Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label టెక్కి. Show all posts
Showing posts with label టెక్కి. Show all posts

Thursday, December 22, 2011

తెలంగాణ పరిక్షిశమల్ని కాపాడుకుందాం - T industry body launched ( TEECI) Telangana Chambers of Commerce and Industry

 (TEECI Means - Telangana Chambers of Commerce and Industry)

సీమాంవూధుల దోపిడీని అరికడుదాం: వక్తల పిలుపు
తెలంగాణ యవనికపై ‘టెక్కి’ ఆవిర్భావం
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
తెలంగాణను విదర్భతో ముడిపెట్టొద్దు: పేర్వారం
తెలంగాణ ప్రజలు పాలేర్లుగా మారాల్సి వస్తోంది: విపకాశ్
టెక్కీ ఆవిర్భావం శుభపరిణామం: అల్లం నారాయణ

tred-talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 21 ():‘‘భారత్ హెవీ ఎలక్షికికల్స్ లిమిటెడ్‌లో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి (సీమాంధ్ర వ్యక్తి) తన పలుకుబడిని ఉపయోగించి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 3,500 మందికి ఉద్యోగాలు కల్పించారు. దీంతో స్థానిక తెలంగాణ యువత తమ ఉపాధి అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది.’’

‘‘బూర్గుల రామకృష్ణారావు (తెలంగాణ వ్యక్తి) సమీప బంధువు ఒకరు పరిక్షిశమ స్థాపించేందుకు తన భూమిని తనఖా పెట్టి బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా, బ్యాంకు మొండిచేయి చూపింది. చివరకు విసుగెత్తిన ఆయన భూమిని ఓ సీమాంవూధుడికి విక్రయించాడు. తెలంగాణ వ్యక్తికి రుణం ఇచ్చేందుకు అంగీకరించని ఆ బ్యాంకు సీమాంధ్ర వ్యక్తికి అదే భూమిపై రెండు నెలల్లో రుణం మంజూరు చేసింది.’’

‘‘తెలంగాణకు చెందిన పారిక్షిశామికవేత్త ఒకరు విశాఖపట్నం సమీపంలో సిమెంట్ పరిక్షిశమ స్థాపనకు ప్రయత్నించి అనువైన స్థలం కోసం సంప్రదించగా ఏపీఐఐసీ తాను సేకరించిన ధరకంటే 10 రెట్లు అధికంగా ధరకు భూమిని కేటాయించింది. ఆ స్థలంలోనూ సిమెంట్ పరిక్షిశమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల పాటు సీమాంధ్ర నాయకులు, పారిక్షిశామిక వేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు మరో స్థలంలో ఆయన పరిక్షిశమ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.’’

... ఇవి తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టీఈసీసీఐ-టెక్కి) ఆవిర్భావ సమావేశంలో పలువురు వ్యక్తులు ఉదహరించిన సంఘటలు. సీమాంవూధుల పాలనలో తెలంగాణ పారిక్షిశామిక రంగం ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, అణచివేతకు సంబంధించిన ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇలా రంగాల్లో దోపిడీకి గురైన తెలంగాణ సమాజం ఉత్తేజితమై దోపిడీదారులపై తిరుగుబావుటా ఎగురవేస్తున్న క్రమంలో తాజాగా తెలంగాణ పారిక్షిశామిక వేత్తల సైతం తమ పోరాటానికి అంకురార్పణ చేశారు. ఒకప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా పరిఢవిల్లిన తెలంగాణ పారిక్షిశామిక రంగం దశల వారీగా దెబ్బతినడం వెనుక ఉన్న సీమాంవూధుల కుట్రను ఎండగడుతూ, పునురుజ్జీవం దిశగా అడుగులు వేస్తోంది. 

తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య వేత్తలకు ప్రోత్సాహం అందించి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే ధ్యేయంగా టెక్కీ ఆవిర్భవించింది. ఈ కార్యక్షికమం బుధవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ సీహెచ్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. టెక్కి వెబ్‌సైట్‌ను పేర్వారం రాములు ఆవిష్కరించారు. పెన్నార్ ఇండవూస్టీస్8 చైర్మన్ జె.ఉపేందర్‌రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్షికమంలో టెక్కి అధ్యక్షుడు ఎం ఉపాధ్యక్షులు వై.జైహింద్ రెడ్డి, వేదకుమార్, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, విపకాశ్, ప్రముఖ రాజకీయ నాయకులు కమలాకర్, ప్రొ.రమేష్, ఇండవూస్టియలిస్ట్ బ్రహ్మయ్య, జె.బాపుడ్డి తదితరులు మాట్లాడారు.

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ హనుమంతరావు అభివూపాయపడ్డారు. ఆర్థిక ప్రగతిని సాధించడం అనేది భారత ఆర్థిక ప్రణాళికలో కీలకాంశం అన్నారు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచీ అమలుచేస్తున్న ప్రణాళికల్లో నిర్ధేశించుకున్న లక్ష్యాలతో పోలిస్తే సాధించిన ప్రగతి తక్కువగానే ఉందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత అభివృద్ధిలో వేగం పుంజుకున్నప్పటికీ పేదరిక పెరిగారనారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు పారిక్షిశామికవేత్తలకు మంచి ఊపునిచ్చాయని పేర్కొన్నారు. 

జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్8గఢ్ రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఆయా ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. ఈ అభివృద్ధి మాతృ రాష్ట్రాల(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధికంటే ఎక్కువుందన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో ఇంతకు ముందు రాష్ట్రాలు సైతం చిన్నవిగా మారాయని తెలిపారు. తద్వారా ఈ రాష్ట్రాల్లోనూ(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధి రేటు పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో బీహార్ సాధించిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. మహరాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కారణంగానే విదర్భ, తెలంగాణకు పోలికుందని పలువురు భావిస్తారు, కానీ ‘విదర్భ నిరాదరణకు గురైతే తెలంగాణ దోపిడీకి గురైందని’ ప్రొ.జయశంకర్ ఒక చక్కని వివరణ ఇచ్చారని హనుమంతరావు గుర్తుచేశారు. రాష్ట్రంలోని మొత్తం పరిక్షిశమల్లో 62 శాతం తెలంగాణ ప్రాంతంలో ఉండగా, వాటిలో 75శాతం సీమాంధ్ర వ్యక్తులకు చెందినవేనన్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల్లోనూ తెలంగాణ వారికి 25శాతం కూడా దక్కలేదన్నారు.

రక్తం మరిగిపోతోంది: పేర్వారం
అనాదిగా తెలంగాణ అణచివేతకు గురికావడం ఒకెత్తయితే 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం పరిణామాలతో అంతకు మించిన అన్యాయం జరుగుతోందని రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్8 పేర్వారం రాములు అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి చిదంబరం, ప్రధాన మంత్రి తదితరులు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే మాలాంటి రిటైర్డ్ ఉద్యోగులకూ రక్తం మరిగిపోతోంది’ అని ఘాటుగా స్పందించారు. ‘ఆంవూధవూపదేశ్ ఆవిర్భావానికి వ్యతిరేకంగా 1952లోనే (నేను రెండో తరగతిలో ఉన్నా) ఈ ప్రాంతంలో వ్యతిరేకత ఉంది..’ అని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక డిమాండ్లకు పోలిక లేదన్నారు. తెలంగాణను విదర్భతో ముడిపెట్టడం తగదని పేర్కొన్నారు. తెలంగాణలో పారిక్షిశామిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని, సీమాంవూధుల పెత్తనం మొదలయ్యాకే ఈ ప్రాంతం దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.

అవినీతిలో ఎందెందు వెతికినా సీమాంవూధులే: కేటీఆర్
దేశంలో జరిగిన దాదాపు అవినీతి కుంభకోణాల్లో సీమాంవూధుల పాత్ర ఉండటం వారి దోపిడీ విధానానికి నిదర్శనమని టీఆర్‌ఎస్8 ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్న నానుడిని వీరు నిజం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిజాం షుగర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్8 రాజశేఖరడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి వైఎస్8 తాను అధికారంలోకి వచ్చాక పూర్తి భిన్నంగా వ్యవహరించి నిజాం షుగర్స్‌ను కోలుకోలేని స్థితికి వచ్చేలా చేశారని మండిపడ్డారు. తెలంగాణ భూములను కొల్లగొ చంద్రబాబు ప్రభుత్వం కిటీకీలు తెరిస్తే కాంగ్రెస్8 ఏకంగా తలుపులే తెరిచిందన్నారు.

అభివృద్ధికంటే దోపిడే అధికం: ప్రకాశ్
సీమాంవూధులు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్ధం అని ప్రముఖ తెలంగాణవాది విపకాశ్ అన్నారు. ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉందని గుర్తుచేశారు. తమకు అనువైన ప్రాంతంగా భావించి తెలంగాణకు వచ్చిన సీమాంవూధులు అంచెలంచెలుగా ఇక్కడి వనరుల్ని దోచుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వారుపెట్టిన పెట్టుబడులకన్నా ప్రభుత్వం ద్వారా పొందిన రాయితీలు, ప్రయోజనమే అధికమన్నారు. చర్లపల్లి పారిక్షిశామికవాడలో ఉన్న సుమారు 500 కంపెనీల్లో 300 వరకు సీమాంవూధుల ఆధీనంలోనివే అయినప్పటికీ, ఆయా కంపెనీల పెట్టుబడులు మిగతా వాటితో పోలిస్తే 10శాతం కూడా లేవని చెప్పారు. కేవలం ఫార్మా రంగంలోనే సీమాంవూధులు అధికంగా పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ ప్రాంతంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీల వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. పరిక్షిశమల కోసం స్థలాల్ని కోల్పోయిన తెలంగాణ ప్రజలు సొంత భూముల్లో పాలేర్లుగా మారాల్సిన దుస్థితికి వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విధ్వంసం నుంచి పునరుజ్జీవనం దిశగా: అల్లం
అడుగడుగునా విధ్వంసానికి గురైన తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య రంగాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ అభివూపాయపడ్డారు. సీమాంవూధులు ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ సమాజాన్ని దోపిడీకి గురిచేశారన్నారు. తొలుత సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ దోపిడీ ఆరంభమైందని వివరించారు. ఒకప్పటి మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ పవర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఐమాక్స్ శిథిలాల కిందికి చేరిపోయిందన్నారు.

మీడియా హౌజ్‌లూ అదే దారిపట్టాయని చెప్పారు. విదర్భ వెనుకబడిన ప్రాంతం అయితే తెలంగాణ దోపిడీకి గురైన ప్రాంతం అని అన్నారు. సీమాంవూధుల విచ్చలవిడి దోపిడీతో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో నష్టపోయిందని, నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి సంస్థపూన్నో ఖాయిలా పడ్డాయని పేర్కొన్నారు. ఐడీపీఎల్ మూతపడిన వెంటనే చౌటుప్పల్ పరిసరాల్లో సీమాంవూధులకు చెందిన సుమారు 40ఫార్మా కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ పారిక్షిశామిక రంగం ఆర్థిక స్వావలంభన సాధించి నిలదొక్కుకోవడంలో భాగంగా టెక్కీ ఆవిర్భావం తొలి అడుగని ఆయన అన్నారు.

Take By: T News

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు

-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు



DSC_8486-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్‌లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించారు.

సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్‌ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్‌లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు

నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.

ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్‌రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.

తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్‌లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్‌గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .

తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్‌లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.

తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం

Telangana History 

Read Part - 1 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

Read Part - 3 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html


Take By: T News .

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP