Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Pranab Mukherjee. Show all posts
Showing posts with label Pranab Mukherjee. Show all posts

Monday, July 2, 2012

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా -ప్రణబ్‌


నేనిప్పుడు కాంగ్రెస్ వ్యక్తిని కాదు.. అందరివాడిని
- రాష్ట్రపతి ఎన్నికలో ‘అద్భుతం’పై విశ్వాసం లేదు
- మజ్లిస్ నేతలు మా మిత్రులు.. వారిని సంప్రతిస్తా
- పదవికే వన్నె తెచ్చిన దక్షిణాది రాష్ట్రపతులు
- వారి అడుగు జాడల్లోనే నడుస్తా
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- అనంతరం విలేకరులతో భేటీ
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం
- ఆయన దృష్టిలో పడేందుకు నేతల తంటాలు
- దానం, బండ చంద్రాడ్డి మధ్య వాగ్వాదం
ప్రణబ్‌కు తప్పని తెలంగాణ సెగ ఓయూలో దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్, జూలై 1( రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరికీ మద్దతునివ్వని పార్టీలు తనకు మద్దతు ప్రకటించి, గెలిపించాలని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు మిగతా పార్టీలు కూడా తనకు మద్దతు తెలియజేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఎన్‌డీయే అభ్యర్థి పీఏ సంగ్మా చేసిన వ్యాఖ్యలపై ప్రణబ్ స్పందిస్తూ అలాంటి అద్భుతాలు జరుగుతాయని తాను విశ్వసించడం లేదని అన్నారు. ఆదివారం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా గతంలో తాను చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని ప్రణబ్ చెప్పారు. ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించేందుకు గతంలో తాను ఇక్కడికి వచ్చానని, ఇప్పుడు ఆ పాలసీల గురించి చెప్పలేనని అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాడని, పార్టీ, ప్రభుత్వ విధానాల గురించి తాను ఇప్పుడు మాట్లాడలేనని ఆయన స్పష్టంచేశారు. అయితే కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా తన వద్దకు వస్తే వాటిపై మాత్రం మాట్లాడగలనని ఆయన చెప్పారు.

ఈ నెల 15 వరకు ప్రచారం
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజ్ జాబితాలోని సభ్యులను కలిసేందుకు తాను శనివారం చెన్నై నుంచి తన ప్రచారం ప్రారంభించానని ప్రణబ్ తెలిపారు. అయితే దీన్ని తాను ప్రచారం అనుకోవడం లేదని అన్నారు. ఆంధ్రవూపదేశ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. తన ప్రచారం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తనకు మద్దతు ఇస్తున్న ఎలక్షిక్టోరల్ జాబితా సభ్యులను కలువనున్నట్లు ఆయన తెలిపారు. మజ్లిస్ నేతలను కలుస్తారా? అన్న ప్రశ్నకు వాళ్లు మా మిత్రులు, వాళ్ళతో కూడా సంప్రతింపులు జరుపుతానని ప్రణబ్ స్పష్టంచేశారు. మద్దతు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రంలోని టీఆర్‌స్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ అధ్యక్షులను కూడా కలుస్తారా? అని అడిగితే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయమై పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదని, పైగా తాను ఎలక్షిక్టోరల్ జాబితాలోని సభ్యులతో మాత్రమే మాట్లాడుతానని ఆయన చెప్పారు.


రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఆయా పార్టీలే నిర్ణయం తీసుకుంటాయని, ఈ సంప్రదాయం 1952 నుంచి వస్తున్నదని ఆయన తెలియజేస్తూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇంకా తనకు మద్దతు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోలేదని అన్నారు. యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు యూపీయేతర పార్టీలు, అధికార కూటమికి వ్యతిరేక పార్టీలు ఇంకా మద్దతు విషయంలో తమ తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.

సమన్వయపర్చేందుకు వచ్చా: ఆజాద్
అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలకు తాను పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నందునే పార్టీ సభ్యులను సమన్వయపర్చేందుకు ప్రణబ్‌తోకలిసి వచ్చినటు తెలిపారు.

కాంగ్రెస్‌లో ప్రతిభకు కొదవ లేదు: ప్రణబ్
బెంగళూరు: రాష్ట్రపతి పదవికి పోటీచేస్తూ.. తాను రాజకీయాల నుంచి తప్పుకోనుండటంవల్ల సంక్షోభ పరిష్కార విషయంలో అధికార యూపీఏ సర్కారుకు ఎలాంటి సమస్యా రాబోదని రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మెరుగైన ప్రతిభావంతులకు కొదవ లేదని, తన స్థానాన్ని వారు భర్తీ చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రజావూపతినిధులతో ఆయన ఆదివారమిక్కడ భేటీ అయ్యారు.

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా: ప్రణబ్
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం

రాష్ట్రపతి ఎన్నికలో తనని గెలిపిస్తే.. ఆ పదవికి వన్నె తెస్తానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో సంక్షోభ పరిష్కర్తగా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 46 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి, గౌరవాన్ని పొందినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యుడిగా కాకుండా రాష్ట్రపతి అభ్యర్థిగా నగరానికి వచ్చినట్లు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చెప్పారు. గతంలో తాను పార్టీ ప్రతినిధిగా ఇక్కడ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చేవాడినని, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు కోసం మీ ముందుకు వచ్చానని ప్రణబ్ అన్నారు.

తాను ఇప్పుడు పార్టీ వ్యక్తిని కాదని, అందరి మనిషినని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న ప్రణబ్, గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఆదివారం ఉదయం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్షం(సీఎల్పీ) సమావేశంలో పాల్గొన్నారు. తనను గెలిపించాలని ఆయన సీఎల్పీ సభ్యులను కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన సుమారు గంటకుపైగా జూబ్లీహాల్‌లో ఉండి సీఎల్పీ సభ్యులను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా ఆయన కోరారు. ఈ సందర్భంగా సీఎల్పీని ఉద్దేశించి 25 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కువసేపు భారత రాజ్యాంగం, విధానాల గురించే మాట్లాడటం గమనార్హం.

దక్షిణాది నుంచి నీలం సంజీవడ్డి, ఆర్ వెంకవూటామన్, వీవీ గిరి, రాజగోపాలచారి, సర్వేపల్లి రాధకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం.. ఇలా ఎంతోమంది రాష్ట్రపతులుగా పనిచేశారని, వీరంతా ఉన్నత సంప్రదాయాలు, పద్ధతులను పాటిస్తూ ఆ పదవికి, దేశానికి ఎంతో మంచిపేరు తీసుకొచ్చారని వివరించారు. వారి అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని ప్రణబ్ దక్షిణాది సెంటిమెంట్‌తో సభ్యుల మనసు దోచే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎన్నుకున్నందుకు యూపీఏకు, మరీ ముఖ్యంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. యూపీయేతర పార్టీలు కూడా తనకు మద్దతు ఇస్తున్నందుకు ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అలాంటి పార్టీలు కూడా తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని మద్దతు పలకాలని ఆయన తృణముల్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు ఎంతో కీలకమైనవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం కిరణ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఓటు వేసి గెలిపించాలని సీఎల్పీ సభ్యులను కోరారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్షికమానికి అధ్యక్షత వహించగా, శాసన సభ వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో యూపీఏ ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు.

Take By: T News

Read more...

Saturday, June 23, 2012

ఇప్పుడు వీస్తున్నది.. తెలంగాణ గాలి



- విడిపోవడంపై అంచనాకొచ్చిన సీమాంధ్ర నేతలు
- అక్కడా ఇక్కడా బతకాలంటే.. తెలంగాణే మార్గం!
- జగన్ జోరును అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
- రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో నెట్టుకురావచ్చు
- ఉప ఫలితాలతో మెట్టు దిగుతున్న సీమ నేతలు
- జూలైలో ఉద్యమానికి రెడీ అవుతున్న తెలంగాణ
అవును.. 

ఇప్పుడు తెలంగాణ గాలి వీస్తున్నది! ఉద్యమక్షిశేణుల్లోనే కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దల్లోనూ..! ఒక టీజీ వెంక ఒక ఏరాసు ప్రతాప్‌డ్డి.. ఒక బొత్స సత్యనారాయణ.. ఇవి ఇంకా తొలి స్వరాలే! రాష్ట్ర విభజనకు వ్యతిరేకత నుంచి.. మా హక్కులు దక్కితే చాలు అన్నంత స్థితికి.. అక్కడి నుంచి.. 

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరనే ఆందోళనను వ్యక్తం చేసే స్థాయికి పడిపోయిన నేతల మాటల తీవ్రత! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుని.. 2014 ఎన్నికల్లో అందివస్తే అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన! ఉప ఎన్నికల్లో సమైక్యవాదం విలువలేకుండా పోయిన వేళ.. సీమాంవూధలో భవిష్యత్ కళ్లకు కడుతుండగా.. కనీసం తెలంగాణలోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం! తెలంగాణలో బట్టకడితే.. సీమాంవూధలోనూ ఏదో విధంగా బతికేద్దామని ఆశ! అందుకు ఉన్న ఏకైక ఆస్కారం.. తెలంగాణపై ‘నిర్ణయం’! అందుకే మారుతున్న స్వరం!!

హైదరాబాద్ జూన్ 19 () : ఇక తెలంగాణ నిర్ణయాత్మక దశకు చేరుకుందా? రాష్ట్రపతి ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ తీసుకోబోయే ప్రధాన విధానపరమైన నిర్ణయాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతున్నదా? తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాటలను కేంద్రం పక్కనపెట్టబోతున్నదా? అవుననే అంటున్నారు.. సాక్షాత్తూ సీమాంధ్ర నేతలు! పరకాల ఉప ఎన్నిక ఫలితం ఆసరాగా మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఆశించిన కేసీఆర్ మాటలు.. నిజమవుతాయని భావించే విధంగా ప్రస్తుత సీమాంధ్ర నేతల మాటలు వినిపిస్తున్నాయి! ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమైక్యవాదం ఆత్మరక్షణలో పడిపోయింది! సీమాంధ్ర నియోజకవర్గాల్లో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయమన్న నేతలు.. జనం తమ వాదనను వినిపించుకోకపోవడాన్ని గుర్తించినట్లున్నారు.

ఉప ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిళ్లు తెచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఇక్కడ సీమాంవూధలో కాంగ్రెస్ ఖతం అవుతుందని హెచ్చరించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేతల తీరూ మారింది. తెలంగాణ ఇస్తారేమోనన్న భయం వేస్తోందనే స్థాయిలో సీమాంధ్ర నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇస్తే ఇచ్చారు.. కనీసం మా హక్కులనైనా కాపాడండి అని అదే నేతలు వేడుకుంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం సీమాంవూధలో పోటీ చేసిన 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 2చోట్ల గెలిచి 7చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలో పోటీ చేసిన ఒక్క స్థానంలో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది. ‘2014లో ప్రధాని రేసులో రాహుల్‌గాంధీ ఉంటారని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ గత రెండు సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలనిచ్చిన ఏపీపై ఆశ పెట్టుకుంది. కానీ.. సీమాంవూధలో నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది తెలంగాణే. ఇక్కడ ఆశలు ఇంకా సజీవం.

ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణపైనే. సీమాంవూధలో పార్టీకి భవిష్యత్తు లేదని, చిరంజీవి వచ్చినా చిరు ప్రయోజనం కూడా లేదని తెలిపోవడంతో అధిష్ఠానం తెలంగాణపై నాన్చడం ఆపేసి, తేల్చడం ఎంచుకుంది’ అని సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తేల్చే మొట్టమొదటి అంశం తెలంగాణేనని అక్కడినుంచి తెలంగాణ నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఒకవేళ తేల్చితే తమతో మాట్లాడిన తరువాతే తేల్చాలని, తమ డిమాండ్లు, వాటాలు తేల్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాళ్లబేరానికి వస్తున్నారు. రాయలసీమ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌డ్డి ఢిల్లీ పెద్దలను కలిసి సందర్భంలో వారికి అధిష్ఠానం నుంచి పలు ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. ‘మీ మాటలు నమ్మి నష్టపోయింది చాలు’ అంటూ తలంటుపోసినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమాధానం చెప్పుకోలేకపోయారని తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు ఖాయమంటూ టీజీ, ఏరాసు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివేనని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పరకాల విజయం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సైతం తమ గొంతు వినిపిస్తూ.. సీమాంధ్ర నేతల వాదనలు వారి ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీలాపడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే చేపట్టే అంశాలేవీ లేవని, చాలా కాలంగా పెడింగ్‌లోఉన్న తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ నేతలకు సర్దిచెబుతున్నారు. ‘ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరో మూడు నెలలు ఆగాలనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్రం ఇస్తామన్నట్లుగా మా ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ తేల్చకుంటే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేసింది. అందుకే రాష్ట్రం ఇచ్చే విషయంలో మాకు సంకేతాలు పంపుతోంది’ అని తెలంగాణనేత ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. జైల్లో ఉన్న జగన్‌ను వెళ్లి కలిశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్దతివ్వాలని హైకమాండ్ అభ్యర్థన మేరకే ఆయన జగన్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్న తరుణంలో నెలాఖరు తరువాత తెలంగాణ వేడి గల్లీ నుండి ఢిల్లీకి తాకుతుందని, అప్పుడు రాష్ట్రం ఇవ్వడం తథ్యమనే సంకేతాలను తెలంగాణ నేతలిస్తున్నారు.

సీమాంధ్ర నేతల్లో జగన్ గుబులు

సీమాంధ్ర నేతల స్వరం మారడం వెనుక జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ ఇటీవలి ఘన విజయాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల నాటికి సీమాంవూధలో సైతం అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి దాపురించే ప్రమాదం కనిపిస్తుండడంతో పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. దీంతో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలకడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పునరుజీవ్జవం తథ్యమని ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చాక సీమాంవూధలో ఏదో ఒకటి చేసి నెట్టుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణకు బదులు రాయల తెలంగాణను ముందుకు తెస్తున్నారు.

ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆఖరి ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమలో జగన్ జోరును కడప, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేయడం ద్వారా సంఖ్యాబలం విషయంలో ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలమనే అభివూపాయం వారి మాటల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, మరో మాజీ మంత్రి, కొందరు సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైన పక్షంలో అనంతపురం, కర్నూలు.. ఈ రెండు జిల్లాలు కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్ర నేతల్లో సైతం అత్యధికులు రాష్ట్ర విభజనకే తలూపే పరిస్థితి కనిపిస్తోంది.

ఉత్తరాంవూధతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత వరకు కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటు చేసినా, రాయల తెలంగాణ ఇచ్చినా ఆంధ్రాలో కొంత వరకు పార్టీని బతికించుకోవచ్చని వారు అభివూపాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజావూపతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తే అక్కడ, ఇక్కడ పార్టీ ఉంటుందన్న నమ్మకం, ధీమా వారిలో కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించేందుకు వారు సమయాత్తమవుతున్నట్లు సమాచారం.

Read more...

Monday, June 18, 2012

Kalam is people's president: Mamata


June 18:
Trinamool Congress chief Mamata Banerjee today described A P J Abdul Kalam as people's president and said she was hurt that he has decided not to contest the presidential elections.

"I have seen your statement that you are not contesting.

This news has hurt all of us deeply," she said in her latest Facebook post.
Describing Kalam as a 'people's president', she said that he had bridged the gap between high office and common people.

Take By: Sisat News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP