Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Results. Show all posts
Showing posts with label Results. Show all posts

Sunday, March 17, 2013

X క్టాస్ సక్సెస్


Xclassవచ్చింది వంద శాతం రాయడానికి ఫైవ్ పాయింట్ ఫార్ములా!

టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే విద్యార్థులకు టెన్షన్, పేరెంట్స్ అటెన్షన్. చాలా మంది పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. కానీ ఎగ్జామ్స్‌పై అవగాహన, సరైన ప్రణాళిక లేక రావలసిన గ్రేడు కంటే తక్కువ గ్రేడు తెచ్చుకుంటారు. ఈ నిరాశను నివారించేందుకు వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించి అత్యుత్తమ ర్యాంకులు సాధించిపెట్టిన శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ పి.వి.ఆర్.కె.మూర్తి టర్నింగ్ పాయింట్ విజ్ఞప్తిపై మార్క్స్ స్కోరింగ్ స్టెప్స్ అందిస్తున్నారు.


విద్యార్ధినీ విద్యార్ధులు తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో టెన్త్‌క్లాసు పబ్లిక్ పరీక్షలను రాయబోతు న్నారు. ప్రతి విద్యార్ధికీ కెరీర్‌లో అత్యంత ముఖ్యమై నవి టెన్త్‌క్లాసు ఎగ్జామ్స్. పదవతరగతిని ఒకే విద్యా సంవత్సరంగా పరిగణిస్తున్నప్పటికీ, నిజానికి 9వ తరగతి చివరిలోనే టెన్త్ క్లాసు పాఠాలు ప్రారంభమై ఏడాదిన్నర కాలం విద్యార్ధితో సహవాసం చేస్తాయి. మరో ఐదు రోజుల్లో టెన్ల్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇప్పటివరకు నేర్చుకున్న దానిని వంద శాతం పరీక్షల్లో రాసేలా విద్యార్ధులు సిద్ధం కావాలి. ఇక ఇప్పుడు కొత్తగా పాఠాలు చదువవద్దు. కొత్తగా ఏదైనా లెసన్ దృష్టికి వచ్చినా, దానిని వదిలేసి ఇప్పటికే చదివినది పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం. పరీక్షల్లో తనకు వచ్చింది వందశాతం రాసేలా అభ్యర్ధులు సిద్ధం కావాలి.

1. గ్రేడింగ్‌పై అవగాహన 
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ‘నువ్వా? నేనా? డిస్ట్రిక్ టాపర్‌ను ఇక నేనే... స్కూల్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలవాలి’... అన్న ఉద్వేగం విద్యార్ధులను ఊపేసేది. దీనితో విద్యార్ధులు టెన్త్ పబ్లిక్ పరీక్షలను జీవన్మరణ సమస్యగా భావించి రాసేవారు. అయితే ప్రస్తుత గ్రేడింగ్ విధానం వల్ల విద్యార్ధులు అంతగా కష్టపడాల్సిన పనిలేదు. 600 మార్కులకు గాను 550 మార్కులు స్కోర్ చేసిన విద్యార్ధులు ఎవరైనా 10/10 గ్రేడింగ్‌తో టెన్త్‌క్లాసు ఉత్తీర్ణత సాధించినట్టే. ఇక ఇందులో తారతమ్యాలు లేవు. 10/10 గ్రేడ్ రావాలంటే కొన్ని సబ్జెక్టుల్లో సెంట్‌పర్సంట్ (100/100) స్కోర్ చేయాలనే నియమం లేదు. వివిధ సబ్జెక్ట్లు 92 నుంచి 100 లోపు ఎన్ని మార్కులు స్కోర్ చేసినా విద్యార్ధికి 10/10 గ్రేడ్ లభిస్తుంది. కాబట్టి బోర్డు నిర్దేశించిన మార్కుల వరకు అన్ని సబ్జెక్టుల్లో తెచ్చుకుంటే చాలు. కాబట్టి కొన్ని సబ్జెక్టులను మాత్రం ఫోకస్‌గా చదవాలనే పరిస్థితి గ్రేడింగ్‌తో తప్పించినట్టయిందని అభ్యర్ధులు గుర్తుంచుకోవాలి.

2. ప్రెజెంటేషన్ ప్రధానం 
ఏడాదిన్నరపాటు (9వ తరగతి చివరి నుంచి అనుకున్నాం కదా) విద్యార్ధి పరీక్ష రోజున రెండున్నర గంటల్లో జవాబుప్రతం (ఆన్సర్ షీట్) రాస్తాడు. ఎస్.ఎస్.సి బోర్డు రూపొందించిన వేల్యూ పాయింట్ల ఆధా రంగా వేల్యుయేటర్ స్పాట్ సెంటర్‌లో నాలుగైదు నిమిషాల సమయంలో దిద్ది మార్కులు వేసేస్తారు. అందుకే ఎంత చదివినా, ఎంత బాగా వచ్చినా వేల్యు యేటర్‌ను ఆకర్షించేలా జవాబులు రాయాలన్న విషయం మాత్రం విద్యార్ధి మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉండాలి. ప్రశ్నాపత్రం చేతిలోకి తీసుకోగానే మొదటి ప్రశ్నే కష్టంగా ఉంటే నీరుకారిపోకూడదు. ‘ఈ ప్రశ్న నాకే కాదు. అందరికీ కఠినమే’ అని మనసుకు సర్దిచెప్పుకొని మిగతా ప్రశ్నల్లో బాగా నచ్చిన దానిని ఎంచుకొని వేల్యూయేటర్‌ను మెప్పించేలా జవాబులు రాయాలి. తొలి జవాబు నుంచి ఆఖరి జవాబు రాసే వరకు ‘ప్రజంటేషన్ స్టైల్’ ఒకే ఒరవడిలో కొనసాగించినప్పుడే విద్యార్ధి కోరుకోకుండానే వేల్యూయేటర్ మంచి మార్కులు ఇస్తారు. ఆన్సర్ షీట్‌ను అంగుళం ఖాళీ లేకుండా నింపేయకుండా పేజీలో నలువైపులా కాసింత స్థలం ఇస్తూ మధ్యలో జవాబును రాసే ప్రయత్నం చేసినప్పుడే వేల్యూయేటర్‌ను ఆకర్షించ గలుగుతారు. అడిగిన మేరకే ప్రశ్నకు తగిన జవాబును రాయాలి. విద్యార్ధి తనకు ఎంతో విషయం తెలిసినప్పటికీ దానిని మొత్తం జవాబు రూపంలో గుమ్మరించేస్తే వేల్యూయేటర్‌ను గందరగోళ పరచినట్టుంటుంది. కాబట్టి ఎంత వరకు జవాబు రాయాలన్న జడ్జిమెంట్ విద్యార్ధికి ఉండాలి.

3. టైమ్ మేనేజ్‌మెంట్ 
పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ టైమ్ మేనేజ్ మెంట్ కీలకం అవుతుంది. ఎంతసేపు చదవాలి? ఎంతసేపు నిద్రపోవాలి? తమ తప్పు లేకుండా వృధా టైమ్‌పోవడాన్ని ఎలా నియంత్రించాలి? అన్న సందేహాలు విద్యార్ధులను వెన్నాడుతుంటాయి. ఈ విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు స్పష్టతలో ఉండాలి. ఒకే ఆలోచనతో ఉండాలి. మొత్తం 24 గంటల్లో 7 గంటలు నిద్రకు వదిలేయాలి. 3 గంటలు కాలకృత్యాలకు, ఇతర పనులకు వదిలేసి ఇక మిగిలిన 17 గంటలు చదువులోనే నిమగ్నం కావాలి. తెల్లవారుఝూమున లేచి చదవడమా? లేక రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండటమా? అన్నది విద్యార్ధి మనస్తత్వం, శరీర తత్వం బట్టి నిర్ణయించుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్లాన్ చేసుకొని చదివితే మంచిది. రెండున్నర గంటల పాటు చదివిన తర్వాత అరగంటసేపు రిలాక్స్ కావచ్చు. తర్వాత 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. లంచ్, రిలాక్స్ కోసం 2 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు సబ్జెక్టు ప్రిపరేషన్ చేయవచ్చు. టీ టైమ్‌కి సాయంత్రం 6 నుంచి అరగంట పాటు విద్యార్ధి ఫ్రీగా మళ్ళీ రిలాక్స్ కావచ్చు. చివరగా 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రిపరేషన్ పూర్తి చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని 10 గంటల కల్లా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు.

4. గ్రూప్ స్టడీ 
సమాన ప్రతిభ గల సహవిద్యార్ధులు కలిసి చదువుతామంటే సానుకూల ఫలితాలే వస్తుం టాయి. టెన్త్ క్లాస్ స్థాయిలో బృందాలుగా విద్యార్ధులు చదవటం తక్కువగా ఉంటుంది. మార్కుల రీత్యా టాపర్‌గా నిలవగలిగే విద్యార్ధి క్లాసులో యావరేజీ మార్కులు వచ్చే విద్యార్ధి ఇద్దరూ గ్రూప్ స్టడీ చేయటం సరికాదు. ఎప్పుడో వచ్చేసిన సబ్జెక్టును మళ్ళీమళ్ళీ చదవటం రుచించని టాపర్. కొన్ని అంశాలకే పరిమితమయ్యే యావరేజి విద్యార్ధికి పొంతన కుదరక గ్రూప్ స్టడీ ఇద్దరికీ నష్టంగా పరిణమిస్తుంది. ఇటువంటి సందర్భాలలో ఎవరికి వారే ఇండిపెండెంట్‌గా పరీక్షలు ప్రిపేర్ కావటం ఉత్తమమైనది. చదివే క్రమంలో ఏమైనా అనుమానాలుంటే టీచర్‌ను లేదా సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ను ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇంటిపట్టునే ఉంటూ పరీక్షలకు చదవాలి. ఉదా ॥ మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి సబ్జెక్టులలో టీచర్ పరీక్షల సమయంలో చెప్పిన దానికంటే విద్యార్ధి సొంతంగా ప్రాక్టీసు చేస్తేనే నిర్దేశిత అంశం సులువుగా అర్ధం అవుతుంది.

5. మితాహారం - ఆరోగ్యం
పరీక్షల సమయంలో ఫిజికల్ ఎక్సర్ సైజులు, వాకింగ్‌లు వంటివి విద్యార్ధులు చేయ రాదు. అవి చేస్తే శరీరం అలసిపోయి నిద్రవచ్చే ప్రమాదం ఉంది. ఉదయం లేవగానే పావుగంట, రాత్రి పడుకునే ముందు పావుగంట మెడిటేషన్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టెన్త్ క్లాసు పరీక్షలు బాగా రాయాలంటే విద్యార్ధులు మానసికంగా దృఢంగా ఉండాలి. మెడిటేషన్‌తో దానిని సాధ్యం చేసుకోవచ్చు. ఆహారం పరంగా ఎక్కువగా తీసుకోకుండా, మితమైన ఆహారం తీసుకునే ప్రయ త్నం చేయాలి. పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుంది. అంటే అన్నం తినటం మానేసి పూర్తిగా పండ్లు మాత్రమే తీసుకోవాలనేది కాదు. ఇతరత్రా ఆహారం మితంగా తీసుకొని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగటం విద్యార్ధులకు పరీక్షల దృష్ట్యా బాగుంటుందనేది తల్లిదండ్రులు మరువరాదు.

తల్లిదండ్రులూ ఇలా వ్యవహరించండి..
1. ‘చదువురా .. బాబు పరీక్షలు చదువు..’ అంటూ పిల్లలను పరుగులు పెట్టించరాదు.

2. అసలే విద్యార్ధులకు లోలోపల తెలియ కుండానే పరీక్షల వత్తిడి ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకొని వారి మనసును తేలికపరిచేలా విరామ సమయంలో వారిని ఆహ్లాదపరచేలా మాట్లాడాలి.

3. ఎట్టి పరిస్థితులలోను నువ్వు ఎన్ని మార్కులు సాధిస్తావు? ‘చూడు .. ఎదురింటి అబ్బాయి ఎంత బాగా చదువు తున్నాడో’ అంటూ పోలికలు తీసుకురావద్దు. 

4. పిల్లలలో ఆత్మ విశ్వాసం పెరిగేలా విజయగాథలు చెప్పండి. 

5. రిలాక్స్ అయ్యే క్రమంలో కాసేపు టివి చూస్తుంటే పరీక్షల్లో టివి ఏమిటంటూ ‘కసురుకోవద్దు. టైమ్ లిమిట్ పెట్టి అనుమతించండి. 

6. తల్లిదండ్రులు టివి చూసే బలహీనత ఉంటే పిల్లల పరీక్షల సమయం నియంత్రించుకోవాలి. వీలయితే పరీక్షల సమ యంలో టివి కట్టేసే ప్రయత్నం చేయండి. 

7. తొలి రోజు పరీక్షా కేంద్రానికి చేరడంలో జాప్యాన్ని నివారించేందుకు పరీక్ష సెంటర్ చిరునామా ఒక రోజు ముందు మీరు తెలుసుకుని సిద్ధంగా ఉండండి. 

8. అరగంట ముందు పరీక్ష సెంటర్‌కు విద్యార్ధి చేరుకునేలా ప్లాన్ చేయండి.

9. పరీక్షలు రాసిన రోజు మధ్యాహ్నం గంట లేదా రెండు గంటలు మీ అబ్బాయి, అమ్మాయి నిద్రపోయేలా చూడండి. అప్పుడు పరీక్ష రాసిన వత్తిడి తగ్గుతుంది. 

10. జరిగిన పరీక్ష గురించి ఎక్కువగా చర్చించవద్దు.

11. ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ బాల్ పాయింట్‌పెన్ను, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్, రబ్బరు, స్కేల్ వంటి స్టేషనరీ ఒక రోజు ముందే విద్యార్ధి రెడీ చేసుకునేలా సహకరించండి.

12. ఫంక్షన్లు, బంధువులు వంటి హంగామా విద్యార్ధులకు ప్రిపరేషన్‌లో ఏకాగ్రతను దూరం చేస్తాయి. కాబట్టి వాటిని పరీక్షల వరకు పుల్‌స్టాప్ పెట్టేలా కఠిన నిర్ణయం తీసుకోండి.

13. ప్రతిరోజూ ‘నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయగలవు’ అనే ప్రేరణ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పండి.

Read more...

Friday, June 29, 2012

బి.ఇడి సీటు చాలా హాటు!


బి.ఇడి ఎంట్రన్స్‌ను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు కౌన్సిలింగ్‌లో సీటు కోసం కుస్తీ పట్టవలసి ఉంటుంది. సోషల్ స్టడీస్‌లో, బయోలాజికల్ సైన్స్, మేథమేటిక్స్ గ్రూపుల్లో ప్రతి సీటుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీపడుతుంటే ఇక ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా, ఐ.ఎ.ఎస్.ఇ. , కాకతీయ కాంపస్‌లలో సీటు రావాలంటే ర్యాంకు ఎంత కనిష్టంగా వుంటే అంత సులువు అవుతుందని తెలిసిందే. 2011 కౌన్సిలింగ్ ముగింపు ర్యాంకుల ఆధారంగా విశ్లేషణ.

బి.ఇడి సోషల్ స్టడీస్ మెథడాలజీలో 19,500 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 59,605. ఇక బి.ఇడి మేథమేటిక్స్ మెథడాలజీలో 16,250 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 25,257. బయోలాజికల్ మెథడాలజీలో 13,000 సీట్లు వుండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 37,375. ఇక ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో 9,750 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 11,237, చివరగా బి.ఇడి ఇంగ్లీష్ మెథడాలజీలో 6,500 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 3193. బి.ఇడి సీట్లు, సంబంధిత బి.ఇడి మెథడాలజీ సీట్లు, ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను బట్టి చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ మినహాయిస్తే అన్ని మెథడాలజీలలో అందుబాటులో ఉన్న సీట్లకంటే అర్హత గల అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక గత ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,92, 389) కంటే, ఈ ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,36,667).

57 వేలు తగ్గినప్పటికీ నిర్థిష్ట మెథడాలజీలల్లో పోటీ కనిపించటం విశేషం. డియస్సీ రిక్రూట్‌మెంటులో ఎస్.జి.టి. పోస్టులకు బి.ఇడి. అభ్యర్థులను అనుమతించకపోవటంతో బి.ఇడి కోర్సుపై గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తక్కువ మోజు కనబరుస్తున్నారనేది తాజా ఎడ్‌సెట్ పోటీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా ఆయా మెథడాలజీ బి.ఇడి కోర్సుల సీట్లకంటే పోటీపడే అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించాల్సిన విషయమే.


 Drawe00 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


కేంపస్‌లో సీటు పొందాలంటే?
ఎడ్‌సెట్ పరీక్షలో బెస్ట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా కోరుకునేవి యూనివర్సిటీ బి.ఇడి కోర్సులనే. ఉన్నత విద్యకు, ఉత్తమ సదుపాయాలకు యూనివర్సిటీలే కేంద్రాలు. అందుకే ఇవి అఫర్ చేసే బి.ఇడి సీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. హాస్టల్ వసతి అదనపు ఆకర్షణగా అభ్యర్థులు కేంపస్ బి.ఇడిలకు మొగ్గు చూపుతుంటారు. గత ఏడాది జరిగిన ఉస్మానియా వర్సిటీ కేంపస్ కాలేజీ బి.ఇడి.అడ్మిషన్స్‌లో బి.ఇడి సీట్లు కైవసం చేసుకున్న టాప్ ర్యాంకర్ల వివరాలు పరిశీలిస్తే బి.ఇడి మ్యాథ్స్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ వుండగా, అలాగే ఫిజికల్ సైన్స్‌లో 26వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 1వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 16వ ర్యాంకర్, ఇంగ్లీష్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ అభ్యర్థులున్నారు.

అలాగే కాకతీయ యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి. కాలేజీలో సీట్లు సాధించిన ర్యాంకర్ అభ్యర్థులు బిఇడి మ్యాథమెటికల్ మెథడాలజీలో 367వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 86వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 14వ ర్యాంకర్, చివరగా ఇంగ్లీష్ మెథడాలజీ బి.ఇడిలో 26వ ర్యాంకర్ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇదే పంథాలో టాప్ 100 నుంచి 500 ర్యాంకుల మధ్యన గల ర్యాంకర్లు ఆయా యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి కాలేజీలలో సీట్లు పొందగలరు. ఉదాహరణకు బి.ఇడి. కేంపస్ సీట్లు ఇంకా ప్రైవేటు బి.ఇడి సీట్లు మొత్తం సంఖ్యలో 15శాతం సీట్లు యూనివర్సిటీయేతర అభ్యర్థులు మెరిట్ ర్యాంకుతో రాష్ట్రంలో ఎక్కడైనా బి.ఇడి. సీటును కోరుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో బి.ఇడి. సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ జిల్లాలు), ఆంధ్రా వర్సిటీ (కోస్తాంధ్ర జిల్లాలు), శ్రీవేంకటేశ్వర వర్సిటీలలో (రాయల సీమ జిల్లాలు) భర్తీ అవుతాయి.

 edcet0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


100 సీట్లు గల బి.ఇడిలో 85 సీట్లు స్థానికులకు రిజర్వ్ చేయగా 15 సీట్లు స్థానికులు లేదా స్థానికేతరులు ఎవరైనా మెరిట్‌తో ఎంపిక అవుతారు. సాధారణంగా కేంపస్ బి.ఇడి సీటు డిమాండ్ ఉస్మానియా వర్సిటీకి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడకు వచ్చి కోర్సు చేస్తే బహుముఖ అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయం అభ్యర్థుల్లో వుంది. దానితో ఉస్మానియా బి.ఇడి కోర్సు పట్ల ఇతర యూనివర్సిటీ అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. యూనివర్సిటీ కాలేజీ బి.ఇడి. అభ్యర్థులకు ప్రముఖ కార్పోరేట్ సంస్థలో ప్లేస్‌మెంట్స్ ఇస్తుండటంతో కేంపస్ కోర్సులకు డిమాండ్ ఉంటోంది.

ఐ.ఎ.ఎస్.ఇ అంటే క్రేజ్
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐ.ఎ.ఎస్. ఇ.) ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు అభ్యర్థుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఉదా॥ మాసాబ్‌ట్యాంకులోని ఐ.ఎ.ఎస్.ఇ. విద్యా సంస్థ 1959లో ఏర్పాటైన పురాతన కాలేజీగా ఖ్యాతి గడించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ బి.ఇడి. కాలేజీల్లో ఒకటైన కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు ర్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. పటిష్టమైన విద్యాబోధన అందించే సీనియర్ క్వాలిఫైడ్ లెక్చరర్లు ఐ.ఎ.ఎస్.ఇ.;సి.టి.ఇ.లలో ఉండటం, అత్యంత తక్కువగా ఫీజు చెల్లించి బి.ఇడి ని సొంతం చేసుకునే అవకాశం ఉంటున్న దృష్ట్యా ఇక్కడి బి.ఇడి కోర్సులకు డిమాండ్ ఉంటోంది.
మాసాబ్‌ట్యాంక్‌లోని ఐ.ఎ.ఎస్.ఇ.లో 2011 బి.ఇడి సీట్లు పొందిన టాప్ ర్యాంకర్లను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 46వ ర్యాంక్, ఫిజికల్ సైన్స్‌లో 208వ ర్యాంక్, బయోలాజికల్ సైన్స్‌లో 25వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 46వ ర్యాంకర్ చివరగా ఇంగ్లీష్ మెథడాలజీలో 30వ ర్యాంక్ అభ్యర్థులు అడ్మిషన్లు కైవసం చేసుకున్నారు.

 B.Ed0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


ప్రఖ్యాత బి.ఇడి. కాలేజీలు
రాష్ట్రంలో బి.ఇడి మొత్తం కాలేజీలు 605, ఇందులో మొత్తం సీట్లు 65వేలు ఉన్నాయి. ఫీజుల పరంగా సౌలభ్యం ఇతర సదుపాయాలపరంగా సౌకర్యం గల కేంపస్, గవర్నమెంట్ బి.ఇడి.కాలేజీల సంఖ్య పట్టుమని 15 మించడం లేదు. ఇందులో మొత్తం బి.ఇడి సీట్లు సంఖ్య 2వేలకు మించదు. పోటీకీ సమీపంలో గల ఎయిడెడ్ కాలేజీలలో ఫీజులు సాధారణంగానే ఉన్న దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు సదరు బి.ఇడి. కోర్సుల వైపు చూస్తున్నారు.

ఎక్కువభాగం బి.ఇడి సీట్లు ప్రైవేట్ బి.ఇడి కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ బి.ఇడి. కాలేజీలు కేంపస్ కాలేజీలతో పోటీపడేలా బి.ఇడి కోర్సును ఆఫర్ చేస్తూ అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఫీజులు మాత్రం కాస్త భారీగానే చెల్లించాల్సిందే. గత ఏడాది ప్రైవేటు కాలేజీలలో బి.ఇడి సీటు పొందాలంటే రూ. 16,500 ట్యూషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా, కేంపస్ బి.ఇడి కాలేజీలలో రూ.8,000 ఉండగా ఐ.ఎ.ఎస్.ఇ విద్యా సంస్థల్లో రూ.3000లతో బి.ఇడి కోర్సు చేసే అవకాశం ఉంటున్నది.
ఇంకా ఎస్.సి. , బి.సి, ఎస్.టి.కి చెందిన నిర్థిష్ట రూ.లక్ష రూపాయల కుటుంబ వార్షికాదాయం గల వారికి బి.ఇడి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వం నుంచి కాలేజీలకు రీయం బర్స్‌మెంటు లభించటం అభ్యర్థులకు తెలిసిందే.

Take By: T News

Read more...

Monday, June 18, 2012

ఆంగ్లంలో హోం మంత్రి.. తెలుగులో రక్షణ మంత్రి!


పోలీసు కానిస్టేబుల్ ప్రశ్నాపవూతంలో అనువాద దోషం
తొలిసారిగా నెగెటివ్ మార్కులు.. సమీప జవాబులే కొన్ని ప్రశ్నలకు దిక్కు
20,429 పోస్టులకు ముగిసిన రాతపరీక్ష.. ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ

హైదరాబాద్, జూన్ 17 ():పోటీ పరీక్షల ప్రశ్నావూపతం రూపకల్పనలో అనువాద దోషాలు, కరెక్టు జవాబులేని ప్రశ్నలు.. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకూ తప్పలేదు. 20,429 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షలో తప్పులు దొర్లాయి. 200 ప్రశ్నలతో రూపొందించిన ఈ ప్రశ్నావూపతంలో అక్కడక్కడా అచ్చుతప్పులు, అనువాద దోషాలు కన్పించాయి.

బుక్‌పూట్ సిరీస్ Aలో 30వ ప్రశ్న కింద ఇంగ్లిష్‌లో కేంద్ర హోం మంత్రి ఎవరు? అని అడిగి తెలుగు అనువాదంలో రక్షణ శాఖ మంత్రి ఎవరు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ఆప్షన్లలో.. పీ చిదంబరం, ఏకే ఆంటోని అని ఇద్దరి పేర్లూ ఉండటం గమనార్హం. ప్రతివూపశ్నకు వరుసగా ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో సమాధానం పక్కపక్కనే ఇచ్చినందున దేనిని ఆధారంగా తీసుకొని జవాబు గుర్తించాలో నిర్ణయించుకోలేక అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు.

బుక్‌పూట్ ప్రారంభంలో ఇచ్చిన సూచనల్లో 3 భాషల్లో చిన్న తేడాలుండవచ్చునని, అలాంటపుడు ఇంగ్లిష్ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. దీనినిబట్టి బుక్‌పూట్ సీరిస్ Aలోని 30వ ప్రశ్నను కేంద్ర హోంమంవూతిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు అనువాదంలో రక్షణ శాఖమంత్రి ఎవరు? అని స్పష్టంగా అడిగినందున తెలుగు మీడియం అభ్యర్థులు జవాబుగా ‘ఆంటోనీ’నే గుర్తించారు. మరి, బోర్డు ఈ ప్రశ్నకు ఏ జవాబును పరిగణనలోకి తీసుకుంటుందో తెలపాల్సి ఉంది.


200 ప్రశ్నలు గల ఈ రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కొక్క సరైన జవాబుకు ఒక మార్క్‌ను కేటాయించగా ప్రతి తప్పు జవాబుకు అర మార్క్‌ను నెగెటివ్ మార్కింగ్‌గా తీసివేస్తామని బోర్డు పేర్కొంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ: 2011 అక్టోబర్ 31న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 4.28 లక్షల మంది రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారు. ఇంటర్ కనీస విద్యార్హత కావడం, పోస్టులు 20 వేల వరకు ఉండటంతో అభ్యర్థులు వెల్లువలా దరఖాస్తు చేశారు. అయితే శారీరక సామర్థ్య పరీక్షల్లో 1.28 లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. రాత పరీక్షకు ప్రతి పోస్టుకు ఆరుగురి చొప్పున పోటీపడ్డారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ విధానం లేదు.

ప్రశ్నలకు సరైన జవాబులు కరువు!

రాత పరీక్షా ప్రశ్నాపవూతంలో మూడు, నాలుగు ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులు లేవు. దీంతో అభ్యర్థులు.. ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబు కోసం అన్వేషించి కొంత సమయం పొగొట్టుకున్న తర్వాత సమీప జవాబులను గుర్తించాల్సి వచ్చింది. జీకే విభాగంలో ఆంధ్రవూపదేశ్‌లో ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్య ఎంత? అన్న ప్రశ్నకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రం లో ప్రస్తుత మండలాల సంఖ్య 1128.

అయితే ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్‌లో 1104 ఉంది. 2004-05 గణాంకాల ప్రకారం అధికార గెజిట్‌ను అనుసరించి 1104నే జవాబుగా గుర్తించాలి. అయితే పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్‌లో తాజాగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి చాలామంది అభ్యర్థులు తాజా సంఖ్య 1128 కోసం వెతికారు.

ఇదేవిధంగా మెంటల్ ఎబిలిటీ విభాగంలో సిరీస్ ‘ఎ’ కోడ్‌లో 56వ ప్రశ్న ‘ఒక పనిని-ఎ 15 రోజుల్లో అదే పనిని బి-20 రోజుల్లో చేయగలిగితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు?’ అని ఉంది. దీనికి సరైన సమాధానం 8.57 రోజులు. అయితే ప్రశ్నాపవూతంలో ఇచ్చిన ఆప్షన్లలో 8.5 అని ఉంది.

Take By: T News

Read more...

Monday, January 30, 2012

నేడు టెట్ ఫలితాలు and డీఎస్సీ నోటిఫికేషన్ నేడే (TET and DSC)

మధ్యాహ్నం 2:30కు వెల్లడించనున్న మంత్రి పార్థసారధి
హైదరాబాద్, జనవరి 29 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే పార్థసారధి సచివాలయంలో మధ్యాహ్నం రెండున్నరకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలను www.aptet.cgg.gov.in లో చూడొచ్చు.


డీఎస్సీ నోటిఫికేషన్ నేడే

- సుమారు 22,622 పోస్టులతో ప్రకటన
హైదరాబాద్, జనవరి 29 (): డీఎస్సీ-2012 నోటిఫికేషన్ సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 22, 622 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఇటీవల రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) 9569 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసింది. ఇన్ సర్వీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పదోన్నతులు కల్పించింది. ప్రమోషన్లతో భర్తీ చేసిన పోస్టుల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ పోస్టుల స్థానంలో డీఎస్సీలో నేరుగా ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుల సంఖ్య, వివరాలపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నానికల్లా జీవో వస్తే సాయంత్రం లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP