Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, January 20, 2012

పోలీస్ శాఖలో 820 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 19 (): పోలీస్ శాఖలోని వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి గురువారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ సీటీ ఎస్సై పోస్టులు 38, వేలిమువూదల విభాగంలో ఎస్8సీటీ ఎస్సై పోస్టులు 17, పోలీస్8 ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ ఏఎస్సై పోస్టులు 29 భర్తీ కానున్నాయి.

అదేవిధంగా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్8సీటీ కానిస్టేబుల్ పోస్టులు 516, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులు 32, ఎస్8సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు 188 భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.apstatepolice.org వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ మాలకొండయ్య తెలిపారు.

Take By: T News

Read more...

నెరవేరిన చిరు కోరిక

- కేబినెట్‌లో ‘పీఆర్పీ’.. రాష్ట్ర మంత్రులుగా సీఆర్, గంటా
- ప్రమాణం చేయించిన గవర్నర్
- కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కేబినెట్‌లోకి..
- ఐదు నిమిషాల్లో ముగిసిన తంతు
- హాజరుకాని విపక్ష నేతలు
- అధిష్ఠానం దూతగా కేబీ కృష్ణమూర్తి
- శాఖల కేటాయింపులపై తర్జన భర్జన

55505-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 19 (): ఎట్టకేలకు చిరంజీవి ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర కొత్త మంత్రులుగా ‘ప్రజారాజ్యం’ తరపున సీ రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలుత రామచంద్రయ్య, అనంతరం శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39కి చేరింది. ఉదయం 11.43కు మొదలైన కార్యక్రమం 11.48 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పలువురు మంత్రులు, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు కేవీపీ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది, డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. విపక్షనేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరవలేదు.

కాగా.. ప్రమాణస్వీకారం ముగిసిందో లేదో కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి పదవులు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ది చేయాలంటే నిధుల కేటాయింపులో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పదవుల ఆశతో ఉద్యమాన్ని నీరుగార్చిన టీ కాంగ్రెస్ నేతలపై ఆ ప్రాంత ఎంపీలు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణవారికి చోటు దక్కపోవడం.. ఈ ప్రాంత నేతలకు చెంపపెట్టులాంటిదని దుయ్యబట్టారు.

వారికి తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా పదవుల చుట్టూ తిరగకుండా ఉద్యమాన్ని నీరుగార్చొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పదవులు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు, గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయిన అనంతరం ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏర్పడిన లోటును త్వరలోనే సర్దుబాటు చేస్తామన్నారు. విస్తరణ జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు సీఎం కిరణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు..

Take By: T News

Read more...

రాజీవ్ విద్యామిషన్ పోస్టుల భర్తీ..

-ప్రభుత్వానికి ట్రిబ్యునల్ నోటీసులు
-నాలుగు వారాల్లో వివరణకు ఆదేశం

హైదరాబాద్, జనవరి 19 (): రాజీవ్ విద్యామిషన్‌కు సంబంధించిన పోస్టుల భర్తీలో మాధ్యమిక విద్యాశాఖ జారీచేసిన జీవో నెం 7పై రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో నెంబర్ 7ను రద్దు చేయడంతోపాటు, జీవో నెం 3ను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. విద్యామిషన్ ద్వారా భర్తీ చేయాల్సిన సుమారు 9500 పైగా ఉన్న పోస్టులను నేరుగా నియమించేందుకు ప్రభుత్వం జీవో నెం 3 జారీచేసిన తర్వాత, జనవరి 9 వ తేదీన అందుకు విరుద్ధంగా జీవో జారీచేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపించారు.

Read more...

దగా పడిన ధర్మాస్పత్రి

- మందు బిళ్లలకూ దిక్కులేదు
- ఉన్న స్టాక్‌తోనే పంపిణీ మాయ
- మూలన పడిన విలువైన మెషినరీ
- కార్పొరేట్‌తో సర్కారు దోస్తానా!
- 10% కార్పొరేట్ వైద్యం ఉచితం
- కానీ.. కాగితాలకే పరిమితం
- వర్ధిల్లుతున్న ‘కార్పొరేట్ శ్రీ’
- ఈ పథకంలో రూ.3593 కోట్లు ఖర్చు
- ప్రైవేటు కార్పొరేట్‌కేరూ.2853 కోట్లు
- భారీగా అక్రమాలు..బయటపడేవి కొన్నే

Hospital1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
రెండు తెల్లమందు బిళ్లలు.. రెండు ఎర్రగోలీలు! మహా అయితే ఓ సూదిమందు! గత కొన్నేళ్లుగా సర్కారీ వైద్యం తీరిదే! కొన్ని చోట్ల ఇవీ ఉండవు! మారుమూల పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభించినా.. దిక్కులేని పరిస్థితి! ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఏరియా ఆస్పవూతులో, జిల్లా ఆస్పవూతులో గతి! అక్కడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉండటంతో సర్కారీ వైద్యం కునారిల్లుతోంది. కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సేవలో పడిన ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం ధర్మాస్పవూతులను దగా చేస్తున్నది. ప్రభుత్వాస్పవూతుల ఉసురు తీసి.. కార్పొరేట్‌కు ఊపిరిపోస్తున్నది!

ప్రభుత్వ నిండు నిర్లక్ష్యం కారణంగా ధర్మాస్పవూతులు దగా పడుతున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బంది లేక, మందుల్లేక, అధునాతన యంత్రసామగ్రి ఉన్నా.. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించే దిక్కులేక కునారిల్లుతున్నాయి. అదే సమయంలో ఖరీదైన వైద్యానికి పెట్టిందిపేరైన కార్పొరేట్ వైద్యశాలలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అక్కడ వైద్యం ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు గతంలో ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు.. దాంతో కొంతకాలం పాటు ఆ ఆస్పవూతులు ఈగలు తోలుకున్న పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ప్రభుత్వ పుణ్యమాని ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పవూతులను కాపాడేందుకు, పోషించేందుకు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లు స్థాయిలో వాటికి బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు గుప్పెడు రోగాలకు మాత్రమే కోట్లలో ఉంటున్నది తప్పించి.. ప్రజల తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన, ఏరియా, జిల్లా ఆస్పవూతులపైనా ఉండటం లేదని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

(, హైదరాబాద్)ఈ ఆర్థిక సంవత్సరం మందుల కోసం ప్రభుత్వం రూ.310 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.112కోట్లు గ్రీన్ చానల్ కింద ఇస్తామని నాలుగు నెలలక్షికితం చెప్పింది. ఇప్పటికీ రూపాయి కూడావిడుదలచేయలేదు. మందులు సరఫరా చేసే అనేక సంస్థలు కోర్టు కేసుల్లో ఉన్నాయి.వీటిని పరిష్కరించాలని ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాసినా ప్రభుత్వంగానీ, ఏజీ గానీ శ్రద్ధ పెట్టడం లేదని అధికారులే అంటున్నారు. మందుల పంపిణీలో అవినీతిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మందులు జిల్లా కేంద్రాల్లోని గోడౌన్లలో ఉండడంతో అక్కడికి మందుల కోసం వెళ్లేవారిని రూ.2వేల నుండి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మందులు అయిపోయినా పీహెచ్‌సీల్లోని సిబ్బంది మందులకోసం జిల్లా కేంద్రాలకు వెళ్లడం లేదనే వాదన ఉంది.

ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల కొన్ని సలహాలు కూడా చేశారు.అవి.. 1.మందుల కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా నేరుగా పీహెచ్‌సీల నుండి ఇండెంట్ తెప్పించడం. 2.శస్త్ర చికిత్సకు అవసరమైన సామాక్షిగికి ప్రతినెలా ముందుగానే ఇండెంట్ పెట్టడం. 3.ఆస్పవూతులకు సరఫరా చేసిన మందుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆస్పవూతుల్లో అందే సేవలపై ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఆన్‌లైన్‌లో సమాచారం ఉంచాలి.4.ఆస్పవూతుల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను బోర్డుల రాయాలి. కానీ.. వీటిని ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు.

మూలపడిన మెషినరీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పవూతుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువైన సామాగ్రి ఉంది. ఇందులో రూ.450కోట్ల విలువైన మెషినరీని ప్రస్తుతం వాడటం లేదు.చిన్నచిన్న రిపేర్ల వల్ల ఇవి మూలపడ్డాయి. ఈ బాధ్యత నిర్వహించాల్సిన ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో యంత్రాలు పని చేయక రోగులు ప్రైవేటు ఆస్పవూతులకు వెళ్లి ఆస్తులు కరిగించుకునే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.

కార్పొరేట్‌తో దోస్తానా
సొమ్ములుం ఆస్పత్రి గడప తొక్కనిచ్చేది అన్న రీతిలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పవూతులు వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాగం, పర్యవేక్షణ, తనిఖీ, నిఘా వంటివి ఏమాత్రం లేకపోవడంతో కార్పొరేట్ ఆస్పవూతులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. ఇక్కడ వసూలు చేసే చార్జీలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకే రకమైన రోగానికి, పరీక్షకు పలు ఆస్పవూతులు పలు రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయి. చికిత్సతో రోగం కుదిరినా.. ఈ బిల్లులు చూసి వారి గుండెలు గుభేల్మంటున్న పరిస్థితి ఉందన్నవాదన ఎప్పటినుంచో ఉంది. రాజధాని పరిధిలో దాదాపు 2200ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పవూతులున్నాయి.ఇందులో 1500 ఆస్పవూతులకే అనుమతులున్నాయని తెలుస్తోంది. వివిధ సేవల చార్జీల వివరాలను నోటీసు బోర్డులో పేర్కొనాల్సి ఉంది. చాలా ఆస్పవూతుల్లో ఇవి కనిపించవు.

ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు పొందిన కారణంగా తమ ఆస్పవూతుల్లో పదిశాతం రోగులకు ఉచిత సేవలు అందిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రం ఇస్తాయి. ఇలా రాయితీలు, సబ్సిడీలు పొందిన ఆస్పవూతుల్లో ఏ ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతున్న దాఖలాలు లేవు. అపోలో ఆస్పత్రి సహా అనేకం ఇదే బాటలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రభుత్వం నుండి రూ.200కోట్ల విలువైన భూమిని సాధారణ ధరకు తీసుకుంది. ఇది ట్రస్టు ఆస్పత్రి కనుక తెలంగాణతో పాటు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారూ విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా తెలంగాణ నుండి ఒక్కరు కూడా డైరెక్టర్ కాలేదు. కేర్ ఆస్పత్రి యాజమాన్యం గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ను ఆసరాగా చేసుకుని, అవే ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేస్తూ, ఫౌండేషన్‌కు చూపిస్తూ డబ్బులు దండుకుంటోందనే ఆరోపణలున్నాయి.

కనిపించని తనిఖీలు
ఏటా రాష్ట్రంలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో రూ.7వేలకోట్లకు పైగా ప్రైవేటు ఆస్పవూతుల జేబుల్లోకి వెళ్తున్నాయని అంచనా. కార్పొరేట్ ఆస్పవూతుల వ్యవహారాలను జిల్లా డీఎంహెచ్‌వో తనిఖీ చేయాలి. కొన్ని తనిఖీ బృందాలూ ఉండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ఆస్పవూతిలోనూ తనిఖీలు జరగడంలేదని నిపుణులు అంటున్నారు. నెలనెలా మామూళ్లు అందడంతోనే అధికారులు నిమ్మకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. మందుల షాపుల్లోనూ తనిఖీలు లేవు. నాశిరకం మందుల అమ్మకాలను నిరోధించేందుకు డ్రగ్ కంట్రోల్ అథార్టీ ఉన్నా.. తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో మెడికల్ షాపుల్లో జరిగే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని అంటున్నారు.

కార్పొరేట్ శ్రీ
అందరికీ మెరుగైన వైద్యం పేరుతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ.. కార్పొరేట్ ఆస్పవూతులకు కల్పతరువుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 2007లో ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా కార్పొరేట్ ఆస్పవూతుల్లో ఈగలు తోలుకునే పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ఆరోగ్యశ్రీ రాకతో కార్పొరేట్ ఆస్పవూతులు నేడు ధనికులకంటే పేదలతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.3593కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.2853కోట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పవూతులకు,మిగిలిన రూ.740 కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు బిల్లులు చెల్లించారు. కార్పొరేట్ ఆస్పవూతులకు ఇచ్చిన డబ్బును ప్రభుత్వ ఆస్పవూతుల కోసం ఖర్చు చేసి ఉంటే మళ్లీ ప్రభుత్వ ఆస్పవూతులు జీవం పోసుకునేవని అధికారులు,మేధావులుఅంటున్నారు.ఒకసంస్థ చేసిన సర్వేలో రూ.2వేల కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు ఖర్చు చేస్తే కార్పొరేట్‌కు దీటుగా పనిచేస్తాయని, పూర్తిగా ఉచిత సేవలందించవచ్చని పేర్కొంది.

అయినా.. కార్పొరేట్‌కు దోచిపెట్టడానికే ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ కింద ఇంకెన్ని కోటె్లైనా ఇచ్చేందుకు సిద్ధమని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీలో అక్రమాలకూ అంతూపొంతూ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పవూతులుఅవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి బిల్లులు దండుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాకు హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌పై ఆరోగ్యశ్రీ ట్రస్టు క్రిమినల్ కేసులు పెట్టింది. గాంధీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎన్‌వీఎన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ సెంటర్‌పై ఈ నెల 15న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ ఐపీసీ 406-42కింద క్రిమినల్ కేసు పెట్టారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, అనవసరమైన హెర్నియా శస్త్రచికిత్సలు చేసి ప్రజలను మోసం చేశారని రిపోర్టులో తేలిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆరోగ్యశ్రీ పరిధిలో అనేకం జరుగుతున్నాయి.

DRRR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసర్కార్ వైద్యం పూర్తిగా నిర్వీర్యం కావడానికి ప్రభుత్వాలే కారణం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కార్పొరేట్ ఆస్పవూతులు ప్రైవేటు రంగంలోకి వచ్చాయి. దీనికి ముందు వైద్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. రాష్ట్రంలో మొదటి పౌరుడు గవర్నర్ నుండి మామూలు వ్యక్తి వరకు ప్రభుత్వ ఆస్పవూతికి వచ్చి అత్యుత్తమ చికిత్స చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ రానురాను కేటాయింపులు తగ్గిస్తూ కావాలనే ప్రభుత్వ వైద్యాన్ని సర్కారు నిర్వీర్యం చేసింది. ప్రభుత్వమే మందులు, పరికరాల కొరత సృష్టించడం మొదలు పెట్టింది. కార్పొరేట్ రంగం ఆవిర్భవించాక ప్రభుత్వ ఆస్పవూతులకు బడ్జెట్ పెంచాల్సింది పోయి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రైవేటు సెక్టార్‌లో ఇన్స్యూన్స్ చేయించి ప్రోత్సహించింది.
- డాక్టర్ నర్సయ్య, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు

తమిళనాడులో ఏ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ ఆస్పవూతుల్లో వైద్యం చేయించుకుంటారు. ఆ పరిస్థితి గతంలో మన రాష్ట్రంలోనూ ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే కావాలని కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తూ సీమాంధ్రవ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త కార్పొరేట్ ఆస్పవూతులొచ్చి కోట్లు దండుకుంటున్నాయి. పేదలకు 20శాతం ఉచితవైద్యం చేస్తామని చెప్పి వచ్చిన వాళ్లు ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. లాబీయింగ్‌తో మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్న డబ్బుతోనే ప్రభుత్వ ఆస్పవూతులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వైద్యం చేస్తామంటే ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? నమ్మకం పోయింది కనుకే ప్రభుత్వ ఆస్పవూతులు నిర్వీర్యం అవుతున్నాయి.
- డాక్టర్ రమేష్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
Take By: T News

Read more...

Wednesday, January 18, 2012

Don't spy on Muslims, says Achuthanandan

Don't spy on Muslims, says Achuthanandan
Thiruvananthapuram, January 17 : Opposition leader V.S. Achuthanandan Tuesday blasted the Kerala government for allegedly spying the email accounts of Muslim leaders.
 
The Marxist leader accused Chief Minister Oommen Chandy of "following in the footsteps of Narendra Modi". 

"We wish to know if P.V. Abdul Wahab and Abdul Samad Samadhani, both belonging to the Indian Union Muslim League, have terrorist connections?" asked Achuthanandan. 

On Monday, news surfaced that the intelligence department here was allegedly spying on the email accounts of 189 Muslim leaders, including journalists and politicians.

Chandy has asked Additional Director General of Police (Intelligence) T.P. Senkumar to probe the allegation.

State IUML general secretary K.P.A. Majeed said: "Let the report come out, and then we will react to it."

The Kerala Union of Working Journalists condemned the tracking of emails and tapping of telephones of journalists.

Take By: Siasat News

Read more...

టెట్టా .. డీఎస్సీనా (TET / DSC)

- రెండింటిలో ఏదో ఒకటే.. అధ్యయనంపై ప్రభుత్వ యోచన
- మంత్రి పార్థసారధి వెల్లడి.. ఈ డీఎస్సీకి వర్తింపు డౌటే !
- టెట్‌పై అభ్యర్థుల్లో వ్యతిరేకత.. శాస్త్రీయత లేదంటూ ఆందోళన


హైదరాబాద్, జనవరి 17 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పై రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జాతీయ విద్యా, ఉపాధ్యాయ శిక్షణా మండలి మార్గదర్శకాల మేరకు టెట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. దేశ వ్యాప్తంగా లేని టెట్ రాష్ట్రంలో ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో ఏమాత్రం శాస్త్రీయత లేకుండా ప్రభుత్వ ఆలోచనలను బలవంతంగా రుద్దుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఎంపికకు అభ్యర్థుల వడపోతకు ప్రభుత్వం ఎలాగూ డీఎస్సీ నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలో టెట్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభ్యర్థుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా డీఎస్సీ, టెట్‌లలో ఏదో ఒక పరీక్ష నిర్వహించేలా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పి. పార్థసారధి తెలిపారు. అలా కాకుంటే ఈ రెండు పరీక్షలు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలా? అనేది అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే టెట్ రెండు సార్లు నిర్వహించారు. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు కూడా విద్యాశాఖ రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీకి టెట్ వర్తింపజేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం యోచన బాగానే ఉన్నప్పటికీ ఈ అధ్యయనం పూర్తి చేయటం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించే కొత్త డీఎస్సీకి ఇది వర్తించే అవకాశం కనిపించటం లేదు. డీఎస్సీ రాత పరీక్షకు అర్హతలు ఇప్పటికే విద్యాశాఖా ప్రకటించింది.

సివిల్స్‌స్థాయి ప్రమాణాలా..!
భారత సర్వీసులు, గ్రూప్-1 ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షా ప్రమాణాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపికకు పెట్టడంతో అభ్యర్థులు హడపూత్తి పోతున్నారు. సివిల్స్ ఎంపికకు డిగ్రీ కలిగి ఉండి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు మూడు అంచెలు దాటి వసే ్త అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపిక అవుతారు. ఉపాధ్యాయులకు సైతం ఇదే స్థాయిలో ఎంపిక ప్రక్రియ ఉంది. ప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, డీఎస్సీ మూడు అంచెలు దాటి రావాల్సి ఉంది. దీంతో అభ్యర్థులు సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ కావల్సిన పరిస్థితి నెలకొంది.

శాస్త్రీయత లేదు..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ కూడా శాస్త్రీయంగా లేదు. ఇందులో ప్రధానంగా భాషా పండితులు తెలుగు, హిందీ విషయాన్ని బోధిస్తారు. కానీ వీరికి టెట్ పరీక్షలో సోషల్ సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలడగటం ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇందులో సోషల్ సబ్జెక్టుకే అధిక మార్కులు ఉండటం గమనార్హం. సాధారణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలో సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. కానీ టెట్‌కు మాత్రం 60 శాతం మార్కులు సాధిస్తేనే డీఎస్సీకి అర్హత సాధించినట్లు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు సాధించాలని నిర్ణయించటం శాస్త్రీయంగా లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయుల ఎంపికకు ప్రభుత్వం టెట్ పరీక్ష ఐచ్చికంగా పెట్టుకుంటే బాగుండేది.

లేదా సాధారణ డిగ్రీ, పీజీ మాదిరిగానే 35 శాతం మార్కులు పెట్టి టెట్ పాసైతేనే డీఎస్సీకి అర్హులు అన్నా బాగుండేది. కానీ ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా టెట్ నిర్వహిస్తుండటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more...

స్పెషల్ బాంబ్!

- ఇంధన సర్దుబాటు చార్జీల మోత
- డిస్కమ్ ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం
- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసిన కమిషన్
- హైకోర్టు తీర్పుకు లోబడి 2008-09 ఎఫ్‌ఎస్‌ఏ అమలు
- 2009-10 ఎఫ్‌ఎస్‌ఏ ఫిబ్రవరి నుంచి వసూలు
- విద్యుత్ వినియోగదారులపై రూ. 3038 కోట్ల పరోక్ష వడ్డన
- యూనిట్‌కు 35 నుంచి 40 పైసల భారం


bulb1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 17 (: గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. వచ్చే ఫిబ్రవరి నెలనుంచి ఎఫ్‌ఎస్‌ఏ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్దేశించింది. మంగళవారం రాత్రి పదిగంటల వరకు కసరత్తు జరిపి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఈఆర్సీ ఈ ఆదేశాలు జారీచేసింది. గత రెండేళ్లకు సంబంధించి సరాసరిగా ప్రతి యూనిట్‌పై 35 నుంచి 40 పైసల చొప్పున ఇంధన సర్దుబాటు భారం పడనుంది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి న ప్రతిపాదనల్లో ఈఆర్సీ రూ.3038 కోట్ల మేరకు ఆమోదం తెలిపింది.

2008-09 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు రూ.3,141.97 కోట్ల ఎఫ్‌ఎస్‌ఏను ప్రతిపాదించగా ఈఆర్సీ రూ. 1,638.82 కోట్లకు ఆమోదం తెలిపింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు 1,480కోట్లు ప్రతిపాదించగా ఈఆర్సీ మాత్రం రూ.1,400కోట్లకు సర్దుబాటు చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో వ్యవసాయ వినియోగదారులు మినహా మిగతా వినియోగదారులపై సగటున 2008-09 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క యూనిట్‌పై 33.88పైసల చొప్పున, 2009-10 ఆర్థిక సంవత్సరంలో 44.05 పైసల చొప్పున అదనపు భారం పడనుంది. రెండు సంవత్సరాలకు సంబంధించి గృహ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ (ఎఫ్‌ఎస్‌ఏ) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.

గత సెప్టెంబర్‌లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ముఖ్యమంవూతికి నివేదిక అందజేసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల ఇంధన సర్దుబాటు ఛార్జీల మొత్తం దాదాపు రూ.577కోట్లను సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరడ్డి ప్రకటించడంతో మిగతా వినియోగదారులు (నాన్ డొమెస్టిక్) హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసును గత సెప్టెంబర్‌లో హైకోర్టు బెంచ్ విచారించి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు, ప్రభుత్వానికి చురకలు పెట్టింది. దాంతో 2008-09 ఇంధన సర్దుబాటు చార్జీల అమలు అంశం హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటుందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఏను వినియోదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి మనోహరరాజు ‘T’కు వెల్లడించారు.

Take By : T News

Read more...

గెలుపు ఎవరిది? (Who is Win)

ఆజాద్‌తో కిరణ్ సుదీర్ఘ భేటీ
మంత్రుల జాబితాపై చర్చ?
శాఖలపైనా మంతనాలు!

సీఎం మాటను మన్నించిన ఆజాద్?
పునర్వ్యవస్థీకరణకు ఓకే
బొత్సను తప్పించే అవకాశం
ముందే బొత్సతో మాట్లాడిన ఆజాద్
నేనుంటేనే పార్టీకి మంచిది
ఆజాద్ ముందు బొత్స వాదన
సమన్వయ కమిటీలో ఉన్నారుగా..
నచ్చజెప్పిన రాష్ట్ర ఇన్‌చార్జ్
సీఆర్‌తో మొదలైన కిరికిరి

ఆయనపై సీఎం విముఖత?


పూర్తి ప్రక్షాళనతో సొంత టీమ్ కోసం కిరణ్
మార్పులకు బ్రేక్ కోసం బొత్స ఫైట్
హస్తినాపురంలో జోడెద్దుల మంతనాలు

కేబినెట్‌లో మాకూ చోటివ్వండి... సీనియర్ ఎమ్మెల్సీల డిమాండ్
తెరపైకి వచ్చిన తెలంగాణ ఖాళీలు
రెండు డిమాండ్ల వెనుక సీఎం?

Kiran205-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 17 (): విస్తరణ రాజకీయం హస్తినకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఎడతెగని చర్చల్లో మునిగిపోయింది. మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి తనకంటూ ఒక జట్టును కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలి... కొందరు సీనియర్లకు ఉద్వాసన పలికి, కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రాంతాల మధ్య సమతుల్యం సాధించాలి.. ఇది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి యోచన! పార్టీని, ప్రభుత్వాన్ని ఆపత్కాలంలో ఆదుకున్న చిరు బ్యాచ్‌కు తక్షణమే మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి.. ఇతర మంత్రుల శాఖలను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చరాదు.. ఇది పీసీసీ చీఫ్ మనోగతం! ఇద్దరు నేతలూ రెండు వాదాలతో ఢిల్లీలో అడుగుపెట్టడంతో కాంగ్రెస్‌లో సమస్యల కొలిమి మరోసారి రాజుకున్నట్లయింది. దీనికి తోడు ఎమ్మెల్సీగా ఉన్న సీ రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండటంతో మేమే తక్కువా? అంటూ ఎమ్మెల్సీలు సైతం తిరగబడుతుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. పునర్వ్యవస్థీకరణే జరిగితే తెలంగాణ కోటాలో ఏర్పడిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాజాగా మంత్రి పదవుల డిమాండ్‌ను లేవనెత్తడం దీనికి నిదర్శనం.

మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. విమానాక్షిశయం నుంచి నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాను పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నదీ ఆయనకు మరోసారి వివరించారు. ప్రధానంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు శాఖల కేటాయింపుపై వారిరువురూ సుదీర్ఘంగా చ ర్చించారని తెలిసింది. సీఎం తెచ్చిన కొత్త మంత్రుల జా బితా, వారి కేటాయించాలనుకుంటున్న శాఖలపై ఈ చర్చ సాగినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్నందున ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొని, పాలనాపరంగా మరింత దూకుడుగా వ్యవహరించగలిగే కొంతమంది మంత్రులు కావాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. సుమారు గంటన్నరకు పైగా జరిగిన భేటీలో సొంత టీం ఏర్పాటుకు తనకు స్వేచ్ఛనివ్వాలన్న సీఎం విన్నపాన్ని ఆజాద్ అమోదించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో కాలం లేకపోవడంతో పాత టీంను మార్చాలన్న ఆయన ప్రతిపాదనకు ఆజాద్ ఓకే చెప్పినట్లు తెలిసింది. తనకు తలనొప్పిగా మారిన పీసీసీ అధ్యక్షుడు బొత్స, శంకపూరావులను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఎంతో కాలంగా సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఈ దఫా ఫలించేటట్లు కనిపిస్తున్నాయి. పీఆర్‌పీ నుంచి చిరంజీవి ప్రతిపాదిస్తున్న సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాస్‌రావుకు స్థానం కల్పించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సను తప్పించాల్సిందేనని ఆజాద్‌ను కిరణ్ ఒప్పించారని అంటున్నారు. సీఎం ప్రతిపాదనను ముందే గుర్తించిన ఆజాద్.. కిరణ్ తనను కలవడానికి ముందే బొత్సను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. మధ్యాహ్నం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పిస్తున్న అంశాన్ని బొత్సకు తెలియపరిచారని సమాచారం.

అయితే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి తాను మంత్రిగా కొనసాగితేనే ఉపయోగకరమని బొత్స వాదించినట్లు తెలిసింది. అయితే దీనికి ఆజాద్ సుముఖత చూపించలేదని తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ఇప్పటికే తన అధ్యక్షతన సమన్వయ కమిటీ పనిచేస్తున్నదని, దానిలో మీరు కూడా సభ్యులైనందున అక్కడ పార్టీ అభివూపాయాలను సీఎం దృష్టికి తీసుకురావచ్చని ఆజాద్ సూచించారని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో లోపాలను సైతం ఎత్తిచూపొచ్చని, దానికి మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం లేదన్న ధోరణిలో బొత్సను ఆజాద్ ఒప్పించినట్లు సమాచారం. మంత్రి శంకపూరావును కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం రూపొందించిన జాబితాపై అభివూపాయం తెలపడానికి అందుబాటులో ఉండాలని బొత్సను ఆజాద్ కోరినట్లు తెలిసింది. తాను రూపొందించిన జాబితాపై ఆజాద్‌తో ఆమోద ముద్ర వేయించుకున్న కిరణ్.. సోనియాతో బుధవారం భేటీ అయి.. ఆమె అనుమతి తీసుకుని రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.

ఎవరి ప్రయోజనాలు వారివే!
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), కోమటిడ్డి వెంకట్‌డ్డి (నల్గొండ) తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం కేబినెట్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి రెండు ఖాళీలు ఉన్నాయి. వీటిని ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యతను పాటించాలంటే ఈ రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఖాళీలను తాజా విస్తరణలో భర్తీ చేయాలని వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి మంగళవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్సీలు ఉండగా వారిని కాదని పీఆర్పీ ఎమ్మెల్సీ రామచంవూదయ్యకు మంత్రిపదవి ఎలా ఇస్తారని అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే.. ఎమ్మెల్యేలు ఉత్తంకుమార్‌డ్డి, దామోదర్‌డ్డి, గండ్ర వెంకటరమణాడ్డి, మల్లు భట్టి విక్రమార్క్‌లకు దక్కవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రి శంకపూరావును తొలగించాల్సి వస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు మంత్రిపదవి ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీల విషయానికి వస్తే డీ శ్రీనివాస్, పాలడుగు వెంకవూటావు, మహ్మద్ జానీ, రుద్రరాజు పద్మరాజు, ఇంద్రసేన్‌డ్డి, జగదీశ్వర్‌డ్డి, భూపాల్‌డ్డి, భానువూపసాద్ మంత్రిపదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో పాలడుగు, పద్మరాజు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌డ్డి, టీజీ వెంక మల్లు భట్టివిక్షికమార్క ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ ఢిల్లీ వెళ్ళారు.

తెలంగాణ ఉద్యమ వాతావరణం కొంత చల్లబడటంతో పాటు రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, యువతకు అనేక పథకాలు, కార్యక్షికమాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నందున ఇదంతా తన గొప్పతనంగా కిరణ్ చెప్పుకుంటున్నారు. వీటిని చూపి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కిరణ్.. మొత్తంగా ప్రభుత్వంలో తన పట్టుపెంచుకునేందుకు పావులు కదిపారని సమాచారం. తనకు అడ్డంకిగా ఉన్న మంత్రులు బొత్స, శంకపూరావు, డీఎల్ వంటి సీనియర్లను కూడా కేబినెట్ నుంచి తొలగించుకోవాలని కిరణ్ ఆరాట పడుతున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్ ఆలోచనలను ముందే పసిగట్టిన బొత్స తదితరులు కిరణ్‌కు వ్యతిరేకంగా అధిష్ఠానానికి సవివరంగా నివేదికలు పంపినట్లు సమాచారం.

పథకాల్లో డొల్లతనాన్ని వారు ఆ నివేదికలో పొందుపర్చారని తెలిసింది.మంత్రివర్గంలోకి రామచంవూదయ్యను తీసుకోవడంపై సీఎం సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు వంగా గీత, బండారు సత్యానందరావు తదితరులతో భేటీ కావడం పీఆర్పీ వర్గాల్లో కలకలం రేపింది. పీఆర్పీ నేతల్లో చీలికి తెచ్చేందుకు సీఎం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రుల శాఖల మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుండడంతో మంత్రులు ఆర్ వెంకట్‌డ్డి, ఏరాసు ప్రతాప్‌డ్డి, సబితా ఇంద్రాడ్డి, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్ధసారధి, మహిధర్‌డ్డి, రఘువీరాడ్డి, పీ విశ్వరూప్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణాడ్డి పలువురు ఎమ్మెల్సీలు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పులి ఉప ఎన్నిక సందర్భంగా మంత్రిపదవికి రాజీనామా చేసిన వైఎస్ వివేకానందడ్డి కూడా కిరణ్‌ను కలిశారు.

హస్తినకు ఆశావహుల క్యూ
మంత్రి వర్గంలో భారీ మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్న వార్తలతో రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఆశావహులు హస్తినబాట పట్టారు. మంత్రులు ఏరాసు, శైలాజానాథ్, చీఫ్ విప్ కొండ్రు మురళి, డిప్యూటీ స్పీక్ మల్లు, ఎమ్మెల్యేలు గండ్ర, ముత్యండ్డి, మస్తాన్‌వలీ తదితరులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం జరుగుతుందన్న వార్తలతో అసంతృప్తులు రగులుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అందరూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఈ నేపథ్యంలోనే మంత్రులు రాష్ట్ర నేతలను కోరుతున్నారు.

మా సంగతేంటి?
ఎమ్మెల్సీ కోటా నుండి రామచంవూదయ్యకు మంత్రి వర్గంలో స్థానం దాదాపు ఖరారు కావడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అధిష్ఠాన తీరును తప్పుబడుతున్నారు. తాము మంత్రి పదవి అడిగినప్పుడు ఎమ్మెల్సీలకు అవకాశం లేదన్న పార్టీ పెద్దలు ఇప్పుడు ఏ రకంగా రామచంవూదయ్యకు పదవి కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వదలుచుకుంటే పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన తనకివ్వాలని పాలడుగు కోరుతున్నారు. ఇదే విషయంపై ఆజాద్‌తోపాటు పార్టీ కోర్‌కమిటీ సభ్యులనూ ఆయన కలవనున్నారు. ఎమ్మెల్సీలు బాషా, పద్మరాజు, రంగాడ్డి తదితరులు కూడా ఇదే వాదనతో ఢిల్లీ పెద్దలను కలువనున్నారు.

Take By: T News

Read more...

Tuesday, January 17, 2012

గిలానీకి ఊరట



raza_gilani telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema-ప్రజాస్వామ్యానికే పాకిస్థాన్ పార్లమెంట్ ఓటు
-విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధాని.. మూడింట రెండొంతుల మెజారిటీ
-19న సుప్రీంకోర్టుకు హాజరవుతా: గిలానీ ప్రకటన
-రాజీనామా చేయరన్న పీపీపీ నేత
-నష్టనివారణ చర్యల్లో అధికార పక్షం
-కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటన
-‘ధిక్కారం’ కేసులో 19న హాజరవ్వాలని గిలానీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
-ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
-జర్దారీని కలిసిన గిలానీ
-స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్


మెమోగేట్ కుంభకోణం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సైన్యం ఓవైపు.. అవినీతి కేసులను తిరిగి తెరిచే విషయమై నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు మరోవైపు.. ప్రజలను గాలికొదిలేసి, నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్న ప్రతిపక్షాలు ఇంకోవైపు.. ముప్పేట దాడిలా చుట్టుముట్టిన సమస్యలతో, నిత్యం మనుగడ ప్రశ్నార్థకమైన పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య అనుకూల తీర్మానాన్ని పార్లమెంట్ దిగువ సభ సోమవారం రాత్రి మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించింది. దీంతో యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వానికి ఊరట లభించింది. వారం రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు సుప్రీంకోర్టు గిలానీకి కోర్టు ధిక్కార నోటీసు జారీచేయడంతో ఆయన ఇక పదవి నుంచి దిగిపోవడం ఖాయమనిపించింది. కానీ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం ఆయనలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇవాళ చాలా మంచి రోజని అభివర్ణించారు. పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాస్వామ్యమే అన్నింటికన్నా గొప్పదని అన్నారు. సర్వాధికారాలు గల పార్లమెంట్‌కే అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. మిలిటరీ, న్యాయవ్యవస్థలతో తమకు విభేదాలున్నా ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కూడా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతానని, కోర్టు ధిక్కారం కేసులో బేషరతు క్షమాపణ చెబుతానని అన్నారు.


supreme-court_PK telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇస్లామాబాద్, జనవరి 16:రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోపాటు మరో ఎనిమిది వేల మందిపై అవినీతి ఆరోపణల కేసులను తిరిగి తెరవాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదో ఈ నెల 19వ తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణను జస్టిస్8 నజీర్ ఉల్ ముల్క్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. తమ ఆదేశాలను పాటించాలంటూ సుప్రీంకోర్టు గిలానీకి పలుమార్లు గుర్తుచేసినా ఆయన కావాలనే పెడచెవిన పెట్టారని, అందువల్ల తనపై కోర్టు ధిక్కార విచారణను ఎందుకు చేపట్టకూడదో ఆయన చెప్పాలని పేర్కొంది.

ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
అవినీతి కేసులను తిరిగి తెరవాలంటూ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదని అటార్నీ జనరల్(ఏజీ) అన్వర్‌ఉల్‌హక్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనకు చీవాట్లు పెట్టింది. తమ ఆదేశాలకు ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తమకు ఎందుకు తెలియజేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలను దేశ అధ్యక్షుడికి, ప్రధానికి, ఇతర అధికారులకు తెలిపానని, వారి నుంచి తనకు ఎలాంటి స్పందనలూ రాలేదని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలిస్తోందని ఏజీ.. కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముల్క్.. ఏజీపై మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలపటం, వారి స్పందనలను కోర్టుకు చెప్పటం మీ బాధ్యత కాదా?, ఇందులో మీరు కొత్తగా చేస్తున్నదేమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

ఏదేమైనా కేసులను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వ ఆదేశాలు కావాలని తేల్చిచెప్పారు. అనంతరం విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత ఏజీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే ఈ సమయంలో అలాంటిదేమీ చేయొద్దని ధర్మాసనం ఏజీకి సూచించింది. అనంతరం గిలానీకి నోటుసు జారీ చేసింది. ‘కోర్టు ఆదేశాలను గిలానీ అమలుచేయనందునే ఆయనకు ఈ నోటీసు జారీచేశాం’ అని ముల్క్ విలేకర్లకు చెప్పారు. మెమోగేట్ కుంభకోణం విషయమై ఇప్పటికే సైన్యంతో ముఖాముఖి తలపడుతూ అస్థిత్వ ప్రమాదం ఎదుర్కొంటున్న పాక్ సర్కారు పరిస్థితిని సుప్రీంకోర్టు తీర్పు మరింత దిగజార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా పాక్ ప్రధానికి కోర్టు ధిక్కార నోటీసులు రావడం ఇది రెండోసారి. 1997 నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కూడా ఈ తాఖీదులు అందాయి.

జర్దారీతో గిలానీ భేటీ
సుప్రీంకోర్టు నోటీసు, పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో ప్రధాని గిలానీ.. అధ్యక్షుడు జర్దారీ, అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అగ్రనేతలతో సోమవారం భేటీ అయ్యారు. కోర్టు నోటీసు జారీచేసిన కొద్దిసేపటికే ఆయన జర్దారీని కలిశారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనతో చర్చించారు. అనంతరం పీపీపీ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జర్దారీ కూడా హాజరయ్యారు. కోర్టు నోటీసుపైన, సాయంత్రం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పైన ఈ భేటీలో చర్చించారు. సైన్యంతో జగడం, కోర్టు నోటీసుల వల్ల రాజకీయంగా వాటిల్లే నష్టాన్ని నివారించేందుకు గిలానీ చేత రాజీనామా చేయించాలని పీపీపీ అగ్రనేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.

రాజీనామా చేస్తానన్న గిలానీ!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని గిలానీ అన్నట్లు వార్తలొచ్చాయి. తన రాజీనామా ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను సుస్థిర పరుస్తుందంటే పదని నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు ఆర్మీ న్యూస్8 చానెల్ తెలిపింది. గిలానీ దిగిపోతే కొత్త ప్రధానిగా పీపీపీ నేత ఖమర్ జమాన్ ఖైరా, ఆధ్యాత్మిక వ్యవహారాల మంత్రి ఖుర్షీద్‌షా, కీలక భాగస్వామ్య పక్షం(పీఎంఎల్-క్యూ) నేత పర్వేజ్‌ఇలాహీల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఈ మీడియో పేర్కొంది. కానీ ఆ వార్తలను అవామీ నేషనల్ పార్టీ చీఫ్ ఖండించారు.

ప్రధానితోపాటు కోర్టుకు వెళ్లనున్న పీపీపీ నేతలు
పీపీపీ నేతలు, భాగస్వామ్యపక్షాల నాయకులు ఈ నెల 19న ప్రధాని గిలానీతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి మౌలాబుక్స్ చందోలియా తెలిపారు. గిలానీ ప్రభుత్వం తన పూర్తికాలం అధికారంలో ఉంటుందని చెప్పారు. తమపై జరుగుతున్న ఈ కుట్రలల్నీ భగ్నమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కోర్టు నోటీసును స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్
ప్రధాని గిలానీకి సుప్రీంకోర్టు నోటీసు జారీచేయటాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. యావద్దేశం కూడా న్యాయస్థానం ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. ‘సామాన్యుల సాధకబాధకాలను తీర్చాల్సిన పాలకులు నేరస్తులను కాపాడేందుకు కృషిచేస్తున్నారు. ఈ మేరకు న్యాయవ్యవస్థను కూడా భష్ఠుపట్టించాలని చూస్తున్నారు. జర్దారీని రక్షించేందుకు వారు ఎంత మంది న్యాయవాదులను, న్యాయమూర్తులను మోహరించినా ప్రజలంతా దేశ అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకంతో ఉన్నారు’ అని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.

సమాచారం ఇచ్చేందుకు బ్లాక్‌బెర్రీ నో
మెమోగేట్ కుంభకోణానికి సంబంధించి పాక్-అమెరికా వ్యాపారి ఇజాజ్, అమెరికాలో అప్పటి పాకిస్తాన్ రాయబారి హుస్సేన్ హక్కానీలు తమ నెట్‌వర్క్ ద్వారా ఇచ్చిపుచ్చుకున్న సమాచారాన్ని వెల్లడించేందుకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్(రిమ్) నిరాకరించింది. వినియోగదారుల అనుమతి లేకుండా ఈ వివరాలను తాము బయటపెట్టలేమని తేల్చిచెప్పింది. ఈ కేసును విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్‌కు ఈ విషయాన్ని ఏజీ తెలిపారు. హక్కానీ ఉపయోగించిన రెండు బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు అమెరికాలోని అతని కార్యాలయంలోగానీ నివాసంలోగానీ దొరకలేదని కూడా చెప్పారు.

ఏమిటీ మెమోగేట్?
ఒసామా బిన్ లాడెన్ హతమైన అనంతరం పాక్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం కుట్ర పన్నుతోందని అధ్యక్షుడు జర్దారీ భయపడ్డారు. ఈ కుట్రను నిలువరించేందుకు అమెరికా సాయం కోరారు. ఈ మేరకు సంతకంలేని ఓ మెమో పంపారు. జర్దారీ తరఫున హక్కానీ రాసిన ఆ లేఖను ఆయన ఆదేశాల మేరకే తాను అమెరికాకు అందజేశానని పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్‌ఇజాజ్ బహిరంగంగా చెప్పారు. ఇది వివాదాస్పదమవడంతో హక్కానీ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

‘మెమో’ దర్యాప్తునకు ఇజాజ్ డుమ్మా
మెమోగేట్ కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఇజాజ్ ఈ కేసుపై సోమవారం జరిగిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తునకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిషన్ ముందుకు భద్రతా కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ నెల 25వ తేదీ దాక తనకు గడువు ఇవ్వాలని కోరారు. కమిషన్ మూడోసారి సోమవారం భేటీ అయిన కొద్దిసేపటికే ఇజాజ్ తరఫు న్యాయవాది అక్రమ్‌షేఖ్ ఈ విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. కుంభకోణంలో.. ఇజాజ్, హక్కానీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న సమాచారాలను వెల్లడించేందుకు రిమ్ నిరాకరించిన నేపథ్యంలో ఇజాజ్ గైర్హాజరీ ప్రధాన్యం సంతరించుకుంది.

ఇజాజ్, హక్కానీ, పాషాలకు సమన్లు
జ్యుడీషియల్ కమిటీ దర్యాప్తునకు గైర్హాజరైన ఇజాజ్‌కు పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 26న జ్యుడీషియల్ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. మీరు కూడా 23వ తేదీన హాజరై వాంగ్మూలాలు ఇవ్వాలని హక్కానీ, ఐఎస్8ఐ చీఫ్ అహ్మద్‌షుజాపాషాలకు కూడా పార్లమెంటరీ కమిటీ సమన్లు ఇచ్చింది.

‘ముషారఫ్ తల’కు నూటొక్క మిలియన్లు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌ను హతమార్చిన వారికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని బలోచిస్తాన్ జాతీయ నేత అక్బర్‌బుగ్తి మనవడు షాజైన్‌బుగ్తి ప్రకటించారు. నగదు బహుమతితోపాటు వంద మిలియన్ల విలువైన బంగ్లాను కూడా ఇస్తామని విలేకర్లకు ఆదివారం చెప్పారు. 2006లో ముషారఫ్ ఆదేశాలతో బలోచిస్తాన్‌లోని కుహ్లు జిల్లాలో జరిగిన మిలిటరీ ఆపరేషన్‌లో అక్బర్‌బుగ్తి మృతిచెందారు?

ఏ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదు
-‘ఎన్నార్వో’ తప్పు చేసింది ఎవరు: గిలానీ

ఇస్లామాబాద్, జనవరి 16: పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రధాని గిలానీ మాట్లాడుతూ సైన్యంగానీ న్యాయస్థానాలుగానీ వ్యవస్థను గాడితప్పించేలా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మెమోగేట్ కుంభకోణం, అవినీతి కేసుల విషయంలో సైన్యం, సుప్రీంకోర్టు ప్రభుత్వంతో వ్యవహరించిన తీరును గిలానీ ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కోర్టులపై మాకు పూర్తివిశ్వాసం ఉంది. అందుకే ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతాను. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై ఓటు విషయంలో మేము ఏ వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోలేదు. జర్దారీకి రాజ్యాంగం రక్షణకవచంలా ఉంది. సర్కారును నిందించేవారు.. అవినీతి కేసుల నుంచి నిందితులను కాపాడేలా జాతీయ సయోధ్య ఉత్తర్వులు (ఎన్‌ఆర్‌ఓ) రూపొందించినవారిపై ఎలాంటి చర్యలూ కోరకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని గిలానీ.. ముషారఫ్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఎన్‌ఆర్‌ఓను ఎవరు తెచ్చారు. ఆ తప్పు మేం చేయలేదు. ఆ పొరపాటు చేసినవారు ఇప్పుడు దేశం బయటున్నారు. మళ్లీ ఇప్పుడు దేశంలోకి రావాలనుకుంటున్నారు’’ అని పాక్‌లోకి మళ్లీ రావాలనుకుంటున్న ముషారఫ్ ప్రయత్నాలను గిలానీ ఎండగట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని ప్రపంచానికి చాటేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.

Take By: T News

Read more...

తెలంగాణ కాంగ్రెస్ పెద్దల దొంగాట



CMpostlist telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema -నాలుకలు మడతేస్తున్న నేతలు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు

ఈ నేతలకు రెండు నాల్కలే కాదు.. రెండు ముఖాలు కూడా! తెలంగాణ ఉద్యమం విషయంలో నాల్కలు మడతేయడమే కాదు.. ముఖాలూ మార్చేయగల నైపుణ్యం వీరి సొంతం! ఒక నాలుక తెలంగాణ ఉద్యమం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది! మరో నాలిక పార్టీ అధిష్ఠానం వద్ద వక్రభాష్యాలు చెబుతుంది! ఒక ముఖం ఉద్యమ శ్రేణుల ఎదుట వీర గంభీరంగా కనిపిస్తుంది.. మరొకటి నాలుగు గోడల మధ్య.. పార్టీ పెద్దల ముందు ముడుచుకుని కూర్చొంటుంది! అధికారం వీరి పరమావధి! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇందుకు వారధి! పదవులు ఓ లెక్క కాదంటారు.. కానీ వారి లెక్కలన్నీ పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి! సచివాలయం దరిదాపులకు వెళ్లేది లేదని భీకర వచనాలు చెబుతారు.. కానీ.. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని సీఎం మెప్పు పొందేలా సంతకాలు బరికేస్తారు! ఉద్యమంలో దూకుతామంటారు.. ఇచ్చేది.. తెచ్చేదీ తమ పార్టీయేనంటారు.

నిర్ణయాత్మక దశలో మాత్రం పత్తా లేకుండాపోతారు! ఉద్యమ శ్రేణులు సెగ పెట్టినా తట్టుకుంటారు.. కానీ.. అధిష్ఠానానికి ఆ సెగ తీవ్రతను చెప్పడానికి ఇష్టపడరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలని ఒకసారి, అమ్మకు ఒంట్లో బాలేదని ఒకసారి, పండుగలు పబ్బాలని మరోసారి, ఆజాద్ చర్చిస్తున్నారని ఇంకోసారి, ఇదిగో కోర్ కమిటీ సమావేశం అదిగో సీడబ్ల్యూసీ భేటీ.. అంటూ ఎప్పటికప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల బూచిని ముందుకు తెస్తూ అధిష్ఠానం దోబూచులాడుతుంటే.. నిలువరించే సత్తా లేక.. అధిష్ఠానా నికే జీ హుజూర్..
అంటూ సాష్ఠాంగపడిపోయిన నేతలు! ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ వాళ్లను మోసం చేయడం.. తెలంగాణ ప్రాంత నేతలుగా తమకు తెలిసినంత మరెవరికీ తెలియదని ఢంకా బజాయించి మరీ చెప్పగలిగే నేతాక్షిగేసరులు! వీరిలో కొందరిది మరీ అత్యాశ! ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే వీరి కన్ను! సీఎం కుర్చీ అప్పగిస్తే ఉద్యమం అణచివేతలో తడాఖా చూపిస్తామని అధిష్ఠానం వద్ద తొడలు కొడతారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ను మార్చేస్తారన్న ఊహాగానాలతో.. ఉద్యమం ముసుగులో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుని.. కలలు కంటున్నారు! పదేళ్లుగా ఈ నేతల తీరిదే. ప్రత్యేకించి గత రెండేళ్లుగా మహోధృతంగా సాగుతున్న మలి విడత తెలంగాణ పోరాటంలో వీరిది ప్రతినాయక పాత్రే! ఇదీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకుల ద్రోహ చరిత్ర! అనేకానేక మంది నేతలు.. ఎన్నదగినవారు కొందరు! జానాడ్డి, జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, జే గీతాడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య! వీరు మచ్చుకే! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ రాజకీయ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన పెద్దలు! సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కయి.. ఉద్యమాన్ని నాశనం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్న ద్రోహచింతన గల నేతలు! ఉద్యమం గుండెలపై తన్ని.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న టీ కాంగ్రెస్8 నేతలు ఎందరో! ఇది సకల తెలంగాణం చేస్తున్న విమర్శ!

ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్8 అధిష్ఠాన పెద్దలు. ఎన్నికలయిపోయి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడ్డాయి. ఆ తర్వాత సోనియాకు ఆరోగ్యం బాగోలేదు.. ఆమె విదేశాల నుంచి వచ్చాక నిర్ణయం అన్నారు. ఆమె తిరిగి వచ్చేశారు. దీపావళి, బక్రీద్ పండుగల సాకు చెప్పారు. ఆ తర్వాత ఆ మాట ఎవరన్నారని ప్రశ్నించారు. ఆజాద్ మాట్లాడుతున్నారని మరోసారి చెప్పారు. అజాద్ మాట్లాడేశారు. నివేదికలు ఇచ్చేశారు. జాతీయ స్థాయి నేతల అభివూపాయాలన్నారు. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. కోర్‌కమిటీ భేటీలన్నారు. మినీ కోర్‌కమిటీ అని చెప్పారు. ఇదుగో సీడబ్ల్యూసీ అన్నారు. తెలంగాణ అంశం గుండ్రంగా ఉంటుందని నిరూపించాలని భావించినట్లున్నారు.. ఇప్పుడు మళ్లీ మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలను బూచిగా చూపిస్తున్నారు! ఈ మాటల మాయాజాలం సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగింది.

పల్లెలు పట్టాలపైకెక్కి ఢిల్లీకి ఉద్యమ తీవ్రతను కూతవేసి చాటాయి. వంటావార్పుతో పొయ్యిల మంటతో జనం సెగ తగిలించారు. అన్నింటికీ మించి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష బలాన్ని చాటిచెప్పారు. రోజువారీ ఆందోళనలు, నిరసనలు సరేసరి! ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బలమైన విమర్శలు వస్తున్నాయి.

CMpostlist_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్)ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా, 4కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకులు.. ఆ పని చేయకపోగా.. ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డారని ప్రత్యేకవాదులు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని నేతలు ఆచరణలో రుజువు చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. కేసీఆర్ దీక్షనేపథ్యంలో డిసెం బర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన, దానిని సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం,జేఏసీ ఆవిర్భావం, ఉద్యమాలు, ఆయా సమయాల్లో జరిగినపరిణామాల్లో టీ కాంగ్రెస్8 నేతల తీరుతెన్నులు వారిని ద్రోహులుగా నిలబెడుతున్నాయని విమర్శలు వెల్లు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది మేమే అంటూ నినదించిన టీ కాంగ్రెస్8 నేతలు.. నేడు తెలంగాణవాదంపై మౌనం వహిస్తూ.. ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైగా ‘‘ఉన్నత పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి. తెలంగాణవూపజలను మేమే పకడ్బందీగా భ్రమల్లో పెడుతాం. ఆ కళ మాకే తెలుసు. 4దశాబ్దాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాం. మా ప్రాంత ప్రజలను ఎలా మోసం చేయాలో మాకే ఎక్కువ తెలుసు’’ అంటూ అధిష్ఠానం వద్ద మహజరులు సమర్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ అంటూ మాట్లాడిన జానాడ్డి లాంటి సీనియర్‌లు నేడు ప్రేక్షకపాత్ర వహించడమే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కుర్చీ నుంచి కిరణ్‌కుమార్‌డ్డిని అధిష్ఠానం తప్పిస్తుందన్న అంచనాలో కొందరు టీ కాంగ్రెస్8 నేతలున్నారు.ఉద్యమం పేరుతో ఈ నేతలు సీఎం కుర్చీపై కన్నేసినట్లు తెలుస్తోంది.

సమైక్యరాష్ట్రానికి తమను సీఎంగా చేస్తే తెలంగాణవాదాన్ని ఎదుర్కొంటామని అధిష్ఠానం వద్ద నమ్మబలుకుతున్న వారిలో జానాతో పాటు జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, గీతాడ్డి, రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నట్లు వినిపిస్తోంది. దీనికోసం హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. సీఎం కుర్చీ కోసం తెలంగాణ కోటాలో కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. కిరణ్‌ను మార్చాల్సివస్తే ఈసారి తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చినప్పుడు టీ మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతోనే సరిపెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. తెలంగాణలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి 42 రోజుల పాటు సకలజనుల సమ్మెకు దిగడం, తెలంగాణ కోసం త్యాగాలు చేయడం, అడ్వాన్స్‌లు తప్ప ఇప్పటి వరకు వారి జీతాలపై నిర్ణయం జరగకపోవడం, విద్యార్థులు చదువులు కోల్పోవడం, రవాణా వ్యవస్థ స్తంభించి పోయి తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే టీ మంత్రులు మాత్రం దర్జాగా హోదాలు, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తూ గడిపారే తప్ప, తెలంగాణ కోసం ఉద్యమకారులతో కలిసిరాలేదనివారు విమర్శిస్తున్నారు.

సచివాలయ నాటకం..
మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేదనే కానీ.. మేం అసలు సచివాలయానికి వెళ్లడం లేదని గప్పాలు కొట్టిన మంత్రుల నాటకం సీఎం వ్యాఖ్యలతోనే బయటపడింది. సచివాలయానికి వెళ్లని మంత్రులు.. ఫైళ్లను ఇంటికి తెప్పించుకుని చకచకా సంతకాలు లాగించేశారు. మంత్రులు సచివాలయానికి రాని కాలంలోనే ఎక్కువ ఫైళ్ళు పరిష్కారమయ్యాయని అప్పట్లో సీఎం చెప్పడం తెలంగాణపై టీ మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో చాటిచెప్పింది. ‘‘పదవులు, హోదాలు పోతే ఎవరూ పట్టించుకోరు. తొందరపడి రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ ఉండదు. తెలంగాణపై పోరాడుతున్నట్లు నటిస్తూనే మీ పనులు మీరు చూసుకోండి’’ అంటూ టీ మంత్రుల జోరుకు సీఎం బ్రేకు వేశారన్న ప్రచారం ఉంది. దీంతో బుగ్గకారు, హోదా, పీఎస్8, పీఎలు పోతారని, సర్కార్ పరంగా లభిస్తున్న సౌకర్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుందని భావించే టీ అమాత్యులు తెలంగాణవాదాన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం
టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం పని చేసిందని విమర్శలున్నాయి. ‘‘నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పనులు కేటాయిస్తాను. పదవుల్లో ఉండి హాయిగా పనులు చేసుకోండి. భవిష్యత్తులో మీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా’’ అనే రీతిలో సీఎం వారికి భరోసా కల్పించడమే కాకుండా ప్రలోభాలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. టీ కాంగ్రెస్ ఎంపీలది మరో కథ. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ కేకే నేతృత్వంలో టీ కాంగ్రెస్8 ఎంపీలు దీక్షలు చేపట్టారు. రాజీనామా చేశామంటూ పార్లమెంట్ సమావేశాలకు మొదట్లో దూరం పాటించినా, తరువాత సమావేశాలకు హాజరై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు పట్టి కొంత హంగామా చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులతో పోల్చితే.. వారు అధిష్ఠానంతో కొంత ఘర్షణవైఖరిని, పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ.. చివరాఖరుకు వారూ మెత్తబడ్డారు.

నిరసన సెగలతో స్వరం పెంచిన నేతలు
తెలంగాణవాదం రోజురోజుకూ బలపడుతూ రాజకీయ నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలుస్వరాన్ని పెంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శవాల వద్దకు వెళ్ళి తెలంగాణ తెచ్చే వరకు తాము వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల నుంచి నిరసనలు పెరగడంతో తప్పనిసరై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాలని, తెలంగాణ సాధన కోసం కలిసి ఉద్యమించాలని టీ కాంగ్రెస్8 ప్రజావూపతినిధులు, మంత్రులు నిర్ణయించుకున్నారు. టీ కాంగ్రెస్8 స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలానికే దాని పస తేలిపోయింది. కమిటీ చైర్మనే దాని నిర్ణయాలను పాటించని దుస్థితి. ఎట్టకేలకు రాజీనామాలు చేసినా.. పై నాయకత్వం చక్రం తిప్పడంతో రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయన్న వాదన ఉంది. టీడీపీ టీ ఫోరం, టీఆర్‌ఎస్8, సీపీఐ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్8కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండ్‌తో రెండవ సారి రాజీనామా చేశారు. వీరితో పాటు రాజీనామాలు చేయడానికి టీ కాంగ్రెస్8మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ససేమిరాఅన్నారు.

మరో వైపు నాగం జనార్దన్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, టీ రాజయ్య తదితరులు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. వారి తరహాలోనే మిగతా టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాల కోసం పట్టుబడితే తప్పకుండా ఆమోదం పొందడమో లేక కేంద్రం దిగిరావడమో జరిగేది. కానీ తెలంగాణ జన ఆకాంక్షలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, సీమాంధ్ర పాలకుల ప్రలోభాలకు లొంగి, తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని నాయకులపై ఉద్యమ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఉద్యమాన్ని బలహీనపర్చే కుట్ర!
పదవులు, హోదాలు, పనులు, పైరవీల కోసం టీ కాంగ్రెస్8 నేతల మధ్య నెలకొంటున్న అంతర్గత కుమ్మలాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలహీనం చేయడానికి దోహదపడుతున్నాయనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్8 నేతల అనైక్యతను ఆసరా చేసుకుని కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా తన ఆట కొనసాగిస్తున్నారంటున్నారు. సెలక్షన్ కమిటీ హస్తినలో ఉందని నమ్మబలికిస్తూ గులాం నబీ ఆజాద్, సోనియాల వద్ద మార్కులు కొట్టేసేలా సీఎం తన స్కోరును పెంచుకుంటున్నారని అంటున్నారు. బలహీనమైన బౌలింగ్‌గా ఉన్న తెలంగాణ అగ్రనేతల కుమ్మలాటలతో, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో క్రికెటర్‌గా సీఎం దీటైన షాట్లతో అధిష్ఠానం వద్ద, రాష్ట్రంలో తన స్కోరు మరింత పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం కేంద్రం తరఫున ప్రకటించారు. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో... సీమాంధ్ర కాంగ్రెస్8 నేతలు మిగతా పార్టీల నేతలను ఉసిగొల్పి పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా వచ్చే తెలంగాణను అడ్డుకున్నారు. తదనంతరం తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. తెలంగాణ కోరుతూ ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థులు సైతం తెలంగాణ కోసం కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కొక్కరుగా 700 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కానీ.. టీ కాంగ్రెస్8 నేతల ద్రోహచింతనలో ఏమాత్రం మార్పు రాలేదని ఉద్యమకారులు వాపోతున్నారు.

Take By : T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP