Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label AP TET. Show all posts
Showing posts with label AP TET. Show all posts

Saturday, October 20, 2012

టెట్, డియస్‌సిలకు వీడ్కోలు ‘టెస్ట్’ టాలెంట్ చాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (డియస్‌సి) రెండింటి స్థానంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదే టెస్ట్.

ఇదెలా ఉంటుంది? టెస్ట్ అంటే ఏమిటి?
టెస్ట్ అంటే టీచర్ ఎలిజబులిటీ, సెలక్షన్ టెస్ట్ - Teacher Elijibility & Selection Test-TEST. అంటే ఉపాధ్యాయ అర్హత, ఎంపిక పరీక్ష.

టెస్ట్ ఆలోచన ఎందుకు?
మన రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షగా టెట్ - టీచర్ ఎలిజబులిటీ టెస్ట్, ఉపాధ్యాయ ఎంపిక కోసం డిఎస్‌సి నిర్వహిస్తున్నారు. అప్పటికే డిప్లొమా ఇన్ పబ్లికేషన్స్, బి.ఇ.డి, లాంగ్వేజ్ పండిట్స్ పాసైన ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు రెండు పరీక్షలు నిర్వహించటం పట్ల తీవ్ర విమర్శలు రేగాయి. ఈ విధానం ఏ రాష్ట్రంలో లేదని ఏదో ఒక దానిని రద్దు చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. దీనితో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ రెండింటినీ కలిపి టెస్ట్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనినే విద్యామంత్రి డియస్‌సి ఫలితాల సమయంలో ప్రకటించారు.

ఏదో ఒక దానిని రద్దు చేయకుండా, రెండింటినీ కలపడమెందుకు?
2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ అర్హత నిర్ధారించేందుకు టెట్ పరీక్షను విధిగా నిర్వహించాలి. దీని నుంచి ఏ రాష్ట్రానికీ మినహాయింపు లేదు. ఇదేవిధంగా ఉపాధ్యాయ ఎంపికల కోసం గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వం డియస్‌సిలను నిర్వహించి దానిలో ఏ ఒక్కటి రద్దు చేసే అవకాశం లేక రెండింటినీ కలిపి టెస్ట్‌గా నిర్వహించాలని భావిస్తోంది.



టెస్ట్ మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది?
టెట్, డియస్‌సిలను కలిపి వేస్తున్నందుకు రెండు పరీక్షల్లో ఉన్న కామన్‌గా ఉంచే విభాగాలను తొలగించి నైతన స్వరూపంలో టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వ అభిమతం. అంటే ఒక పరీక్షలో ఉండే విభాగం మరొక పరీక్షలో ఉంటే దానిని తొలగిస్తారు. దీనివల్ల రిపిటీషన్ ఉండదు. డి.యస్.సి., బి.ఇ.డి.లు ప్రొపెషన్ కోర్సులు ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒకటి పాసై ఉపాధ్యాయ పోస్టు అభిలషిస్తున్న వారికి ఇలా రెండు పరీక్షలు నిర్వహించడం ఏ రాష్ట్రంలోనూ లేదు.

ఎలాంటి పరీక్ష రూపొందిస్తారు?
ఇటు డియస్సీ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలు, అటు టెట్ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలలో ఏవైతే రిపీట్ అవుతాయో వాటిని కొత్త టెస్ట్ పరీక్షలో తొలగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉదా॥ లాంగ్వేజీ అంశాలు, కంటెంట్ అంశాలు రెండు రకాల పరీక్షలలో రిపీట్ అవుతున్నాయి. అటువంటి సిలబస్‌లో ప్రశ్నలు తగ్గిస్తారు. అలాగే అటు డియస్సీ, ఇటు టెట్ పరీక్షలను కలుపుతున్న దృష్ట్యా రిపీటెడ్ సిలబస్ గురించే కాకుండా పరీక్ష సమయం, ప్రశ్నల సంఖ్య వంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తూ టెస్టు పరీక్షను సమగ్రంగా రూపొందించనున్నారు. టెట్ పరీక్ష స్ట్రక్చర్ అండ్ కంటెంట్‌ను ఎస్.సి.టి.ఇ. రూపొందించింది. కాబట్టి దానినే రాష్ట్రాలు పాటించాలి. అదే సమయంలో టెట్‌కు వెయిటేజీ 20 శాతం మార్కులు, డియస్సీ పరీక్షకు 80 శాతం ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.



3 గంటల పరీక్ష టెస్టు?
నూతనంగా రూపొందిస్తున్న టెస్టు పరీక్ష వ్యవధి 3 గంటలుగా ఖరారు చేసే ప్రతిపాదన లున్నాయి. డియస్‌సిలో 2.30 గంటలలో 160 ప్రశ్నలు అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉండేది. అదే టెట్ పరీక్షలో 2.30 గంటలలో 120 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంది. నూతన టెస్టులో 200 ప్రశ్నలకు 200 జవాబులను గుర్తించేలా పరీక్ష వ్యవధి 3 గంటలు నిర్ణయిస్తారని తెలుస్తోంది. టెస్టులో 200 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డియస్సీ పరీక్షకు 80 మార్కులు టెట్ పరీక్షకు 20 మార్కులు విధానం నిష్పత్తిలో కొత్త టెస్టు నిర్మాణంలో 70.:30 నిష్పత్తి లేదా 60:40 నిష్పత్తిలో ప్రశ్నలు ఇవ్వనున్నారనేది సమాచారం. మొత్తం మీద టెట్ కంటే డియస్సీ సిలబస్ నుంచే అధిక ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.

టెస్ట్ ఏర్పాట్లు మొదలయ్యాయా?
ఇంకా లేదు. మంత్రిగారు విధాన ప్రకటన చేశారుగానీ ఇప్పటి వరకు ఎటువంటి ... సన్నాహాలు ఆరంభం కాలేదు. .. కొత్త పరీక్ష విధానం, సిలబస్ రూపకల్పనకు పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీని నియమిస్తుంది. కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎన్.సి.ఇ.ఆర్.టి. సిలబస్‌లో మార్పులు చేర్పులు చేస్తుంది. అయితే ఇంతవరకు ఈ దశల్లో ఏదీ ఆరంభం కాలేదు.

మరి.. టెస్ట్ నోటిఫికేషన్‌ను ఎప్పటిలోగా ఆశించవచ్చు?
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామాలకు కట్టుబడి ఉంది కాబట్టి రాబోయే రెండు నెలల్లో ఈ దశలు పూర్తి చేసి ఆపై నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టెస్ట్-2013గా నోటిఫికేషన్ వెలువడవచ్చు. ఈ దశలు పూర్తి చేసేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పట్టదని అధికార వర్గాలు చెబు తున్నాయి.

Take BY: T News

Read more...

Monday, January 30, 2012

నేడు టెట్ ఫలితాలు and డీఎస్సీ నోటిఫికేషన్ నేడే (TET and DSC)

మధ్యాహ్నం 2:30కు వెల్లడించనున్న మంత్రి పార్థసారధి
హైదరాబాద్, జనవరి 29 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే పార్థసారధి సచివాలయంలో మధ్యాహ్నం రెండున్నరకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలను www.aptet.cgg.gov.in లో చూడొచ్చు.


డీఎస్సీ నోటిఫికేషన్ నేడే

- సుమారు 22,622 పోస్టులతో ప్రకటన
హైదరాబాద్, జనవరి 29 (): డీఎస్సీ-2012 నోటిఫికేషన్ సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 22, 622 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఇటీవల రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) 9569 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసింది. ఇన్ సర్వీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పదోన్నతులు కల్పించింది. ప్రమోషన్లతో భర్తీ చేసిన పోస్టుల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ పోస్టుల స్థానంలో డీఎస్సీలో నేరుగా ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుల సంఖ్య, వివరాలపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నానికల్లా జీవో వస్తే సాయంత్రం లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Take By: T News

Read more...

Tuesday, January 24, 2012

టెట్ రద్దు కోసం ఐక్య ఉద్యమాలు

నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని యువజన, విద్యార్థి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. టెట్ రద్దు, ఎస్జీటీలో బీఈడీ అభ్యర్థులకు అనుమతి, వయోపరిమితి వంటి అంశాలపై ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించాయి. ఈ నెల 31న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నాయి. సోమవారం ఏఐవైఎఫ్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేఎల్ గౌతంకుమార్, రాములు యాదవ్, ఎన్ లెనిన్‌బాబు, భాస్కర్, ఎం హన్మేశ్ పాల్గొన్నారు.

Take By: T News

Read more...

Wednesday, January 18, 2012

టెట్టా .. డీఎస్సీనా (TET / DSC)

- రెండింటిలో ఏదో ఒకటే.. అధ్యయనంపై ప్రభుత్వ యోచన
- మంత్రి పార్థసారధి వెల్లడి.. ఈ డీఎస్సీకి వర్తింపు డౌటే !
- టెట్‌పై అభ్యర్థుల్లో వ్యతిరేకత.. శాస్త్రీయత లేదంటూ ఆందోళన


హైదరాబాద్, జనవరి 17 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పై రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జాతీయ విద్యా, ఉపాధ్యాయ శిక్షణా మండలి మార్గదర్శకాల మేరకు టెట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. దేశ వ్యాప్తంగా లేని టెట్ రాష్ట్రంలో ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో ఏమాత్రం శాస్త్రీయత లేకుండా ప్రభుత్వ ఆలోచనలను బలవంతంగా రుద్దుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఎంపికకు అభ్యర్థుల వడపోతకు ప్రభుత్వం ఎలాగూ డీఎస్సీ నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలో టెట్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభ్యర్థుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా డీఎస్సీ, టెట్‌లలో ఏదో ఒక పరీక్ష నిర్వహించేలా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పి. పార్థసారధి తెలిపారు. అలా కాకుంటే ఈ రెండు పరీక్షలు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలా? అనేది అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే టెట్ రెండు సార్లు నిర్వహించారు. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు కూడా విద్యాశాఖ రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీకి టెట్ వర్తింపజేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం యోచన బాగానే ఉన్నప్పటికీ ఈ అధ్యయనం పూర్తి చేయటం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించే కొత్త డీఎస్సీకి ఇది వర్తించే అవకాశం కనిపించటం లేదు. డీఎస్సీ రాత పరీక్షకు అర్హతలు ఇప్పటికే విద్యాశాఖా ప్రకటించింది.

సివిల్స్‌స్థాయి ప్రమాణాలా..!
భారత సర్వీసులు, గ్రూప్-1 ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షా ప్రమాణాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపికకు పెట్టడంతో అభ్యర్థులు హడపూత్తి పోతున్నారు. సివిల్స్ ఎంపికకు డిగ్రీ కలిగి ఉండి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు మూడు అంచెలు దాటి వసే ్త అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపిక అవుతారు. ఉపాధ్యాయులకు సైతం ఇదే స్థాయిలో ఎంపిక ప్రక్రియ ఉంది. ప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, డీఎస్సీ మూడు అంచెలు దాటి రావాల్సి ఉంది. దీంతో అభ్యర్థులు సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ కావల్సిన పరిస్థితి నెలకొంది.

శాస్త్రీయత లేదు..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ కూడా శాస్త్రీయంగా లేదు. ఇందులో ప్రధానంగా భాషా పండితులు తెలుగు, హిందీ విషయాన్ని బోధిస్తారు. కానీ వీరికి టెట్ పరీక్షలో సోషల్ సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలడగటం ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇందులో సోషల్ సబ్జెక్టుకే అధిక మార్కులు ఉండటం గమనార్హం. సాధారణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలో సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. కానీ టెట్‌కు మాత్రం 60 శాతం మార్కులు సాధిస్తేనే డీఎస్సీకి అర్హత సాధించినట్లు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు సాధించాలని నిర్ణయించటం శాస్త్రీయంగా లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయుల ఎంపికకు ప్రభుత్వం టెట్ పరీక్ష ఐచ్చికంగా పెట్టుకుంటే బాగుండేది.

లేదా సాధారణ డిగ్రీ, పీజీ మాదిరిగానే 35 శాతం మార్కులు పెట్టి టెట్ పాసైతేనే డీఎస్సీకి అర్హులు అన్నా బాగుండేది. కానీ ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా టెట్ నిర్వహిస్తుండటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more...

Sunday, January 15, 2012

టెట్‌ను రద్దు చేయాలి : డీవైఎఫ్‌ఐ

-18,19 తేదిల్లో సదస్సులు : డీవైఎఫ్‌ఐ
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

టెట్‌ను నిరసిస్తూ ఈ నెల 18,19 తేదిల్లో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులను నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కే భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి తెలిపారు.

Read more...

Saturday, January 14, 2012

‘టెట్’ను తక్షణమే రద్దు చేయాలి

- జీఓ 7ను ఉపసంహరించుకోవాలి
- జీఓ 3ని యథాతథంగా అమలు చేయాలి
- ఎస్జీటీ పోస్టుల్లోనూ అవకాశం కల్పించాలి
- బీఈడీ విద్యార్థుల ధర్నా, రాస్తారోకో
- సచివాలయ ముట్టడికి యత్నం

13NGK04A-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
: ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఈడీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీకి హాజరవ్వాలంటే టెట్‌లో అర్హత సాధించాలనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టెట్‌ను పూర్తిగా రద్దుచేసి, ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులను బీఈడీ అర్హతతోనే నింపాలని కోరారు. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని, జీఓ 7ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలు పరిష్కారమయ్యేంత వరకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపివేయాలని కోరారు. ఆయా డిమాండ్లతో శుక్రవారం పలు జిల్లాల్లో బీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకో చేశారు. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్‌లో నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో టెట్‌ను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ధర్నాకు నాగం జనార్దన్‌డ్డి, సీపీఎం, జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. నాగం మాట్లాడుతూ ఏసీ గదుల్లో ఉండే ఎవరో ఒక అధికారి నిర్ణయా న్ని ప్రభుత్వం అమలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడు కుంటోందని దుయ్యబట్టారు. టెట్‌తో కొత్తగా జరిగే ప్రయోజనమేమీ లేదని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. గద్వాలలో మంత్రి డీకే అరుణకు నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్‌పై వినతిపత్రం ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా డీఎస్సీ రాసేందుకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

వెంపటి రాజేష్ అనే బీఈడీ విద్యార్థి గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్య గౌడ్ మాట్లాడుతూ టెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులన్నింటినీ నేరుగా రిక్రూట్ చేయాలని, ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అర్హుత గల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని వెంపటి రాజేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరులో టెట్‌ను రద్దు చేయాలంటూ బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో 7 రద్దు చేసి, జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఈడీ నిరుద్యోగులకు ఎస్‌జీటీలో అవకాశం ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

నిజామాబాద్ జిల్లా కామాడ్డిలో టెట్‌ను రద్దు చేయాలని విద్యావాలంటీర్లు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీలో అందరికీ అర్హత ఇవ్వాలని కోరుతూ మెదక్ జిల్లా సిద్దిపేట, చేగుంటలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చేగుంటలో హైదరాబాద్-మెదక్ రహదారి పై అభ్యర్థులు రాస్తారోకో చేపట్టి టెట్ జీవో ప్రతులను దహనం చేశారు. జీవో 7 రద్దు చేయాలని, పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపేయాలంటూ డిమాండ్ చేస్తూ బీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకారులు హైదరాబాద్‌లో సెక్ర ముట్టడికి విఫలయత్నం చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టెట్‌ను రద్దు చేయాలని రాష్ట్ర బీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అలవాల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.

Take By : T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP