Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telangana News (Telugu). Show all posts
Showing posts with label Telangana News (Telugu). Show all posts

Sunday, September 2, 2012

పిల్లలకు నేర్పండి...‘పొదుపు’కథలు


పదేళ్ళ అబ్బాయికి ఓ పది రూపాయలిస్తే ఏంచేస్తాడు? ఏ చాక్లెట్టో..ఐస్‌క్రీమో..కొనుక్కుంటాడు. లేకపోతే స్పైడర్‌మేన్, సచిన్ టెండూల్కర్ స్టిక్కర్లు కొనుక్కుంటాడు. కొంత మంది బుద్ధిమంతులైన పిల్లలైతే ఆ పదిరూపాయల్ని తీసుకెళ్ళి తమ కిడ్డీబ్యాంకులో వేసుకుం టారు. అది కూడా అవన్నీ కూడబెట్టి పెద్ద బ్యాట్ కొనుక్కోవడానికే అయ్యుం టుంది. అలా కాకుండా ఆ పదిరూపాయలతో ఆ పిల్లవాడు ‘డాడీ..దీంతో ఫలానా షేరు కొంటాను...మూడు నెలల్లో పదిరెట్లు అవుతుంది’ అన్నాడనుకోండి. 

నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో అని ఆ తండ్రి పుత్రోత్సాహానికి అంతుండదు. కానీ పిల్లలకు ఈ వయసు నుంచే అంతపెద్ద పొదుపు, పెట్టుబడి మాటలెందుకని అనిపించొచ్చు. కాలం మారింది.

ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు విలువ, పొదుపు అలవాటు, పెట్టుబడి పరిజ్ఞానం తెలియడం చాలా అవసరమని అంటున్నారు పిల్లల మానసిక శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకరైన వారెన్ బఫెట్ తొలి షేర్‌ను 11 ఏళ్ళ వయసులో కొన్నాడట. ‘అబ్బా..ఇంకాస్త చిన్న వయసులో మొదలుపెట్టి ఉంటే మరింత ధనవంతుడయ్యేవాడ్ని కదా’ అని సరదాగా బాధపడుతుంటాడట బఫెట్.
డబ్బు విలువ తెలియజేయడం కన్నా ముఖ్యమైనది పిల్లలలో పొదుపు, పెట్టుబడి అలవాటును ప్రోత్సహించడం. చిన్నప్పుడే అంత పెద్ద అలవాట్లు ఎందుకు అని తల్లిదండ్రులు అనుకోకుండా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేయడం మంచిది.

కిడ్డీబ్యాంక్‌తో పొదుపభ్యాసం
పిల్లలు ప్రీస్కూల్, కిండర్‌గార్డెన్ వయసులో ఉండగానే ప్రాథమిక డబ్బు విలువను అర్థం చేసుకోగల సమర్థత కలిగి ఉంటారని తల్లిదండ్రులు నమ్మాలి. అందుకే అప్పుడే కిడ్డీ బ్యాంక్‌ను ప్రవేశపెట్టాలి. ఆకర్షణీయమైన ట్రాన్స్‌పరెంట్ కిడ్డీ బ్యాంక్ బొమ్మను కొనివ్వండి. అందులో వేసే డబ్బులు బయటికి కనిపించే విధంగా ఉండాలి. అందులో వేసిన డబ్బులు చూపిస్తూ, డబ్బు ఎంతటి విలువైనదో ఎన్ని పనులు చేస్తుందో చిన్నచిన్న ఉదాహరణలతో, మాటలతో కొద్దిగా చెప్పండి. డబ్బు బయటకు కనిపించే కిడ్డీ బ్యాంక్‌లోంచి పిల్లలు డబ్బులు తీసినప్పుడు తగ్గిపోవడం, వేసినప్పుడు పెరగడం చూస్తున్నప్పుడు మీరు చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి. ఆ దశలో డబ్బు విలువను పిల్లలు రాశితోనే ఎక్కువ తక్కువలుగా లెక్కిస్తారు. కాబట్టి డబ్బు తగ్గిపోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. పొదుపు, బ్యాంక్, డిపాజిట్ వంటి పదాలు, వాటి అర్థాలు ముఖ్యంగా చిన్న కథల సహాయంతో చెప్తే పిల్లలకు ఎంతగానో హత్తుకుంటాయి.

కిడ్డీబ్యాంక్ నుండి ఆన్‌లైన్ బ్యాంక్‌కి
పిల్లలు కొద్దిగా ఎదిగి కేజీ చదువులు దాటి ముందుకు వెళ్తూ మేథ్స్ సబ్జెక్టులో బోలెడన్ని లెక్కలు చేస్తున్న దశకు చేరుకున్న సమయంలో పాకెట్ మనీని ఎలాగూ అలవాటు చేస్తారు. పిల్లల అవసరాలకు సరిపడా డబ్బులివ్వడమే కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బులివ్వండి. అలా ఇస్తూ చూద్దాం. ‘దాన్ని నువ్వు ఎంత తెలివిగా పొదుపు చేస్తావో’ అని పరోక్షంగా ఒక ప్రోత్సాహానిచ్చే కామెంట్ కూడా చేయాలి. దాంతోపాటు పిల్లలు చేసే ప్రతి ఖర్చును ఒక పుస్తకంలో రాసే అలవాటును కూడా ప్రోత్సహించండి. ‘ఆ యాభై రూపాయలు ఏం చేశావు’ అని అడిగినప్పుడు పిల్లలు గుర్తుకురాక తడబడుతూ, గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో తెగ ఇబ్బంది పడుతున్న సమయంలో ‘అందుకే అన్నీ ఒక పుస్తకంలో రాస్తే..ఏదీ మర్చిపోవు’ అని చెప్తే పిల్లల మనసులో బలంగా ముద్రించుకుపోతుంది. ఆ మరునాటి నుంచే పిల్లలు కూడా అకౌంట్స్ మెయింటెన్ చేయడం మెదలు పెడతారు. అదే సమయంలో పిల్లల పేరు మీద ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయాలి. అందులో కొంత డబ్బు డిపాటిజ్ చేసి కిడ్డీ బ్యాంక్‌కి, ఈ బ్యాంక్‌కి గల తేడాను పిల్లలకి చెప్పాలి. ‘కిడ్డీ బ్యాంక్‌లో వేసిన డబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈ బ్యాంక్‌లో డబ్బులు వేస్తే పెరుగుతాయి’ అని వారికి వడ్డీ గురించి వివరించాలి. ‘ఆ వడ్డీతో నువ్వు ఏం కొనుక్కున్నా..అసలు అలాగే ఉంటుంది’ అని తేలికైన పదాలతో వారికి శాస్త్రీయమైన పొదుపు పద్ధతుల గురించి చెప్పాలి. వీటన్నింటి నేపథ్యంలో డబ్బు విలువను పిల్లలు పదేపదే తెలుసుకుంటూ ఉంటారు. ఫలితంగా డబ్బు పట్ల నిర్లక్ష్య ధోరణిపోయి, జాగ్రత్త గౌరవం పెంచుతాయి.

పొదుపు నుంచి పెట్టుబడికి
బాల్యంలో డబ్బు విషయాలు పెద్దవాళ్ళ విషయాలుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం పాటిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ నేటి మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో పిల్లలను కుటుంబంలోని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం వీలు పడదు. అయినా, ఇప్పు డు అనేక సందర్భా లలో పిల్లలముందే ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. పైగా ‘బోలెడంత ఫీజులు కట్టి చదివిస్తున్నాం..బాగా చదువు’ అని ఎలాగూ పిల్లలతో అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలా ఆర్థిక విషయాల గురించి నెగెటివ్ భావాలు పెంపొందించే బదులు పాజిటివ్ భావాలు పెంపొందించడం మంచిది కదా..అని సలహా ఇస్తున్నారు పిల్లల వ్యక్తిత్వ వికాస నిపుణులు.
పిల్లలు 7వ తరగతికి వచ్చేసరికే వారి సిలబస్ చూస్తే వారు ఎంతటి కీలకమైన ఆర్థిక పరమైన అంశాలను అభ్యాసం చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆ పనుల నుండే వారికి ఏ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత వస్తాయి. ఒక 50 వేలు డిపాజిట్ చేస్తే ఏయే బ్యాంక్‌లో ఎంత ఆదాయం వస్తుంది. మొదలైన బాధ్యతలు పిల్లలకే అప్పగించాలి. డిపాజిట్లు, పెట్టుబడుల పద్ధతుల గురించి వారితో చర్చించాలి. ముఖ్యంగా వివిధ పెట్టుబడుల పద్ధతుల గురించి, ఎందులో పొదుపు చేస్తే, పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందో..పిల్లలకు వివరించాలి.

ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తున్న తరుణంలో పిల్లలలో కూడా పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కంపెనీలలో షేర్లు మొదలైనవి వారికి కొంత అర్థమవుతాయి. అందులోని సందేహాలను తల్లిదండ్రులు తీర్చాలి. ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి పిల్లలకే పెట్టుబడి నిర్ణయాధికారం ఇవ్వాలి. ‘ఇదిగో ఈ లక్ష రూపాయలు, లేదా ఓ ఇరవై వేలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టమంటావో చెప్పు’ అని తల్లిదండ్రులు పిల్లలని అడిగితే, వాళ్ళు ఆ విషయంపై ఎంతో పరిశోధన, విశ్లేషణ చేస్తారు. ఆ ప్రక్రియలో పిల్లలు ఆర్థిక అంశాల విషయంలో ఎంతో తెలివైన వారుగా రూపుదిద్దుకుంటారు.

కొంత డబ్బుతో ప్రత్యేకంగా పిల్లల సలహామేరకు వారి స్వేచ్ఛా నిర్ణయానుసారం పెట్టుబడులు జరుగుతుంటే ఆ డబ్బు పెరుగుతుంటే ఆ అంశంపై వారికి మరింత ఆసక్తి రావడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. డబ్బుపట్ల విపరీతమైన జాగ్రత్త పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు ఏదైనా అనవసరంగా ఖర్చు చేస్తే పిల్లలే అది వృథా ఖర్చని, వద్దని వారించే స్థితికి వస్తారు.

ఏ వయస్సులో..
ఎలాంటి పొదుపు?

సం॥ వయస్సున్న పిల్లలకు కిడ్డీ బ్యాంక్ పొదుపు అలవాటు చేయండి. పెరిగే, తరిగే డబ్బును చూపిస్తూ డబ్బు విలువ తెలియజేయండి. చిన్న చిన్న పొదుపు లక్ష్యాలు పెట్టండి. 100 రూపాయలు ఎప్పుడూ చేస్తారో అప్పుడు బొమ్మ కొనుక్కోవచ్చు వంటి సరదా లక్ష్యాలు పెట్టండి.
సం॥ వయసు ఉన్న పిల్లల పేరుమీద బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించాలి. ఆపాస్ పుస్తకం, అందులో పేర్లు పిల్లలకి ఆసక్తిగా ఉంటాయి. అప్పుడే బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ పద్ధతులు, వడ్డీ వివరాలు చెప్పాలి. ఆ సమయంలో పిల్లలకు సరిగా అర్థంకాక అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి.
సం॥ వయసు పిల్లలకు అప్పటికే డబ్బు, పొదుపు, పెట్టుబడి అంశాలపై ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. కాబట్టి పొదుపు పెట్టుబడుల విషయంలో వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. వారి వెంట ఉంటూ వాటిని అమలు చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మంచిది? అందుకు కారణాలేమిటో పిల్లల్ని అడగాలి. దాని నుంచి వచ్చే జవాబులు ఎంతో కీలకమైనవి.
సం॥ వయసున్న పిల్లలకు చేతిలో కొంత డబ్బు ఇచ్చి దాని పూర్తి పెట్టుబడి బాధ్యత, ఆ మొత్తాన్ని ఎక్కువ చేసే బాధ్యత వారికే అప్పగించాలి. అది చిన్న చిన్న మొత్తాలుగా ఉండాలి. వారి నిర్ణయాలలో తారుమారై నష్టం సంభవించినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. అది వారికి ఎంతో విలువైన అనుభవం అవుతుంది.

Take By: T News

Read more...

Friday, June 29, 2012

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Saturday, December 24, 2011

సమన్వయంతో అణిచేద్దాం!

కాంగ్రెస్ సమన్వయ కమిటీ అసలు కోణం ఇదే!
- అందుకే తెలంగాణ వ్యతిరేకులకు చోటు
- ప్రత్యేకవాదం వినిపించేందుకు ఒక్కరూ లేరు
- తెలంగాణ నుంచి ముగ్గురున్నా..ముగ్గురివీ వ్యక్తిగత ప్రయోజనాలే!
- కమిటీ ఏర్పాటులో ముందు జాగ్రత్త


TG-copy talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 23 ():‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు వెనుక తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాలు దాగి ఉన్నాయా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆకాంక్షలను కట్టడి చేయడానికే ఈ కమిటీని ముందుకు తీసుకువచ్చారా? తెలంగాణకు బద్ధ వ్యతిరేకులను, తెలంగాణపై గట్టిగా మాట్లాడని వారిని కమిటీలోకి తీసుకోవడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటి? తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే ఏ ఒక్క నాయకుడికీ ఈ కమిటీలో ఎందుకు స్థానం దక్కలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఉద్దేశించినట్లు చెబుతున్న సమన్వయ కమిటీ విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలివి!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలోదారిన నడుస్తున్నారు కనుక, అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసేందుకు అంటూ సమన్వయ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలోకి సభ్యులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏ పదవీ లేదని రుసరుసలాడుతున్న చిరంజీవిని తీసుకోవడంతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ కావూరి సాంబశివరావును తీసుకున్నారు. గతంలో ఈ కమిటీలో ఉన్న జానాడ్డి, కేవీపీ రామచందర్‌రావు, గీతాడ్డిని ఈ సారి పక్కనపెట్టారు. మొత్తంగా ఈ కమిటీలో తెలంగాణ అంశాన్ని గట్టిగా వినిపించే నాయకుడుకానీ, ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తే గట్టిగా అడ్డుకునే నేత లేకపోవడంపై ప్రత్యేక రాష్ట్ర వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డుకునేందుకు, అణచివేసేందుకు ముందు జాగ్రత్తగా రూపొందించిన పక్కా పథకమని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులైన వారిని ఈ కమిటీలో నియమించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణవారే అయినా.. వీరు ముగ్గురూ అంత గట్టిగా తెలంగాణవాదం వినిపిస్తున్న వారు కాదు.


డీ శ్రీనివాస్ తెలంగాణపై ఏదో ఒకటి చెబుతున్నా ఆయన లక్ష్యం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద ఆశీస్సులు పొందటం కోసమేనన్నట్లు కనిపిస్తోందని విమర్శలున్నాయి. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ అగుపించటం లేదు. ఏ పదవీ లేనపుడు అంతో కొంతో తెలంగాణ అంటూ మాట్లాడిన డీఎస్ తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కటంతో ఇతరత్రా పదవుల కోసమే అంగలారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ అభివృద్ధి మండలిని కేంద్రం వేస్తే.. దానిపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏనాడూ తెలంగాణవాదిగా మాట్లాడకపోవటం గమనార్హం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పదవిని వాడుకుంటున్నారు తప్పితే తెలంగాణవాదాన్ని వినిపించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదని పలువురు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కావడంతోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీని ద్వారా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను తెచ్చుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ శాఖ కోసం పట్టుబట్టిన ఆయన.. అధిష్ఠానం వద్ద ఇప్పటికే తన అభ్యర్థనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక, షబ్బీర్‌అలీ కూడా తెలంగాణకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్‌తో సన్నిహితంగా ఉండి ఈ కమిటీలో స్థానం పొందారని అంటున్నారు.

ఆయన కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలు బహు అరుదు. కాగా, కమిటీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారందరూ తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణవాదుల ముందు మాత్రం తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఈ మేరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా సమైక్యవాదిగానే వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవటం లేదు. కరడుగట్టిన సమైక్యవాదిగా చెప్పుకునే చిరంజీవికి ఈ కమిటీలో ప్రాతినిథ్యం లభించింది. ఆయన తెలంగాణను నేరుగా వ్యతిరేకిస్తున్నారు.

ఆయనకంటే కావూరి సాంబశివరావు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ లాబీయింగ్ విస్తృతస్థాయిలో ఉందని, దీనికి జాతీయ నాయకులు కూడా ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సమైక్యవాదులకు పెద్ద పీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం పట్ల తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కీలక సమయాల్లో కట్టడికే!
తెలంగాణ ఉద్యమం సంధికాలాన్ని దాటుకుని మరోసారి విజృంభించే పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. ఉద్యోగ జేఏసీలు మొదలుకుని సింగరేణి తదితర చోట్ల నుంచి కూడా తెలంగాణ కోసం మరోసారి మహోద్యమానికి సిద్ధమన్న సంకేతాలు అందుతున్నాయి.

రాజకీయ పోరాటాలు కూడా మరింత ఉధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపైన, ఉద్యమాలపైన సర్కారు గతంలో అనుసరించిన పద్ధతులనే ఈ సారీ అనుసరించవచ్చు. గతంలో 42రోజులపాటు వీరోచితంగాసాగిన సకల జనుల సమ్మెసందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు జులుం ప్రదర్శించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తీవ్రంగా వేధించారు. దీనికి టీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతలు పెల్లుబికాయి. మళ్లీ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే సమన్వయ కమిటీలో మాట్లాడుకుంటాం.. అన్న మాట చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

దీంతో టీ కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించడానికి, వారు కూడా తమపై ఒత్తిళ్లను సమన్వయ కమిటీపైకి నెట్టేసేందుకు వీలు కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. పైగా టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన పక్షంలో వారిపై కేసుల విషయంలో సర్కారు తానుఅనుకున్నదే చేసేందుకు సమన్వయ కమిటీని ఉపయోగించుకోవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 2014 దాకా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ సాగదీస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శలదాడి నుంచి తప్పించుకోవడానికే ఈ కమిటీని ఉద్దేశించారని అంటున్నారు.

కిరణ్ వ్యూహమా?
సమన్వయ కమిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా ప్రధాన భూమికను వహించినట్టు తెలుస్తోంది. ఆజాద్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న కిరణ్.. రాష్ట్రంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఈ కమిటీ నిర్మాణానికి చొరవ తీసుకున్నారని, ఈ మేరకు ఆజాద్‌ను ఒప్పించారని చెబుతున్నారు.

రాష్ట్రంలో వైఎస్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించానని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించేలా పథకాల రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తున్నట్టు కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నట్టు తెలిసింది. దీంతో జగన్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, వైఎస్‌కున్న పలుకుబడి క్షీణించిందని, దీనివల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మేలు జరుగుతుందని కిరణ్‌కుమార్‌డ్డి రాష్ర్ట్ర ఇన్‌చార్జి వద్ద గట్టిగా వాదించి, రాష్ట్రంలో తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా కమిటీ నిర్మాణం జరిగేందుకు విజయవంతంగా కృషి చేసినట్టు చెబుతున్నారు.

వైఎస్ అత్యధిక ప్రచారం చేసుకున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రాజీవ్ ఉద్యోగశ్రీ, పావలా వడ్డీకే రుణాలు తదితర కార్యక్షికమాలు పూర్తిస్థాయిలో మార్చివేసి, వైఎస్ పథకాలు రాష్ట్రంలో లేకుండా చేసినట్టు ఆయన అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నారని అంటున్నారు. వాటి స్థానంలో రూపాయికే కిలో బియ్యం, రాజీవ్ ఉద్యోగ కిరణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వాటిని కాంగ్రెస్ పథకాలుగా రాష్ట్ర ప్రజలు గుర్తించేలా ప్రచార కార్యక్షికమాన్ని ముమ్మరం చేసినట్టు కూడా కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.

దీంతో కిరణ్‌కుమార్‌డ్డి అభీష్టం మేరకే సమన్వయ కమిటీ ఏర్పాటైందని, పీసీసీ అధ్యక్షుని హోదాలో కమిటీ సభ్యునిగా ఉన్న బొత్స సత్యనారాయణ మినహా ఇతరుపూవరూ కిరణ్‌కుమార్‌డ్డికి ప్రతికూలంగా మాట్లాడే అవకాశం లేదని, దీంతో ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా కమిటీకి రూపకల్పన జరిగిందని భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అధ్యక్షతన జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆజాద్ ముందు బొత్స సత్యనారాయణ పెద్దగా నిరసనలు తెలిపే అవకాశాలుండవని, అంతా తూతూమంవూతంగా జరుగుతుందనే అభివూపాయం వ్యక్తమవుతోంది.

Take By: T News  

Read more...

Monday, December 19, 2011

చిరుకు కేంద్ర మంత్రి పదివి ఇప్పట్లో లేనట్లే!

- మెగాస్టార్‌కు 3 నెలల నిరీక్షణ తప్పదు
- రాష్ట్రం నుంచే రాజ్యసభకు
- మార్చిలో ఎన్నికయ్యే అవకాశం
- ఆచీతూచీ అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Chiranjivi-12-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 18 (): తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కూడా ఇంకా పీఆర్పీ అధినేతగానే నెట్టుకొస్తున్న తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధికార పార్టీలో తగిన హోదా, గుర్తింపు ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కోసం ఆయన ఇంకా కనీసం మూడు నెలలు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ ఘడియ కోసం ఆయన ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పదంటున్నారు. రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందుగా లేదా, రాజ్యసభకు ఎన్నికైన వెంటనే చిరుకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌లో సినీగ్లామర్ కలిగిన నేతగానే కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందర్ని తన వర్గంగా మలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతానంటూ ఒక వైపు జగన్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే, ఆ సర్కార్ కూలిపోకుండా తాను నిలబెడతానంటూ చిరంజీవి అధికార పార్టీకి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో పీఆర్పీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల మద్ధతుతో కిరణ్ ప్రభుత్వానికి కొండత ధైర్యం లభించింది. ఇందుకు ప్రతిఫలంగా పీఆర్పీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంవేసిన చిరుకు కాంగ్రెస్‌లో కీలక గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు, మిగతా వారిలో కొందరికి నామినే డ్ పదవులు అప్పగించే యోచనలో ైహైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలంటే ముఖ్యమంవూతిని చేయడం లేదా పీసీసీ పగ్గాలు అప్పగించడం. ఈ రెండు ఇప్పట్లో హైకమాండ్‌కు సాధ్యమయ్యేలా లేవంటున్నారు. అదిలేకుంటే ఆ స్థాయిలోనే గుర్తింపు లభించే మరో హోదాను కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనేది ఆ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే చిరుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలంటే మరో మూడు నెలల వేచి చూడాలి. తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన ఒక దశలో అధిష్ఠానానికి వచ్చినా, చిరుకు రాజకీయ, పరిపాలన అనుభవం లేక పోవడం, తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించే హైకమాండ్ వెనకడుగు వేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

దాసరి స్థానంలో చిరు ఎంపిక !
రాజ్యసభ దై్వవార్షిక ఎన్నికల్లో భాగంగా మార్చిలో రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో కాంగ్రెస్ 4 స్థానాలను కచ్చితంగా గెలుచుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు, దాసరి నారాయణరావు, సంజీవడ్డి, రషీద్ అల్వీ, టీడీపీ నుంచి మైసూరాడ్డి, సీపీఐకి చెందిన అజీజ్‌పాషా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఖాతాలో వచ్చే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవి కోసం అధిష్ఠానం రిజర్వ్ చేసినట్లు ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే రెండు మార్లు దాసరి నారాయణరావుకు రాజ్యసభ అవకాశం కల్పించినందున, ఆయన స్థానంలో ఈ సారి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో హైకమాండ్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపికైన కొత్త అభ్యర్థుల పదవీ కాలం మే నుంచి వర్తిస్తుంది. అయితే చిరును రాజ్యసభకు ఎంపిక చేసిన వెంటనే కేంద్రంలో చోటు కల్పించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ఆలస్యమవుతుందని అనుకుంటే రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే కేంద్రం మంత్రివర్గంలో తీసుకుని స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Take By: T News

Read more...

Sunday, December 18, 2011

చిదంబరాన్నీ చేర్చాలి

- ఆయనపై విచారణ జరపాల్సిందే
- సీబీఐ కోర్టుకు స్వామి విజ్ఞప్తి
- రాజా, చిదంబరంల ఉమ్మడి నిర్ణయమది
- అందుకు సాక్ష్యాధారాలున్నాయి
- చిదంబరం మీద ఇదివరలోనూ కేసులున్నాయి
- ఆయనో పాత నేరగాడి కిందే లెక్క
- సాక్ష్యం సందర్భంగా వాదించిన సుబ్రమణ్యస్వామి
- ధ్రువీకృత పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశం
- తదుపరి విచారణ 7కు వాయిదా

46578-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశాన్ని కుదిపేసిన సంచలన అవినీతి కుంభకోణం- 2జీ స్పెక్ట్రం కేసులో టెలికం మాజీ మంత్రి రాజా ఒక్కడినే తప్పుబట్టడం సరికాదని, అప్పుడు ఆర్థికమంవూతిగా పనిచేసిన ప్రస్తుత హోంమంత్రి పీ చిదంబరం కూడా అందులో భాగస్వామేనని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. చిదంబరం సూ చనలు, ఆదేశాల మేరకే రాజా వ్యవహరించారని, అందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాధారాలున్నాయని స్పష్టం చేశారు. అందువల్ల కేసులో చిదంబరాన్నీ నిందితుడిగా చేర్చాలని, ఆయననూ విచారించాలని కోరా రు. చిదంబరం మీద ఇదివరలోనూ కేసులున్నాయని, ఆయనో పాత నేరగాడి కిందే పరిగణించాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో తన ప్రైవేటు ఫిర్యాదుపై సాక్ష్యమిచ్చారు.

తన వాదనలకు మద్దతుగా ఆయన కొన్ని డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. ఆయన వాదనలు విన్న కోర్టు సాక్ష్యాలకు సంబంధించి పార్లమెంటు, సంబంధిత శాఖల నుంచి ధ్రువీకృత ప్రతులను తీసుకురావాలని కోరింది. కొందరు ప్రభుత్వ అధికారులతోపాటు ఇతర సాక్షులను పిలవాలన్న స్వామి అభ్యర్థనపై తర్వాత స్పందిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి వాయిదా వేసింది. చిదంబరం, రాజాల సమావేశాల వివరాలు కోర్టుకు విన్నవిస్తానని, వాటి ఆధారంగా న్యాయస్థానం వెంటనే చర్యలకు ఉపక్షికమించే అవకాశముందని ఆ తర్వాత స్వామి విలేకరులతో చెప్పారు. ‘‘ఆ నాలుగు డాక్యుమెంట్లకు సంబంధించి మీరు ధ్రువీకృత ప్రతులను అందజేస్తే సరిపోతుందని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత అవసరమైతే నేరుగానే విచారణ కొనసాగిస్తామని, మీకెలాంటి సాక్ష్యం అవసరం ఉండదని కోర్టు చెప్పడం సంతోషం కలిగించింది’’ అని ఆయన తెలిపారు.

కేబినెట్ నిర్ణయం మేరకు అప్పటి టెలికాం మంత్రి రాజా, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంలకు స్పెక్ట్రం ధరలను సంయుక్తంగా నిర్ణయించే అధికారం లభించిందని సుబ్రమణ్యస్వామి సీబీఐ న్యాయస్థానానికి తెలిపారు. 2001నాటి ధరల ప్రకారం 2008లో స్పెక్ట్రం చార్జీలను ఖరారు చేయడంలో రాజా ఒక్కడినే బాధ్యుడిగా పరిగణించడం సరికాదని, చిదంబరం గట్టి మద్దతుతోనే ఆయన ఆ నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ‘‘టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్), ఆర్థికమంవూతిత్వశాఖ కలిసి చర్చించి స్పెక్ట్రం ధరలను ఖరారుచేస్తా’’మని చిదంబరం 2008 జనవరి 15న ప్రధానమంవూతికి లేఖ రాశారని స్వామి తెలిపారు. ‘‘ధరలపై చర్చించి ఓ నిర్ణయానికి వద్దామా? దానిని ప్రధానికి తెలియజేయవచ్చు’’ అంటూ చిదంబరం అదే ఏడాది ఏప్రిల్ 21న రాజాకు లేఖ రాశారని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2011 ఫిబ్రవరి 24న రాజ్యసభలో చేసిన ప్రకటనను స్వామి గుర్తుచేశారు. 2003నాటి కేబినెట్ నిర్ణయం మేరకు స్పెక్ట్రం ధరలను నిర్ధారించారని, ఆ అంశాన్ని ఆర్థికమంవూతిత్వశాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ సంయుక్తంగా చూసుకుంటాయని ప్రధాని స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. ‘‘ఆ అధికారంతోనే (2003నాటి కేబినెట్ సమావేశం) ఇద్దరు మంత్రులు నాలుగుసార్లు సమావేశమయ్యారు. 2008 జనవరి 31, మే 29, జూన్ 6, ఆ తర్వాతా కలిసి ఓ అవగాహనకు వచ్చారు. 2008 జూలై 4న ప్రధానమంవూతిని కలుసుకుని తమ నిర్ణయాన్ని తెలియజేశారు’’ అని సుబ్రమణ్యస్వామి వివరించారు. ‘‘ఈ వాస్తవాలనుబట్టి స్పెక్ట్రం ధరల నిర్ణయంలో చిదంబరం ప్రమేయముందన్నది స్పష్టం’’ అని ఆయన వాదించారు. మరికొన్ని ఆధార పత్రాలను సేకరించడానికి తనకు ఇంకొంత సమయం అవసరమవుతుందని చెప్పారు. దీంతో కోర్టు తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి వాయిదావేసింది.

చిదంబరం చాలా తెలివిగా వ్యవహరిస్తారని, ఆయన ఎన్నో నేరాలు చేసిన వ్యక్తని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఆయన అసలు స్వరూపాన్ని బహిర్గత పరుస్తానని చెప్పారు. ‘‘చిదంబరాన్ని అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంది. రాజా కేవలం చిదంబరానికి సబార్డినేట్. చిదంబరం ఎంత అవినీతిపరుడో నిరూపించేందుకు నేను కొత్త నిజాలను తెలియజేస్తాను. ఆయన ప్రమేయమున్న అవినీతి కేసు ఇదొక్కటే కాదు. ఆయన ఎన్నో నేరాలు చేశారు. ఆయన మరీ తెలివైనవారు. లాయరైనందున ఏదో సాకు చూపెట్టుకోవచ్చనుకుంటారు. ఆయనో పాతనేరగాడి కిందే లెక్క. ఈరోజు కాకున్నా మరెప్పుడైనా సెక్షన్ 13 (1) కింద చిదంబరం అలవాటైన నేరగాడని చూపిస్తా’’ అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.

Take By: T News

Read more...

Friday, December 16, 2011

రాజ్యసభలోనూ తెలం‘గానం’

న్యూఢిల్లీ, డిసెంబర్ 15 ): తెలంగాణ అంశంపై పార్లమెంటు మరోసారి దద్దరిల్లనుంది. గత సమావేశాల్లో లోక్‌సభలో వాడివేడి చర్చ జరగ్గా ఈసారి పెద్దలసభను తెలంగాణ కుదిపేయనుంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ తెలంగాణపై ఇచ్చిన ప్రైవేట్ మెంబర్ బిల్లు నోటీస్8పై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరగనుంది. తెలంగాణపై రాజ్యసభలో చర్చ జరగటం ఇదే తొలిసారి. దీంతో ఈ అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.ఆ మేరకు ఢిల్లీలో ఉన్న టీఆర్‌ఎస్8 నేత వినోద్‌కుమార్ పలు పార్టీల నేతలని కలిసి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. తెలంగాణాకు మద్దతు పలికిన బీజేపీ, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, జేడీ(యూ) నేతలతోపాటు కాంగ్రెస్8 సీనియర్ నేత కే కేశవరావును ఆయన కలిశారు. రాజ్యసభలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సభ్యులు ప్రకాశ్ జవదేకర్(బీజేపీ), డి. రాజా (సీపీఐ), తారిఖ్ అన్వర్ (ఎన్సీపీ), సతీష్ మిశ్రా(బీఎస్పీ) తదితరులకు వినోద్ పూర్తి సమాచారంతో కూడిన నివేదికను బుధవారం అందచేశారు.

బాల్కసుమన్ విడుదల
అక్రమ నిర్భంధాలు, అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని టీఆర్‌ఎస్8వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం రాత్రి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. తన విడుదలకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, అండగా నిలిచిన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్8 పొలిట్‌బ్యూరో సభ్యుడు, టీఆర్‌ఎస్8వీ రంగాడ్డి జిల్లా వీరమల్ల రాంనర్సింహాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్, కూకట్‌పల్లి అధ్యక్షుడు పూర్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌డ్డి, ఓయు అధ్యక్షుడు గెల్వ శ్రీనివాస్8యాదవ్ పాల్గొన్నారు.

Take By: T News

Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Rahasabha Sabha, News  

Read more...

ఆర్టీసీ రాయితీలు

సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్ సిటీ, సబర్బన్ బస్సులలో ఉద్యోగితో పాటు అతని భార్యకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో 50శాతం అంటే సగం చార్జీలు చెల్లించి ప్రయాణించవచ్చు. అంతే కాకుండా ఆర్టీసీ హాస్పిటల్‌లో రిటైర్డ్ ఉద్యోగులు(భార్యకు కూడా) వైద్య సౌకర్యం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇక మీదట హైదరాబాద్‌లోని 8కార్పోరేట్ ఆసుపవూతుల్లో సైతం వైద్య సేవలు పొందడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది. జిల్లాల్లో ఆర్టీసీ ధృవీకరించిన ఆసుపవూతుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలు కల్పించారు. ఆర్టీసీ ప్రకటించిన రాయితీలతో రాష్ట్రంలోని దాదాపు 10వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్దిచేకురనున్నది.

Take By: T News
 
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana,  

Read more...

కాంగ్రెస్‌లో మళ్లీ అదే సీన్!

- 1983కి పూర్వపు స్థితి పునరావృతం!
- వైఎస్సార్ జమానాలో మౌనం
- ఇప్పుడు చెలరేగుతున్న నాయకగణం
- కిరణ్ నాయకత్వంపై కినుక!
- పూర్తి స్థాయి మద్దతు కరువు
- నిలదొక్కుకుంటున్న సమాంతర కేంద్రాలు!
- నేటి కాంగ్రెస్‌లో నాటి పరిస్థితులు

మూడు గ్రూపులు ఆరు ముఠాలు
VRK_2639-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 15 (): అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అదే సీన్! వైఎస్ ఏకఛవూతాధిపత్యం కింద కనుమరుగైన గ్రూపులు, ముఠాల సంస్కృతి మళ్లీ తెరపైకి! సీఎం పనితీరుపై సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శలు సంధిస్తున్న పరిస్థితి! మంత్రులు సైతం ఈ విషయంలో తాము ఏమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్న సందర్భం! వెరసి.. ముఖ్యమంవూతికి సమాంతరంగా.. పార్టీలో ప్రాణం పోసుకుంటున్న ‘పూర్వ వైభవం’! మూడు గ్రూపులు.. ఆరు ముఠాలుగా వర్థిల్లుతున్న వైనం!!

రవాణా శాఖ మంత్రిగా ఉన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, చేనేత శాఖ మంత్రి డాక్టర్ పీ శంకర్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంవూదాడ్డి గత కొంత కాలంగా ప్రభుత్వ శాఖల పనితీరు, సీఎం కార్యక్షికమాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలో మంత్రుల వ్యవహార శైలి, వారు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ గతకాలపు వైభవంతో వర్థిల్లుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్నా కూడా ఇంకా మంత్రులు, పార్టీ సీనియర్లను కిరణ్‌కుమార్‌డ్డి సమన్వయం చేసుకోలేక పోతున్నారా? లేకుంటే ముఖ్యమంవూతిగా కిరణ్ నాయకత్వాన్ని మంత్రులు, సీనియర్లు పూర్తిగా అంగీకరించడం లేదా? అనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సొంత పార్టీ నుంచే సీఎంను విమర్శించే స్థాయిలో, ఆయన కార్యక్షికమాలపై అసంతృప్తిని వ్యక్తం చేసే స్థితికి నేతలు వచ్చారంటే కిరణ్‌కు సమాంతరంగా పార్టీలో మరో రెండు, మూడు గ్రూపులను అధిష్ఠానం తెర చాటున సిద్ధం చేస్తున్నదా? అధిష్ఠానం అండదండలు, సంకేతాలతోనే వారు అలా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

వైఎస్ ఏకఛవూతాధిపత్యం
ఐదున్నర ఏళ్ళు సీఎంగా ఉన్న వైఎస్ హయాంలో పార్టీలో ఎక్కడా అసమ్మతి, అసంతృప్తి కనిపించక పోయేది. ఒక వేళ అది ఉన్నా బాహాటంగా విమర్శించే స్థాయికి వచ్చేది కాదు. ముఠాలు, గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం రావద్దనే ఉద్దేశంతో, సుదీర్ఘ కాలం తరువాత పార్టీని అధికారంలో తీసుకొచ్చిన గుర్తింపుతో పార్టీ అధిష్ఠానం కూడా వైఎస్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తనను ఎదిరించే స్థాయికి ఎదుగుతూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్న సీనియర్లను ఆయన ఏదో విధంగా తన దారికి తెచ్చుకున్నారు. ఆయన హయాంలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన కేశవరావు, డీ శ్రీనివాస్ కూడా వైఎస్ ముందు డమ్మీలుగానే మిగిలిపోయారు తప్ప ఆయన్ని ఎదిరించే, విమర్శించే సాహసం చేయలేక పోయారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో వైఎస్‌కు తిరుగులేకుండా పోయింది.

దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో వైఎస్‌లా మరో నేత ఎదగని, ఎదగలేని పరిస్థితి. హైకమాండ్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, పీసీసీ చీఫ్‌ల కంటే వైఎస్ సలహాలు, సూచనలు, నిర్ణయాలకే తలూపేది. ఫలితం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ అత్యధిక స్థానాల్లో తన వర్గం వారికే టికెట్లు ఇప్పించుకోగలిగారు. ఆయన మరణానంతరం వైఎస్ ఏకఛవూతాధిపత్యం ప్రభావం కనిపించింది. పార్టీకి మరో బలమైన నేతలేని లోటు ఏర్పడింది. అదే సమయంలో వైఎస్ కొడుకు జగన్ సీఎం పదవిని ఆశించడం, కొంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడదీసుకోవడంతో అధిష్ఠానం కలవరపడింది. అలాంటి పరిస్థితుల్లో సీఎం ఎంపిక కోసం అధిష్ఠానం నానా తంటాలు పడాల్సి వచ్చింది. సీనియర్ నేత రోశయ్యను ఎంపిక చేసి కొంత కాలం ఆయనతో నెట్టుకొచ్చింది.

ఆ తర్వాత స్పీకర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌డ్డిని అనూమ్యరీతిలో సీఎం పదవికి ఎంపిక చేసింది. ఒక్కసారి కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టని కిరణ్‌ను ఏకంగా సీఎం సీటులో కూర్చొనబెట్టడం సీనియర్ మంత్రులకు ఏమాత్రం రుచించలేదు. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేని శాఖలను కట్టబెట్టారంటూ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మరుసటి రోజునే కొందరు సీనియర్ మంత్రులు కిరణ్‌పై అసంతృప్తి వెళ్లగక్కారు. మరి కొందరు హస్తినకు వెళ్ళి శాఖల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయాన్ని హైకమాండ్ వద్ద మొరపెట్టుకున్నారు. అప్పట్లో అధిష్ఠానం కూడా వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కిరణ్ పక్షానే నిలువడంతో ఆ తరువాత అసంతృప్త మంత్రులు దారికొచ్చి తమపని తాము చేసుకు పోయారు. కానీ.. ఆ పరిస్థితి లోలోన రగులుతూనే ఉంది. ఇటీవల క్రమక్షికమంగా బయటపడింది.

మారుతున్న సీన్
ఇటీవలి కాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొంటున్న పరిస్థితులు చూస్తుంటే సీఎం కిరణ్‌కు సమాంతరంగా మరో రెండు, మూడు బలమైన నాయకత్వాలు తయారవుతున్నట్లు కనిపిస్తోంది. సీమాంవూధకు చెందిన నేత సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే సంప్రదాయాన్ని సైతం కాంగ్రెస్ పక్కనపెట్టింది. సీఎంగా సీమాంవూధకు చెందిన కిరణ్‌ను నియమించడంతో పాటు.. ఇదే ప్రాంతానికి చెందిన కాపు నేత బొత్సకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. పీసీసీ బాధ్యతలు చేపట్టిన నుంచి పార్టీలో తనకంటూ గ్రూపు, వర్గాన్ని బొత్స తయారు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. సీఎంకు సమాంతర శక్తిగా ఎదిగేందుకు ఆయన వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలో నెలకొన్న సమస్యలను చక్కబెడుతూ అధిష్ఠానం వద్ద తన కంటూ ముద్రవేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కిరణ్ పనితీరు, ఏకపక్ష నిర్ణయాలపై ఆయన అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ, సమయం చిక్కినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనేది పార్టీ వర్గాల సమాచారం. మంత్రి వర్గంలోని కొందరు మంత్రులు ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారు కిరణ్ నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరించడం లేదని సుస్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు సీఎం పనితీరుపై మంత్రులు, సీనియర్లు బహిరంగ విమర్శలు చేస్తున్నా వారిపై అధిష్ఠానం చర్యలు తీసుకోక పోవడం, కనీసం వారిని పిలిచి మందలించక పోవడం చూస్తుంటే కాంగ్రెస్‌లో సీఎంకు సమాంతర నాయకత్వం తయారవుతున్నదా? లేక అధిష్ఠానమే ఈ కథ నడిపిస్తున్నదా? అనుమానాలు పార్టీ శ్రేణులకు కలుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న పార్టీ వర్గాలు.. పరిస్థితి చూస్తుంటే తమ పార్టీలో 1983కి పూర్వపు పరిస్థితి రాబోతున్నట్లు కనిపిస్తోందని అంటున్నాయి.

ఇందిర వ్యూహం అమల్లోకి?
అప్పట్లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా, ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ తన రాజకీయ చతురత, వ్యూహాలతో పార్టీ ఎక్కడా బలహీన పడకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వచ్చారు. అవసరమని భావించిన పక్షంలో బలమైన సీఎంలుగా ఉన్న నేతలను మార్చి వేసి వారి స్థానాల్లో బలమైన ప్రత్యామ్నాయ నేతలకు ఊహించని రీతిలో అవకాశాలు కల్పించారు. తద్వారా పార్టీ ఏ ఒక్కరిపై ఆధారపడి ఉండదని నిరూపించడమే కాకుండా, సీఎంలుగా నేతలు పాతుకుపోకూడదని, అధిష్ఠానాన్ని శాసించేస్థాయికి ఎదగకూడదని ఆలోచించే నాడు ఇంది రాష్ట్ర నేతల దూకుడుకు కళ్ళెం వేస్తూ వచ్చారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం అప్పట్లో మర్రి చెన్నాడ్డికి సీఎంగా అవకాశం కల్పించారు. అదే సమయంలో ప్రత్యామ్నాయ శక్తులుగా టీ అంజయ్య, రాజారాం, రాజమల్లు, కోట్ల విజయభాస్కర్‌డ్డి, నేదురుమల్లి జనార్దన్‌డ్డి లాంటి నేతలను ప్రోత్సహించారు.

అంజయ్య సీఎంగా ఉన్న సమయంలో భవనం వెంకవూటామిడ్డి, ఎన్‌జేఆర్, జీ వెంకటస్వామి, కోట్ల విజయభాస్కర్‌డ్డి తమ వర్గాలు, గ్రూపులతో కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా చలామణి అయ్యారు. భవనం వెంకట్రాం సీఎంగా పనిచేసిన రోజుల్లో కోట్ల విజయభాస్కర్‌డ్డి, ఎన్‌జేఆర్, వెంకటస్వామి, కోట్ల సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత నేదురుమల్లి, వెంకటస్వామి, వీహెచ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ నేతలుగా గుర్తింపు పొందారు. నేదురుమల్లి సీఎం అయిన తరుణంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న వీహెచ్ కూడా ఆయనకు కౌంటర్ నేతగా ఎదిగారు. 2004లో వైఎస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ శక్తులు లేకుండా చేశారు.

అప్పట్లో ఎన్‌జేఆర్ సతీమణి రాజ్యలక్ష్మి, సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న వెంకటస్వామి కుమారుడు జీ వినోద్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకుని, ఆ ఇద్దరు సీనియర్ నేతలకు కేంద్రంలో మంత్రి పదవి రాకుండా, ఆ తరువాత రాష్ట్రంలో వారిని బలహీనపర్చేందుకు వైఎస్ ప్రయత్నించారని, తనకు సమాంతరంగా ఎదుగుతున్న పీజేఆర్ కూడా వైఎస్ ఎదగనివ్వకుండా హైకమాండ్ వద్ద చక్రం తిప్పారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. వైఎస్ జమానాను మినహాయిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో సమాంతర బలమైన నేతల సంస్కృతిని అధిష్ఠానమే ప్రోత్సహిస్తూవచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమలుకు హైకమాండ్ సిద్ధమవుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Take By: T News

Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, India News, AP CM, KiranKumar Reddy, CM, Congress,
   

Read more...

Thursday, December 15, 2011

గిరిజనంపై పంజా

- కవ్వాల్ అడవుల్లో మరో జీవన విధ్వంసం
- నిబంధనలకు వ్యతిరేకంగా టైగర్‌జోన్
- అడవి బిడ్డలను తరిమేసే పన్నాగం
- ఖాళీ చేయాలంటూ ఆదివాసులపై ఒత్తిళ్లు
- పాములు వదిలి భయపెడుతున్న వైనం
- భారీగా నష్టపరిహారం ఇస్తామని హామీలు
- మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.68 కోట్లు
- పరిహారాలకే రూ.100 కోట్లు
- సాయం అందడంపై అనుమానాలు
- కవ్వాల్‌లో కనిపించని పెద్దపులులు
- ఉన్నట్లుగా అధికారుల జిమ్మిక్కులు
- సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు యత్నాలు
- తప్పుపట్టిన మానవహక్కుల వేదిక
- 10లక్షలతోపాటు ఉపాధి కల్పిస్తాం: కలెక్టర్

14-adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
వారు మనలా పూటకోరకం తినరు. కాలానుగుణంగా ప్రకృతి ప్రసాదించిన దాంతోనే సరిపెట్టుకుంటారు! అడవిలో చెట్టు కాస్తే.. వారింట్లో ధాన్యపు గుమ్మి నిండినంత ఆనందం! చెట్టు ఎండితే దానిపువ్వుతో కల్లుచేసి ఏటమాంసంతో మజా చేస్తారు! ప్రకృతి ఫలాలే తప్ప ప్రభుత్వ పథకాలు వారికి అందని ద్రాక్షలే! కొండకోనల్లోనుంచి పారేనీరే వారికి అమృతం! రోగమొచ్చినా.. రొప్పొచ్చినా ఔషధ నిలయమైన అడవితల్లే కాపాడుతుందనే దృఢమైన నమ్మకం! కవ్వాల్ కొండకోనల్లో ఉంటున్న గిరిజనుల వర్తమాన జీవితమిది! ఇదే వారి తరతరాల చరిత్ర! భవిష్యత్ కూడా ఇలానే ఉంటుందా? లేదు.. వారి భవిష్యత్తు ఇలా ఉండబోవడం లేదు. ఊరుకాని ఊరులో.. తమ భాషకు, తమ సంస్కృతికి, తమ జీవన విధానానికి పూర్తి భిన్నమైనలోకంలో వారు బతుకీడ్చాలి! అడవిలో ఎలాంటి కరువుకాటకాల్లోనైనా దర్జాగా బతికిన గిరిజనులు.. ఇప్పుడు కూలిపని తప్ప మరోటి చేసుకోలేని దుస్థితిని చేరుకోబోతున్నారు. దీనికి కారణం.. వారిపై సర్కారు విసురుతున్న పులి ‘పంజా’!


( ఆదిలాబాద్) పులి వారి జీవితంలో ఒక భాగం. అంతకు మించి ఇంటి దేవత! గోండులకు జన్మనిచ్చిన జంగుబాయి వాహనం పులి. పులి పేరిట ఆకిడి పేరుతో ఏకంగా ఒక పండుగే ఉంది వారికి. ఆ పండుగ రోజు పులి బొమ్మలు తయారు చేసి పూజిస్తారు. చల్లగా చూడమని పులిని వేడుకుంటారు. ఆకలై తినాలనుకుంటే ఒక్క పశువునే తిను.. అన్ని పశువులకూ హాని చేయొద్దని మొక్కుకుంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయంలో భాగంగా అడవిలోకి వెళ్లినప్పుడు పులి ఎదురైనా వారి భయం లేదు. తల్లీ.. నీ దారిని నువ్వు వెళ్లు.. మా దారిన మేం పోతాం.. అని చేతులు జోడిస్తే చాలు.. ఆ తల్లి ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోతుందని వారి నమ్మకం. ఆ నమ్మకంపైనే తరతరాలుగా ఇక్కడి గిరిజనులు క్రూరమృగాలు, పశుపక్ష్యాదుల నడుమ నిర్భయంగా బతుకుతున్నారు.

వారి తెగల ఆవిర్భావానికి పులి ఒక సాంస్కృతిక చిహ్నం. అంతెందుకు.. పులిని వారు తోదో అనిపిలుస్తారు. తోదో అంటే తాత అని అర్థం. ఇలా ఇక్కడి గిరిజనులు పులిని ఏకంగా తమ కుటుంబంలో పెద్ద దిక్కుగా పరిగణిస్తారు. వారికి పులితో ఎలాంటి ప్రమాదం లేదు. కానీ.. ఇప్పుడు పులిపేరుతో ప్రమాదం ముంచుకొచ్చింది. ఏళ్ల తరబడి పులులతో అనుబంధాన్ని పెనవేసుకున్న గిరిజనులను ఇప్పుడు ప్రభుత్వం టైగర్ జోన్ పేరుతో తరిమేయాలని చూస్తోంది. అంతరించిపోతున్న పులులను సంరక్షించే పేరుతో.. గిరిజన తెగలు అంతరించిపోయేందుకు ఆస్కారం కల్పిస్తోంది. అదీ నిబంధనలకు పాతరేసి. చట్టాలను చుట్టచుట్టి బుట్టదాఖలు చేసి. మార్గదర్శకాలను బేఖాతరు చేసి. టైగర్ జోన్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అడవులను అభయారణ్యంగా నోటిఫై చేసేందుకు సర్కారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. ఇక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్న గిరిజనులను అడవి తల్లికి దూరం చేయబోతున్నది. వారి చరివూతను చెరిపే కుట్ర పన్నింది.

దేశానికే వన్నెతెచ్చే ‘టైగర్ జోన్’ ఏర్పాటు చేస్తామంటూ వారిని అడవిలోంచి బయటకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. కవ్వాల్ అరణ్యం పెద్దపులులు జీవించడానికి అనువైన ప్రదేశమైతే అక్కడ పులుల సంఖ్య గణనీయంగా ఉండాలి. మరి అక్కడ ఎన్ని పులులున్నాయి? అంటే.. ఒక్క పెద్దపులికూడా లేదనే సమాధానమే వస్తుంది. అయినా సరే అక్కడే టైగర్‌జోన్‌ను ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లుగా రాష్ట్రంలో మరే జిల్లాలో అభయారణ్యాలులేవా? అక్కడ పులులను పెంచేందుకు ఆస్కారంలేదా? ఉంది. అయినాసరే ఇక్కడే పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రవూపభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అడవితల్లినే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్న గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు పక్కా ప్రణాళికకూడా తయారుచేశారు.

ఇది ఆచరణ రూపం దాల్చితే కవ్వాల్ అభయారణ్యం దేశంలోని 41వ పులుల సంరక్షణ కేంద్రం అవుతుంది. తాళ్లపేట్, జన్నారం, ఇంధన్‌పల్లి, బీర్సాయిపేట్, కడం అటవీరేంజ్‌ల పరిధిలో విస్తరించి ఉన్న కవ్వాల్ అడవిలోని 1100 చదరపు కిలోమీటర్ల రేడియల్ డిస్టెన్స్‌లో పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారుల సర్వేకూడా పూర్తవడంతో అడవిని వదిలేందుకు గిరిజనులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Full News Read Click this Link

http://goo.gl/vkdHE

Or
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=53224



Take By: T News - http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=53224


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, India News, Adhila Bad, Karim Nagar,   



Read more...

చీకటి బతుకుల కలనేత

- సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిక్షిశమ
- నేతన్నల ఉసురుతీస్తున్న కరెంటు కోత
- వ్యాపారవేత్తల తిరుగుముఖం
- ఏడాదిగా లేని సబ్సిడీ, పడిపోయిన ఉత్పత్తులు


knr054-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవేళాపాళాలేని కరెంటు కోతలతో చేనేత కార్మికులు అల్లాడిపోతున్నారు. మరమగ్గాలు మూలనపడ్డాయి. ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు తిరుగుముఖం పడుతున్నారు. రోజుకు రూ.200 సంపాదించే కార్మికులు రూ.30 మాత్రమే సంపాదిస్తున్నారు. దీంతో కార్మికులు పొట్టచేతపట్టుకొని వలసబాట పడుతున్నారు. చాలీచాలని సంపాదనతో ఇల్లు గడవక ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. కరెంటు కోత నుంచి సిరిసిల్లను మినహాయించండంటూ బుధవారం నేతన్నలు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ..

సిరిసిల్ల, డిసెంబర్ 14 (): అడ్డూ అదుపు లేని కరెంటు కోతలు నేతన్నల ఉసురుతీస్తోంది. దీంతో నెల రోజులుగా మరమగ్గాల పరిక్షిశమలు సరిగా నడవక, వందలాది మంది కార్మికులు పొట్టచేతపట్టుకుని బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిక్షిశమలో నెలకొన్న తీవ్ర సంక్షోభంతో 2000 సంవత్సరంలో సుమారు 450 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలావరకు ఆత్మహత్యలే. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి జాతీయస్థాయి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి నేతన్నలకు అనేక రాయితీలు ఇచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి స్వయంగా సిరిసిల్లను సందర్శించి కార్మికుల దయనీయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోయడంతో అప్పటి దివంగత వైఎస్ స్వయంగా సిరిసిల్లకు వచ్చారు.

కార్మికులకు ఆరోగ్యశ్రీ పథకంతోపాటు విద్యుత్‌లో సగం వరకు రాయితీలు, అంత్యోదయ కార్డులు, ఇళ్ల పట్టాలు, బీమా సౌకర్యం వర్తింపజేశారు. రాష్ట్రంలో కరెంటు కోత తీవ్రంగా ఉన్నా సిరిసిల్లను మాత్రం మినహాయించారు. సిరిసిల్లలో టెక్స్‌టైల్స్ రంగాన్ని అభివృద్ధి పర్చాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వాలు ఇక్కడ ‘టెక్స్‌టైల్స్ పార్క్’ను ఏర్పాటు చేసింది. సిరిసిల్లకు ప్రత్యేకంగా రాయితీలు కల్పించడంతో గుజరాత్, ముంబై, భీవండి, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారవేత్తలు వచ్చి ఆధునిక మరమగ్గాల యూనిట్లను నెలకొల్పడంతో టెక్స్‌టైల్స్ రంగం కొంత మెరుగుపడింది. కానీ ప్రస్తుతం కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో నెల రోజుల నుంచి ఇటు వ్యాపారులు, అటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయమంటూ లేకుండా రోజుకు ఆరుగంటలపాటు కోత విధించడంతో ఇక్కడ పరిక్షిశమలు నెలకొల్పాలన్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు తిరుగుముఖం పడుతున్నారు.

అన్నమో రామచంద్రా అంటున్న నేతన్నలు
ఉదయం 8 గంటలకు కరెంటు పోతే తిరిగి 10 గంటలకు వస్తోంది. అదికూడ కేవలం అరగంట మాత్రమే ఉండి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీరాదు. ఈ రకంగా పొద్దంతా కరెంటు కోత కారణంగా రోజుకు ₹200 సంపాదించే కార్మికుడు.. ₹30 మాత్రమే సంపాదిస్తున్నాడు. వచ్చిన కూలీ డబ్బులు కూరగాయలకు, చిల్లర ఖర్చులకైతే ఇక పొట్టగడవడం ఎట్లా అని నేతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఈ కరెంటు కోత కారణంగా పొట్టగడవక అనేక మంది నేతన్నలు అన్నమో రామచంద్రా అంటూ ఆకలిచావులకు పాల్పడుతున్నారు.

తగ్గిన ఉత్పత్తి.. ఉపాధి కరువు
సిరిసిల్ల పట్టణంలోతోపాటు రాజీవ్‌నగర్, తంగళ్లపల్లి, చంద్రంపేట, సారంపల్లి టెక్స్‌టైల్స్ పార్కులను కలుపుకుంటే 30 వేల మరమగ్గాలకుపైగా ఉన్నాయి. వీటితోపాటు అనుబంధ పరిక్షిశమలు సైజింగ్‌లు, డైయింగ్‌లు, వార్పిన్‌లు, ఇతర కులవృత్తుల ద్వారా సుమారు 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వెల్డింగ్, ఇంజనీరింగ్, హమాలీలు, వడ్రంగులు, కమ్మరులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు వస్త్ర పరిక్షిశమే ఆధారంగా ఉంది. రోజుకు 15 లక్షల మీటర్ల వస్త్రాలు తయారు కాగా కరెంటు కోత కారణంగా 6 లక్షల మీటర్లకు ఉత్పత్తులు పడిపోయి ఇటు వ్యాపారులు, అటు కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఏడాదిగా మంజూరు కాని విద్యుత్ సబ్సిడీ
నేతన్నల ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వాలు ఇక్కడి పరిక్షిశమలకు విద్యత్ రాయితీలు ఇస్తూ వచ్చాయి. వైఎస్సార్ మరణించిన అనంతరం విద్యుత్ సబ్సిడీలు గత ఏడాది 2010 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ₹7కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత సర్కార్ సబ్సిడీ నిధులు మంజూరు చేయకుండా కార్మికులను అరిగోస పెడుతోంది. అనేకసార్లు నేత కార్మికులు, యజమానులు ఆందోళన కార్యక్షికమాలు చేపట్టినా, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినా సబ్సిడీకి దిక్కులేదు. ఒకవైపు కరెంటు కోత మరోవైపు విద్యుత్ సబ్సిడీలు మంజూరు చేయకుండా ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిక్షిశమను అంపశయ్యపైకి చేర్చుతోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిక్షిశమలు రాకుండా ప్రభుత్వం కుట్ర: గూగూరి ప్రవీణ్, వస్త్రవ్యాపారి, సెస్ డైరెక్టర్
ప్రభుత్వం కరెంటు కోత విధించడంతో ఇక్కడ పరిక్షిశమలు స్థాపించే వ్యాపారులు వెనక్కి మళ్లిపోతున్నారు. వెనకబడ్డ తెలంగాణ ప్రాంతానికి ఈ విధంగా సీమాంధ్ర ప్రభుత్వం నష్టం చేస్తోంది. కరెంటు సబ్సిడీ కూడా ఏడాదిగా మంజూరు చేయకుండా వస్త్ర పరిక్షిశమను సంక్షోభంలోకి నెడుతోంది. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

కరెంటు కోతపై నేతన్నల నిరసన
నెలరోజులుగా కరెంటు కోత కారణంగా వస్త్ర పరిక్షిశమ సంక్షోభంలోకి కూరుకు పోవడంతో నేతన్నలు ఆగ్రహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి, అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు పంతం రవి, మూషం రమేశ్‌లు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిక్షిశమలో పనిచేస్తున్న నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేవిధంగా ప్రభుత్వం కరెంటు కోతను విధిస్తోందని ఆరోపించారు. కరెంటు కోతకు నిర్ణీత సమయం లేకపోవడంతో ఎప్పుడు వస్తుందో తెలియక కార్మికులు సాంచెల వద్ద కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లను ప్రత్యేక జోన్‌గా గుర్తించి, కరెంటు కోత నుంచి మినహాయించాలని డిమాండ్‌చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్షికమంలో ఆసాముల సంఘం అధ్యక్షుడు కొండ ప్రతాప్, దాసరి వెంక తన్నీరు లక్ష్మీరాజం, సబ్బని నర్సయ్య, బండారి రమేశ్, వార్పిన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడుత రవి, గోస్క చంద్రకాంత్, నేత కార్మికులు పాల్గొన్నారు.

కరెంటు కోత
మా సావుకొచ్చింది

కరెంటు కోత మాసావుకొచ్చింది. రోజుకు కూలీ రూ.200 వచ్చేది. కరెంటు కోతల వల్ల రోజుకు రూ.30 వస్తున్నాయి. పెండ్లం, పిల్లలను ఎట్లా పోషించమంటరు. గిట్లనే గోసైతే ఇంత మందేసుకుని సావాల్సిందే.

బతుకుదెరువుకు బొంబై పోతం
గిట్ల కరెంటు పోతే తీసుకున్న మైక్రో ఫైనాన్స్ అప్పు ఎట్ల తీర్చుడు. రోజుకు నాలుగు బీములు నింపడం లేదు. ఈ తెలంగాణలో బతుకుదెరువు లేదు. కరెంటు పోయి మాకు జీతం వస్తలేదు. బొంబైకెళ్లి పనిచూసుకుంటం.

ఉరేసుకునుడే
బతుకుదెరువు కోసం సాంచెలు కిరాయి తీసుకున్నా. పొద్దంతా కరెంటు పోతోంది. నెలకు కిరాయిలు కట్టాలంటే ఎల్తలేదు. ఇప్పటికే అప్పులు తెచ్చి సేటుకు కడుతున్నా. ఇంకా అప్పులు తెచ్చుడు నాతోని కాదు. ఇక ఉరేసుకొని సచ్చుడే.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, News, India News, Karim Nagar, Local News,   

Read more...

Friday, December 9, 2011

తెలుగు నేలపై తీరని కల

చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది
విద్వేష వాతావరణానికి వీడ్కోలు
సువర్ణాక్షరాలతో లిఖితమై ఉండే
2009 డిసెంబర్ 9 ప్రకటన
నిక్కమైన జలాల పంపిణీ
రాజధాని ఏర్పాట్లలో సీమాంధ్ర

bhanughf-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- కేంద్రం హామీ అమలై ఉంటే..తెలుగునేలపై మార్పులేంటి?
- కొత్త రాష్ట్రాల్లో సీఎంలు ఎవరు..
- జగన్ సీనేంటి? బాబు హవా ఏంటి..
- చిరంజీవి సత్తా ఏమిటి..
- కాంగ్రెస్ లాభం ఏమిటి..
- బొత్స, కిరణ్ భవిష్యత్తేంటి..
- జానాకు దక్కే హోదా ఏంటి..
- బడా కాంట్రాక్టర్లకు బాధేంటి?
- విస్తరించే నిర్మాణరంగం
- విస్తరించే అనుబంధ వ్యాపారాలు
- సీమాంధ్రలో రియల్‌బూమ్
- తెలంగాణలో నిరుద్యోగం మాయం
- నెరవేరి ఉండే స్వయం పాలన
- సంస్కృతీ సంప్రదాయాల వికాసం
- రెండుచోట్లా పారిశ్రామిక కారిడార్‌లు
- పారిశ్రామిక కేంద్రంగా సింగరేణి
- పుంజుకునే ప్రభుత్వ కార్యక్రమాలు

  Read More click this click 

http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=51599

Read more...

తెగిస్తేనే..తెలంగాణ

డిసెంబర్ 9 ప్రకటన
P-Chidambara-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ అంశంైపై విస్తృత స్థాయిలో చర్చించాం. ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చాక ముఖ్యమంత్రి రోశయ్యనూ సంప్రదించాం. అన్ని రకాలుగా చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రోశయ్యకు సూచించాం. నవంబర్ 29(కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజు) తర్వాత ఆందోళనకారులు, విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం. కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆయన సత్వరం దీక్ష విరమించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. తదుపరి ఆందోళనలకు స్వస్తి పలకాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం

డిసెంబర్ 23 ప్రకటన
2009 డిసెంబర్ 7న ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభివూపాయం వ్యక్తమైంది. ఆ భేటీ వివరాలను అందుకున్న తర్వాత డిసెంబర్ 9న ఇందుకు సంబంధించి కేంద్రవూపభుత్వం ప్రకటన కూడా చేసింది. అయితే ఈ ప్రకటన తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితి మారిపోయింది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు చీలిపోయాయి. రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ఇతరత్రా సంఘాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రవూపదేశ్‌లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించాల్సిన అవసరముంది. పరిపాలన, అభివృద్ధిపైన దృష్టి పెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశమివ్వాలి. తమ ఆందోళనలను విరమించి శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలని కేంద్రవూపభుత్వం ఆంధ్రవూపదేశ్‌లోని వివిధ ప్రాంతాల వారికి, అన్ని రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నది.’

బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ నిజాం ప్రభువు శృంఖాలలను తెగ్గొట్టుకునేందుకు పిడికిలి బిగించిన పోరుగడ్డ ఈ తెలంగాణ. భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకెళ్లి పాకిస్థాన్‌లో కలిపేందుకు సిద్ధమైన నిజాం నవాబుకు, ఆయన సైన్యం రజాకార్లకు ఎదురునిలిచి నిలబడింది ఈ గడ్డ. ఉద్యమస్ఫూర్తి, అన్యాయంపై తిరగబడే తత్వాన్ని అలవరుచుకున్న ఈ సమాజానికి స్వాతంత్య్రం లభించిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. విశాల ప్రయోజనాల మాటున సామ్రాజ్యవాద భావనలతో తెలంగాణను పెట్టుబడిదారులు అన్ని విధాలుగా కబ్జాచేశారు. 1969లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తూటాలతో అణిచేశారు.

ఆ తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు తెలంగాణ మరోసారి ఉద్యమనినాదాన్ని అందుకున్నది. ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు, ఉపాధ్యాయులు ఏకమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ముక్తకం నిరసించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పదేళ్ల పాటు అనేక విధాలుగా పోరాటాలు సాగిస్తూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పట్ల దాటవేత వైఖరిని అవలంబిస్తూ విపరీతమైన కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ ఆవిర్భావాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మద్దతుగా తెలంగాణ అంతటా మద్దతు పలుకుతూ రాస్తారోకోలు, ఆందోళనలు, బంద్‌లు, నిరాహారదీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ విషాదకరమైన రీతిలో యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే కేంద్రవూపభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అఖిలపక్షభేటీ జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకెలాంటి అభ్యంతరం లేదంటూ ఆ భేటీలో పాల్గొన్న టీడీపీ, పీఆర్పీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా స్పష్టం చేస్తూ లిఖితపూర్వక ప్రకటన ఇచ్చాయి. దీంతో డిసెంబర్ 9 రాత్రి పదకొండున్నరకు పార్లమెంటు సాక్షిగా కేంద్రవూపభుత్వం తరపున హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం కేసీఆర్ దీక్ష విరమించారు. చిదంబరం ప్రకటన విన్న వెంటనే యావత్ తెలంగాణ సంబరాల్లో మునిగిపోయింది. ఉస్మానియా, కాకతీయ సహా అన్ని తెలంగాణ ప్రాంత యూనివర్సిటీల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. అయితే ఈ సంబురం పట్టుమని పదిహేను రోజులు కూడా నిలవలేదు. తెలంగాణలో, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తూ వేలకోట్లు ఆర్జిస్తున్న పెట్టుబడిదారులైన సీమాంధ్ర నేతలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించారు.


dffsd-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

సీమాంవూధకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏకం చేసి రాజీనామాల డ్రామాను నడిపారు. సీమాంధ్ర ప్రాంతాల్లో అద్దె ప్రదర్శనలు చేయించి ఆందోళనల పర్వాన్ని రక్తి కట్టించారు. ఇందుకు సీమాంధ్ర మీడియా బాగా తోడ్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. డిసెంబర్ 9న ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు అవసరమంటూ డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకునే సరికి తెలంగాణ భగ్గుమన్నది. మరోసారి ఉద్యమబాట పట్టింది. తెలంగాణను డిమాండ్ చేస్తూ బలిదానాలు ఆగలేదు. మరోవైపు చిదంబరం అఖిలపక్షాలతో 2010 జనవరి5 న ఢిల్లీలో భేటీ నిర్వహించారు. ఆ తర్వాత విస్తృత సంప్రదింపుల పేరుతో జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఫిబ్రవరి 3న ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలోనే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం నడిపేందుకు అటు రాజకీయ పక్షాలను ఇటు ప్రజాసంఘాలను కలుపుకొంటూ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భవించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెగని ఉద్యమాలు నిర్వహించింది. వంటావార్పులు నిర్వహించింది. రైల్‌రోకోలు, బస్సురోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. రాజీనామాలు చేసి ఐక్యతను చాటి తెలంగాణ కాంక్షను చాటిచెప్పాలని జేఏసీ పిలుపునిచ్చింది. కానీ ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు వెనక్కి తగ్గాయి. తమ అవకాశవాదాన్ని మరోసారి చాటుకున్నాయి. కేవలం టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రమే ముందుకొచ్చాయి. 12 స్థానాల్లో వారు రాజీనామాలు చేసి 2010 జూలైలో ఉప ఎన్నికల్లో తలపడ్డారు. తెలంగాణ కాంక్ష కోసం పదవులు వదులుకొని నిబద్ధత చాటుకున్న ఆ పన్నెండు మందికి జనం బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో వారిని గెలిపించారు. మరోవైపు ఇదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల అభివూపాయాలు తీసుకున్నది. ఇటు తెలంగాణ, అటు సీమాంవూధలో పర్యటించింది. ప్రజాభివూపాయ సేకరణ చేసింది.

2010 డిసెంబర్ 30న 550 పేజీలతో 8 అధ్యాయాలతో కేంద్రవూపభుత్వానికి నివేదిక సమర్పించింది. కట్టె విరగొద్దు..పాము చావొద్దు..అన్న రీతిన సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని చూపలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లేదా విడగొట్టాలంటూ ఆరు ఆప్షన్లు చెబుతూ తెలంగాణ అంశాన్ని మరింత సంక్లిష్టపరిచింది. 2011 జనవరిలో ఈ నివేదిక వెలువడిన తర్వాత ఉద్యోగులు ఫిబ్రవరి నెలలో పదహారు రోజుల పాటు సహాయ నిరాకరణ చేశారు. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మార్చి 10న జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణలో అడుగడుగునా పోలీసులు విధించిన నిర్బంధాన్ని ఎదిరించి వేలాది మంది ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. అదిగో.. ఇదిగో.. అంటూ నయవంచన చేస్తూ ఉద్యమాన్ని అణిచివేస్తున్న ప్రభుత్వానికి ఉద్యమవేడి రుచి చూపారు. సీమాంధ్ర పాలక ఆధిపత్య చిహ్నాలైన విగ్రహాలను విరగ్గొట్టి నేలపాలు చేశారు. కొన్నింటిని హుసేన్‌సాగర్‌లోకి గిరా అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూనే ఉన్నాయి.

DSC_0086-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
మరోసారి తెలంగాణ జనం రోడ్లెక్కారు. జూన్ 19న హైదరాబాద్ నడివీధుల్లో వంటావార్పు చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కదలిక తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓ ప్రయత్నం చేశాయి. జూలై 4, 5 తేదీల్లో మొత్తం 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో వందమంది, 14 మంది ఎంపీలు, 20 మంది ఎమ్మెల్సీలు తెలంగాణను కోరుతూ రాజీనామాలు సమర్పించారు. కానీ ఆ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్, శాసనసభ స్పీకర్ ఆమోదించలేదు. తెలంగాణ ప్రజావూపతినిధులు చేసిన ఈ ప్రయత్నాన్ని కేంద్రం తన కుయుక్తులతో తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు మరోసారి తమ పోరాటపటిమను కనబరిచారు. సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సింగరేణి, ఆర్టీసీ, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. తెలంగాణలోని సబ్బండవర్ణాల వారు ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సమ్మెకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టే దిగొచ్చి మళ్లీ కాలయాపన చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో అభివూపాయసేకరణ పూర్తి చేసిన కేంద్రం..ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కావాలంటూ కొత్త పాట పాడటం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉంది.

విద్యార్థిని పట్టిస్తే వంద!
తెలంగాణ మలి ఉద్యమానికి ఊపిరులూదిన ఉస్మానియా యూనివర్సిటీపై సీమాంధ్ర ప్రభుత్వం ఎంత కక్ష గట్టిందో ఇదో చిన్న ఉదాహరణ. 2009 డిసెంబర్ నెలలో కేసీఆర్ దీక్షకు విద్యార్థులు మద్దతు ప్రకటిస్తూ ఉద్యమబాట పట్టారు. మరోవైపు పోలీసులు క్యాంపస్‌లోకి మావోయిస్టులు ప్రవేశించారంటూ తప్పుడు ప్రచారం చేసి దొరికిన విద్యార్థిని దొరికనట్టుగా చితకబాదారు. హాస్టళ్లలోకి చొరబడి చావబాదారు. అంతేకాదు క్యాంపస్‌కు ఆనుకొని పక్కనే ఉన్న మాణికేశ్వర్‌నగర్‌లో కూడా విద్యార్థులను పట్టుకుపోయి వేధించేవారు. ఆ బస్తీలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను పట్టిస్తే వందరూపాయల చొప్పున ఇస్తామంటూ పోలీసులే బహిరంగంగా ప్రకటించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

వందల సంఖ్యలో ప్రత్యేక బలగాలను రప్పించి ఉస్మానియాలను ఓ బందీఖానలాగా మార్చివేశారు. విద్యార్థులతో సమావేశాలు పెట్టుకుంటున్నాం.. అనుమతివ్వండి.. అని అడిగిన ప్రతీసారి పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుం అనుమతి దక్కలేదు. ఆ నేపథ్యంలోనే 2010 జనవరి 3న జరిగిన విద్యార్థి గర్జన ఉస్మానియా విశ్వవిద్యాలయ చరివూతలోనే ఓ మైలురాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నా లెక్కచేయక లక్షన్నర మంది విద్యార్థులు గర్జనకు హాజరయ్యారు.

42 రోజుల సమ్మె
2010లో ఉద్యమాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే ఆ బాధ్యతను 2011లో ఉద్యోగులు తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ వరుసలో అందరికన్నా ముందు నిలబడింది సింగరేణి కార్మికులే. బొగ్గుబావుల్లోకి దిగకుండా, ఉత్పత్తిని నిలిపివేసి ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఆర్టీసీతో పాటు ఆర్టీసీ, ఎకై్సైజ్ అధికారులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. సచివాలయం స్తంభించిపోయింది. తెలంగాణలోని ఏ ఊరువాడలోనూ ప్రభుత్వ కార్యాలయం పనిచేయలేదు. 42 రోజుల్లో ఒక్కరోజంటే ఒక్క రోజుకూడా పనులు సాగలేదు.

29.11.2009 : తెలంగాణ కోసం ఆమరణ నిరాహార
march08-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదీక్ష చేప కరీంనగర్ నుంచి సిద్ధిపేటకు బయలుదేరిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను అలుగునూరు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం మున్సిఫ్ మెజివూస్టేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు. జైల్లోనే ఆమరణ దీక్ష ప్రారంభించిన కేసీఆర్.
09.12.2009 : భారత ప్రభుత్వం తరపున ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ’ ప్రారంభమవుతుందని చిదంబరం ప్రకటన.
23.12.2009 : ‘‘తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ పార్టీలు, సంఘాలతో విస్తృత చర్చలు అవసరం’’ అని రెండో ప్రకటన విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి చిదంబరం.
24.12.2009 : కళింగ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జేఏసీ మొట్ట మొదటి సమావేశం ఏర్పాటు. రెండు రోజుల తెలంగాణ బంద్‌కు పిలుపు.
03.01.2010 : ఉస్మానియా యూనివర్సిటీలో ‘తెలంగాణ విద్యార్థి మహాగర్జన’ సమావేశం. హాజరైన లక్షలాది మంది విద్యార్థులు.
28.01.2010 : తెలంగాణపై కమిటీ(శ్రీకృష్ణ) ఏర్పాటు చేస్తున్నట్లు చిదంబరం ముందస్తు ప్రకటన.
04.02.2010 : జాతీయ రహదారులపై వంటావార్పు కార్యక్షికమాలు.
14.02.2010 : 15 మంది తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలు. ఓయూలో రెచ్చిపోయిన పోలీసులు, విద్యార్థులు, మీడియాపై పాశవిక దాడి.
20.02.2010 : ఓయూ ఐకాస ‘అసెంబ్లీ ముట్టడి’ పిలుపు. సిరిపురం యాదయ్య ఆత్మహత్యాయత్నం, తర్వాత మరణం.
27.07.2010 : తెలంగాణలోని 12 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు.
30.07.2010 : ఉప ఎన్నికల ఫలితాలు విడుదల. రాజీనామా చేసిన 12 మంది ఎమ్మెల్యేల విజయం. 12 టీడీపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు.
16.12.2010 : వరంగల్‌లో మహాగర్జన సభ స్వామి అగ్నివేశ్ ప్రసంగం.
30.12.2010 : ఒక రోజు ముందుగానే కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
15.02.2011 : తెలంగాణ అంతటా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం.
0ou-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
10.03.2011 : ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ విజయవంతం.
19.05.2011 : టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా.
19.06.2011 : హైదరాబాద్‌లో వంటా వార్పు కార్యక్షికమం.
14.07.2011 : రైల్‌రోకో కార్యక్షికమం విజయవంతం.
21.07.2011 : పార్లమెంట్ సమీపంలో యాదిడ్డి ఆత్మహత్య. ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత
06.08.2011 : ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలు
13.09.2011 : నుంచి 24.10.2011 : సకలజనుల సమ్మె.
04.11.2011 : పీడీ యాక్టు కింద డాక్టర్ చెరుకు సుధాకర్ అరెస్టు, వరంగల్ జైలుకు తరలింపు.
08.04.2011 : చెరుకు సుధాకర్ విడుదలకు హైకోర్టు ఆదేశం.


Take By: T News

Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, Sima Andra, AP News, Political News, December 9,

Read more...

Thursday, December 8, 2011

ఎఫ్‌డీఐలపై పీఛేముడ్



PRANAB talangana patrika telangana culture telangana politics telangana cinema -మెట్టుదిగిన యూపీఏ ప్రభుత్వం
-అందరి సమ్మతి వచ్చాకే నిర్ణయం
-లోక్‌సభలో ప్రణబ్‌ముఖర్జీ ప్రకటన
-స్వాగతించిన ప్రతిపక్షాలు
-ప్రజాభీష్ఠానికి తలొగ్గడం ఓటమికాదు
-ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్య
-పారిక్షిశామికవర్గాల్లో నిరుత్సాహం
-హర్షం వ్యక్తం చేసిన వ్యాపారులు
-ఇక సజావుగా పార్లమెంటు


ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం తోకముడించింది. పార్లమెంటులో ప్రతిపక్షాల పోరాటానికి ఫలితం దక్కింది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని కేంద్రం బుధవారం నాడు తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది. ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చేంతవరకూ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు తొలుత అఖిలపక్ష భేటీలో, అనంతరం లోక్‌సభలో ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ రాజ్యసభలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు ముక్తకం స్వాగతించాయి. ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గి ఉండాలన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్.. అలా తలొగ్గడం ఓడిపోయినట్లు కాదని అన్నారు. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐలను తీవ్రంగా వ్యతిరేకించిన యూపీఏ భాగస్వామ్య పక్షాలు తృణమూల్‌కాంక్షిగెస్, డీఎంకే హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై పారిక్షిశామికవర్గాలు నిరుత్సాహం ప్రకటించగా.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ , డిసెంబర్ 7:చిల్లర వర్తకంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనపై కేంద్రవూపభుత్వం తోకముడిచింది. స్వపక్ష, విపక్షాల వ్యతిరేకతకు తోడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు ప్రభుత్వం వెనక్కితగ్గింది. బుధవారం అఖిలపక్షభేటి అనంతరం...ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చే వరకూ నిలిపివేస్తున్నట్లుగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్‌ముఖర్జీ అధికారికంగా ప్రటించారు. రాజ్యసభలోనూ వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ ఇదే ప్రకటన చేశారు. బుధవారం ఉదయం జరిగిన అఖిలపక్షభేటిలో చిల్లర రంగంలో 51శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నట్టు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిని ప్రతిపక్షాలు ముక్తకం స్వాగతించాయి. అనంతరం ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈ విషయాన్ని లోక్‌సభలో అధికారికంగా ప్రకటించారు. ఎఫ్‌డీఐలను స్వాగతించాలన్న నిర్ణయాన్ని అమలుచేయడానికి ముందు ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంవూతులు, చిల్లరవర్తకులను, రైతులను కూడా సంప్రదించనున్నట్టు ప్రణబ్ వివరించారు.

ఆ విధంగా ఒక ఏకాభివూపాయం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఒక ముఖ్యమైన వివాదానికి తెరపడినటె్టైందని యూపిఏ భాగస్వామ్య పక్షాలైన తృణముల్, డీఎంకేలు హర్షం వ్యక్తం చేశాయి. ఇకనైనా సభ సజావుగా సాగుతుందని ఆశాభావన్ని వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా వాణిజ్యరాజధాని ముంబాయిలో రిటెలర్‌లు ప్రభుత్వ నిర్ణయంతో ఆనోందత్సవాలు జరుపుకున్నారు. పార్లమెంట్‌లో తొమ్మిదిరోజులుగా ఊపిరి సలుపవ్వని ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రభుత్వం, ఈ నిర్ణయంతో కొంత ఉపశమనం పొందినటె్టైంది. తదనంతరం ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఎస్పీ ,వామపక్షాలు పలు వాయిదాతీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, స్పీకర్ మీరాకుమార్ వాటిని తిరస్కరించడంతో బీఎస్పీకి చెందిన సభ్యులు అసంతృప్తితో సభనుండి వాకౌట్ చేశారు. ఈ విధంగా సభ శీతాకాల సమావేశాల్లో తొలిసారి ప్రశ్నోత్తరాల సమయంలోకి ప్రవేశించింది.

స్వాగతిస్తున్నాం: సుష్మ
ప్రభుత్వం తీసుకున్న ఎఫ్‌డీఐల నిలుపుదల నిర్ణయాన్ని పార్లమెంట్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్ స్వాగతించారు. ‘‘ప్రజాభీష్టానికి ప్రభుత్వం తలొగ్గి ఉండాలని.. అట్లా తలొగ్గడం ఓడిపోయినట్టు కాదని’’ ఆమె గుర్తుచేశారు. ప్రజాభివూపాయాన్ని విన్నందుకు ప్రభుత్వానికి, ముఖర్జీకి ఈ సందర్భంగా సుష్మా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ప్రజాస్వామిక శక్తుల విజయంగా ఆమె అభివర్ణించారు. అన్ని పక్షాలను సంప్రదించి ఒక కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

పూర్తిగా వెనక్కి తీసుకోవాలి:సీతారాం ఏచూరి
ఎఫ్‌డీఐల ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సీపిఎం డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఎఫ్‌డీఐల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. వారి అభివూపాయాలను తప్పకుండా పరిగణించాలని అన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం తలొగ్గేలా ఒత్తిడి తీసుకురాగలిగాము. ఈ విషయంలో ఏకాభివూపాయం ఏ విధంగానూ కుదరదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఈ ఘనత సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నదని, కానీ తమ పార్టీ 2004 నుండే ఈ పెట్టుబడులను అడ్డుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయంలో ఫ్యూచర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు ధరలను తగ్గించడంతో పాటు గోదాముల్లో నిలువ ఉన్న ఆహారధాన్యాలను విడుదల చేసి, ధరలను అదుపు చేయాలన్నారు.

ఎఫ్‌డీఐలు కావాల్సిందే : కావూరి
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతించాలని, దేశవూపజలు అదే కోరుకుంటున్నారని ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ పండ్లు కూరగాయల నిల్వకోసం కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలంటే లక్షకోట్లరూపాయలు అవసరమని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏ నిర్ణయమైన తీసుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఒక్క పార్టీకి చెందినది మాత్రమే కాదని, ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తృణముల్, డీఎంకెల అభివూపాయాన్ని కూడా పరిగ స్తుందని అన్నారు.

 Take By: T News

Tags: Telangana News, Hyderabad, Telangana, Lok Sabha, News, FDI in retail, foreign investment, retail sector, Indian economy,

Read more...

Wednesday, December 7, 2011

అందరూ గద్దలే ఆంధ్రా పెద్దలే

BHUDANDA talangana patrika telangana culture telangana politics telangana cinema
- హైటెక్ సిటీ వెనుక అంతులేని కుట్రలు
- అవినీతి పునాదిపై ఎమ్మార్ భవంతులు
- ఔటర్ పేరుతో రోడ్డుపాలైన కుటుంబాలు
- సర్కారుకే రహేజా టోకరా
- శంషాబాద్‌లో రియల్‌కు రెక్కలు
- సంస్థ ఏదైనా.. సంపద ఒక్కరికే
- కోట్లు పోగేసుకున్న సీమాంధ్ర బడాబాబులు
- భూ పందేరంపై సీబీఐ భూతద్దం
- తీగలాగుతున్న దర్యాప్తు సంస్థలు
- కలవరపడుతున్న భూ రాబందులు

సేకరణ పేరుతో బడుగు జీవుల నేల గుంజుకోవడం..దానిని తమ ప్రయోజనాలు నెరవేర్చే కంపెనీలకు చౌకగా పంపిణీ చేయడం.. అదే భూమిలో సదరు కంపెనీలు దందా చేసి.. కోట్లకు కోట్లు కూడబెట్టుకోవడం! అది నారావారి జమానా అయినా.. వైఎస్సారు హయామైనా జరిగింది ఇదే! రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూములపై ఇప్పుడో భూతద్దం తిరుగుతున్నది! ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో భారీగా పందేరం జరిగిన భూముల అక్రమాల పుటలు తిరగేస్తున్నది! తమ అంతేవాసులకు కారుచౌకగా భూములు చుట్టబెట్టేందుకు పాలకులే పావులు కదిపిన కుతంత్రాల లోతులకు దృష్టి సారిస్తున్నది! అక్రమంగా జరిగిన పందేరాలపై ఆరా తీస్తున్నది! ఎన్నో ఏళ్ల క్రితమే భూమాతను చెరబట్టి ఇప్పుడు కోట్ల కొద్దీ సొమ్ము వెనకేసుకుంటున్న బడాబాబుల ముసుగులు తొలగిస్తున్నది!భూములపై వాలిన రాబందుల బాగోతాలు బయటికి తీస్తున్నది! ఆ భూతద్దం పేరు సీబీఐ! ఈ భూతద్దం పరిధిలోకి ఇప్పటికే వచ్చిన రాబందులు.. ఇబ్బంది పడుతున్నాయి! ఈ భూతద్దం పరిధి మరింత విస్తరిస్తే తమ గుట్టూ బయట పడుతుందని మరికొన్ని కలవరపడుతున్నాయి! దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న చందంగా సాగిన ఈ భూదందాలో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్, దాని పొరుగున్న ఉన్న రంగారెడ్డి జిల్లా కోల్పోయింది వెయ్యి, రెండువేల ఎకరాలు కాదు..! అక్షరాలా పది లక్షల ఎకరాల పైమాటే! ఇందులో అధికారికంగా కీలక సంస్థలకు పందేరం చేసిందే లక్ష ఎకరాలు! ఎత్తులు, పై ఎత్తులతో జరిగే పందేరంలో చివరకు చిత్తయిపోయింది హైదరాబాద్! వీరి కుతంత్రాలకు బలైపో యింది రాజధాని చుట్టుపక్కల ప్రాంతం! ఇది మొన్న తెలంగా ణ భూమి. నేడూ తెలంగాణ భూమే! ఇది ‘మా భూమి’ అని ప్రతి ఒక్క తెలంగాణ వాసి గొంతెత్తి నినదించే నేలతల్లి!

ఈ నేలలో మొన్నటిదాకా పంటలు పండాయి! పువ్వులు వికసిం చాయి! కూరగాయలు నవనవలాడాయి! కానీ.. ఇదే భూమి.. నాటి బ్రిటిష్ వలస పాలకులను గుర్తుకు తెస్తూ.. పరాయీ కరణకు గురైంది! ఇప్పుడా భూముల్లో సీమాంధ్ర బడాబాబు లకు నోట్ల చెట్లు మొలుస్తున్నాయి! ఆ నోట్ల చెట్లకు నీళ్లు పోసిన పాలకులకు ప్రతిఫలాల నీడనిస్తున్నాయి. ఈ భూ పందేరం గుట్టంతా ఇప్పుడు బయటికి వస్తున్నది. పందేరాల్లో భాగస్వా ములైన వారు, వారి ప్రతినిధులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలే ఆ గుట్టును బయటపెడుతున్నాయి. పిటిషన్‌ల రూపంలో బయటపడినవే కాక.. తాజాగా అవిశ్వాస తీర్మానం పై చర్చలో హైదరాబాద్ భూముల కేటాయింపుల లోగుట్టులు బయటపెట్టుకున్నారు. తమ బంధువులకు, మిత్రులకు అప్ప నంగా భూములు కట్టబెట్టారని చంద్రబాబు విమర్శించారు. 2004 నుంచి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. ఇందుకు అంతే దీటుగా స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్.. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. వీరి ఆరోపణలు ఎలా ఉన్నా.. చంద్రబాబు, వైఎస్ హయాంలో సాగిన అడ్డగోలు అక్రమాలపై సీబీఐ తీగలాగుతున్నది! అక్రమాల భువన భవంతుల్లో దాగిన డొంకలను కదిలిస్తున్నది! నేతాగ్రేసరుల పాపాల పుట్టలు బద్దలు కొట్టబోతున్నది!

( హైదరాబాద్‌ పభుత్వం ఓ కీలకమైన ప్రాజెక్టును ప్రకటించడం.. అంతకు ముందే తమకు కావల్సిన వారికి ఆ మేరకు సంకేతాలు ఇవ్వడం.. ప్రాజెక్టు ప్రకటించే నాటికే దాని చుట్టుపక్కల భూములను ‘కావల్సినవారు’ కాజేయడం..! ఇదో భూమాయ! కోట్ల ఖరీదు పలికే భూములను అగ్గువకు కాజేసే కుతంత్రం! సేకరణ పేరుతో బడుగు జీవుల నేల గుంజుకోవడం.. దానిని తమ ప్రయోజనాలు నెరవేర్చే కంపెనీలకు చౌకగా పంపిణీ చేయడం.. అదే భూమిలో సదరు కంపెనీలు దందా చేసి.. కోట్లకు కోట్లు కూడబెట్టుకోవడం! అది నారావారి జమానా అయినా.. వైఎస్సారు హయామైనా జరిగింది ఇదే! హైదరాబాద్ అభివృద్ధి పేరుతో సాగిన ఈ తంతు.. చివరకు తెలంగాణ గుండెకాయను పీల్చిపిప్పి చేసింది. పాలకులకు కావల్సిన వారికి కాసుల పంట పండించింది. పేరేదైనా దందా ఒక్కటే! సంస్థ ఏదైనా.. సంపద పోగుపడింది ఒక్కరికే! వచ్చింది ఏదైనా.. పోయింది మాత్రం తెలంగాణ జనం భూమే! హైదరాబాద్‌కు ఆత్మనే లేకుండా చేశారు. దశాబ్దాలుగా సీమాంవూధులు చేసిన ఈ భూ దోపిడీ పాపాల పుట్టలు ఇప్పుడు పగులుతున్నాయ్. మంత్రి శంకర్‌రావు వేసిన పిటిషన్‌తో వైఎస్ కుటుంబం, ఆయన కోటరీ.. విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌తో చంద్రబాబు ఆయన కోటరీ భాగస్వామ్యం ఉన్న అన్ని లావాదేవీలతోపాటు భూ దందాలపై సీబీఐ విచారణ జరుపనుంది. ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందా? ఇన్నాళ్లూ సీమాంవూధుల దోపిడీని భరిస్తూ వస్తున్న తెలంగాణ ఆత్మఘోషను వెలుగులోకి తెస్తుందా? ఇప్పుడు సగటు తెలంగాణవాసి ఆసక్తిగా చూస్తున్న అంశమిది! తమ భూమి తమది కాకుండాపోయిన వేళ.. జరిగిన అక్రమాలకు న్యాయం జరుగుతుందా? అని ఆశగా చూస్తున్న సందర్భమిది!

సీమాంధ్ర కబంధ హస్తాల్లో పది లక్షల ఎకరాలు!
PPP talangana patrika telangana culture telangana politics telangana cinemaపందేరాలైతేనేమి.. కబ్జాలైతేనేమి.. దందాలైతేనేమి.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్షరాలా పది లక్షల ఎకరాలకుపైగా భూమి సీమాంధ్ర బడాబాబుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని అంచనా! గోదావరి నదికి ఇరువైపులా ఉన్న సారవంతమైన భూములన్నీ దాదాపుగా వారి వశం అయ్యాయి. కృష్ణా, గోదావరి తదితర నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో మెజార్టీ భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా కోట్లు విలువ చేసే భూములను ఎత్తున మింగేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, వెంగళరావునగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఎర్రగడ్డ ఏరియాల్లో భూముల పరాయీకరణ విరివిగా జరిగింది. పరిక్షిశమల భూముల స్థానంలో అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లోనే ఇరవై నుంచి ముపె్పైవేల ఎకరాల భూమి పరాయీకరణ జరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. రాజధాని నడిబొడ్డున ట్యాంక్‌బండ్ కింద ఉన్న దాదాపు రూ.200 కోట్ల విలువైన డీబీఆర్ మిల్స్ భూములపై కన్నేశారు. ఈ భూములను రక్షించుకోవడానికి కార్మికులే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ జిల్లాలో 1354 భూకబ్జా కేసులు ఉండగా, ఒక్క షేక్‌పేట మండలంలోనే భూ ఆక్రమణ కేసులు 450 వరకు ఉన్నాయి. నగరం చుట్టూ కాందిశీకుల భూములను కూడా వదలి పెట్టలేదు. దాదాపు లక్ష ఎకరాల కాందిశీకుల భూమి నేడు వందల ఎకరాలకే పరిమితమైంది. 400 చెరువులను పూడ్చేసి ప్లాట్లు చేసి తెగనమ్ముకున్నారు. సమైక్య రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈ భూముల రక్షణ కోసం చేసుకున్న ఒప్పందాలు ఉల్లంఘనలకు గురయ్యాయి.

పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సహా తెలంగాణలో ప్రాంతేతరులు భూములు కొనరాదు. కొన్నా చెల్లవు. ఎవరైనా భూములు కొనాలనుకుంటే తెలంగాణ ప్రాంతీయబోర్డు అనుమతి తీసుకోవాలి. తెలంగాణ భూములపై కన్నేసిన సీమాంధ్ర పాలక పెద్దలు ప్రాంతీయ కమిటీనే ఏర్పాటు చేయలేదు. అడ్డగోలుగా భూములు కొన్నారు. తెలంగాణను మార్కెట్ సరుకుగా మార్చారు. అసైన్డ్ భూములు కూడా వదల్లేదు. సీమాంధ్ర బడా బాబులు ఒక్కొక్కరు వేల ఎకరాల భూములను తమ ఖాతాలో వేసుకున్నారు. ఒక్క రామోజీరావే హయత్‌నగర్ మండలంలో దాదాపు 2,350 వేల ఎకరాల భూమిని కారు చౌకగా సొంతం చేసుకున్నారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ముందే రామోజీకకి లీక్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే రామోజీ శంషాబాద్ పరిసరాల్లో బినామీ పేర్లతో 360 ఎకరాలు కొన్నారు. రెండు మూడేళ్లలోనే విమానాక్షిశయం రావటంతో ఇక్కడ భూముల ధరలు ఆకాశానికి పెరగటం, రామోజీ వాటిని అమ్ముకుని దండిగా డబ్బు సంపాదించటం జరిగిపోయాయి. నార్నె రంగారావు నార్నె ఎస్టేట్ పేరుతో బీబీనగర్ ఏరియాలోనే దాదాపు 3 వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. నగరం చుట్టూ అనేక ప్రాంతాల్లో ఈ సంస్థకు మరో 3 వేల ఎకరాల భూమి ఉంటుందని అంచనా. సినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి రియల్ ఎస్టేట్‌కు నగరంలో కీలకమైన ప్రాంతాల్లోనే దాదాపు 2 వేల ఎకరాల భూమి ఉంది. ఇక, చంద్రబాబు హైటెక్‌సిటీని ప్రకటించక ముందే ఆయన బినామీగా సినీనటుడు మురళీమోహన్ అక్కడ రంగవూపవేశం చేశారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరిగినట్టుగా ఉన్నా హైటెక్‌సిటీ వస్తుందని ముందే తెలిసి నామమావూతపు ధరలకు ఎకరాలకొద్దీ భూములను కొనేసుకున్నారు. కొందరు వ్యక్తులు వివిధ పేర్లతో కేవలం భూముల కోసం ఏర్పాటు చేసిన సంస్థలకు కేటాయింపులు జరిపారు.

ఆ తరువాత ఈ సంస్థలు మురళీమోహన్ తదితరులకు ఆ భూములను బదలాయించారు. ఇవే భూములను రియల్‌బూమ్‌లో అమ్ముకున్న మురళీమోహన్ తదితరులు వందలకోట్లు పోగేసుకున్నారు. ఇక, చంద్రబాబు కుటుంబం 1989లో రామా అగ్రికల్చరల్ ఫామ్స్ పేరిట కొండాపూర్‌లో 3,276 ఎకరాలు కొనుగోలు చేసింది. రామా అగ్రికల్చరల్ ఫామ్స్‌లో భువనేశ్వరి, లోకేష్, అమ్మణ్ణమ్మలు భాగస్వాములు. ఈ భూములు కొన్న తరువాత కొండాపూర్‌కు అరకిలోమీటరు దూరంలో హైటెక్‌సిటీని ప్రకటించారు. ఇక, 1989లో డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను వర్తింపచేసి రూ.25కోట్ల మేర లబ్ధిని చేకూర్చిన బాబు ఆ తరువాత 2000 సంవత్సరంలో కొండాపూర్‌లో తాను కొన్న భూమిని ఎకరా కోటి రూపాయలకు డాక్టర్ రెడ్డీస్ సంస్థ అధిపతి అంజిడ్డి తనయుడైన సతీష్‌డ్డి భార్య దీప్తిడ్డికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. నిజానికి అదే ఏడాది మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఎకరా 8లక్షలకు కొన్నారు. దానికి కొద్దిదూరంలోనే ఉన్న కొండాపూర్‌లో మార్కెట్ విలువ రూ.12లక్షలు ఉండగా ఎకరా కోటి చొప్పున చంద్రబాబు ఎలా అమ్మారో... సతీష్‌డ్డి దంపతులు ఎలా కొన్నారో ఆ దేవునికే తెలియాలి.

కొండాపూర్‌లో భూములు కొన్న తరువాత సతీష్‌డ్డి కుటుంబం ఆ తరువాత వాటిని డెవలప్‌మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్‌నకు చంద్రబాబు హైటెక్‌సిటీ లే అవుట్‌లో ఏడెకరాల భూమిని కేటాయించటం గమనార్హం. ఇలా దాదాపు 50 సంస్థలు నగరంలో రకరకాల పేరుతో భూదందాలు చేస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ చుట్టూ ఎక్కడ చూసినా సీమాంవూధుల ఎస్టేట్‌లు, ఫాం హౌస్‌లే. ఒక్క జూబ్లీహిల్స్, బంజరాహిల్స్‌లోనే సీమాంవూధకు చెందిన ఇద్దరు నేతలు 1700 ఎకరాల భూమిని మింగారని ఏకంగా మంత్రి శంకర్‌రావే ఆరోపించారు. బంజారాహిల్స్‌లో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భూమిని కూడా స్వాహా చేశారు. హైటెక్‌సిటీకి ఆనుకొని ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూమి 637 ఎకరాలు కబ్జా చేశారు. కళ్లు మూసుకున్న ప్రభుత్వ సంస్థలు ఏకంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. కబ్జా భూములకు తామే వారసులమన్న తీరుగా అక్కడ సీమాంధ్ర కబ్జాదారులు గుండాలతో భూములకు పహారా కాయడం విచిత్రం. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో శివారు భూములన్నింటినీ హస్తగతం చేసుకున్నారు. అలైన్‌మెంట్ల పేరుతో భూసేకరణ నోటీసులు ఇప్పించి కారు చౌకగా భూములను లాక్కొని ఆ తరువాత నోటిఫికేషన్ ఉపసంహరింపజేసుకొని అలైన్‌మెంట్లు మార్చి మార్చి రైతుల భూములను అడ్డికి పావుషేరుకు తీసేసుకున్నారు.

భూముల కేటాయింపులో ఘరానా మోసం
ఇది చాలదని సీమాంధ్ర సర్కారే నేరుగా భూకబ్జాదారుడి అవతారమెత్తింది. చంద్రబాబు హయాంలో మొదలైన భూ పందేరం, కాంగ్రెస్ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా కొనసాగింది. గత ఆరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ కేంద్రంగా 150 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 70 వేల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు, వ్యక్తులకు, సెజ్‌లకు కేటాయించింది. ఇంతే కాదు అసలు ఉనికిలోనే లేని పత్రికలకు గజం లక్ష రూపాయల వరకు ధర పలికే జూబ్లీహిల్స్‌లో రెండెకరాల చొప్పున భూమిని కేటాయించింది. ఢిల్లీకి చెందిన ఆగాఖాన్ ఫౌండేషన్‌కు శంషాబాద్‌కు దగ్గరలో రూ.450 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని ఉచితంగా కట్టబెట్టింది. సీమాంవూధకుచెందిన ఇందూ టెక్నోజోన్‌కు రూ.750 కోట్ల విలువ చేసే 250 ఎకరాల భూమిని కేవలం రూ.50 కోట్లకే అప్పగించారు. ఇదే తీరుగా బ్రహ్మణీ ఇన్‌వూఫాకు రూ.750 కోట్ల విలువ చేసే 250 ఎకరాల భూమి రూ.50 కోట్లు, స్టార్‌గేజ్ ప్రాపర్టీస్‌కు రూ.750 కోట్ల విలువ కలిగిన 250 ఎకరాల భూమిని రూ.50 కోట్లకే అప్పగించారు. ఫ్యాబ్‌సిటీకి రూ.400 కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూమిని ఎకరాకు ఒక్కపైస లీజు కింద అప్పగించారు. ఇలా ఏపీఐఐసీ, హెచ్‌ఎండీఏల ద్వారా దాదాపు 70 వేల ఎకరాల భూమి కేటాయింపులు చేశారు. ఇందులో రహేజాది మరో మోసం. హెటెక్‌సిటీకి సమీపంలో ఉన్న రూ.520 కోట్ల విలువ చేసే 109 ఎకరాల భూమిని కేవలం 55 కోట్లకు తీసుకుంది. ఉద్యోగాలు కల్పిస్తామని భూమిని కాజేసిన రహేజా కంపెనీ ఈ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో ఐటీ పార్కులు కట్టి అద్దెకు ఇచ్చుకుంది. దీనితో రహేజా నెలకు రూ.30 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఇందులో సర్కారుకు నయాపైస ఆదాయం రాకపోగా రూ.500 కోట్లు నష్టపోయింది. రహేజా అక్రమాల్లో మాజీ సీఎం చంద్రబాబు పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలంటూ లాయర్స్ జేఏసీ కన్వీనర్ రంగారావు సీఎంను కలిశారు. రహేజా భూ కేటాయింపుల్లో బాబు అక్రమాలపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.

శంషాబాద్ దందా
మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న రాజధానికి అంతే సొబగులతో అంతర్జాతీయ స్థాయి విమానాక్షిశయం కావాలని చంద్రబాబు హయాంలో భావించారు. అప్పటికే ఉన్న బేగంపేట విమానాక్షిశయం ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలందిస్తున్నది. పైగా నగరం నడిబొడ్డున ఉండటంతో వచ్చిపోయేవారికి ఎంతో అనుకూలం. కానీ.. తన ప్రయోజనాలు తనకు ఉన్న చంద్రబాబు నాయుడు సర్కారు.. భారీ ఎత్తున శంషాబాద్ విమానాక్షిశయం నిర్మాణానికి పూనుకుంది. ఈ క్రమంలోనే దాని సమీప భూములను విమానాక్షిశయం ఏర్పాటు ప్రకటనకు ముందే తనకు కావల్సిన వారి చేత కొనిపించేశారు.

మైండ్ బ్లాక్ చేసే ఎమ్మార్ అక్రమాలు
వివాదాస్పదమై, ప్రస్తుతం చర్చనీయంశంగా మారిన ఎమ్మార్ ప్రాపర్టీ అక్రమాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇందులో దొందూ దొందే.. అన్న తీరుగా చంద్రబాబు, వైఎస్.. ఇద్దరూ భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఫలితంగా భారీ ఎత్తున లబ్ధి పొందారు. 2002లో టీడీపీ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు నగరశివారు ప్రాంతమైన మణికొండలో 535 ఎకరాలను అప్పగించింది. ఈ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారం గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ కన్వెన్షెన్ సెంటర్‌తోపాటు ఇతర బహుళ ప్రయోజన ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మార్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్‌డ్డి అధికారంలోకి రాగానే మాట మార్చారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఏపీఐఐసీకి సంబంధం లేకుండానే ఎమ్మార్‌కు మూడో పార్టీగా ఎంజీఎఫ్‌ను చేర్చుకొని, మొత్తం ప్రాజెక్టుకు డెవలపర్ హక్కులు అప్పగించింది. ఈ రహస్య ఒప్పందాల ద్వారా బినామీ వ్యక్తులకు, సంస్థలకు అతి తక్కువ మొత్తానికి పలు ప్లాట్లు విక్రయించింది. ఇందులో ఒక్కరూపాయి కూడా ఏపీఐఐసికి దక్కలేదు. దీనిపై సీబీఐ విచారణ చేస్తోంది. అమీర్‌పేట సెంటర్‌లోరూ. 200 కోట్ల విలువ చేసే హెచ్‌ఎండీఏ భూమిని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తన హయాంలో కడపజిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడికి అప్పగించేశారు. దీనిపై పెద్ద వివాదం జరిగింది. దీనిపై విచారణ చేపట్టాలని లాయర్లు సీఎంను కోరారు.

ప్రభుత్వ భూములు మాయం
నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్షికాంతమయ్యాయి. రికార్డులనే తారుమారు చేసిన భూ మాఫియా.. బడా నేతలను తమ గుప్పిట్లో పెట్టుకొని వందల ఎకరాలు కబ్జా చేశారు. ఈ మధ్య కాలంలోనే ఉప్పల్‌లోని సర్వే నెంబర్ 789/1లో రూ.250 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమి అన్యాక్షికాంతమైంది. హైదరాబాద్‌లోని కోఠీ ఈఎన్‌టీ ప్రభుత్వ ఆసుపవూతికి చెందిన రూ. 3381 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేశారు. సీమాంధ్ర సర్కారు ఏకంగా ఈ భూమిని కబ్జాదారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో సర్కారు ఆ ఆదేశాల అమలును పెండింగ్‌లో పెట్టింది. ఇవే కాదు.. శివారు ప్రాంతమైన జవహర్‌నగర్‌లో దాదాపు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో కాలనీలు వెలిశాయి. నగరంలో ఇలా దాదాపు 2 వేల ఎకరాల భూమి కబ్జా అయినట్లుగా అధికారులు గుర్తించినా అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకునే పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం లేదు. ఈ మధ్య కాలంలో యూఎల్సీ క్లియన్స్ కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వీటిని వెతుక్కునే పనిలో ఉన్నారు.

చెరువులు మింగిన ఘనులు
రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం సీమాంవూధుల కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ బడా బాబులు రాత్రికి రాత్రే చెరువులను పూడ్చి ప్లాట్లు చేసి విక్రయానికి పెట్టిన మహా ఘనులు. దీంతో నగరంలో దాదాపు 400 చెరువులు మాయమయ్యాయి. హైటెక్‌సీటీకి సమీపంలో ఉన్న దుర్గం చెరువును పూడ్చి అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. దీనిని ఒక మురికి గుంటగా మార్చిన ఘనత సీమాంధ్ర కబ్జాదారులదే. కూకట్‌పల్లిలోని కాజా కుంటది అదే పరిస్థితి. నగరం నడిమధ్యలో ఉన్న యూసుఫ్‌గూడ పెద్ద, చిన్న చెరువులు కాలనీలయ్యాయి. ఇలా అనేక చెరువులను పూడ్చి ఆక్రమించి అమ్మేశారు. ఈ మేరకు రికార్డులనే తారుమారు చేసిన ఘనా పాటీలు వీరు.


మణికొండలో లగడపాటి మహామాయ
రాజశేఖర్‌డ్డి హయాంలో కీలకమైన ప్రయోజనాలు పొందినవారిలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒకరు. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో లగడపాటిరాజగోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీకి ఐటీ సెజ్ నిమిత్తం ప్రభుత్వం 108 ఎకరాల వక్ఫ్ భూములను కేటాయించింది. ఈ భూముల కేటాయింపు పూర్తి కాగానే ఐటీ సెజ్ పక్కకు పోయింది. నాలుగోవంతు భూమిని సెజ్‌కు పరిమితం చేసిన లగడపాటి.. మిగిలిభూమిలో ల్యాంకో హిల్స్ పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 7200 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతి పెద్ద రియల్ వెంచర్‌గా మారింది. సెజ్ పేరుతో వచ్చే రాయితీలు అనుభవిస్తూ పక్కా దందాకు తెరతీశారు. స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నుల మినహాయింపు పేరుతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను కోల్పోయాయి. నిజానికి ఈ దందా మొదలైనప్పుడు ల్యాంకో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు పెట్టుకున్నారు. దానిని తర్వాత ల్యాంకో టెక్నాలజీ పార్క్‌ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చారు. ఆ తర్వాత ల్యాంకో మంత్రి టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారి.. చివరకు ల్యాంకో హిల్స్ టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లివిటటెడ్‌గా మిగిలింది. తన రియల్ ఎస్టేట్ మోసాలను కప్పిపుచ్చుకునేందుకే కంపెనీ పేరును ఇన్ని సార్లు మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నిర్మాణం మొదలైన కొద్దికాలానికి ఆ భూములు వక్ఫ్ భూములన్న సంగతి బయటికి వచ్చింది. అంటే ఈ భూమిని స్వాధీనం చేసుకున్న సర్కారు.. అక్రమంగా ల్యాంకోకు కేటాయించిందన్నమాట!

అవుటర్.. అదో భూమాయ
హైదరాబాద్ చుట్టూ రింగురోడ్డన్నారు! రాజధాని చుట్టూ గ్రోత్‌కారిడార్‌ను అభివృద్ధి చేయడం కోసమని చెప్పారు. కానీ.. ఆ గ్రోత్ కారిడార్‌లో ఇప్పుడు అవినీతి ప్రబలిపోయింది. అవినీతికి, భూ కుంభకోణాలకు రింగ్‌రోడ్ వ్యవహారం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూముల మాయాజాలంలో రింగ్ రోడ్డు అష్ట వంకరలు తిరిగింది. రింగ్‌రోడ్డు కోసం సర్కారు 86 గ్రామాల్లో 6,500 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో 5,500 ఎకరాల భూమి రైతుల వద్దనుంచే సేకరించింది. అయితే భూసేకరణలో పెద్దల భూములను వదలి పేదల భూములు, ఇళ్లపై నుంచి తీసుకు శంషాబాద్ జంక్షన్ కోసం మొదట జాతీయ రహదారిపై 18.9 కిమీ వద్ద ప్రతిపాదించారు. దీని ప్రకారమైతే సామాన్యుల హుడా కాలనీలో కేవలం 4 ఇళ్లు మాత్రమే పోయేవి. కానీ.. ఇదే ప్రతిపాదనతో ఒక మాజీ మంత్రితో పాటు, అప్పట్లో బడా వ్యాపారులకు చెందిన 12 ఎకరాల భూములు పోతున్నాయి. అంతే.. సదరు పెద్దలు సర్కారు వద్ద తమ పలుకుబడిని ప్రయోగించారు. ఫలితం.. అలైన్‌మెంట్ మారిపోయింది.. హుడా కాలనీ మొత్తంగా అదృశ్యమైంది. శ్మశానవాటిక సైతం సమాధి అయిపోయింది. కీసరలో మూడు సార్లు అలైన్‌మెంట్ మార్చారు. ఇంతే కాదు భూసేకరణ నోటీస్‌లతో హడపూత్తించారు. వట్టినాగుల పల్లిలో మొదటి భూసేకరణ ప్రకారం సర్వే నెంబరు 410 నుంచి 425 వరకు నోటీస్‌లు ఇచ్చారు. ఆ తరువాత దళారీలు రంగంలోకి దిగారు. హుడా కంటే ఎక్కువ ధర ఇప్పిస్తామని సత్యం కంప్యూటర్స్ తరఫున ఎకరాకు రూ.16 లక్షల నుంచి 35 లక్షల వరకు చెల్లించి తీసేసుకున్నారు.

ఆ తరువాత అలైన్‌మెంట్ మార్చారు. భూములు పోతాయని భయపడి అమ్ముకున్న రైతులు నష్టపోగా ఇప్పుడు ఆ భూములు ఎకరా రూ.4 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. సీమాంధ్ర భూబకాసురుల భూములు కాపాడుకుంటూ సామాన్యుల భూములను మింగుతూ వెళ్లిన ఆనకొండ ఈ రింగ్‌రోడ్డు. ఈ రింగ్ రోడ్డును అడ్డం పెట్టుకొని సీమాంధ్ర నేతలు రియల్ వ్యాపారం పేరుతో భారీ భూదందా నిర్వహించారు. కోట్లకు కోట్లు గడించారు. గ్రోత్‌కారిడార్‌లో వేలాది ఎకరాలు సీమాంధ్ర భూబకాసురుల చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఇక్కడి సామాన్య రైతులకు డెత్ కారిడార్‌గా మారింది. ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారాయి. అలైన్‌మెంట్ల మార్పులపై సీబీఐ విచారణ చేసినా నివేదికను వెలుగు చూడకుండా నొక్కిపెట్టారు. రావిరాల గ్రామంలో బ్రహ్మణీ, ఇందు, స్టార్‌గేజ్ కంపెనీలకు కేటాయించారు.

Take By: T News http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=51104


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, RingRoad,Scam, APScam,   

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP