Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Medak. Show all posts
Showing posts with label Medak. Show all posts

Monday, September 17, 2012

స్వేచ్ఛకోసం ..నెత్తురోడిన మెతుకు సీమ

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

సరిగ్గా 64 ఏళ్ల కిందట ఇదే రోజు మెదక్‌లో మువ్వన్నెల పతాకం రెపరపలాడింది. రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు అది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. ఏడో నిజాం నవాబు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఎదుట మోకరిల్లిన క్షణం.. తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర సంబురాలు మిన్నంటాయి. ఈ పోరాటంలో ‘మెతుకుసీమ’ పాత్ర మరువలేనిది. రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి మెతుకుసీమ బిడ్డలు చరివూతలో నిలిచిపోయారు. రాచరికపు బానిస సంకెళ్లు తెంచి పోరాట స్ఫూర్తి ప్రదర్శించారు. ఇపుడు మళ్లీ అదే సందర్భం. అదే స్ఫూర్తితో ముందడగు వేయాల్సిన ఆవశ్యకత. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాటఘట్టాలపై

మెదక్, (): 1947 ఆగస్టు 15న దేశం మొత్తం మీద ఓ వైపు సంబురాలు జరుగుతుంటే మరోవైపు ఆంధ్రవూపదేశ్‌లోని తెలంగాణ జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఫర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల ప్రజలు రజాకార్ల వ్యతిరేక పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇండియన్ యూనియన్‌లో విలీనమవ్వడానికి నిజాం నిరాకరించాడు. తన ఆధీనంలోని రాజ్యంలో 1947 ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదని నిషేధాజ్ఞలు విధించాడు. 1946 మే 10, 11వ తేదీల్లో సంగాడ్డి మండలం కంది గ్రామంలో జరిగిన 13వ ఆంధ్రమహాసభలతో ఉత్తేజితులైన ప్రజలు జిల్లావ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. గ్రామాల్లో పండించిన పంటలు, ఆస్తులు దోచుకుంటున్న రజాకార్లను ఎదుర్కోవడానికి గ్రామ గ్రామాన యువకులు, ఆర్యసమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. 1947 జూన్ 16, 17, 18వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ సమావేశాలకు జిల్లా నుంచి తేర్పోల్‌కు చెందిన జె.రామిడ్డి తదితరుల నాయకత్వంలో పలువురు హాజరయ్యారు. ఊరూరా జెండా వందనాలు చేయాలని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌వాదులు జిల్లాలోని కల్పగూర్, అల్లాదుర్గం, శంకరంపేటల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే రజాకార్ల దురాగతాలు పెచ్చుమీరడంతో ఆవేదన చెందిన నాందెడ్ జిల్లా తహసీల్దార్ ఫరీద్‌మీర్జా 1947 జూలై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేయడం ఉద్యమకారులకు మరింత బలాన్నిచ్చింది. 1947 ఆగస్టు 11న జోగిపేటలో బస్వ మాణయ్య అనే నాయకుడి ఇల్లు సోదా చేసి ఆయనను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఆగ్రహం చెంది పోలీస్‌స్టేషన్‌పై దాడికి యత్నించగా, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు ఉద్యమకారులు మెదక్‌ను ఎంచుకున్నారు.

మెదక్‌లో తూటాలకు ఎదురొడ్డి పతాకావిష్కరణ
1947 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, తూటాలకు ఎదురొడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు మెదక్ పట్టణాన్ని ఎంచుకున్నారు. మెదక్ నివాసి గడియారం హన్మంతరావు నివాసంలో ఈ విషయమై రహస్యంగా సమావేశం నిర్వహించి శంకర్‌రావు తోటలో జెండా వందనానికి రంగం సిద్ధం చేశారు. 1947 ఆగస్టు 15న జెండా ఆవిష్కరించిన వారిని కాల్చి చంపుతామని ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు హెచ్చరికలు జారీ చేశారు. రజాకార్ల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ దాదాపు 20 వేల మంది ప్రజలు మెదక్‌లో జెండా వందనానికి హాజరుకాగా, కూచన్‌పల్లికి చెందిన రామాగౌడ్ పతాకావిష్కరణ చేశారు. 1947 సెప్టెంబర్ 2న సంగాడ్డిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు నిర్ణయించారు. మహంకాళి నారాయణ, వెంకయ్య, శంకర్‌ల నాయకత్వంలో సెప్టెంబర్ 2న తెల్లారేసరికి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.

సజీవ దహనాలు
1947 సెప్టెంబర్ 4న కోడూర్ గ్రామ పటేల్ రంగాడ్డి రజాకార్ల దురాగతానికి బలవ్వగా, ఖాదిరాబాద్‌లో ఉద్యమకారుడు దుగ్గిశెట్టి విశ్వనాథం తండ్రిని రజాకార్లు సజీవ దహనం చేశారు. రైతు సంగప్ప అనే వ్యాపారిని 1947 అక్టోబర్ 24వ తేదీన రజాకార్లు సజీవ దహనం చేసి చంపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పటాన్‌చెరు మండటం జానకంపేట వాసులు కంది శ్రీనివాస్‌రావు నాయకత్వంలో బాణాలతో పోరాడారు. కంది కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, మచ్చ వెంక గుప్తల ఆధ్వర్యంలో పటాన్‌చెరు, పరిసర గ్రామాల్లో ఉద్యమకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించి పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు, పాటి ఘణపూర్, కిష్టాడ్డిపేట గ్రామాలకు చెందిన వెంకటరత్నం, మల్లయ్యలను అరెస్ట్ చేసి సికింవూదాబాద్ జైల్లో నిర్బంధించారు.

దగ్ధమైన సదాశివపేట
1947 అక్టోబర్ 24వ తేదీ సదాశివపేటలో చరివూతలో మరువలేనిది. ఆ రోజు ఒకవైపు దసరా పండగ సంబురాలను ప్రజలు జరుపుకుంటుండగా..అజాంఖాన్, శంశోద్దీన్‌ల నాయకత్వంలో రజాకార్లు సదాశివపేటపై దాడి చేసి మార్కెట్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను దగ్ధం చేశారు. కిరోసిన్ దుకాణంతో పాటు మొదలుపెట్టిన ఈ దహనకాండకు తన దుకాణానికి తోరణం కడుతున్న సంగప్ప అనే వ్యాపారిని అదే దుకాణంలో వేసి సజీవ దహనం చేశారు.

ప్రేరణనిచ్చిన కలం యోధుడు మాణిక్యరావు
సురవరం ప్రతాప్‌డ్డి ప్రారంభించిన గోల్కొండ పత్రికలో పాత్రికేయుడిగా పనిచేసిన వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. ఫిరోజ్ మీర్జా, బాకర్ అలీమీర్జా, సిరాజుల్‌హాసన్ వంటి ప్రగతి కాముక ముస్లిం మేధావుల మాటలను పెడచెవిన పెట్టిన మత ఛాందసవాద, ఫాసిస్టు భావజాల రజాకార్ల మాటలు విని ప్రజలపై విపరీతమైన దురాగతాలకు, అత్యాచారాలకు పాల్పడ్డ నిజాంపై హైదరాబాద్ స్టేట్ ప్రజల పిలుపు మేరకు ఇండియన్ యూనియన్ సైన్యాలు పోలీస్ యాక్షన్ పేరిట 1948 సెప్టెంబర్ 13న నల్దురుపై దాడి చేసి వశపర్చుకున్నాయి. ఆ తర్వాత వరుసగా భారత సైన్యాలు పురోగమించడంతో నిజాం నవాబు లొంగుబాటును ప్రకటించారు. దీంతో నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. రాచరిక పాలన అంతమైంది.

Take By: T News

Read more...

Monday, July 2, 2012

సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు


సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు

- సగానికి పైగా శిథిలావస్థలో
- కానరాని కనీస సౌకర్యాలు
- పలుచోట్ల కనిపించని మరుగుదొడ్లు
- 29 కాలేజీల్లో ప్రయోగశాలలు కరువు
- 20 చోట్ల ప్రహరీలూ లేవు
- 300కు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో విద్యార్థులు

దాహమేస్తే ఓర్చుకోవాలి..
మంచినీళ్లు దొరకవు గనుక..!
మూత్రమొస్తే ఆపుకోవాలి..
మరుగుదొడ్లు లేవుగనుక..!
వర్షమొస్తే బయటకు పరిగెత్తాలి..!
పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు గనుక..!
పందులు, పశువులకూ ప్రవేశముంది..
ప్రహరీలు లేవుగనుక..!
కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదు..
లెక్చరర్లే లేరుగనుక..!


సర్కారీ ఇంటర్ కళాశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి..! సగానికిపైగా శిథిలావస్థకు చేరుకొని బంజరుదొడ్లను తలపిస్తున్నాయి..! పాఠాలు చెప్పే అధ్యాపకులే కాదు.. కాగడా వేసి వెతికినా కనీస సౌకర్యాలు కానరావడం లేదు..! వర్షమొస్తే ఎప్పుడు కూలుతాయో తెలియని పైకప్పుల కింద చదువులు కొనసాగించే పరిస్థితి లేదు..! దీంతో పదోతరగతి పాసై, ఎన్నో ఆశలతో కాలేజీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు వాస్తవ పరిస్థితిని జీర్ణించుకోలేక లబోదిబోమంటున్నారు..!

జిల్లావ్యాప్తంగా 71 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు(50- బాలురు, -బాలికలు),11 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు (బాలురు-, బాలికలు-3), రెండు గిరిజన సంక్షేమ గురుకుల కళాలలు(బాలురు-1, బాలికలు-1) ఎనిమిది ప్రైవేటు కో-ఆపరేటివ్ కళాశాలలున్నాయి. మారుమూల మండలాలు మినహా దాదాపు మండలానికో జూనియర్ కళాశాల ఉంది. వీటిలో సగానికి పైగా కళాశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షమొస్తే గదుల పైకప్పులు, గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 21 కళాశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 చాలా చోట్ల బెంచీలు, బల్లలు లేవు. విరిగిపోయి మూలపడ్డవాటికి మరమ్మతులు చేయించేవారు లేరు. 300కు పైగా జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకువస్తున్నారు. పది కళాశాలలకు ప్రిన్సిపాళ్లు కూడా లేరు. 25 మందికన్నా తక్కువ విద్యార్థులుంటే సెక్షన్ ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించడంతో దాదాపు 10 కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 20 కళాశాలకు ప్రహరీలు లేకపోవడంతో పశువులు, పందులు లోపలికి వస్తున్నాయి.

దీంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. పదింట్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మూత్రం వస్తే బయటకు పరిగెత్తాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచినీటికీ ఇక్కట్లు పడాల్సి వస్తోంది. 29కి పైగా కళాశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు లేవు. లైబ్రరీయన్లు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 50 దాకా పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో క్రీడల అడ్రస్ లేకుండా పోయింది.

Take by: T news

Read more...

Friday, June 29, 2012

రాయల రచ్చ


rayalatelangana-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?


తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్


ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్


హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.

ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.

సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ

వరంగల్,  ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

Take BY: T News

Read more...

Sunday, January 15, 2012

సంబురాలు సంక్రాంతి

పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి. కొత్త అల్లుళ్ల రాకలు. యువకుల గాలిపటాల కేరింతలు. పిల్లల బొమ్మరిల్లాటలు. ఇలా హడావిడి మధ్య, ఎముకలు కొరికే చలితో సయ్యంటూ సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. మూడు రోజులు జరుపుకునే పండుగ ఎంతో ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. ఆడబిడ్డల రాకతో పల్లెల్లో కళకళలాడుతుంటాయి. పండుగ రోజు ప్రతి ఇంటి ముందు రంగుల హరివిల్లులను తలపించే ముగ్గులేసేందుకు యువతుల ఉత్సాహాలు ఒకవైపు. డూడూ బసవన్న అంటూ తెల్లారేసరికి వచ్చే గంగిద్దులవారి చప్పుళ్లతో సంక్రాంతి పండుగ కొత్త కాంతిని సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ విశిష్టత పై ‘టీ న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

సంబురాలు సంక్రాంతి
సంక్రాంతి అంటే ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేశాధి, ద్వాదశ రాశులందూ క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి మొదలవుతుంది. ఏడాదికి 12 సంక్రాంతులుంటే కాగా పుష్యమాసంలో, హేమంతరుతువులో చల్లటి గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగుపెడతాడు. అందుకే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని చెబుతుంటారు. ఈ ఉత్తరాయణ కాలం నుంచి చేయు దానాలను ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, దుంపలు,కాయగూరలు, పండ్లు మొదలైనవి ఈ కాలమందు చేయు దానాల వల్ల స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు.

గంగిద్దుల సందడి.......
తెల్లారే సరికి ఇళ్ల ముందు హరిదాసు కీర్తనలు వినిపిస్తుంటాయి. గంగిద్దులను ఆడించే అలంకరించిన గంగిద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు,సన్నాయి రాగాలతో అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. అయ్యవారికి దణ్ణం పెట్టు...అమ్మవారికి దణ్ణం పెట్టంటూ గంగిద్దుల వారి సందడి ఎంతో రమణీయంగా ఉంటుంది. పండించిన పంట సంక్రాంతికి ముందే రావడంతో ఆ ధాన్యాన్ని గంగిద్దుల వారికి దానంగా ఇస్తుంటారు.

ఆకట్టుకునే హరిదాసుల కీర్తనలు....
సంక్రాంతి పండుగ రోజు హరిలో రంగ హరి అంటూ నడి నెత్తి పై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో , కంచు గజ్జెలు గల్లుగల్లుమనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిడుతలు కొడుతూ హరిదాసులు చేసే కీర్తనలు ఎంతో ఆకట్టుకుంటాయి. తల పై అక్షయపాత్ర కదలకుండా హరిదాసులు కీర్తనలు చేస్తూ పాడటం ఎంతో బాగుంటుంది. గతంలో ఇలాంటి వేడకలుండేవి. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హరిదాసులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

పిల్లల గాలిపటాల ఆటలు...
పండుగ రోజులో పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురేస్తుంటారు. కనువిందైన గాలిపటాలు ఎగిరేస్తూ సందడి చేస్తారు. చిన్నపిల్లలు బొమ్మరిలాటలాడుతుంటారు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటుంటారు. బావమరదళ్ల సయ్యాటలు సంక్రాంతి రోజు కనిపిస్తుంటాయి.

వాకిళ్లలో వెలిసే గొబ్బెమ్మలు...
స్త్రీలు వాకిళ్లలో ముగ్గులు వేస్తుంటారు. యువతులు, ఆడపిల్లలు ఆవుపేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు వాకిళ్లల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ గొబ్బెమ్మల మీద గరకపోసలు, రంగుల పూలరేకులు పసుపు, కుంకుమలు పెడతారు.

ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు...
సంక్రాంతి పండుగ తెల్లారి జరుపుకునే కనుమ రోజు ఇళ్లల్లో ప్రత్యేకమైన పిండి వంటకాలు తయారు చేసుకుంటారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా భోజనాలు తయారు చేసుకొని తింటారు. కనుమ రోజంతా కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఇలా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

Read more...

Sunday, December 25, 2011

క్రిస్మస్‌కు ముస్తాబైన మెదక్ చర్చి



Cherch talangana patrika telangana culture telangana politics telangana cinemaమెదక్, డిసెంబర్ 24 (): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారం రోజులుగా సమష్టి కృషితో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెవండ్ బిషప్ కనకవూపసాద్ భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇక్కడ జరిగే వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగాడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులే కాకుండా మతాలకతీతంగా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు రానున్నారు. దాదాపు రెండు లక్షల మంది దాకా రావచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 

వేడుకలను పురస్కరించుకొని మెదక్‌కు ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ తెలిపారు.

Read more...

కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర

- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం


chandra-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!

దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!

రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.

చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.

అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News   :

Read more...

Tuesday, December 20, 2011

కన్నీటి పల్లెలు

- ఎండుతున్న గొంతులు
- ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు
- తెల్లారుజామునే బోరుబావుల వద్ద బారులు
- అడుగంటిన భూగర్భజలాలు
- కరెంటు కోతలతో మరింత కష్టం
- తూతూ మంత్రంగా ట్యాంకర్లతో నీటి సరఫరా
- కానరాని బోర్ల మరమ్మతులు
- ప్రత్యేకాధికారుల పాలనలో అరిగోస

nzb-water-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema: వేసవి రాక ముందే తాగునీటి కోసం ప్రజలు అరిగోస పడుతున్నారు. వర్షాభావంతో అడుగంటిన భూగర్భజలాలు, వట్టిపోయిన బోరు బావులు, పనిచేయని రక్షిత నీటి పథకాలు, కరెంటు కోతలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి జనం గొంతుపూండేలా చేస్తున్నాయి. గ్రామాల్లో తెల్లారుజామున మూడు గంటలకే ‘పానిపట్టు’ యుద్ధం మొదలవుతోంది.

తాగునీటి సమస్యతో బతుకులు కడతేరుతున్నాయి. తాగునీటి కోసం వెళ్లిన ఓ తల్లి ఇంటికొచ్చే సరికి ఐదునెలల పసికందు గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి మృతి చెందిన హృదయవిదారకమైన సంఘటన రెండురోజుల క్రితం రంగాడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకుంది. వేసవి రాకముందే ప్రజల గొంతెండుతోంది. ప్రత్యేకాధికారుల పాలన నీటిఎద్దడిని ఏమాత్రం తీర్చలేకపోతోంది. జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరున్నా వాటిని ప్రజలకు అందించడంలో పాలకులు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.భాగ్యనగరం ప్రజల క‘న్నీళ్ల’ కథ అంతులేనిది. 87లక్షల జనాభాకు సరిపడా నీరందించలేని పరిస్థితి. రోజుకు 459 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)నీరు అవసరం ఉండగా జలమండలి అధికారులు కేవలం 340 ఎంజీడీలు మాత్రమే అందిస్తున్నారు. ఇందులోనూ ప్రాంతాల వారీగా వివక్ష ప్రదర్శిస్తున్నారు. రోజుకు మనిషి 165 లీటర్లు అందించాల్సి ఉండగా ప్రముఖులకు 500 లీటర్లు, మురికివాడలకు 100 లీటర్లతో సరిపెడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో విలీనమయిన 12 మున్సిపాలిటీ ప్రాంత ప్రజల గోస వర్ణనాతీతం. అంతర్జాతీయ నగరంగా ఎదిగామని చెప్పుకునే ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు వారానికోకసారి నీరు సరఫరా చేస్తోంది. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నగరానికి గోదావరి, కృష్ణా మూడో దశ పథకాలు చేపడుతున్నామంటూ ప్రతి సమావేశంలోనూ ఊదరగొట్టే నేతలు ఈ పథకాల పనితీరు చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి. గోదావరి ప్రాజెక్టు మూడేళ్లలో 25శాతం పనులు జరగగా కృష్ణా మూడోదశ మాత్రం ఇంక కాగితాలపైనే నలుగుతోంది. ఇవన్నీ వెరసి కాలనీలకు అతీతంగా ఇక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

తాగునీటికి తహ తహ
వరంగల్ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాలేదు. సెప్టెంబర్ నుంచి వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో నీటిమట్టం తగ్గిపోయి గ్రామాల్లోని చేతి పంపులకు నీరు అందక రెండు వేల చేతి పంపులు పూర్తిగా పనిచేయడంలేదు. మరో వెయ్యి చేతి పంపుల్లో డిసెంబర్ రెండోవారం నాటికే నీరు అందక పనిచేయడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం సాధారణ నీటి మట్టంకన్నా నాలుగు మీటర్లకు అడుగంటాయి. గ్రామాల్లో కరెంటు కోత తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్‌లో కూడా మంచినీటి ఎద్దడి ఏర్పడంతో మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. పాఖాల, రామప్ప చెరువుల్లో నీరు అడుగంటడంతో సమక్షిగనీటి పథకాలు మూలకు పడనున్నాయి. ఎస్సాస్పీ నీటిని రెగ్యులర్‌గా విడుదల చేస్తేనే సమగ్ర నీటి పథకాలు పనిచేసే పరిస్థితి ఉంది. ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదలచేసింది.

వారానికి ఒకసారే ఇంటి ఎదుట కల్లాపి
Wgl-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaనల్లగొండ జిల్లాలో మంచినీటి కోసం ప్రజలు అప్పుడే అవస్థలు పడాల్సి వస్తోంది. చండూరు మండలంలోని గుండ్రపల్లిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వారం రోజులకు ఒక సారి మాత్రమే ఇంటిముందు కల్లాపి చల్లుకుంటున్నారు. వంటకు నీరు దొరికితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గంలో స్కీం బోర్లన్నీ ఎండిపోయాయి. కృష్ణా జలాలు అందడం లేదు. మిర్యాలగూడ ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. వేముపల్లిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బేతవోలు చెరువు నుంచి మండలానికి నీరు అందుతున్నా అవి మురికిగా వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొండపాడు ప్రాజెక్టు పూర్తై పైప్‌లైన్ పూర్తి కాలేదు. సూర్యాపేటలో 70 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. భువనగిరి, యాదగిరిగుట్టలో కూడా అదే పరిస్థితి.

వేసవి రాకముందే నీటికి కటకట
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి రాకముందే మంచినీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. గాంధారి మండలం బీర్లమార్ తండా, కొత్తబజార్ తండా, జ్జెపల్లి, ఉత్తూనూరు, బుర్గర్, జువ్వాడి, బ్రహ్మణిపల్లి, కర్ణగడ్డతండాలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. బుర్గుల్‌లో బోర్లలో నీరు రాకపోవడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణపల్లిలో పూర్తిగా ఫ్లోరైడ్‌నీరు ఉండటంతో మంచినీటి ట్యాంకుకు వెళ్లే పైప్‌లైన్లు చెడిపోయినాపట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్, దేశాయిపేట్, తిర్మలాపూర్‌లో నీటి పైప్‌లైన్ అస్తవ్యస్తంగా తయారైంది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం తడిహిప్పర్గా, అంతాపూర్‌లో పైప్‌లైన్ ధ్వంసమై, ఉన్న బోర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా కనెక్షన్ ఇవ్వకపోవడంతో వృథాగా పడిఉన్నాయి.


దాహార్తి తీర్చని ట్యాంకర్ల సరఫరా
Wgl1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaరంగాడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 705 గ్రామ పంచాయతీలున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 1,472 ఉండగా10,532 చేతిపంపులున్నాయి. ఇందులో సగానికి పైగా చేతిపంపులు వర్షాభావంతో వట్టిపోయాయి. త్రీఫేజ్ కరెంటు సపె్లై లేకపోవడంతో చాలా చోట్ల బోర్లున్నా గొంతుతడవటం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా ఇవీ దాహర్తిని తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయ బోర్లు కిరాయికి తీసుకుని మరీ నీటిని అందిస్తున్నా ఎద్దడి తీవ్రతను తగ్గించలేకపోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో సమస్య తీవ్రంగా ఉంది. తెల్లవారుజామున మూడు గంటలకే నీటికోసం క్యూ కడుతున్నారు. రెండురోజుల క్రితం చేవెళ్ల మండలం అల్లవాడలో భీమమ్మ నీళ్లకు వెళ్లగా ఐదు నెలల కుమారుడు భానువూపసాద్ ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన విషయం తెలిసిందే.

గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల దూరం
మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్ట ప్రాంతాల్లో ఇప్పటికే వారానికి ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడు కావడంతో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు సైతం ఎండిపోవడంతో పశువులకు కూడా నీళ్లు కరువవడంతో రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. జిల్లాలోని 1,545 గ్రామాల్లో 17,132 చేతిపంపులు ఉండగా, అందులో సగం ఇప్పటికే పనిచేయడం లేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రభాకర్ తెలిపారు. కరువు నివారణ పథకం కింద రూ. 4 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.

అస్తవ్యస్తంగా మంచినీటి వ్యవస్థ
water-knr-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఆదిలాబాద్ జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వెయ్యి గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. జిల్లావ్యాప్తంగా 2,463 రక్షిత మంచినీటి పథకాలు, 20,309 బోరుబావులుండగా మూరుమూల ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ లేకపోవడంతో కొన్ని పనిచేయకపోగా మరికొన్ని చెడిపోయాయి. ముథోల్ మండలం బిద్రెల్లిలో మంచినీటి సరఫరా నిలిచివడంతో రెండుకిలోమీటర్ల దూరంనుంచి నీరు తెచ్చుకుంటున్నారు. బాసర నుంచి పైప్‌లైన్‌ద్వారా గ్రామానికి నీరు రావాల్సి ఉండగా గ్రామశివారులోని బోరు మోటర్ చెడిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది.

తలాపునే గోదారి.. తీరని దాహం
ఖమ్మం జిల్లాలో మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. ఏళ్ల నాటి బోర్లు మొరాయిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాటికి కనీస మరమ్మతులు లేక కొన్నిచోట్ల పనికిరాకుండా పోయాయి. జిల్లాలో తాగునీటికి 20కిపైగా మండలా ప్రజలు అల్లాడుతున్నారు. తలాపున గోదావరి ఉన్నా నీటి కష్టాలు మాత్రం తీర్చే నాథుడే కరువయ్యాడు. దాదాపు ప్రతి పంచాయతీలో ఐదు నుంచి 10కిపైగా బోరు మోటార్లు రిపేరులో ఉన్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో వేళాపాళా లేని నీటి సరఫరా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. రాత్రి వేళల్లోనూ నీటిని సరఫరా చేస్తుండటంతో ఇబ్బందిగా మారింది.

తాగునీటి సరఫరా అంతంతే
NLG-WATER-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్ జిల్లాలో మొత్తం 2,260 హాబి పూర్తిగా తాగునీరు అందుతున్న గ్రామాలు 295 మాత్ర మే. 81 గ్రామా ల్లో తాగునీటి వ్యవస్థేలేదు. మిగ తా గ్రామాల్లో పాక్షికంగా తాగునీరు అందుతోంది. 2,158 రక్షి త మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. 20,988 బోరు బావుల్లో వెయ్యి పనిచేడంలేదు. జిల్లాలోని మంథని, సిరిసిల్ల డివిజన్‌లతోపాటు హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేములవాడ, కొండగట్టులోనూ సమస్య తీవ్రంగా ఉంది.

మెతుకుసీమలో పథకాలు అసంపూర్ణం
ప్రత్యేకాధికారుల పాలనలో మెదక్ జిల్లాలోని గ్రామాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రత్యేక మంచినీటి పథకాలున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలతో ప్రజల గొంతెండుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 212 కోట్లతో నిర్మాణంలో ఉన్న 26 మంచినీటి పథకాలు నత్తనడకన నడుస్తుండటంతో ప్రజల దాహార్తి తీరడంలేదు. సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు మినహా జిల్లాలోని మిగతా గ్రామీణ ప్రాంతాల్లో చేతి పంపులు, బోరుబావుల ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతోంది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఉద్దేశించిన సత్యసాయి మంచినీటి సరఫరా పథకం నిర్వహణ లోపంతో కుదేలైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా స్థానికులకు తాగునీటి గోస తప్పడం లేదు.

Take By: T News




Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP