Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Scam. Show all posts
Showing posts with label Scam. Show all posts

Saturday, November 10, 2012

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతీయుల నల్లధనం 6 వేల కోట్లు!

తాజా బాంబు పేల్చిన కేజ్రీవాల్ బృందం
700 మందికి ఆ బ్యాంకులో ఖాతాలున్నాయని ఆరోపణ..
జెనీవా బ్యాంకులో గుప్త సొత్తుల గుట్టురట్టు
అవినీతికి ప్రభుత్వ ప్రోత్సాహం.. మండిపడిన కేజ్రీవాల్
- అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు
- మొటెక్ సాఫ్ట్‌వేర్ సంస్థ (రిలయన్స్ గ్రూప్) ఖాతాలో రూ.2100 కోట్లు
- కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్ ఖాతాల్లో రూ.125 కోట్లు
- డాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 9: కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు! అధికార, ప్రతిపక్ష నేతల బండారాలు బయటపెట్టిన కేజ్రీవాల్... తాజాగా దేశంలోని ప్రముఖ వ్యాపారవర్గాల గుప్త సొత్తుల గుట్టురట్టు చేశారు. స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని హెస్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతదేశానికి చెందిన 700 మంది ఆరువేల కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్నారని సంచలన ఆరోపణ చేశారు! దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన అంబానీ సోదరులు మొదలుకుని జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, డాబర్ ప్రమోటర్లకు ఈ బ్యాంకులో రహస్య ఖాతాలు ఉన్నాయని బయటపెట్టారు. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించడం వల్లే విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయుల అవినీతి ధనం గుట్టలు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బడా వ్యాపారవేత్తలకు తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. హవాలాను ప్రోత్సహిస్తున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎస్‌బీఐలో కన్నా.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం చాలా సులభమని అన్నారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు సైతం ఇదే మాట చెప్పారు.

దేశంలోని బడా నేతల అవినీతి భాగోతాలను బయటపెడుతున్న ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నల్లధన కుభేరులపై విరుచుకుపడ్డారు. దేశంలో నల్ల ధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనంపై చర్చ జరుగుతోందికానీ, దాన్ని వెనక్కి రప్పించడంలో ఏ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించలేదని విమర్శించారు. నల్లడబ్బును దాచిన నేతల వివరాలు తెలిసి కూడా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో 700 మంది భారతీయులకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఖాతాల్లో మొత్తం రూ.6000 కోట్ల డబ్బు మూలుగుతోందని సంచలనాత్మక ఆరోపణ చేశారు. భారత్‌లో నల్లధనాన్ని హెచ్‌ఎస్‌బీసీ ప్రోత్సహిస్తోందన్నారు.
kejriwal
ఆ బ్యాంకులో ఖాతాలు కలిగిన వారిలో అంబానీ సోదరులు, జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేశ్‌గోయల్, కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీ కోర్ గ్రూప్ సభ్యురాలు అనూటాండన్‌లు ఉన్నారని చెప్పారు. వారు భారీ ఎత్తున ఆ బ్యాంకులో నల్ల ధనాన్ని దాచారని ఆరోపించారు. ఈ వివరాలను శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో కలిసి కేజ్రీవాల్ విలేకరులకు వెల్లడించారు. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో రహస్య అకౌంట్లు కలిగిన బడా వ్యక్తుల వివరాలు ఇంకా తమ వద్ద ఉన్నాయన్నారు. వందల కోట్లు దాచిన వారిపై ఈగ కూడా వాలనీయకుండా, చిన్నవారిపై దాడులు చేస్తోందని ఆరోపించారు. అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు ఉన్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. వారి తల్లి కోకిలా బెన్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. యశోవర్ధన్ బిర్లా ఖాతాలో కూడా జీరో బ్యాలెన్స్ ఉందని, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మొటెక్ సాఫ్టవేర్ సంస్థ ఖాతాలో రూ.2100 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్‌కు చెందిన ఖాతాల్లో రూ.125 కోట్లు.. దాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని కేజ్రీవాల్ వివరించారు. ఈ వివరాలన్నీ 2006లో సేకరించినవిగా వెల్లడించారు.

కొత్త ఆరోపణలేంకాదు: ప్రభుత్వ వర్గాలు
నల్లధనంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను యూపీఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘ఆయన చేసిన ఆరోపణల్లో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు. పైగా వాటికి సరైన ఆధారాలను కూడా ఆయన చూపడంలేదు’ అని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం రాత్రి పేర్కొన్నాయి. ‘ఆదారాల్లేని ఆరోపణలపై నేను స్పందించను’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో తమకు ఎలాంటి అక్రమ ఖాతాలు లేవని.. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అంబానీ సోదరులు తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఐఎల్ నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల వల్ల ఎన్నో బ్యాంకులతో సంబంధాలు ఉన్నాయని.. అందులో హెచ్‌ఎస్‌బీసీ ఒకటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని స్వార్థపూరిత శక్తుల వల్లే కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. హెచ్‌ఎస్‌బీసీలో నల్లధనాన్ని బయటపెట్టాలని బీజేపీ నేత అద్వానీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ అనూటాండన్, జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్‌గోయల్, దాబర్ ప్రమోటర్స్ బర్మన్స్ సోదరులు ఖండించారు. హెచ్‌ఎస్‌బీసీ కూడా ఆరోపణలను ఖండించింది.

ఇంటి నుంచే హెచ్‌ఎస్‌బీసీ ఖాతా ఓపెన్.. నిర్వాహణ
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతా తెరవాలంటే జెనీవా వెళ్లనక్కర్లేదని, ఆ బ్యాంకు ప్రతినిధులే ఇంటికి వస్తారని కేజ్రీవాల్ చెప్పారు. డబ్బులు కూడా వారికే అప్పగించొచ్చునన్నారు. శ్రమ లేకుండా ఆన్‌లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చన్నారు. అవసరమైనప్పుడు సంప్రదించడానికి కాంటాక్ట్ నెంబర్ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో హెచ్‌ఎస్‌బీసీ వల్ల హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌బీఐతో పోలిస్తే స్విస్ బ్యాంకులో ఖాతా తెరవడం చాలా సులభమన్నారు. హెచ్‌ఎస్‌బీసీ విధానాల వల్ల ఉగ్రవాదులకు మేలు జరుగుతోందన్నారు. పాకిస్థాన్‌లో ఉండి భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు, నేరస్తులకు ఈ బ్యాంకు ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం సులభమన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశ ద్రోహం, భారత్‌పై యుద్ధం ప్రకటన వంటి కేసులను నమోదు చేసి, ఆ బ్యాంకు అధికారులను అరెస్టు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆ బ్యాంక్ హవాలా దందా చేస్తుందనడానికి ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలన్నారు.హెచ్‌ఎస్‌బీసీలో 700 మందికి ఖాతాలు ఉంటే 125 మందిపైనే దాడులు నిర్వహించడానికి కారణం ఏమిటని కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
voice2telangana.blogspot.com
నల్ల కుబేరులకు ప్రణబ్‌అండ: కేజ్రీవాల్
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలున్న 700 మంది బడా నేతలకు కాపాడ్డానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రయత్నించారని కేజ్రీవాల్ ఆరోపించారు. వారి నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి వాలెంటరీ డిస్‌క్లోజర్ ఆఫ్ ఇన్‌కం స్కీం (వీడీఐఎస్)ను ప్రవేశపెట్టారని చెప్పారు. విపక్షాల విమర్శలకు జడిసి దాన్ని విరమించుకున్నారన్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా ముఖర్జీ ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం బడా వ్యక్తులకు అమ్ముడుపోయిందన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం వారికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఈ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారి వివరాలు అధికారికంగా నిరూపించడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి దక్కించుకున్న ఓ కాంగ్రెస్ నేత చెప్పిన వివరాల ప్రకారమే తాము ఈ పరిశోధన చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసి రికార్డు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే మరింత కూపీలాగి ఈ ఖాతాల వివరాలను సేకరించామని చెప్పారు.

న్యాయవ్యవస్థే తదుపరి లక్ష్యం
రాజకీయ నేతలు, పారిక్షిశామికవేత్తలపై ఆరోపణలు చేసిన సంచలనం సృష్టించిన కేజ్రీవాల్ తదుపరి ఆరోపణలు ఎవరిపై అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి ఆయన శుక్రవారం సమాధానం ఇచ్చారు. దేశంలోని న్యాయవ్యవస్థే తమ తదుపరి లక్ష్యమన్నారు. దేశంలోని అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసులు ఏళ్ల తరబడి తీర్పుకు నోచుకోకుండా వాయిదాలు పడ్డం వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఆధారాలతో మీరు కోర్టుకు ఎందుకు వెళ్లరు అన్న ప్రశ్నకు సమాధానంగా.. మేం కోర్టును ఆశ్రయిస్తే.. ప్రభుత్వం అక్కడ మేనేజ్ చేస్తుందని వ్యాఖ్యానించారు.


- T News

Read more...

Wednesday, October 31, 2012

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతిని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డంటూ కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ను, మహారాష్ట్ర నీటి పారుదల కుంభకోణంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీని కేజ్రీవాల్ బయటకు తెలిసిన విషయం తెలిసిందే.

- T News

Read more...

Monday, July 2, 2012

మెడికల్ సీట్ల కుట్ర


- index talangana patrika telangana culture telangana politics telangana cinema సీమాంవూధకు అదనంగా 150 సీట్లు.. తెలంగాణకు సున్నాయే
- 250 సీట్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కటీ తేలేదు
- అధికారుల నిర్లక్ష్యంతో రాని వరంగల్, గాంధీ సీట్లు
- కనీస సౌకర్యాలు లేవని ఉస్మానియా సీట్లు కట్
- అవిలేకున్నా సీమాంధ్ర కాలేజీలకు సీట్లు
- మెడికల్ సీట్ల విషయంలో కొనసాగుతున్న వివక్ష

హైదరాబాద్, జూలై 1 (): ఇది మరో దగా.. తెలంగాణ పట్ల సీమాంధ్ర అధికారులు, వారితో కలిసిపోయే ప్రభుత్వాల తీరును బట్టబయలు చేసే మరో సందర్భం. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఈ సంవత్సరం మెడికల్ సీట్ల విషయంలో కూడా తెలంగాణకు వివక్షే ఎదురైంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు పంపిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీమాంవూధకే సీట్లు తెప్పించే బాధ్యతను తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గుంటూరు, అనంతపురం కాలేజీల నివేదికలను ఎంసీఐకి పంపలేదు. ఎనిమిది కాలేజీల నివేదికలనే పంపారు. వాటిల్లో తెలంగాణ నుంచి గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల నివేదికలు కూడా ఉన్నాయి. ఎంసీఐ పరిశీలన బృందం ఇన్‌స్పెక్షన్‌కు వచ్చినప్పుడు దాదాపు ఏ కాలేజీలోనూ కనీస మౌలిక సదుపాయాలు లేవని, భవనాలు, ల్యాబ్‌లు, రేడియాలజీ యూనిట్లు, తాగునీరు, బాత్‌రూంలు సరిగ్గా లేవని రాష్ట్రానికి లేఖ రాసింది.

ఆ లేఖలో విశాఖపట్నం కాలేజీకి సీట్లు ఇచ్చేందుకు ఓకే కానీ, ఈ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సెక్రెటరీ బాధ్యత తీసుకుంటే ఇస్తామని మెలి క పెట్టింది. ఇందుకు ప్రతి లేఖ ఇవ్వడంతో విశాఖపట్నం కాలేజీకి సీట్లు దక్కాయి. ఇక విజయవాడ, కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలకు కూడా 50సీట్ల చొప్పున దక్కాయి. మొత్తంగా సీమాంవూధలోని మూడు కాలేజీలకు అదనంగా 150 సీట్లుదక్కాయి. అదే తెలంగాణ విషయానికొస్తే ఉస్మానియా కాలేజీలో తాగునీరు, కరెంటువైర్లు బయటకు కనిపిస్తున్నాయనే సాకును చూపి సీట్లు ఇవ్వలేదు. ఇక గాంధీలో ఓపీ తక్కువ ఉందనే కారణంతో అసలు ఇన్‌స్పెక్షనే చేయలేదు. ఇక వరంగల్ కాలేజీ విషయానికొస్తే ఇక్కడ పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ కాలేజీ రిపోర్టునే సరైన సమయానికి డీఎంఈకి ఇవ్వలేకపోయారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ కాలేజీకి కూడా ఎంసీఐ బృందం పరిశీలనకు వెళ్లలేదు. అంటే తెలంగాణలోని మూడు కాలేజీలకు సీట్లు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం, సీమాంధ్ర అధికారుల కుట్ర ఉందని తెలుస్తోంది.

నిజామాబాద్ కాలేజీకి స్టాఫ్‌ను కేటాయించి, భవనాలు త్వరగా పూర్తిచేసి ఉంటే ఈ ఏడాది వంద సీట్లతో కాలేజీ ప్రారంభమయ్యేది. కానీ అధికారులు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ కాలేజీ 2010లో ప్రారంభమైన ఇప్పటికీ సీట్లు తెచ్చుకోలేకపోతోంది. ఇలా తెలంగాణకు రావాల్సిన 250సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి వైద్య రంగంలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలొస్తున్నాయి.

సౌకర్యాలు లేకున్నా సీమాంవూధకు సీట్లు
తెలంగాణలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో తాగునీరు, బాత్‌రూం, ల్యాబ్‌లలో రిపేర్లు సాకుగా చూపి 50సీట్లు రాకుండా పోయాయి. అదే సీమాంవూధలోని విజయవాడ మెడికల్ కాలేజీలో రేడియాలజీ, రూరల్ హెల్త్ సెంటర్ భవనం, మరికొన్ని సౌకర్యాలు లేకపోయానా ఎంసీఐ సీట్లు మంజూరు చేసింది. దీని వెనుక సీమాంధ్ర అధికారులు కుట్ర ఉందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియాలో చిన్నచిన్న సమస్యలుంటే సీట్లు ఇవ్వరుగానీ, సీమాంవూధలో మాత్రం భవనాలు, డిపార్ట్‌మెంట్లు లేకపోయినా సీట్లు ఎలా ఇస్తారనే మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ఇది స్టేట్‌వైడ్ కాలేజీ కనుక సీట్లు మూడు ప్రాంతాలకు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ కాలేజీలో లేని సౌకర్యాలు బయటకు చెబితే ఉన్న సీట్లు పోతాయని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన సీట్లను పక్కన పెట్టి 30సీట్లు మాత్రమే ఇందులో ఇస్తున్నారు.

Take By: T News

Read more...

Wednesday, February 8, 2012

సిండికేట్లకే బందిపోట్లు



mopidevi talangana patrika telangana culture telangana politics telangana cinema మంత్రి మోపిదేవికి పది లక్షలిచ్చా.. బాంబు పేల్చిన ఖమ్మం లిక్కర్ డాన్
-ఎక్సైజ్ అధికారులు మొదలు కామ్రేడ్ల దాకా
-విలేకరులకూ లంచాలిచ్చిన మద్యం వ్యాపారి
-తిలాపాపం తలా కొంత పంపిణీ!
-రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వెల్లడి
-ఇది ఒక్క జిల్లాలోనే.. ఇతర జిల్లాల్లో?
-రాజకీయ పార్టీల్లో పెను సంచలనం
-నష్టనివారణ చర్యల్లో పార్టీలు
-ఎందుకు తీసుకున్నామంటే...
-వివరణలు ఇచ్చేందుకు పోటీలు

హైదరాబాద్, మహబూబాబాద్, ఫిబ్రవరి 7 () :మద్యం మంత్రికి పది లక్షలు.. రాజకీయ నాయకులకు వారి వారి స్థాయి, హోదాలను బట్టి యాభై వేలు మొదలు లక్ష, రెండు లక్షలు ఐదు లక్షలు! పదివేలు, పాతికవేలతో సర్దుకుపోయినవారూ ఉన్నారు! అధికారులు భారీగా గుటుక్కుమనిపించారు. విలేకరులూ తగ్గలేదు! ఇది మద్యం వ్యాపారం, రాజకీయ నాయకత్వం కలిసి మెలిసి సహజీవనం చేస్తున్నాయనడానికి తాజా తార్కాణం. నిలు దర్శనమిచ్చిన నగ్నసత్యం! మద్యం వ్యాపారంలో లొసుగులు బయటపడకుండా ఉండేందుకు.. అక్రమంగా అధిక ధరలకు అమ్మేసుకుంటున్నా.. నోరు మెదపకుండా ఉండేందుకు.. లంచాల రూపంలోనైతేనేమి.. చందాల పేరుతోనైతేనేమి.. తిలాపాపం తలా కొంచెం! ముడుపులు ముట్టాయి! ఇది ఖమ్మం జిల్లా లిక్కర్ కింగ్ నున్నా రమణ బయటపెట్టిన సత్యం! అవినీతి నిరోధక శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో లిక్కర్ డాన్ చదివిన మద్యం పద్దుల చిట్టా! ఉరుములేని పిడుగులా వచ్చి పడిన బాంబుతో భీతిల్లిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. తాము ఆ వ్యాపారి నుంచి ఎందుకు ఆ మొత్తాలు తీసుకున్నామో వివరణలు ఇస్తున్నాయి! మొత్తానికి.. డబ్బులు తీసుకున్నది నిజమేనని అంగీకరించాయి!

మద్యం సిండికేట్ల వెనుక పొలిటికల్ గాడ్‌ఫాదర్లు ఉన్నట్టు వచ్చిన వార్తలకు బలం చేకూరింది. ఖమ్మంలో మద్యం సిండికేట్లకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ సంబంధం బట్టబయలైంది. సిండికేట్ల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు గాను ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తాను స్వయంగా పది లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానని లిక్కర్ డాన్ నున్నా రమణ సంచలనం రేపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్‌లో ఖమ్మంలోని చంద్రవైన్స్ యజమాని బాలాజీ, మంత్రి క్లాస్‌మేట్ అయిన రాజబాబుతో కలిసి ఈ సొమ్ము అందించినట్లు ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. మంత్రితో పాటు ఖమ్మం జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులకు, ఎక్సయిజ్ అధికారులకు లక్షల్లో ఇచ్చానని, విలేకరులకు కూడా ముడుపులు చెల్లించానని తెలిపాడు. రమణను మంగళవారం కోర్టులో హాజరుపర్చినప్పుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో.. రమణ ఎవవరికి ఎంతెంత సొమ్ము ఇచ్చారో ఆ వివరాలన్నింటినీ ఏసీబీ పేర్కొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించిన సమయంలోనే కొందరు మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో లిక్కర్ కింగ్ రమణను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.

ఈయన వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వ్యక్తి. రమణను ఏసీబీ అధికారులు విచారించగా పలు సంచలనాత్మక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలను పొందుపరుస్తూ ఏసీబీ వరంగల్ జిల్లా డీఎస్పీ టీపీ విఠలేశ్వర్ రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 0/ఏసీబీ-డబ్ల్యూకేహెచ్/2012 ప్రకారం అఫెన్స్ యూ/ఎస్ 7, , 12, 13(1)(ఏ) అండ్ (0) ఆర్/డబ్ల్యూ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 19 అండ్ సెక్షన్స్ 120-బీ, 34 అండ్ 109 ఐపీసీ సెక్షన్ల ప్రకారం డీఎస్పీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రమణకు పది మద్యం సిండికేట్లలో 29 మద్యం దుకాణాలు ఉన్నాయని, వీటన్నింటినీ రమణ బినామీ పేర్లతో 2010, జూలైలో తీసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. టెండర్ల సమయంలో ఎక్కువ ధరలకు వేర్వేరు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు.. ఆ తర్వాత గరిష్ఠ చిల్లర ధరకన్నా ఎక్కువ రేట్లకు మద్యాన్ని విక్రయిస్తూ కోట్లుకొల్లగొట్టారు. ఎమ్మార్పీ రేట్లకన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు జరిపినా కేసులు నమోదు చేయకుండా ఎక్సయిజ్, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తాల్లో మామూళ్లు ముట్టజెప్పారు.

లైసెన్సులు దక్కించుకున్న తరువాత సిండికేట్‌గా ఏర్పడుతూ అక్రమాలకు తెర తీస్తున్నారు. అకౌంట్స్ బాధ్యతలను ఒకటి రెండు మద్యం దుకాణాల యజమానులకు అప్పగిస్తున్నారు. వీళ్లే సిండికేట్‌లోని ఏయే వైన్‌షాపులు ఎంతెంత సరుకు కొనుగోలు చేశాయి? ఎంతవిక్రయాలు జరిపాయి? అన్నది రికార్డు చేస్తారు. అనంతరం వచ్చిన స్థూల లాభాలను లెక్క తేలుస్తారు. ఈ లాభాల్లో నుంచి ఆయా షాపుల లైసెన్స్ ఫీజులను ప్రభుత్వానికి చెల్లిస్తారు. రోజువారీ నిర్వహణ ఖర్చులు, మామూళ్లు తీసివేసి నికర లాభాలు తేలుస్తారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టు ప్రకారం ఆయా అధికారులకు ప్రతినెలా నిర్ణీత మొత్తంలో మామూళ్లు మద్యం వ్యాపారుల నుంచి వెళుతున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, వైరా, పాల్వంచ, భద్రాచలం, ఏదులాపురం, గార్ల, కారేపల్లి, విశ్వనేతపల్లి, కొత్తలింగాల, బోనకల్లు, కల్లూరు, ముదిగొండ తదితర ప్రాంతాలతోపాటు వరంగల్, ఇతర జిల్లాల్లో అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు రమణ విక్రయిస్తున్నాడని తెలిపారు. అందుకోసం అధికారులు, ప్రజావూపతినిధులకు మామూళ్ల రూపంలో నెలనెలా నగదును ముట్టచెబుతున్నాడని వెల్లడించారు.

రమణ 29 మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానూ, 0 దుకాణాల్లో పరోక్షంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. రాజకీయ నాయకుల విషయానికొస్తే.. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు రూ.5లక్షలు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్షికసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావుకు రూ.4.5 లక్షలు, సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌కు రూ.3 లక్షలు, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు రూ.3 లక్షలు, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్యకు రూ.3 లక్షలు చెల్లించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

మామూళ్లు నిర్ణయించేది నేనే!
ఎవవరికి ఎంతెంత మామూళ్లు ఇవ్వాలన్నది తానే నిర్ణయించినట్టుగా రమణ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. 2010, జూలై 1వ తేదీ నుంచి 2010, సెప్టెంబరు 31వ తేదీ మధ్య మూడు నెలల కాలానికి ఎక్సయిజ్ ఎస్‌ఐ మహేంవూదకుమార్‌కు రూ.1,44,495 ఇచ్చినట్టు తెలిపాడు. ఈ మొత్తాన్ని ఎక్సయిజ్ సీఐ డీఎస్‌నాథ్, సూపరింటెండెంట్ మధుసూదన్‌రావులు పంచుకున్నట్టు చెప్పాడు. ఇక, రమణ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో కొత్తగూడెంలోని ఎంజే వైన్స్ యజమాని జనార్ధన్‌డ్డి తరఫున కొత్తగూడెం డీఎస్‌పీ దేవదాస్‌నాగుకు 2011లో రూ.50వేలు మామూళ్ల కింద ఇచ్చినట్టు తేలింది. గోల్డెన్ వైన్స్, సాయి సుధ వైన్స్‌కు చెందిన సుబ్బారావు, షాజీరావుల తరఫున ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌కు రూ.24వేలు, ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ మహేంవూదకుమార్‌కు రూ.12వేలు, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు రూ.12వేలు ముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక షాజీరావు తరఫున ఖమ్మం ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు మూడు దఫాలుగా రూ.36వేలు, రూ.1వేలు, రూ.1వేలను ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ ద్వారా పంపించినట్టు రమణ తెలిపాడు. ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్‌కు ఎనిమిది వైన్‌షాపుల నుంచి రూ.96వేలు అందినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.

మద్యం వ్యాపారులు సుబ్బారావు, షాజీరావుల నుంచి నాలుగు వైన్‌షాపుల తరఫున రూ.60వేలను ఎక్సయిజ్ ఎస్‌ఐ మహీందర్‌కుమార్ మామూళ్లుగా తీసుకుని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు అందచేసినట్టుగా వెల్లడించారు. ఖమ్మంలోని భ్రమరాంబ వైన్స్ కౌంటర్ ఇన్‌చార్జిగా ఉన్న రాజు నుంచి ఎక్సయిజ్ ఎస్‌ఐ ప్రతాప్ నెలకు రూ.12వేలను లంచంగా తీసుకుంటూ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌కు అందచేస్తున్నట్టుగా తేలింది. వైరా ఎక్సయిజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమ.. శ్రీదుర్గ వైన్స్, భ్రమరాంబ వైన్స్‌లో కౌంటర్ ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న రాజు, మురళి నుంచి నెలకు రూ.6వేల చొప్పున వసూలు చేసి ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌రావుకు చేరుస్తున్నట్టు పేర్కొన్నారు. సిండికేట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న రమణ.. మద్యం వ్యాపారంతోపాటు గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు అతనిపై మూడు కేసులు కూడా నమోదై ఉన్నట్టు తేలింది. రమణ గతంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి, తర్వాతి కాలంలో ఈ దందాలోకి దిగాడు. ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ఎస్‌ఐ మహింవూదకుమార్, వైరా ఎక్సయిజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమలు మద్యం దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేసి పై అధికారులకు అందచేస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.

నిరాధార ఆరోపణలు...
తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో చెప్పారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తి తనపై ఆరోపణలు చేయటం వెనక కుట్ర ఉందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితో చర్చించనున్నట్టు తెలిపారు. విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంవూతిని కోరుతానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని విచారణలో తేలితే మంత్రి పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

ఎవరికెంత?
మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత: రూ.5 లక్షలు
పోటు రంగారావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి): రూ.4.5లక్షలు
పోతినేని సుదర్శన్ (సీపీఎం జిల్లా కార్యదర్శి): రూ.3 లక్షలు
పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ నేత): రూ.3 లక్షలు
విజయసారధి (సీపీఐ నేత): రూ.40వేలు
సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి ఎమ్మెల్యే): రూ.3లక్షలు
ఏ సమ్మిడ్డి (సాక్షి బ్యూరో మాజీ): రూ.60 వేలు
శ్రీనివాస్‌డ్డి (ఈనాడు బ్యూరో మాజీ): రూ.60 వేలు
మధుసూదన్ (ఆంవూధజ్యోతి బ్యూరో) : రూ.0 వేలు
దండి భాస్కర్ (వార్త రిపోర్టర్) : రూ.40 వేలు
దిండిగాల రాజేందర్ (టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్) : రూ.60వేలు
శ్రీనివాస్ (సీపీఎం నేత) : రూ.40వేలు

Take By: T News

Read more...

Friday, February 3, 2012

అందినంత దోచుకో - Lanco refutes allegation of Rs 13k cr scam

 http://namasthetelangaana.com/updates/2012/Feb/03/slidePic.jpg


అందినంత దోచుకో Solar-Farm talangana patrika telangana culture telangana politics telangana cinemaఅదే లగడపాటి ల్యాంకో!
నిబంధనలకు నిలువు పాతర.. జాతీయ సౌరశక్తి పథకానికి టోకరా
9 దొంగ కంపెనీలతో కాంట్రాక్టులు.. అల్లిబిల్లి కంపెనీలన్నీ ల్యాంకోవే!
డైరెక్టర్లుగా ఉద్యోగులు, వారి కుటుంబీకులు
9, 10 ఏళ్ల చిన్నారులూ డైరెక్టర్లే.. కంపెనీల అడ్రస్‌లన్నీ ఒక్కచోటే!


రూ.13 వేల కోట్ల
‘సౌరశక్తి’
కుంభకోణం!
వెలుగులోకి
తెచ్చిన సీఎస్‌ఈ
విచారణ
జరుపుతామన్న
కేంద్రం


ఇది లగడపాటి మాయాజాలం! రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల పేరుతో, వక్ఫ్‌భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వెనకేసుకున్న కోట్లు చాలవన్నట్లు.. పాతికేళ్లలో 13వేల కోట్ల రూపాయలు అప్పనంగా బొక్కేందుకు రచించిన వ్యూహం! నిబంధనలకు పాతరేసి.. దొంగ కంపెనీలను సృష్టించి.. సూర్యకాంతినీ చెరప చేస్తున్న పన్నాగం! ఒక కంపెనీకి ఒకటే ప్రాజెక్టు దక్కాల్సి ఉన్నా.. టెండర్లు వేసేందుకు ఎవరూ రాని అవకాశాన్ని అందిపుచ్చుకుని.. అప్పటికప్పుడు కంపెనీలను సృష్టించి.. అన్ని కంపెనీలకూ ఒకే సెల్ నెంబర్ ఇచ్చి, అన్ని కంపెనీలనూ ఒకేచోట నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసి, ల్యాంకో ఉద్యోగులను ఆఖరుకు ఉద్యోగుల పిల్లలను సైతం కంపెనీలకు డైరెక్టర్లును చేసేసి, ఐదు పైసల తేడాతో బిడ్లు దాఖలు చేసి 235 మెగావాట్లకు విద్యుత్ ఉత్పాదనకు అనుమమతులు సాధించి ‘రాజ’ మార్గంలో దోపిడీకి సిద్ధమైన వైనం! ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధనతో సౌర విద్యుత్ రంగంలో కొత్త కంపెనీలు పోటీ పడేందుకు ఉద్దేశించిన స్ఫూర్తికి అక్రమ మేధస్సుతో కొట్టిన గండి! సౌర విద్యుత్ ఉత్పత్తికి స్వర్గధామంగా భాసిల్లుతున్న రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో దీని మూలాలు బయటపడ్డాయి! నెలల తరబడి శ్రమించిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది! లగడపాటి మాయా సామ్రాజ్యాన్ని దేశం కళ్లముందు నిలబెట్టింది!
laga45 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (): నక్కజిత్తుల వ్యవహారాలతో రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులు, వక్ఫ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కోట్లు దండుకుంటున్న ల్యాంకో... ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్రమాలకు తెరలేపిందా? దేశాన్ని కుదిపివేసిన 2జీ కుంభకోణం రీతిలో సోలార్ మిషన్‌లో వేల కోట్లు బొక్కేందుకు పన్నాగాలు రచించిందా? అల్లిబిల్లి కంపెనీలను అల్లి.. ఏకంగా 13వేల కోట్ల రూపాయలకు ‘టెండర్’ పెట్టిందా? అవుననే అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ). అనడమే కాదు.. అందుకు పకడ్బందీ ఆధారాలను సైతం బయటపెట్టింది. దీనిపై విచారణకు ఆదేశిస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించింది.
దేశంలో విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు 2022 సంవత్సరం నాటికి 20,000మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయాలని జవహర్‌లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్(జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2013 సంవత్సరాంతానికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలని నిర్దేశించుకుంది.

మొదటి దశలో 150 మెగావాట్ల ఫోటో వోల్టాయిక్(పీవీ)ప్లాంట్స్, 470 మెగావాట్ల సోలార్‌థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ‘ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధన’తో కేంద్ర న్యూ అండ్ రినెవబుల్ ఎనర్జీ(ఎంఎన్‌ఆర్‌ఈ) మంత్రిత్వ శాఖ బిడ్‌లను ఆహ్వానించింది. ఏ ఒక్క కంపెనీకీ 5 మెగావాట్లకు మించకుండా ఫోటో వోల్టాయిక్(పీవీ)ప్లాంట్, 100 మెగావాట్లకు మించకుండా సోలార్‌థర్మల్ ప్లాంట్ కేటాయించాలని జాతీయ సౌరశక్తి పథకం నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఒక్కటంటే ఒక్కడి కూడా బిడ్ దాఖలు కాలేదు. నియమ నిబంధనలను అతిక్షికమించడంలో ఆరితేరిన ల్యాంకోకు చెందిన ల్యాంకో ఇన్‌వూఫాటెక్ సంస్థ తన నక్కజిత్తుల ఆలోచనలకు పదును పెట్టింది. అవకాశం వచ్చిందే తడవుగా దొంగ కంపెనీలను సృష్టించి, 235 మెగావాట్లకు విద్యుత్ ఉత్పాదనకు అనుమమతులు సాధించింది.

నేషనల్ సోలార్ మిషన్ మొదటి దశకు బిడ్ ఆహ్వానించిన 620 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పాదనలో 40 శాతం (235 మెగావాట్లు) మేరకు కైవసం చేసుకుంది. ల్యాంకో సృష్టించిన తొమ్మిది కంపెనీలు దాఖలు చేసిన బిడ్స్‌లలో ఒక్కొక్క దానికి కేవలం రూ.0.05పైసల చొప్పునతేడాలు ఉండడం గమనార్హం. ల్యాంకో సృష్టించిన దొంగ కంపెనీల్లో ఏడు కంపెనీల ఈక్విటీ షేర్లు కేవలం రూ.10లక్షలు, రూ.11లక్షల వరకే ఉన్నాయి. సదరు కంపెనీలకు ఆస్తులు గానీ, బ్యాంకు ఖాతాల్లో రిజర్వు ఫండ్ గానీ లేకపోవవడం మరో విశేషం. ఈ దొంగ కంపెనీలన్నీ నేషనల్ సోలార్ మిషన్ బిడ్డింగ్ సమయంలోనే పుట్టుకువచ్చాయి. ఇలాంటి అంశాలు నేషనల్ సోలార్ మిషన్ నిబంధనలను పూర్తిగా విరుద్ధం. ల్యాంకో సృష్టించిన దొంగ కంపెనీలన్నింటిలోనూ ల్యాంకో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉండడం గమనార్హం. కళ్ళు తిరిగే నిజమేమిటంటే.. ఒక కంపెనీలో తొమ్మిదేళ్ళ బాలుడు, పదేళ్ళ బాలుడు డైరెక్టర్లుగా నమోదై ఉన్నారు.

వీరిద్దరూ ల్యాంకో గ్రూప్‌లోని సుబ్రమణ్యం అనే ఉద్యోగి పిల్లలుగా, సదరు సుబ్రమణ్యం ల్యాంకో సంస్థకు అత్యంత విశ్వాసమైన వ్యక్తిగా, నమ్మకస్తుడిగా అభివర్ణింస్తూ ల్యాంకో ఇన్ హౌజ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ ఎన్‌వీవీఎన్ ఆధ్వర్యంలో జరిగిందని, తాము కేవలం నిబంధనలను మాత్రమే రూపొందించామని నవీన పునర్వినియోగ ఇంధన శాఖ కార్యదర్శి గిరీశ్ ప్రధాన్ చెబుతున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన రీత్యా దీనిపై తాము లోతుగా విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే సీఎస్‌ఈ ప్రకటనలపై ల్యాంకో అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వద్ద ధ్రువీకరించుకోకుండానే ఆరోపణలు చేశారని పేర్కొంటోంది. కానీ.. సీఎస్‌ఈ మాత్రం తాము ల్యాంకో అభివూపాయాల కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని, కానీ వీలుకాలేదని తెలిపింది.

ల్యాంకో కథా కమామిషు
ల్యాంకో ఇన్‌వూఫాటెక్ సంస్థ ల్యాంకో గ్రూప్ కంపెనీల్లో ప్రధానమైంది. దీనిని 196లో ప్రస్తుత విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్థాపించారు. ల్యాంకో ఇన్‌వూఫాటెక్ కంపెనీ చైర్మన్ లగడపాటి రాజగోపాల్ అయితే ఆయన సోదరుడు లగడపాటి మధుసూదనరావు ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ల్యాంకో 2006 సంవత్సరంలో గ్లోబెపూక్ అనే సింగపూర్ సంస్థతో కలిసి మధ్యవూపదేశ్‌లోని ససన్ వద్ద 4,000మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును అత్యంత తక్కువ ధరకు అంటే యూనిట్‌కు రూ.1.196పైసల చొప్పున కోట్ చేసి దక్కించుకుంది. బిడ్డింగ్ పూర్తికాగానే ల్యాంకో-జిందాల్‌స్టీల్ కంపెనీలు కలిసి గ్లోబెపూక్ కంపెనీని కొనుగోలు చేశాయి. తొలుత సింగపూర్‌కు చెందిన గ్లోబెపూక్ ఆర్థిక స్థితుల ఆధారంగానే ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు వచ్చింది.

ల్యాంకో వ్యవహారం దేశంలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేకెత్తించింది. దీంతో ల్యాంకోను అనర్హంగా ప్రకటించారు. అదే విధంగా ల్యాంకో ఆంధ్రవూపదేశ్‌లో కొండపల్లి వద్ద ఒక పవర్ ప్రాజెక్టు, హర్యానాలో మరొక పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులు సైతం అవినీతి ఊబిలో కూరుకుపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొండపల్లి పవర్ ప్రాజెక్టును 16 నెలల్లో పూర్తిచేస్తానని బిడ్‌ను దక్కించుకున్న ల్యాంకో.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 43 నెలల సమయం తీసుకుంది. టెండర్ నిబంధనల ప్రకారం యూనిట్‌ధర కనీసం రూ.0.30పైసలు తగ్గించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏటా ఎపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లపై సుమారు రూ.90కోట్ల మేరకు భారం పడుతున్నది. గత పదకొండు సంవత్సరాలుగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ల్యాంకో దోచుకుంది. అలాగే కొండపల్లి పవర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 351 మెగావాట్ల నుంచి 369 మెగావాట్లకు పెంచి చూపించి, విద్యుత్ కంపెనీలకు సుమారు రూ.వంద కోట్లకు పైగా నష్టాలను కలిగించింది. సెంట్రల్ ఎలక్షిక్టిసిటీ అథారిటీ(సీఈఏ) సైతం కొండపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 351 మెగావా నిర్థారించినప్పటికీ ల్యాంకో సంస్థ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కాలయాపన చేస్తోంది.

సమాచార చట్టానికి అతీతమట!
ల్యాంకో ఇన్‌వూఫాటెక్ దక్కించుకున్న సోలార్ పవర్ ప్రాజెక్టు వివరాలు అత్యంత గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. వీరితో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎన్టీపీపీ విద్యుత్ వ్యాపార నిగమ్‌లు కొమ్ముకాస్తున్నాయనే విమర్శలున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ సోలార్ మిషన్ బిడ్డింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. చివరకు చట్టబద్ధంగా సమాచార హక్కు చట్టం కింద 2011 సెప్టెంబర్‌లో కేంద్రంలోని సంబంధిత శాఖను, సెంట్రల్ ఎలక్షిక్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సీఈఆర్‌సీ)ని, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగంను ఆశ్రయించింది. అయితే కేంద్ర విద్యుత్ నియంవూతణ మండలి(సీఈఆర్‌సీ), విద్యుత్ మంత్రిత్వ శాఖ సదరు సోలార్ ప్రాజెక్టుల వివరాలు తమ పరిధిలోకి రావని, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగంను సంప్రతించాలని ఉచిత సలహా ఇచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్టీపీసీ సంస్థ ఆ సమాచారం అత్యంత గోప్యమైందని పేర్కొంటూ సదరు కంపెనీలకు సంబంధించిన సమాచారం వెల్లడించినట్లయితే ఆయా కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొనడం గమనార్హం. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఎన్టీపీసీ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. అయితే ఇప్పటి వరకు సమాచారం ఇంకా బయటకు రాలేదు.

ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధన ఎందుకు?
సోలార్ పవర్ ప్రాజెక్టు మిషన్ కింద 20వేల మెగావాట్ల సామర్థ్యాన్ని 2022 నాటికి సాధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ప్రస్తుతం సోలార్ విద్యుత్ ధర ఆకాశాన్ని అంటుతున్నది. ధరను అందుబాటులోకి తీసుకురావాలంటే సౌర విద్యుత్ రంగంలోకి ఎక్కువ కంపెనీలు వచ్చేందుకు వీలుగా ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు అనే నిబంధనను విధించారు. దీంతో పోటీ పెరగడంతో పాటు భవిష్యత్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి సౌర విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గుముఖం పడుతాయనే ఆలోచ . ల్యాంకో చేసిన నిర్వాకంతో సోలార్ మిషన్ స్ఫూర్తికే గండికొట్టినట్లయ్యింది.

దొంగ కంపెనీ అర్హత ఎలా?
ఉదాహరణకు డీడీఈ రెన్యూవబుల్ ఎనర్జీ (డీడీఈఆర్‌ఈ) 5 మెగావాట్ల పీవీ ప్లాంట్‌ను దక్కించుకుంది. ఈ కంపెనీ కిషన్ లలిత్ బన్సల్, అతని ముగ్గురు పిల్లల పేరు మీద నమోదైంది. ఇదే బన్సల్ పేరుతో డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్(డీఈఈడీఈ) అనే మరొక కంపెనీ నమోదై ఉంది. ఎంఎన్‌ఆర్‌ఈ నిబంధనల ప్రకారం బిడ్‌లో పాల్గొనేందుకు బిడ్డింగ్‌కు వారం రోజుల ముందు కంపెనీ మూలధనం కనీసం రూ.17కోట్లు ఉండాలి. అయితే బిడ్‌లలో డీడీఈఆర్‌ఈ కంపెనీ డీఈఈడీఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లను సమర్పించి బిడ్‌లో అర్హత సాధించింది. దీని ఆధారంగా ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ డీడీఈఆర్‌ఈ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీచేసింది.

అడ్రస్‌లన్నీ ఒక్కటే
విచిత్రం ఏమంటే సోలార్ ప్రాజెక్టు బిడ్‌లను దక్కించుకునేందుకు పుట్టించిన కంపెనీల అడ్రస్‌లు అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రపంచంలో దేని గురించైనా ఇట్టే క్షణాల్లో గుర్తించేందుకు వీలుగా ఉన్న గుగూల్ సెర్చ్‌లో కూడా బిడ్‌లు దక్కించుకున్న కంపెనీల వివరాలు లేవంటే అవి ఎంతటి గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) సంస్థ సోలార్ పవర్‌కు స్వర్గధామంగా భావిస్తున్న రాజస్థాన్‌లో దీని మూలాలు ఉండవచ్చనే అనుమానంతో రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్‌ను కూడా సంప్రతించింది. అనుకున్నట్లే సదరు కంపెనీల మూలాలు రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా ఆస్కందార గ్రామంలో ఉన్నట్లు బయటపడ్డాయి. ఈ గ్రామంలో సౌర విద్యుత్తు కోసం వెయ్యి హెక్టార్ల భూమిని ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే వాటికి సంబంధించి ఎక్కడా ఒక్క బోర్డు కానరాదు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ ల్యాంకో కోసమే పని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారని సీఎస్‌ఈ పేర్కొంది. రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అన్ని కంపెనీలకూ కలిపి ఒకే సెల్ ఫోన్ నెంబర్ ఉండడం గమనార్హం.

లాభం అంతా
ల్యాంకోదే!

ఖాయా, దివాకర్ సంస్థలు ల్యాంకోకు అనుబంధ సంస్థలు. అలాగే కెవికె ఎనర్జీలో సంస్థకు 49 శాతం వాటా ఉంది. డీడీఈ, ఎలక్షిక్టోమెక్ కంపెనీలలో 26 శాతం ఉంది. ఈ సంస్థ న్నింటి ప్రిఫన్షియల్ షేర్లలో ల్యాంకోకు 100 శాతం వాటా ఉంది. ఈ మొత్తం విలువ నేరుగా సోలార్ మిషన్‌లో భాగంగా ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందేందుకు ఒక సంస్థకు ఉండాల్సిన నెట్‌వర్త్ (నికర ఆస్తుల విలువ)తో సమానంగా ఉంది. సోలార్‌మిషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పొందడానికి ఈ కంపెనీలను ఫ్రంట్ కంపెనీలుగా ఉపయోగించుకున్న విషయం ఇక్కడే ే టతెల్లం అవుతోంది. ప్రిఫన్షియల్ షేర్లు మూలధన వాటాలతో సమానంగా భావిస్తారు. అందునా ఈ షేర్లను భవిష్యత్‌లో ఈక్విటీ వాటాల రూపంలోకి బదలాయించుకునే అవకాశం ఉన్నందున ఈ కంపెనీలన్నింటిలో ల్యాంకోకు 99 శాతం వాటా దక్కే అవకాశం ఉంది.

ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ
మార్గదర్శకాల ఉల్లంఘన
సోలార్ పవర్ ప్రాజెక్టు ఎంపికకోసం
జులై 2010లో ఈ మార్గదర్శకాలు
జారీ చేశారు.


1. సోలార్ పవర్ ప్రాజెక్టు బిడ్డింగ్‌కోసం ఓ కంపెనీ కేవలం ఒకే అప్లికేషన్ దాఖలు చేయాలి. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు డెవలపర్లు భాగస్వామ్య కంపెనీలైనా, వ్యక్తిగత కంపెనీలైనా, గ్రూప్ కంపెనీలైనా 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికోసం ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు లభించనుంది.

2. సోలార్ థర్మల్ ప్రాజెక్టు బిడ్డింగ్‌కోసం ఏ కంపెనీ అయినా నిర్దేశిత ప్రాంతంలో మాతృసంస్థకానీ, ఏదైనా గ్రూప్ సంస్థకానీ 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే అనుమతిస్తారు. కంపెనీలు బహుళ ప్రాంతాలలో ఎన్ని ప్లాంట్లను నెలకొల్పినా మొత్తం 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మించి అనుమతి లేదు.

3. కంపెనీని నడిపే ప్రమోటర్ కనీస మూలధనం వాటా నిబంధనను పరిమితులకు లోబడి అనుమతిస్తారు. పై నిబంధనలే అన్ని కంపెనీలకు వర్తిస్తాయి. స్టాక్ ఎక్సేంజిలలో లిస్టెడ్ కంపెనీలకు సోలార్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రాజెక్టు డెవలపర్‌కు ఈ కంపెనీలో కనీసం 27 శాతం వాటాతోపాటు ఓటింగ్ హక్కులు కలిగి ఉండాలి. ఇలాంటి అన్ని హంగులు కలిగిఉన్న కంపెనీలకు ప్రాజెక్టు నిర్వహించబడిన సంవత్సరం కాలం తర్వాత విద్యుత్ పంపిణీకి అనుమతిస్తారు.

డీడీఈ పునరుత్పాదక సంస్థ
1. 17నవంబర్ 2009న డీడీఈ పునరుత్పాదక సంస్థ కే బస్నాల్ ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు డైరెక్టర్లుగా, ఓనర్లుగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ లక్ష రూపాయల ఈక్విటీవిలువ కలిగి ఉంది.
2. 10 సెప్టెంబర్ 2010న నైస్ ఇన్‌ఫ్రాకాన్
నైస్ ఇన్‌ఫ్రాకాన్ కార్పొరేట్ సంస్థ టోను కుమార్, క్రిష్ణ కుమార్ డైరెక్టర్లుగా ఏర్పాటు చేశారు. లక్షరూపాయల ఈక్విటీ విలువ కలిగిన ఈ కంపెనీలో వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఉంది.
3. 10-11 సెప్టెంబర్ 2010న ల్యాంకో ఉద్యోగి పిల్లలు ప్రేమ్ చంద్, సాహితి కుర్మోజు నైస్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థలో డైరెక్టర్లుగా చేరారు. కుమార్ ఆ కంపెనీకి రాజీనామా చేశారు.
4. అక్టోబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ 2009-10 సంవత్సరానికి బాలెన్స్‌షీట్ సమర్పించింది. ఇందులో ఓనర్షిప్‌లోగాని, ఈక్విటీలోగాని ఎలాంటి మార్పులు లేవు.
5. 16 నవంబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు బిడ్ గెలుచుకుంది.
6. 31 డిసెంబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ 15.2 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాధాన్యతా షేర్లను క్రిష్ణన్ లలిత్ బన్సల్ స్థాపించిన డీడీఈ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ కంపెనీకి బదలాయించింది.
7. ఫిబ్రవరి 2011న 2009-10 సంవత్సరానికి సవరించిన బాలెన్స్ షీట్‌ను సమర్పించింది. 23 శాతం క్రిష్ణన్ లలిత్ బన్సల్ పేరిట మరో 77 శాతం పేరు తెలియని వాణిజ్య సంస్థ పేరిట చూపించారు. అదేరోజు బాలెన్స్‌షీట్‌లో కంపెనీ కొత్త డైరెక్టర్లుగా ప్రేమ్‌చంద్, సాహితి కుర్మోజులను పేర్కొంది.
. 30 మార్చి 2011న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ నుంచి క్రిష్ణన్ లలిత్ బన్సల్ మినహా బన్సల్ కుటుంబ సభ్యులంతా కంపెనీ డైరెక్టర్లుగా రాజీనామా చేశారు.

9. 31 మార్చి 2011న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థలోని మెజారిటీ షేర్ 74 శాతం సొంతం చేసుకుని కంపెనీని హస్తగతం చేసుకుంది. అదేసమయంలో ల్యాంకో 26 శాతం వాటాతోపాటు 15.2 కోట్ల ప్రిపన్షల్ షేర్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కంపెనీ 15.2 కోట్ల రూపాయల ప్రిఫన్షల్ షేర్లను విడుదల చేసింది. కంపెనీ పేరుపై 15 కోట్ల రుణాలతోపాటు 5 లక్షల రూపాయల నగదు, బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు వివరించింది.
10. 14 నవంబర్-16 డిసెంబర్ 2011 తేదీలలో డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ/నైస్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థలలో రవీందర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా వచ్చారు. వీరిలో రవీందర్ సింగ్ ల్యాంకో సోలార్‌లో పని చేస్తున్నారు.

ఎలక్షిక్టోమెక్ మారిటెక్ సంస్థ
11. 2 జనవరి 200న లక్షరూపాయల ఈక్విటీ కలిగిన ఎలక్షిక్టోమెక్ మారిటెక్ సంస్థలో తుషార్ వినాయక్ మెహెందాలె, అవంతి తుషార్ మెహెందాలె డైరెక్టర్లుగా ఏర్పాటు చేశారు. వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఈ కంపెనీలో ఉంది.

12. 7 సెప్టెంబర్ 2010న గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ టోను కుమార్, క్రిష్ణన్ కుమార్ శర్మ డైరెక్టర్లుగా ఏర్పాటైంది. లక్ష రూపాయల ఈక్విటీ విలువకలిగిన ఈ సంస్థలో వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఉంది.
13. 10-11 సెప్టెంబర్ 2010న సురేశ్, యర్రగుంట్ల నాగరాజు గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులో కొత్త డైరెక్టర్లుగా చేరారు. వీరిద్దరూ కుర్మోజు పక్కింటివారు కావడం విశేషం. అదేరోజు కుమార్ రాజీనామా చేశారు.
14. 16 నవంబర్ 2010న ఎలక్ట్రో మారిటెక్ సంస్థ 5 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ బిడ్ గెలుచుకుంది.
15. 31డిసెంబర్ 2010న తుషార్ బీఎమ్ సారథ్యంలోని ఎలక్షిక్టోమెటీరియల్ హాండ్లింగ్ కంపెనీకి 15.2 కోట్ల ప్రిఫన్షల్ షేర్లను ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీ బదలాయించింది.

16. 2 జనవరి 2011న ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీ 2009-10 సంవత్సరానికి సవరించిన బాలెన్స్ షీట్ సమర్పించింది. ఇందులో 0.01 శాతం వాటాలను తుషార్ వీఎమ్ పేరుపై 99 శాతం పేరు తెలియని కంపెనీ పేరుపై చూపించింది. ఇక కంపెనీ ఈక్విటీ విలువ లక్షరూపాయలుగా, లక్షరూపాయలు బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు బాలెన్స్‌షీట్ వివరించింది.

17. 29 జనవరి 2011న ఎలక్షిక్టోమెక్ కంపెనీనుంచి అవంతి టీ మెహెందాలె రాజీనామా చేశారు. అదేరోజు సురేశ్‌తోపాటు నాగరాజ యర్రగుంట్ల అడిషనల్ డైరెక్టర్లుగా కంపెనీలో చేరారు. ్చటఠ్ఛిజిఝ్చజీజూ.ఛిౌఝ ఈ-మెయిల్ అడ్రస్ నుంచి వీరిద్దరికీ నియామకపవూతాలు జారీ అయ్యాయి. ఈ- మెయిల్ అడ్రస్ ల్యాంకో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిది కావడం గమనార్హం.
18. 31 జనవరి 2011న ఎలక్షిక్టోమెక్ కంపెనీ మరోసారి 2009-10 సంవత్సరానికి బాలెన్స్ షీట్‌ను సవరించింది. తుషార్ పేరుపై 0.01 శాతం వాటా మరో 23 శాతం వాటా వాటాదార్లపేరుపై చూపించారు. 76.99 శాతాన్ని వేరే కంపెనీల పెట్టుబడులుగా చూపించారు.

19. 31 మార్చి 2011
ఎలక్షిక్టోమారిటెక్/గోప్డూన్ ఇన్‌వూఫావూపాజెక్ట్స్
ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీలో 74 శాతం ఈక్విటీని సొంతం చేసుకుని గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ చేజిక్కించుకుంది. లాంకో కంపెనీ 26శాతం ఈక్విటీతో 15.2 కోట్ల రూపాయల ప్రిఫన్షల్ షేర్లను సొంతం చేసకుంది. ఆ తర్వాత కూడా కంపెనీ 15.2 కోట్ల రూపాయలతో ప్రిఫన్షల్ షేర్లను విడుదల చేసింది. కంపెనీ పేరుపై 15 కోట్ల రుణాలను తీసుకుంది. రెండు లక్షల రూపాయల నగదు బ్యాంక్ బాలెన్స్ కలిగిఉంది.

-24 సెప్టెంబర్ 2010 తేదీన ఎంపిక ప్రక్రియ కోసం అభ్యర్థన మేరకు చివరితేదీని సవరించింది.
-ఈకాలంలో వాటాదారులను మార్చడాన్ని, షేర్ల బదిలీని అనుమతించరు.
-10 జనవరి 2011 తేదీన విద్యుత్ కొనుగోలుకోసం ఎన్‌వీవీఎన్ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది.
-ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తర్వాత ఏడాదివరకు ప్రాజెక్టు సొంతదారు షేర్లపై తన నియంత్రణను మార్చుకోరాదు.
-10 జనవరి 2012 ప్రాజెక్టుల ప్రారంభానికి తుది గడువు.


నిబంధనలు తుంగలో తొక్కి
13 వేల కోట్లకు లగడపాటి టెండర్
- జాతీయ సోలార్ మిషన్‌కు టోకరా !
- బోగస్ కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలి
- లగడపాటిని అరెస్టు చేయాలి
- టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరోసభ్యుడు దాసోజు శ్రవణ్ డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (: తెలంగాణ ప్రాంతాన్ని దోపిడి చేసి వేల కోట్ల రుపాయలు దోచుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దృష్టి ప్రస్తుతం జాతీయ సంపదపై పడిందని టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. తెలంగాణ బొగ్గును దోచుకుని ఆంధ్రలో విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి లగడపాటి డబ్బు చేసుకున్నాడని విమర్శించారు. వక్ఫ్ భూములను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో హిల్స్ నిర్మించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు జాతీయస్థాయిలో దోపిడీకి లగటపాటి తయారయ్యారని శ్రవణ్ దుమ్మెత్తి పోశారు. ప్రస్తుతం జాతీయ సోలార్ మిషన్ విద్యుత్ ప్రాజెక్టులలో నిబంధనలను అతిక్షికమించి 13 వేల కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో జాతీయ సంపదను కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. అర్హతలేని వ్యక్తుల పేర్లతో తొమ్మిది బినామి కంపెనీలను సృష్టించాడన్నారు.

దొంగ బాలన్స్ షీట్లతో 13 వేల కోట్ల రుపాయల సబ్సిడీ గల 235 ఎంవిఏ సామర్థం ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టును పొందిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి 105 మెగావాట్ల ప్రాజెక్టును మాత్రమే అప్పగించాలి. కానీ లగటపాటి జిత్తులమారి ఎత్తులతో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు ప్రదర్శించి 235 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్నారన్నారు. లగడపాటిని తక్షణమే అరెస్టు చేసి, ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే స్వచ్ఛందసంస్థ పూర్తి స్థాయి విచారణ జరిపి లగడపాటి అవినీతి బాగోతాన్ని బయట పెట్టిందని, దీనిని జాతీయ పత్రికలు వెలుగులోకి తెచ్చాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినందుకు కేంద్రవూపభుత్వం లగడపాటికి దీనిని కానుకగా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోక పోతే తామే సీబీఐని సంప్రదిస్తామని తెలిపారు. ఈ విషయాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చి జాతీయ సోలార్ మిషన్ లగడపాటికి ఇచ్చిన అగ్రిమెంట్‌ను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ల్యాంకో గ్రూప్‌పై విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ జాతీయ సౌర విద్యుత్ ప్రాజెక్టును పొందిందన్న సెంటర్‌ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ‘ఈ అంశంపై మేం విచారణకు ఆదేశించాం. వ్యక్తిగతంగాగానీ, ప్యానెల్ ఏర్పాటుద్వారా గానీ విచారణ చేపడతాం’ అని కొత్త శక్తుల పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఉమ్మడి కార్యదర్శి తరుణ్ కపూర్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తేలినా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Take By: T News

Read more...

Tuesday, December 27, 2011

Teacher held for raping student

New Delhi, December 26: A government school teacher has been arrested for allegedly raping a woman who took private tuitions from him as a schoolgirl. 



The teacher, identified as Ram Avtar (40), is also charged with making an obscene MMS of the woman and blackmailing her into continuing in a physical relationship with him over the last several years. 

The victim, who is 22 years old now, has told the police that Ram Avtar, who teaches Hindi at a government school in south Delhi's Ambedkar Nagar, took her to Rajasthan in 2004 and had intercourse with her. 

After that, the Madangir area resident repeatedly lured her away from home on various pretexts and continued exploiting her. 

The woman alleged that in 2008 she understood Avtar was taking undue advantage of her and objected to his acts. The accused, however, recorded an MMS of her and blackmailed her into submission.

Read more...

Friday, December 23, 2011

సిన్నబోతున్న సింగరేణి

-ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు 123వ వసంతంలోకి సింగరేణి
-సింగరేణిని ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు వ్యాపార సరుకుగా మార్చి
-అడ్డగోలుగా తవ్వేస్తున్నారు
-యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ
-ఉద్యోగాలపై ప్రైవేటీకరణ దెబ్బ
-యాంత్రీకరణతో మరో ఎసరు
-30 వేల మంది కార్మికుల తొలగింపు
-నాడు ప్రాంత పరిశ్రమల కోసమే

karmikulu-telangana-News2 talangana patrika telangana culture telangana politics telangana cinema( కోల్‌బెల్ట్ ప్రతినిధి):‘తల్లి నవ్వితే మాగాణి.. ఎద తలుపు తీస్తే సింగరేణి’ అన్నాడో కవి... కానీ మన సింగరేణి సీమాంధ్ర కడుపునింపితే, మాగాణి భూములు బొందల గడ్డలుగా మిగులుతున్నాయి. తెలంగాణ గర్భాన్ని చీల్చి, నల్లబంగారంతో దేశానికి వెలుగులిస్తున్న సింగరేణి సీమాంధ్ర సర్కారు కుట్రలు, కుతంవూతాలతో కుదేలవుతోంది. శ్రమైక జీవన సౌందర్యం, కార్మికుల అవిక్షిశాంత పోరాటాలతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తన ఖాతాలో ఎన్నో రికార్డులను వేసుకున్న ఈ సిరుల తల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గల్లా పెట్టెలు నింపేందుకు పరిమితమవుతోంది. ఓపెన్‌కాస్టు తవ్వకాలతో నాలుగు జిల్లాల్లో గోదావరి పొడువునా ఉన్న పల్లెలన్నీ బొందల గడ్డలుగా మారాయి. యాంత్రీకరణ పేరుతో సాగుతున్న ఉపరితల బొగ్గు గనుల్లో కనీస ఉపాధి కరువైంది. మరో వందేళ్లకు సరిపడే బొగ్గునిల్వలున్నా నేటికీ కోల్ కారిడార్‌కు మోక్షం కల్పించలేదు. మాంచెస్టర్ ప్రణాళికలకు రూపమివ్వలేదు. కొత్త పరిక్షిశమలను ఏర్పాటుచేయకపోగా ఇక్కడున్న పరిక్షిశమలను సీమాంధ్ర సర్కార్ మూసివేసింది. మరోవైపు కోల్ కారిడార్ పేరిట కొత్త బావుల ఏర్పాటుకు ప్రణాళికలు రచించి, మరింత దోపిడీకి తెరలేపుతోంది. నాలుగు జిల్లాల్లోని వందలాది గ్రామాలు దుమ్ముధూళితో కన్నీళ్లు పెడుతున్నాయి. అయినా సీమాంధ్ర సర్కారు కనికరించడం లేదు. అంతే కాదు సింగరేణిలో గడిచిన ఆరు సంవత్సరాల్లో వివిధ ప్రమాదాల్లో 83 మంది మృత్యువాత పడ్డారు. ఇదేకాలంలో శ్వాసకోశ వ్యాధులతో 120మందికిపైగా చనిపోయారు. ఇన్ని కష్టాల మధ్య పనిచేస్తున్న నల్ల సూరీళ్లకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. డిసెంబర్ 23తో 123వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణిపై నమస్తే తెలంగాణ ఫోకస్..ఉత్తర తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన వరం. హైదరాబాద్ లేని తెలంగాణను ఎట్లా ఊహించలేమో, సింగరేణి లేని తెలంగాణను కూడా ఊహించలేం. 1889లో నిజాం కాలంలో అవతరించిన సింగరేణి నిజాం పారిక్షిశామిక అవసరాలకు ముడి సరుకును అందించే బొగ్గునే కాదు ఒక నూతన పారిక్షిశామిక విప్లవాన్ని సృష్టించింది. ఆంధ్రవూపదేశ్ అవతరణకు పూర్వదశ సింగరేణి నిజాం ఏలుబడిలో ఉన్న కాలం. ఈ రెండు దశలను ఒకసారి పరిశీలిస్తే పారిక్షిశామిక ప్రగతికి ముడి సరుకును అందించే బొగ్గు పరిక్షిశమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించడం వల్లే నిజాం రాజు అంతవరకూ బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న హైదరాబాద్ దక్కన్ కంపెనీ నుండి మెజార్టీ షేర్లు కొనుగోలు చేసి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణికి ఖ్యాతి తెచ్చారు. నిజాం ఎంతటి నిరంకుశ రాజయినప్పటికీ తన దేశ అవసరాలకు తన ప్రజల అవసరాలకు భంగం కలిగించేలా వ్యవహరించలేదు. నిజాం స్టేట్ అవసరాల కోసం పరిమిత స్థాయిలో బొగ్గు తవ్వకాలు సాగించారు. నిజాం ఏలుబడిలో సింగరేణిలో సాగిన మొదటి 66 సంవత్సరాల కాలంలో మొత్తం బొగ్గు తవ్వకాలు 50 మిలియన్ టన్నులకు మించలేదు. ఆతర్వాత పరిస్థితిని పరిశీలిస్తే 2009-10 ఆర్థిక సంవత్సరంలోనే 50.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. నిజాం కాలంలో జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తికి సమానంగా ఒక్క సంవత్సరంలో బొగ్గును తవ్వడం జరిగింది. ఈ విధంగా సింగరేణి నుండి తవ్విన బొగ్గు సంపద ఎవరికి లాభాలు పండిస్తుందో, ఎవరికి కన్నీళ్ళు మిగిల్చిందో తేలాల్సిన అంశం!!

నిజాం స్టేట్‌లో ఫ్యూడల్ దొరలు, భూస్వాములు, దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల దోపిడీలు, దౌర్జన్యాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. నీ బాంచెన్ కాల్మొక్త అంటూ ప్రజలు అణిగిమణిగి ఉండేవారు. దొరల దోపిడీ పీడను భరించలేక పారిపోయి వచ్చినవారికి సింగరేణి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్నది. బొగ్గు గనుల్లో పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఊళ్ళలో దొరతనం భరించలేనివారికి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్న పారిక్షిశామిక ప్రాంతం ఆకర్షించింది. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన బ్రిటీష్ అధికారుల పెట్టుబడిదారి స్వభావరీత్యా ఒక నూతన పారిక్షిశామిక సంస్కృతికి అంకురార్పణ జరిగి తదనంతర కాలంలో కార్మిక వర్గ చైతన్యానికి నాంది పలికింది. సింగరేణి కార్మికులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సింగరేణి కార్మికులు వందలాది మంది గెరిల్లా యోధులుగా పాల్గొని పోరాటంలో అమరులయ్యారు. సింగరేణి చరివూతలో కార్మిక ఉద్యమంలో అదొక ఉజ్వల ఘట్టం. 1952లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వనరులు స్థానిక అభివృద్ధికి దోహదపడటం, బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం అనే రెండంచెల అభివృద్ధి విధానం ఎజెండా మీదికి రావడం జరిగింది.

రాష్ట్ర అవతరణతో తలకిందులైన పరిస్థితి
karmikulu-telangana-News3 talangana patrika telangana culture telangana politics telangana cinema1956 నవంబర్ 1న ఆంధ్రవూపదేశ్ అవతరణతో పరిస్థితి మొత్తం తలకిందులైంది. స్థానిక వనరులు స్థానిక ప్రజలకు చెందకుండా ఉమ్మడి రాష్ట్రం పేరిట దోచుకుపోయే ప్రాంతీయ నయా వలస విధానానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ ప్రాంత అవసరాలకు పరిమితమై సాగించే బొగ్గు ఉత్పత్తి రాష్ట్ర అవతరణ తర్వాత ఆంధ్ర ప్రాంత అవసరాలను కూడా తీర్చాల్సివచ్చింది. బొగ్గు వ్యాపార సరుకుగా మారింది. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసి సొమ్ము చేసుకునే విధానం మొదలైంది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడింది. నిజాం కాలంలో కొత్తగూడెం, ఇల్లందు, బెల్లంపల్లి ప్రాంతాలకు పరిమితమైన బొగ్గు తవ్వకాలు ఆంధ్రవూపదేశ్ అవతరణ తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మాదారం, గోలేటి, అటు వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని మణుగూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు విస్తరిస్తూ పోయారు. ఆంధ్రవూపదేశ్ అవతరణ నాటికి 1956-57లో 1.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే గత సంవత్సరం 2009-10 నాటికి 50.4 మిలియన్ టన్నులకు చేరుకున్నది. వార్షిక ఉత్పత్తి 25 రెట్లకు పెరిగిపోయింది. ఇలా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఆంధ్రవూపాంతానికి తరలించి బొగ్గు ఆధారిత పరిక్షిశమలను అక్కడ నెలకొల్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతం కేవలం ముడి సరుకును అందించే ప్రాంతంగా మిగిలిపోయింది. అదే సమయంలో బొగ్గును వ్యాపార సరుకుగా మార్చి అమ్మకాలు సాగించిన మిగులు నిధులను కూడా ఉమ్మడి రాష్ట్రం పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రవూపాంత అభివృద్ధికి ఖర్చు చేయడం మొదలైంది. రాష్ట్రానికి కేటాయించిన బొగ్గులో మూడింట రెండొంతులు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు వినియోగిస్తున్నాయి. మిగతా బొగ్గు రాష్ట్రంలోని 46 సిమెంట్ కంపెనీలు, 43 స్పాంజ్ ఐరన్ యూనిట్స్, 19 సీపీపీ యూనిట్లు మాత్రమే కాకుండా వార్షికంగా 4200 టన్నులకు మించి వాడే 182 చిన్న పరిక్షిశమలకు కేంద్ర బొగ్గు శాఖ ఉత్వర్వుల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఉత్పత్తిలో 92 శాతం సరఫరా చేయాల్సి వస్తోంది. ఇట్లా వినియోగించే పరిక్షిశమల్లో 80 శాతం ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులవే.

విద్యుత్‌లోనూ అన్యాయం
తెలంగాణలోని రామగుండంలో 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్‌టీపీసీ, కొత్తగూడెంలోని ఏపీ జెన్‌కోకు చెందిన 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌కు సింగరేణి బొగ్గే సరఫరా అవుతున్నది. ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చే విధంగా మొదటి పిట్ హెడ్ వద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాభదాయకం అనే అంతర్జాతీయ నిపుణుల అభివూపాయాన్ని కూడా కాలదన్ని సింగరేణికి చెందిన మణుగూరు ఏరియాలో ఏపీ జెన్‌కో మొదట నిర్మించతలపెట్టిన 1260 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వందల కిలోమీటర్ల దూరానికి ఇక్కడి బొగ్గు తరలించుకు పోయే విధంగా అప్పటి ఏపీఎస్‌బీ చీఫ్ ఇంజినీర్ నార్ల తాతారావు తన పలుకుబడితో విజయవాడకు తరలించి అక్కడ విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారన్న వాదన ఉంది. రామగుండంలోని ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడం వల్ల ఎన్‌టీపీసీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ 71 శాతం తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరిలకు సరఫరా అవుతోంది. కేవలం 21 శాతం మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు. అందులో తెలంగాణకు అందుతున్నది నామమావూతమే. కానీ ఈ ప్లాంట్ కోసం సేకరించిన 10 వేల ఎకరాల భూమి తెలంగాణవారిదే. ఆ మేరకు ఈ ప్రాంత వాసులు నిర్వాసితులయ్యారు. గత 30 ఏళ్లుగా నష్టపరిహారం సక్రమంగా అందక నిర్వాసితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 10 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ నుంచి మళ్ళించారు.

singareni-telangana-News2 talangana patrika telangana culture telangana politics telangana cinemaఆ మేరకు అక్కడ ఆయకట్టు తగ్గింది. ఇలా రామగుండం ఎన్‌టీపీసీలో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్‌కు ఇక్కడి బొగ్గునే ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యుత్‌లో మాత్రం ఒక్కశాతం కూడా ఈ ప్రాంత రైతులకు చెందడం లేదు. కొత్తగూడెం ఏపీ జెన్‌కో కేటీపీఎస్ నుండి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 70 శాతం ఉభయగోదావరి జిల్లాలకే కేటాయించారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు తప్ప ఇందులో తెలంగాణకు వచ్చేదేమీ లేదు. వీటీపీఎస్‌లో 1260, రాయలసీమలో 420 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పారు. ఇటీవల వీటీపీఎస్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. సి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్‌టీపీసీ సింహావూదిలో విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసే 1000 మెగావాట్లు మొత్తంగా కోస్తాంవూధకు ఇప్పించి ఆ ప్రాంత అవసరాలు తీర్చుకుంటున్నారు. రామగుండం బీ థర్మల్ కేంద్రాలను కూడా మూసి తెలంగాణ ప్రజలను మరింత అష్టకష్టాలకు గురిచేశారు.

సంపద శాశ్వతంగా దక్కకుండా కుట్రలు
తెలంగాణ బొగ్గు సంపద శాశ్వతంగా తెలంగాణకు దక్కకుండా సీమాంధ్ర పాలకులు కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్స్ పేరుమీద బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం జరుగుతోంది. అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్ ఎంత వేగవంతంగా జరుగుతున్నదో గత సంవత్సరం కంపెనీ ప్రకటించిన వార్షిక నివేదికలోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2008-09లో సింగరేణిలో జరిగిన వార్షిక ఉత్పత్తి 44.55 మిలియన్ టన్నులు. ఇందులో 32.46 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 13 ఓపెన్ కాస్టు గనుల నుండి రాగా 37 భూగర్భ బావుల నుండి 12.9 మిలియన్ టన్నులు వచ్చింది. అందులో 8 మిలియన్ టన్నులు మిషన్ మైనింగ్ ద్వారా ఉత్పత్తి జరిగింది. కేవలం 4.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రం మానవ శ్రమ ఆధారిత హ్యాండ్ సెక్షన్ ద్వారా జరిగింది. బొగ్గు ఉత్పత్తిలో నాలుగింట మూడో వంతు పాత్ర వహిస్తున్న ఓపెన్‌కాస్టు గనుల్లో 80 శాతం పనులు ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. 14 ఓపెన్‌కాస్టు గనుల్లో పన్నెండింటిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లే పనిచేస్తున్నారు. సింగరేణికి వచ్చే సగం లాభాలు వీరి జేబుల్లోకే పోతున్నాయి.

విపరీతమైన విధ్వసం
ఆంధ్ర పాలకుల వలస దోపిడీసింగరేణి కార్మికుల మూలుగుల్ని పీలుస్తున్నది. అణిచివేత, హక్కుల హరింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. 1989-90లో 1.16 లక్షలుగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 65 వేలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. . 2020 నాటికి మరో 30 వేల మంది పదవీ విరమణ ద్వారా బయటికి పోనున్నారు. పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న ఓపెన్‌కాస్ట్ విధానం వల్ల ఇప్పటికే తెలంగాణలో 74 ఏజెన్సీ ప్రాంతంలోని తాండాలు, ఊర్లు నేలమట్టమయ్యాయి. వారి బతుకులు సర్వనాశనమయ్యాయి. పెద్ద ఎత్తున వాగులు, వంకలు, అడవులు నాశనమవుతున్నాయి. సంపద తెలంగాణది అయితే లాభాలు సీమాంధ్ర బడాబాబుల జేబుల్లోకి పోతున్నాయి. నిజాం కాలంలో తవ్వి తీసిన బొగ్గు నిజాం స్టేట్‌లోని పరిక్షిశమలైన రైల్వే, రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పొగాకు, వస్త్ర, సిమెంట్ తదితర పరిక్షిశమల అవసరాలను తీర్చేది. ఈ ప్రాంతంలో తవ్వి తీసిన బొగ్గు ఈ ప్రాంత పారిక్షిశామిక అవసరాలకు వినియోగించడం వల్ల ఆ మేరకు పారిక్షిశామిక అభివృద్ధి ఫలితాలు ప్రాంత ప్రజలకు దక్కాయి. పర్యావరణ విధ్వంసం కూడా పరిమితంగా ఉండిపోయింది. బొగ్గు తవ్వకాల వల్ల నిజాం కాలంలోని 66 సంవత్సరాలు పర్యావరణ విధ్వంసం ఇవాళ ఒక్క సంవత్సరంలోనే జరిగిపోతుంది.

కుంభకోణాలు.. అప్పులు
singareni-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకేంద్ర ప్రభుత్వం అవలంబించిన నూతన బొగ్గు విధానం విదేశీ బొగ్గు దిగుమతులకు కల్పించిన రాయితీలు వారికి మార్కెట్ సృష్టించడానికి కల్పించిన కోల్ లింకేజ్ డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు వందల కోట్ల కుంభకోణాలకు దారి తీశాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ పరిక్షిశమను నిర్వీర్యపరిచి నూతన బొగ్గు బ్లాకులను పెద్ద ఎత్తున ప్రైవేటు పరం చేస్తూ పోయింది. వారికి ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకునే స్వేచ్ఛను, అనేక రాయితీలను, చట్టపరమైన వెసులుబాటును కల్పించింది. సింగరేణి దశాబ్దకాలంగా లాభాలు సాధిస్తున్నప్పటికీ ఈ పరిస్థితుల వల్లే ఈ రోజుకీ అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వడ్డీలు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్లు, అటు కేంద్రానికి 400 కోట్లు పన్నులు, రాయల్టీల పేరిట చెల్లించడం, మరోవైపు 400 కోట్ల రూపాయలు డివిడెంట్లు ఇవ్వడం ఆగ లేదు. గత పది సంవత్సరాల్లో ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరిగితే పన్నుల రూపంలో రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటిన్నరట్లు, కేంద్ర ప్రభుత్వానికి 20 రెట్లు పన్ను చెల్లింపులు పెరిగాయి. గత సంవత్సరం బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన 6396 కోట్లలో నాలుగింట మూడు వంతులు ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుల్లోకి, అలాగే ప్రభుత్వం బొక్కసంలోకి వెళ్ళిపోయింది. సింగరేణి తరతరాల దోపిడీ నుండి విముక్తి పొందాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే మార్గం లేదని కార్మికులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటికి 44 సార్లు సమ్మె చేశారు. మరో వందరోజుల సమ్మెకూ సై అంటున్నారు.

ఇదీ ఆటుపోట్ల సింగరేణి
ప్రకృతి వల్ల ఏర్పడిన సహజ ఇంధనం బొగ్గు. గోదావరి నదీ తీరమంతా ఉన్న ఈ బొగ్గుతో వేలాది పరిక్షిశమలు పని చేస్తున్నాయి. 1771లో మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో గల రాణిగంజ్ వద్ద బొగ్గు తవ్వకం ప్రారంభించగా 1850 నుంచి తవ్వకాలు రెగ్యులరైజ్ అయ్యాయి. మధ్యవూపదేశ్‌లో 1862లో, ఆతరువాత 1871లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో గల సింగరేణి గ్రామంలో బొగ్గును కనుగొన్నారు. బ్రిటిష్ అధికారి విలియం కింగ్ కనుగొన్న ఈ బొగ్గును 1989 నుంచి దక్కన్ కంపెనీ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. 1920లో సింగరేణి కంపెనీగా సంస్థ పేరు మారింది. బొగ్గు గనులు ప్రారంభమయి 123 సంవత్సరాలవుతున్నది. సింగరేణి యాజమాన్యం 2003 నుంచి ప్రతీ సంవత్సరం సింగరేణి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సింగరేణి భారతదేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. 51 శాతం రాష్ర్టం, 49 శాతం కేంద్రం వాటాలు ఉన్న సంస్థ. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రవేశపెట్టిన నూతన పారిక్షిశామిక, ఆర్థిక విధానాల ఫలితంగా తీరు మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడులు లేవు. అయితే ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి డివిడెంట్‌ను, ఇతర పన్నులను వెయ్యి కోట్లకుపైగానే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పొందుతున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ప్రారంభించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం సింగరేణి నాలుగు వేల కోట్లకుపైగా అప్పు చేసింది. ఇలా ప్రతి ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మట్టిలో కలిసిన మోడల్ మాంచెస్టర్
-ఉన్న పరిక్షిశమల మూసివేత.. ఊసేలేని కొత్త పరిక్షిశమలు
-నడిరోడ్డున ఉద్యోగులు.. తరిగిపోతున్న సింగరేణి సిరులు

karmikulu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema(కరీంనగర్ ప్రతినిధి/గోదావరిఖని):సింగరేణిలో మరో వందేళ్లకు సరిపడా నిల్వలున్నాయి. గడిచిన 122 ఏళ్లలో సింగరేణి ఇప్పటి వరకు 1050 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, ఇంకా 8 నుంచి 10వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఏటా 10శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ పోతున్న సింగరేణి సంస్థకు బొగ్గు ఆధారిత పరిక్షిశమలు నెలకొల్పుకోవడానికి కావల్సిన అన్ని వనరులూ ఉన్నా.. అ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికులతో కిటకిటలాడిన సింగరేణి నేడు కేవలం 65వేల మంది కార్మికులకే పరిమితమైంది. సింగరేణి బొగ్గు ఆధారితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండంలో నెలకొల్పిన 2600 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్టీపీసీ మినహా మరే పరిక్షిశమ లేకుండా పోయింది. గతంలో రామగుండంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ‘ఎ’ థర్మల్, ‘బి’ థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా వాటిలో ‘ఎ’ థర్మల్ కేంద్రం మూతపడింది. బొగ్గు ఆధారిత పరిక్షిశమ అయిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 11 ఏళ్ల క్రితమే మూసేశారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా విద్యుత్ కోత వల్లే ఎఫ్‌సీఐని మూసివేయాల్సి వచ్చిందని సర్కారు నిస్సిగ్గుగా ప్రకటించింది. నైజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న జిల్లాల్లో 80 పరిక్షిశమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించగా, సీమాంధ్ర సర్కారు వాటిని తుంగలో తొక్కింది. నిజానికి ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నుంచి మంచిర్యాల మీదుగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని వరంగల్ జిల్లా భూపాలపల్లిని కలుపుతూ అక్కడి నుంచి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు పారిక్షిశామిక కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు వెళ్లినా ఏనాడూ పట్టించుకోలేదు.

బొగ్గు మనది.. వెలుగులు మందివి..
boggu talangana patrika telangana culture telangana politics telangana cinemaబొగ్గు మనది.. నీళ్లు మనవి.. శ్రామికులు మనవాళ్లు. కానీ వెలుగులు మాత్రం మందికి.. మనకు మాత్రం చీకట్లు..! ఇదీ మన దౌర్భాగ్యం! సింగరేణి బొగ్గు ఆధారిత పరిక్షిశమగా 200 మెగావాట్ల విద్యదుత్పత్తి లక్ష్యంగా రామగుండంలో 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎన్టీపీసీకి పునాది రాయివేశారు. 1983 అక్టోబర్ 23న ఉత్పత్తి మొదలైంది. నాటి నుంచి నేటివరకు అంచలంచెలుగా 7 యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ దక్షిణాదిరాష్ట్రాలకు వెలుగులు పంచుతోంది. నిజానికి ఇంత భారీ ప్లాంటు తెలంగాణలో ఉండటం గర్వకారణమే అయినా, అ మేరకు కేంద్రం మనకు వాటా కేటాయించకపోవడం దారుణం. 2,600 మెగావాట్లలో మన రాష్ట్రానికి దక్కుతున్న వాటా కేవలం 29 శాతం మాత్రమే! తమిళనాడుకు 22 శాతం, కర్ణాటకకు 16 శాతం, కేరళకు 12 శాతం, గోవాకు 5 శాతం, పాండిచ్చేరికి 2 శాతం, మిగిలిన 14 శాతంలో కొంత ఇతర రాష్ట్రాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆ 29 శాతం వాటా కేవలం మన పది జిల్లాకు దక్కేది.

తప్పని కరెంటు కోతలు...
ఎన్టీపీసీ ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉండటంతో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తెలంగాణలోని మెజార్టీ రైతులు వ్యవసాయ మోటార్లపై అధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరెంటు కోసం అన్నదాత కన్నీళ్లు పెట్టని రోజంటూ ఉండదు. 2006-07లో 500 మెగావాట్ల సామర్థ్యంతో 7యూనిట్ ప్రారంభించినప్పుడు తమకు కనీసం ఇరవై శాతం అదనంగా విద్యుత్ కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కోరారు. కానీ.. కేంద్రం కరుణించలేదు. ఏటా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నుంచి 6 టీఎంసీల నీటిని ఎన్టీపీసీ వాడుతోంది. ఈ నీళ్లతో కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కనీసం మరో 60వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. సింగరేణి అధారంగా నడుస్తున్న ఎన్టీపీసీలో మన వాటా పెరిగితే తప్ప తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.

ఇవీ మైలురాళ్లు
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaఅంగ్లేయుల పాలన కాలంలో ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలో ఓ నల్లరాయి మండుతూ కనిపించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన అప్పటి బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అక్కడ తవ్వకాలు జరపగా, బొగ్గు నిక్షేపాలు బయట పడ్డాయి.

1870 - బొగ్గు నిక్షేపాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం అన్వేషణ
1889 - బొగ్గు ఉత్పత్తికి అంకురార్పణ
1920 - అంగ్లేయుల నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాధీనం, ‘దక్కన్ కంపెనీ’గా నామకరణం
1945 - లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు
1949 - రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి, సింగరేణిగా నామకరణం
1951 - విద్యుత్తు సౌకర్యంతో డ్రిల్లింగ్ పనుల ప్రారంభం
1953- బ్యాటరీతో నడిచే క్యాప్ ల్యాంపుల (టోపీ లైట్లు) ప్రవేశం
1974 - భూఉపరితల గనులకు శ్రీకారం
1976 - యంత్రాల ప్రవేశం
1983 - లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
1986 - బ్లాస్టింగ్ గ్యాలరీ విధానంతో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం
1992, 1996 - ఖాయిలా పడ్డ పరిక్షిశమల జాబితాలోకి సింగరేణి
1994 - జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఓసీపీ(ఉపరితల గని)-2 ఏర్పాటు
1998 - గుర్తింపు కార్మిక సంఘాల ఏర్పాటు
2002 - నష్టాలను అధిగమించి లాభాల బాట
2009 - అడ్రియాల్ మైన్ వద్ద లాంగ్‌వాల్ ఏర్పాటు
2010 - ఫిబ్రవరి 14 అదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1200ల
మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి శంకుస్థాపన


Take By: T News

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- భారీగా రియల్‌ఎస్టేట్ దందాలు
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్‌రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే

Real-Estate1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema









 తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్‌హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!

హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదివాలా తీసిన పరిక్షిశమలను అతి తక్కువ ధరలకు కొనుగోలుచేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు కన్వర్షన్ ద్వారా అప్పటి వరకు ఉన్న పరిక్షిశమల స్థానంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్పొరేట్ ఆసుపవూతుల నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రాంత పరిక్షిశమల్లో నట్ బోల్టుల నుంచి భారీ కంటైనర్ల వరకు తయారవుతున్నాయి.

బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.

పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.

దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్‌గా విలసిల్లుతున్నది.

గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.

ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్‌హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్‌హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.

ఏపీఐఐసీ భూ పందేరం...
వాస్తవానికి ముఖ్యమంవూతిగా కాసు బ్రహ్మానందడ్డి హయాంలో ఆవిర్భవించిన పారిక్షిశామికవాడల్లో ఎక్కువ సంఖ్యలో చిన్నతరహా పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చిన్నతరహా పరిక్షిశమలకు సైతం కనీసం ఐదు ఎకరాల చొప్పున భూ కేటాయింపులుండగా, తదుపరి క్రమంగా వెయ్యి గజాలకు భూ కేటాయింపులు దిగజారాయి. పరిక్షిశమలకు భూ కేటాయింపుల అధికారం ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కట్టబెట్టాక నేరుగా భూములను విక్రయించడం ప్రారంభించింది.

ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.

బహుజన పరిశ్రమ
- కత్తులు చేసిన కండలు మనవి
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త

హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

డెమాస్కస్ కత్తులు మనవే..
తెలంగాణ సమాజంలో రాజుల కాలం నుంచి దళిత బహుజనులే వృత్తి నిపుణులుగా ప్రపంచఖ్యాతి గడించారు. వందల ఏళ్ళు ఉప్పునీటిలో ఉన్నా తుప్పు పట్టని డెమాస్కస్ కత్తులను తయారు చేయడంలో వరంగల్ జిల్లా కమ్మరులు ప్రావీణ్యులు. వీరు తయారుచేసే కత్తులకు ఆనాడే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. మిశ్రమ ధాతు శాస్త్రం (మెటాలజీ)లో హైదరాబాద్ సంస్థానానికి పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కోహినూర్, హార్లాట్, పిట్స్, జాకబ్ లాంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇక్కడే.

అగ్గిపెట్టెలో చీర చరిత్ర మనదే..
చేనేత రంగానికి తెలంగాణ ప్రాంతాలైన సిరిసిల్ల, పోచంపల్లి, వరంగల్, భువనగిరి పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీరను నేసిన ఘనత పోచంపల్లి నేతన్నలకే దక్కింది. వరంగల్‌కు చెందిన నేతన్న ఒకరు 1980 దశకంలో సినీ నటుడు శోభన్‌బాబుపై ఉన్న విపరీతమైన అభిమానంతో తన నేత చతురతతో శోభన్‌బాబు చిత్రపటం చద్దర్ (దుప్పటి)పై చిత్రించారు.

ఇత్తడికీ ప్రసిద్ది ఇక్కడే..
ఇత్తడి పరిక్షిశమకు నల్లగొండ జిల్లా చండూరు ప్రసిద్ధి. ఇప్పటికీ చండూరు ఇత్తడితోనే దేశంలోని ప్రముఖ దేవాలయాలకు తాపడాలు చేస్తున్నారు. పూజా పరికరాలతో పాటు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు చండురులో తయారై విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.

వ్యవసాయానికి ఊతం ఇచ్చిన పరిక్షిశమ
ప్రపంచంలో పారిక్షిశామికీకరణ జరగక ముందే తెలంగాణ గడ్డపై ఇలాంటి పరిక్షిశమలు చేతివృత్తులుగా వర్థిల్లాయి. యజమానులు వీరే, కార్మికులు వీరేగా చేతివృత్తుల మనుగడ కొనసాగేది. వీరు తయారు చేస్తున్న వస్తువుల్ని చూసి మరీ ఆకర్షితులై దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఆర్డర్లు ఇచ్చి చేయించుకునేవారు.

ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.

చేతివృత్తులు చెల్లా చెదురు
నిజాం లొంగుబాటు తదుపరి పుట్టుకువచ్చిన పెట్టుబడిదారులు చేతి వృత్తుల్లో నిష్ణాతులైన బడుగు వర్గాలను, వారి వృత్తులను పూర్తిగా అణిచివేశారు. చేనేత వృత్తిని దెబ్బతీసేందుకు పవర్‌లూమ్స్, కుమ్మరి వృత్తి దారులను దెబ్బతీసేందుకు ప్లాస్టిక్ పరిక్షిశమలు, ఇండియన్‌మేడ్ ఫారిన్ లిక్కర్‌తో గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు. జీ వివేక్, ఎం వెంక వంటి కొద్ది మంది దళిత బహుజన పారిక్షిశామికవేత్తలు నిలదొక్కుకోగలిగినా.. ఎంతో మంది ఔత్సాహికులు దూరంగానే ఉండిపోయారు. పరిక్షిశమలు పెట్టేందుకు ఆసక్తి చూపి సర్కారుకు పెట్టిన దరఖాస్తులు జిల్లా పరిక్షిశమల కేంద్రాలకే పరిమితం అవుతున్నాయని వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన దళిత ఔత్సాహికుడు మురళి విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఆటో నడుపుకొంటున్నారు.

కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-గంప చంద్రమోహన్, పారిక్షిశామిక వేత్త



కనుమరుగైన ఖండాంతర ఖ్యాతి
-ఆసియాలో భారీ వస్త్ర పరిక్షిశమ..
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్‌సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు

20--adb-2b-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( - కాగజ్‌నగర్) తెలంగాణలో భారీ పరిక్షిశమగా విరాజిల్లుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఖండాంతర ఖ్యాతి గాంచిన స్థానిక సర్‌సిల్క్ మిల్లు 26 ఏళ్ల క్రితం మూతపడింది. మిల్లు ఆస్తులు అమ్మేయగా మిగిలిన మొండిగోడలతో చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ పట్టు వస్త్ర పరిక్షిశమగా పేరొందిన ఇది ముడి సరుకు కొరత నెపంతో మూతపడింది. 40వ దశకం మొదట్లో నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తపేట కుగ్రామంలో సర్‌సిల్క్ మిల్లును ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ - హైదరాబాద్ రైల్వే మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఈ పరిక్షిశమకు తోడుగా కాగితపు పరిక్షిశమను కూడా నిజాం నవాబు పక్క పక్కనే ఏర్పాటు చేయడంతో కొత్తపేట కుగ్రామం కాస్తా కాగజ్‌నగర్‌గా గుర్తింపు పొందింది.

నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్‌సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్‌ఔ్ తో మూతపడింది.

20--adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కార్మికుల ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రయోగాత్మకంగా కార్మిక సహకార పద్ధతిలో మాజీ మంత్రి కేవీ కేశవులు, ప్రైవేటు ప్రమోటర్లు, ఐడీబీఐ రుణంతో 1994 ఏప్రిల్ 16న మిల్లు పునఃవూపారంభింపజేసినప్పటికీ యాజమాన్యం అసమర్థత, అవినీతి కారణంగా ఏడు నెలలకే మరోసారి మూతపడింది. ఆ తర్వాత మిల్లు తెరిచే ఏర్పాటు జరుగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మిల్లు శాశ్వతంగా మూతపడటంతో మిల్లులో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఉపాధి కరువై, పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిల్లులో అధికారులుగా అధికారం చెలాయించిన ఉద్యోగులు పేపర్ బాయ్‌లుగా, ట్యూషన్ మాస్టర్లుగా మారాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.

వ్యక్తులుగా కాదు.. శక్తులుగా..
-తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలి(టెక్కి) ఏర్పాటు
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం

హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్‌రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్‌రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు పాల్గొంటారు.


Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

 
Take By: T News 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP