Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Chiranjivee. Show all posts
Showing posts with label Chiranjivee. Show all posts

Thursday, June 28, 2012

సమన్వయం లేదు అందుకే ఓడాం - చిరంజీవి


Chieee talangana patrika telangana culture telangana politics telangana cinema
సోనియాకు నివేదించిన చిరంజీవి మీరూ కారణమేనన్న అధినేత్రి
‘ఉప’ ఓటమిపై పోస్ట్‌మార్టం
- పార్టీ బలోపేతంపై చర్చించాం
- పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మేడమ్ కార్యాచరణ
- నాయకత్వ మార్పు ఉండదు
- నావల్లే గెలిచామని నేననలేదు మీడియానే వక్రీకరించింది
- సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి
- రాష్ట్రంపై అధినేత్రి ప్రత్యేక దృష్టి
- అందుకే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు
- నాయకత్వ మార్పు అక్కర్లేదు: రఘువీరా
- అధిష్ఠానం ఆదేశిస్తే చిరును సమర్థిస్తాం

న్యూఢిల్లీ, జూన్ 27 ():కాంగ్రెస్‌లో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సమన్వయం లోపించడంవల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ కూడా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె దృష్టి సారించినట్లు తెలిపారు. దానిపై ఆమె రూపొందించే కార్యాచరణ ప్రణాళికను తామంతా అనుసరించి పార్టీని బలోపేతం చేస్త్తామని చెప్పుకొచ్చారు. కిందిస్థాయి నాయకులకు పార్టీ, నామినే పదవులు ఇచ్చి పని కల్పించాలని మేడమ్‌ను లేదు సమన్వయం.. అందుకే ఓడాం
కోరినట్లు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర మంత్రులు సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి సోనియాతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పార్టీ ఓటమి చెందడానికి కారణాలపై తనదైన నివేదికను ఆమెకు అందజేశారు.

ఆంధ్రవూపదేశ్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం పార్టీ అగ్ర నేతలు పలువురు అధిష్ఠానాన్ని కలిసి తమ వివరణలను, అభివూపాయాలను నివేదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిరంజీవి కాంగ్రెస్ అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అగ్ర నాయకత్వం నుంచి, క్షేత్రస్థాయి వరకు అన్నిచోట్లా సమన్వయ లోపం కారణంగానే పార్టీకి దారుణ అనుభవం ఎదురైందని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. తిరుపతిలాంటిచోట్ల కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, అంతర్గత గ్రూపు తగాదాలవల్లే పార్టీ నష్టపోయిందని వివరించినట్లు తెలిసింది. రాజంపేట, రాయచోటి లాంటిచోట్ల సరైన అభ్యర్థులను నిలుపలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గంతో పోలిస్తే తన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పార్టీకి పడ్డాయని ఆయన నియోజకవర్గాలవారీగా సమాచారాన్ని సోనియాకు అందించినట్లు తెలిసింది.

దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీ పీఆర్పీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని, తన వర్గానికి ప్రాధాన్యం లభించలేదని చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సోనియా సైతం చిరంజీవి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్న మీరు సమన్వయం కోసం ఏం ప్రయత్నాలు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విలీనమై ఏడాది గడుస్తున్నా సొంత వర్గీయులైన గంటా, రామచంవూదయ్యలను వెంట తిప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సీనియర్లతో, నాయకులతో సఖ్యత యత్నాలు ఆశాజనకంగా లేవని అన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అహంభావాలకు పోకుండా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

అందుకే కేంద్ర పదవి అడుగుదామనుకున్న చిరంజీవి ఆ పనిచేయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది. సోనియాతో సమావేశమైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ తాను కేంద్ర పదవిని ఆశించలేదంటూ నిట్టూర్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సోనియాతో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సానుభూతే జగన్ విజయానికి కారణమని, అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందన్న అంశం తమ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. రెండుస్థానాల్లో పార్టీ విజయానికి కారణాలపై సైతం చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలపై మేడమ్‌కు అవగాహన ఉందని, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి? పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. రామచంవూదాపురం, నరసాపురంలో పార్టీ తనవల్లే గెలిచిందని తానెప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. అదంతా మీడియా వక్రీకరణ అంటూ కొట్టిపారేశారు.

‘‘కలిసికట్టుగా పనిచేయడంవల్లే ఆయా స్థానాల్లో విజయం సాధించాం. ఇదే రకంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పా. నావల్లే అక్కడ గెలిచారని నేనన్నట్లు మీడియా పదే పదే ప్రచారం చేయడం భావ్యం కాదు’’ అని సూచించారు. అందరం కలిసి ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేశామని, వెంకటరమణ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవే సీఎం అన్న పెడన ఎమ్మెల్యే జోగు రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ- అది ఆయన అభిమానంగా చూస్తున్నాను తప్ప ఆయన పదాల్లోని అర్థాన్ని తాను చూడటం లేదని అన్నారు. పార్టీలో తననెవ్వరు టార్గెట్ చేయడం లేదన్న ఆయన, దాన్ని మీడియానే ఎక్కువచేసి చూపుతోందన్నారు. తెలంగాణ అంశంగానీ, తనకు కేంద్ర మంత్రి పదవి అంశంగానీ చర్చకు రాలేదన్నారు. ‘‘సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నా బాధ్యత ఏమిటన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప నేను ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదు. కేంద్ర పదవి ఇవ్వకపోయినా, సంతృప్తిగా పనిచేస్తా. ప్రజలకు ఏం చేయాలన్నదే నాకు ముఖ్యం తప్ప నాకేం కావాలన్నది ముఖ్యం కాదు. ఎంపీగా అవకాశం ఇచ్చారు. నన్ను నిరూపించుకోనీయండి’’ అని స్పందించారు. ప్రభుత్వ పెద్దల పనితీరుపై అధ్యక్షురాలి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయలేదని చెప్పారు. కేవలం భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపైనే సలహాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుల అంశం తమ చర్చలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. నాయకత్వ మార్పుంటుందని తాననుకోవడంలేదని చెప్పారు. మనుషులను సోనియా మారుస్తారని అనుకోనన్నారు. సీఎం మార్పుపై చర్చే లేనప్పుడు మీడియా వారికి నాయకత్వ మార్పుపై అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందన్నది కేవలం అభియోగమే తప్ప అది నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు.

అవినీతి నిర్ధారణ అయితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని బదులిచ్చారు. కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లేశారా అన్న ప్రశ్నకు తానేం మాట్లాడనని సమాధానమిచ్చారు. ఓట్లు ఎవ్వరు వేసినా వేయకపోయినా కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన అది ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇతరుల ఓట్లు ఎంత మేర సాధించుకుంటామన్నదే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పీఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయలోపం కొనసాగుతోందని అంగీకరించారు. దాన్ని అధిగమించేలా పార్టీ కార్యాచరణ చేపట్టాలని కోరిన ఆయన అధిష్ఠానం చేపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టులోపు పార్టీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టడానికి పార్టీ పెద్దలు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలవల్లే పదవుల భర్తీ జరగలేదని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

దాంట్లో అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీని కలిసి అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక్కడి పార్టీ పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభివూపాయపడుతున్నాయి.
4200 talangana patrika telangana culture telangana politics telangana cinema
నాయకత్వ మార్పుపై అధిష్ఠానానిదే నిర్ణయం: మంత్రి రఘువీరాడ్డి
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను గాడిలో పెట్టడానికి నాయకత్వ మార్పు అవసరం లేదని రాష్ట్రమంత్రి రఘువీరాడ్డి అభివూపాయపడ్డారు. తనతో సహ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యతని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఢిల్లీ వచ్చిన రఘువీరాతో ఎంపీ చిరంజీవి బుధవారం కొద్దిసేపు మంతనాలు జరిపారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. పార్టీలో సమన్వయం లోపించిందన్న చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికార పార్టీలో ఇలాంటివి సహజమని అన్నారు. దానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఓటమికి కారణాలు వెతకడానికే పరిమితం కాకుండా ఓటమిని అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని నాయకులు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇకపై దానిపై మాట్లాడబోమని తెలిపారు. పదే పదే నాయకులు అభివూపాయాలను వ్యక్తంచేయడం భావ్యం కాదన్నారు. అధిష్ఠానం చిరంజీవి నాయకత్వంలో పనిచేయాలని ఆదేశిస్తే దాన్ని తాము ధిక్కరించబోమని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అధిష్ఠానం చెబితే చిరుతో సహా ఎవరి నాయకత్వాన్నైనా అంగీకరిస్తామని తెలిపారు.

Take By: T News

Read more...

Monday, June 25, 2012

సోనియాతో నేడు చిరు భేటీ


-కాంగ్రెస్ నేతలే కొంప ముంచారు
-పార్టీలో ఐక్యత లోపించింది
-పీఆర్పీకి ద్వితీయ శ్రేణి గుర్తింపే!
-ఓటమికి ఇవే కారణాలు
-ఉప ఫలితాలపై నివేదిక!

హైదరాబాద్, ():కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చిరంజీవి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటి అయిన రెండోరోజే చిరంజీవి సోనియాతో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను వివరించనున్నారు. కాంగ్రెస్ నేతల వైఖరివల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని తన నివేదికను ఆయన సోనియాకు సమర్పించే అవకాశాలున్నట్లు పూర్వ పీఆర్పీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామచంవూదాపురం, నర్సాపురం రెండు స్థానాల్లో కాంగ్రెస్ తనవల్లే గెలిచిందని, మిగతాచోట్ల పీఆర్పీ శ్రేణులకు కాంగ్రెస్ సహకరించలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఐకమత్యం లోపించిందని, విలీనమైనా కూడా పీఆర్పీ శ్రేణులను ఇప్పటికీ ద్వితీయక్షిశేణి నేతలుగానే పరిగణిస్తున్నారని, నామినేటెడ్ పదవులు భర్తీచేయకపోవడం వంటి పరిణామాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన అధినేత్రి దృష్టికి తీసుకెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవి విషయం కూడా తేల్చుకోనున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగానియమించినప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నాన్చుతుండటం చిరులో అసంతృప్తికి కారణమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో గెలిపిస్తే చిరంజీవికి మంత్రి పదవి కచ్చితంగా వచ్చేదని, ఇప్పుడు పార్టీ ఓటమితో ప్రస్తుతానికి ఆ పదవి కూడా డౌటేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరుకు రాజ్యసభ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి పదవితోపాటు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకుగతంలో ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో కేంద్ర మంత్రి పదవి తప్ప మిగతావన్నీ చిరు సాధించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ప్రభావం ఎంతమాత్రం కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. చిరు ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోగా అక్కడ ఓటమికి కాంగ్రెస్ వారే కారణమని చిరు నిందలు వేయడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగించింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వంటి పరిణామాలు చిరుకు కేంద్ర మంత్రి పదవి విషయంలో మైనస్ కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read more...

Friday, January 20, 2012

నెరవేరిన చిరు కోరిక

- కేబినెట్‌లో ‘పీఆర్పీ’.. రాష్ట్ర మంత్రులుగా సీఆర్, గంటా
- ప్రమాణం చేయించిన గవర్నర్
- కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కేబినెట్‌లోకి..
- ఐదు నిమిషాల్లో ముగిసిన తంతు
- హాజరుకాని విపక్ష నేతలు
- అధిష్ఠానం దూతగా కేబీ కృష్ణమూర్తి
- శాఖల కేటాయింపులపై తర్జన భర్జన

55505-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 19 (): ఎట్టకేలకు చిరంజీవి ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర కొత్త మంత్రులుగా ‘ప్రజారాజ్యం’ తరపున సీ రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలుత రామచంద్రయ్య, అనంతరం శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39కి చేరింది. ఉదయం 11.43కు మొదలైన కార్యక్రమం 11.48 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పలువురు మంత్రులు, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు కేవీపీ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది, డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. విపక్షనేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరవలేదు.

కాగా.. ప్రమాణస్వీకారం ముగిసిందో లేదో కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి పదవులు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ది చేయాలంటే నిధుల కేటాయింపులో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పదవుల ఆశతో ఉద్యమాన్ని నీరుగార్చిన టీ కాంగ్రెస్ నేతలపై ఆ ప్రాంత ఎంపీలు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణవారికి చోటు దక్కపోవడం.. ఈ ప్రాంత నేతలకు చెంపపెట్టులాంటిదని దుయ్యబట్టారు.

వారికి తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా పదవుల చుట్టూ తిరగకుండా ఉద్యమాన్ని నీరుగార్చొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పదవులు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు, గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయిన అనంతరం ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏర్పడిన లోటును త్వరలోనే సర్దుబాటు చేస్తామన్నారు. విస్తరణ జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు సీఎం కిరణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు..

Take By: T News

Read more...

Wednesday, December 28, 2011

కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!

- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?


హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.

అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.

నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.


సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం. 

 Take By: T News

Read more...

Sunday, December 25, 2011

కిరణ్‌కు కొత్త టీం!

- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.

.
1-(6)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.

వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.

ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.

కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.

తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.

ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.

ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.

Take By: T News  

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- భారీగా రియల్‌ఎస్టేట్ దందాలు
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్‌రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే

Real-Estate1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema









 తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్‌హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!

హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదివాలా తీసిన పరిక్షిశమలను అతి తక్కువ ధరలకు కొనుగోలుచేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు కన్వర్షన్ ద్వారా అప్పటి వరకు ఉన్న పరిక్షిశమల స్థానంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్పొరేట్ ఆసుపవూతుల నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రాంత పరిక్షిశమల్లో నట్ బోల్టుల నుంచి భారీ కంటైనర్ల వరకు తయారవుతున్నాయి.

బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.

పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.

దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్‌గా విలసిల్లుతున్నది.

గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.

ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్‌హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్‌హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.

ఏపీఐఐసీ భూ పందేరం...
వాస్తవానికి ముఖ్యమంవూతిగా కాసు బ్రహ్మానందడ్డి హయాంలో ఆవిర్భవించిన పారిక్షిశామికవాడల్లో ఎక్కువ సంఖ్యలో చిన్నతరహా పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చిన్నతరహా పరిక్షిశమలకు సైతం కనీసం ఐదు ఎకరాల చొప్పున భూ కేటాయింపులుండగా, తదుపరి క్రమంగా వెయ్యి గజాలకు భూ కేటాయింపులు దిగజారాయి. పరిక్షిశమలకు భూ కేటాయింపుల అధికారం ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కట్టబెట్టాక నేరుగా భూములను విక్రయించడం ప్రారంభించింది.

ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.

బహుజన పరిశ్రమ
- కత్తులు చేసిన కండలు మనవి
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త

హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

డెమాస్కస్ కత్తులు మనవే..
తెలంగాణ సమాజంలో రాజుల కాలం నుంచి దళిత బహుజనులే వృత్తి నిపుణులుగా ప్రపంచఖ్యాతి గడించారు. వందల ఏళ్ళు ఉప్పునీటిలో ఉన్నా తుప్పు పట్టని డెమాస్కస్ కత్తులను తయారు చేయడంలో వరంగల్ జిల్లా కమ్మరులు ప్రావీణ్యులు. వీరు తయారుచేసే కత్తులకు ఆనాడే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. మిశ్రమ ధాతు శాస్త్రం (మెటాలజీ)లో హైదరాబాద్ సంస్థానానికి పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కోహినూర్, హార్లాట్, పిట్స్, జాకబ్ లాంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇక్కడే.

అగ్గిపెట్టెలో చీర చరిత్ర మనదే..
చేనేత రంగానికి తెలంగాణ ప్రాంతాలైన సిరిసిల్ల, పోచంపల్లి, వరంగల్, భువనగిరి పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీరను నేసిన ఘనత పోచంపల్లి నేతన్నలకే దక్కింది. వరంగల్‌కు చెందిన నేతన్న ఒకరు 1980 దశకంలో సినీ నటుడు శోభన్‌బాబుపై ఉన్న విపరీతమైన అభిమానంతో తన నేత చతురతతో శోభన్‌బాబు చిత్రపటం చద్దర్ (దుప్పటి)పై చిత్రించారు.

ఇత్తడికీ ప్రసిద్ది ఇక్కడే..
ఇత్తడి పరిక్షిశమకు నల్లగొండ జిల్లా చండూరు ప్రసిద్ధి. ఇప్పటికీ చండూరు ఇత్తడితోనే దేశంలోని ప్రముఖ దేవాలయాలకు తాపడాలు చేస్తున్నారు. పూజా పరికరాలతో పాటు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు చండురులో తయారై విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.

వ్యవసాయానికి ఊతం ఇచ్చిన పరిక్షిశమ
ప్రపంచంలో పారిక్షిశామికీకరణ జరగక ముందే తెలంగాణ గడ్డపై ఇలాంటి పరిక్షిశమలు చేతివృత్తులుగా వర్థిల్లాయి. యజమానులు వీరే, కార్మికులు వీరేగా చేతివృత్తుల మనుగడ కొనసాగేది. వీరు తయారు చేస్తున్న వస్తువుల్ని చూసి మరీ ఆకర్షితులై దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఆర్డర్లు ఇచ్చి చేయించుకునేవారు.

ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.

చేతివృత్తులు చెల్లా చెదురు
నిజాం లొంగుబాటు తదుపరి పుట్టుకువచ్చిన పెట్టుబడిదారులు చేతి వృత్తుల్లో నిష్ణాతులైన బడుగు వర్గాలను, వారి వృత్తులను పూర్తిగా అణిచివేశారు. చేనేత వృత్తిని దెబ్బతీసేందుకు పవర్‌లూమ్స్, కుమ్మరి వృత్తి దారులను దెబ్బతీసేందుకు ప్లాస్టిక్ పరిక్షిశమలు, ఇండియన్‌మేడ్ ఫారిన్ లిక్కర్‌తో గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు. జీ వివేక్, ఎం వెంక వంటి కొద్ది మంది దళిత బహుజన పారిక్షిశామికవేత్తలు నిలదొక్కుకోగలిగినా.. ఎంతో మంది ఔత్సాహికులు దూరంగానే ఉండిపోయారు. పరిక్షిశమలు పెట్టేందుకు ఆసక్తి చూపి సర్కారుకు పెట్టిన దరఖాస్తులు జిల్లా పరిక్షిశమల కేంద్రాలకే పరిమితం అవుతున్నాయని వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన దళిత ఔత్సాహికుడు మురళి విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఆటో నడుపుకొంటున్నారు.

కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-గంప చంద్రమోహన్, పారిక్షిశామిక వేత్త



కనుమరుగైన ఖండాంతర ఖ్యాతి
-ఆసియాలో భారీ వస్త్ర పరిక్షిశమ..
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్‌సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు

20--adb-2b-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( - కాగజ్‌నగర్) తెలంగాణలో భారీ పరిక్షిశమగా విరాజిల్లుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఖండాంతర ఖ్యాతి గాంచిన స్థానిక సర్‌సిల్క్ మిల్లు 26 ఏళ్ల క్రితం మూతపడింది. మిల్లు ఆస్తులు అమ్మేయగా మిగిలిన మొండిగోడలతో చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ పట్టు వస్త్ర పరిక్షిశమగా పేరొందిన ఇది ముడి సరుకు కొరత నెపంతో మూతపడింది. 40వ దశకం మొదట్లో నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తపేట కుగ్రామంలో సర్‌సిల్క్ మిల్లును ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ - హైదరాబాద్ రైల్వే మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఈ పరిక్షిశమకు తోడుగా కాగితపు పరిక్షిశమను కూడా నిజాం నవాబు పక్క పక్కనే ఏర్పాటు చేయడంతో కొత్తపేట కుగ్రామం కాస్తా కాగజ్‌నగర్‌గా గుర్తింపు పొందింది.

నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్‌సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్‌ఔ్ తో మూతపడింది.

20--adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కార్మికుల ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రయోగాత్మకంగా కార్మిక సహకార పద్ధతిలో మాజీ మంత్రి కేవీ కేశవులు, ప్రైవేటు ప్రమోటర్లు, ఐడీబీఐ రుణంతో 1994 ఏప్రిల్ 16న మిల్లు పునఃవూపారంభింపజేసినప్పటికీ యాజమాన్యం అసమర్థత, అవినీతి కారణంగా ఏడు నెలలకే మరోసారి మూతపడింది. ఆ తర్వాత మిల్లు తెరిచే ఏర్పాటు జరుగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మిల్లు శాశ్వతంగా మూతపడటంతో మిల్లులో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఉపాధి కరువై, పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిల్లులో అధికారులుగా అధికారం చెలాయించిన ఉద్యోగులు పేపర్ బాయ్‌లుగా, ట్యూషన్ మాస్టర్లుగా మారాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.

వ్యక్తులుగా కాదు.. శక్తులుగా..
-తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలి(టెక్కి) ఏర్పాటు
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం

హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్‌రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్‌రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు పాల్గొంటారు.


Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

 
Take By: T News 

Read more...

Monday, December 19, 2011

చిరుకు కేంద్ర మంత్రి పదివి ఇప్పట్లో లేనట్లే!

- మెగాస్టార్‌కు 3 నెలల నిరీక్షణ తప్పదు
- రాష్ట్రం నుంచే రాజ్యసభకు
- మార్చిలో ఎన్నికయ్యే అవకాశం
- ఆచీతూచీ అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Chiranjivi-12-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 18 (): తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కూడా ఇంకా పీఆర్పీ అధినేతగానే నెట్టుకొస్తున్న తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధికార పార్టీలో తగిన హోదా, గుర్తింపు ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కోసం ఆయన ఇంకా కనీసం మూడు నెలలు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ ఘడియ కోసం ఆయన ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పదంటున్నారు. రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందుగా లేదా, రాజ్యసభకు ఎన్నికైన వెంటనే చిరుకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌లో సినీగ్లామర్ కలిగిన నేతగానే కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందర్ని తన వర్గంగా మలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతానంటూ ఒక వైపు జగన్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే, ఆ సర్కార్ కూలిపోకుండా తాను నిలబెడతానంటూ చిరంజీవి అధికార పార్టీకి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో పీఆర్పీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల మద్ధతుతో కిరణ్ ప్రభుత్వానికి కొండత ధైర్యం లభించింది. ఇందుకు ప్రతిఫలంగా పీఆర్పీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంవేసిన చిరుకు కాంగ్రెస్‌లో కీలక గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు, మిగతా వారిలో కొందరికి నామినే డ్ పదవులు అప్పగించే యోచనలో ైహైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలంటే ముఖ్యమంవూతిని చేయడం లేదా పీసీసీ పగ్గాలు అప్పగించడం. ఈ రెండు ఇప్పట్లో హైకమాండ్‌కు సాధ్యమయ్యేలా లేవంటున్నారు. అదిలేకుంటే ఆ స్థాయిలోనే గుర్తింపు లభించే మరో హోదాను కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనేది ఆ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే చిరుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలంటే మరో మూడు నెలల వేచి చూడాలి. తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన ఒక దశలో అధిష్ఠానానికి వచ్చినా, చిరుకు రాజకీయ, పరిపాలన అనుభవం లేక పోవడం, తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించే హైకమాండ్ వెనకడుగు వేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

దాసరి స్థానంలో చిరు ఎంపిక !
రాజ్యసభ దై్వవార్షిక ఎన్నికల్లో భాగంగా మార్చిలో రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో కాంగ్రెస్ 4 స్థానాలను కచ్చితంగా గెలుచుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు, దాసరి నారాయణరావు, సంజీవడ్డి, రషీద్ అల్వీ, టీడీపీ నుంచి మైసూరాడ్డి, సీపీఐకి చెందిన అజీజ్‌పాషా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఖాతాలో వచ్చే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవి కోసం అధిష్ఠానం రిజర్వ్ చేసినట్లు ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే రెండు మార్లు దాసరి నారాయణరావుకు రాజ్యసభ అవకాశం కల్పించినందున, ఆయన స్థానంలో ఈ సారి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో హైకమాండ్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపికైన కొత్త అభ్యర్థుల పదవీ కాలం మే నుంచి వర్తిస్తుంది. అయితే చిరును రాజ్యసభకు ఎంపిక చేసిన వెంటనే కేంద్రంలో చోటు కల్పించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ఆలస్యమవుతుందని అనుకుంటే రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే కేంద్రం మంత్రివర్గంలో తీసుకుని స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP