Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Voice of telangana. Show all posts
Showing posts with label Voice of telangana. Show all posts

Wednesday, December 19, 2012

ఇవి మంచి పెయిన్ కిల్లర్లు


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..

ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు. ఓసారి మనమూ ట్రై చేద్దామా..!

curd
పెరుగుతో పొట్ట క్షేమం
మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

FreeGreatPicture
హెర్బల్ టీ
తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.

cherries
చెర్రీతో కీళ్లు భద్రం
చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.

pasupu
పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..
ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.

alllam
ఆర్థరైటిస్‌కి అల్లం
జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

fish
నడుంనొప్పికి చేప
మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read more...

Saturday, December 8, 2012

Best Cartoons - T News

Read more...

కాసేపు హీరో మరికాసేపు జీరో

తీవ్రమైన అసహనం... అశాంతి. కాసేపు తనకు తానే గొప్ప... మరి కాసేపటిలో తీవ్రమైన న్యూనతాభావం కలిసి టీనేజిలోకి ప్రవేశించిన వారి మానసిక పరిస్థితిలో సంచలన మార్పు వస్తుంది. టీనేజర్ల అంతరంగమేమిటో అవలోకిద్దాం.

టీనేజ్‌కి ముందు పిల్లలు తమ తల్లిదండ్రులు అందించిన సహాయ సహకారాల మీద పూర్తిగా ఆధారపడతారు. అయితే టీనేజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు తమ వ్యక్తిత్వం మీద నిలబడాలనే తపనతో తల్లిదండ్రుల సహాయాన్ని స్వీకరించటానికి ఇష్టపడరు. అదే సమయంలో తమకు తాము అడ్జెస్ట్ కావటమూ చాతకాదు.

ఎవరిని నిందించాలో తెలియక, అసలు కారణం అంతుపట్టక సహాయానికి రాబోయిన తల్లిదండ్రుల మీద విసుగు చెందుతారు.

పైగా వీళ్ళను సినిమాలలోనూ పత్రికలలోనూ కనిపించే ప్రకటనలు ఈ దుస్తుల్ని ధరించు, ఆ సబ్బును వాడు, ఈ చెప్పులను వేసుకో, ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించు అంటూ రెచ్చగొడుతుంటాయి.

ఆ బాపతు ప్రకటనలు అందించే అంచనా లకూ వాస్తవ జీవితంలో లభించే సౌకర్యాలకూ పొత్తు కుదరకపోవటం కూడా వాళ్ళు బోరు చెందటానికి ఒక కారణంగా ఉం టుంది.
ఇది నాణానికి ఒకవైపు మాట!

రెండో వైపున -
వాళ్ళు ఇప్పుడిప్పుడే బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతుంటారు.
ఎంతో వైవిధ్యంతో కూడుకున్న జీవితాను భవాలు ఎదురుగా ఉంటాయి.

కాలేజీకి వెళ్ళటం, ఫలానా కోర్సు చదవటం, చదువులో లేక ప్రేమలో తోటివాళ్ళతో పోటీ, మనస్సును ఆకట్టుకునే క్రీడా ప్రపంచం, ఉద్వేగాల్ని వశీకరించుకునే సినిమా ప్రపంచం, వీటన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.

ఒక్క క్షణాన తమకు తాము ఎంతో ప్రాముఖ్యత కలవాళ్ళుగా భావిస్తారు. మరుక్షణమే తమనెవరూ పట్టించుకోవటం లేదని బాధ చెందుతుంటారు.

భవిష్యత్తులో తానేదో సూపర్‌స్టార్ అయిపోవా లనీ, గొప్ప క్రీడాకారుడు కావాలనీ ఆశలు పెంచుకుంటారు. అనుకోకుండా ఎక్కడ నుంచో ఆస్తి వచ్చి పడుతుందని కలలు కంటుంటారు.
కానీ వాటిలో ఏ ఒక్కటీ ఎన్నాళ్ళు గడిచినా జరగవు. (ఏడాది రెండేళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఎక్కువ కాలమేనన్న సంగతి మర్చిపోవద్దు!) ఫలితంగా జీవితం ‘బోర్’ అనిపిస్తుంది.
టీనేజర్స్ మీద తోటివాళ్ళ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంగతి ముందే చెప్పుకున్నాం.

తోటివాళ్లు తనను మెచ్చుకోవాలని ఉంటుంది లోలోపల. కానీ వాళ్ళు తనను లెక్కచేయటం లేదనిపించినప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నారనిపించి నప్పుడు వాళ్ళు బోర్‌గా కనిపిస్తారు.
పిల్లలు స్కూలు బోరు కొడుతోందని అంటున్నారంటే స్కూలులో వాళ్ళు రాణించలేక పోతున్నారనీ, చదువులో వెనకబడుతున్నారనీ అర్థం. అక్కడ వాళ్ళకు పాఠాలు సరిగ్గా అర్థం కావటం లేదనో లేక మరేదో అసౌకర్యానికి ఫీలవుతున్నారనో అనుకోవాలి.

చాలా అరుదైన సందర్భాలలో మాత్రం కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ తమ తెలివితేటలకు తగ్గ చదువు స్కూలులో లభించక పోయినా బోరు చెందుతారు.

కారణం ఏమైనప్పటికి టీనేజర్లలో బోర్ ఫీలింగ్‌ను గమనించి వారికో వ్యాపకం కల్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వారిలో క్రమేపి నిరాశ ఏర్పడే ప్రమాదముంది. మొత్తం మీద టీనేజర్ల అంతరంగం అంతా పలు ఆలోచనలతో నిండి స్థిరంగా ఉండదు. వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.

Read more...

Tuesday, July 3, 2012

గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి


గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి

yADAGIRE talangana patrika telangana culture telangana politics telangana cinemaఇదీ యాదగిరి చిట్టాపద్దు
- సోమశేఖరరెడ్డి నుంచి అడ్వాన్సుగా రూ.9.5 కోట్లు.
- యాదగిరి నొక్కేసింది రూ.6.5 కోట్లు
- గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో రూ.3.75 కోట్ల నిల్వ
- చలపతిరావుకు ఇచ్చింది రూ.3 కోట్లే
- ఇంటి పక్కనే ప్లాటు కొనుగోలుకు రూ.40 లక్షలు
- నాచారంలో ఇల్లు కొనుగోలుకు రూ.20 లక్షలు
- మారుతి స్విఫ్ట్ కారు కొనుగోలుకు రూ.8.10 లక్షలు కుక్కలను కట్టేసేచోట ఆస్తుల పత్రాలు
- గెస్ట్‌హౌస్‌లో వాటర్‌ట్యాంక్‌కు 20 సీసీ కెమెరాల నిఘా
- డబ్బు స్వాధీనం.. పత్రాలు సీజ్
- లెక్క దొరకని మొత్తం రూ.2.07 కోట్లు
- కర్నూలులో యాదగిరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు
- అజ్ఞాత జీవితానికి గాలి సోదరుడి సహకారం!
- మొబైల్ కాల్స్‌ను ట్రాక్ చేసి పట్టుకున్న ఏసీబీ బెయిల్ ఫర్ సేల్ కేసులో రౌడీషీటర్ అరెస్ట్

హైదరాబాద్, జూలై 2 (): బెయిల్ ఫర్ సేల్ కేసులో కీలక పాత్రధారి అయిన రౌడీషీటర్ యాదగిరిరావు అలియాస్ యాదగిరి అలియాస్ గిరిని ఏసీబీ అధికారులు కర్నూలులోని ఓ హోటల్‌లో అరెస్టు చేశారు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించేందుకు అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి అడ్వాన్సుగా 9.5కోట్ల రూపాయల నగదును తీసుకున్నట్టు యాదగిరి విచారణలో వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను రిటైర్డ్ జడ్జి చలపతిరావుకు ఇచ్చినట్టు వెల్లడించాడు. కొంత డబ్బును తన నివాసంలో దాచిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున యాదగిరిని వెంటబెట్టుకుని నాచారంలోని అతని ఇంటికి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. అదే ప్రాంతంలో ఉన్న యాదగిరి గెస్ట్‌హౌస్‌లో కూడా సోదాలు చేసి, వాటర్‌ట్యాంక్‌లో దాచిపెట్టిన రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కుక్కలను కట్టి ఉంచే చోటు నుంచి విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు.

యాదగిరి తండ్రి బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాలికి బెయిల్ డీల్‌లో ఇంకా స్వాధీనం కాకుండా ఉన్న 2.07 కోట్ల రూపాయలు ఎక్కడికి? ఎవరి చేతికి? వెళ్లాయన్న దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బెయిల్ డీల్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి చేతికి ఈ డబ్బు చేరిందా? లేక యాదగిరి ఈ మొత్తాన్ని తన సంబంధీకుల వద్ద దాచి పెట్టుకున్నాడా? అన్న కోణాల్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మంగళవారం యాదగిరిని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మొత్తం వ్యవహారంపై అతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించాలని నిశ్చయించారు.
Gali05 talangana patrika telangana culture telangana politics telangana cinema
గాలి బెయిల్ డీల్‌లో భాగంగా అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి 9.5కోట్ల రూపాయల నగదును అడ్వాన్సుగా తీసుకున్న యాదగిరి బెయిల్ మంజూరైన రాత్రే తన మనిషి ద్వారా చలపతిరావు ఇంటికి రూ.3 కోట్లు ఇచ్చి పంపించాడు. మిగిలిన రూ.6.5కోట్లను తన వద్దనే పెట్టుకున్నాడు. ఒప్పుకున్న ప్రకారం రూ.5కోట్లు ఇవ్వాలి కదా.. అని చలపతిరావు ఫోన్ చేయగా గాలికి మంజూరైన బెయిల్‌పై సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారని, దానిపై నిర్ణయం వెలువడిన తరువాత మిగతా రూ.2కోట్లు ఇస్తానని చెప్పాడు. అయితే.. చలపతిరావు సీబీఐ అధికారులకు చిక్కగానే యాదగిరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ కోసం డీల్ కుదుర్చుకున్న ఆయన తమ్ముడు సోమశేఖరడ్డి, కర్ణాటక రాష్ట్రం కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబులు యాదగిరికి సహకరించారని, పోలీసులకు చిక్కకుండా యాదగిరిని కొన్నిరోజులు బెంగళూరు శివార్లలో దాచిపెట్టినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.

యాదగిరి కోసం వేటను ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు.. బెంగళూరుకు ప్రత్యేక బృందాలను కూడా పంపించారు. సోమశేఖరడ్డి తదితరుల కదలికలపై నిఘా పెట్టారు. యాదగిరితోపాటు సోమశేఖరడ్డి తదితరుల మొబైల్‌ఫోన్లపై కన్నేసి ఉంచారు. దీనిని పసిగట్టిన యాదగిరి ఇటీవలే కర్నూలుకు చేరుకుని ఓ హోటల్‌లో బస చేశాడు. అతని మొబైల్‌ఫోన్ కాల్స్ ద్వారా యాదగిరి కర్నూలులో ఉంటున్నట్టు పసిగట్టిన ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

9.5కోట్లు తీసుకున్నా : విచారణలో యాదగిరి
గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించటానికిగాను అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి రూ.9.5కోట్లను అడ్వాన్సుగా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో యాదగిరి వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను వెంకట చలపతిరావుకు అందచేసినట్టు తెలియచేశాడు. కొంత డబ్బును తన గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో భద్రపరిచినట్టు చెప్పాడు. ఇక, అడ్వాన్సుగా తీసుకున్న మొత్తం నుంచి రూ.40లక్షలు వెచ్చించి తన ఇంటి పక్కనే ఉన్న ప్లాటును, మరో 20లక్షల రూపాయలతో నాచారంలో ఓ ఇల్లును కొన్నట్టు వెల్లడించాడు. మరో 8.10లక్షలు ఖర్చు చేసి మారుతి స్విఫ్ట్ కారు కొన్నట్టు చెప్పాడు.
తెల్లవారుజాము సమయంలో..: ఈ నేపథ్యంలో యాదగిరిని వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున నాచారంలోని అతని ఇంటికి చేరుకున్నారు. యాదగిరి నివాసంతోపాటు అతని గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు జరిపారు.

తనిఖీల్లో గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో యాదగిరి దాచిపెట్టిన 3.75 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సెక్యూరిటీగా యాదగిరి 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఓ వాచ్‌మెన్‌ను కూడా నియమించుకున్నట్టు విచారణలో నిర్ధారించుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న తరువాత ఏసీబీ అధికారులు యాదగిరితోపాటు తమ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మరోసారి ప్రశ్నించగా విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తన ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశంలో భద్రపరిచినట్టుగా యాదగిరి వెల్లడించాడు. దాంతో మధ్యాహ్నం 12.30గంటలకు మరోసారి యాదగిరిని వెంట తీసుకుని నాచారం వచ్చిన ఏసీబీ అధికారులు అతని ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశం నుంచి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Take By: T Media

Read more...

శాఖ కరెంటు టెంటు ఆంధ్రోళ్ల టెంటు

Power500 talangana patrika telangana culture telangana politics telangana cinema

తరలిపోయిన
కీలక ప్రాజెక్టులు
యథేచ్ఛగా
ఉద్యోగాల దోపిడీ
తెలంగాణ జిల్లాల్లో నిర్మించాల్సిన
ప్రాజెక్టులను సీమాంవూధకు
తరలించడం ద్వారా ఉద్యోగాల్లో జరిగిన నష్టం
వనరుల్లేనిచోట పవర్‌ప్లాంట్లు
తెలంగాణకు మొండి చేతులు
ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు
పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
కోల్పోయిన తెలంగాణ ప్రాంతం
సీమాంధ్రలో నూరుశాతం స్థానికులే
అందుకోసం జీవోలూ జారీ
నెల రోజుల్లో అమలైన జీవో 564
దశాబ్దంగా మూలపడి
ఉన్న జీవో 610
నిర్ణయాత్మక స్థానాల్లో
సీమాంధ్రులు
వారి ప్రాంతాలకు
అనుగుణంగా జీవోలు
కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు
dddd talangana patrika telangana culture telangana politics telangana cinema

తెలంగాణ ప్రాంతంలోని జెన్‌కో పవర్ ప్రాజెక్టుల్లో 60 శాతం ఉద్యోగులు సీమాంవూధవారే! కానీ.. సీమాంవూధలోని జెన్‌కో ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జాడే కనిపించదు! తెలంగాణ ప్రాంతానికి నీరందించే శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టులో 70 శాతం ఉద్యోగులు సీమాంవూధులే! కానీ.. విజయవాడలోని వీటీపీఎస్ ప్రాజెక్టులో కేవలం పట్టుమని ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు కూడా లేరు! 2011 మార్చి వరకు విద్యుత్‌రంగంలో 80,920 పోస్టులు మంజూరై ఉండగా, వాటిల్లో 23,366 పోస్టులు మాత్రమే తెలంగాణ వారికి దక్కాయి! ఇందులోనూ మూడు వేల మంది తెలంగాణకు వలస వచ్చినవారే! అంటే.. తెలంగాణ గడ్డపై పుట్టిన వారికి దక్కింది కేవలం 20వేల ఉద్యోగాలేనన్నమాట! అంతేకాదు.. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు సీమాంవూధకు తరలిపోవడంతో ప్రత్యక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను, పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. సమైక్యాంవూధలో తెలంగాణకు జరిగిన నష్టానికి విద్యుత్ రంగంలోని ఈ అన్యాయాలు మచ్చుతునకలు! విద్యుత్ బయటికి కనిపించదు.. కానీ పట్టుకుంటే షాక్‌కొడు తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలూ అంతే.. పట్టిచూస్తే కానీ అంతుచిక్కవు!!

శాఖ కరెంటు ఆంధోళ్ల టెంటు
తరలిపోయిన కీలక ప్రాజెక్టులు.. యథేచ్ఛగా ఉద్యోగాల దోపిడీ
- వనరుల్లేని చోట పవర్‌ప్లాంట్లు.. తెలంగాణకు మొండి చేతులు
- ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు.. పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
- కోల్పోయిన తెలంగాణ ప్రాంతం.. సీమాంవూధలో నూరుశాతం స్థానికులే
- అందుకోసం జీవోలూ జారీ.. నెల రోజుల్లో అమలైన జీవో 564
- దశాబ్దంగా మూలపడి ఉన్న జీవో 610
- నిర్ణయాత్మక స్థానాల్లో సీమాంవూధులు
- వారి ప్రాంతాలకు అనుగుణంగా జీవోలు
- కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
- సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు

Contral0 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, జూలై 2 (): సీమాంధ్రులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది! విద్యుత్‌రంగంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, 4 డిస్కమ్‌లలోని ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కకుండా సీమాంవూధులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతల వాదన! లోతుగా తరచి చూస్తే.. నివురుగప్పిన అన్యాయం.. నిప్పులా కనిపిస్తుంటుంది. శాతాలు, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు వాటా దక్కినట్లు కనిపించినా.. కనిపించని అన్యాయం మరోటి ఉంది. అదే తెలంగాణ కోల్పోయిన ఉద్యోగాలు! విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు పుష్కలంగా లభ్యమవుతున్నా తెలంగాణ ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకపోవడం, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను సీమాంవూధకు తరలించడం, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నష్టపోయిన ఉద్యోగాలు 16వేలకుపైనే! ట్రాన్స్‌కోలో 8,302 మంది, జెన్‌కోలో 15,647 మంది, నాలుగు డిస్కమ్‌లలో 56,971 మంది ఉద్యోగులున్నారు.

రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కమ్‌లలో రెండు డిస్కమ్(ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లు పూర్తిగా సీమాంధ్ర పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 26,605 మంది పనిచేస్తుండగా, సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో 30,366 మంది ఉద్యోగులున్నారు. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వలసవాదులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సీపీడీసీఎల్ పరిధిలో రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉండడంతో ఈ రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్నారు. సీమాంవూధలో నూటికి నూరుశాతం అక్కడివారే ఉద్యోగాలు పొందుతుండగా అదే విధానం తెలంగాణలో ఎందుకు పాటించడం లేదన్నది ప్రశ్న!
Power10 talangana patrika telangana culture telangana politics telangana cinema

అంటే.. వంద మార్కులు వచ్చేలా చదివిన విద్యార్థికి 40మార్కులు వేసి.. అసలు ఒక్కమార్కు వచ్చేందుకూ ఆస్కారం లేని విద్యార్థికి 60 మార్కులు వేసిన ప్రభుత్వం.. సమతుల్యం పాటించామంటూ మోసగించే యత్నాలను నిస్సిగ్గుగా చేస్తున్నది! అంతేకాదు.. ఈ అన్యాయంలో పెను జీవన విధ్వంసం కూడా కనిపిస్తుంది. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా కోసం తెలంగాణ నుంచి బొగ్గు అందిస్తున్నారు. ఈ పేరుతో భారీ స్థాయిలో ఓపెన్‌కాస్ట్ గనులను తవ్వి.. వందల వేల గ్రామాల ఉనికిని అదృశ్యం చేస్తున్నారు. వెరసి.. విద్యుత్ రంగంపై సీమాంధ్ర పాలకుల వివక్ష ఫలితంగా అటు ఉద్యోగిత పరంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగానూ తెలంగాణ నష్టపోయింది. మరోవైపు వనరుల్లేని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి బొగ్గు రవాణా, అక్కడి ప్రాజెక్టులనుంచి విద్యుత్ పంపిణీలో నష్టాలు కలిసి.. అక్కడ తయారయ్యే విద్యుత్ ఖరీదును అమాంతం పెంచివేస్తున్నది.

1969లో వికసించిన విద్యుత్ తేజం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తున రాజుకొనడానికి నాంది పలికింది విద్యుత్ రంగమే! 1957లో ఏపీ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ టు రెసిడెన్సీ యాక్ట్‌ను విద్యుత్ బోర్డు.. నాటి ఎపీఎస్‌ఈబీలో అమలు చేయాలంటూ ఓ విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్ష.. దవానలంలా వ్యాపించి.. తెలంగాణ పది జిల్లాలకూ విస్తరించింది. జై తెలంగాణ అంటూ యావత్ ప్రాంతం నినదించేందుకు గొంతుక అయ్యింది! అదే స్ఫూర్తి విద్యుత్ రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నది.

మొన్నటి సహాయ నిరాకరణ ఉద్యమం, తదుపరి సకల జనుల సమ్మెలో విద్యుత్ తేజం వికసించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సమరశంఖం పూరించింది. విద్యుత్ రంగంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకుండా సీమాంవూధులు కుట్రలు చేస్తే ఉప్పెనలాంటి ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉన్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీ జాక్) హెచ్చరిస్తున్నది. గత ఆరు దశాబ్దాల చరివూతను నెమరేసుకుని సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయనేతలు మసలు కుంటారో, మలిఉద్యమాన్ని చవిచూస్తారో వారే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింపజేయాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులుంటే ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Power50 talangana patrika telangana culture telangana politics telangana cinema

1957లో చట్టం
ఏపీ ఎంప్లాయ్‌మెంట్, రిక్రూట్‌మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్-1957 ప్రకారం 14 ఏళ్లపాటు పాటు స్థానికంగా ఉన్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. ఈ చట్టాన్ని విద్యుత్‌బోర్డు(ఎపీఎస్‌ఇబి)లో వర్తింపజేయాలని తెలంగాణ యువకులు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ చట్టం విద్యుత్‌బోర్డుకు వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా 1969లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఒక విద్యార్ధి చేసిన ఆమరణ నిరాహారదీక్ష తీవ్రత దావానలంగా తెలంగాణ జిల్లాలకు విస్తరించి 1969 తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు.

అయితే సుప్రీంకోర్టు సైతం విద్యుత్‌బోర్డుకు 1957 చట్టం వర్తించదని హైకోర్టు తీర్పునే ఖరారుచేసింది. దాంతోపాటు 1957 చట్టం అమలుకు ముందున్న ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు 1971లో తీర్పు ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న పీవీ నరసింహారావు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దానిని జీర్ణించుకోలేని సీమాంధ్ర రాజకీయనేతలు ముల్కీ రూల్స్ అమలుచేస్తే తమకు ఉద్యోగ అవకాశాలు దక్కవని గుర్తించి, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షతో జై ఆంధ్రా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపందాల్చడంతో నాటి కాంగ్రెస్ అధిష్ఠానం పీవీతో సీఎం పదవికి రాజీనామా చేయించింది. ఆ తర్వాత కేంద్రం 1974లో రాజ్యాంగ సవరణ (37) చేసి ముల్కీ నిబంధనలను తొలగించింది. అనంతరం 1975 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అయితే నాడు అధికారంలో ఉన్న పాలకులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయనేతల ఉద్యమం ఫలితంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గిర్‌గ్లానీ కమిషన్ 2004లో ప్రభుత్వానికి సుదీర్ఘమైన నివేదిక సమర్పించింది. విద్యుత్ రంగానికి సంబంధించిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో సంస్థల్లోనూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని సిఫారసు చేసింది.

బొగ్గు సింగరేణిది-సోకు సీమాంధ్రులుది
విద్యుత్ రంగంలో మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులదే పైచేయిగా ఉంది. ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్‌రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్‌రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రం ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు, మరో అడుగు ముందుకేసి విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తెలంగాణ నుంచి వచ్చే బొగ్గు ఆధారంగానే సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ప్రాజెక్టులు. కానీ.. సీమాంధ్ర పాలకులు వాటిని తమ తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. దీనికి అదనంగా తెలంగాణలో బొగ్గు తవ్వకాలకు ఓపెన్‌కాస్టుల పేరిట పెను జీవన విధ్వంసం జరుగుతున్నది.

సీమాంధ్రులదే పెత్తనం......
విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అగ్రభాగంగా ఉన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన బడా కాంట్రాక్టర్లు 21మంది ఉంటే.. వారిలో 19మంది సీమాంవూధులే. ఇలాంటి పరిస్థితులకు నాటి సీఎం చంద్రబాబు ప్రధాన కారణమన్న విమర్శ బలంగా ఉంది. సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసి, ప్రైవేటురంగంలో విద్యుత్ ఉత్పత్తికి ఆయన హయాంలోనే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకుకు అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు హయంలో సీమాంవూధుల నక్కజిత్తుల కారణంగా ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఏపీఎస్‌ఈబీ నాటినుంచే సీమాంవూధులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో పనిచేసిన మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ, వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుట్రపూరితంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సంస్కరణల తదుపరి అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసినవారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌వూపాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎన్నో మతలబులున్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో ప్రాజెక్టు విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతోనే ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబు ఉంది. అంతే కాకుండా మర్చంట్ పవర్‌వూపాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టును ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సకల జనుల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో ఒకవైపు పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా రైతుకూలీలు, పరిక్షిశమల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి కొరవడింది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాలేదు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. సత్తుపల్లి ప్రాజెక్టు వస్తే తెలంగాణ సస్యశ్యామలమై ఉండేది. కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు 2002లోనే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కేవలం 26 నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు.

గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. సకాలంలో ఇది పూర్తి అయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు వ్యవసాయ, పారిక్షిశామికరంగాల్లో తెలంగాణ దూసుకు పరిస్థితులుండేవి. ఇదే సమయంలో 2003లో సీమాంవూధకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే 220 మెగావాట్లు, వేమగిరి 370 మెగావాట్లు, గౌతమి 464 మెగావాట్లు, కోనసీమ 445 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 1400 మెగావాట్ల సామర్థ్యం గల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్నీ అనుమతులు వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసింది. కాంతానపల్లితోపాటు మరికొన్ని హైడెల్ పవర్ ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో వ్యవసాయరంగం, పారిక్షిశామికరంగాలు ఎదగాల్సినంతగా ఎదలేకపోయాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయింది.

ఒప్పందాల ఉల్లంఘనలు
విద్యుత్ సంస్కరణల సమయంలో చేసుకున్న ఒప్పందాల్లో అనేకం ఈనాటికీ అమలుకు నోచుకోలేదు. గతేడాది సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతాంగానికి, వినియోగదారులకు మెరుగైన కరెంటు సేవలు అందిస్తూనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యమై కీలక భూమిక పోషించారు. సింగరేణి కార్మికుల సమ్మె, తదుపరి కరెంటోళ్ల సమ్మె సర్కారును ఇరకాటంలో పెట్టింది. దాంతో గత ఏడాది అక్టోబర్ 25న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు రాతపూర్వక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. మొత్తం 13 అంశాలపై యాజమాన్యాలు అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎం జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరఫున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు.

జీవోల అమలులో ఎంతో తేడా
ఆచరణలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకపోవడంపై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతలను తట్టుకునేందుకు 1985 డిసెంబర్‌లో అప్పటి సీఎం ఎన్‌టీఆర్ 610 జీవో తెచ్చారు. విచిత్రం ఏమంటే 610 జీవో జారీకి నెల ముందు రాయలసీమ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 564ను తీసుకువచ్చింది. రాయలసీమ జిల్లాల్లో (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) ఇతర జిల్లాల ఉద్యోగులు ఉండరాదనేది జీవో సారాంశం. ప్రభుత్వం ఈ జీవోను నెలలో అమలుచేసి రాయలసీమలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఉన్నపళాన వెనక్కి పంపించింది. అప్పట్లో రాయలసీమ నేతలు తెలంగాణ ఉద్యోగుల పట్ల కిరాతకంగా వ్యవహరించిన తీరును ఇప్పటికీ ఉద్యోగులు మరచిపోలేదు. కేవలం నెల గడువులో 564 జీవోను నిఖార్సుగా అమలు చేసిన ప్రభుత్వం దశాబ్దకాలంగా 610 జీవోను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదంటే తెలంగాణపై ఎంతటి పక్షపాతధోరణి ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రత్యేకవాదులు అంటున్నారు.

రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌వూపాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పొతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఒప్పందంలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి
1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.
3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.
4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్ (హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.
5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కాంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.
7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.
8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.
9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయి కల్పించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవడం.
10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించడం.
11. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన (కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.
12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు
అనుగుణంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.
13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్తూపాన్ని
తెలంగాణ చౌరస్తా (మింట్ కాంపౌండ్)వద్ద ఏర్పాటు చేయడం.

Take By: T Media

Read more...

Friday, June 29, 2012

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Saturday, June 23, 2012

ముందున్నది...ఉపద్రవం

నోరుతెరిచి నడిరోడ్డుపైకి పొంగిన నాలా పాదచారికి ప్రాణగండమవుతుంది.. జలదిగ్బంధనంలో నీటమునిగిన పల్లె పగలూరాత్రి తెలియక విలవిల్లాడుతుంది.. ఏటా కట్ట తెంచుకునే చెరువు ఊరిమీదికి ఉరిమి దూకుతుంది.. లోలెవల్ వంతెనలపై నుంచి వాగులు సాగిపోతుంటే, రాకపోకలు రోజులు లెక్కిస్తూ నిలిచిపోతాయి.

చినుకు పడ్డప్పుడల్లా అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. భారీ వర్షం పడితే ఇక పరిస్థితి భయానకమే. ఏజెన్సీ ఏరియానేకాదు దాదాపు అన్ని డివిజన్లలోనూ అదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో పదే పదే ఉపద్రవాలు ముంచు కొస్తున్నాయి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే తలెత్తే ప్రమాదకర పరిస్థితికి సర్కారు తాత్కాలిక మరమ్మతులతోనే పరిష్కారాన్ని ముగిస్తోంది. అందుకే జిల్లాయంత్రాంగం ముందు సవాళ్లుగా నిలుస్తున్న ఈ సీజన్‌లోని ప్రమాదకర ప్రాంతాలపై టీ-

మీడియా ఫోకస్.......మాటేసిన దస్రూమాటు..
ములుగు, దేవగిరిపట్నం ప్రధాన రహదారిపై గల దస్రూమాటు పొంగితే దేవగిరిప ట్నం అవతలి గ్రామాలైన 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లక్నవరం ముందు భాగంలోని పెద్ద వాగు పొంగితే అంకన్నగూడెం, జగ్గన్నగూడెం గ్రామాల జలదిగ్బంధం అవుతాయి. ఇక్కడ ఐటీడీఏ అధికారులు రూ. 35 లక్ష లు ఖర్చు పెట్టి లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి వర్షాకాలంలో ఎప్పుడూ నీళ్లల్లో మునిగిపోయే ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకల కోసం నాటు పడవలను వాడకతప్పని పరిస్థితి.

కొమ్ములవంచ రిజర్వాయర్‌కూ ఏటా గండ్లే..
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారులో ఆకేరు వాగుపై 1964లో అప్ప టి రెవెన్యూ శాఖా మంవూతిగా పని చేసిన నూకల రాంచంవూదాడ్డి, పబ్లిక్ వర్క్ శాఖామంత్రి ఏసీ.సుబ్బాడ్డిలు ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు కుడికాల్వ కింద నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం, ముంగిమడుగు శివారులో 1100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఎడమ కాల్వ ద్వారా నెల్లికుదురు మండలం మదనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆకేరు వాగును ని ర్మించారు. 2006లో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి రూ.1.0కోట్లు కేటాయించి కుడికాల్వ పనులు చేపట్టారు. సిమెంట్ కాల్వకు బుంగ, ఆనకట్టకు ఉన్న షటర్(తూము)లు తుప్పు పట్టి వచ్చిన నీరంతా నిల్వ ఉండకుండా వృథాగా పోతున్నప్పటికీ ప్రతీ ఏటా ఐబీ అధికారులు నామమావూతపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోయే పరిస్థితులు ఉన్నాయి.

మారేడు పొంగితే అంతే..
వెంకటాపురం మండలంలోని లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య గల మా రేడుగూడెం చెరువు మత్తడి పొంగిపొర్లితే పెద్దాపురం వైపు గల సుమారు 12 గ్రామా లకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ ఏళ్ల తరబడి లోలెవల్ వంతెన దర్శనమిస్తోంది. ఇటీవల వెంకటాపురం చెల్పూర్ ప్రధాన రహదారికి సుమారు రూ. మూడు కోట్లతో నూతన తారు రోడ్డును వేశారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు కాజ్‌వేను నిర్మించడం మరిచారు.

గుండ్లవాగుతో కడగండ్లే..
గోవిందరావుపేట మండలంలో గుండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తే అమృతండా, చం ద్రూతండాల గిరిజనులకు భాహ్య ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అలాగే పస్రా సమీ పంలోని దయ్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తే నార్లాపురం, మేడారం పరిధిలోని 1 గ్రామాలకు ప్రధాన రహదారి బంద్ అయినట్లే. ప్రతీసారి మేడారం జాతరకు అధికారులందరూ ఇదే లోలెవల్ కాజ్‌వే మీది నుంచి పోతారు... వస్తారు. కానీ ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలనే ఆలోచనే వారికి తట్టదు. జంపన్నవాగు పొంగితే ముత్తాపురం మూలకు పడుతది.

రేగొండ మండలంలోని భాగిర్థిపేట క్రాస్‌రోడ్డు సమీపంలో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్‌వేతో ప్రతీయేటా సమస్యలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేకు దగ్గర్లోనే చెరువు ఉండడంతో వర్షాకాలంలో చెరువు నిండడం మూలంగా నీరుబయటకు వచ్చి కాజ్‌వే మీదుగా వెళ్తుంటుంది. కాజ్‌వేపై నీరు ఉధృతంగా వెళ్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం వందలాది లారీలలో బొగ్గు తరలిపోతుండడంతో వర్షాకాలంలో లారీలు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే విధిలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారికి ఎంతో కొంత చెల్లించి ద్విచక్ర వాహనాలను మాత్రం కాజ్‌వే నుంచి దాటించుకుంటారు.

భయంభయంగా లోతట్టు ప్రాంతాలు
వరంగల్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు, 20 లోతట్టు కాలనీలు వణికిపోతుంటాయి. శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ కాలనీలు ముంపునకు గురికావాల్సి వస్తోంది. కచ్చా డ్రైనేజీలు నిర్మించి తాత్కాలిక పనులు మాత్రమే బల్దియా చేపడుతోంది.నిధుల కొరత, సాంకేతిక సమస్యలు సాకుగూ చూపుతూ అధికారులు శాశ్వత పరిష్కారాన్ని పక్కనబెడుతున్నారనేది ప్రధాన విమర్శ.

ఆకేరు పొంగితే రాకపోకలు ఆగుడే..
లోలెవల్ బ్రిడ్జి మూలాన వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు కొన్ని రోజుల పాటు రాకపోకలు స్తంభిస్తాయి. తొర్రూరు కేంద్రం నుండి నెల్లికుదురు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ ప్రాంతాలకు ఈ రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. దశాబ్దాలకాలంగా ఈ సమస్య ప్రతీ వర్షాకాలంలో తలెత్తుతున్నా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే నెల్లికుదురు మండలం మదనతుర్తి శివారులోని మొండివాగు సైతం రోడ్డుపైనే ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీని కారణంగా నెల్లికు దురు నుండి మహబూబాబాద్ వైపు ఎవరు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల నూతనంగా బీటి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ హైలెవల్ బ్రిడ్జిని మాత్రం నిర్మించలేదు. దీంతో ఈ రెండు రహదారులపై నెలకొన్న సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

Take By: T News

Read more...

ఇప్పుడు వీస్తున్నది.. తెలంగాణ గాలి



- విడిపోవడంపై అంచనాకొచ్చిన సీమాంధ్ర నేతలు
- అక్కడా ఇక్కడా బతకాలంటే.. తెలంగాణే మార్గం!
- జగన్ జోరును అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
- రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో నెట్టుకురావచ్చు
- ఉప ఫలితాలతో మెట్టు దిగుతున్న సీమ నేతలు
- జూలైలో ఉద్యమానికి రెడీ అవుతున్న తెలంగాణ
అవును.. 

ఇప్పుడు తెలంగాణ గాలి వీస్తున్నది! ఉద్యమక్షిశేణుల్లోనే కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దల్లోనూ..! ఒక టీజీ వెంక ఒక ఏరాసు ప్రతాప్‌డ్డి.. ఒక బొత్స సత్యనారాయణ.. ఇవి ఇంకా తొలి స్వరాలే! రాష్ట్ర విభజనకు వ్యతిరేకత నుంచి.. మా హక్కులు దక్కితే చాలు అన్నంత స్థితికి.. అక్కడి నుంచి.. 

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరనే ఆందోళనను వ్యక్తం చేసే స్థాయికి పడిపోయిన నేతల మాటల తీవ్రత! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుని.. 2014 ఎన్నికల్లో అందివస్తే అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన! ఉప ఎన్నికల్లో సమైక్యవాదం విలువలేకుండా పోయిన వేళ.. సీమాంవూధలో భవిష్యత్ కళ్లకు కడుతుండగా.. కనీసం తెలంగాణలోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం! తెలంగాణలో బట్టకడితే.. సీమాంవూధలోనూ ఏదో విధంగా బతికేద్దామని ఆశ! అందుకు ఉన్న ఏకైక ఆస్కారం.. తెలంగాణపై ‘నిర్ణయం’! అందుకే మారుతున్న స్వరం!!

హైదరాబాద్ జూన్ 19 () : ఇక తెలంగాణ నిర్ణయాత్మక దశకు చేరుకుందా? రాష్ట్రపతి ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ తీసుకోబోయే ప్రధాన విధానపరమైన నిర్ణయాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతున్నదా? తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాటలను కేంద్రం పక్కనపెట్టబోతున్నదా? అవుననే అంటున్నారు.. సాక్షాత్తూ సీమాంధ్ర నేతలు! పరకాల ఉప ఎన్నిక ఫలితం ఆసరాగా మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఆశించిన కేసీఆర్ మాటలు.. నిజమవుతాయని భావించే విధంగా ప్రస్తుత సీమాంధ్ర నేతల మాటలు వినిపిస్తున్నాయి! ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమైక్యవాదం ఆత్మరక్షణలో పడిపోయింది! సీమాంధ్ర నియోజకవర్గాల్లో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయమన్న నేతలు.. జనం తమ వాదనను వినిపించుకోకపోవడాన్ని గుర్తించినట్లున్నారు.

ఉప ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిళ్లు తెచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఇక్కడ సీమాంవూధలో కాంగ్రెస్ ఖతం అవుతుందని హెచ్చరించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేతల తీరూ మారింది. తెలంగాణ ఇస్తారేమోనన్న భయం వేస్తోందనే స్థాయిలో సీమాంధ్ర నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇస్తే ఇచ్చారు.. కనీసం మా హక్కులనైనా కాపాడండి అని అదే నేతలు వేడుకుంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం సీమాంవూధలో పోటీ చేసిన 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 2చోట్ల గెలిచి 7చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలో పోటీ చేసిన ఒక్క స్థానంలో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది. ‘2014లో ప్రధాని రేసులో రాహుల్‌గాంధీ ఉంటారని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ గత రెండు సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలనిచ్చిన ఏపీపై ఆశ పెట్టుకుంది. కానీ.. సీమాంవూధలో నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది తెలంగాణే. ఇక్కడ ఆశలు ఇంకా సజీవం.

ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణపైనే. సీమాంవూధలో పార్టీకి భవిష్యత్తు లేదని, చిరంజీవి వచ్చినా చిరు ప్రయోజనం కూడా లేదని తెలిపోవడంతో అధిష్ఠానం తెలంగాణపై నాన్చడం ఆపేసి, తేల్చడం ఎంచుకుంది’ అని సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తేల్చే మొట్టమొదటి అంశం తెలంగాణేనని అక్కడినుంచి తెలంగాణ నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఒకవేళ తేల్చితే తమతో మాట్లాడిన తరువాతే తేల్చాలని, తమ డిమాండ్లు, వాటాలు తేల్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాళ్లబేరానికి వస్తున్నారు. రాయలసీమ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌డ్డి ఢిల్లీ పెద్దలను కలిసి సందర్భంలో వారికి అధిష్ఠానం నుంచి పలు ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. ‘మీ మాటలు నమ్మి నష్టపోయింది చాలు’ అంటూ తలంటుపోసినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమాధానం చెప్పుకోలేకపోయారని తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు ఖాయమంటూ టీజీ, ఏరాసు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివేనని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పరకాల విజయం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సైతం తమ గొంతు వినిపిస్తూ.. సీమాంధ్ర నేతల వాదనలు వారి ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీలాపడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే చేపట్టే అంశాలేవీ లేవని, చాలా కాలంగా పెడింగ్‌లోఉన్న తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ నేతలకు సర్దిచెబుతున్నారు. ‘ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరో మూడు నెలలు ఆగాలనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్రం ఇస్తామన్నట్లుగా మా ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ తేల్చకుంటే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేసింది. అందుకే రాష్ట్రం ఇచ్చే విషయంలో మాకు సంకేతాలు పంపుతోంది’ అని తెలంగాణనేత ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. జైల్లో ఉన్న జగన్‌ను వెళ్లి కలిశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్దతివ్వాలని హైకమాండ్ అభ్యర్థన మేరకే ఆయన జగన్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్న తరుణంలో నెలాఖరు తరువాత తెలంగాణ వేడి గల్లీ నుండి ఢిల్లీకి తాకుతుందని, అప్పుడు రాష్ట్రం ఇవ్వడం తథ్యమనే సంకేతాలను తెలంగాణ నేతలిస్తున్నారు.

సీమాంధ్ర నేతల్లో జగన్ గుబులు

సీమాంధ్ర నేతల స్వరం మారడం వెనుక జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ ఇటీవలి ఘన విజయాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల నాటికి సీమాంవూధలో సైతం అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి దాపురించే ప్రమాదం కనిపిస్తుండడంతో పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. దీంతో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలకడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పునరుజీవ్జవం తథ్యమని ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చాక సీమాంవూధలో ఏదో ఒకటి చేసి నెట్టుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణకు బదులు రాయల తెలంగాణను ముందుకు తెస్తున్నారు.

ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆఖరి ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమలో జగన్ జోరును కడప, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేయడం ద్వారా సంఖ్యాబలం విషయంలో ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలమనే అభివూపాయం వారి మాటల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, మరో మాజీ మంత్రి, కొందరు సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైన పక్షంలో అనంతపురం, కర్నూలు.. ఈ రెండు జిల్లాలు కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్ర నేతల్లో సైతం అత్యధికులు రాష్ట్ర విభజనకే తలూపే పరిస్థితి కనిపిస్తోంది.

ఉత్తరాంవూధతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత వరకు కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటు చేసినా, రాయల తెలంగాణ ఇచ్చినా ఆంధ్రాలో కొంత వరకు పార్టీని బతికించుకోవచ్చని వారు అభివూపాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజావూపతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తే అక్కడ, ఇక్కడ పార్టీ ఉంటుందన్న నమ్మకం, ధీమా వారిలో కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించేందుకు వారు సమయాత్తమవుతున్నట్లు సమాచారం.

Read more...

Tuesday, June 19, 2012

ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా!


ఒక్క ఏజెంట్‌కూ లైసెన్సు లేదు
రెండేళ్లుగా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు
హైదరాబాద్, జూన్ 18 ():డ్రైవింగ్ లైసెన్సు లేదని చలాన్ రాస్తారు. లైసెన్సు ఉన్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ దగ్గర లేదంటూ జరిమానా విధిస్తారు. ఇవన్నీ ఉంటే పొల్యూషన్ సర్టిఫికెట్ ఏదీ? హెల్మెట్ ఎక్కడ? అంటూ నిలదీస్తారు. దబాయిస్తారు.

 ఇవన్నీ.. అంత ప్రమాదకరం కాని ద్విచక్షికవాహనదారుల విషయంలో కనిపించే దృశ్యాలు. మరి.. ప్రాణాంతక నిర్లక్ష్యం ప్రదర్శించే ‘ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా’ గురించి అధికార గణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే ఏయే చర్యలు చేపడుతోంది? నిజంతెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే. షిర్డీ వెళ్లే బస్సు రోడ్డుప్రమాదానికి గురై 32 మంది దుర్మరణం చెందడంతో, రవాణాశాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో సుమారు 600 వరకు ట్రావెల్ ఏజెంట్లు ఉన్నారు. వీరికి సంబంధించి 1215 ప్రైవేటు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరుగుతున్నాయి.

వాస్తవానికి ప్రైవేటు బస్సు రోడ్డుపై నడుపుకోవాలంటే ముందుగా టికెట్ బుకింగ్ చేసుకునేందుకు రవాణాశాఖ నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర లేదా అంతర్‌రాష్ట్ర పర్మిట్ తీసుకోవడం, మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించడం వంటివి ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఒక్క ట్రావెల్ ఏజెంట్‌కూ లైసెన్సు లేదు. కొందరి లైసెన్సుల కాలపరిమితి 2007లో, మరికొందరివి 2009లో ముగిసిపోయింది. ఇప్పటివరకు ఒక్కరూ రెన్యువల్ చేయించుకోలేదు. సోమవారం జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూడటంతో రవాణాశాఖాధికారులు కంగుతిన్నారు. లైసెన్సు లేకపోయినా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయంటే అందుకు మొదట బాధ్యత వహించాల్సింది రవాణాశాఖే.

అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనధికార ఆదేశాలు ఉండటంతో, రవాణాశాఖ అధికారులు ఎవ్వరూ వాటి గురించి ఆరా తీసే ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం. లైసెన్సు లేని ఏజెంట్లు టికెట్లు విక్రయించకూడదు, బస్సులు తిప్పకూడదు. కానీ రెండేళ్లుగా ట్రావెల్స్.. మాఫియా స్థాయిలో నిబంధనలు గాలికి వదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విషయమై రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరిని ‘టీ మీడియా’ ప్రశ్నించగా 2009 దాకా ఏడాదికి 2500 కేసుల వరకు రాసేవారమని, అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం నుంచి అనధికార ఆదేశాలు రావడంతో రెండేళ్లుగా వాటి జోలికి వెళ్లడం లేదన్నారు.

సవాలక్ష నిబంధనలు.. ఖాతరు చేసేదెవరు?
వాస్తవానికి వాహనాలు, ప్రయాణానికి సంబంధించి నిబంధనలు బోలెడున్నాయి. పట్టించుకునేవారే లేరు. ప్రైవేటు బస్సులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నా పట్టించుకుని శిక్షించేవారు కరువయ్యారు. లైసెన్సు సమయంలో కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి తీసుకుంటారు. ఒకచోట నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అక్కడే ఆగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్‌గా కాకుండా స్టేజీ క్యారియర్‌గా తిరుగుతున్నాయి. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.

ఈ విషయం రవాణాఅధికారులకు తెలిసినా, పైస్థాయిలో ఒత్తిడి ఉండటంతో చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. కాంట్రాక్టు క్యారియర్ అనుమతి ఉన్న బస్సుల్లో తప్పనిసరిగా ప్రయాణికుల వివరాలు ఉండాలనే నిబంధన కూడా అమలుకావడం లేదు. ఈ నిబంధన అమలుకాకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారి వివరాలు తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదాహరణకు మొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో రవాణా అధికారులు ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్‌చేసి వివరాలు అడిగితే, తమ వద్ద వివరాలు ఏమీలేవని జవాబు వచ్చింది.

 హైదరాబాద్ నగరంలో 40మంది బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ అయ్యాయని తెలియడంతో, 44 మంది ప్రయాణికుల వివరాల కోసం నాలుగుగంటలపాటు శ్రమించి 40 మంది ఏజెంట్లను వాకబు చేసి అందుబాటులో ఉన్న వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించగలిగామని రవాణాశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ‘టీ మీడియా’తో చెప్పారు.

 ఆర్టీసీ బస్సులు స్టేజీ క్యారియర్ల కిందకు వస్తాయని, వాటిల్లో కూడా రిజర్వేషన్ చేయించుకునేవారి జాబితా ఉండే విధంగా ప్రయత్నిస్తామని రవాణా శాఖాధికారి ఒకరు చెప్పారు.

డ్రైవర్లకు పరీక్షలు, విశ్రాంతి మాటేమిటి?

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్లుగా నడపాలంటే వాల్వో బస్సుకు మూడు నెలలకు రూ.1.40 లక్షలు, హైటెక్ బస్సులకు మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష చొప్పున చెల్లించాలి. అలా ప్రతి సంవత్సరానికి నాలుగుసార్లు పన్ను చెల్లించాలి. పర్మిట్ కోసం అంతపూరాష్ట్ర బస్సులకు సీటుకు రూ.3675, రాష్ట్ర సర్వీసులకు రూ.2625 చొప్పున చెల్లించాలి. రెండేళ్ల నుంచి లైసెన్సులు రెన్యువల్ చేసుకోకపోవడంతో, కేవలం పర్మిట్లు మాత్రమే కట్టి బస్సులు తిప్పుకుంటున్నారు. ఫలితంగా పన్ను రూపేణా ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లలో నష్టం వాటిల్లుతోంది. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదు.

 ప్రభుత్వరంగ సంస్థ అయినప్పటికీ ఆర్టీసీ నుంచి సకాలంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు బస్సులపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇందులో ఆంతర్యం అధికారులకు, ప్రభుత్వానికే తెలుసు! లైసెన్సుల జోలికి వెళ్లని రవాణాశాఖ కేవలం వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూన్సులు ఉన్నాయో లేదో చూసి ఊరుకుంటోంది. గత కొంతకాలం నుంచి అదీ లేదు. అయితే ప్రైవేటు బస్సుల్లో చాలావరకు కొత్త బస్సులే కావడంతో ఫిట్‌నెస్ సమస్య పెద్దగా ఎదురుకావడం లేదు.

 కొన్ని బస్సుల యాజమాన్యాలు ఒకే పర్మిట్ రెండు, మూడు బస్సులు తిప్పడం, లేదా ఒకే నంబర్‌తో రెండు బస్సులు నడపడం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనదారులకు, కార్లలో ప్రయాణించేవారికి మద్యం తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు జరుపుతున్నారు. కానీ ఒక్క బస్సు డ్రైవర్‌ను కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. కనీసం ఆ ఆలోచన కూడా అటు పోలీసుశాఖకుగానీ ఇటు రవాణా అధికారులకు గానీ ఎందుకు తలెత్తడం లేదో! బస్సులో ప్రయాణికుల ప్రాణాలు బస్సు నడిపే డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయి.

 బస్సు డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. తగినంత విశ్రాంతినివ్వాలి. కానీ మెజార్టీ యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు షిర్డీ బస్సు ప్రమాద ఘటనతో కాస్త హడావిడి చేస్తున్న ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటుందో, కంటి తుడుపు చర్యలతో సరిపెడుతుందో చూడాలి.

Take By : T News

Read more...

Thursday, December 30, 2010

SMS for Telangana

Welcome to Customer Care

Meeku "Karimnagar Kavalante 1 Nokkandi
Meeku "Hyderabad Kavalante 2 Nokkandi
Meeku "WArangal Kavalante 3 Nokkandi

Total TELANGANA Kavanlante SimaAndrola Peeka Nokkandi

Jai Telangana
Jai Jai TElangana



Free Send SMS Any Time - Any Were India or World (Any Country) and Earn money






Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP