేతలను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టడంతో జేఏసీ నేతలు రాస్తారోకో విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటల పాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. కోదండరాం, ఇతర జేఏసీ నేతల అరెస్టును తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి ఖండించారు.

సోమవారం ఉదయం నుంచి మక్తల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల తదితర ప్రాంతాలలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌డ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినా.. తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.


- T News

Read more...

Monday, September 17, 2012

సెప్టెంబర్ 17 తెలంగాణం

 pidikili2హైదరాబాద్, సెప్టెంబర్ 16 ):
1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో దోబూచులాడాయి..!

 బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..! దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!

దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది. నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా..

ఇదీ చరిత్ర...
బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం చేయాల్సిందేనని నినదించారు.

ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు అమరులయ్యారు.

గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్‌ప హైదరాబాద్‌ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా హైదరాబాద్‌ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్‌కు ఏడాదిపాటు హైదరాబాద్‌ను పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్‌ప ఆశచూపించారు.

ఆ క్రమంలో జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను ఇండియన్ యూనియన్‌లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ ప్రమాణం చేయించారు.

ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్‌లో 1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

‘సమైక్య’ కుట్ర..:నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంవూధలో కలిపేశారు. దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట తెలంగాణను అణచివేస్తూనే ఉంది.


Take By: T News

Read more...

Tuesday, September 4, 2012

నెల్లూరులో బ్లడ్ మాఫియా! blood_mafiya

-ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా బ్లడ్ బ్యాగ్‌ల తరలింపు
-అర్ధరాత్రి పట్టుకున్న స్థానికులు.. విచారణకు ఆదేశించిన కలెక్టర


 : నెల్లూరులో బ్లడ్ ఫియా రెచ్చిపోతోంది..! బ్లడ్ బ్యాగ్‌లను ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటుంది. ఈ దందా గుట్టు ఆదివారం రాత్రి రట్టయింది. నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా ఈ మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం అర్ధరాత్రి 100 బ్లడ్ బ్యాగ్‌లను నెల్లూరు ప్రభుత్వాస్పత్రి రక్తనిధి కేంద్రం టెక్నీషియన్ ప్రదీప్ కుమార్, ఉస్మానియా ఆస్పవూతిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మరగంటి వెంక తరలించుకుపోయేందుకు సిద్ధమయ్యారు. వారిని కొందరు టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సరిగ్గా ఏడాది క్రితం నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో బాలింతకు ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవీ కణాలుండటంతో అప్పట్లో రక్తం పంపిణీపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు ఏడాదిపాటు సాగిన విచారణ అనంతరం ఇటీవలే నెల్లూరు రెడ్ క్రాస్‌కు నూతన కమిటీని వేసి, ఆ రక్తనిధి కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించారు.

ఇదే సమయంలో నెల్లూరు ప్రభుత్వాస్పవూతికి చెందిన బ్లడ్ బ్యాంకు రక్తాన్ని ఆస్పత్రి టెక్నీషియనే తరలించుకుపోవడం, ఇందుకు ఉస్మానియా ఆస్పత్రి టెక్నీషియన్ కూడా సహకరించడం పలు అనుమానాలు తావిస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు మాఫియా విస్తరించి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా, పట్టుబడ్డ రక్తం గత నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల నుంచి సేకరించింది.

Take By: T News

Read more...

Wednesday, February 8, 2012

సిండికేట్లకే బందిపోట్లు



mopidevi talangana patrika telangana culture telangana politics telangana cinema మంత్రి మోపిదేవికి పది లక్షలిచ్చా.. బాంబు పేల్చిన ఖమ్మం లిక్కర్ డాన్
-ఎక్సైజ్ అధికారులు మొదలు కామ్రేడ్ల దాకా
-విలేకరులకూ లంచాలిచ్చిన మద్యం వ్యాపారి
-తిలాపాపం తలా కొంత పంపిణీ!
-రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వెల్లడి
-ఇది ఒక్క జిల్లాలోనే.. ఇతర జిల్లాల్లో?
-రాజకీయ పార్టీల్లో పెను సంచలనం
-నష్టనివారణ చర్యల్లో పార్టీలు
-ఎందుకు తీసుకున్నామంటే...
-వివరణలు ఇచ్చేందుకు పోటీలు

హైదరాబాద్, మహబూబాబాద్, ఫిబ్రవరి 7 () :మద్యం మంత్రికి పది లక్షలు.. రాజకీయ నాయకులకు వారి వారి స్థాయి, హోదాలను బట్టి యాభై వేలు మొదలు లక్ష, రెండు లక్షలు ఐదు లక్షలు! పదివేలు, పాతికవేలతో సర్దుకుపోయినవారూ ఉన్నారు! అధికారులు భారీగా గుటుక్కుమనిపించారు. విలేకరులూ తగ్గలేదు! ఇది మద్యం వ్యాపారం, రాజకీయ నాయకత్వం కలిసి మెలిసి సహజీవనం చేస్తున్నాయనడానికి తాజా తార్కాణం. నిలు దర్శనమిచ్చిన నగ్నసత్యం! మద్యం వ్యాపారంలో లొసుగులు బయటపడకుండా ఉండేందుకు.. అక్రమంగా అధిక ధరలకు అమ్మేసుకుంటున్నా.. నోరు మెదపకుండా ఉండేందుకు.. లంచాల రూపంలోనైతేనేమి.. చందాల పేరుతోనైతేనేమి.. తిలాపాపం తలా కొంచెం! ముడుపులు ముట్టాయి! ఇది ఖమ్మం జిల్లా లిక్కర్ కింగ్ నున్నా రమణ బయటపెట్టిన సత్యం! అవినీతి నిరోధక శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో లిక్కర్ డాన్ చదివిన మద్యం పద్దుల చిట్టా! ఉరుములేని పిడుగులా వచ్చి పడిన బాంబుతో భీతిల్లిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. తాము ఆ వ్యాపారి నుంచి ఎందుకు ఆ మొత్తాలు తీసుకున్నామో వివరణలు ఇస్తున్నాయి! మొత్తానికి.. డబ్బులు తీసుకున్నది నిజమేనని అంగీకరించాయి!

మద్యం సిండికేట్ల వెనుక పొలిటికల్ గాడ్‌ఫాదర్లు ఉన్నట్టు వచ్చిన వార్తలకు బలం చేకూరింది. ఖమ్మంలో మద్యం సిండికేట్లకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ సంబంధం బట్టబయలైంది. సిండికేట్ల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు గాను ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తాను స్వయంగా పది లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానని లిక్కర్ డాన్ నున్నా రమణ సంచలనం రేపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్‌లో ఖమ్మంలోని చంద్రవైన్స్ యజమాని బాలాజీ, మంత్రి క్లాస్‌మేట్ అయిన రాజబాబుతో కలిసి ఈ సొమ్ము అందించినట్లు ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. మంత్రితో పాటు ఖమ్మం జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులకు, ఎక్సయిజ్ అధికారులకు లక్షల్లో ఇచ్చానని, విలేకరులకు కూడా ముడుపులు చెల్లించానని తెలిపాడు. రమణను మంగళవారం కోర్టులో హాజరుపర్చినప్పుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో.. రమణ ఎవవరికి ఎంతెంత సొమ్ము ఇచ్చారో ఆ వివరాలన్నింటినీ ఏసీబీ పేర్కొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించిన సమయంలోనే కొందరు మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో లిక్కర్ కింగ్ రమణను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.

ఈయన వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వ్యక్తి. రమణను ఏసీబీ అధికారులు విచారించగా పలు సంచలనాత్మక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలను పొందుపరుస్తూ ఏసీబీ వరంగల్ జిల్లా డీఎస్పీ టీపీ విఠలేశ్వర్ రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 0/ఏసీబీ-డబ్ల్యూకేహెచ్/2012 ప్రకారం అఫెన్స్ యూ/ఎస్ 7, , 12, 13(1)(ఏ) అండ్ (0) ఆర్/డబ్ల్యూ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 19 అండ్ సెక్షన్స్ 120-బీ, 34 అండ్ 109 ఐపీసీ సెక్షన్ల ప్రకారం డీఎస్పీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రమణకు పది మద్యం సిండికేట్లలో 29 మద్యం దుకాణాలు ఉన్నాయని, వీటన్నింటినీ రమణ బినామీ పేర్లతో 2010, జూలైలో తీసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. టెండర్ల సమయంలో ఎక్కువ ధరలకు వేర్వేరు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు.. ఆ తర్వాత గరిష్ఠ చిల్లర ధరకన్నా ఎక్కువ రేట్లకు మద్యాన్ని విక్రయిస్తూ కోట్లుకొల్లగొట్టారు. ఎమ్మార్పీ రేట్లకన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు జరిపినా కేసులు నమోదు చేయకుండా ఎక్సయిజ్, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తాల్లో మామూళ్లు ముట్టజెప్పారు.

లైసెన్సులు దక్కించుకున్న తరువాత సిండికేట్‌గా ఏర్పడుతూ అక్రమాలకు తెర తీస్తున్నారు. అకౌంట్స్ బాధ్యతలను ఒకటి రెండు మద్యం దుకాణాల యజమానులకు అప్పగిస్తున్నారు. వీళ్లే సిండికేట్‌లోని ఏయే వైన్‌షాపులు ఎంతెంత సరుకు కొనుగోలు చేశాయి? ఎంతవిక్రయాలు జరిపాయి? అన్నది రికార్డు చేస్తారు. అనంతరం వచ్చిన స్థూల లాభాలను లెక్క తేలుస్తారు. ఈ లాభాల్లో నుంచి ఆయా షాపుల లైసెన్స్ ఫీజులను ప్రభుత్వానికి చెల్లిస్తారు. రోజువారీ నిర్వహణ ఖర్చులు, మామూళ్లు తీసివేసి నికర లాభాలు తేలుస్తారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టు ప్రకారం ఆయా అధికారులకు ప్రతినెలా నిర్ణీత మొత్తంలో మామూళ్లు మద్యం వ్యాపారుల నుంచి వెళుతున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, వైరా, పాల్వంచ, భద్రాచలం, ఏదులాపురం, గార్ల, కారేపల్లి, విశ్వనేతపల్లి, కొత్తలింగాల, బోనకల్లు, కల్లూరు, ముదిగొండ తదితర ప్రాంతాలతోపాటు వరంగల్, ఇతర జిల్లాల్లో అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు రమణ విక్రయిస్తున్నాడని తెలిపారు. అందుకోసం అధికారులు, ప్రజావూపతినిధులకు మామూళ్ల రూపంలో నెలనెలా నగదును ముట్టచెబుతున్నాడని వెల్లడించారు.

రమణ 29 మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానూ, 0 దుకాణాల్లో పరోక్షంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. రాజకీయ నాయకుల విషయానికొస్తే.. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు రూ.5లక్షలు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్షికసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావుకు రూ.4.5 లక్షలు, సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌కు రూ.3 లక్షలు, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు రూ.3 లక్షలు, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్యకు రూ.3 లక్షలు చెల్లించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

మామూళ్లు నిర్ణయించేది నేనే!
ఎవవరికి ఎంతెంత మామూళ్లు ఇవ్వాలన్నది తానే నిర్ణయించినట్టుగా రమణ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. 2010, జూలై 1వ తేదీ నుంచి 2010, సెప్టెంబరు 31వ తేదీ మధ్య మూడు నెలల కాలానికి ఎక్సయిజ్ ఎస్‌ఐ మహేంవూదకుమార్‌కు రూ.1,44,495 ఇచ్చినట్టు తెలిపాడు. ఈ మొత్తాన్ని ఎక్సయిజ్ సీఐ డీఎస్‌నాథ్, సూపరింటెండెంట్ మధుసూదన్‌రావులు పంచుకున్నట్టు చెప్పాడు. ఇక, రమణ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో కొత్తగూడెంలోని ఎంజే వైన్స్ యజమాని జనార్ధన్‌డ్డి తరఫున కొత్తగూడెం డీఎస్‌పీ దేవదాస్‌నాగుకు 2011లో రూ.50వేలు మామూళ్ల కింద ఇచ్చినట్టు తేలింది. గోల్డెన్ వైన్స్, సాయి సుధ వైన్స్‌కు చెందిన సుబ్బారావు, షాజీరావుల తరఫున ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌కు రూ.24వేలు, ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ మహేంవూదకుమార్‌కు రూ.12వేలు, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు రూ.12వేలు ముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక షాజీరావు తరఫున ఖమ్మం ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు మూడు దఫాలుగా రూ.36వేలు, రూ.1వేలు, రూ.1వేలను ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ ద్వారా పంపించినట్టు రమణ తెలిపాడు. ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్‌కు ఎనిమిది వైన్‌షాపుల నుంచి రూ.96వేలు అందినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.

మద్యం వ్యాపారులు సుబ్బారావు, షాజీరావుల నుంచి నాలుగు వైన్‌షాపుల తరఫున రూ.60వేలను ఎక్సయిజ్ ఎస్‌ఐ మహీందర్‌కుమార్ మామూళ్లుగా తీసుకుని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు అందచేసినట్టుగా వెల్లడించారు. ఖమ్మంలోని భ్రమరాంబ వైన్స్ కౌంటర్ ఇన్‌చార్జిగా ఉన్న రాజు నుంచి ఎక్సయిజ్ ఎస్‌ఐ ప్రతాప్ నెలకు రూ.12వేలను లంచంగా తీసుకుంటూ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌కు అందచేస్తున్నట్టుగా తేలింది. వైరా ఎక్సయిజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమ.. శ్రీదుర్గ వైన్స్, భ్రమరాంబ వైన్స్‌లో కౌంటర్ ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న రాజు, మురళి నుంచి నెలకు రూ.6వేల చొప్పున వసూలు చేసి ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌రావుకు చేరుస్తున్నట్టు పేర్కొన్నారు. సిండికేట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న రమణ.. మద్యం వ్యాపారంతోపాటు గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు అతనిపై మూడు కేసులు కూడా నమోదై ఉన్నట్టు తేలింది. రమణ గతంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి, తర్వాతి కాలంలో ఈ దందాలోకి దిగాడు. ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ఎస్‌ఐ మహింవూదకుమార్, వైరా ఎక్సయిజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమలు మద్యం దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేసి పై అధికారులకు అందచేస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.

నిరాధార ఆరోపణలు...
తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో చెప్పారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తి తనపై ఆరోపణలు చేయటం వెనక కుట్ర ఉందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితో చర్చించనున్నట్టు తెలిపారు. విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంవూతిని కోరుతానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని విచారణలో తేలితే మంత్రి పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

ఎవరికెంత?
మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత: రూ.5 లక్షలు
పోటు రంగారావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి): రూ.4.5లక్షలు
పోతినేని సుదర్శన్ (సీపీఎం జిల్లా కార్యదర్శి): రూ.3 లక్షలు
పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ నేత): రూ.3 లక్షలు
విజయసారధి (సీపీఐ నేత): రూ.40వేలు
సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి ఎమ్మెల్యే): రూ.3లక్షలు
ఏ సమ్మిడ్డి (సాక్షి బ్యూరో మాజీ): రూ.60 వేలు
శ్రీనివాస్‌డ్డి (ఈనాడు బ్యూరో మాజీ): రూ.60 వేలు
మధుసూదన్ (ఆంవూధజ్యోతి బ్యూరో) : రూ.0 వేలు
దండి భాస్కర్ (వార్త రిపోర్టర్) : రూ.40 వేలు
దిండిగాల రాజేందర్ (టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్) : రూ.60వేలు
శ్రీనివాస్ (సీపీఎం నేత) : రూ.40వేలు

Take By: T News

Read more...

Friday, February 3, 2012

'సర్కారు’ కరెంటు బకాయిలు వెయ్యి కోట్లు!



vidyut talangana patrika telangana culture telangana politics telangana cinema -నిధుల్లేక చేతుపూత్తేస్తున్న శాఖలు
-కనెక్షన్లు కత్తిరిస్తున్న డిస్కమ్‌లు
-అంధకారంలో సంక్షేమ హాస్టళ్లు,స్కూళ్లు, పీహెచ్‌సీలు
-తాగునీటి పథకాల బోర్లకూ కట్
-నీటి కోసం అల్లాడుతున్న పల్లెలు

హైదరాబాద్, ఫిబ్రవరి 2 ():ఆ స్కూళ్లో బోరుంది! కానీ.. గొంతు తడుపుకుందామంటే విద్యార్థులకు గుక్కెడు నీళ్లు కరువు! కారణం.. కరెంట్ కనెక్షన్ కత్తిరించడమే! అదో సంక్షేమ హాస్టల్! తమ పిల్లలను చదివించే ఆర్థిక స్థోమతలేని పేద తల్లిదంవూడులకు ఇవి ఆశాదీపాలు! కానీ ఇప్పుడవి అంధకారంలో మగ్గుతున్నాయి! ఆ విద్యార్థులకు గ్యాస్8నూనె దీపం వెలుతురులే గతి! కారణం.. కరెంట్ కనెక్షన్ కత్తిరించడమే! అదో ప్రభుత్వ ఆస్పత్రి! పేదల పాలిట సంజీవని! కానీ..సెల్‌ఫోన్ లైట్ వెలుగులోనే డాక్టర్లు సూదిమందు వేస్తున్నారు! టార్చిలైట్ వెలుతురులోనే రోగులను పరీక్షిస్తున్నారు! దీనికి కారణం కూడా.. కరెంట్ కనెక్షన్‌ను కత్తిరించడమే! ఇక గవర్నమెంట్ ఆఫీసుల సంగతి చెప్పనక్కర్లేదు! ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో నెలకొన్న దుస్థితి. గత ఆరు నెలలుగా ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ బకాయిలు రాకపోవడంతో డిస్కమ్‌లు వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాయి. కరెంటు వైర్లను కత్తిరిస్తున్నాయి. ఫలితంగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోతున్నాయి. సంక్షేమ హాస్టళ్ళు, పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అంధకారంలో మగ్గుతున్నాయి. బడ్జెట్‌లో ప్రభుత్వ శాఖలకు వందల కోట్ల కేటాయింపులు జరుగుతున్నా చిట్టచివరకు కరెంటు బిల్లులకే నిధులు లేని దుస్థితి నెలకొనడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వెల్లు ఆర్థికభారం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు.. వందకు వంద శాతం విద్యుత్ చార్జీల వసూళ్లు ఉండేలా సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి.

అయితే ప్రభుత్వ శాఖలకు సంబందించిన బకాయిలే ఎక్కువ మొత్తంలో పేరుకుపోయి ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో వాటికి సరఫరా నిలిపివేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.567.63 కోట్ల మేరకు కరెంటు బిల్లుల బకాయిలు ఉండడం గమనార్హం. తదుపరి స్థానంలో రూ.154.13 కోట్లతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిలిచింది. ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు వినియోగానికి సంబంధించి రూ.122 కోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా ఆయా శాఖల నుంచి దాదాపు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోయాయి. వాస్తవానికి రాష్ట్రస్థాయిలో సంబంధిత శాఖలు కరెంటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి నిధుల సర్దుబాటుచేయాల్సి ఉన్నా కొన్ని నెలలుగా ప్రభుత్వానికి పట్టించుకోవ మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధుల మంజూరులో ఆర్థిక శాఖ అనేక కొర్రీలు వేసే అవకాశాలు ఉంటాయి. దాంతో ఆయా శాఖల బకాయిల చెల్లింపులు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఎంతటి వారైనా వాటికి విద్యుత్ సరఫరాను తొలగించాలని డిస్కం యాజమాన్యాలు అధికారులను ఆదేశించాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా వీధి దీపాలు వెలగడం లేదు. తాగునీటి పథకాల బోర్లు పని చేయడం లేదు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో 21,806 గ్రామ పంచాయతీలుండగా, వాటిలో 1,247 మేజర్ గ్రామపంచాయతీలు, 20,559 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఆదాయవనరులు అంతంతమావూతంగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలకు నిత్యం కరెంటు వాడకం అవసరం కావడం వల్ల బిల్లుల చెల్లింపుల్లో గతంలో ప్రభుత్వం కొంత వెసలుబాటును కల్పించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పంచాయతీల కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వం అశ్రద్ధ వల్ల వేలల్లో, లక్షల్లో ఉన్న విద్యుత్ బిల్లులు కాస్తా వందల కోట్లకు చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

bakai tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు

-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు



DSC_8486-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్‌లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించారు.

సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్‌ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్‌లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు

నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.

ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్‌రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.

తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్‌లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్‌గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .

తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్‌లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.

తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం

Telangana History 

Read Part - 1 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

Read Part - 3 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html


Take By: T News .

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP