Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label TDP. Show all posts
Showing posts with label TDP. Show all posts

Wednesday, February 13, 2013

Chandrababu Naidu woos minorities

Telugu Desam president N. Chandrababu Naidu on Tuesday said he would provide 8 per cent reservation to Muslims in local as well as general elections, jobs and higher education.
Mr. Naidu’s latest sop comes on a day when he completed 2,000 km as part of ‘Vastunna Meekosam’ padayatra here.
Addressing a roadside meeting at NTR Statue Centre, Mr. Naidu said he would provide Rs.5 lakh interest-free loan to poor Muslims who wanted to set up industries.
He said Muslim youngsters have been forced to do low-paying jobs such as automobile mechanics.
The Telugu Desam supremo reiterated that he would provide 50 per cent reservation to the Backward Classes in all legislative bodies and announced that he would take measures to provide reservations to upper castes.
Wearing a skull cap in the Muslim-dominated Old Town area, Mr. Naidu, flanked by former MP Lal Jan Basha and MLA Sk. Ziaudddin, reiterated that the first signature he would make after returning to power would be on the file waiving crop loans.
The second signature would be eradication of belt shops, the third on diversion of Krishna waters to meet drinking water requirements in Guntur and the fourth on developing Guntur-Vijayawada as twin cities and creating an IT hub between the two cities.
Flays Sakshi
Mr. Naidu made serious allegations against Sakshi newspaper calling it a ‘visha kanya,’ (poisonous maiden), spewing venom on its way.
Faults Chiru
In an interesting comment, Mr. Naidu blamed K. Chiranjeevi for spoiling the chances of the TDP in the 2009 elections. “Had not the Praja Rajyam been in the fray, the TDP would have come to power,” he said.
He also turned his ire towards Chief Minister N. Kiran Kumar Reddy accusing the latter of protecting tainted Ministers and corrupt industrialists.
The TDP president said that while he had come out unscathed during investigations into the allegations of corruption levelled against him during 2004-2009 by his adversaries, the Congress leaders had been framed by the CBI and the courts for their corrupt deals.

Read more...

Saturday, October 20, 2012

Cameraman Ganga tho Rambabu (CGR) film stopped in Telangana

The movie print burnt by Osmania University students in Hyderabad on Friday.

 
The screening of Pawan Kalyan starrer ‘Cameraman Ganga tho Rambabu’ was stopped in many theatres across Telangana on the second day of its release on Friday following protests by Telangana supporters against objectionable scenes which they claimed hurt their sentiments. 

The protests took a violent turn when Telangana Rashtra Samiti activists vandalised the offices of the film director Puri Jagannath and producer/distributor Dil Raju at Jubilee Hills and Srinagar Colony respectively here. They smashed the windscreens of four cars parked on Mr. Jagannath’s office premises, besides damaging furniture at both their offices. 

Mr. Jagannath and Mr. Raju promised to delete the scenes if they were indeed objectionable, but appealed to the agitators to stop violence. Mr. Jagannath arranged a special screening for leaders of TRS and Telangana joint action committee to vouch for the content. 

The dialogues of the film’s hero Pawan Kalyan and villain Prakash Raj was the cause of trouble. The particular scene depicted the villain throwing a challenge that only sons of the soil would be allowed to do business in Andhra Pradesh and those from other States would be driven away. 

This argument was rebuffed by the hero asking how was it that the former’s father could do business in New Delhi while the son pursued higher studies in the US.
Interpreting the scene as a direct reference to leaders in the forefront of Telangana movement, the agitators thronged theatres screening the film since morning on Friday. 

Aradhana theatre at Tarnaka which is close to Osmania University campus was the first to be attacked by the students. The crowd brought the prints to the campus and burnt them in front of the Arts College building. 

The agitators staged demonstrations at Sriramana and Sandhya talkies at Amberpet and RTC crossroads respectively. The shows were also suspended at halls in Medchal, Nacharam, Madhapur, Balanagar, L.B. Nagar, Karmanghat, Gaddiannaram, Dilsukhnagar and Kothapet. 

Mancherial MLA G. Arvind Reddy led a crowd to close down a theatre in that town. The film was not shown in 12 out of 21 theatres where it was released across Karimnagar district. A theatre at Paloncha in Khammam district was also attacked. 

The Telangana Film Chamber convened an emergency meeting of its executive and demanded the film producer to compensate the talkies’ owners for the loss suffered on account of non-screening. Chamber president M. Vijayender Reddy said the compensation was paid when ‘Saleem’, ‘Arya Two’ and ‘Adurs’ were not screened under similar circumstances. 

The TRS reacted to the developments saying it will not tolerate insult to Telangana movement in the name of a film. 

Take BY: The Hindu News

Read more...

తెలంగాణకో లెక్కుంది.. కెమెరామెన్ గంగతో రాంబాబు తిక్క దిగింది

తెలంగాణ సెగకు దిమ్మతిరిగిన పూరీ
అభ్యంతరకర సన్నివేశాలపై క్షమాపణలు
వాటిని తొలగిస్తామని వెల్లడి
12 సీన్లు తొలగించామన్న దిల్‌రాజు


- కెమెరామెన్ గంగతో రాంబాబుపై వెల్లువెత్తిన వ్యతిరేకత
- తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చిన సన్నివేశాలపై ఆగ్రహం
- పూరీ జగన్నాథ్, దిల్‌రాజు నివాసాలపై దాడులు
- తెలంగాణ పది జిల్లాల్లోనూ సినిమా నిలిపివేత
- ఆ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ప్రదర్శన
- తేల్చి చెప్పిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
- నేడు తెలంగాణ నేతలకు సినిమా ప్రత్యేక ప్రదర్శన
- వారు అభ్యంతరాలు లేవంటేనే తెరపైకి ‘రాంబాబు’

తెలంగాణ ఉద్యమ సెగతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు దిమ్మ తిరిగింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేవిధంగా సన్నివేశాలు, సంభాషణలు ఉన్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన చిత్ర సమీక్షలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో థియేటర్లవద్ద తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో పూరీ జగన్నాథ్ నివాసాన్ని టీఆర్‌ఎస్వీ నేతలు ముట్టడించారు. వాహనాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు నివాసంపైనా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మరోవైపు ఈ సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించేంతవరకూ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆడనిచ్చేదిలేదని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేయడం, హైదరాబాద్ నగరంతోపాటు.. ఇతర తెలంగాణ జిల్లాలన్నింటా సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో దర్శకుడు పూరీ, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు అతికష్టంమీద దిగి వచ్చారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఎవరినైనా నొప్పించినట్లయితే క్షమించాలని కోరారు. అభ్యంతరకరంగా ఉన్న 12 దృశ్యాలను తొలగిస్తామని ప్రకటించారు. సన్నివేశాలు తొలగించిన తర్వాత ఈ సినిమాను శనివారం తెలంగాణ నాయకులకు చూపిస్తామని, వారు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన తరువాతనే సినిమాను ప్రదర్శనకు పంపిస్తామని అన్నారు. దిల్ రాజు సైతం అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, మరిన్ని అభ్యంతరాలు ఉంటే వాటినీ పరిశీలిస్తామని తెలిపారు. మొదట తాను తెలంగాణవాడినని, తాను పెట్టుబడి పెట్టాను కాబట్టి అభ్యంతరకర సన్నివేశాలున్నా... సినిమాను ఆడించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. సినిమా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. అయితే తెలంగాణవాదులు ప్రాంతంవాడివైనంత మాత్రాన తెలంగాణకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్న సినిమాను ఆడనిచ్చేది లేదని ఆచరణలో తెగేసి చెప్పారు. ఉద్యమకారుల ఆందోళన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాక ‘రాంబాబు’ చిత్రాన్ని ఉద్యమనాయకులకు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు చూపించనున్నారు. వారు సరేనంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మళ్లీ తెరపైకి రానుంది.
కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పట్ల టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమా రంగం పట్ల అత్యంత సానుకూలంగా ఉండే తెలంగాణవాదుల పట్ల దుర్మార్గమైన పద్ధతిని అవలంబించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినీ రంగంపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

పూరీ సారీ
‘కెమెరామెన్ గంగతో రాం బాబు’ సినిమాపై తెలంగాణవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్‌రాజు దిగివచ్చారు. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని పూరీ జగన్నాథ్ అన్నారు. అభ్యంతరకంగా ఉన్న 12 సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన పూరీ.. సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని, ఎవరికి వారు ఏదేదో ఊహించుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ నొప్పించడానికి ఈ సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణవాదులు అభ్యంతరం తెలిపిన 12 సన్నివేశాలను నిర్మాత దిల్‌రాజుతో చర్చించి తొలగించామని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే దర్శకుడు, నిర్మాతలతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తొలగించామని, తెలంగాణవాదులకు శనివారం చిత్రాన్ని చూపిస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి
- టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్
హైదరాబాద్, అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే విధంగా నిర్మించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ఆ సినిమా దర్శక, నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. రాంబాబు సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ సినిమాను ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే వారు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తారన్న విషయం మరువద్దని సూచించారు. రాంబాబు వంటి ఉద్యమ వ్యతిరేక సినిమాలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి పెద్దపీట వేయనున్నట్లు తమ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రాలు నిర్మించడం సరికాదని అన్నారు.

Read more...

Saturday, June 16, 2012

డూప్లికేట్ చంద్రబాబు?













ఎలక్షన్స్ ప్రచారం కోసం ఈ మధ్యన తిరుపతి  వెళ్ళిన చంద్రబాబుకి విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది.

అచ్చు తనలాగే వున్న డూప్లికేట్ ని చూడగానే చంద్రబాబు నోటమాట రాలేదు.

ఈ బాబు డూప్ పేరు Rukmamgadha.ఈయన టిడిపి కి పిచ్చ ఫ్యాన్.

Take By: teluguviews

Read more...

Saturday, January 14, 2012

నందమూరి ఫ్యామిలీ డ్రామా.. అదుర్స్!

- చంద్రబాబు చక్కర్.. నందమూరి ఫ్యామిలీ డ్రామా
- నట, రాజకీయ వారసత్వంపై రచ్చకెక్కుతున్న ఆధిపత్య పోరు

- ఓవైపు ‘అధినాయకుడు’ మరోవైపు ‘నందీశ్వరుడు’
- ఒంటరవుతున్న జూనియర్
- పేరు మార్చుకున్న తారకరత్న
- ఇకపై ఇండవూస్టీలో మరో ఎన్టీఆర్
- బాబుకు దూరమైన జూనియర్
- స్టూడియోఎన్ నుంచి లోకేష్ ఔట్!
- బాలకృష్ణ మద్దతూ బాబుకే
- చక్రం తిప్పుతున్న చంద్రబాబు?


నందమూరి-నారా కంబైన్స్
సమర్పించు..! ప్రముఖ రాజకీయ చాణక్యుడి మార్గ‘దర్శకత్వం’లో! సినిమాలో రాజకీయం..
రాజకీయంలో సినిమా కలగలిసిన సరికొత్త స్క్రీన్‌ప్లే!
రాజకీయ, నట వారసుపూవరు? ఇదీ స్టోరీ లైన్! సినిమా పేరు
‘ఆధిపత్య పోరు’! నటీనటులు పాతవారే. కాకపోతే కొత్త పాత్రల్లో! మొన్నటిదాకా అక్కరకొచ్చిన పాత్ర.. ఇప్పుడు భారంగా తయారైంది! ఆ క్యారెక్టర్ పక్కకు పోయి.. అదే పేరుతో మరో క్యారెక్టర్ ముందుకు వచ్చింది. మరికొన్ని క్యారెక్టర్ల తీరూ మారిపోయింది. కొంతకాలంగా షూటింగ్ జోరుగా
సాగుతోంది! ప్రస్తుతం క్లయిమాక్స్ పనులు పూర్తి చేసుకుంటూ.. వీలైనంత త్వరలో
రచ్చకెక్కనుంది.

babu2012-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతలవని తలంపుగా బాలకృష్ణ పర్యటనలకు వెళ్లి తొడలు కొట్టడంలోని ఆంతర్యమేంటి? తారక రత్న తన పేరును ఎన్టీఆర్ అని మార్చుకోవడం వెనుక కిటుకేంటి? తన మామ చానల్‌లో ఆధిపత్యం వహిస్తున్న నారా లోకేష్‌ను జూనియర్ ఎన్టీఆర్ తప్పించడం వెనుక మతలబులేంటి? మొన్నటి ఎన్నికల ముందు అక్కున చేర్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి వంశం దూరంగా ఉంచడంలో రాజకీయం ఏమిటి? కొత్త రాజకీయ చిత్రంలో నారా చంద్రబాబు పాత్రేంటి? ‘అధినాయకుడు’, ‘నందీశ్వరుడు’తో చంద్రబాబు ఆడిస్తున్న చదరంగంలో జూనియర్ ‘దమ్ము’ నిరూపించుకుంటాడా? అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆధిపత్య పోరు’!

(-హైదరాబాద్) మొన్నటిదాకా తమదంతా ఒకే కుటుంబం అని చెప్పుకున్న నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు విభేదాలు బట్టబయలవుతున్నాయి. చాలా కాలందూరం పెట్టి.. మళ్లీ దగ్గరకు తీసుకున్న హరికృష్ణ రెండో భార్య తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ దూరం పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే నట సమ్రాట్ నందమూరి తారక రామారావుకు నట వారసుడిని తానేనని రుజువు చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.

బాలకృష్ణ తర్వాత సినిమా రంగంలో మూడోతరం ఎవరూ క్లిక్ కాకపోవడం కూడా జూనియర్‌కు కలిసొచ్చింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సలహా మేరకు రాజకీయ బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. తన పదునైన ఉపన్యాసాలతో భారీగానే జనం దృష్టిని ఆకర్షించాడు. దీంతో చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టగల చరిష్మా ఉన్నవాడిగా జూనియర్ నిలుస్తాడన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇదే అంశం నందమూరి వంశంలో ఇతర యువతారలకు గిట్టడం లేదని తెలుస్తోంది. ఫలితంగానే జూనియర్‌ను పక్కనపె తతంగం నడుస్తోందని సినీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి!

కలిసొచ్చిన తాత పోలికలు
జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంతో బాలనటుడిగా రంగవూపవేశం చేశారు. అచ్చుగుద్దినట్లు తాత పోలికలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకొని ప్రేక్షకులు ఆదరించారు. సినిమా సినిమాకీ ఎదుగుతూ, అతి తక్కువ కాలంలోనే సినీ పరిక్షిశమలో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. నందమూరి అభిమానులు చేత యంగ్‌టైగర్‌గా పిలుపించుకుంటూ తిరుగులేని హీరోగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే మొదట్లో జూనియర్‌ను నందమూరి కుటుంబం పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. కానీ.. హీరోగా మంచి గుర్తింపు రావడంతో అనివార్యంగా అతడిని కుటుంబంలో కలుపుకోవాల్సి వచ్చిందని పరిశీలకులు చెబుతుంటారు.

తర్వాతి కాలంలో జూనియర్.. నందమూరి కుటుంబంలో ప్రముఖ స్థానాన్నే పొందాడు. ఇదంతా ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కృషిగానే పేర్కొంటుంటారు. ఏడాది పాటు శ్రమించిన చంద్రబాబు.. జూనియర్‌ను నందమూరి ఫ్యామిలీలో ఒకడిని చేయగలిగారని అంటారు. ఇందులో ఆయన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నవాదన లేకపోలేదు. దానిని నిరూపించే ఘటనలు అనంతరకాలంలో జరిగాయి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి కుటుంబంతో సంబంధాలు సరిగ్గా లేవు. హరికృష్ణ మొదటి భార్య తనయుడు కళ్యాణ్‌రామ్‌తో జూనియర్‌కు సత్సంబంధాలు లేవని చెబుతుంటారు. కుటుంబాల మధ్య రాకపోకలు కూడా వుండేవి కావు. జూనియర్‌కు, బాలకృష్ణకు మధ్య కూడా అంత బలమైన సాన్నిహిత్యం ఉన్నట్లు దాఖలాలు లేవు. బాలకృష్ణ కూతురికి, చంద్రబాబు కొడుకుకి నిశ్చితార్థం జరిగిన రోజు మధ్యలోనే జూనియర్ బయటికి వచ్చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలకు దారి తీసింది.

ఇటువంటి పరిస్థితుల్లో 2009 ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటే ప్రయోజనం ఉంటుందని భావించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేకసార్లు మాట్లాడటం ద్వారా అందర్నీ ఒక్క దగ్గరకు చేర్చారు. ఇక తాత స్థాపించిన టీడీపీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కార్యక్షికమాల్లో పాల్గొని మామయ్య చంద్రబాబు నాయుడు మెప్పు కూడా పొందాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయించడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. మొత్తంగా జూనియర్ కూడా నందమూరి ఫ్యామిలీలో ఇమిడిపోయారని ఆయన అభిమానులూ, టీడీపీ శ్రేణులూ సంతోషించాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తమలో ఒకడిగా ఆత్మీయంగా మెలిగిన జూనియర్‌ను ఇప్పుడు మెల్లమెల్లగా అటు సినీ రంగంలో ఒంటరిని చేసేందుకు, భవిష్యత్ రాజకీయ చిత్రం నుంచి తొలగించేందుకు పావులు కదులుతున్నాయని తెలుస్తోంది.

‘కథ’ మొదలైంది ఎక్కడంటే...
ఇది దాదాపు ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటన! కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో తనకు అవమానం జరిగిందని ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అలిగిన సందర్భంలో ఈ ఆధిపత్య పోరుకు బీజం పడిందని చెబుతారు. తండ్రికి జరిగిన అవమానంపై ఆగ్రహించిన జూనియర్.. ఆ రోజు నుంచే ఇకపై టీడీపీతో కానీ, చంద్రబాబుతో కానీ సంబంధాలు కొనసాగించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో సింగపూర్‌లో ఉన్న చంద్రబాబు.. అక్కడి నుంచే జూనియర్‌కు ఫోన్ చేసి.. బుజ్జగించేందుకు ప్రయత్నించారని, కానీ.. చంద్రబాబు ఫోన్‌ను జూనియర్ ఆన్సర్ చేయలేదని వార్తలొచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అంతరం పెరిగిందని చెబుతున్నారు.

బాలకృష్ణ సైతం ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మారారని సమాచారం. రామారావు పేరు పెట్టుకుని సినిమాల్లోకి జూనియర్ రావడం, ఎదగడం జీర్ణించుకోలేకపోయిన నందమూరి కుటుంబీకులు.. జూనియర్‌కు పోటీగా హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కల్యాణ్‌రామ్‌ను, ఎన్టీఆర్ మరో తనయుడు మోహనకృష్ణ తనయుడు తారకరత్నను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కళ్యాణ్‌రామ్ సొంతంగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అంటూ తాత పేరు మీద సొంతంగా బేనర్‌ను స్థాపించాడు. నిజానికి అప్పటికి అంత అవసరం లేకపోయినా.. ఏనాటికైనా జూనియర్ ఎన్టీఆర్.. తాత పేరుతో బేనర్ స్థాపించి.. ఆ క్రెడిట్ కూడా కొట్టేస్తాడేమోనన్న అనుమానంతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో బేనర్ స్థాపించాడన్న వాదన ఉంది.

ఇక తారకరత్న విషయానికొస్తే అతనితో ఒకే రోజు 9 చిత్రాలు ఓపెనింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేయించాలని చూశారు. అయితే అందులో ఒకటి రెండు మినహా మిగతా చిత్రాలన్నీ అటకెక్కాయి. ఆ తర్వాత తారకరత్న పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. ఈ మధ్య పూర్తిగా దృష్టి కేంద్రీకరించి.. నందీశ్వరుడు పేరుతో సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇకపై తన పేరు నందమూరి తారక రామారావుగా మార్చుకుంటున్నట్లు తారకరత్న ప్రకటించడం ఈ కుటుంబంలో రోజు రోజుకు రగులుతున్న చిచ్చుకు, ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. తారకరత్న పేరు మార్పిడి విషయంలో నందమూరి కుటుంబ సభ్యుల ప్రోద్బలం కూడా ఉందని సమాచారం.

బాలకృష్ణ తర్వాత నందమూరి వంశంలో తదుపరి స్థానం జూనియర్ ఎన్టీఆర్‌దేని అందరూ అంటుండటం కూడా నందమూరి కుటుంబీకులు తారకరత్న పేరు మార్పుపై ప్రభావం చూపిందని పరిశీలకులు అంటున్నారు. అటు బాలకృష్ణ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని చేసిన ప్రకటన కూడా ఈ ఆధిపత్య పోరులో భాగమేనని తెలుస్తోంది. రాజకీయవారసుడు కూడా జూనియరేనన్న ముద్ర పడిపోక ముందే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బాలకృష్ణ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

డైలమాలో ఎన్టీఆర్ కెరీర్
నందమూరి కుటుంబం నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భవిష్యత్‌లో జూనియర్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే గత దసరాకు బాలకృష్ణ శ్రీరామరాజ్యం విడుదలకు సిద్ధమవుతుండగా జూనియర్ ఆ సినిమాకు పోటీగా తన ‘ఊసర విడుదల చేయాలని నిర్ణయించుకోవడంతో శ్రీరామరాజ్యం నవంబరులో విడుదలైందని సమాచారం. సినిమా కథ బాగున్నా.. ఊసర చిత్రానికి రామారావు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత లభించడంతో అది యావరేజీ చిత్రంగా నిలిచింది. శ్రీరామరాజ్యం చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణం జూనియర్ అని తెలిసిన నందమూరి అభిమానులు ఈ చిత్రానికి నందమూరి వ్యతిరేక ప్రచారాన్ని చేశారని తెలిసింది. ఇక ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో బాలకృష్ణ నటనకు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ లాంటి వారే ప్రశంసల వర్షం కురిపించినా జూనియర్ నుంచి ఆ చిత్రం గురించి కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం.

పైఎత్తుల్లో జూనియర్
తనను నందమూరి కుటుంబం మళ్లీ వెలి వేస్తోందని గమనించిన జూనియర్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తన మామ నార్నే శ్రీనివాసరావుతో కలిసి తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు సమాచారం. ఫలితంగానే స్టూడియో ఎన్ బాధ్యతల నుంచి లోకేష్‌ను తప్పించారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ను తప్పించిన జూనియర్.. స్టూడియోఎన్‌ను తన ఆధీనంలో తీసుకున్నారని చెబుతున్నారు. ఈ పరిణామం చంద్రబాబు, బాలకృష్ణలకు మరింత ఆగ్రహం కల్గించిందని సమాచారం. త్వరలోనే జూనియర్ మరో చానల్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ పరిక్షిశమలో చర్చ జరుగుతోంది. స్టూడియో ఎన్‌లో ఇవాల్టికివాళ చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు పెద్దగా ప్రచారం కూడా ఇవ్వలేదు.

గత కొద్దికాలం నుంచే ఈ చానల్‌లో చంద్రబాబు ప్రచారం తగ్గినట్లు చెబుతున్నారు. అయితే మెలితిప్పిన మీసంతో ‘నందీశ్వరుడు’ అంటూ హంగామా చేసిన మాత్రాన తారకరత్న అలియాస్ కొత్త ఎన్టీఆర్‌కు ఒరిగేదేమీ లేదని, ఎవరు అవునన్నా కాదన్నా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేంత వరకు బాలకృష్ణ తర్వాత మళ్ళీ ఆ చరిష్మా జూనియర్‌కే ఉంటుందని పరిక్షిశమ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తాజా పరిణామాలు నందమూరి కుటుంబంలో ఆధిపత్యపోరు సాగుతున్నదన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదంతా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో జరుగుతున్నదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Take By : T News

Read more...

Monday, December 26, 2011

చంద్రబాబూ ఖబర్దార్..

-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ


TRS-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.

సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు

Take By: T News

Read more...

Sunday, December 25, 2011

కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర

- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం


chandra-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!

దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!

రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.

చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.

అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News   :

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP