Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, January 14, 2012

నందమూరి ఫ్యామిలీ డ్రామా.. అదుర్స్!

- చంద్రబాబు చక్కర్.. నందమూరి ఫ్యామిలీ డ్రామా
- నట, రాజకీయ వారసత్వంపై రచ్చకెక్కుతున్న ఆధిపత్య పోరు

- ఓవైపు ‘అధినాయకుడు’ మరోవైపు ‘నందీశ్వరుడు’
- ఒంటరవుతున్న జూనియర్
- పేరు మార్చుకున్న తారకరత్న
- ఇకపై ఇండవూస్టీలో మరో ఎన్టీఆర్
- బాబుకు దూరమైన జూనియర్
- స్టూడియోఎన్ నుంచి లోకేష్ ఔట్!
- బాలకృష్ణ మద్దతూ బాబుకే
- చక్రం తిప్పుతున్న చంద్రబాబు?


నందమూరి-నారా కంబైన్స్
సమర్పించు..! ప్రముఖ రాజకీయ చాణక్యుడి మార్గ‘దర్శకత్వం’లో! సినిమాలో రాజకీయం..
రాజకీయంలో సినిమా కలగలిసిన సరికొత్త స్క్రీన్‌ప్లే!
రాజకీయ, నట వారసుపూవరు? ఇదీ స్టోరీ లైన్! సినిమా పేరు
‘ఆధిపత్య పోరు’! నటీనటులు పాతవారే. కాకపోతే కొత్త పాత్రల్లో! మొన్నటిదాకా అక్కరకొచ్చిన పాత్ర.. ఇప్పుడు భారంగా తయారైంది! ఆ క్యారెక్టర్ పక్కకు పోయి.. అదే పేరుతో మరో క్యారెక్టర్ ముందుకు వచ్చింది. మరికొన్ని క్యారెక్టర్ల తీరూ మారిపోయింది. కొంతకాలంగా షూటింగ్ జోరుగా
సాగుతోంది! ప్రస్తుతం క్లయిమాక్స్ పనులు పూర్తి చేసుకుంటూ.. వీలైనంత త్వరలో
రచ్చకెక్కనుంది.

babu2012-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతలవని తలంపుగా బాలకృష్ణ పర్యటనలకు వెళ్లి తొడలు కొట్టడంలోని ఆంతర్యమేంటి? తారక రత్న తన పేరును ఎన్టీఆర్ అని మార్చుకోవడం వెనుక కిటుకేంటి? తన మామ చానల్‌లో ఆధిపత్యం వహిస్తున్న నారా లోకేష్‌ను జూనియర్ ఎన్టీఆర్ తప్పించడం వెనుక మతలబులేంటి? మొన్నటి ఎన్నికల ముందు అక్కున చేర్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి వంశం దూరంగా ఉంచడంలో రాజకీయం ఏమిటి? కొత్త రాజకీయ చిత్రంలో నారా చంద్రబాబు పాత్రేంటి? ‘అధినాయకుడు’, ‘నందీశ్వరుడు’తో చంద్రబాబు ఆడిస్తున్న చదరంగంలో జూనియర్ ‘దమ్ము’ నిరూపించుకుంటాడా? అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆధిపత్య పోరు’!

(-హైదరాబాద్) మొన్నటిదాకా తమదంతా ఒకే కుటుంబం అని చెప్పుకున్న నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు విభేదాలు బట్టబయలవుతున్నాయి. చాలా కాలందూరం పెట్టి.. మళ్లీ దగ్గరకు తీసుకున్న హరికృష్ణ రెండో భార్య తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ దూరం పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే నట సమ్రాట్ నందమూరి తారక రామారావుకు నట వారసుడిని తానేనని రుజువు చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.

బాలకృష్ణ తర్వాత సినిమా రంగంలో మూడోతరం ఎవరూ క్లిక్ కాకపోవడం కూడా జూనియర్‌కు కలిసొచ్చింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సలహా మేరకు రాజకీయ బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. తన పదునైన ఉపన్యాసాలతో భారీగానే జనం దృష్టిని ఆకర్షించాడు. దీంతో చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టగల చరిష్మా ఉన్నవాడిగా జూనియర్ నిలుస్తాడన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇదే అంశం నందమూరి వంశంలో ఇతర యువతారలకు గిట్టడం లేదని తెలుస్తోంది. ఫలితంగానే జూనియర్‌ను పక్కనపె తతంగం నడుస్తోందని సినీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి!

కలిసొచ్చిన తాత పోలికలు
జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంతో బాలనటుడిగా రంగవూపవేశం చేశారు. అచ్చుగుద్దినట్లు తాత పోలికలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకొని ప్రేక్షకులు ఆదరించారు. సినిమా సినిమాకీ ఎదుగుతూ, అతి తక్కువ కాలంలోనే సినీ పరిక్షిశమలో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. నందమూరి అభిమానులు చేత యంగ్‌టైగర్‌గా పిలుపించుకుంటూ తిరుగులేని హీరోగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే మొదట్లో జూనియర్‌ను నందమూరి కుటుంబం పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. కానీ.. హీరోగా మంచి గుర్తింపు రావడంతో అనివార్యంగా అతడిని కుటుంబంలో కలుపుకోవాల్సి వచ్చిందని పరిశీలకులు చెబుతుంటారు.

తర్వాతి కాలంలో జూనియర్.. నందమూరి కుటుంబంలో ప్రముఖ స్థానాన్నే పొందాడు. ఇదంతా ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కృషిగానే పేర్కొంటుంటారు. ఏడాది పాటు శ్రమించిన చంద్రబాబు.. జూనియర్‌ను నందమూరి ఫ్యామిలీలో ఒకడిని చేయగలిగారని అంటారు. ఇందులో ఆయన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నవాదన లేకపోలేదు. దానిని నిరూపించే ఘటనలు అనంతరకాలంలో జరిగాయి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి కుటుంబంతో సంబంధాలు సరిగ్గా లేవు. హరికృష్ణ మొదటి భార్య తనయుడు కళ్యాణ్‌రామ్‌తో జూనియర్‌కు సత్సంబంధాలు లేవని చెబుతుంటారు. కుటుంబాల మధ్య రాకపోకలు కూడా వుండేవి కావు. జూనియర్‌కు, బాలకృష్ణకు మధ్య కూడా అంత బలమైన సాన్నిహిత్యం ఉన్నట్లు దాఖలాలు లేవు. బాలకృష్ణ కూతురికి, చంద్రబాబు కొడుకుకి నిశ్చితార్థం జరిగిన రోజు మధ్యలోనే జూనియర్ బయటికి వచ్చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలకు దారి తీసింది.

ఇటువంటి పరిస్థితుల్లో 2009 ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటే ప్రయోజనం ఉంటుందని భావించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేకసార్లు మాట్లాడటం ద్వారా అందర్నీ ఒక్క దగ్గరకు చేర్చారు. ఇక తాత స్థాపించిన టీడీపీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కార్యక్షికమాల్లో పాల్గొని మామయ్య చంద్రబాబు నాయుడు మెప్పు కూడా పొందాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయించడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. మొత్తంగా జూనియర్ కూడా నందమూరి ఫ్యామిలీలో ఇమిడిపోయారని ఆయన అభిమానులూ, టీడీపీ శ్రేణులూ సంతోషించాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తమలో ఒకడిగా ఆత్మీయంగా మెలిగిన జూనియర్‌ను ఇప్పుడు మెల్లమెల్లగా అటు సినీ రంగంలో ఒంటరిని చేసేందుకు, భవిష్యత్ రాజకీయ చిత్రం నుంచి తొలగించేందుకు పావులు కదులుతున్నాయని తెలుస్తోంది.

‘కథ’ మొదలైంది ఎక్కడంటే...
ఇది దాదాపు ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటన! కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో తనకు అవమానం జరిగిందని ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అలిగిన సందర్భంలో ఈ ఆధిపత్య పోరుకు బీజం పడిందని చెబుతారు. తండ్రికి జరిగిన అవమానంపై ఆగ్రహించిన జూనియర్.. ఆ రోజు నుంచే ఇకపై టీడీపీతో కానీ, చంద్రబాబుతో కానీ సంబంధాలు కొనసాగించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో సింగపూర్‌లో ఉన్న చంద్రబాబు.. అక్కడి నుంచే జూనియర్‌కు ఫోన్ చేసి.. బుజ్జగించేందుకు ప్రయత్నించారని, కానీ.. చంద్రబాబు ఫోన్‌ను జూనియర్ ఆన్సర్ చేయలేదని వార్తలొచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అంతరం పెరిగిందని చెబుతున్నారు.

బాలకృష్ణ సైతం ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మారారని సమాచారం. రామారావు పేరు పెట్టుకుని సినిమాల్లోకి జూనియర్ రావడం, ఎదగడం జీర్ణించుకోలేకపోయిన నందమూరి కుటుంబీకులు.. జూనియర్‌కు పోటీగా హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కల్యాణ్‌రామ్‌ను, ఎన్టీఆర్ మరో తనయుడు మోహనకృష్ణ తనయుడు తారకరత్నను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కళ్యాణ్‌రామ్ సొంతంగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అంటూ తాత పేరు మీద సొంతంగా బేనర్‌ను స్థాపించాడు. నిజానికి అప్పటికి అంత అవసరం లేకపోయినా.. ఏనాటికైనా జూనియర్ ఎన్టీఆర్.. తాత పేరుతో బేనర్ స్థాపించి.. ఆ క్రెడిట్ కూడా కొట్టేస్తాడేమోనన్న అనుమానంతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో బేనర్ స్థాపించాడన్న వాదన ఉంది.

ఇక తారకరత్న విషయానికొస్తే అతనితో ఒకే రోజు 9 చిత్రాలు ఓపెనింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేయించాలని చూశారు. అయితే అందులో ఒకటి రెండు మినహా మిగతా చిత్రాలన్నీ అటకెక్కాయి. ఆ తర్వాత తారకరత్న పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. ఈ మధ్య పూర్తిగా దృష్టి కేంద్రీకరించి.. నందీశ్వరుడు పేరుతో సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇకపై తన పేరు నందమూరి తారక రామారావుగా మార్చుకుంటున్నట్లు తారకరత్న ప్రకటించడం ఈ కుటుంబంలో రోజు రోజుకు రగులుతున్న చిచ్చుకు, ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. తారకరత్న పేరు మార్పిడి విషయంలో నందమూరి కుటుంబ సభ్యుల ప్రోద్బలం కూడా ఉందని సమాచారం.

బాలకృష్ణ తర్వాత నందమూరి వంశంలో తదుపరి స్థానం జూనియర్ ఎన్టీఆర్‌దేని అందరూ అంటుండటం కూడా నందమూరి కుటుంబీకులు తారకరత్న పేరు మార్పుపై ప్రభావం చూపిందని పరిశీలకులు అంటున్నారు. అటు బాలకృష్ణ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని చేసిన ప్రకటన కూడా ఈ ఆధిపత్య పోరులో భాగమేనని తెలుస్తోంది. రాజకీయవారసుడు కూడా జూనియరేనన్న ముద్ర పడిపోక ముందే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బాలకృష్ణ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

డైలమాలో ఎన్టీఆర్ కెరీర్
నందమూరి కుటుంబం నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భవిష్యత్‌లో జూనియర్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే గత దసరాకు బాలకృష్ణ శ్రీరామరాజ్యం విడుదలకు సిద్ధమవుతుండగా జూనియర్ ఆ సినిమాకు పోటీగా తన ‘ఊసర విడుదల చేయాలని నిర్ణయించుకోవడంతో శ్రీరామరాజ్యం నవంబరులో విడుదలైందని సమాచారం. సినిమా కథ బాగున్నా.. ఊసర చిత్రానికి రామారావు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత లభించడంతో అది యావరేజీ చిత్రంగా నిలిచింది. శ్రీరామరాజ్యం చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణం జూనియర్ అని తెలిసిన నందమూరి అభిమానులు ఈ చిత్రానికి నందమూరి వ్యతిరేక ప్రచారాన్ని చేశారని తెలిసింది. ఇక ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో బాలకృష్ణ నటనకు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ లాంటి వారే ప్రశంసల వర్షం కురిపించినా జూనియర్ నుంచి ఆ చిత్రం గురించి కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం.

పైఎత్తుల్లో జూనియర్
తనను నందమూరి కుటుంబం మళ్లీ వెలి వేస్తోందని గమనించిన జూనియర్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తన మామ నార్నే శ్రీనివాసరావుతో కలిసి తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు సమాచారం. ఫలితంగానే స్టూడియో ఎన్ బాధ్యతల నుంచి లోకేష్‌ను తప్పించారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ను తప్పించిన జూనియర్.. స్టూడియోఎన్‌ను తన ఆధీనంలో తీసుకున్నారని చెబుతున్నారు. ఈ పరిణామం చంద్రబాబు, బాలకృష్ణలకు మరింత ఆగ్రహం కల్గించిందని సమాచారం. త్వరలోనే జూనియర్ మరో చానల్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ పరిక్షిశమలో చర్చ జరుగుతోంది. స్టూడియో ఎన్‌లో ఇవాల్టికివాళ చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు పెద్దగా ప్రచారం కూడా ఇవ్వలేదు.

గత కొద్దికాలం నుంచే ఈ చానల్‌లో చంద్రబాబు ప్రచారం తగ్గినట్లు చెబుతున్నారు. అయితే మెలితిప్పిన మీసంతో ‘నందీశ్వరుడు’ అంటూ హంగామా చేసిన మాత్రాన తారకరత్న అలియాస్ కొత్త ఎన్టీఆర్‌కు ఒరిగేదేమీ లేదని, ఎవరు అవునన్నా కాదన్నా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేంత వరకు బాలకృష్ణ తర్వాత మళ్ళీ ఆ చరిష్మా జూనియర్‌కే ఉంటుందని పరిక్షిశమ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తాజా పరిణామాలు నందమూరి కుటుంబంలో ఆధిపత్యపోరు సాగుతున్నదన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదంతా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో జరుగుతున్నదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Take By : T News

Read more...

Sunday, January 1, 2012

Great Cartoon .................................. Just Think










Source: T News

Read more...

గణితంలో చిచ్చర పిడుగు హర్షిత - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 31(): ‘ పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లుగా పిన్న వయస్సులోనే గణిత సూత్రాలను ఔపోసన పట్టిన బేబీ హర్షితాడ్డి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు ను నమోదు చేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెంది న హర్షితాడ్డి(10) ఐదో తరగతి చదువుతూనే ఇంటర్మీడియట్ గణిత సూత్రాలను అలవోకగా చెప్పేస్తోంది.

శనివారం సిద్దిపేటలో ఎస్‌ఎంఎస్ కళాశాలలో ఎర్పాటు చేసిన కార్యక్షికమంలో వంద నిముషాల్లో వంద గణిత సమస్యలను పరిష్కరించి ఔరా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు తెలిపి ఆశ్చర్య పరిచింది.

కార్యక్షికమంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు దక్షిణ భారత సమన్వయ కర్త వెంకటాచారి, డాక్టర్.జి.శ్రీనివాస్, ప్రముఖ గణిత శాస్త్ర నిపుణులు రాజేందర్, కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్యలు పాల్గొన్నారు.

Read more...

సౌర విద్యుదుత్పత్తి షురూ

ధరూర్, డిసెంబర్ 31): మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు దగ్గర ఒక మెగావాట్ సామర్థ్యంతో నిర్మిచిన ఫొటో ఓల్టాయిక్ సోలార్ పవర్ ప్రాజెక్టులో శనివారం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. కార్యక్షికమానికి జెన్‌కో డైరెక్టర్ ఆదిశేషు, ఉన్నతాధికారుల రావాల్సి ఉండడంతో చివరి నిమిషంలో వాయిదా పడటంతో ప్రాజెక్టు ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

అధికారికంగా విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ప్రాజెక్టు యూనిట్ ద్వారా ఉత్పత్తిని ఎనర్జీ మీటర్‌లో పరిశీలించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

Read more...

రాజకీయాల్లో ముస్లింల పాత్ర పెరగాలి

హైదరాబాద్, డిసెంబర్ 31 (): రాజకీయాల్లో ముస్లింల పాత్ర పెరగాలని, తద్వారా మాత్రమే వారికి సరైన న్యాయం జరుగుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అభివూపాయపడ్డారు. రంగనాథమిశ్రా, సచార్ తదితర కమిటీలు ఇచ్చిన సూచనలు అమల్లోకి రాకపోవడంవల్ల ముస్లింలలో పేదరికం పెరుగుతోందని అన్నారు. ఉర్దూ భాష అభివృద్ధి, పరిరక్షణ కోసం ముస్లింలు కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ముస్లింల పేదరికమే ఉర్దూ భాష అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిందని పేర్కొన్నారు.

‘ప్రపంచ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్’లో భాగంగా శనివారం జూబ్లీహాలులో జరిగిన కార్యక్షికమానికి బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీడీపీ హయాంలో 15 జిల్లాల్లో ఉర్దూ రెండవ భాషగా అభివృద్ధి చెందేటట్లు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరల్డ్ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లమా ఇజాజ్ ఫారూఖ్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి చారివూతాత్మక నగరంలో ‘ప్రపంచ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్’ నిర్వహించడం తమకు ఆనందాన్నిచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మాట్లాడుతూ అందరూ ఉర్దూ భాష అభివృద్ధి చెందాలని ఉపన్యాసాలు ఇస్తున్నారని, కానీ అభివృద్ధి మాత్రం జరగడంలేదని వ్యాఖ్యానించారు. సియాసత్ ఎడిటర్ జహీద్ అలీఖాన్ మాట్లాడుతూ పాలకులు ఉర్దూ భాషను అభివృద్ధి చేస్తారని ఎదురుచూడకుండా భాషాభిమానులు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read more...

ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి రెండేళ్లు పెంపు


నిరుద్యోగులకు ప్రభుత్వం
నూతన సంవత్సర కానుక

kiran-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ డిసెంబర్ 31 (): ప్రభుత్వ ఉద్యోగాలకోసం అర్హతా వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయోపరిమితి పెంచాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. నిరుద్యోగులకు ప్రస్తుతం ఉన్న వయస్సు నిబంధనను అన్ని కేటగిరీల వారి రేండేళ్లకు పెంచింది. అయితే నిరుద్యోగులు మాత్రం కనీసం ఐదేళ్ల వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం కేవలం రేండేళ్లకు పరిమితి చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం చాన్నాళ్లుగా నిరుద్యోగుల వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసింది.

Read more...

Wednesday, December 28, 2011

మూడు వేల కొలువులు (apspsc.gov.in )

- 2,805 ఉద్యోగాల భర్తీ
- ఒకేసారి 10 నోటిఫికేషన్‌లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
- అత్యధికంగా 1,716 ఏఈఈ పోస్టులు
- జీవో 420 ప్రకారమే ఉద్యోగాల నియామకాలు
- మెరిట్ లిస్టు ఆధారంగానే భర్తీ

హైదరాబాద్, డిసెంబర్ 27 ():రాష్ట్ర ప్రభుత్వంలోని 10 శాఖలకు చెందిన 2,805 పోస్టుల భర్తీకి ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్లూఎస్ శాఖల్లోని 1,716 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 432 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో అత్యధికంగా 397అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, అత్యల్పంగా పోర్టు ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎలక్షిక్టికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 9 ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ సంస్కరణల ఆధారంగా విడుదల చేసిన జీవో 420 ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ జీవో ప్రకారం కేవలం రాత పరీక్ష మెరిట్ లిస్టు ఆధారంగా మాత్రమే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా బోర్డు ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో 420 విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూ పద్దతి ఉండాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 420ని ఉపసంహరించుకోవాలని బోర్డు సభ్యులు ముఖ్యమంవూతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవో అమలుపై గత సోమవారం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కమిటీ సిఫారసుల మేరకు ప్రస్తుత నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుం దా? లేదా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ల వరకు జీవో 420 అమలు చేసి, మిగితా నోటిఫికేషన్లకు కమిటీ సిఫారసులు వర్తింపజేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు www.apspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ప్రకటించారు.

Take By: T News

Read more...

కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!

- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?


హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.

అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.

నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.


సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం. 

 Take By: T News

Read more...

ఎట్టకేలకు లోక్‌పాల్

-లోక్‌సభలో రోజంతా చర్చ..
-లొసుగులపై విపక్షాల రచ్చ
-తొందరేంలేదు.. మళ్లీ తీసుకురండి
-2, 3 నెలలైనా ఫర్వాలేదు: సుష్మ
-అవినీతిపై పోరుకు సహకరించండి
-లోక్‌పాల్‌ను ఆమోదించండి
-పార్లమెంటుకు ప్రధాని విజ్ఞప్తి
-సీబీఐని చేర్చేది లేదని స్పష్టీకరణ


న్యూఢిల్లీ, డిసెంబర్ 27:ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లును మంగళవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదించింది. ఒకవైపు బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ముంబైలో నిరాహార దీక్షకు కూర్చోగా, మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై పలు పార్టీలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వం ముందుకొచ్చింది. బిల్లుపై చర్చలో భిన్నాభివూపాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తి లోపాలతో ఉన్న బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త బిల్లును తేవాలని బీజేపీ డిమాండ్ చేయగా, మార్పులు అవసరమని వివిధ పార్టీలు సూచించాయి. సమతుల్యతతో రూపొందించిన బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు నేతలు తమదైన శైలిలో విమర్శలు, విసుర్లు, ఛలోక్తులతో ఆసక్తి కలిగించారు.లోక్‌సభలో బిల్లు పెడుతున్న సందర్భంగా మంత్రి నారాయణస్వామి పార్లమెంటు ఔన్నత్యం గురించి నొక్కిచెప్పారు. ‘‘మనం ఈ సభకు మాత్రమే తలవంచాలి. అంతేతప్ప మరెవరికీ కాదు’’ అని పరోక్షంగా అన్నాను ఉద్దేశించి అన్నారు. అవినీతికి సంబంధించిన నేరానికి పాల్పడ్డట్లు విశ్వసించిన పక్షంలో అలాంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదిత బిల్లు ప్రకారం అధికారం లభిస్తుందని, లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయని మంత్రి చెప్పారు. లాలు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాల లోకాయుక్తలకు సంబంధించి కూడా జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. లోకాయుక్తల ఏర్పాటు గురించి, గుజరాత్‌లో అవినీతి నిరోధక వ్యవస్థ లేకపోవడం గురించి మంత్రి ప్రస్తావిస్తుండగా ఏఐఏడీఎంకే, బీజేపీ సభ్యులు లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిల్లు పూర్తి లోపాలతో ఉందని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.

‘‘బిల్లును ఉపసంహరించాలి. హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. తిరిగి స్థాయీసంఘానికి పంపించండి. 3, 4 నెలల తర్వాత తిరిగి ప్రవేశపెట్టండి. ఈ సమావేశాల్లోనే బిల్లు కావాలని మేం కోరాం. కాని, మేము ఇలాంటి బిల్లును కోరుకోలేదు’’ అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తలకు సంబంధించి ప్రభుత్వం తొలుత గందరగోళాన్ని తొలగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలు దానిని తప్పనిసరిగా అనుసరించాలా లేదా వాటి ఇష్టవూపకారం వ్యవహరించవచ్చా అన్నది స్పష్టం చేయాలన్నారు. మంత్రి కపిల్ సిబల్ ఐచ్ఛికమంటుంటే మరోమంత్రి నారాయణస్వామి విధిగా నెలకొల్పాల్సిందేనంటున్నారని ఆమె తప్పుబట్టారు. బిల్లు సమాఖ్య స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. లోక్‌పాల్‌లో మైనారిటీల రిజర్వేషన్‌కు సంబంధించి ఆమె రెండో అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ ప్రతిపాదన విభజనకు విత్తనాలను నాటుతుందని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండానే మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఉన్నత పదవులను నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె లాలూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కుటిలత్వాన్ని లాలు అర్థం చేసుకోలేకపోతున్నారనిపిస్తోంది. ఇప్పుడాయన తెలుసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆమె వ్యాఖ్యానించగా, ‘‘బీజేపీ దేశాన్ని విడదీయాలని కోరుకుంటోంది’’ అని లాలూ బదులిచ్చారు. లోక్‌పాల్‌ను ప్రభుత్వం అన్ని రకాలుగా నియంవూతించేలా ప్రస్తుత బిల్లు ఉందని, ప్రధానికి చాలా రక్షణలు కల్పించారని, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని సుష్మా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కపిల్‌సిబల్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. బిల్లును ఆలస్యం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా లోకాయుక్తల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంతో విభేదించాయి. బలమైన లోక్‌పాల్ అవసరమని, ఆ వ్యవస్థ పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలని సీపీఎం నేత బసుదేవ్ ఆచార్య కోరారు.

-సీబీఐని లోక్‌పాల్‌లో చేర్చం
-ప్రధాని మన్మోహన్ స్పష్టీకరణ

లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐని తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ తోసిపుచ్చారు. దేశ రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేప లేదని స్పష్టం చేశారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకుంటూ అవినీతిపై పోరాటంలో ఫెడరలిజం అడ్డంకి కాకూడదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అవినీతి క్యాన్సర్‌పై పోరాటంలో కలిసిరావాలని, బిల్లు ఆమోదానికి సహకరించాలని ఆయన కోరారు. ‘‘సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడమనే ప్రతిపాదన సరికాదు. దానివల్ల పార్లమెంటుకు వెలుపల ఒక కార్యనిర్వాహక నిర్మాణం ఏర్పడుతుంది.. అది ఎవరికీ జవాబుదారీకాకుండాపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది’’ అని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. అవినీతి, దాని పర్యవసానాలు ఎలా దారితీస్తున్నాయో గుర్తుంచుకోవాలని, గత ఏడాది కాలంలోనే ప్రజాక్షిగహం ఎలా వ్యక్తమయిందో గమనించాలని అన్నారు. అందుకే ప్రతిపాదిత బిల్లును ఆమోదించాలని కోరారు. బిల్లును రూపొందించే ముందు విసృ్తతంగా సంప్రతించామని, రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. లోక్‌పాల్‌పై రోజంతా చర్చ కొనసాగగా, ప్రధానమంత్రి అలాగే కూర్చున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, అవినీతిపై పోరాటంలో సభ అభివూపాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉందని అన్నారు. లోకాయుక్తల ఏర్పాటు అవసరాన్ని ప్రధానమంత్రి గట్టిగా సమర్థించారు. ‘ఆమ్ ఆద్మీ’ (సాధారణ పౌరుడు) పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నాడని ఆయన పేర్కొన్నారు. నీరు, విద్యుత్, మునిసిపల్ సేవలు, భూమి రికార్డులు, పోలీస్, రేషన్‌షాపులు.. తదితర నిత్యావసర సమస్యలన్నీ రాష్ట్రాలకు, స్థానిక అధికార సంస్థలకు సంబంధించినవని, ఈ సమస్యల పరిష్కారానికి లోకాయుక్తల ఏర్పాటు అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘లోకాయుక్తలను ఏర్పరచకపోతే అవినీతి క్యాన్సర్ విస్తరిస్తుంది. ఈ విషయంలో మనం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయరాదు’’ అని ఆయన అన్నారు.

లోక్‌పాల్‌తో అవినీతి పోదు: ములాయం
లోక్‌పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదని, పార్లమెంటు మాత్రమే ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చలో పాల్గొంటూ- పార్లమెంటు కన్నా మరేదీ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ‘‘లోక్‌పాల్ బిల్లు అవినీతిని నిర్మూలించదు. బిల్లులో చాలా లోపాలున్నాయి. అది చాలా అంశాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం లోక్‌పాల్ కన్నా పెద్దది. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుంది. దానికన్నా మరేదీ ఉన్నతం కాదు. ప్రజలు తమను ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఎంపీలు భయపడతారు’’ అని ఆయన అన్నారు. ‘‘సీబీఐపై చేసిన ఆరోపణలను లోక్‌పాల్‌పైనా చేయొచ్చు. ఈ లోక్‌పాల్ బిల్లు అమలుచేయాల్సినంత మంచిదేంకాదు’’ అని ములాయం వ్యాఖ్యానించారు.

సీబీఐకి స్వేచ్ఛ, కొత్త లోక్‌పాల్ అవసరం: జేడీ (యూ)
ప్రభుత్వం మెరుగైన బిల్లు తేవాలని, సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు అవినీతిని నిరోధించలేదని ఆయన లోక్‌పాల్‌పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఫలితంగా కోర్టు కేసుల సంఖ్య పెరగడం తప్ప అసలైన ఫలితం ఉండదని ఆయన పేర్కొన్నారు. సభలో బీజేపీకి మంత్రి కపిల్ సిబల్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని చెప్పే బదులు బిల్లును మెరుగుపరచాలని సూచించారు.‘‘ప్రజలు ఈ నాటకాన్ని అర్థంచేసుకోవడం లేదని సిబల్ భావిస్తున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు అవినీతిని నిర్మూలిస్తుందనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక చట్టాలను తేవాలనుకునేవారు బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

తొలి లోక్‌పాల్.. మన్మోహన్!
తొలి లోక్‌పాల్‌గా నిజాయితీపరుడైన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎన్నుకోవాలని ఆర్‌జేడీ నేత లాలూవూపసాద్ యాదవ్ సూచించగా మంగళవారం లోక్‌సభలో నవ్వులు విరిశాయి. అందరు బిగ్గరగా నవ్వగా, ప్రధాని మన్మోహన్ చిరునవ్వుతో స్పందించారు. లోక్‌పాల్ ఎన్నిక ప్రక్రియ గురించి లాలూ మాట్లాడుతూ తనకు ఆయన కంటే నిజాయితీపరుపూవరో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు మరొకరిని ప్రధానమంవూతిగా చేసుకోండి’’ అని అధికార కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా అన్నా హజారే తీరుపై లాలూ మండిపడ్డారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP