Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, December 25, 2011

క్రిస్మస్‌కు ముస్తాబైన మెదక్ చర్చి



Cherch talangana patrika telangana culture telangana politics telangana cinemaమెదక్, డిసెంబర్ 24 (): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారం రోజులుగా సమష్టి కృషితో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెవండ్ బిషప్ కనకవూపసాద్ భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇక్కడ జరిగే వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగాడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులే కాకుండా మతాలకతీతంగా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు రానున్నారు. దాదాపు రెండు లక్షల మంది దాకా రావచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 

వేడుకలను పురస్కరించుకొని మెదక్‌కు ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ తెలిపారు.

Read more...

కిరణ్‌కు కొత్త టీం!

- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.

.
1-(6)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.

వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.

ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.

కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.

తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.

ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.

ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.

Take By: T News  

Read more...

కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర

- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం


chandra-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!

దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!

రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.

చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.

అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News   :

Read more...

Saturday, December 24, 2011

Court orders summons to websites for webcasting objectionable content

In yet another blow to 21 social networking sites including Facebook, Microsoft, Google, Yahoo and Youtube, a Delhi court on Friday issued summons to them for facing trial for allegedly webcasting objectionable contents. 

Metropolitan Magistrate Sudesh Kumar took cognizance on a private criminal complaint and directed the Centre to take “immediate appropriate steps” and also file a report in the court by January 13. 

The court's order came three days after another court in a civil case restrained these sites from webcasting any “anti-religious” or “anti-social” content promoting hatred or communal disharmony. 

In the fresh case, the court said: 

“It appears from a bare perusal of the documents that prima facie the accused, in connivance with each other and other unknown persons, are selling, publicly exhibiting and have put into circulation obscene, lascivious content which also appears to the prurient interests and tends to deprave and corrupt the persons who are likely to read, see or hear the same. 

“It is also evident that such contents are continuously openly and freely available to everyone who is using the said network irrespective of their age and even the persons under the age of 18 years have full and uncensored access to such obscene contents.” 

The Magistrate has summoned the accused companies to face trial for allegedly committing the offence punishable under Section 292 (sale of obscene books etc.), 293 (sale of obscene objects to young persons etc.) and 120-B (criminal conspiracy) of the IPC. 

The Magistrate noted that the website material submitted by the complainant, Vinay Rai, a journalist, contained obscene pictures and derogatory articles pertaining to Islam, Christianity and Hindu gods and godesses.
The Magistrate said that as per the records placed before the court by the complainant, there were defamatory and obscene articles pertaining to various Indian political leaders which are being webcasted by these sites. 

“The contents are certainly disrespectful to the religious sentiments and faith and seem to be intended to outrage the feelings of religious people whether Hindu, Muslim or Christian.
“There are certain degrading and obscene photographs of various political leaders belonging to different political parties and photographs pasted and the language used is also obscene, filthy and degrading,” the court said. 

It said that prima facie the accused were also liable to be summoned for offences of promoting enmity between classes and causing prejudice to national integration but due to an embargo under the Code of Criminal Procedure, the court could not summon them under these offences without prior sanction of the Central or State government or District Magistrate. 

“I find prima facie that the accused persons are liable to be summoned for offences under section 153-A [promoting enmity between classes], 153-B [assertion prejudicial to national integration]and 295-A [insulting religion or religious belief of any class] IPC… However, owing to the embargo under Section 196 of the Cr.PC, which prohibits taking of cognizance under the said provisions except with the previous sanctions of the Central or State government or district magistrate, the accused persons are not summoned for the said offences.” 

Mr. Rai, in his complaint filed through advocate Shashi Tripathi, said the contents hosted on these were “inflammatory” and sought to create enmity and communal violence among various religious communities. 

He alleged that the contents on these sites were obscene and might lead to “creation of obscene books, pamphlets, papers which can easily be downloaded from these social networking websites affecting the minds of children and were harmful for social harmony and may lead to increase in crime against women also.” 

Take By: The Hindu News

Read more...

కరకు మాటల కట్జు (Justice Markandey Katju blasts the media )

- సినిమా, క్రికెటర్లకు భారతరత్న ఇస్తారా!
- ఇది దిగజారుడుతనమే- స్వీయ అవసరాల కోసమే 90% పాత్రికేయులు పని చేస్తున్నారు
- వినోదానికే మీడియా ప్రాధాన్యం
- వివాదాస్పదమవుతున్న ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ వ్యాఖ్యలు


pysical talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, డిసెంబర్ 23:దేవానంద్ చనిపోతే ఆ వార్తను మొదటి పేజీలో వెయ్యాలా? దేశంలోని మీడియా 90 శాతం వినోదాత్మక అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది! పత్రికా స్వాతంత్య్రం పేరుతో మీడియా పరిధులు దాటి ప్రవర్తిస్తోంది. దేశంలోని 90 శాతం మంది పాత్రికేయులు సామాన్య ప్రజల కోసం కాకుండా, స్వీయ అవసరాల కోసం పనిచేయడం దారుణం! భారత రత్న అవార్డు క్రికెటర్లకు, సినిమా తారలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది! ఇవి ఎవరో మామూలు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాదు! దేశ పత్రికా వ్యవస్థను నియంవూతించే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు చేసిన విమర్శలు! అసలు మీడియా బాధ్యతే లేనట్లు ప్రవర్తిస్తోందన్న స్థాయిలో కట్జు దుమ్మెత్తిపోయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏ వ్యవస్థలోనైనా ఎన్నోకొన్నిలోపాలు ఉండటం సహజం. మీడియా అందుకు అతీతమేమీ కాదు. కానీ.. మొత్తం అన్ని మీడియా సంస్థలను కలగలిపేసి మార్కండేయ వరుస వ్యాఖ్యానాలు చేయడంపై అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. అయినా కట్జు కరుకు మాటలు ఆగడం లేదు. తాజాగా ఆయన భారత రత్న అవార్డు ఎవరికి ఇవ్వాలనే అంశంపై స్పందించారు.

కట్జు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని...
‘ఇప్పుడు ప్రజలంతా భారతరత్న అవార్డును క్రికెటర్లకు, సినిమాస్టార్లకు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. తరిగిపోతున్న సాంస్కృతిక విలువలను ఇది గుర్తు చేస్తోంది. మనం నిజమైన హీరోలను వదిలేస్తున్నాం. ఈరోజు మనదేశం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. మన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడు కావాలి.

అటువంటివారికే భారతరత్న ఇవ్వాలి. ఇప్పటికే వారు చనిపోయి ఉన్నా వారికి అవార్డు ఇవ్వాలి. క్రికెటర్లు, సినిమాస్టార్ల లాంటి సాంఘిక ఔచిత్యం లేని వారికి భారతరత్న ఇవ్వడం అవార్డు ఔన్యత్యాన్ని దిగజార్చడమే. సచిన్, ధ్యాన్ చంద్ లాంటి వారికి భారతరత్న ఇవ్వడానికి బదులు ఉర్దూ కవి మీర్జా గాలిబ్, బెంగాల్ రచయిత శరత్‌చంద్ర, తమిళనాడు కవి సుబ్రమణ్య భారతికి భారత రత్న ఇవ్వాలి.

l సినిమా నటుడు దేవానంద్ మరణవార్తను మొదటి పేజీలో వేస్తారా? దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఫొటోలను మధ్య పేజీలలో వేసి సినిమా స్టార్ మరణవార్తను మొదటిపేజీలో వేయడంలో ప్రాముఖ్యం ఏంటి? భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వార్తలు రాయాలి. దేవానంద్ సినిమాలను చిన్నతనంలో చూశాను. ఆయన నటనను ఇష్ట పడ్డాను.

l సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉన్న అనైతిక సమాచారాన్ని తొలగించాలన్న సమాచార శాఖ మంత్రి కపిల్ సిబాల్ అభివూపాయానికి మద్దతు పలుకుతున్నాను. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలంటే ఇంటర్‌నెట్‌లో ఉన్న అనైతిక సమాచారాన్ని తొలగించాలి. ఇలా చేయడం తప్పుకాదు.

l దేశంలోని మీడియా 90 శాతం వినోదాత్మక అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. దేశ ప్రయోజనాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రజలకు అవసరమైన వార్తలు అందించకుండా, అన్నీ తెలుసని వారికి వారే మేధావులమని అనుకుంటే ఎలా? జర్నలిస్టులంతా చరివూతతోపాటు భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి. అప్పుడే వారు రాసిన వార్తలలో తప్పులు దొర్లవు.

l దేశంలోని ఎలక్షిక్టానిక్ మీడియాను కూడా ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలి. స్వీయనియంవూతణ పాటించని చానళ్లపై చర్యలు తీసుకోవాలి. పత్రికా స్వాతంత్య్రం పేరుతో మీడియా పరిధులు దాటి ప్రవర్తిస్తోంది. అపరిమిత స్వేచ్ఛను అరికట్టాలి.

l పాత్రికేయులంతా మనదేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేశంలోని 90 శాతం మంది సామాన్య ప్రజలకోసం పనిచేయకుండా వారి స్వీయ అవసరాల కోసం పనిచేయడం దారుణం. ఈ అంశాలను క్రమబద్ధీకరించడానికి ప్రెస్ కౌన్సిల్‌కు మరిన్ని అధికారాలు కావాలి.

Read more...

ఉడుకుతున్న భూగోళం (Global Warming)

glob talangana patrika telangana culture telangana politics telangana cinema
- హరిత గృహ వాయువులతో ఉష్ణోక్షిగతలో తీవ్ర మార్పులు
- ప్రతి దశాబ్దానికి 0.1 డిగ్రీల సెంటిక్షిగేడ్ పెరుగుదల
- కరిగిపోనున్న ధ్రువపు మంచు- వచ్చే కొన్నేళ్లలో..జీవం మనుగడ ప్రశ్నార్థకం
- ఖండాల శీతోష్ణస్థితిలో పెనుమార్పులు - భారత్‌కూ పెను ముప్పు


ఏళ్లుగా భూవాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. చలికాలంలో వేడి, వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు, ఎండ కాయాల్సిన సమయంలో వానలు పడుతూ.. జనజీవనాన్ని శీతోష్ణస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీటికి తుఫాన్‌లు తోడై జీవజాతిని కలవరపెడుతోంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా..? మానవుల స్వయంకృతాపరాధం వల్ల పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు.

వాతావరణంలో వీటి చేరిక అధికమై భూగోళం మండిపోతోంది. పారిక్షిశామికాభివృద్ధి పేరిట గాలిలోకి వదులుతున్న కర్బనం భూమినే మింగేసే స్థితికి చేరుకుంది. హరిత గృహ వాయువు నగీన్‌హౌస్ గ్యాసెస్) ల వల్ల ఉష్ణోక్షిగతలు ఉచ్ఛస్థితికి చేరుకున్నాయి. ఏడాదికేడాది ఉష్ణోక్షిగత పెరుగుదల పరంపర ఇలాగే కొనసాగితే.. భూమి వేడెక్కి శీతోష్ణస్థితిలో తీవ్ర మార్పులు రానున్నాయి. ఫలితంగా.. కరువు, క్షామంతోపాటు హిమానీ నదాలు కరగడంతో సమువూదాలు ఉప్పొంగి ధరివూతిపై జీవం మనుగడే ప్రశ్నార్థకమవనుంది. ఈ భయంకర నిజాలు నాసా పరిశోధనలో వెలుగుచూశాయి.

పారిక్షిశామిక యుగాని కంటే ముందు కాలం (1880)తో పోల్చినపుడు ప్రస్తుతం భూ ఉపరితల ఉష్ణోక్షిగత 0.8 డిగ్రీ సెంటిక్షిగేడ్ (1.4 డిగ్రీల ఫారన్‌హీట్స్) పెరిగింది. అంతటితో ఆగకుండా ప్రతి దశాబ్దానికి ఉష్ణోక్షిగత 0.1 డిగ్రీల సెంటిక్షిగేడ్ (0.2 డిగ్రీల ఫారన్‌హీట్‌కు) పెరుగుతూనే ఉంది. ఫలితంగా పగలు, రాత్రి ఉష్ణోక్షిగతలు అమాం తం పెరిగిపోయి.. చల్లని వాతావరణమే కనుమరుగవుతోంది. వేడి పవనాలు భూవాతావరణంలోకి దూసుకొస్తున్నాయి. దీంతో శీతోష్ణస్థితి సమతౌల్యం దెబ్బతిని పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి.

1970 నుంచి ప్రపంచంలోని చాలా చోట్ల కరువుకు ప్రధానం కారణం ఈ భూతాపమే. ఉష్ణోక్షిగతలో మార్పుల వల్ల ప్రపంచ దేశాలను సైక్లోన్‌లు కుదిపేస్తున్నాయి. వీటి తాకిడికి కోట్ల మంది ప్రజలు నిరాక్షిశయులై ఆకలితో అలమటిస్తున్నారు. హిమానీ నదాల కరుగుదల ఈ ఉష్ణోక్షిగతలో మార్పులతో ముంచుకొచ్చే పెనువూపమాదం. 1880 నుంచి ఇప్పటి వరకూ పెరుగుతున్న ఉష్ణోక్షిగత వల్ల ఇప్పటికే ధ్రువాల వద్ద ముఖ్యంగా మంచు దుప్పటి అలుముకున్న అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరిగి సముద్ర మట్టాల స్థాయి ఘననీయంగా పెరిగిపోయింది.

ఈ రెండు ప్రాంతాల్లో నాసాకు చెందిన గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 10,000 ఏళ్ల క్రితం సముద్రం మట్టం స్థాయి 25 మీటర్లు (82 ఫీట్లు) ఉండేది. అప్పటి నుంచీ భౌగోళిక ఉష్ణోక్షిగత ప్రతీ డిగ్రీ పెరుగుదలకు సముద్ర మట్టం స్థాయి 20 మీటర్లు (66 ఫీట్లు) పెరుగుతున్నట్లు పరిశోధకులు లెక్కకట్టారు. మంచు కరుగుదల అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండకుండా పశ్చిమ అంటార్కిటికాలోని పైన్ దీవిలో అనూహ్య పరిమాణంలో ఉంటోందని తేల్చారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే.. 2100 సంవత్సరంలో సముద్ర మట్టపు స్థాయి పెరిగి నీరంతా భూమిని ముంచేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఉష్ణోక్షిగతలో పెరుగుదలకు కారణం..
పారిక్షిశామిక యుగం పూర్వం కంటే ప్రస్తుత కాలంలో ఉష్ణోక్షిగతలో పెరుగుదలకు ప్రధాన కారణం హరిత గృహ వాయువులు. విద్యుత్ ఉత్పత్తికి శిలాజ ఇంధనాలను మండిచడం, కార్లు, భాకీ పరిక్షిశమల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరి భూతాపాన్ని కలుగజేస్తున్నాయి. 10,000 సంవత్సరాలకు పూర్వంతో పోల్చినపుడు వాతావరణంలో కార్బన్‌డయాకె్సైడ్ శాతం రెట్టింపు పరిమాణంలో ఉండడం ఉష్ణోక్షిగత పెరుగుదలకు దారితీసింది. పారిక్షిశామిక ఉద్గారాలలో కార్బన్‌డైఆకె్సైడ్‌ను 390 పార్ట్స్ ఫర్ మిలియన్లకు తగ్గించాల్సి ఉంటుంది.

అయితే దీనిపై దేశాధినేతలు క్రోటోవూపొటోకాల్ ఒప్పందం చేసుకుని దశాబ్దాలుగా చర్చలు జరుపుతున్నా.. అవి ఓ కొలిక్కి రాకపోవంతో 350 పార్ట్స్ ఫర్ మిలియన్ల కార్బన్‌డైఆకె్సైడ్ వాతావరణంలో కొనసాగుతూనే ఉంది. దీనిపై దేశాధినేతలు సాచివేత ధోరణి అవలంభిస్తుండటంతో భౌగోళిక వాతావరణంలో కార్బన్ ఉద్గారాల స్థాయి సంవత్సరానికి సరాసరిగా 0.0001 పార్ట్స్ ఫర్ మిలియన్ పెరుగుతోంది. దీని ప్రభావం వల్లే ఇప్పటికే ధ్రువవూపాంతాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుదల రూపంలో భవిష్యత్తు విపత్తు కళ్లముందు కదలాడుతోంది.

భూతాపం పరిణామాలు
nasa talangana patrika telangana culture telangana politics telangana cinema1. భూమిపై చల్లని రాత్రి, పగలు, మంచు తగ్గిపోయాయి
2. రాత్రి, పగటి ఉష్ణోక్షిగతలు గణనీయంగా పెరిగాయి
3. మైదాన ప్రాంతాల్లోకి వేడిగాలులు వీస్తున్నాయి.
4. సముద్ర మట్టాల స్థాయి పెరిగిపోయింది
5. 1970 నుంచి కరువు తాండవం చేస్తోంది
6. మూడు దశాబ్దాలుగా.. సైక్లోన్ల తాకిడి పెరిగిపోయింది
7. ఉష్ణమండల ప్రాంతంలో నీటి వనరులు తగ్గిపోయాయి

ఖండాలపై ప్రభావం
1. అమెరికా ఖండం: పశ్చిమ ప్రాంతంలోని మంచు చాలా వరకు కరిగిపోయింది. వర్షాధార ప్రాంతంలో 5-10 శాతం పంట నికర దిగుబడి తగ్గిపోయింది. అధిక తీవ్రత గల వేడిగాలులు నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తూర్పు అమజోనియాలోని సవన్నా అడవులు తగ్గిపోయి జీవ వైవిధ్యంలో భారీ వ్యత్యాసం ఏర్పడింది.
2. ఐరోపా: సముద్ర మట్టాల పెరుగుదలతో వరదల బీభత్సం పెరిగిపోయింది. పర్వత ప్రాంతాల్లో హిమానీ నదాలు కరిగిపోయాయి. మంచు తగ్గిపోవడంతో అనేక జీవజాతులు కనుమరుగైపోయాయి. దక్షిణ ఐరోపాలో పంట దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది.
3. ఆఫ్రికా: వర్షాలు తగ్గిపోవడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 2020 కల్లా 75 నుంచి 250 మంది ప్రజలు నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతారని అంచనా. పదేళ్లలో 50 శాతం పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది.
4. ఆసియా: కేంద్ర, దక్షిణ, తూర్పు, ఆగ్నేయాసియాలో 2050 వరకు మంచినీటి లభ్యత గణనీయంగా తగ్గనుంది. తీరవూపాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం అధికం.

భారత్‌కూ పొంచి ఉన్న ముప్పు
అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలనే లక్ష్యంతో పారిక్షిశామికాభివృద్ధికి కృషి చేస్తోన్న భారత్‌లోనూ ఉద్గారాలు తీవ్రత హెచ్చుస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో గత కొంతకాలంగా మన దేశంలో భూతాపం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. దీనివల్ల సహజవనరులు, వ్యవసాయం, నీరు, అడవులు తగ్గిపోయి కరువు బారినపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2045 కల్లా శీతోష్ణస్థితిలో భారీగా మార్పులు చోటుచేసుకున్న దేశాలలో మూడో స్థానంలోకి భారత్ ఎగబాకనుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కమ్యూనికేషన్స్ (నాట్కామ్) పేర్కొంది.

భారత్‌పై భూతాప ప్రభావం
1. గంగా, బ్రహ్మపుత్ర నదీ ప్రాంతంలోని హిమానీ నదాలు క్షీణిస్తున్నాయి. వేసవిలో మంచు కరిగి 70 శాతం నీటి రూపంలో వెళ్లిపోతోంది
2. అస్థవ్యస్థ రుతుపవనాల వల్ల నదులలోని నీరు తగ్గి.. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి కుంటుపడుతోంది
3. ప్రతి 1 డిగ్రీ సెంటిక్షిగేడ్ ఉష్ణోక్షిగత పెరుగుదలకు 4-5 మిలియన్ టన్నల గోధుమల ఉత్పత్తి తగ్గిపోతోంది
4. సముద్ర మట్టం పెరిగిపోయి తీరవూపాంత ప్రజలకు మంచినీరు కరువవుతోంది
5. దేశ తీర, ఉష్ణమండల ప్రాంతంలో వరదలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది
6. నాసా అధ్యయనం ప్రకారం భూతాపం వల్ల 2050 కల్లా భారత్‌లోని 50 శాతం అటవీవూపాంతం కనుమరుగైపోయి..జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది.-సెంట్రల్ డెస్క్

Take By: T News  

Read more...

సమన్వయంతో అణిచేద్దాం!

కాంగ్రెస్ సమన్వయ కమిటీ అసలు కోణం ఇదే!
- అందుకే తెలంగాణ వ్యతిరేకులకు చోటు
- ప్రత్యేకవాదం వినిపించేందుకు ఒక్కరూ లేరు
- తెలంగాణ నుంచి ముగ్గురున్నా..ముగ్గురివీ వ్యక్తిగత ప్రయోజనాలే!
- కమిటీ ఏర్పాటులో ముందు జాగ్రత్త


TG-copy talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 23 ():‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు వెనుక తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాలు దాగి ఉన్నాయా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆకాంక్షలను కట్టడి చేయడానికే ఈ కమిటీని ముందుకు తీసుకువచ్చారా? తెలంగాణకు బద్ధ వ్యతిరేకులను, తెలంగాణపై గట్టిగా మాట్లాడని వారిని కమిటీలోకి తీసుకోవడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటి? తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే ఏ ఒక్క నాయకుడికీ ఈ కమిటీలో ఎందుకు స్థానం దక్కలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఉద్దేశించినట్లు చెబుతున్న సమన్వయ కమిటీ విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలివి!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలోదారిన నడుస్తున్నారు కనుక, అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసేందుకు అంటూ సమన్వయ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలోకి సభ్యులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏ పదవీ లేదని రుసరుసలాడుతున్న చిరంజీవిని తీసుకోవడంతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ కావూరి సాంబశివరావును తీసుకున్నారు. గతంలో ఈ కమిటీలో ఉన్న జానాడ్డి, కేవీపీ రామచందర్‌రావు, గీతాడ్డిని ఈ సారి పక్కనపెట్టారు. మొత్తంగా ఈ కమిటీలో తెలంగాణ అంశాన్ని గట్టిగా వినిపించే నాయకుడుకానీ, ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తే గట్టిగా అడ్డుకునే నేత లేకపోవడంపై ప్రత్యేక రాష్ట్ర వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డుకునేందుకు, అణచివేసేందుకు ముందు జాగ్రత్తగా రూపొందించిన పక్కా పథకమని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులైన వారిని ఈ కమిటీలో నియమించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణవారే అయినా.. వీరు ముగ్గురూ అంత గట్టిగా తెలంగాణవాదం వినిపిస్తున్న వారు కాదు.


డీ శ్రీనివాస్ తెలంగాణపై ఏదో ఒకటి చెబుతున్నా ఆయన లక్ష్యం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద ఆశీస్సులు పొందటం కోసమేనన్నట్లు కనిపిస్తోందని విమర్శలున్నాయి. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ అగుపించటం లేదు. ఏ పదవీ లేనపుడు అంతో కొంతో తెలంగాణ అంటూ మాట్లాడిన డీఎస్ తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కటంతో ఇతరత్రా పదవుల కోసమే అంగలారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ అభివృద్ధి మండలిని కేంద్రం వేస్తే.. దానిపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏనాడూ తెలంగాణవాదిగా మాట్లాడకపోవటం గమనార్హం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పదవిని వాడుకుంటున్నారు తప్పితే తెలంగాణవాదాన్ని వినిపించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదని పలువురు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కావడంతోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీని ద్వారా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను తెచ్చుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ శాఖ కోసం పట్టుబట్టిన ఆయన.. అధిష్ఠానం వద్ద ఇప్పటికే తన అభ్యర్థనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక, షబ్బీర్‌అలీ కూడా తెలంగాణకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్‌తో సన్నిహితంగా ఉండి ఈ కమిటీలో స్థానం పొందారని అంటున్నారు.

ఆయన కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలు బహు అరుదు. కాగా, కమిటీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారందరూ తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణవాదుల ముందు మాత్రం తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఈ మేరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా సమైక్యవాదిగానే వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవటం లేదు. కరడుగట్టిన సమైక్యవాదిగా చెప్పుకునే చిరంజీవికి ఈ కమిటీలో ప్రాతినిథ్యం లభించింది. ఆయన తెలంగాణను నేరుగా వ్యతిరేకిస్తున్నారు.

ఆయనకంటే కావూరి సాంబశివరావు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ లాబీయింగ్ విస్తృతస్థాయిలో ఉందని, దీనికి జాతీయ నాయకులు కూడా ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సమైక్యవాదులకు పెద్ద పీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం పట్ల తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కీలక సమయాల్లో కట్టడికే!
తెలంగాణ ఉద్యమం సంధికాలాన్ని దాటుకుని మరోసారి విజృంభించే పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. ఉద్యోగ జేఏసీలు మొదలుకుని సింగరేణి తదితర చోట్ల నుంచి కూడా తెలంగాణ కోసం మరోసారి మహోద్యమానికి సిద్ధమన్న సంకేతాలు అందుతున్నాయి.

రాజకీయ పోరాటాలు కూడా మరింత ఉధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపైన, ఉద్యమాలపైన సర్కారు గతంలో అనుసరించిన పద్ధతులనే ఈ సారీ అనుసరించవచ్చు. గతంలో 42రోజులపాటు వీరోచితంగాసాగిన సకల జనుల సమ్మెసందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు జులుం ప్రదర్శించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తీవ్రంగా వేధించారు. దీనికి టీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతలు పెల్లుబికాయి. మళ్లీ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే సమన్వయ కమిటీలో మాట్లాడుకుంటాం.. అన్న మాట చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

దీంతో టీ కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించడానికి, వారు కూడా తమపై ఒత్తిళ్లను సమన్వయ కమిటీపైకి నెట్టేసేందుకు వీలు కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. పైగా టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన పక్షంలో వారిపై కేసుల విషయంలో సర్కారు తానుఅనుకున్నదే చేసేందుకు సమన్వయ కమిటీని ఉపయోగించుకోవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 2014 దాకా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ సాగదీస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శలదాడి నుంచి తప్పించుకోవడానికే ఈ కమిటీని ఉద్దేశించారని అంటున్నారు.

కిరణ్ వ్యూహమా?
సమన్వయ కమిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా ప్రధాన భూమికను వహించినట్టు తెలుస్తోంది. ఆజాద్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న కిరణ్.. రాష్ట్రంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఈ కమిటీ నిర్మాణానికి చొరవ తీసుకున్నారని, ఈ మేరకు ఆజాద్‌ను ఒప్పించారని చెబుతున్నారు.

రాష్ట్రంలో వైఎస్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించానని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించేలా పథకాల రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తున్నట్టు కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నట్టు తెలిసింది. దీంతో జగన్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, వైఎస్‌కున్న పలుకుబడి క్షీణించిందని, దీనివల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మేలు జరుగుతుందని కిరణ్‌కుమార్‌డ్డి రాష్ర్ట్ర ఇన్‌చార్జి వద్ద గట్టిగా వాదించి, రాష్ట్రంలో తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా కమిటీ నిర్మాణం జరిగేందుకు విజయవంతంగా కృషి చేసినట్టు చెబుతున్నారు.

వైఎస్ అత్యధిక ప్రచారం చేసుకున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రాజీవ్ ఉద్యోగశ్రీ, పావలా వడ్డీకే రుణాలు తదితర కార్యక్షికమాలు పూర్తిస్థాయిలో మార్చివేసి, వైఎస్ పథకాలు రాష్ట్రంలో లేకుండా చేసినట్టు ఆయన అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నారని అంటున్నారు. వాటి స్థానంలో రూపాయికే కిలో బియ్యం, రాజీవ్ ఉద్యోగ కిరణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వాటిని కాంగ్రెస్ పథకాలుగా రాష్ట్ర ప్రజలు గుర్తించేలా ప్రచార కార్యక్షికమాన్ని ముమ్మరం చేసినట్టు కూడా కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.

దీంతో కిరణ్‌కుమార్‌డ్డి అభీష్టం మేరకే సమన్వయ కమిటీ ఏర్పాటైందని, పీసీసీ అధ్యక్షుని హోదాలో కమిటీ సభ్యునిగా ఉన్న బొత్స సత్యనారాయణ మినహా ఇతరుపూవరూ కిరణ్‌కుమార్‌డ్డికి ప్రతికూలంగా మాట్లాడే అవకాశం లేదని, దీంతో ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా కమిటీకి రూపకల్పన జరిగిందని భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అధ్యక్షతన జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆజాద్ ముందు బొత్స సత్యనారాయణ పెద్దగా నిరసనలు తెలిపే అవకాశాలుండవని, అంతా తూతూమంవూతంగా జరుగుతుందనే అభివూపాయం వ్యక్తమవుతోంది.

Take By: T News  

Read more...

Friday, December 23, 2011

4.5 % reservation for Muslims: Rahul baba, Maya politics

New Delhi, December 23: Just ahead of Uttar Pradesh elections, Congress has played its minority card with the Union Cabinet on Thursday approving 4.5 per cent quota for minorities within the larger 27 per cent quota for the Other backward Classes (OBC) in central government jobs and educational institutions.

The Constitution bars reservations on religious lines; however, the government in this case is relying on Justice Sachar Committee and Ranganath Misra Commission. The two commissions have backed affirmative actions for Muslims calling their social economic status worse than even the schedule castes.

"UPA government is scared, working under fear. Now at the eve of elections, they are giving reservations to Muslim. What needs to be noticed, why now?," BSP MP Vijay Bahadur Singh said. 

The quota will come into effect from January 1, 2012.

"It is extremely dangerous for the secular fabric of the nation keeping polls in mind. One indulges in politics, with a reservation connected to it for a particular religion, I think it's unconstitutional and unpatriotic to do so," BJP MP Smriti Irani said.

Now, with Congress general secretary Rahul Gandhi aggressively campaigning to regain Muslim vote bank in UP. The move is being seen as one last desperate attempt to reach out to the Muslims which constitutes nearly 18 per cent of the total electorate in UP.

Take By: Siasat News

Read more...

సినిమా ప్రభావం సమాజం మీద ఉంటుందా - (లగేరహో..సినిమా)

సినిమా ప్రభావం సమాజం మీద ఉంటుందా?

rangulakala talangana patrika telangana culture telangana politics telangana cinema

సమాజమే సినిమాలకు ప్రేరణ అవుతుందా?
రెండూ జరుగుతున్నాయి
అందుకే కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ అయి...,
కొత్త సంస్కృతులనూ మోసుకొస్తుంటాయి
ఫ్యాషన్ నుంచి స్పోర్ట్స్ వరకూ అనేక రంగాల్లో
అవసరమైన స్ఫూర్తిని అందిస్తుంటాయి
అలాంటి సినిమాలు ఎక్కడున్నా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే


సరదాగా చెప్పుకున్నా, సీరియస్‌గా ఆలోచించినా అర్థమయ్యే ఒక విషయం ‘ప్రతి సినిమా సమాజంలోని పరిస్థితుల నుంచి పుడుతుంది. కానీ ప్రతి సినిమా ప్రజలపై ప్రభావం చూపించదు’ అని!

అందుకే ఒక సినిమా హిట్టయితే కొన్నాళ్ల పాటు ఆ సినిమా మాయలో ఉంటారు జనం. అది ఏ కుర్రాళ్లో, సినిమా పిచ్చోళ్లే అయితే పట్టించుకోనవసరం లేదు. కానీ మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు...ఇలా సమాజంలోని పెద్దలు ప్రభావితులైనప్పుడు మాత్రం కాస్త ఆలోచించాలి. మన టాలీవుడ్ పరిధి చిన్నది కాబట్టి దాని సంగతి పక్కనపెట్టి దేశవ్యాప్తంగా వ్యాపారం సాగే ‘బాలీవుడ్’ను ఓ సారి గమనిస్తే అలాంటి సినిమాలు కొన్ని కనిపిస్తాయి. అవి పక్కా సినిమా ఫార్ములాతో తీసినవే అయినప్పటికీ ఆలోచింపజేసే చిత్రాలు కావడం గమనార్హం.

3idiots talangana patrika telangana culture telangana politics telangana cinemaమున్నాభాయ్‌తో...
సంజయ్‌దత్ నటించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘లగేరహో మున్నాభాయ్’. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్టే. సగటు ప్రేక్షకుడి నుంచి మేధావుల వరకు అందరి దృష్టినీ ఆకర్షించింది. గాంధీజీ పుస్తకాలు చదివి ఆ ప్రభావంతో ఒక రౌడీలో వచ్చిన పరివర్తన అందరికీ నచ్చింది. అహింసా మార్గంలో, శాంతియుతంగా అన్యాయాల్ని ఎదురించే పద్ధతులు అందరినీ ఆకట్టుకున్నాయి. గులాబీలతో నిరసనలు తెలపడం, సహనంతో నిర్లక్ష్యాన్ని జయించడం వంటి సన్నివేషాలు విపరీతంగా ఆకర్షించాయి. అయితే అవి సినిమాలోనే కనిపించి ఆగిపోలేదు. బయటి ప్రపంచానికీ విస్తరించాయి. రాజకీయ నిరసనలు సైతం గులాబీపూల బహూకరణ దాకా వెళ్లింది. 2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సందర్భంలో తెలంగాణ వాదులు ఆంధ్ర అధికారులకు, నాయకులకు గులాబీలు అందజేసి మద్దతు కోరారు. జార్ఖండ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ తరహా నిరసనలు జరిగాయి. ఈ ఐడియాను సమాజంలో పాపులర్ చేసింది సినిమా కాదని ఎలా చెప్పగలం?

ఇలాంటి వినూత్న ఐడియాలతో వచ్చిన చిత్రాల ప్రభావం ఇప్పటికీ ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంది. అదే కోవలో ‘తారే జమీన్ పర్’, ‘పా’ వంటి చిత్రాలు కూడా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నాయి.
మానసిక, శారీరక వైకల్యం అనేది విశ్వజనీనమైన విషయం. నాలుగైదేళ్ల నుంచి బాలీవుడ్‌లో ఇలాంటి కాన్సెప్టులతో వచ్చిన చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. నిజానికి అవన్నీ వెరైటీ కోసం ఎంచుకున్న సబ్జెక్టులే కావచ్చు, కానీ సమాజాన్ని ఆలోచనల్లోకి లాగిన చిత్రాలుగా నిలిచాయి. వ్యవస్థను ఎంతోకొంత ప్రభావితం చేస్తూ అనేక విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చిన ఈ కాన్సెప్టు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నడుస్తోంది.

తారే జమీన్ పర్
అమీర్‌ఖాన్ అన్నీ తానై తీసిన చిత్రం తారే జమీన్ పర్. ఆస్కార్ నామినేషన్‌దాకా వెళ్లిన ఆ చిత్రం ‘డిస్లెక్సియా’ వ్యాధిపై వచ్చిన తొలి భారతీయ చిత్రం. సినిమా హిట్టవ్వడమే కాదు, దేశవ్యాప్తంగా ‘డిస్లెక్సియా’ బాధిత చిన్నారులను ప్రత్యేకంగా గుర్తించేలా చేయడం ఆ సినిమా సాధించిన అతి పెద్ద విజయం. తరువాత వచ్చిన ‘పా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘గజిని’, ‘గుజారిష్’...వంటివి. వైద్యశాస్త్రాన్ని వడబోసి, అరుదైన వ్యాధులను వెతికి బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికినట్టయింది. ఈ సినిమాలు స్పెషల్లీ ఛాలెంజ్‌డ్ చిల్డ్రన్, పర్సన్స్‌ను చూసే కోణాన్ని మార్చాయి. అలాంటి వారి గురించి అనేక పరిశోధనలు జరిగి, వ్యాధులపై అవగాహన పెరిగింది. వాళ్లని అర్థం చేసుకునే స్థాయీ పెరిగింది. ‘విభిన్న’ ప్రతిభావంతుల జీవితాలను ఆవిష్కరించిన ఆ చిత్రాలు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. పిల్లల తల్లిదంవూడులను సమాయాత్తం చేశాయి. అయితే ఇదంతా అట్టహాసంగానో, బహిరంగంగానో జరగడం లేదు. నిశ్శబ్దంగా, పరోక్షంగా సాగుతోంది.

హాకీ వైభవం
క్రీడారంగంలో చూస్తే అత్యంత ప్రభావితం చేసిన సినిమా ‘చక్‌దే ఇండియా’. అంతకుముందు వచ్చిన ‘లగాన్’ సినిమాది కూడా క్రీడానేపథ్యమే కానీ అది క్రికెట్. చక్‌దే ఇండియా మూవీ హాకీ నేపథ్యంలో నడుస్తుంది. అది మన జాతీయ క్రీడ. భారతీయ యువత, స్పోర్ట్స్ అథారిటీలు క్రికెట్ మత్తులో హాకీని నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో చక్ దే ఇండియా లాంటి సినిమా రావడం హాకీ పూర్వ వైభవం సంతరించుకునేందకు తోడ్పడింది. ‘కోచ్’ షారూక్ ఖాన్.. ఒక మహిళా హాకీ టీమ్‌ను తయారుచేసి ఇండియాకు ప్రపంచ కప్‌ను అందిస్తాడు. ఆ విజయం సినిమాలోనే అనుకుంటే పొరపాటే. క్రికెట్ జోష్‌లో జోగుతున్న ఎందరికో చక్ దే ఇండియా చక్ నిచ్చింది. మళ్లీ హాకీ వైభవాన్ని గుర్తు చేసింది. ఎందరో మాజీ క్రీడాకారులను మేల్కొలిపింది. అందుకే ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ మూవీ మాత్రమే కాదు. సమాజాన్ని ప్రభావితం చేసిన ఒక మంచి సినిమా. అదేవిధంగా విద్యావ్యవస్థను పునరాలోచనలో పడేసిన ‘త్రీ ఇడియట్స్’ కూడా ప్రభావిత చిత్రంగానే చెప్పుకోవచ్చు.

న్యూ ‘ట్రెండ్’
పైన చెప్పిన సినిమాలు సమాజంపై ఒకరకమైన ఇంపాక్ట్ చూపితే ఇప్పుడు చెప్పుకోబోయే ‘జిందగీ న మిలేగీ దొబారా’ సినిమా ఎఫెక్ట్ వేరే టైపు. అది అవుట్ అండ్ అవుట్ ఫారెన్ కల్చర్ మూవీ. ప్రేమ, పెళ్లి, స్నేహం, జీవితం... అనే కాన్సెప్టులో సాగుతుందా చిత్రం. అయితే ఇండియాలో కొత్త సంస్కృతికి తెరలేపిన సినిమా ఇది. స్పెయిన్‌లో జరుపుకునే టమాటినో ఫెస్టివల్ మనదేశంలో జరగడానికి ప్రధాన కారణం ఆ సినిమానే. యూరప్ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది దర్శకురాలు జోయా అఖ్తర్. ఆగస్టులో రిలీజైన మరుసటి వారమే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా బెంగళూర్, హైద్రాబాద్‌లలో టమాటినో ఫెస్టివల్స్ జరిగాయి (హైవూదాబాద్‌లో ఒక చోట అడ్డుకున్నారు. కానీ వేరేచోట జరిగింది). ఇంకేముంది. ఒక కొత్త ట్రెండ్ మొదలైంది! అయితే దీనికి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. ఒరిస్సాలాంటి రాష్ట్రాల్లో తిండిలేక ఆకలి చావులు పెరుగుతుంటే టమాటాలతో ఆడుకోవడం ఏంటి? అని మేధావులు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. యూత్‌కున్న న్యూ ట్రెండ్ ఆసక్తిలో అవన్నీ ఆర్తనాదాలుగానే మిగిలాయి.

డాన్సు.. సంగీతం...స్పోర్ట్స్...ఫ్యాషన్ ట్రెండ్స్... ఇలా కాన్సెప్టు ఏదైనా ఆ సినిమా ప్రభావం ఎంతో కొంత ఏదో ఒక వర్గంపై ఉండనే ఉంటది. అది వేరే విషయం కానీ చెప్పుకోదగిన, అర్థవంతమైన, చర్చనీయాంశమైన ప్రభావాన్నే లెక్కలోకి తీసుకుంటే అలాంటి సినిమాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి.ఏ రచయిత అయినా, దర్శకుడయినా సమాజంలో జరుగుతున్న సంఘటనలే సినిమాల్లో చూపిస్తున్నాం అంటున్నారు. అది నిజమే కావచ్చు... కానీ ఆ సినిమా జనంపై ప్రత్యేక ప్రభావం చూపడమే ఇక్కడ విశేషం.

తెలుగు సంగతేంటి?
వాస్తవంగా చెప్పాలంటే టాలీవుడ్ విస్తక్షుతి తక్కువ. అందుకే దాని ప్రభావమూ తక్కువే. పైగా పక్కా కమర్షియల్ టైపు కాబట్టి ‘సమాజం- ప్రభావం’ అనే విషయం పక్కనపెట్టాల్సిందే. మన సినిమాల ప్రభావం కాలేజీ కుర్రాళ్లను దాటిపోదు. అయినా ఓ సారి గమనిస్తే... ‘ప్రేమించుకుందాం...రా’ సినిమాతో బంధువుల ఇంటికి ప్రేమాయణాలు నడపడం, ‘ప్రేమంటే ఇదేరా’తో పెళ్లిలో సైట్ కొట్టడం బాగా నడిచాయి. ఆ తరువాత ‘జయం’, ‘నువ్వు-నేను’ వంటి చిత్రాలు కాలేజీలన్నీ ప్రేమాలయాలుగా మార్చే ప్రయత్నం చేశాయి. అంతేకాదు లెక్చరర్లను బఫూన్లుగా చూసే ట్రెండ్ కూడా అప్పుడే మొదలైంది. అంతకుముందు నుంచే ‘ఇడియట్స్’ అందరూ హీరోలుగా మారిపోయారు. ఇటీవల కాలంలో తెల్లబట్టలు వేసుకున్నోళ్లంతా‘ఫ్యాక్షనిస్టు’లను చేసింది. లేటేస్ట్‌గా ‘మాఫియా’లోని మజాను ఎంజాయ్ చేస్తోంది. ఇంకెక్కడి సమాజం, ఇంకెక్కడి ప్రభావం!

Any Comment 

Take By: T News

Read more...

సిన్నబోతున్న సింగరేణి

-ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు 123వ వసంతంలోకి సింగరేణి
-సింగరేణిని ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు వ్యాపార సరుకుగా మార్చి
-అడ్డగోలుగా తవ్వేస్తున్నారు
-యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ
-ఉద్యోగాలపై ప్రైవేటీకరణ దెబ్బ
-యాంత్రీకరణతో మరో ఎసరు
-30 వేల మంది కార్మికుల తొలగింపు
-నాడు ప్రాంత పరిశ్రమల కోసమే

karmikulu-telangana-News2 talangana patrika telangana culture telangana politics telangana cinema( కోల్‌బెల్ట్ ప్రతినిధి):‘తల్లి నవ్వితే మాగాణి.. ఎద తలుపు తీస్తే సింగరేణి’ అన్నాడో కవి... కానీ మన సింగరేణి సీమాంధ్ర కడుపునింపితే, మాగాణి భూములు బొందల గడ్డలుగా మిగులుతున్నాయి. తెలంగాణ గర్భాన్ని చీల్చి, నల్లబంగారంతో దేశానికి వెలుగులిస్తున్న సింగరేణి సీమాంధ్ర సర్కారు కుట్రలు, కుతంవూతాలతో కుదేలవుతోంది. శ్రమైక జీవన సౌందర్యం, కార్మికుల అవిక్షిశాంత పోరాటాలతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తన ఖాతాలో ఎన్నో రికార్డులను వేసుకున్న ఈ సిరుల తల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గల్లా పెట్టెలు నింపేందుకు పరిమితమవుతోంది. ఓపెన్‌కాస్టు తవ్వకాలతో నాలుగు జిల్లాల్లో గోదావరి పొడువునా ఉన్న పల్లెలన్నీ బొందల గడ్డలుగా మారాయి. యాంత్రీకరణ పేరుతో సాగుతున్న ఉపరితల బొగ్గు గనుల్లో కనీస ఉపాధి కరువైంది. మరో వందేళ్లకు సరిపడే బొగ్గునిల్వలున్నా నేటికీ కోల్ కారిడార్‌కు మోక్షం కల్పించలేదు. మాంచెస్టర్ ప్రణాళికలకు రూపమివ్వలేదు. కొత్త పరిక్షిశమలను ఏర్పాటుచేయకపోగా ఇక్కడున్న పరిక్షిశమలను సీమాంధ్ర సర్కార్ మూసివేసింది. మరోవైపు కోల్ కారిడార్ పేరిట కొత్త బావుల ఏర్పాటుకు ప్రణాళికలు రచించి, మరింత దోపిడీకి తెరలేపుతోంది. నాలుగు జిల్లాల్లోని వందలాది గ్రామాలు దుమ్ముధూళితో కన్నీళ్లు పెడుతున్నాయి. అయినా సీమాంధ్ర సర్కారు కనికరించడం లేదు. అంతే కాదు సింగరేణిలో గడిచిన ఆరు సంవత్సరాల్లో వివిధ ప్రమాదాల్లో 83 మంది మృత్యువాత పడ్డారు. ఇదేకాలంలో శ్వాసకోశ వ్యాధులతో 120మందికిపైగా చనిపోయారు. ఇన్ని కష్టాల మధ్య పనిచేస్తున్న నల్ల సూరీళ్లకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. డిసెంబర్ 23తో 123వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణిపై నమస్తే తెలంగాణ ఫోకస్..ఉత్తర తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన వరం. హైదరాబాద్ లేని తెలంగాణను ఎట్లా ఊహించలేమో, సింగరేణి లేని తెలంగాణను కూడా ఊహించలేం. 1889లో నిజాం కాలంలో అవతరించిన సింగరేణి నిజాం పారిక్షిశామిక అవసరాలకు ముడి సరుకును అందించే బొగ్గునే కాదు ఒక నూతన పారిక్షిశామిక విప్లవాన్ని సృష్టించింది. ఆంధ్రవూపదేశ్ అవతరణకు పూర్వదశ సింగరేణి నిజాం ఏలుబడిలో ఉన్న కాలం. ఈ రెండు దశలను ఒకసారి పరిశీలిస్తే పారిక్షిశామిక ప్రగతికి ముడి సరుకును అందించే బొగ్గు పరిక్షిశమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించడం వల్లే నిజాం రాజు అంతవరకూ బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న హైదరాబాద్ దక్కన్ కంపెనీ నుండి మెజార్టీ షేర్లు కొనుగోలు చేసి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణికి ఖ్యాతి తెచ్చారు. నిజాం ఎంతటి నిరంకుశ రాజయినప్పటికీ తన దేశ అవసరాలకు తన ప్రజల అవసరాలకు భంగం కలిగించేలా వ్యవహరించలేదు. నిజాం స్టేట్ అవసరాల కోసం పరిమిత స్థాయిలో బొగ్గు తవ్వకాలు సాగించారు. నిజాం ఏలుబడిలో సింగరేణిలో సాగిన మొదటి 66 సంవత్సరాల కాలంలో మొత్తం బొగ్గు తవ్వకాలు 50 మిలియన్ టన్నులకు మించలేదు. ఆతర్వాత పరిస్థితిని పరిశీలిస్తే 2009-10 ఆర్థిక సంవత్సరంలోనే 50.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. నిజాం కాలంలో జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తికి సమానంగా ఒక్క సంవత్సరంలో బొగ్గును తవ్వడం జరిగింది. ఈ విధంగా సింగరేణి నుండి తవ్విన బొగ్గు సంపద ఎవరికి లాభాలు పండిస్తుందో, ఎవరికి కన్నీళ్ళు మిగిల్చిందో తేలాల్సిన అంశం!!

నిజాం స్టేట్‌లో ఫ్యూడల్ దొరలు, భూస్వాములు, దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల దోపిడీలు, దౌర్జన్యాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. నీ బాంచెన్ కాల్మొక్త అంటూ ప్రజలు అణిగిమణిగి ఉండేవారు. దొరల దోపిడీ పీడను భరించలేక పారిపోయి వచ్చినవారికి సింగరేణి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్నది. బొగ్గు గనుల్లో పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఊళ్ళలో దొరతనం భరించలేనివారికి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్న పారిక్షిశామిక ప్రాంతం ఆకర్షించింది. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన బ్రిటీష్ అధికారుల పెట్టుబడిదారి స్వభావరీత్యా ఒక నూతన పారిక్షిశామిక సంస్కృతికి అంకురార్పణ జరిగి తదనంతర కాలంలో కార్మిక వర్గ చైతన్యానికి నాంది పలికింది. సింగరేణి కార్మికులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సింగరేణి కార్మికులు వందలాది మంది గెరిల్లా యోధులుగా పాల్గొని పోరాటంలో అమరులయ్యారు. సింగరేణి చరివూతలో కార్మిక ఉద్యమంలో అదొక ఉజ్వల ఘట్టం. 1952లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వనరులు స్థానిక అభివృద్ధికి దోహదపడటం, బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం అనే రెండంచెల అభివృద్ధి విధానం ఎజెండా మీదికి రావడం జరిగింది.

రాష్ట్ర అవతరణతో తలకిందులైన పరిస్థితి
karmikulu-telangana-News3 talangana patrika telangana culture telangana politics telangana cinema1956 నవంబర్ 1న ఆంధ్రవూపదేశ్ అవతరణతో పరిస్థితి మొత్తం తలకిందులైంది. స్థానిక వనరులు స్థానిక ప్రజలకు చెందకుండా ఉమ్మడి రాష్ట్రం పేరిట దోచుకుపోయే ప్రాంతీయ నయా వలస విధానానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ ప్రాంత అవసరాలకు పరిమితమై సాగించే బొగ్గు ఉత్పత్తి రాష్ట్ర అవతరణ తర్వాత ఆంధ్ర ప్రాంత అవసరాలను కూడా తీర్చాల్సివచ్చింది. బొగ్గు వ్యాపార సరుకుగా మారింది. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసి సొమ్ము చేసుకునే విధానం మొదలైంది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడింది. నిజాం కాలంలో కొత్తగూడెం, ఇల్లందు, బెల్లంపల్లి ప్రాంతాలకు పరిమితమైన బొగ్గు తవ్వకాలు ఆంధ్రవూపదేశ్ అవతరణ తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మాదారం, గోలేటి, అటు వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని మణుగూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు విస్తరిస్తూ పోయారు. ఆంధ్రవూపదేశ్ అవతరణ నాటికి 1956-57లో 1.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే గత సంవత్సరం 2009-10 నాటికి 50.4 మిలియన్ టన్నులకు చేరుకున్నది. వార్షిక ఉత్పత్తి 25 రెట్లకు పెరిగిపోయింది. ఇలా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఆంధ్రవూపాంతానికి తరలించి బొగ్గు ఆధారిత పరిక్షిశమలను అక్కడ నెలకొల్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతం కేవలం ముడి సరుకును అందించే ప్రాంతంగా మిగిలిపోయింది. అదే సమయంలో బొగ్గును వ్యాపార సరుకుగా మార్చి అమ్మకాలు సాగించిన మిగులు నిధులను కూడా ఉమ్మడి రాష్ట్రం పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రవూపాంత అభివృద్ధికి ఖర్చు చేయడం మొదలైంది. రాష్ట్రానికి కేటాయించిన బొగ్గులో మూడింట రెండొంతులు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు వినియోగిస్తున్నాయి. మిగతా బొగ్గు రాష్ట్రంలోని 46 సిమెంట్ కంపెనీలు, 43 స్పాంజ్ ఐరన్ యూనిట్స్, 19 సీపీపీ యూనిట్లు మాత్రమే కాకుండా వార్షికంగా 4200 టన్నులకు మించి వాడే 182 చిన్న పరిక్షిశమలకు కేంద్ర బొగ్గు శాఖ ఉత్వర్వుల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఉత్పత్తిలో 92 శాతం సరఫరా చేయాల్సి వస్తోంది. ఇట్లా వినియోగించే పరిక్షిశమల్లో 80 శాతం ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులవే.

విద్యుత్‌లోనూ అన్యాయం
తెలంగాణలోని రామగుండంలో 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్‌టీపీసీ, కొత్తగూడెంలోని ఏపీ జెన్‌కోకు చెందిన 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌కు సింగరేణి బొగ్గే సరఫరా అవుతున్నది. ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చే విధంగా మొదటి పిట్ హెడ్ వద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాభదాయకం అనే అంతర్జాతీయ నిపుణుల అభివూపాయాన్ని కూడా కాలదన్ని సింగరేణికి చెందిన మణుగూరు ఏరియాలో ఏపీ జెన్‌కో మొదట నిర్మించతలపెట్టిన 1260 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వందల కిలోమీటర్ల దూరానికి ఇక్కడి బొగ్గు తరలించుకు పోయే విధంగా అప్పటి ఏపీఎస్‌బీ చీఫ్ ఇంజినీర్ నార్ల తాతారావు తన పలుకుబడితో విజయవాడకు తరలించి అక్కడ విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారన్న వాదన ఉంది. రామగుండంలోని ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడం వల్ల ఎన్‌టీపీసీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ 71 శాతం తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరిలకు సరఫరా అవుతోంది. కేవలం 21 శాతం మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు. అందులో తెలంగాణకు అందుతున్నది నామమావూతమే. కానీ ఈ ప్లాంట్ కోసం సేకరించిన 10 వేల ఎకరాల భూమి తెలంగాణవారిదే. ఆ మేరకు ఈ ప్రాంత వాసులు నిర్వాసితులయ్యారు. గత 30 ఏళ్లుగా నష్టపరిహారం సక్రమంగా అందక నిర్వాసితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 10 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ నుంచి మళ్ళించారు.

singareni-telangana-News2 talangana patrika telangana culture telangana politics telangana cinemaఆ మేరకు అక్కడ ఆయకట్టు తగ్గింది. ఇలా రామగుండం ఎన్‌టీపీసీలో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్‌కు ఇక్కడి బొగ్గునే ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యుత్‌లో మాత్రం ఒక్కశాతం కూడా ఈ ప్రాంత రైతులకు చెందడం లేదు. కొత్తగూడెం ఏపీ జెన్‌కో కేటీపీఎస్ నుండి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 70 శాతం ఉభయగోదావరి జిల్లాలకే కేటాయించారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు తప్ప ఇందులో తెలంగాణకు వచ్చేదేమీ లేదు. వీటీపీఎస్‌లో 1260, రాయలసీమలో 420 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పారు. ఇటీవల వీటీపీఎస్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. సి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్‌టీపీసీ సింహావూదిలో విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసే 1000 మెగావాట్లు మొత్తంగా కోస్తాంవూధకు ఇప్పించి ఆ ప్రాంత అవసరాలు తీర్చుకుంటున్నారు. రామగుండం బీ థర్మల్ కేంద్రాలను కూడా మూసి తెలంగాణ ప్రజలను మరింత అష్టకష్టాలకు గురిచేశారు.

సంపద శాశ్వతంగా దక్కకుండా కుట్రలు
తెలంగాణ బొగ్గు సంపద శాశ్వతంగా తెలంగాణకు దక్కకుండా సీమాంధ్ర పాలకులు కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్స్ పేరుమీద బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం జరుగుతోంది. అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్ ఎంత వేగవంతంగా జరుగుతున్నదో గత సంవత్సరం కంపెనీ ప్రకటించిన వార్షిక నివేదికలోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2008-09లో సింగరేణిలో జరిగిన వార్షిక ఉత్పత్తి 44.55 మిలియన్ టన్నులు. ఇందులో 32.46 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 13 ఓపెన్ కాస్టు గనుల నుండి రాగా 37 భూగర్భ బావుల నుండి 12.9 మిలియన్ టన్నులు వచ్చింది. అందులో 8 మిలియన్ టన్నులు మిషన్ మైనింగ్ ద్వారా ఉత్పత్తి జరిగింది. కేవలం 4.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రం మానవ శ్రమ ఆధారిత హ్యాండ్ సెక్షన్ ద్వారా జరిగింది. బొగ్గు ఉత్పత్తిలో నాలుగింట మూడో వంతు పాత్ర వహిస్తున్న ఓపెన్‌కాస్టు గనుల్లో 80 శాతం పనులు ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. 14 ఓపెన్‌కాస్టు గనుల్లో పన్నెండింటిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లే పనిచేస్తున్నారు. సింగరేణికి వచ్చే సగం లాభాలు వీరి జేబుల్లోకే పోతున్నాయి.

విపరీతమైన విధ్వసం
ఆంధ్ర పాలకుల వలస దోపిడీసింగరేణి కార్మికుల మూలుగుల్ని పీలుస్తున్నది. అణిచివేత, హక్కుల హరింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. 1989-90లో 1.16 లక్షలుగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 65 వేలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. . 2020 నాటికి మరో 30 వేల మంది పదవీ విరమణ ద్వారా బయటికి పోనున్నారు. పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న ఓపెన్‌కాస్ట్ విధానం వల్ల ఇప్పటికే తెలంగాణలో 74 ఏజెన్సీ ప్రాంతంలోని తాండాలు, ఊర్లు నేలమట్టమయ్యాయి. వారి బతుకులు సర్వనాశనమయ్యాయి. పెద్ద ఎత్తున వాగులు, వంకలు, అడవులు నాశనమవుతున్నాయి. సంపద తెలంగాణది అయితే లాభాలు సీమాంధ్ర బడాబాబుల జేబుల్లోకి పోతున్నాయి. నిజాం కాలంలో తవ్వి తీసిన బొగ్గు నిజాం స్టేట్‌లోని పరిక్షిశమలైన రైల్వే, రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పొగాకు, వస్త్ర, సిమెంట్ తదితర పరిక్షిశమల అవసరాలను తీర్చేది. ఈ ప్రాంతంలో తవ్వి తీసిన బొగ్గు ఈ ప్రాంత పారిక్షిశామిక అవసరాలకు వినియోగించడం వల్ల ఆ మేరకు పారిక్షిశామిక అభివృద్ధి ఫలితాలు ప్రాంత ప్రజలకు దక్కాయి. పర్యావరణ విధ్వంసం కూడా పరిమితంగా ఉండిపోయింది. బొగ్గు తవ్వకాల వల్ల నిజాం కాలంలోని 66 సంవత్సరాలు పర్యావరణ విధ్వంసం ఇవాళ ఒక్క సంవత్సరంలోనే జరిగిపోతుంది.

కుంభకోణాలు.. అప్పులు
singareni-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకేంద్ర ప్రభుత్వం అవలంబించిన నూతన బొగ్గు విధానం విదేశీ బొగ్గు దిగుమతులకు కల్పించిన రాయితీలు వారికి మార్కెట్ సృష్టించడానికి కల్పించిన కోల్ లింకేజ్ డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు వందల కోట్ల కుంభకోణాలకు దారి తీశాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ పరిక్షిశమను నిర్వీర్యపరిచి నూతన బొగ్గు బ్లాకులను పెద్ద ఎత్తున ప్రైవేటు పరం చేస్తూ పోయింది. వారికి ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకునే స్వేచ్ఛను, అనేక రాయితీలను, చట్టపరమైన వెసులుబాటును కల్పించింది. సింగరేణి దశాబ్దకాలంగా లాభాలు సాధిస్తున్నప్పటికీ ఈ పరిస్థితుల వల్లే ఈ రోజుకీ అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వడ్డీలు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్లు, అటు కేంద్రానికి 400 కోట్లు పన్నులు, రాయల్టీల పేరిట చెల్లించడం, మరోవైపు 400 కోట్ల రూపాయలు డివిడెంట్లు ఇవ్వడం ఆగ లేదు. గత పది సంవత్సరాల్లో ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరిగితే పన్నుల రూపంలో రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటిన్నరట్లు, కేంద్ర ప్రభుత్వానికి 20 రెట్లు పన్ను చెల్లింపులు పెరిగాయి. గత సంవత్సరం బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన 6396 కోట్లలో నాలుగింట మూడు వంతులు ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుల్లోకి, అలాగే ప్రభుత్వం బొక్కసంలోకి వెళ్ళిపోయింది. సింగరేణి తరతరాల దోపిడీ నుండి విముక్తి పొందాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే మార్గం లేదని కార్మికులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటికి 44 సార్లు సమ్మె చేశారు. మరో వందరోజుల సమ్మెకూ సై అంటున్నారు.

ఇదీ ఆటుపోట్ల సింగరేణి
ప్రకృతి వల్ల ఏర్పడిన సహజ ఇంధనం బొగ్గు. గోదావరి నదీ తీరమంతా ఉన్న ఈ బొగ్గుతో వేలాది పరిక్షిశమలు పని చేస్తున్నాయి. 1771లో మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో గల రాణిగంజ్ వద్ద బొగ్గు తవ్వకం ప్రారంభించగా 1850 నుంచి తవ్వకాలు రెగ్యులరైజ్ అయ్యాయి. మధ్యవూపదేశ్‌లో 1862లో, ఆతరువాత 1871లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో గల సింగరేణి గ్రామంలో బొగ్గును కనుగొన్నారు. బ్రిటిష్ అధికారి విలియం కింగ్ కనుగొన్న ఈ బొగ్గును 1989 నుంచి దక్కన్ కంపెనీ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. 1920లో సింగరేణి కంపెనీగా సంస్థ పేరు మారింది. బొగ్గు గనులు ప్రారంభమయి 123 సంవత్సరాలవుతున్నది. సింగరేణి యాజమాన్యం 2003 నుంచి ప్రతీ సంవత్సరం సింగరేణి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సింగరేణి భారతదేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. 51 శాతం రాష్ర్టం, 49 శాతం కేంద్రం వాటాలు ఉన్న సంస్థ. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రవేశపెట్టిన నూతన పారిక్షిశామిక, ఆర్థిక విధానాల ఫలితంగా తీరు మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడులు లేవు. అయితే ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి డివిడెంట్‌ను, ఇతర పన్నులను వెయ్యి కోట్లకుపైగానే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పొందుతున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ప్రారంభించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం సింగరేణి నాలుగు వేల కోట్లకుపైగా అప్పు చేసింది. ఇలా ప్రతి ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మట్టిలో కలిసిన మోడల్ మాంచెస్టర్
-ఉన్న పరిక్షిశమల మూసివేత.. ఊసేలేని కొత్త పరిక్షిశమలు
-నడిరోడ్డున ఉద్యోగులు.. తరిగిపోతున్న సింగరేణి సిరులు

karmikulu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema(కరీంనగర్ ప్రతినిధి/గోదావరిఖని):సింగరేణిలో మరో వందేళ్లకు సరిపడా నిల్వలున్నాయి. గడిచిన 122 ఏళ్లలో సింగరేణి ఇప్పటి వరకు 1050 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, ఇంకా 8 నుంచి 10వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఏటా 10శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ పోతున్న సింగరేణి సంస్థకు బొగ్గు ఆధారిత పరిక్షిశమలు నెలకొల్పుకోవడానికి కావల్సిన అన్ని వనరులూ ఉన్నా.. అ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికులతో కిటకిటలాడిన సింగరేణి నేడు కేవలం 65వేల మంది కార్మికులకే పరిమితమైంది. సింగరేణి బొగ్గు ఆధారితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండంలో నెలకొల్పిన 2600 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్టీపీసీ మినహా మరే పరిక్షిశమ లేకుండా పోయింది. గతంలో రామగుండంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ‘ఎ’ థర్మల్, ‘బి’ థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా వాటిలో ‘ఎ’ థర్మల్ కేంద్రం మూతపడింది. బొగ్గు ఆధారిత పరిక్షిశమ అయిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 11 ఏళ్ల క్రితమే మూసేశారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా విద్యుత్ కోత వల్లే ఎఫ్‌సీఐని మూసివేయాల్సి వచ్చిందని సర్కారు నిస్సిగ్గుగా ప్రకటించింది. నైజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న జిల్లాల్లో 80 పరిక్షిశమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించగా, సీమాంధ్ర సర్కారు వాటిని తుంగలో తొక్కింది. నిజానికి ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నుంచి మంచిర్యాల మీదుగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని వరంగల్ జిల్లా భూపాలపల్లిని కలుపుతూ అక్కడి నుంచి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు పారిక్షిశామిక కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు వెళ్లినా ఏనాడూ పట్టించుకోలేదు.

బొగ్గు మనది.. వెలుగులు మందివి..
boggu talangana patrika telangana culture telangana politics telangana cinemaబొగ్గు మనది.. నీళ్లు మనవి.. శ్రామికులు మనవాళ్లు. కానీ వెలుగులు మాత్రం మందికి.. మనకు మాత్రం చీకట్లు..! ఇదీ మన దౌర్భాగ్యం! సింగరేణి బొగ్గు ఆధారిత పరిక్షిశమగా 200 మెగావాట్ల విద్యదుత్పత్తి లక్ష్యంగా రామగుండంలో 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎన్టీపీసీకి పునాది రాయివేశారు. 1983 అక్టోబర్ 23న ఉత్పత్తి మొదలైంది. నాటి నుంచి నేటివరకు అంచలంచెలుగా 7 యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ దక్షిణాదిరాష్ట్రాలకు వెలుగులు పంచుతోంది. నిజానికి ఇంత భారీ ప్లాంటు తెలంగాణలో ఉండటం గర్వకారణమే అయినా, అ మేరకు కేంద్రం మనకు వాటా కేటాయించకపోవడం దారుణం. 2,600 మెగావాట్లలో మన రాష్ట్రానికి దక్కుతున్న వాటా కేవలం 29 శాతం మాత్రమే! తమిళనాడుకు 22 శాతం, కర్ణాటకకు 16 శాతం, కేరళకు 12 శాతం, గోవాకు 5 శాతం, పాండిచ్చేరికి 2 శాతం, మిగిలిన 14 శాతంలో కొంత ఇతర రాష్ట్రాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆ 29 శాతం వాటా కేవలం మన పది జిల్లాకు దక్కేది.

తప్పని కరెంటు కోతలు...
ఎన్టీపీసీ ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉండటంతో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తెలంగాణలోని మెజార్టీ రైతులు వ్యవసాయ మోటార్లపై అధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరెంటు కోసం అన్నదాత కన్నీళ్లు పెట్టని రోజంటూ ఉండదు. 2006-07లో 500 మెగావాట్ల సామర్థ్యంతో 7యూనిట్ ప్రారంభించినప్పుడు తమకు కనీసం ఇరవై శాతం అదనంగా విద్యుత్ కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కోరారు. కానీ.. కేంద్రం కరుణించలేదు. ఏటా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నుంచి 6 టీఎంసీల నీటిని ఎన్టీపీసీ వాడుతోంది. ఈ నీళ్లతో కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కనీసం మరో 60వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. సింగరేణి అధారంగా నడుస్తున్న ఎన్టీపీసీలో మన వాటా పెరిగితే తప్ప తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.

ఇవీ మైలురాళ్లు
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaఅంగ్లేయుల పాలన కాలంలో ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలో ఓ నల్లరాయి మండుతూ కనిపించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన అప్పటి బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అక్కడ తవ్వకాలు జరపగా, బొగ్గు నిక్షేపాలు బయట పడ్డాయి.

1870 - బొగ్గు నిక్షేపాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం అన్వేషణ
1889 - బొగ్గు ఉత్పత్తికి అంకురార్పణ
1920 - అంగ్లేయుల నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాధీనం, ‘దక్కన్ కంపెనీ’గా నామకరణం
1945 - లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు
1949 - రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి, సింగరేణిగా నామకరణం
1951 - విద్యుత్తు సౌకర్యంతో డ్రిల్లింగ్ పనుల ప్రారంభం
1953- బ్యాటరీతో నడిచే క్యాప్ ల్యాంపుల (టోపీ లైట్లు) ప్రవేశం
1974 - భూఉపరితల గనులకు శ్రీకారం
1976 - యంత్రాల ప్రవేశం
1983 - లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
1986 - బ్లాస్టింగ్ గ్యాలరీ విధానంతో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం
1992, 1996 - ఖాయిలా పడ్డ పరిక్షిశమల జాబితాలోకి సింగరేణి
1994 - జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఓసీపీ(ఉపరితల గని)-2 ఏర్పాటు
1998 - గుర్తింపు కార్మిక సంఘాల ఏర్పాటు
2002 - నష్టాలను అధిగమించి లాభాల బాట
2009 - అడ్రియాల్ మైన్ వద్ద లాంగ్‌వాల్ ఏర్పాటు
2010 - ఫిబ్రవరి 14 అదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1200ల
మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి శంకుస్థాపన


Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP