Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Nizam HISTORY. Show all posts
Showing posts with label Nizam HISTORY. Show all posts

Sunday, December 23, 2012

రాజుల సొమ్ము..కేసుల పాలు (వారసత్వ పోరులో నలుగుతున్న వేల కోట్ల నిజాం ఆస్తులు)

ఆస్తులపై ఎవరి వాదనలు.. వారివే..
తమకే చెందుతాయంటూ ముందుకొచ్చిన 500 మంది..
ఒకరిపై ఒకరు వ్యాజ్యాలు.. కేసులు..
ముకరం జా ఆస్తుల్లో వాటాల కోసం భార్యా పిల్లల పోటీ

వేల ఎకరాల్లో భూములు.. ఒక్క హైదరాబాద్‌లోనే 630 ప్యాలెస్‌లు.. దేశంలో అనేక చోట్ల భవంతులు.. క్వింటాళ్ల కొద్ది వజ్ర, వైఢూ ర్యాలు... ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకప్పటి నంబర్ వన్, చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్తుల చిట్టా ఇదీ! హైదరాబాద్ కేంద్రంగా 37 సంవత్సరాల సుదీర్ఘ పాలనతో దక్కన్‌లో ఆధునికతకు బాటలు వేసి, ఆపరేషన్ పోలోతో భారత సైన్యాలకు తలవంచిన ఈ నిజాంకు చెందిన అపార సంపద అంతా వివాదాలమయం!!

సాక్షి, హైదరాబాద్: కళ్లు బైర్లుకమ్మే ఆభరణాలు, ఆస్తులు నిజాం కుటుంబానికే చెందుతాయంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ 1947, నిజామ్స్ ట్రస్ట్ వాలిడేషన్ యాక్ట్ 1950) నిజాం పరివారంలో వెలుగులు నింపినా.. ‘వారసత్వ పోరు’తో అవి కాస్త మసకబారాయి. ఆ ఆస్తులకు వారసులం తామంటే.. తామంటూ వారసులు అమీతుమీకి సిద్ధమయ్యారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్(1886-1964) అనంతరం ఆయన కుమారులు ఆజం జా, మోజం జాల తరం వరకు గుట్టుగా జీవనం సాగించిన నిజాం వారసులు.. ఆస్తుల వివాదంతో మరోసారి తెరపైకొచ్చారు. ఆజం మొదటి కుమారుడు 8వ నిజాం హైదరాబాద్ ప్రిన్స్ ముకరం జా (79)... తన భార్యలు, వారి పిల్లలతో ఆస్తి వివాదాల్లో మునిగి తేలుతుండగా.. ఆజం మరో కుమారుడు ముఫకం జా తన తోబుట్టువులు, వారి పిల్లలతో పంచాయతీల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ అలీఖాన్.. ఆయన వారసులు-వివాదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...


హైదరాబాద్ విలీనం సమయంలో ఏం జరిగింది..?

1911 నుండి 1948 వరకు హైదరాబాద్ కేంద్రంగా రాచరిక పాలన చేసిన ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను ఓ స్వతంత్య్ర రాజ్యంగానే ఉండాలని కోరుకున్నారు. కానీ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత సైన్యాలు చేసిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయక తప్పలేదు. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనానికి ప్రతిఫలంగా అలీఖాన్ భారత ప్రభుత్వంతో ఒప్పందం (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు. నిజాంకు చెందిన ఆస్తుల జోలికి వెళ్లమని, తన సొంతమని భావించే ఆస్తులకు సంబంధించి చట్టపరమైన రక్షణలు ఇస్తామని నాడు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఇందులో భాగంగానే నిజాం సమర్పించిన తన ప్రైవేటు ఆస్తుల చిట్టా ‘బ్లూ బుక్’ను ఆమోదిస్తూ 1950 జనవరి 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూరా ఉన్న 23 వేల ఎకరాల (సర్ఫెఖాస్) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, మహేబలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న 630 భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ వెంకటాచారి ఉత్తర్వులు వెలువరించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చౌమహల్లా, ఫలక్‌నుమ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా, ఫెర్న్ విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ప్లజెంట్ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర , వైఢూర్యాలు నిజాం కుటుంబం సొంతమయ్యాయి. అయితే ఈ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా చేర్చింది. ఫలితంగా 28 రకాల ట్రస్ట్‌లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, నిజాం కుటుంబ సభ్యులతో పాటు మాజీ సివిల్ సర్వీసు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

వారసులు వచ్చారిలా..

నిజాంకు సంబంధించి దాదాపు 90 శాతం ఆస్తులు న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయి. తాజాగా 8వ నిజాం ముకరం జా (ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఆజం జా మొదటి కొడుకు) మూడో మాజీ భార్య మనోల్యా ఒనూర్, ఆమె కూతురు నీలోఫర్‌లు.. చిరాన్ ప్యాలెస్ తమకే వస్తుందని ప్రకటించారు. మరోవైపు తన వాటా కింద ముఫకం జా ట్రస్ట్ అధీనంలో ఉన్న మౌంట్‌ప్లజెంట్ (ముఫకం జా కాలే జీ) వస్తుందంటూ ముఫకం జా (ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు) కోడలు సఫియా సఖీనా కోర్టును ఆశ్రయించారు. దక్షిణ ముంబై మలబార్‌హిల్స్‌లోని రూ.400 కోట్ల విలువ చేసే 5,000 గజాల స్థలానికి వారసులం తామేనంటూ జమీన్ అలీఖాన్, కుద్రత్, ఫిర్సాత్ అలీఖాన్‌లు ముంబై కలెక్టర్‌కు ఇటీవలే లేఖ రాశారు. ఇందుకు తీవ్ర అభ్యంతరం చెబుతూ 8వ నిజాం ముకరం జా కలెక్టర్‌కు మరో లేఖ సంధించారు. ఇవిగాకుండా నిజాం ప్రైవేటు ఆస్తిగా పేర్కొనే సర్ఫేఖాస్ భూములపై వేల సంఖ్యలో కేసులు సిటీ న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. నిజాం ఆస్తులకు వారసులం తామంటే.. తామని అనేక మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే ముకరం జా కొడుకు అజ్మత్ జా తాజాగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. ఆస్తుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఏడో నిజాం తర్వాత.. ఎవరికి వారే యమునా తీరే!

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తర్వాత.. నిజాం కుటుంబం ఎవరికి వారే విడిపోయారు. తామే నిజాం వారసులమంటూ ఇప్పటిదాకా ఐదు వంద మందికిపైగా ముందుకు రావడం విశేషం. ఎనిమిదో నిజాంగా ప్రకటించుకున్న ముకరం జా అధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టాలు అందుకున్న ఈ హైదరాబాద్ ప్రిన్స్ విలాసాలకు చిరునామా. ఈయన తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959-75), తర్వాత ఎయిర్ హోస్టెస్ హెలెన్ (1980-90)ను ,ఆపై అప్పటి మిస్ టర్కీ మనోల్యా ఒనోర్‌ను (1990-96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాక్’ చెప్పేశారు. ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్‌లతో కలిసి ఉంటున్నారు. మొత్తంగా చూస్తే ఈయనకు మొదటి భార్య ద్వారా ఇద్దరు (కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడో భార్య ద్వారా కూతురు (నీలోఫర్), నాలుగో భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు.

ఆస్తుల అన్యాక్రాంతం సరికాదు: న్యాయనిపుణుడు వెంకట రమణ

‘‘రాజభరణాల రద్దు తర్వాత నిజాం కుటుంబానికి ఎలాంటి ప్రత్యేక హోదాలు, హక్కులు లేవు. అయినా వారి పేర్లపై వందల ఎకరాల భూములు, ఆస్తులు, అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయి. వారు ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తుల అన్యాక్రాంతం చేస్తున్న దృష్ట్యా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ట్రస్ట్‌ల తీరుపై వెంటనే విచారణ చేపట్టాలి.’’

నిజాం సంతానం ఇదీ...

ఉస్మాన్ అలీఖాన్-దుల్హన్ పాషా దంపతులకు ఇద్దరు కొడుకులు ఆజం జా, మోజం జా, ఓ కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం. ఆజంజా టర్కీకి చెందిన దురేషెవార్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముఖరంజా, ముఫకం జా ఇద్దరు కొడుకులు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బతికి ఉండగానే తన వారసునిగా అంటే 8వ నిజాంగా ముకరం జాను ప్రకటించాడు. మోజం జా తొలుత నీలోఫర్ (టర్కీ)ను పెళి ్లచేసుకున్నాడు. విడాకుల అనంతరం రజియాబేగం, ఆ తర్వాత అన్వర్ బేగంలను పెళ్లాడాడు. వీరిలో ఆయనకు రజియాబేగం ద్వారా ఫాతిమా, అమీనా, ఓలియా కుల్సుం ముగ్గురు కూతుళ్లు కలిగారు. చివరి భార్య అన్వర్ బేగం ద్వారా కొడుకు శ్యామత్ అలీఖాన్ జన్మించాడు.

చిరాన్ ప్యాలెస్ నాకే రావాలి

నాన్నను చూడక రెండేళ్లవుతోంది. కలుసుకునేందుకు ప్రయత్నించినా కొందరు అడ్డుకుంటున్నారు. అందుకే నాన్న (ముకరం జా) ఆస్తిలో వాటా కోసం నేనిప్పుడు అమ్మ ఓనూర్‌తో కలిసి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం కొడుకులకు రెండు వంతులు, ఆడ పిల్లకు ఒక వంతు ఆస్తి ఇవ్వాల్సిందే. నాన్నను చూసేందుకు న్యాయ పోరాటం చేస్తా. లెక్క ప్రకారం కేబీఆర్ పార్కు పరిసరాల్లోని చిరాన్ ప్యాలెస్ పూర్తిగా నాకే రావాలి.
- నిలోఫర్ (ముకరం జా మూడో భార్య మనోల్యా ఓనూర్ కూతురు)

లాయిడ్స్ బ్యాంక్‌లో తేలని వివాదం
1947లో ఆపరేషన్ పోలో సమయంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ ద్వారా అప్పట్లో లక్షా ఎనిమిది వేల (ప్రస్తుత విలువ రూ.240 కోట్లు) పౌండ్లను లాయిడ్ బ్యాంక్ ఆఫ్ లండన్‌లో డిపాజిట్ చేయించిన వివాదం ఇంకా సమసిపోనేలేదు. 1947 అనంతంర భారత్, పాకిస్థాన్ విడిపోవటం, లాయఖ్ అలీ తాను పాక్ జాతీయుడిగా పేర్కొనటంతో ఆ మొత్తం ఎవరికి చెందుతుందన్న అంశం 65 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. అయితే 2003 నుంచి భారత ప్రభుత్వం ఈ మొత్తం తమకే చెందుతుందని వాదిస్తోంది. ఈ మొత్తం భారత్‌కు వస్తే అందులోనూ నిజాం వారసులకు వాటా వచ్చే అవకాశం ఉంది.

లండన్‌లో ముఫకం జా..


మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు ముఫకం జా. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు.

Read more...

Tuesday, December 20, 2011

ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణ పరిశ్రమ -2 (Telangana History - Nizam in Telangana)

ఇదీ ధ్వంస రచన
- సీఎంల తెలంగాణ వ్యతిరేకతకు ఘనమైన పరిక్షిశమలు మాయం
- వేల మంది కార్మికులు రోడ్లపైకి
- కొత్త పరిక్షిశమల్లో ఉద్యోగులు సీమాంధ్ర జిల్లాలవారే
- తోడైన సరళీకరణ విధానాలు
- మాయమైన తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతం
- విధ్వంసానికి గురైన కార్మికవాడ


proklain-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఐడీపీఎల్‌లో ఉన్నతోద్యోగులుగా చేరిన డాక్టర్ అంజిరెడ్డి తదితరులు డగ్స్ తయారీకి కావాల్సిన ఫార్ములాను చౌర్యం చేసి, సొంత ఫార్మాస్యూటికల్ సంస్థలు ఏర్పాటు చేసుకొని క్రమంగా దీనిని దివాలా తీయించారన్న ఆరోపణలున్నాయి. ఐడీపీఎల్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నా.. బలవంతంగా ఉరి వేశారు. ఫలితంగా సామాన్య ప్రజల ఆరోగ్య ప్రదాయిని అంతమైంది.

హైదరాబాద్ చుట్టూ ఏర్పాటైన
భారీ పరిశ్రమలకు భూమిని సేకరించేటప్పుడు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు, అనుబంధ కాంట్రాక్టులను కూడా భూములు కోల్పోయిన స్థానికులకు ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ ఈ నిబంధన ఏ ఒక్క పరిశ్రమలోనూ అమలు కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం 1964, 1989లలో రెండు సార్లు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చినా ఫలితం లేకపోయింది.

తెలంగాణకు కొంగు బంగారాల్లా భాసిల్లిన అనేకానేక పరిక్షిశమలు.. ఇప్పుడు అంతర్థానమయ్యాయి! ప్రపంచ బ్యాంకుకు అవల్‌దర్జా జీతగాళ్లుగా మారిన ముఖ్యమంవూతుల చేతిలో దగాపడ్డాయి. పాలకుల కుట్రలకు తోడు ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు తోడై.. తెలంగాణ పరిక్షిశమల గొంతునులిమాయి! వాటి సమాధులే పునాదులుగా సీమాంధ్ర బడాబాబుల పారిక్షిశామిక సామ్రాజ్యాల భువన భవనాలు ఎదిగాయి! ఐడీపీఎల్, ఆల్విన్, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్, డీబీఆర్ మిల్స్, ఆజంజాహీ మిల్స్ ఒక అనేకానేక పరిక్షిశమలు.. అన్నీ లాభాల్లో, ఉత్పత్తుల నాణ్యతలో ప్రఖ్యాతిగాంచినవే! దేశంలో ఆమాట కొస్తే ఆసియాలోనే అతి పెద్ద కర్మాగారాలు కొన్ని! వేల మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించినవి! హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆనాడే నిలబెట్టిన ఘనత వహించినవి! తెలంగాణ పేరును దిగంతాలకు వ్యాప్తి చేసిన అద్భుతాలు! ఏవీ ఇవన్నీ? ఎక్కడకు పోయాయి?

దేశంలోనే మొట్టమొదట సారి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, హైదరాబాద్ నగరాన్ని వెలుగులతో నింపిన హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్.. ఇప్పుడు ఐమాక్స్ జిలుగుల కింద సమాధి అయి ఉంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన నిజాం షుగర్స్.. పాలకుల దుర్నీతికి బలైపోయింది. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్ మిల్స్.. దొంగల బారిన పడి మొండిగోడలతో మిగిలింది! భారీ లాభాల్లో ఉన్న హైదరాబాద్ ఆల్విన్.. అడ్డికిపావుశేరు ధరకే ఓల్టాస్ కంపెనీకి సొంతమై.. తరువాత రియల్టర్లపాలైంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన ఐడీపీఎల్ గుండెలపై ప్రైవేట్ ఫార్మా కాళ్లు నిగడదన్ని ఎదిగింది!

ఆసియాలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లు ఆజంజాహి నేడు చెత్త కంపెనీ రాంకీ ఖాతాలోకి వెళ్లింది! వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ స్థలం నేడు రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మారింది! సనత్‌నగర్, ఆజామాబాద్, కాటేదాన్, ఉప్పల్ పారిక్షిశామిక ప్రాంతాలు ఇప్పుడు కళ తప్పాయి! ఇది తెలంగాణ పారిక్షిశామిక సామ్రాజ్యం కుప్పకూలిన తీరు! వలస వచ్చి పాగావేసిన సీమాంధ్ర బడాబాబులు, వారికి వెన్నుదన్నులిచ్చిన పాలకులు తెలంగాణ పరిక్షిశమల ఆయువు తీసిన వైనం! పాత కంపెనీలు బొందపెట్టి..
 
కొత్త కంపెనీలు తెచ్చారు సరే.. నిబంధనల ప్రకారం రావాల్సిన ఉద్యోగాలైనా దక్కాయా? అంటే అవీ సీమాంధ్ర జిల్లాల వాసులకే వశమయ్యాయి! ఉన్న ఉపాధి పోయి.. కొత్త ఉపాధి లేక ఇప్పుడు తెలంగాణ యువత నిరాశా నిస్పృహలతో రగిలిపోతున్నది! పోనీ పారిక్షిశామికరంగంలో తెలంగాణ ఔత్సాహికులు ఎదిగారా అంటే అదీ లేదు! ఇదీ.. కోటి రతనాల వీణ ధ్వంసమైన తీరు! పాలకుల దుర్నీతి తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతంపై వేయి పడగపూత్తి విషం చిమ్మిన విధం! వేల మందికి నీడనిచ్చిన తెలంగాణ పరిక్షిశమల చెట్టు కొమ్మలను ఒక్కొక్కటిగా నరికిపారేసిన దారుణం!


చితికిన ఐడీపీఎల్ బతుకులు

idbl-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema-కొందరి స్వార్థం - వేల మందికి శాపం
-ఐడీపీఎల్ సమాధులపై ప్రైవేట్ ఫార్మా సామ్రాజ్యాలు

కొందరు వ్యక్తుల స్వార్థం.. ఈ సంస్థలో పని చేసే సుమారు 6వేల మంది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసింది. ఇది హైదరాబాద్ నగరంలో బాలానగర్‌లోని ఐడీపీఎల్ వ్యథ. భారతదేశంలో దీనితో పాటు ప్రారంభమైన మద్రాస్, రిషికేష్, గుర్గావ్ సంస్థలు నేటికీ సవ్యంగా నడుస్తుండగా హైదరాబాద్ సంస్థ మాత్రం ప్రారంభమైన మూడు దశాబ్దాలకు మూతపడింది.

అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1961 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నాలుగుచోట్ల ఐడీపీఎల్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 1967లో బాలానగర్‌లో హైదరాబాద్ యూనిట్ ప్రారంభమైంది. రష్యన్ కొలాబరేషన్‌తో ప్రారంభించిన ఈ సంస్థ ఎన్నో రకాల బల్క్ డ్రగ్స్‌ను దేశవిదేశాలకు సరఫరా చేసింది. జాబ్ ఓరియం ప్రారంభించిన ఈ యూనిట్ అనతికాలంలోనే లాభాల బాటలో పయనించి మిగిలిన యూనిట్లకు మదర్ యూనిట్‌గా మారింది. మందుల తయారీ, టానిక్‌ల తయారీలో పదేళ్లపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఊహించిన దానికంటే అధికస్థాయిలో పేరువూపఖ్యాతులు గడించింది.

ఆ తరువాత ఈ సంస్థలోకి ఆంధ్రా ప్రాంత ఉన్నతోద్యోగులు (జీఎం స్థాయి) రంగ ప్రవేశం చేశారు. అప్పటికే ఈ సంస్థలో సీనియర్ కెమిస్టుగా పనిచేస్తూ అపార పరిజ్ఞానం సంపాదించిన డాక్టర్ అంజిడ్డి తన పలుకుబడిని ఉపయోగించి డిజైన్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ (డీడీపీ) విభాగం హెడ్‌గా మార్పించుకున్నాడని చెబుతారు. నెమ్మదినెమ్మదిగా ఈ సంస్థ టెక్నాలజీని అనుసరించి ఓ సంస్థను నిర్వహించడానికి కావలసినంత టెక్నాలజీని సమకూర్చుకున్నాడు.

ఆ తరువాత ఐడీపీఎల్‌కు 1981-82లో రాంరాం చెప్పి మరో ఉన్నతోద్యోగి చంద్రశేఖర్‌డ్డితో కలిసి ఏకంగా ఎస్‌ఓఎల్ పేరిట ఓ లేబొరేటరీని స్థాపించాడు. 1984లో పూర్తిస్థాయిలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీపేరుతో భారీ పరిక్షిశమను స్థాపించాడు. కాగా ఐడీపీఎల్‌లో ఉన్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఆర్డర్లకు తగిన ఉత్పత్తిని అందించలేకపోయారు. ఇదే అదునుగా డాక్టర్ రెడ్డీస్ బాటలోనే రాంప్రసాద్ రెడ్డి అరబిందో లేబొరేటరీస్‌ను ప్రారంభించారు. సీమాంవూధులైన ఉన్నతోద్యోగులు ఈ పరిక్షిశమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వచ్చిన ఆర్డర్లను కొత్తగా ఆవిర్భవించిన పరిక్షిశమలకు గుట్టుచప్పుడు కాకుండా మళ్లించి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పడు అధికారంలో ఉన్న కొందరు మంత్రిస్థాయి నేతలు డాక్టర్ రెడ్డీస్, అరబిందో సంస్థలకు సహకారం అందించి, ఐడీపీఎల్ పతనానికి పరోక్షంగా కారకులైనట్లు మాజీ ఐడీపీఎల్ ఉద్యోగులు చెబుతున్నారు.

ఆంధ్రవూపదేశ్‌కు, ప్రత్యేకించి తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ పరిక్షిశమ దిగజారిపోతున్నా పట్టించుకోలేదని, పైగా ఆయన కూతురుకు చెందిన ఓ డ్రగ్ పరిక్షిశమకు సహకారమందించాల్సిందిగా ఉన్నతోద్యోగులకు పరోక్షంగా సందేశమందినట్లు వారు పేర్కొన్నారు. పరిక్షిశమ మూతపడి ఓ వైపు కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు కోట్ల రూపాయల విలువచేసే ఐడీపీఎల్ ఖాళీ భూమిని కైవశం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ పరిక్షిశమ స్థాపనకు ప్రభుత్వం కేటాయించిన 891 ఎకరాల్లో కొందరు ముస్లింలకు చెందిన పట్టాస్థలాలు ఉన్నాయని, ప్రస్తుతం పరిక్షిశమ నడవడం లేనందున, నాడు వాటికి నష్టపరిహారం చెల్లించనందున వారికి చెందిన భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేయించి, వెనుక తానుండి మంత్రివర్యులు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.

తెలంగాణ కలికితురాయి నిజాం షుగర్స్
కొడిగట్టిన పూర్వవైభవం.. వరుసగా దగా చేస్తున్న సీమాంధ్ర సీఎంలు (నిజామాబాద్): తెలంగాణ జాతి కిరీటాన కలికితురాయిగా నిలిచి ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కార్మాగారంగా పేరొందిన నిజాం షుగర్స్ గత వైభవం సీమాంధ్ర పాలకుల దగాతో కొడిగట్టింది. సీమాంధ్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు మొదలుకుని నేటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు నిజాం షుగర్స్‌కు దగా చేస్తూనే ఉన్నారు.

నిజాం షుగర్స్‌ను నాటి సీఎం చంద్రబాబు సీమాంధ్ర పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మివేయగా, అధికారంలోకి రాకముందు అది అక్రమమని ఘోషించిన రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ స్వాధీనానికి వీసమెత్తు ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. నిజాం షుగర్స్‌ను తీసుకున్న డెల్టా పేపర్ మిల్స్ యాజమాన్యం జాయింట్ వెంచర్ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లఘిస్తున్నప్పటికీ కిరణ్ సర్కార్ మౌనం వహిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది.


ఇదీ గత వైభవం: 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ దేశంలోనే ప్రభుత్వరంగంలో ఏర్పాటయిన అతిపెద్ద ఫ్యాక్టరీగా నిలిచింది. బోధన్ పరిసరాల్లో చెరుకును సొంతంగా పండించటానికి అప్పటి నైజాం పాలకుల హయాంలో సుమారు 16 వేల ఎకరాల వ్యవసాయక్షేవూతాలను ఈ ఫ్యాక్టరీకి సమకూర్చటం మరో ప్రత్యేకత. ఆంధ్రాలో చక్కెర ఫ్యాక్టరీలంటే తెలియని రోజుల్లోనే తెలంగాణలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మొదట వెయ్యి టన్నుల సామర్థ్యంతో ప్రారంభించారు. 1952లో రెండవ యూనిట్ ఏర్పాటు చేశారు. బోధన్‌లో నిజాం షుగర్స్ మదర్ యూనిట్‌గా పిలిచే శక్కర్‌నగర్ యూనిట్ ఆర్జించిన లాభాలతో రాష్ట్రంలో 7 చక్కెర ఫ్యాక్టరీలు, 3 ఆల్కహాల్ డిస్టిలరీలు, నాగార్జునసాగర్‌లో మెషినరీ డివిజన్ స్థాపించారు.

శక్కర్‌నగర్ యూనిట్ లాభాలతో నిజాం షుగర్స్ ఆధ్వర్యంలో 1970 దశకంలో హిందూపూర్, మిర్యాలగూడ, జహీరాబాద్‌లో కొత్త చక్కెర ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 1980 దశకంలో బొబ్బిలి, సీతానగరంలో ఖాయిలాపడిన చక్కెర ఫ్యాక్టరీలను, పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు డిస్టిలరీని నిజాం షుగర్స్ అధీనంలోకి తీసుకొచ్చారు. అనంతరం మెట్‌పల్లిలో కొత్తగా మరో చక్కెర ఫ్యాక్టరీని నిజాం షుగర్స్ నిర్మించింది. చివరగా 1988లో మెదక్‌లో కొత్తగా నిజాం షుగర్స్ యూనిట్ ఏర్పడింది. ఆనాడు బోధన్ ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరం మేరకు ఫ్యాక్టరీకి రెండు వైపులా లైట్ రైల్వే లైన్ ఉండేది.

సీమాంధ్ర పెత్తనంలో నష్టాలు ప్రారంభం
ఆంధ్రా పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన హిందూపూర్, లచ్చాయిపేట్, సీతానగరం యూనిట్లు నిజాం షుగర్స్‌కు ఎనలేని నష్టాలను తీసుకువచ్చాయి. ఈ నష్టాల భారాన్ని శక్కర్‌నగర్ మదర్ యూనిట్ మోయాల్సివచ్చింది. 1990 దశకంలో మిర్యాలగూడ యూనిట్‌తో పాటు నష్టాల్లో ఉన్న పై యూనిట్లను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేశారు. చంద్రబాబు హయాంలో నిజాంషుగర్స్ పరిస్థితి మరింత క్షీణించింది. లాభాల్లో ఉన్న శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్ యూనిట్లను నష్టాల్లోకి నడిపించే ప్రయత్నం చంద్రబాబు హయాంలో జరిగింది.

ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వరంగ కార్మికులు, చెరుకు రైతులకు నిజాం షుగర్స్ ఒక అండగా ఉంటూ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు పోటీ సంస్థగా ఉందన్న సత్యాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా 2002లో నిజాం షుగర్స్‌లోని నాలుగు యూనిట్లను డెల్టా పేపర్ మిల్స్ అనే సీమాంధ్ర కంపెనీకి అప్పగించింది. జాయింట్ వెంచర్ పేరిట జరిగిన ఈ ప్రైవేటీకరణ మార్పులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రూ.600 కోట్లు విలువ చేసే యూనిట్లను కేవలం రూ.68 కోట్లకు డెల్టా పేపర్ మిల్స్‌కు అక్రమంగా నిర్వహించిన స్విచ్ చాలెంజ్ టెండర్ల ద్వారా అప్పగించారని విమర్శలున్నాయి.సభాసంఘం నివేదిక తుంగలోకి: వైఎస్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారంపై సభాసంఘాన్ని నియమించింది. రెండేళ్ళ పాటు విచారణ జరిపిన సభాసంఘం..

స్విచ్ చాలెంజ్ పద్ధతిని తప్పుపట్టింది. జాయింట్ వెంచర్‌ను రద్దుచేసి నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. అధికారంలోకి రాకముందు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్.. అధికారంలోకి వచ్చాక సిఫారసులను పట్టించుకోకపోవడం శోచనీయం. జాయింట్ వెంచర్‌లో నిబంధనలను కూడా ప్రైవేట్ యాజమాన్యం ఉల్లంఘించిందని సభాసంఘం తేల్చినప్పటికీ ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయలేదు. ఫలితంగా ప్రైవేట్ యాజమాన్యంలో కార్మికులు, చెరుకు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

ఆల్విన్ అవస్థలు!
-ప్రథమ సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల తయారీ ఘనత
-గడియారాలు, బస్ బాడీలతో ప్రఖ్యాతి
-అధికార దుర్వినియోగంతో పతనం
-పట్టించుకోని పాలకులు

alwayn-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema( జీడిమెట్ల)నైజాం పాలనలో మెటల్ ఇండస్ట్రీస్‌గా మొదలై.. కాలానుగుణంగా వివిధ ఉత్పత్తులను దేశానికి అందిస్తూ ఓ వెలుగు వెలిగిన ఆల్విన్ పరిశ్రమ అధికార దుర్వినియోగానికి కుప్పకూలిపోయింది. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే 12వేల మంది కార్మికులను రోడ్డు పాలు జేసింది. 1942లో అప్పటి నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్.. అల్లావుద్దీన్ అండ్ కంపనీ సహకారంతో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి దినదినా భివృద్ధి చెందింది.

1952లో భారతదేశ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసి అందించిన ఘనత ఆల్విన్‌దే. ఆ తర్వాతి కాలంలో బస్ బాడీ యూనిట్‌గా రూపాం తరం చెంది 1963లో ఏపీఎస్‌ఆర్టీసీకి డెబుల్ డెక్కర్ బస్సును తయారు చేసి మరో ఘనతను సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్విన్‌ను ప్రభుత్వ రంగ పరిశ్రమగా ప్రకటించింది. ఆపై 1981లో మూడవ యూనిట్‌గా జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎనలేని ఖ్యాతిని గడిచింది.

అనంతరం 1983లో నిసాన్ సమన్వయంతో రిప్రిజిరేటర్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. పలురకాల వాహనాలనూ ఉత్పత్తి చేసింది. సుమారు 48ఏళ్లపాటు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్పత్తి రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ 1990లో జీఎంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ అధికార దుర్వినియోగానికి బలవడం మొదలైంది. దీనికి తోడు అప్పటి కార్మిక సంఘ నేతలు సైతం వంతపాడటం కూడా ఆల్విన్‌పాలిట శాపమైందన్న విమర్శలున్నాయి.

పరిశ్రమపక్కనే ప్రస్తుతం ఓ క్లబ్ నిర్వహిస్తున్న వ్యక్తి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్‌గా రంగప్రవేశం చేసి, సదరు జీఎంతో దోిస్తీ చేస్తూ పనులు చేయకుండానే అక్రమాలకు పాల్పడుతూ ఈ పరిశ్రమ పతనానికి పరోక్షంగా కారకుడయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడేళ్ళ కాలంలోనే మూతపడే స్థాయికి చేరి 1993వ సంవత్సరంలో కార్మికులను రోడ్డున పడేసింది. ఆ తరువాత 1994వ సంవత్సరంలో బీఐఎఫ్‌ఆర్ ద్వారా వివిధ కంపెనీలకు భాగస్వామ్యం పంచి కొందరు కార్మికులకు ఉపాధి కల్పించినప్పటికీ సరైన న్యాయం చేయడంలో సీమాంధ్ర ప్రభుత్వం విఫలమైంది.


దగాపడిన డీబీఆర్
-రూ.600 కోట్ల భూములకు ఎసరు
-అప్రకటితంగా కంపెనీ మూసివేత
-అధికారులతోనూ కుమ్మక్కు
-ఫ్యాక్టరీని నడుపుతున్నామని అబద్ధాలు
-20 ఏళ్లుగా కంపెనీకి కార్మికులే కాపలా
-జీవితాలను కోల్పోయిన అభాగ్యులు

DBR-Mills-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్  (: నిజాం నవాబులు సాగునీటి వ్యవస్థతో పాటు, పారిక్షిశామీకరణపై కూడా దృష్టి సారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిక్షిశమలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఔత్సాహికులను ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే దివాన్ బహదూర్ రాంగోపాల్ చేత స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయించారు. అలా ఏర్పడిందే హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్‌మిల్స్.

షాపూర్‌షనైకి చెందిన 24.16ఎకరాల ఇనాం భూమిని దివాన్ బహదూర్ రాంగోపాల్ 99 ఏళ్లు లీజుకు తీసుకొని 1922 నాటికి పరిక్షిశమను నిర్మించి ఉత్పత్తిని మొదలు పెట్టారు. 1984 వరకు ఇది బ్రహ్మాండంగా పని చేసింది. ఆ తర్వాత దివాన్ బహదూర్ కంపెనీని నడపటానికి ఇష్టం లేక లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గోతికాడి నక్కల్లా కాచుక్కూర్చున్న సీమాంధ్ర దోపిడీదారులు వారికి ప్రతినిధిగా ఆనాటి సీఎం ఎన్టీరామారావు, గోదావరిజిల్లాకు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి డీబీఆర్‌మిల్‌ను 1984లో లీజుకు తీసుకున్నారు. తేరగా కంపెనీని చేజిక్కించుకున్న కృష్ణంరాజు ఏనాడూ ఫ్యాక్టరీని పద్ధతిగా నడపలేదు సరికదా ఎలా మూసివేయాలన్న దిశగానే పావులు కదిపాడు.

ఇదే ముడిసరుకుతో 1991 వరకు ఫ్యాక్టరీని నడిపినట్లు చేశారని కార్మికులు చెప్పారు. రకరకాల లిటిగేషన్లు పెడుతూ పని చేయించకుండా చేశాడని, ఇతని ప్రవర్తనతో ఆనాడు చాలా మంది కార్మికులు పనిలోనుంచి వెళ్లి పోయారని తెలిపారు. ఫ్యాక్టరీని నడపని కృష్ణంరాజు 1992 ఫిబ్రవరిలో ఓ అర్ధరావూతిపూట ఫ్యాక్టరీకి తాళం వేశాడు. అడ్రస్ లేకుండా పోయాడు. అంతే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణంరాజు నేరుగా ఫ్యాక్టరీ వద్దకు రాలేదు. కానీ ఫ్యాక్టరీలో ఉన్న రూ.100 కోట్ల విలువైన మిషనరీని రాత్రి పూట తరలించుకు పోయాడు. కానీ ఇప్పటికీ పరిక్షిశమ నడుస్తున్నదనే కృష్ణం రాజుఅడ్డంగా వాదిస్తున్నారు.

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుతం భూమి విలువ గజం రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. అంటే డీబీఆర్ మిల్స్ మొత్తం భూమి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుంది. మరో వైపు ఈ ఫ్యాక్టరీ తనదంటూ సీమాంవూధకు చెందిన ఆర్‌ఆర్‌అసోసియేట్స్ అధినేతగా చెప్పుకునే రంగాడ్డి ప్రవేశించారు. ఈయనను కృష్ణంరాజే కావాలని కార్మికుల బెడద వదిలించుకోవడానికి తీసుకువచ్చాడా... లేక రాయలసీమ డాబుతో తనే కైవసం చేసుకోవడానికి వచ్చాడా అన్న విషయాలపై సర్వత్రా సందేహాలు వెలువడుతున్నాయి.

ఇది ఇలా ఉండగానే బిగ్‌బజార్‌కు చెందిన యజమాని మాల్‌పాణి డీబీఆర్‌ఫ్యాక్టరీలో ఆరు ఎకరాల భూమి తనదని కె్లైమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిర్మాణ పనులు చేయడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. వీరికి తోడుగా సీపీఐ, ఐఎఫ్‌టీయులు నిలబడడంతో వారు వెనక్కు తగ్గారు. ఆ తరువాత డీబీఆర్ ఫ్యాక్టరీ భూమి ప్రభుత్వానిదని ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ నోటీస్‌లు అంటించారు. ‘మా నాన్న మిల్లులో పని చేశాడు. అర్ధాంతరంగా ఫ్యాక్టరీ మూసివేయడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. నాన్న ఫ్యాక్టరీ కోసం కాపలా కాస్తూనే చనిపోయాడు. ఈ మిల్లు కోసం అమ్మ ఎదురు చూస్తూ చనిపోయింది.

ప్రస్తుతం నేను అనాథనయ్యాను’ కార్మికుడిగా తలెత్తుకొని బతికిన. ఇప్పుడు అడ్డమీది బతుకైంది. జీవితం దుర్భరంగా మారింది. నాకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి. ప్రస్తుతం 65 ఏళ్లు. ఇంకా ఎదురు చూసే ఓపిక పోయింది. ఫ్యాక్టరీ మూత పడడంతో పిల్లలను చదివించుకోలేకపోయా. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంచి భవిష్యత్‌ను ఇవ్వలేని తండ్రిగా మిగిలాను.

Any Comments


 Read 1 Part click this link



Take By: T News  -  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=54538

Read more...

Monday, December 19, 2011

తీగలు తెంపిన రతనాల వీణ! ( Nizam In Telangana)

- నాడు వేల పరిక్షిశమలతో విలసిల్లిన నేల
- ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిజాం ప్రోత్సాహం

- లక్షల మందికి ఉపాధి వనరులు
- బలపడిన స్థానిక పారిక్షిశామిక వర్గం
- స్పిన్నింగ్.. ప్రింటింగ్.. షుగర్.. పేపర్ ఐరన్.. బటన్.. గ్లాస్..కెమికల్.. ఫిరంగులు..వీఎస్‌టీ.. డీబీఆర్.. ఆజంజాహి
- ఆనాటి కాలానికే అందివచ్చిన ప్రగతి
- ఆర్టీసీ ఏర్పడిందీ ఆనాడే
- స్టేట్ బ్యాంక్ ఘనతా అప్పటిదే


Industry-telangnaa-News talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, డిసెంబర్ 18 (): తెలంగాణ.. కోటి రతనాల వీణ! నిజంగానే.. నిజంగానే ఇది రత్నగర్భ. సిరులు పొంగిన నేల. సింగరేణి బొగ్గు గనులను గర్భంలో దాచుకుంది. పారిక్షిశామికంగా విలసిల్లింది. ప్రపంచస్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఇది ఇప్పటి మాట కాదు. గత వైభవ వాస్తవ చరిత్ర. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం.. నిజాం హయాంలో సాధించిన ఘనత. భాగ్యనగరం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతమంతా పారిక్షిశామికంగా నాటి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందింది.

హైదరాబాద్‌ను అభివృద్ధి పర్చింది మేమేనని ఇటీవల మైకులు మింగి మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు చూడజాలని వాస్తవమది. ఇంతకుముందు.. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం.. హైదరాబాద్ అభివృద్ధికి ఆమడదూరంలో కునారిల్లిందా?.. ఆదుకునేవారేలేరని అంగలార్చిందా? ఆత్మగౌరవాన్ని తాకట్టుబెట్టి పరాధీనమయిందా?.. ఎంతమాత్రం కాదు. పారిక్షిశామికంగా హైదరాబాద్ నాడు భాగ్యనగరంగానే విలసిల్లింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు (1956) ముందే..

ఆ మాటకొస్తే భారతదేశ స్వాతంవూత్యానికి పూర్వమే నాటి తెలంగాణ.. నిజాం సంస్థానంలో అన్ని రకాలుగా ప్రగతి పథంలో పయనించింది. నాడే పలు రకాల పరిక్షిశమలు తమ ప్రత్యేకతను చాటిచెప్పాయి. కొన్ని ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రఖ్యాతిని దక్కించుకున్నాయి. వేల పరిక్షిశమలు లక్షల మంది ప్రజలకు ఉపాధి కల్పించాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రోత్సాహంతో పారిక్షిశామిక రంగం ముందుకు దూసుకుపోయింది.

స్పిన్నింగ్ మిల్ నుంచి కెమికల్ లేబోరేటరీ దాకా.. ఆర్టీసీ నుంచి ప్రాగా టూల్స్ దాకా.. హైదరాబాద్ దక్కన్‌లో వజీర్ సుల్తాన్ టొబాకో నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ దాకా పలురకాల పరిక్షిశమలు విస్తరించాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలతో తెలంగాణ విలసిల్లింది. ఇది చారివూతక వాస్తవం. తవ్విచూస్తే సజీవ సాక్ష్యాలకు కొదువలేదు. 1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వస్తే.. అంతకు ముందు ఏడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి అనుపమానం. 1871లో సింగరేణి బొగ్గు గనులతో మొదలుపెడితే 1947దాకా పారిక్షిశామిక రంగం బహుముఖంగా విస్తరించింది. 

1873లో మొదటి స్పిన్నింగ్ మిల్లు ప్రారంభం కాగా, 1876లో ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులోకి వచ్చాయి. 1910 దశకంలో సోడా, ఐరన్ ఫ్యాక్టరీలు, దక్కన్ బటన్ ఫ్యాక్టరీ, 1919లో వీఎస్‌టీ ఫ్యాక్టరీ నెలకొన్నాయి. రెండో దశకంలో కెమికల్ లాబోరేటరీ, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, డీబీఆర్ మిల్స్; మూడో దశకంలో వరంగల్ ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లులతో ప్రగతి శోభ చేకూరింది. 1932లో రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) స్థాపన మరో ముందడుగు. ఇక స్వాతంత్య్రం వచ్చిన నాలుగో దశాబ్దానికి వస్తే, మొదటి అర్ధ భాగంలోనే 1941లో గోల్కొండ సిగట్ ఫ్యాక్టరీ నెలకొంది. 1942లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏర్పాటు గణనీయ పరిణామం. ఆ ఏడాదే స్థాపితమైన హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్, 1943లో ఏర్పడిన ప్రాగా టూల్స్ ఘనతను చాటేవే. 

1946లో హైదరాబాద్ ఆస్బెస్టాస్, 1947లో హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్ట్ పారిక్షిశామిక ప్రగతిలో భాగం. ఆనాడు భాగ్యనగరంతోపాటు తెలంగాణ ప్రాంతమంతటా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కృషి కొనసాగింది. అందులో భాగమే.. డీబీఆర్ మిల్స్, వరంగల్ ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్ మెటల్స్ తదితర సంస్థల ఏర్పాటు. ఈ జాబితాకు అంతులేదు. తమ ప్రాంత ప్రగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం నాటి నిజాం ప్రభుత్వం చిత్తశుద్ధితో పారిక్షిశామిక విస్తరణకు ప్రయత్నించింది. అందుకు అవసరమైన విభాగాలను నెలకొల్పి ప్రోత్సాహకాలు కల్పించింది. తత్ఫలితంగా స్థానిక పారిక్షిశామికవర్గం బలపడింది. సాలార్‌జంగ్, బాబూఖాన్, లాహోటి, అల్లాద్దీన్, పన్నాలాల్ పిట్టి తదితర పారిక్షిశామిక కుటుంబాలు పరిక్షిశమల విస్తరణలో ఆసక్తి చూపి ఉపాధి వనరుల పెంపుదలలో దోహదపడ్డాయి.

1956లో సమైక్యరాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో పరిక్షిశమలు కోస్తా ప్రాంతం కంటే ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే నిజాం రాజులు హైదరాబాద్ చుట్టూ పరిక్షిశమల ఏర్పాటుకోసం దృష్టి కేంద్రీకరించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. 19వ శతాబ్దంలో తెలంగాణలో జంపఖానాలు, తివాచీలు, నూలుబట్టలు, ఇనుప వస్తువులు, ఉక్కు, కత్తులు, తుపాకులు, టస్సర్ పట్టుబట్టలు, కాగితం పరిక్షిశమలుండేవి. రుద్రమదేవి కాలంలోనే బట్టల పరిక్షిశమకు వరంగల్ ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఇంగ్లండు దేశస్థుడు మార్కోపోలో రుద్రమదేవి కాలంలోని బట్టలను చూసి సాలెపురుగు దారాలని భ్రమపడ్డారని చరివూతకారులు పేర్కొన్నారు. నిజాం హయాంలో 1851 కాలంలోనే వరంగల్ తివాచీలు, జంపఖానాలు ఇంగ్లాండులో జరిగిన వస్త్ర ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 

దీనినిబట్టి ఆనాడే నైపుణ్యమైన వస్తువుల తయారీలో ఎంత ముందంజలో ఉన్నది అర్థమవుతుంది. వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఇంగ్లీష్‌వారి వ్యాపారం వల్ల అప్పటికే హైదరాబాద్ రాజ్యంలో వెలసిన పరిక్షిశమలు 1800 నుంచి 1850 మధ్య కాలంలో క్షీణదశకు చేరుకున్నాయని ఆంధ్రుల సాంఘిక చరివూతలో సురవరం ప్రతాపడ్డి రాశారు. మొత్తంగా నిజాం ప్రభుత్వ హయాంలో ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి కొనసాగింది. హైదరాబాద్ చుట్టూరా తెలంగాణ జిల్లాలో అపారమైన ఖనిజ వనరులున్నాయి.

ఆధునిక భావాలు కలిగిన సాలార్‌జంగ్ ప్రవేశంతో పారిక్షిశామిక ప్రగతి వేగం పుంజుకుంది. నిజాం రాజులు హైదరాబాద్ రాజ్యాన్ని పారిక్షిశామికీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని సర్కారు భాగస్వామ్యంతో అనేక పరిక్షిశమలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పారిక్షిశామిక వేత్తలను ప్రోత్సహించారు.హైదరాబాద్ చుట్టూ పరిక్షిశమల భద్రత కోసం 1912లో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖను ఏర్పాటుచేయగా, అభివృద్ధి కోసం 1918లో రెవెన్యూశాఖ అనుసంధానంతో ప్రత్యేకంగా ఇండవూస్టీస్ అండ్ కామర్స్ విభాగాన్ని నెలకొల్పారు. దీనిని మరింత విస్తృతం చేస్తూ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేశారు. 

ఈ శాఖ 1927 వరకు పరిక్షిశమల స్థాపనకు ఉదారంగా రుణ సదుపాయాలను కల్పించింది. పరిక్షిశమల ఏర్పాటుకు నిజాం రాజు కల్పించిన ప్రోత్సాహకాల ఫలితంగా 1924, 25 నాటికి 507 ఫ్యాక్టరీలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోనే 121 నెలకొన్నాయి. వాటిలో 116 రైస్, ఫ్లోర్, దాల్‌మిల్లులను విద్యుత్ శక్తితో నడిపారు. 1928లో టింబర్ సీజనింగ్ ప్లాంట్‌ను మింట్ వర్క్‌షాప్ స్థలంలో ఏర్పాటుచేశారు. 1928 నాటికే ఎన్నో సర్కారు, ప్రైవేట్ పరిక్షిశమలను స్థాపించారు. పరిక్షిశమలకు రుణాలివ్వడానికి నిజాం ప్రభుత్వం 1929లోకోటి రూపాయలతో ఇండవూస్టీయల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించేది. దీనికోసం ప్రత్యేకంగా ఒక డైరెక్టర్‌ను నియమించారు. ఫలితంగా చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు వేయి పరిక్షిశమలు హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడ్డాయి. పరిక్షిశమల ఏర్పాటులో అలనాటి ప్రభువర్గంలోని సాలార్‌జంగ్, బాబుఖాన్, లాహోటి, అల్లాద్దీన్, దొరాబ్జీ, చినాయ్, తయాబ్జీ, లాయక్‌అలీ, పన్నాలాల్ పిట్టి కుటుంబాలకు చెందినవారు ప్రభుత్వ రాయితీలు పొంది పరిక్షిశమలను నిర్వహించారు.

సింగరేణితో సిరుల ప్రస్థానం
niZams talangana patrika telangana culture telangana politics telangana cinema
1871లో సింగరేణి బొగ్గు గనులతో మొదలైన భారీపరిక్షిశమల ప్రస్థానం.. స్పిన్నింగ్ మిల్లు, ఫిరంగుల ఫ్యాక్టరీ, గ్లాస్ ఫ్యాక్టరీ, కెమికల్ లాబోరేటరి, ప్రాగాటూల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్, సిగట్, ఆస్‌బెస్టాస్, హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్.. ఇలా అన్ని ఉత్పాదక రంగాలలో కొనసాగింది. పరిక్షిశమల ఉత్పత్తి ద్వారా హైదరాబాద్ ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం రావడంతోపాటు దాదాపు లక్షనుంచి రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఓల్డ్‌మిల్స్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీ 1874లో ఏర్పడింది. ఈ పరిక్షిశమలో 1700 మంది కార్మికులు పనిచేయగా, ఏడాదికి రూ.50 లక్షల ఆదాయంతో మంచి స్థితిలో నడిచింది. హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో 1929లో దివాన్ బహదూర్ రాజగోపాల్ (డీబీఆర్) మిల్స్ ఏర్పరిచారు. 

ఇందులో 1600 మంది కార్మికులు పనిచేసేవారు. ఏడాదికి 72 లక్షల ఆదాయం లభించేది. ఈ కంపెనీకి కోర్సుకాటన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని ప్రొఫెసర్ కే ఎస్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. నిజాం సర్కారు ఉదారంగా రుణాలు ఇవ్వడంకోసం కామర్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయడంతో 1927లో రూ.42.6 లక్షల పెట్టుబడితో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ ఏర్పడింది. ఇందులో 400 మంది కార్మికులు పనిచేసేవారు. 

1942లో రూ.62 లక్షల పెట్టుబడితో సనత్‌నగర్ ఏరియాలో హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇందులో మెటల్, స్టీల్ ఫర్నీచర్, బ్యాంకు సేఫ్స్, స్ట్రాంగ్‌రూములు, రెండో ప్రపంచ యుద్ధకాలంలో అవసరమైన అనేక వస్తువులను ఉత్పత్తి చేశారు. ఈ కంపెనీ దినదినాభివృద్ది చెందుతూ 1964లో రెండు లండన్ కంపెనీలైన పార్క్ రాయల్ వెహికల్స్ లిమిటెడ్, ప్రెస్‌స్టీల్ కంపెనీ లిమిటెడ్‌ల సహాయంతో బస్సుబాడీలు, రిఫ్రిజిరేటర్లు తయారుచేయగలిగింది. దీంతోపాటుగా ఆల్విన్ అసెంబుల్డ్ బస్సులు తయారుచేశారు. ఈ విధానం దేశంలో పశ్చిమబెంగాల్, హైదరాబాద్‌లలో మినహా ఎక్కడా లేదు. భారత ఎన్నికల సంఘానికి బ్యాలెట్ బాక్స్‌లను కూడా ఆల్విన్ ఉత్పత్తి చేసింది.

వేల కుటుంబాలకు ఉపాధి వనరులు
వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్‌టీ) లిమిటెడ్ కంపెనీని చార్మినార్ లేబుల్‌తో 1919లో కోటి రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఈ కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. అలాగే గోల్కొండ లేబుల్‌తో హైదరాబాద్ దక్కన్ సిగట్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటైంది. సిగట్ల ఉత్పత్తితో ఈ రెండు అగ్రగామి సంస్థలుగా వెలుగొందాయి. 1943లో జూబిలి సిగట్ కంపెనీని స్థాపించారు. ఈ సిగట్ కంపెనీలలో వర్జీనియా పొగాకును సిగట్లకు, మిగతా పొగాకును బీడీలు చేసేందుకు వాడేవారు. 

1916లో దక్కన్ బటన్ పరిక్షిశమ ఏర్పడింది. అప్పట్లో బనియన్లు, డ్రాయర్లు ఉత్పత్తి చేసే పరిక్షిశమను కూడా ఏర్పాటుచేశారు. ద ఇండియన్ హ్యూం పైప్ కంపెనీ లిమిటెడ్‌ను ఆజామాబాద్‌లో 1933లో ఆరు అదనపు శాఖలతో ప్రారంభించారు. సనత్‌నగర్‌లో ద హైదరాబాద్ ఆస్బెస్టాస్ లిమిటెడ్ సంస్థ 22 లక్షల పెట్టుబడితో 500 మంది కార్మికులతో ఏర్పడింది. సనత్‌నగర్ పారిక్షిశామికవాడలోనే 1947లో బెక్‌లైట్ లిమిటెడ్ లండన్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్‌లో హైదరాబాద్ లామినేటెడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 

1942లో ఆధునిక అమెరికా మిషన్లతో రూ.42 లక్షల పెట్టుబడితో ద బయో కెమికల్ అండ్ సింథటిక్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇదే ఏడాదిలో రూ.40 లక్షల పెట్టుబడితో 32 ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. 1946లో ఒకేసారి వంద ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. వీటిల్లో 10 వేల మంది కార్మికులు పనిచేసేవారు.

పెట్టుబడులకు ప్రభుత్వ ధీమా
నిజాం ప్రభుత్వం ఇతర పారిక్షిశామికవేత్తలకు భరోసా ఇచ్చే విధంగా, కార్మికులకు రక్షణగా నిలిచే పద్ధతిలో భారీ సంస్థలలో 51 శాతం మేర తన పెట్టుబడులు పెట్టేది. ఆ రకంగానే పలు కంపెనీలను ఏర్పాటుచేసింది. దీంతో అనేక కంపెనీలు లిమిటెడ్ కంపెనీలుగా పనిచేశాయి. ఫలితంగా నిజాం ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం రావడంతోపాటు లక్ష మందికి ఉపాధి లభించింది.

బహుజన పరిక్షిశమలు
హైదరాబాద్ సంస్థానంలో మొదట్లో చేతివృత్తుల పరిక్షిశమలదే పైచేయి. వీటిల్లో బహుజన కులాలకు చెందినవారే ఎక్కువగా పనిచేసేవారు. పలు రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా కూనసమువూదము, దిదరుర్తి, కొమరపల్లి, నిర్మల్, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాద్‌లలో ఇనుమును కరిగించి వస్తువులు తయారుచేసేవారు. 

నిర్మల్ వద్ద శ్రేష్టమైన ఉక్కును తయారుచేసేవారు. ఎల్లందల్, ఇబ్రహీంపట్నం, కోనాపూరు, చింతలపేట తదితర స్థలాల్లో మంచి ఉక్కు తయారయ్యేది. 1890వరకు హైదరాబాద్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లలో విరివిగా కత్తులు తయారుచేసేవారు. ఖమ్మం జిల్లాలోని జగదేవపూరులో బంగారు నీరు పోసిన కత్తులు తయారుచేసేవారు. గద్వాలలో తుపాకులు తయారయ్యేవి. రోహిలాలు పట్టే పెద్ద తుపాకులను వనపర్తి, గద్వాల, నిర్మల్‌లో చేసేవారు. నూలు, పట్టు కలిపిన మష్రూ బట్టలను హైదరాబాద్‌తోపాటు కరీంనగర్ జిల్లాలోని మాధాపురంలో నేసేవారు. నిజామాబాద్ జిల్లా ఇందూరు, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లోని కోయిలకొండలో కాగితాన్ని ఉత్పత్తి చేసేవారు. ఇవన్నీ సహజ సిద్ధంగా దొరికే సంపదతో స్థానిక బహుజన ప్రజలు తయారుచేసేవారు. ఈ విధంగా గ్రామాలలో ఈ పరిక్షిశమలన్నీ చేతి వృత్తుల వారికి జీవనోపాధి కలిగించేవి. కాలక్షికమంలో చేతి వృత్తుల పరిక్షిశమ క్షీణించింది. యూరప్ ప్రభావంతో నిజాం కాలంలో భారీ పరిక్షిశమలు వచ్చాయి.


నిజాం హయాంలో తెలంగాణలో ఏర్పడిన కొన్ని పరిక్షిశమలు:
1871               సింగరేణి బొగ్గు గనులు
1873               మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876               ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910               సోడా, ఐరన్ ఫ్యాక్టరీలు
1916               దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919               వీఎస్‌టీ ఫ్యాక్టరీ
1921               కెమికల్ లాబోరేటరీ
1927               దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929               డీబీఆర్ మిల్స్
1931               వరంగల్ అజంజాహి మిల్స్
1932               ఆర్‌టీసీ స్థాపన
1937               నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939               సిర్పూర్ పేపర్ మిల్
1941               గోల్కొండ సిగట్ ఫ్యాక్టరీ
1942               హైదరాబాద్ స్టేట్ బ్యాంక్,  హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ 1943 ప్రాగా టూల్స్
1946               హైదరాబాద్ ఆస్‌బెస్టాస్
1947               హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్ట్


ఆనాడే అంతర్జాతీయ ఖ్యాతి
నిజాం కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో పరిక్షిశమలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడిన పరిక్షిశమలు ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. టెక్స్‌టైల్స్ రంగం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఆనాడు డిఫెన్స్ పరికరాలు తయారుచేయడంలో ప్రాగా టూల్స్ కీలక పాత్ర వహించింది. చెరుకు పంటకు హైదరాబాద్ సంస్థానం కీలకం కావడంతో నిజాంషుగర్స్‌ను ఏర్పాటు చేసి 39 ఫ్యాక్టరీలను నెలకొల్పారు. తెలంగాణతోపాటు కర్ణాటకలోని రెండు జిల్లాలకు, మరట్వాడలోని 3 జిల్లాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది.
- బాల్‌డ్డి, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్


తెలంగాణలో భారీగా ఖనిజ సంపద ఉన్నట్లు క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం 1వ శతాబ్దం మధ్యనే గుర్తించినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 14 వ శతాబ్దంలో వూట్జ్ స్టీల్‌తో కత్తులు, తల్వార్లు తయారుచేసేవారు. అరబ్బు చక్రవర్తులు ఈ తల్వార్లను దిగుమతి చేసుకున్నారు. నిజాం రాజు అజాంజాహి కాలంలో మోడరన్ ఇండవూస్టీలు వచ్చాయి. 1956కన్నా ముందు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం పారిక్షిశామికంగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. నిజాం సర్కారు పరిక్షిశమలు ప్రతి జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 1910 నుంచి 1940 వరకు పరిక్షిశమల అభివృద్ధి వేగంగా జరిగింది.
- ఎన్.వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్


కుత్‌బ్‌షాహిల కాలంలోనే గోల్కొండ డైమండ్ మైనింగ్ కంపెనీ మణికొండలో 60వేల మంది కార్మికులతో పనిచేసేది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన తావర్నీయర్, డాక్టర్ డెర్నియర్‌లు తమ రచనలో తెలిపారు. పారిక్షిశామికీకరణలో ఎంత ముందున్నామో తెలిపేందుకు ఈ ఒక్క సంఘటన చాలు. నిజాం రాజు పరిక్షిశమల కోసమే సనత్‌నగర్‌ను నెలకొల్పారు. ఆనాడు పరిక్షిశమల అభివృద్ధి కారణంగా తెలంగాణలోనే ఎనిమిది విమానాక్షిశయాలు ఏర్పాటయ్యాయి. చ్నై, విజయవాడల కంటే ముందుగానే హైదరాబాద్‌కు ప్రత్యేక రైల్వే వ్యవస్థ ఉన్నది. 1910లోనే థర్మల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు అయింది. 150 ఏళ్ల నుంచే బొగ్గు ఉత్పత్తి మొదలైంది. చేనేత రంగంలో నిపుణులైన కార్మికులు ఒక్క తెలంగాణలోనే ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి నిపుణులైన కార్మికులను బొంబాయి, బీవండిలకు తీసుకెళ్లేవాళ్లు.

ఎన్ని రకాల పరిక్షిశమలో..
నిజాం కాలంలో పలు రకాల పరిక్షిశమలు విస్తరించాయి. టెక్స్‌టైల్స్, మింట్, ఇంజనీరింగ్, రైల్వేస్, వాటర్ పంపింగ్ స్టేషన్, విద్యుత్, బ్రీవరేజెస్, ప్రింటింగ్, సబ్బులు, ఉండ్ అండ్ కార్పెంటరీ, జైలుఫ్యాక్టరీ, ఇండవూస్టియల్ స్కూల్స్.. ఇలా రకరకాల పరిక్షిశమలు అప్పటి అవసరాలకు, ప్రగతికి ప్రతీకలుగా నిలిచాయి. అవన్నీ ప్రభుత్వం రంగంలో ఏర్పడిన పరిక్షిశమలు కావడం గమనార్హం.

ప్రైవేట్ యాజమాన్యంలోనూ అదే స్థాయిలో టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, మెటల్స్, ఫుడ్ డ్రింక్ అండ్ టొబాకో, ఉడ్ అండ్ గ్లాస్, కెమికల్ అండ్ డ్రగ్స్ తదితర పరిక్షిశమలు వచ్చాయి. 1932లో ఆరులక్షల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ ఏర్పడింది. 1943లో రూ. తొమ్మిది లక్షల పెట్టుబడితో హైదరాబాద్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించారు. 1943లోనే హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాగాటూల్స్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీలు రెండో ప్రపంచ యుద్ధానికి కావాల్సినంతగా ఉత్పత్తి చేసి, ఆర్థికంగా బలపడ్డాయి.
- పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు

Continue Read 2 Part click this link






Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP