Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telangana News - Zindagi. Show all posts
Showing posts with label Telangana News - Zindagi. Show all posts

Friday, December 23, 2011

సినిమా ప్రభావం సమాజం మీద ఉంటుందా - (లగేరహో..సినిమా)

సినిమా ప్రభావం సమాజం మీద ఉంటుందా?

rangulakala talangana patrika telangana culture telangana politics telangana cinema

సమాజమే సినిమాలకు ప్రేరణ అవుతుందా?
రెండూ జరుగుతున్నాయి
అందుకే కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ అయి...,
కొత్త సంస్కృతులనూ మోసుకొస్తుంటాయి
ఫ్యాషన్ నుంచి స్పోర్ట్స్ వరకూ అనేక రంగాల్లో
అవసరమైన స్ఫూర్తిని అందిస్తుంటాయి
అలాంటి సినిమాలు ఎక్కడున్నా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే


సరదాగా చెప్పుకున్నా, సీరియస్‌గా ఆలోచించినా అర్థమయ్యే ఒక విషయం ‘ప్రతి సినిమా సమాజంలోని పరిస్థితుల నుంచి పుడుతుంది. కానీ ప్రతి సినిమా ప్రజలపై ప్రభావం చూపించదు’ అని!

అందుకే ఒక సినిమా హిట్టయితే కొన్నాళ్ల పాటు ఆ సినిమా మాయలో ఉంటారు జనం. అది ఏ కుర్రాళ్లో, సినిమా పిచ్చోళ్లే అయితే పట్టించుకోనవసరం లేదు. కానీ మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు...ఇలా సమాజంలోని పెద్దలు ప్రభావితులైనప్పుడు మాత్రం కాస్త ఆలోచించాలి. మన టాలీవుడ్ పరిధి చిన్నది కాబట్టి దాని సంగతి పక్కనపెట్టి దేశవ్యాప్తంగా వ్యాపారం సాగే ‘బాలీవుడ్’ను ఓ సారి గమనిస్తే అలాంటి సినిమాలు కొన్ని కనిపిస్తాయి. అవి పక్కా సినిమా ఫార్ములాతో తీసినవే అయినప్పటికీ ఆలోచింపజేసే చిత్రాలు కావడం గమనార్హం.

3idiots talangana patrika telangana culture telangana politics telangana cinemaమున్నాభాయ్‌తో...
సంజయ్‌దత్ నటించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘లగేరహో మున్నాభాయ్’. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్టే. సగటు ప్రేక్షకుడి నుంచి మేధావుల వరకు అందరి దృష్టినీ ఆకర్షించింది. గాంధీజీ పుస్తకాలు చదివి ఆ ప్రభావంతో ఒక రౌడీలో వచ్చిన పరివర్తన అందరికీ నచ్చింది. అహింసా మార్గంలో, శాంతియుతంగా అన్యాయాల్ని ఎదురించే పద్ధతులు అందరినీ ఆకట్టుకున్నాయి. గులాబీలతో నిరసనలు తెలపడం, సహనంతో నిర్లక్ష్యాన్ని జయించడం వంటి సన్నివేషాలు విపరీతంగా ఆకర్షించాయి. అయితే అవి సినిమాలోనే కనిపించి ఆగిపోలేదు. బయటి ప్రపంచానికీ విస్తరించాయి. రాజకీయ నిరసనలు సైతం గులాబీపూల బహూకరణ దాకా వెళ్లింది. 2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సందర్భంలో తెలంగాణ వాదులు ఆంధ్ర అధికారులకు, నాయకులకు గులాబీలు అందజేసి మద్దతు కోరారు. జార్ఖండ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ తరహా నిరసనలు జరిగాయి. ఈ ఐడియాను సమాజంలో పాపులర్ చేసింది సినిమా కాదని ఎలా చెప్పగలం?

ఇలాంటి వినూత్న ఐడియాలతో వచ్చిన చిత్రాల ప్రభావం ఇప్పటికీ ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంది. అదే కోవలో ‘తారే జమీన్ పర్’, ‘పా’ వంటి చిత్రాలు కూడా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నాయి.
మానసిక, శారీరక వైకల్యం అనేది విశ్వజనీనమైన విషయం. నాలుగైదేళ్ల నుంచి బాలీవుడ్‌లో ఇలాంటి కాన్సెప్టులతో వచ్చిన చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. నిజానికి అవన్నీ వెరైటీ కోసం ఎంచుకున్న సబ్జెక్టులే కావచ్చు, కానీ సమాజాన్ని ఆలోచనల్లోకి లాగిన చిత్రాలుగా నిలిచాయి. వ్యవస్థను ఎంతోకొంత ప్రభావితం చేస్తూ అనేక విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చిన ఈ కాన్సెప్టు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నడుస్తోంది.

తారే జమీన్ పర్
అమీర్‌ఖాన్ అన్నీ తానై తీసిన చిత్రం తారే జమీన్ పర్. ఆస్కార్ నామినేషన్‌దాకా వెళ్లిన ఆ చిత్రం ‘డిస్లెక్సియా’ వ్యాధిపై వచ్చిన తొలి భారతీయ చిత్రం. సినిమా హిట్టవ్వడమే కాదు, దేశవ్యాప్తంగా ‘డిస్లెక్సియా’ బాధిత చిన్నారులను ప్రత్యేకంగా గుర్తించేలా చేయడం ఆ సినిమా సాధించిన అతి పెద్ద విజయం. తరువాత వచ్చిన ‘పా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘గజిని’, ‘గుజారిష్’...వంటివి. వైద్యశాస్త్రాన్ని వడబోసి, అరుదైన వ్యాధులను వెతికి బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికినట్టయింది. ఈ సినిమాలు స్పెషల్లీ ఛాలెంజ్‌డ్ చిల్డ్రన్, పర్సన్స్‌ను చూసే కోణాన్ని మార్చాయి. అలాంటి వారి గురించి అనేక పరిశోధనలు జరిగి, వ్యాధులపై అవగాహన పెరిగింది. వాళ్లని అర్థం చేసుకునే స్థాయీ పెరిగింది. ‘విభిన్న’ ప్రతిభావంతుల జీవితాలను ఆవిష్కరించిన ఆ చిత్రాలు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. పిల్లల తల్లిదంవూడులను సమాయాత్తం చేశాయి. అయితే ఇదంతా అట్టహాసంగానో, బహిరంగంగానో జరగడం లేదు. నిశ్శబ్దంగా, పరోక్షంగా సాగుతోంది.

హాకీ వైభవం
క్రీడారంగంలో చూస్తే అత్యంత ప్రభావితం చేసిన సినిమా ‘చక్‌దే ఇండియా’. అంతకుముందు వచ్చిన ‘లగాన్’ సినిమాది కూడా క్రీడానేపథ్యమే కానీ అది క్రికెట్. చక్‌దే ఇండియా మూవీ హాకీ నేపథ్యంలో నడుస్తుంది. అది మన జాతీయ క్రీడ. భారతీయ యువత, స్పోర్ట్స్ అథారిటీలు క్రికెట్ మత్తులో హాకీని నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో చక్ దే ఇండియా లాంటి సినిమా రావడం హాకీ పూర్వ వైభవం సంతరించుకునేందకు తోడ్పడింది. ‘కోచ్’ షారూక్ ఖాన్.. ఒక మహిళా హాకీ టీమ్‌ను తయారుచేసి ఇండియాకు ప్రపంచ కప్‌ను అందిస్తాడు. ఆ విజయం సినిమాలోనే అనుకుంటే పొరపాటే. క్రికెట్ జోష్‌లో జోగుతున్న ఎందరికో చక్ దే ఇండియా చక్ నిచ్చింది. మళ్లీ హాకీ వైభవాన్ని గుర్తు చేసింది. ఎందరో మాజీ క్రీడాకారులను మేల్కొలిపింది. అందుకే ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ మూవీ మాత్రమే కాదు. సమాజాన్ని ప్రభావితం చేసిన ఒక మంచి సినిమా. అదేవిధంగా విద్యావ్యవస్థను పునరాలోచనలో పడేసిన ‘త్రీ ఇడియట్స్’ కూడా ప్రభావిత చిత్రంగానే చెప్పుకోవచ్చు.

న్యూ ‘ట్రెండ్’
పైన చెప్పిన సినిమాలు సమాజంపై ఒకరకమైన ఇంపాక్ట్ చూపితే ఇప్పుడు చెప్పుకోబోయే ‘జిందగీ న మిలేగీ దొబారా’ సినిమా ఎఫెక్ట్ వేరే టైపు. అది అవుట్ అండ్ అవుట్ ఫారెన్ కల్చర్ మూవీ. ప్రేమ, పెళ్లి, స్నేహం, జీవితం... అనే కాన్సెప్టులో సాగుతుందా చిత్రం. అయితే ఇండియాలో కొత్త సంస్కృతికి తెరలేపిన సినిమా ఇది. స్పెయిన్‌లో జరుపుకునే టమాటినో ఫెస్టివల్ మనదేశంలో జరగడానికి ప్రధాన కారణం ఆ సినిమానే. యూరప్ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది దర్శకురాలు జోయా అఖ్తర్. ఆగస్టులో రిలీజైన మరుసటి వారమే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా బెంగళూర్, హైద్రాబాద్‌లలో టమాటినో ఫెస్టివల్స్ జరిగాయి (హైవూదాబాద్‌లో ఒక చోట అడ్డుకున్నారు. కానీ వేరేచోట జరిగింది). ఇంకేముంది. ఒక కొత్త ట్రెండ్ మొదలైంది! అయితే దీనికి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. ఒరిస్సాలాంటి రాష్ట్రాల్లో తిండిలేక ఆకలి చావులు పెరుగుతుంటే టమాటాలతో ఆడుకోవడం ఏంటి? అని మేధావులు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. యూత్‌కున్న న్యూ ట్రెండ్ ఆసక్తిలో అవన్నీ ఆర్తనాదాలుగానే మిగిలాయి.

డాన్సు.. సంగీతం...స్పోర్ట్స్...ఫ్యాషన్ ట్రెండ్స్... ఇలా కాన్సెప్టు ఏదైనా ఆ సినిమా ప్రభావం ఎంతో కొంత ఏదో ఒక వర్గంపై ఉండనే ఉంటది. అది వేరే విషయం కానీ చెప్పుకోదగిన, అర్థవంతమైన, చర్చనీయాంశమైన ప్రభావాన్నే లెక్కలోకి తీసుకుంటే అలాంటి సినిమాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి.ఏ రచయిత అయినా, దర్శకుడయినా సమాజంలో జరుగుతున్న సంఘటనలే సినిమాల్లో చూపిస్తున్నాం అంటున్నారు. అది నిజమే కావచ్చు... కానీ ఆ సినిమా జనంపై ప్రత్యేక ప్రభావం చూపడమే ఇక్కడ విశేషం.

తెలుగు సంగతేంటి?
వాస్తవంగా చెప్పాలంటే టాలీవుడ్ విస్తక్షుతి తక్కువ. అందుకే దాని ప్రభావమూ తక్కువే. పైగా పక్కా కమర్షియల్ టైపు కాబట్టి ‘సమాజం- ప్రభావం’ అనే విషయం పక్కనపెట్టాల్సిందే. మన సినిమాల ప్రభావం కాలేజీ కుర్రాళ్లను దాటిపోదు. అయినా ఓ సారి గమనిస్తే... ‘ప్రేమించుకుందాం...రా’ సినిమాతో బంధువుల ఇంటికి ప్రేమాయణాలు నడపడం, ‘ప్రేమంటే ఇదేరా’తో పెళ్లిలో సైట్ కొట్టడం బాగా నడిచాయి. ఆ తరువాత ‘జయం’, ‘నువ్వు-నేను’ వంటి చిత్రాలు కాలేజీలన్నీ ప్రేమాలయాలుగా మార్చే ప్రయత్నం చేశాయి. అంతేకాదు లెక్చరర్లను బఫూన్లుగా చూసే ట్రెండ్ కూడా అప్పుడే మొదలైంది. అంతకుముందు నుంచే ‘ఇడియట్స్’ అందరూ హీరోలుగా మారిపోయారు. ఇటీవల కాలంలో తెల్లబట్టలు వేసుకున్నోళ్లంతా‘ఫ్యాక్షనిస్టు’లను చేసింది. లేటేస్ట్‌గా ‘మాఫియా’లోని మజాను ఎంజాయ్ చేస్తోంది. ఇంకెక్కడి సమాజం, ఇంకెక్కడి ప్రభావం!

Any Comment 

Take By: T News

Read more...

Tuesday, December 13, 2011

సెల్యులాయుడ్ స్మైల్



Zindagi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
‘హంటర్ వాలీ’ సినిమాలో ఒక్క ఉదుటున ఎగిరి గుర్రంపై కూర్చొని సవారీ చేసిన ‘నాడియా’ కాదు. సజల నయనాలతో తెర నిండా దుఃఖాన్ని నింపిన మీనాకుమారి కాదు. అద్భుతమైన సౌందర్యంతో ప్రేక్షకుల హృదయాలలో డ్రీమ్‌గర్ల్‌గా నిలిచిపోయిన హేమమాలినీ కాదు. కానీ అలాంటి ప్రత్యేకతలు లేకున్నా స్టార్‌గా ఎదిగింది స్మితా పాటిల్. ఎందుకంటే ‘సహజ నటన’ అనే ఒకే ఒక్క ప్రత్యేకత ఆమెకున్న అర్హత, ఆభరణం. నటనే ప్రధానంగా ఆరిపోని వెలుగులు చిమ్మిన తార స్మితాపాటిల్....

‘స్వాతంవూత్యానంతరం భారతీయ సినిమాల్లో అత్యుత్తమమైన వంద సినిమాలను ఎంపిక చేస్తే పావు భాగం ఆమె నటించిన చిత్రాలే ఎంపిక అవుతాయి’ స్మిత నటించిన సినిమాల పట్ల కొందరికున్న అభివూపాయం ఇది. అంతగొప్ప నటి ఆమె. స్మిత పేరు చెప్పగానే భూమిక, మంథన్, గమన్, చిదంబరం, ఆక్రోష్, చక్ర, అర్థ్, అర్థ్‌సత్య, మిర్చిమసాలా, దేబ్‌శిషు వంటి దృశ్య కావ్యాలు గుర్తుకువస్తాయి.

నవ్య ధోరణికి అండగా...
న్యూస్ రీడర్ నుంచి మరాఠీ థియేటర్ ఆర్టిస్టుగా మొదలైన ఆమె కెరీర్‌లో తొలిచిత్రం అరుణ్ కోప్‌కర్ డిప్లొమా కోసం తీసిన ‘తీక్షిశామాధ్యం’. ఆ తర్వాత శ్యామ్‌బెనెగల్ తీసిన చిత్రం ‘చరణ్‌దాస్ చోర్’(1975)లో. స్మిత నటిగా ఇండవూస్టీలోకి వచ్చిన సమయంలో భారతీయ నవ్య సినిమా ధోరణి ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. అప్పటి దాకా సత్యజిత్‌రే, మృణాల్‌సేన్ వంటి వారు నవ్య సినిమాను తమ భుజాలపై మోస్తుంటే, ఆ ఉద్యమానికి ఊతమిస్తూ శ్యామ్‌బెనెగల్, బుద్ధదేవ్‌దాస్, ఆదూర్, అరవిందన్, గౌతమ్‌ఘోష్ వంటి కొత్త తరం దర్శకులు రంగ ప్రవేశం చేశారు. వాళ్లకు ఓంపురి, సీర్‌ద్దీన్‌షా, షబానాలతో పాటు స్మితాపాటిల్ వంటి నటి తోడు కావడంతో భారతీయ నవ్య సినిమా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోగలిగింది.

ఎన్నో పాత్రలు.. ప్రశంసలు
అయితే స్మితాపాటిల్‌కు కలిసొచ్చిన అంశం... శ్యామ్‌బెనెగల్ దృష్టిలో పడటం. ఎందుకంటే ‘నిశాంత్’ (1975) చిత్రంలో నటించిన తరువాతే స్మిత పరిక్షిశమ దృష్టిలో పడిపోయింది. ఆ వెంటనే వచ్చిన మంథన్ (1976)లో హరిజన స్త్రీగా నటించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నది. గ్రామీణ జీవితానికి అద్దం పట్టిన ఈ చిత్రం డాక్టర్ కురియన్ ప్రారంభించిన శ్వేత విప్లవ నేపథ్యంలో అగ్రవర్ణాల- హరిజనుల నడుమ సామరస్యాన్ని నెలకొల్పడం ప్రధాన అంశంగా తయారైంది. ఈ సినిమాలో స్మిత నటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మంథన్ తర్వాత శ్యామ్‌బెనెగల్ తీసిన ‘భూమిక’ (1976)లో స్మిత నటన హిమాలయా శృంగాన్ని అందుకున్నది. స్వతంత్ర భావాలు గల యువతిగా, స్త్రీ వాదిగా తెరపై ఆమె ఒదిగిపోయింది. తొలితరం హిందీ- మరాఠీ చిత్రాల నటి హంసా వాడే ర్ (లోక్ శాయర్ రాంజోషి- 1947) జీవితకథే భూమిక చిత్రం. ఆ చిత్ర కథ ఏమిటంటే... ఆమె జీవితంలో నలుగురు మగాళ్లకు స్థానం ఉంటుంది. జీవితం గురించి సరైన అవగాహన లేని వయస్సులోనే తన తల్లి స్నేహితుడు, పర్సనల్ సెక్రటరీ(అమోల్‌పాలేకర్)తో వైవాహిక జీవితం విసుగు చెంది దర్శకుడి (అనంతనాగ్)తో కలిసి జీవిస్తుంది. అతనితోనూ ఇమడలేక, ఆ తర్వాత రచయిత(నసీర్)తో, మరికొంత కొంతకాలం ఓ ఫ్యూడలిస్టు (అవూమిష్‌పురి)తో కూడా కలిసి ఉంటుంది. ఎక్కడా ఇమడలేక చివరికి స్వతంవూతంగా బతుకు సాగించాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ చిత్రంలో అమోల్ పాలేకర్, స్మితలు పోటిపడి నటించారు. ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా ‘ఊర్వశి ’అవార్డు వచ్చింది. ‘ఆక్షికోష్’ చిత్రంతో ఆమె రెండోసారి ‘ఊర్వశి’ అవార్డు అందుకుంది.

పన్నెండేళ్లే...
సహజనటిగా స్మిత సాధిస్తున్న విజయాల పరంపర చూసిన సత్యజిత్‌రే వంటి మహాదర్శకులు సైతం ఆమె ఇంటి తలుపు తట్టారు. ఆయన దర్శకత్వంలో స్మిత ‘సద్గతి’, ‘పికూ’ చిత్రాలల్లో నటించింది. ఇలా వరుస సినిమాల్లో ఒకదానికొకటి విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తన సినీ జీవన జైత్రయావూతను కమర్షియల్ తారలకు తీసి పోకుండా కొనసాగించడం భారత సినీ పరిక్షిశమలో ఒక్క స్మితాకే సాధ్యమైంది.

మహేష్‌భట్ ముక్కోణపు ప్రేమకథతో తీసిన ‘అర్’్థ లో షబానా ఆజ్మీ భార్యగా నటిస్తే, స్మిత ప్రేయసిగా నటించింది. వివాహేతర సంబంధాల కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో ప్రియుడి పట్ల వెర్రి వ్యామోహం చూపే నటనతో ఆమె డామినేట్ చేసింది. స్మిత, షబానాలు ఈ సినిమాలో పోటీపడి నటించారు.

స్మిత నటించిన చిత్రాలల్లో ఇంకా ప్రస్తావించుకోదగిన వాటిలో చిదంబరం, నక్సలైట్, భిగిఫల్కే, అనోఖి రిస్తా, అమృత్, పేట్ ప్యార్ అవుర్ పాప్, వారిస్, అంబర్త...ఇలా చాలా చిత్రాలే ఉన్నాయి. 12 ఏళ్ల కాలంలో మొత్తం ఆమె నటించిన చిత్రాలు 85. వీటిలో హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి, మలయాళం, తెలుగు భాషల్లో ఉన్నవి. తెలుగులో ఆమె నటించిన చిత్రం ‘అనుక్షిగహం’.

పద్మశ్రీగా..
ఆర్ట్ సినిమాల్లోనే కాకుండా స్మిత ‘నమక్ హలాల్’, ‘శక్తి’, ‘బద్లే కి ఆగ్’, ‘ఆజ్ కి ఆవాజ్’ వంటి కమర్షియల్ చిత్రాల్లో నాయకిగా నటించి మెప్పించింది. స్మిత రెండుసార్లు జాతీయ అవార్డును, ‘అంబర్త’ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డు, కేంద్ర ప్రభుత్వ ‘పద్మశ్రీ’(1985)అవార్డులు అందుకున్నది. ప్యారిస్‌లో ఆమె చిత్రాలతో కూడిన రెట్రాస్పిక్టివ్ ఒకటి జరిగినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు కోస్టాగావూవిస్ స్మితను సన్మానించారు. సత్యజిత్‌రే తర్వాత ఇలాంటి గౌరవం అందుకున్న ఏకైక భారతీయ కళాకారిణి స్మితనే.

ఫ్యామిలీ నేపథ్యం
స్మితా పాటిల్ 1955లో పూనాలో మహారాష్ట్ర రాజకీయ నేత శివాజీరావ్ పాటిల్ ఇంట పుట్టింది. తండ్రితో ఆమె సంబంధాలు అంతంత మాత్రమే. తల్లి విద్య ఒక నర్స్. తల్లిదంవూడుల మధ్య సరైన అనుబంధం లేని కుటుంబ వాతావరణంలో నర్సింగ్ క్వార్టర్స్‌లో ఆమె పెరిగింది. ఆడపిల్లలా కాకుండా ఆత్మవిశ్వాసంతో అబ్బాయిలను సైతం హడపూత్తించేది. మగ రాయుడిలా మోటార్ బైక్ రైడింగ్ చేసేది. సెంట్ జేవియర్ కళాశాలలో చదివేందుకు బొంబాయి రావడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడే శ్యామ్‌బెనెగల్ స్మితను తొలిసారిగా చూశారు. సినీ నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడు అప్పటికే వివాహితుడైన రాజ్ బబ్బర్‌ని పెళ్లిచేసుకోవడం, తల్లి కావాలనుకోవడం, ఇండవూస్టీని విస్మయ పరిచింది. కానీ ‘కెరీర్‌కన్న మాతృత్వపు మాధుర్యమే గొప్పదని’ చెప్పింది స్మిత.

దురదృష్టం...
అయితే 1985లో మలయాళ చిత్రం ‘ చిదంబరం’ షూటింగ్‌లో ఉండగా ఆ చిత్రంలోని సహనటుడు గోపితో ‘నాకెంతో సమయం లేదు. వచ్చే ఏడాది డిసెంబర్31 తర్వాత నేను ఈ లోకంలో ఉండను. నా జీవిత కాలం ఒక ఏడాదేనని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు’ అని చెప్పింది. విచివూతమేమిటంటే... ఆ మాటలు అబద్ధం కాలేదు. ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చాక 1986 డిసెంబర్13న తన జీవన నాటకంలో పోషిస్తున్న భూమికను ముగించింది. భారతీయ సినిమాకే ఆమె మరణం ఎన్నటికి తీరని లోటైంది. స్మిత మరణించినప్పుడు భారతదేశంలోని అన్ని భాషల పత్రికలు ఆమెకు నివాళిగా సంపాదకీయాలు రాయడం గొప్ప విషయం.

చివరగా- ఎందరో సినీ విమర్శకులు స్మితను ప్రముఖ నటి షబానా ఆజ్మీతో పోల్చిన సందర్భాలున్నాయి. కాని ఎవ్వరితోను పోల్చనలవి కాని నటిమణీ ఆమె. వాస్తవిక సమాంతర చిత్రాల అభినేవూతిగా స్మితాపాటిల్ భారతీయ చిత్ర రంగంలో సృష్టించిన చరిత్ర మరెవ్వరికి సాధ్యం కాదు.

స్మిత అంటే ఒక హరిజన స్త్రీ..
ఓ గిరిజన మహిళ..
సగటు స్త్రీ....
గరీబ్ ముస్లిమ్ ఔరత్..
వేశ్యా పాత్రధారి..
ధైర్యశాలి...
ఇలా ఎలాంటి భూమికకైనా జీవం పోసే అరుదైన నటి స్మితాపాటిల్.
నేడు ఆమె వర్ధంతి
సందర్భంగా
ఈ నివాళి.


రిస్క్‌ను కూడా
స్మిత తన పాత్ర పోషణలో ఎంత శ్రద్ద తీసుకుంటుందో, ఆ పాత్రను పండించడానికి కూడా అంతగా రిస్కు తీసుకునేది. దేబ్‌శిశు సినిమా కె్లైమాక్స్ షూటింగ్ నాటి సంఘటనే దానికి సాక్ష్యం. ఈచివూతంలో సీత పాత్రలో స్మిత ఓ కలగంటుంది. ఆ కలలో కాళికగా మారి కత్తి చేత బట్టి ప్రతినాయకుడిని మట్టు బెడుతుంది. ఈ సన్నివేషం షూట్‌చేసే రోజున గాలి వానతో వాతావరణం అంతా అల్లకల్లోలంగా ఉండింది. దీంతో షూటింగ్ కుదరదని దర్శకుడు ఉత్పలేంద్ చక్రవర్తి చెప్పినా ఆ వాతావరణమే సన్నివేషానికి బలాన్నిస్తుందని మంచి బ్యాక్ డ్రాప్‌గా ఉంటుందని పట్టుబట్టి షూటింగ్ జరిపించింది. నిజంగా కూడా ఆ సన్నివేషమే సినిమాకి ప్రాణం పోసిందని విమర్శకులూ ప్రశంసించారు.

అమ్మను సినిమాల్లోనే చూస్తాను
‘మా అమ్మ నటనను నేను అమితంగా ఇష్టపడతాను. నేనామెను బయట ఎన్నడూ చూడలేదు. కాని సినిమాల్లోనే చూసుకుంటాను. సినిమాలు చూడటం ద్వారానే ఆమె నాకు తెలుసునన్న భావన కలుగుతుంది. ‘నమక్ హలాల్ ’ చిత్రంలో అమితాబ్‌తో కలిసి అమ్మ పాడిన ‘ఆజ్ రపట్ జాయేతో హమే న ఉఠయ్యో’ పాట నాకెంతో ఇష్టం’
-- ప్రతీక్ బబ్బర్ (స్మితాపాటిల్ కొడుకు)


‘నటనలో సున్నితత్వం, భావోద్వేగాల అభివ్యక్తీకరణలో నూతనత్వాన్ని ఆవిష్కరించిన స్మితా పాటిల్ భారతీయ సినిమాల్లో నటీమణుల అందానికి ఉన్న పూర్తి నిర్వచనాన్నే మార్చివేసింది’
-- గోవింద్‌నిహలని.

‘స్మితకు పెట్టని ఆభరణాలు ఆమె కళ్లు. కదలకుండానే అద్భుతమైన నాటకీయకతను పండిస్తుందామె. హావభావాలతో శృంగార రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన ఏకైక నటి స్మిత’
-- అమోల్ పాలేకర్.
Take By: T News

Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, స్మిత, Telangana News,

Read more...

Saturday, November 19, 2011

హయాది నగర్

దో మినార్..
పేరు హయాత్ బక్షీ మసీదు..
నగర శివారులో ఉన్న మరో మక్కా ఇది.
కాలంతో కనుమరుగై.. చరివూతలో సమాధి అయింది.
హయాత్‌కు ఆయుష్షుకు సంబంధం ఉంది.
ఆ యాదితో ఆయుష్షు పోసే ప్రయత్నమే ఈ వాహ్.. హైదరాబాద్.
తొమ్మిదో నంబర్ జాతీయ రహదారి..
టీచర్స్‌కాలనీ, ఆర్టీసీ కాలనీ, లెక్చరర్స్ కాలనీ...


minar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతర్వాత ఆటో నగర్. ఆర్టీసీ కాలనీలో ఆ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులే ఉంటారు. అలా అని ఆటోనగర్‌లో ఆటోడ్రైవర్లు ఉండరు. దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్‌లో ఇదో పేరెన్నికగల ప్రాంతం. వాహనాల స్పేర్‌పార్ట్స్, మాడిఫికేషన్, రిపేరింగ్.. అన్నింటికీ ఇది కేరాఫ్ అడ్రస్. రకరకాల వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. ఆటోనగర్‌కు ‘ఆటోవాలా’కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆప్రాంతంలో అడుగుపెట్టగానే వాళ్లే దర్శనమిస్తారు. చిన్నచిన్న ఆర్డర్‌ల కోసం ఎదురు చూస్తూ బతుకుపోరు సాగిస్తుంటారు.
ఆటోనగర్ దాటిన తర్వాత వనస్థలి జింకలపార్క్. దీంట్లో ఈ మధ్యే జంతు ప్రతిమల ప్రదర్శనని ప్రారంభించారు. ఆ తర్వాత హయాత్‌నగర్. (హయత్‌నగర్‌గా వాడుకలో ఉంది) ఆయుష్షుకు హయాత్‌నగర్‌కు సంబంధమేమిటి? అని ఆలోచిస్తుండగా ఎన్‌హెచ్-9కు కుడివైపున అల్లంత దూరం నుంచి రెండు మినార్లు కనిపించాయి. వెళ్లిచూస్తే అదో పెద్ద మసీదు. ఐదెకరాల విస్తీర్ణం. మరో మక్కామసీదులా ఉంది ఆ ప్రాంతం. గోల్కొండలోని కుతుబ్‌షా మసీదుని గుర్తుకు తెస్తుంది ఆ నిర్మాణం. హైదరాబాద్ శివారులో ఇలాంటి ఓ చారివూతాత్మక కట్టడం ఉందని చాలామందికి తెలియదు.

దీన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారు? ఎందుకు కట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం లోపలికి వెళ్లాను.. మధ్యాహ్నం ‘నమాజ్’ నడుస్తోంది. ఆ ప్రార్థనలు అయిపోగానే స్థానికులతో కాసేపు మాట్లాడితే విషయం తెలిసింది.

బేగం నజరానా
గోల్కొండ సుల్తాన్ వంశస్థురాలు హయాత్‌బక్షీ బేగం. కులీకుతుబ్ షా వంశస్థుల్లో నాలుగో కుతుబ్ మహ్మద్ కులీ ముద్దుల కూతురు. ఒక ఆదర్శ మహిళ. సుల్తానులకు రాజకీయ సలహాదారుగా కీలకపాత్ర పోషించింది. మహ్మద్‌కులీ ఆమెను తన మేనల్లుడు సుల్తాన్ మహమ్మద్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ఆయన ఐదో కుతుబ్‌గా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత వీరి కుమారుడు అబ్దుల్లా కులీ కుతుబ్ రాజ్యాధికారం చేపట్టాడు. గోల్కొండ సామ్రాజ్యం నుంచి రాజ్యపాలన చేసిన ఈ ముగ్గురు నవాబుల వెనక బక్షీ ఉండేది. శత్రువుల దాడిని పసిగట్టి ముందస్తు ప్రణాళిక రచించడంలో ఆమె దిట్ట. ఔరంగాజేబు గోల్కొండపై దండయాత్ర చేసిన సమయంలో ‘చుట్టరికం’ చేసుకుందామని చర్చలు జరిపింది. ఆమె జరిపిన చర్చలు ఆ యుద్ధవాతావరణాన్నే మార్చేశాయి. యుద్ధంలో ఓడిపోయే ప్రమాదముందని ముందుగానే పసిగట్టి ఆమె పక్కా ప్రణాళికతో రంగవూపవేశం చేసింది. తండ్రి, భర్త, కుమారుడు... వీరి కాలంలో ఇటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం.. సుల్తాన్ మహమ్మద్ 12 సంవత్సరాల పాటు తన కొడుకును చూడలేదట. అప్పుడు హయాత్‌బక్షీ అన్నీ తానై అబ్దుల్లాను పెంచింది. ఓ సారి ఎవరికీ కనిపించకుండా పోయాడు. అబ్దుల్లా కోసం అందరూ వెతుకుతుండగా ఒక వృద్ధుడు తీసుకొచ్చి బక్షీకి అప్పగించాడట. అప్పుడు తన కుమారుడికి ఆయుష్షు ప్రసాదించినందుకు ఏం కావాలో కోరుకొమ్మని బేగం అడిగిందంట. అందుకు ఆ వృద్ధుడు ‘హైదరాబాద్‌కు తూర్పున ఒక పెద్ద మసీదును నిర్మించా’లని కోరాడట. అలా సుల్తాన్ మహమ్మద్ కాలంలో ఈ మసీదును నిర్మించారు. అప్పట్నుంచి దీనిని హయాత్‌బక్షీ మసీదుగా.. ఈ ప్రాంతాన్ని హయాత్‌నగర్‌గా పిలుస్తున్నారు.

ఏనుగుల బావి
bavi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅరబ్ నిర్మాణశైలిలో ఉన్న ఈ మసీదుకు ఐదు ఆర్చ్‌లు, రెండు మినార్‌లు ఉన్నాయి. మధ్యలో ప్రార్థనలు చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లా హాలు ఉంది. దీనికి తూర్పున కింది భాగంలో నీటి ట్యాంకు ఉంది. మసీదు చుట్టూ 140 ఆర్చ్‌ల్లాంటి గదులున్నాయి. వీటిని సరాయ్‌లు అని పిలుస్తారు. ఈ సరాయ్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. మసీదుకు ఎడమవైపునున్న సరాయిల పక్కన పెద్దబావి ఉంది. దీన్ని ‘హథీబౌలీ’ అని పిలుస్తారు. హథీ అంటే ఏనుగు. బౌలీ అంటే బావి. మసీదు కింద పెద్ద తోట ఉండేది. ఏనుగుల ద్వారా నీటిని తోడించి తోటకు నీళ్లు మళ్లించేవారట. అందుకే దీనికి హథీబౌలీ అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఈ మసీదు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఒకవూపాంత చరివూతకు సాక్షిగా నిలుచున్న ఈ కట్టడం పరిరక్షణకు పురావస్తు శాఖ కృషి చేయాల్సిన అవసరం ఉంది.

రింగురోడ్డులా..
హయత్‌నగర్ చుట్టున్న ప్రాంతాల పేర్లపై కూడా గోల్కొండ సుల్తాన్‌ల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వలయంలా పరుచుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ హయాత్ కుమారుడు అబ్దుల్లా పేరు మీద ఏర్పడింది. బక్షీ మసీదు ప్రేరణతో మజీద్‌పూర్, రాజనర్తకి తారామతి పేరుతో తారామతిపేట, అనాజ్‌పూర్, లష్కర్‌గూడ, జాఫర్‌గూడ వంటి గ్రామాలు మరికొన్ని ఉదాహరణలు. హయత్‌నగర్ దాటాక ఎన్‌హెచ్-9కు కుడిపక్కన ‘సంఘీటెంపుల్’ ఉంది. దాని పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ. పేదల భూములు కొట్టి పెద్దలకు పంచిపెడితే పుట్టిందే ఈ సిటీ.. సంఘీనగర్. భళేమంచి చౌకబేరం దొరికిందని ఐదు, పదికే వేల ఎకరాలు కొల్లగొట్టి.. రైతులను కూలీలుగా మార్చిన స్థావరాలివి. ఫిల్మ్‌సిటీ నుంచి వస్తుండగా ఔటర్‌రింగ్‌రోడ్‌పై వడ్ల ధాన్యం ఆరబోసిన రైతులు కనిపించారు. వారిని పలకరిస్తే అధికారుల అన్యాయం, పాలకుల పాపం తెలిసొచ్చింది. రింగ్‌రోడ్‌లో భాగంగా బంగారు భూములు కోల్పోయిన రైతులు వారు. ఎకరం, రెండెకరాలే ఉన్నప్పటికీ అంతా రోడ్డు పాలు అయింది. ఎకరం పదహారు లక్షలకు అమ్ముకున్నారు కానీ.. వారికి సగం డబ్బులు ముట్టాయి. మిగిలిన డబ్బుల కోసం.. ధర్నాలు, ముట్టడిలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రోడ్డులో వడ్లు ఆరబోసిన చోటే వారి ‘కళ్లం’ ఉండేదేమో.. పూర్తిగా నష్టపరిహారం పొందలేదు కాబట్టి నడిరోడ్డుపై వడ్లతో నిరసన చేసే హక్కు వారికుంది కదా! అనిపించింది. హయత్‌నగర్ చుట్టుపక్కల ప్రజల బతుకులు రింగ్‌రోడ్డులా గింగిరాలు తిరుగుతున్నట్లు అనిపించింది. రియల్‌ఎస్టేట్ వారి కొంప ముంచింది. ప్రభుత్వం కోట్ల ఆశచూపి.. కోర్టుల చుట్టూ తిప్పుకుంటోంది.

మిగిలింది మసీదే..
చారివూతక కట్టడమైన హయాత్ బక్షీ బేగం మసీదు కింద ఉన్న భూమినంతా కోల్పోయాం. ఇక మిగిలింది ఈ మసీదే. దీనై్ననా రక్షించుకోవాలనేదే మా ఆకాంక్ష. 2000 మంది నమాజ్ చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ప్రస్తుతం పురావస్తు శాఖ దీని వ్యవహారాలు చూసుకుంటోంది. ఇంతకు ముందు వక్ఫ్‌బోర్డ్ కింద ఉండేది. మసీదులోని సరాయి గదులు, మసీదు మినార్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి వాటిని పునరుద్ధరించాలి. అందుకయ్యే నిధులను మంజూరు చేయాలి. గతంలో కొంత అభివృద్ధి జరిపినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
- మీర్జా సలీమ్ బేగ్
హయాత్‌బక్షీ బేగం మసీదు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడ


Read more...

Sunday, October 30, 2011

ఆరామ్ కుర్చీ - The Short Story

‘తాతా..నాన్న నీకు కుర్చీ తెచ్చాడు’ అంటూ ప్రభాకర్ మనమడు, మనవరాలు అందమైన సీల్డ్ ప్యాక్‌లో ఉన్న కుర్చీని చూస్తూ చప్పట్లతో కేరింతలు కొడుతున్నారు.
‘ మెల్లగరా...తాతతోనే ప్యాక్ విప్పిద్దాం ఆగండి’ అంటూ కుర్చీ మీద పడబోతున్న పిల్లలను చిన్నగా వారించాడు ప్రభాకర్ కొడుకు అమర్.
అప్పటిదాకా ఆ కుర్చీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రభాకర్ పిల్లల అరుపులు విని తన గదిలోంచి హాల్లోకి వచ్చాడు.

కళ్లద్దాలు సవరించుకుంటూ కుతూహలంగా ముందుకు కదిలాడు కుర్చీ వైపు.
తండ్రిని గమనించి‘ పక్కకు జరగండ్రా..తాతను చూడనీయండి’ అంటూ దాని చుట్టూ చేరి గొడవ చేస్తున్న పిల్లలను సున్నితంగా పక్కకు నెట్టుతూ తండ్రికి దారిచ్చాడు అమర్.
ఆరాటంగా వచ్చిన ప్రభాకర్ మొహంలో కుర్చీని చూడగానే భావాలు మారాయి. తండ్రి మొహం ముడుచుకు పోవడం గమనించిన అమర్ అయోమయంలోపడ్డాడు. తన గిఫ్ట్ చూసి సంతోషిస్తాడనుకుంటే..నాన్న నారాజ్ అయ్యాడెందుకు? అర్థం కాలేదు కొడుక్కి.
ప్యాక్ విప్పి చూపిస్తే తనే హ్యాపీగా ఫీలవుతాడని..‘నాన్న ...మీరే ప్యాక్ విప్పండి నాన్నా..’ అంటూ తండ్రి చేయి పట్టుకుని ముందుకు నడిపించబోయాడు అమర్.
కొడుకు చేతిలోంచి తన చేతిని మెల్లగా విడిపించుకుని నిలబడ్డ చోటే ఆగిపోయాడు.
‘సరే, అమ్మతో తీయిస్తాను’ అంటూ ‘అమ్మా...’ పిలిచాడు వాళ్లమ్మను.
అక్కడే హాల్లో డైనింగ్ మీద వంటలు సర్దుతున్న రాజేశ్వరి ‘ఏంట్రా..’ అంటూ వచ్చింది.
‘అమ్మా...నీ చేతులతో ఈ ప్యాక్ విప్పి నాన్నకు నా గిఫ్ట్ చూపించమ్మా’ అంటూ రాజేశ్వరి భుజాల మీద చేతులు వేసి ముందుకు నడిపించాడు.

‘బాగుంది...నువ్వు కొని నన్ను ఇవ్వమంటా అంటూనే గిఫ్ట్ ప్యాక్ విప్పే పనిలో పడింది రాజేశ్వరి.
పిల్లలు కూడా ఉత్సాహంతో నానమ్మకు సాయంగా ప్లాస్టిక్ తాళ్లు కట్ చేసి చుట్టూ ఉన్న అందమైన కవర్ పరపరలాగేశారు. టీక్ వుడ్‌తో చేసిన రాకింగ్ ఛైర్ టచ్‌వుడ్‌పాలిష్‌లో మిలమిల మెరుస్తూ ఠీవీగా ఊగుతోంది

‘హే...రాకింగ్ ఛైర్...రాకింగ్ ఛైర్..తాతా..నేను కూచుంటాను తాతా...నేను కూచుంటాను’ అని పిల్లలిద్దరూ గొడవ పడ్డం మొదలుపెట్టారు.
‘చాలా బాగుందిరా..ఎంతయింది?’ మురిపెంగా చూస్తూ అడిగింది రాజేశ్వరి.
‘ఎంతో కొంతయిందిలే కాని...’ అంటూ తండ్రి వైపు చూశాడు అమర్.
అదేమీ పట్టనట్టు అనాసక్తంగా వెనుదిరిగాడు ప్రభాకర్.
‘నాన్నా.. ఆ కుర్చీ నచ్చలేదా...ఏమైంది నాన్నా....’ వెనకనుంచే గాభరాగా అడిగాడు అమర్.
‘బానే ఉందిలే’ అని గునుగుతూ గదిలోకి వెళ్లిపోయాడు.
‘ఏంటమ్మా...నాన్నకు నచ్చలేదా? ఇది కాదా...నాన్న కావాలనుకున్న కుర్చీ? తండ్రి చిన్నబోవడం భరించలేని కొడుకు తల్లిని అడిగాడు.

‘ఏమోరా..మరి! పుస్తకాలు చదువుకున్నా, ఓ కునుకు తీసినా..ఆరామ్‌గా కూర్చునే వీలుండే కుర్చీ కావాలి అన్నాడు. అంతకుమించి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నాకూ చెప్పలేదు. అయినా ఇప్పుడు ఈ కుర్చీకేమైందని? బంగారంలా ఉంటే! ఆయనే సర్దుకుంటారులే. నువ్వేమీ కంగారు పడకు’ అంటూ సగంలో వదిలేసి వచ్చిన తన పనిలోకి వెళ్లింది రాజేశ్వరి.
అమర్ మొహం చిన్న బోయింది. ఈ సీన్‌ను ఇలా ఊహించుకోలేదు తను. నాన్న పుట్టిన రోజున..తనెప్పటి నుంచో ఆశ పడుతున్న కుర్చీని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాడు. కాని తన భార్య శైలజ దాపరికంలేని నైజంతో రెండురోజుల కిందటే నాన్న ముందు ఈ విషయాన్ని లీక్ చేసింది. విషయం తెలియగానే ఎంత సంతోషపడ్డాడు! పుట్టిన రోజు కోసం చిన్న పిల్లలు ఎదురు చూసినట్టుగా ఎదురుచూశాడు. ఆ ఆరాటం చూసి నిజంగానే పెద్దాళ్లు పిల్లల్లాంటి వాళ్లు అనుకున్నాడు. తనిచ్చిన గిఫ్ట్ చూసి నాన్న ఉబ్బితబ్బిబ్బయిపోతుంటే చూడాలనుకున్నాడు. కాని అంతా రివర్స్ అయింది. ఈ ఆలోచనల్లో ఉండగానే...
అమర్ సెల్ రింగయింది. జేబులోంచి సెల్ తీసి చూశాడు. శైలజ.
‘శైలూ...చెప్పు’ లిఫ్ట్ చేస్తూ అమర్.

‘కుర్చీ వచ్చిందా...మామయ్య చూశారా? నచ్చిందా?’ ప్రశ్నల వర్షం అవతలి నుంచి.
‘ ఆ..వచ్చింది. చూశారు. నేను మళ్లీ చేస్తాలే’ విసుగు వినిపించనీయకుండా పొడిపొడిగా అమర్.
‘ఓ..మామయ్య పక్కనే ఉన్నారా?ఓకె, ఓకె’ అంటూ కట్ చేసింది.
తను ఎప్పుడూ ఇంతే. భలే ఇమాజిన్ చేస్తుంది క్వైట్ అపోజిట్‌గా. అంత విసుగులోనూ నవ్వుకుంటూ సెల్ జేబులో పడేశాడు. కాని తండ్రి అసంతృప్తి అమర్‌కు మనసులో మనసు లేకుండా చేసింది.


తన గదిలో విచారంగా కూర్చున్నాడు ప్రభాకర్. తను కావాలనుకుంటున్న కుర్చీ తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఊరిస్తోంది. అదేమీ లక్షల ఖరీదు కాదు..వందల్లో విలువే. అయితే ఇప్పుడనిపిస్తోంది అది అమూల్యమైందని. ఆలోచిస్తూ తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు ప్రభాకర్..
తనకప్పుడు ఎనిమిదేళ్లు...
తాత ఆరామ్ కుర్చీ అంటే తనకు చాలా ఇష్టం. భోజనం చేసే టైమ్, రాత్రి నిద్ర వేళలు తప్ప మిగిలిన సమయమంతా తాతా ఆ కుర్చీలో కూర్చునే గడిపేవాడు. ఉమ్మడి కుటుంబం. డజను మంది పిల్లలు ఆ ఇంట్లో. తనలాగే పిల్లలందరి కన్నూ ఆ కుర్చీ మీదే.

ఇంట్లో ఉన్నంత సేపు అంతా ఆ కుర్చీ చుట్టే తిరిగేవాళ్లు. ఏ అవసరం కోసమైనా తాతా లేస్తే చటుక్కున ఆ కుర్చీ ఆక్రమించుకుందామని. చెప్పొద్దూ...ఆ కుర్చీ కోసం పెద్దవాళ్లకూ పోటీ ఉండేది. ఒక్క కుర్చీ చుట్టూ చిన్నా, పెద్ద కలిపి ఇరవై మంది మ్యూజికల్ ఛైర్ ఆడినట్టుండేది. పిల్లలందరిలోకి ఆఖరివాడు ప్రభాకర్. పన్నేండేళ్లు వచ్చేదాకా కనీసం ఆ కుర్చీని తాకే ఆదృష్టం కూడా కలగలేదు తనకు.
వయసు పెరుగుతున్న కొద్దీ కుర్చీ మీద మోహమూ పెరగసాగింది ప్రభాకర్‌కు. ఎంతంటే ఆ కుర్చీలో కూర్చునే వాళ్ల మీద కసి తీర్చుకోవాలనుకునేంత.
తాత పోయాక, ఆ కుర్చీ పెద్దనాన్నకు అంకితమైంది. పెద్దనాన్న హయాంలోనే అన్నయ్యలు, బావలు, మామయ్యలూ పంచుకునే వాళ్లు దాన్ని. తనకు ఇరవై రెండేళ్లు వచ్చినా ఆ కుర్చీలో కూర్చునే అవకాశం రాలేదు.
అన్నేళ్లయినా కుర్చీ చెక్కు చెదరలేదు. అప్పుడప్పుడు కుర్చీ పొడవాటి చేతులు వదులైనప్పుడు పెద్దమ్మ వడ్లాయన్ని పిలిపించి చిన్న చిన్న పేళ్లు కొట్టించేది. చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు, ఎన్ని ఊహలు అల్లుకున్నాడు ఆ కుర్చీ చుట్టూ.

దాని పొడవైన రెండు చేతుల మీద రైటింగ్ పాడ్ పెట్టుకుని హోం వర్క్ చేసుకోవాలని, ఆదివారం మధ్యాహ్నం ఆ కుర్చీలో ఆరామ్‌గా కూర్చుని గ్రామ్‌ఫోన్‌లో పాటలు వినాలని, ఎండాకాలం వాకిట్లో ఆ కుర్చీ వేసుకుని చుక్కలను లెక్కబెడుతూ చల్లగా నిద్రలోకి జారుకోవాలని... ఆ కుర్చీలో కూర్చునే కథల పుస్తకాలు చదువుకోవాలని..!వారానికి ఒక్కసారైనా కుర్చీలో కూర్చున్నట్టు కలొచ్చేది. ఆ కలొచ్చిన ఆనందం కన్నా తెల్లారి నిద్రలేచేసరికి ఆ కుర్చీలో కూర్చుని పేపర్‌చదువుకుంటున్న పెద్ద వాళ్లను చూస్తే విపరీతంగా కోపమొచ్చేది. నిస్సహాయంగా అక్కడి నుంచి కదిలేవాడు.
చాలా సార్లు కుర్చీ బట్టకున్న కర్రలు తీసి అందులో కూర్చునే పెద్దవాళ్ల నడుం విరగొట్టాలన్నంత కసికలిగేది. ఒకసారి దానికి ప్రాక్టికల్‌రూపమిచ్చాడు కూడా. అది నెగటీవ్ ఫలితాలనిచ్చింది.
ఒకరోజు ప్రభాకర్ వాళ్ల పెద్దనాన్న ఏదో పంచాయతీ ఉందని బయటకు వెళ్లాడు. అప్పుడే ఆడుకుని లోపలికి వచ్చిన ప్రభాకర్‌కు కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆనందంతో అందులో కూర్చోబోతుంటే...
‘రేయ్‌పెద్దవాళ్లు కూర్చునే కుర్చీ అది. పో లోపలికెళ్లి పుస్తకాలు తియ్’ అంటూ తిడుతూ వచ్చి అందులో కూర్చున్నాడు పెద్దన్నయ్య.
విలవిల్లాడిపోయాడు ప్రభాకర్. బంగారం లాంటి ఛాన్స్. ఛ...వచ్చినట్టే వచ్చి మిస్8 అయింది. ఎవస్ట్ శిఖరం కొన వరకూ వెళ్లి శిఖరం మీంచి జారిపడినంత బాధపడిపోయాడు. మనసులోనే అన్నను తిట్టుకున్నాడు, శాపనార్థాలు పెట్టాడు.

ఇంతలోనే పెద్దమ్మ అన్నయ్యను పిలవడంతో ‘రేయ్...పెద్దమ్మ పిలుస్తోంది, ఇప్పుడే వస్తాను, ఈలోపు కుర్చీలో కూర్చున్నావో..కోలుదండం ఖాయం, జాగ్రత్త’ బెదిరిస్తూ వెళ్లాడు.
ఖాళీ కుర్చీ వెక్కిరిస్తోంది. అవమానం తట్టుకోలేకపోయాడు. ఎన్నాళ్లనుంచో మెదడును తొలుస్తున్న ఆలోచన బయటకు వచ్చింది. వెళ్లి కుర్చీ బట్టకున్న కర్రలు తీసి గప్‌చుప్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయి పుస్తకాలు ముందేసుకున్నాడు బుద్ధిగా చదువు నటిస్తూ.
ఈ లోపు అటుగా వచ్చిన ప్రభాకర్ మేనత్త భర్త ఆ కుర్చీలో కూర్చోబోయి దభేల్న కింద కూలబడ్డాడు. ‘అమ్మా....నడుం పాయే’ అన్న కేక వినిపించే సరికి ఎక్కడి వాళ్లక్కడ పని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు సౌండు వినిపించిన చోటికి.

అన్నయ్య కేక వినిపిస్తదనుకుంటే పెద్ద మామయ్య కేక వినిపించేసరికి బిత్తరపోయి హాల్లోకి వచ్చాడు ప్రభాకర్.
జీతగాడు సాయిలు ఆ ఇంటి పెద్దల్లుడ్ని తన రెండు చేతులతో ఎత్తి పక్కనే ఉన్న దీవాన్ మీద పడుకో బెడుతున్నాడు. బాధతో మెలికలు తిరుగుతున్నాడు ఆ ఇంటి పెద్దల్లుడు. ‘అయ్యో...ఎట్లా పడ్డారు’ పెద్దత్త కంగారు పడుతోంది.
అందరికీ దూరంగా నిలబడ్డాడు ప్రభాకర్. ఆ గుంపులోంచి రెండు చేతుల్లో రెండు కర్రలు పట్టుకుని తన వైపే వస్తూ కనిపించాడు పెద్దన్నయ్య. కర్రలు చూపిస్తూ తనముందు నిలబడ్డాడు నీ పనే కదా అన్నట్టుగా.తల వంచుకున్నాడు ప్రభాకర్.
మామయ్యకు నడుం విరిగింది. బాగవడానికి యేడాది పట్టింది. అయినా పూర్తిగా కోలుకోలేదు ఆయన. ఆ రోజు ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లే హడావుడిలో పడి కర్రలు ఎవరు తీసేశారు అన్న అనుమానంలోకి వెళ్లలేదెవరు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు.
ప్రభాకర్ పెద్దన్నయ్య ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కాని చాలా ఏళ్లు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభాకర్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇంచుమించు తనను సేవకుడిగా మార్చుకున్నాడు.
అత్యంత విషాదమేంటంటే...తన తప్పేమీ లేకపోయినా ఆ ఇంటి పెద్దల్లుడి నడుం విరగడానికి కారణమైన ఆ కుర్చీని ఆ ఇంటి నుంచి తరిమేశారు. ఆ ఊళ్లోనే ఉంటున్న వాళ్ల బంధువులకు ఇచ్చేసింది ప్రభాకర్ పెద్దమ్మ. ఉసూరుమన్నాడు ప్రభాకర్. తాను ఒకటి తలిస్తే...విధి ఒకటి తలిచింది.
రెండు రోజుల కొకసారి పనిగట్టుకుని మరీ బంధువుల ఇంటికి వెళ్లి తృప్తిగా కుర్చీని చూసొచ్చేవాడు. ఎప్పటికైనా మళ్లీ ఆ కుర్చీని తమింటికి తెచ్చుకోవాలని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాడు తనకుతానే. పై చదువుల కోసం పట్నానికి మకాం మారాడు ప్రభాకర్. చదువు ఒత్తిడితో కుర్చీ విషయాన్ని తాత్కాలికంగా మర్చిపోయాడు. జీవన పోరాటంలో రోజులు గడుస్తున్నాయి. కాని ఓ ఫైన్ మార్నింగ్..కుర్చీ జ్ఞాపకం వచ్చింది. అంతే సెలవు రోజున బయలుదేరాడు ఊరికి ఎలాగైనా సరే కుర్చీని వెంట తెచ్చుకోవాలని.
వెళ్లాక తెలిసింది చావు కబురు చల్లగా. బంధువులాయన చనిపోతే ఆయనతోపాటే ఆయన కూర్చునే ఈ కుర్చీనీ ఆయన వెంట సాగనంపారని. కుళ్లి కుళ్లి ఏడ్చాడు మనసులోనే ప్రభాకర్. కుర్చీ సహగమనం అయినందుకు. చెప్పలేని నిరాశతో వెనుదిరిగాడు.

తర్వాత పెళ్లి, పిల్లలు, పెరిగిన బాధ్యతలు కుర్చీ మోహాన్ని చంపినా జ్ఞాపకాన్ని మాత్రం చెరపలేకపోయాయి. అలాంటి కుర్చీ కోసం చాలా ట్రై చేశాడు.ఎక్కడా దొరకలేదు. కొడుకు ఇస్తానంటే అచ్చంగా అలాంటిదే అనుకున్నాడు. కాని కాదు...అన్నిట్లో లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినట్టే ఆరామ్ కుర్చీ కూడా మోడ్రన్ రూపాన్ని తెచ్చుకున్నట్టుంది. ఆ న్యూ మోడల్ ప్రభాకర్‌ను ఆకర్షించలేదు. పైగా బోలెడంత నిరాశను మిగిల్చింది.

‘తాతా..నానమ్మ భోజనానికి రమ్మంటుంది’ అన్న పిల్లల పిలుపుతో వర్తమానంలోకి వచ్చాడు.
‘వస్తున్నా’ అంటూ నెమ్మదిగా లేచి డైనింగ్ హాల్లోకి వచ్చాడు.
పిల్లలు రాకింగ్‌ఛైర్ చుట్టూ చేరి అల్లరి చేస్తున్నారు. నేను కూర్చుంటాను అంటే నేను కూర్చుంటాను అంటూ. వాళ్ల నానమ్మ వారిస్తోంది‘ ఇది తాతది నాన్న...మీరు ఎక్క కూడదు’ అని.
పిల్లల దగ్గరికి వచ్చి‘ ఈ ఛైర్ మీకు బాగా నచ్చిందారా...’ అడిగాడు.
‘అవును తాతా.... ఈ ఛైర్ అంటే నాకు బాగా ఇష్టం. నేను కూచుంటానంటే నానమ్మ వద్దంటుంది, ఇది నీదంట...మెము కూచోవద్దట’ మనవడు చెప్పాడు బాధగా.
‘ నాది కాదు...మీదే’ అంటూ మనవడిని ఎత్తుకుని అందులో కూర్చోబెట్టాడు ప్రభాకర్.
వాడు అందులో కూర్చుని ఆనందంగా ఊగుతుంటే తృప్తిగా ఫీలయ్యాడు.
‘వీడు ఆశపడ్డ ఈ కుర్చీ వీడి మోజు తీరకుండానే రేపు ఇంకో రూపానికి మారిపోతే?.పాపం వాడూ నాలాగే లక్షలు సంపాదించినా ఓ చిన్న కోరిక తీరని వాడిగా మిగిలిపోతాడని.’ తనవైపే ప్రశ్నార్థకంగా చూస్తున్న భార్యతో అంటూ డైనింగ్ వైపు నడిచాడు ప్రభాకర్.


Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP