Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, January 22, 2012

తెలంగాణ విద్యార్థిపై కేసుల ఉచ్చు

- కేసుల ఎత్తివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ
- ఇంతవరకూ ఎత్తేసింది లేదన్న విద్యార్థులు
- ఇది ‘శ్రీకృష్ణ’ చీకటి అధ్యాయం అమలే!


police talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 21 () నిరసన కొత్త కాదు. ఆందోళన పాతదే. ఉద్యమాలూ ఈనాటివి కాదు! విద్యార్థులో, కష్టజీవులో, అన్యాయానికి గురైనవారో, దుర్మార్గాలపై కడుపు మండినవారో గతంలో ఏదైనా ఆందోళనకు దిగితే.. ఉద్యమం చేపడితే పరిస్థితి చేయిదాటినా.. అలాంటి పరిస్థితి ఉన్నా అదుపులోకి తీసుకోవడం పరిపాటి! వారిని సాయంత్రం దాకా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి.. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టడం మామూలే! కొన్ని మినహాయింపులు ఉన్నా.. అత్యంత తీవ్రమైన అభియోగాలు నమో దు చేసిన ఉదంతాలు కొన్నే! కానీ.. తెలంగాణ విద్యార్థి విషయంలో మాత్రం పక్షపాతం! కుట్ర! విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా.. ఒకరిమీదో వంద మంది మీదో కాదు.. సుమారు 9వేల మందిపై! విద్యార్థులపై మునుపెన్నడూ నమోదు చేయని సెక్షన్లు..! ప్రదర్శనలో పాల్గొన్నందుకు.. దిష్టిబొమ్మ దహనం చేసినందుకు.. కోపంతో ఓ రాయి విసిరినందుకు! ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా! తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా! ఒక కేసులో అరెస్టయి బయటికి వస్తే.. మరో కేసులో అరెస్టు చేసి జైలుకు పంపేంత స్థాయిలో! ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టేంత గుడ్డిగా..! ఇదీ సీమాంధ్ర పాలకులు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిపై చూపుతున్న వివక్ష! అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకూ ఒక్కరిపైనా కేసులు ఎత్తేయని వైనం!: తెలంగాణ కో సం జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణ కమిటీలోని చీకటి అధ్యాయాన్ని సీమాంధ్ర పాలకులు అమలు చేస్తున్నారా? పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసు ఉన్నతాధికారులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారా? ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వారిపై మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టడం ఉద్దేశపూర్వకమేనా? కేసుల పేరుతో ఇప్పటికీ విద్యార్థులను మానసికహింసకు గురి చేస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామన్న హామీని నెరవేర్చకుండానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా పరీక్షలు జరపటానికి సన్నాహాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

వేర్వేరు డిమాండ్లపై రాజకీయపార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు ఉద్యమాలు చేయటం కొత్తేమీ కాదు. ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఊరేగింపులు, దిగ్బంధనాల ద్వారా డిమాండ్ల సాధనకు వేర్వేరు వర్గాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పరిస్థితులు అదుపుతప్పి శాంతిభవూదతల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. లాఠీచార్జీలు, కాల్పులు, బాష్పవాయువు గోళాల ప్రయోగాలు జరిగాయి. అయినా ఉద్యమకారులపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు పెట్టిన దాఖలాలు వేళ్ల మీద లెక్కబె సంఖ్యలో కూడా లేవని పరిశీలకులు అంటున్నారు. మహా అయితే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవటం.. వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించటం, చీకటి పడేవరకు పోలీస్‌స్టేషన్లలోనే ఉంచి, ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేయటం ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్నది. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగినపుడు మాత్రమే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కేసులు పెట్టేవారు. ఈ కేసులు కూడా ఆయా నిరసనలను ముందుండి నిర్వహించినవారిపైనే ఉండేవి.

తెలంగాణ విద్యార్థులపై కుప్పలకొద్దీ సెక్షన్‌లు
ఉద్యమంలో భాగంగా శాంతియుతంగా ప్రదర్శనలు జరిపినా, ఊరేగింపులు నిర్వహించినా, ధర్నాలు చేసినా మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులపై పోలీసులు వందలాది కేసులు నమోదు చేశారు. ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. పోలీసుల ఈ అణచివేత వైఖరికి పరాకాష్ట ఏమిటంటే ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టటం. ఎస్‌సీ, ఎస్‌టీలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయటానికి అవకాశం లేదని తెలిసి కూడా ఈ కేసులు పెట్టారం ప్రభుత్వం, పోలీసుల కుట్రను అర్థం చేసుకోవచ్చని ఉద్యమనేతలు అంటున్నారు.

జైళ్లలో మగ్గేలా చేస్తూ...
అడ్డగోలుగా విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీటిని అడ్డం పెట్టుకుని విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విచారణ పేరిట పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరిని అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. బెయిల్‌పై విడుదల కాగానే ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేసి కారాగారాల్లోనే మగ్గేలా చేస్తున్నారు. ఇలా విద్యార్థులపై విచ్చలవిడిగా నమోదు చేసిన కేసులపై తెలంగాణ మొత్తం భగ్గుమంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఢిల్లీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇక్కడ నిరాహారదీక్షలు చేశారు. దాంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులపై నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాయి. హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి దశలవారీగా రెండు నెలల్లోనే ఈ ప్రక్రియను ముగిస్తామని స్వయంగా ప్రకటించారు.

అయితే, నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చటం లేదు. ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడగా కేసుల ఎత్తివేత దశలవారీగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి ఎంత సమయం పట్టవచ్చని అడిగితే ఏడాది పట్టొచ్చు... రెండేళ్లు పట్టొచ్చు అని సమాధానం ఇస్తున్నారు.
కేసులను అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యోగాలను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల వల్ల విద్యార్థులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఏ ఉద్యోగాలకైనా దరఖాస్తు చేయొచ్చు. పరీక్షలనైనా రాయవచ్చు. కానీ ఉద్యోగాల నియామకం సమయంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆడిగి, కేసుల పేరుతో నిరాకరించే ఆలోచనలో సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని రకాల కేసులను ఎత్తివేయాల్సిందే.
- గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ కో కన్వీనర్

 Take By: T News

Read more...

Friday, January 20, 2012

UK's first course in women, Islam and the media launched

London, January 19: Challenging stereotypes connected to women in Islam, a British university has developed a new course to cover topics related to Muslim women to change wrong perceptions of Islam in the world media, the Guardian reported on Thursday, January 19.

"Lots of people have written about women and Islam, lots of people have written about Islam and media or women and media, but they haven't been brought together before," Dr Eylem Atakav, a graduate of Ankara University and lecturer at University of East Anglia (UEA), said.

Developing the course, Atakav focused on topics about women and Islam which usually get the focus of media coverage.

The 12-week module, the first of its kind in UK, will cover issues about the topics of hijab, arranged marriage and "honor" crimes and the way they are portrayed in contemporary film, TV and other media.

Study materials include films and TV programs from around the world, including Iran, the US, Turkey and China.

Launching this week, 18 third-year students have enrolled with roughly equal numbers of men and women signing up for the module.

Atakav said the course had added relevance in the light of the Arab spring and new forms of political activism by women.

Britain is home to a sizable Muslim minority of nearly 2 million who have taken full brunt of anti-terror laws since the 7/7 attacks.

Islam sees hijab as an obligatory code of dress, not a religious symbol displaying one’s affiliations.

Misconceptions
Atakav said she hopes the course would be an important way of changing perceptions of Islam.

"We will look at how the media talk about 'honor'-based violence, for example. If it's a Middle Eastern woman who happens also to be a Muslim woman it's called an 'honor crime',” she said.

“But if it's a British woman who was killed because her husband was jealous because she was having an affair with another man, it's called murder.

"These crimes happen everywhere in the world, it's not just a Muslim, or just a Middle Eastern thing."

In Islam, there is no place for unjustifiable killing as the case in honor killing.

Even in case of capital punishment, only the government can apply the law through the judicial procedures.

Though portrayed in the Western media as exhorted by Islam, honor killing is a cultural act and has nothing to do with the faith.

Journalist and broadcaster Nabila Ramdani agrees there is a need to challenge stereotypes.
"The media caricatures [Muslim women]," Ramdani said.

“It is the same kind of media treatment which sees Muslim men portrayed as swarthy types with beards or – at worst – potential terrorists.”

Read more...

పోలీస్ శాఖలో 820 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 19 (): పోలీస్ శాఖలోని వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి గురువారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ సీటీ ఎస్సై పోస్టులు 38, వేలిమువూదల విభాగంలో ఎస్8సీటీ ఎస్సై పోస్టులు 17, పోలీస్8 ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ ఏఎస్సై పోస్టులు 29 భర్తీ కానున్నాయి.

అదేవిధంగా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్8సీటీ కానిస్టేబుల్ పోస్టులు 516, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులు 32, ఎస్8సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు 188 భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.apstatepolice.org వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ మాలకొండయ్య తెలిపారు.

Take By: T News

Read more...

నెరవేరిన చిరు కోరిక

- కేబినెట్‌లో ‘పీఆర్పీ’.. రాష్ట్ర మంత్రులుగా సీఆర్, గంటా
- ప్రమాణం చేయించిన గవర్నర్
- కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కేబినెట్‌లోకి..
- ఐదు నిమిషాల్లో ముగిసిన తంతు
- హాజరుకాని విపక్ష నేతలు
- అధిష్ఠానం దూతగా కేబీ కృష్ణమూర్తి
- శాఖల కేటాయింపులపై తర్జన భర్జన

55505-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 19 (): ఎట్టకేలకు చిరంజీవి ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర కొత్త మంత్రులుగా ‘ప్రజారాజ్యం’ తరపున సీ రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలుత రామచంద్రయ్య, అనంతరం శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39కి చేరింది. ఉదయం 11.43కు మొదలైన కార్యక్రమం 11.48 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పలువురు మంత్రులు, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు కేవీపీ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది, డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. విపక్షనేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరవలేదు.

కాగా.. ప్రమాణస్వీకారం ముగిసిందో లేదో కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి పదవులు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ది చేయాలంటే నిధుల కేటాయింపులో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పదవుల ఆశతో ఉద్యమాన్ని నీరుగార్చిన టీ కాంగ్రెస్ నేతలపై ఆ ప్రాంత ఎంపీలు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణవారికి చోటు దక్కపోవడం.. ఈ ప్రాంత నేతలకు చెంపపెట్టులాంటిదని దుయ్యబట్టారు.

వారికి తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా పదవుల చుట్టూ తిరగకుండా ఉద్యమాన్ని నీరుగార్చొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పదవులు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు, గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయిన అనంతరం ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏర్పడిన లోటును త్వరలోనే సర్దుబాటు చేస్తామన్నారు. విస్తరణ జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు సీఎం కిరణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు..

Take By: T News

Read more...

రాజీవ్ విద్యామిషన్ పోస్టుల భర్తీ..

-ప్రభుత్వానికి ట్రిబ్యునల్ నోటీసులు
-నాలుగు వారాల్లో వివరణకు ఆదేశం

హైదరాబాద్, జనవరి 19 (): రాజీవ్ విద్యామిషన్‌కు సంబంధించిన పోస్టుల భర్తీలో మాధ్యమిక విద్యాశాఖ జారీచేసిన జీవో నెం 7పై రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో నెంబర్ 7ను రద్దు చేయడంతోపాటు, జీవో నెం 3ను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. విద్యామిషన్ ద్వారా భర్తీ చేయాల్సిన సుమారు 9500 పైగా ఉన్న పోస్టులను నేరుగా నియమించేందుకు ప్రభుత్వం జీవో నెం 3 జారీచేసిన తర్వాత, జనవరి 9 వ తేదీన అందుకు విరుద్ధంగా జీవో జారీచేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపించారు.

Read more...

దగా పడిన ధర్మాస్పత్రి

- మందు బిళ్లలకూ దిక్కులేదు
- ఉన్న స్టాక్‌తోనే పంపిణీ మాయ
- మూలన పడిన విలువైన మెషినరీ
- కార్పొరేట్‌తో సర్కారు దోస్తానా!
- 10% కార్పొరేట్ వైద్యం ఉచితం
- కానీ.. కాగితాలకే పరిమితం
- వర్ధిల్లుతున్న ‘కార్పొరేట్ శ్రీ’
- ఈ పథకంలో రూ.3593 కోట్లు ఖర్చు
- ప్రైవేటు కార్పొరేట్‌కేరూ.2853 కోట్లు
- భారీగా అక్రమాలు..బయటపడేవి కొన్నే

Hospital1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
రెండు తెల్లమందు బిళ్లలు.. రెండు ఎర్రగోలీలు! మహా అయితే ఓ సూదిమందు! గత కొన్నేళ్లుగా సర్కారీ వైద్యం తీరిదే! కొన్ని చోట్ల ఇవీ ఉండవు! మారుమూల పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభించినా.. దిక్కులేని పరిస్థితి! ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఏరియా ఆస్పవూతులో, జిల్లా ఆస్పవూతులో గతి! అక్కడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉండటంతో సర్కారీ వైద్యం కునారిల్లుతోంది. కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సేవలో పడిన ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం ధర్మాస్పవూతులను దగా చేస్తున్నది. ప్రభుత్వాస్పవూతుల ఉసురు తీసి.. కార్పొరేట్‌కు ఊపిరిపోస్తున్నది!

ప్రభుత్వ నిండు నిర్లక్ష్యం కారణంగా ధర్మాస్పవూతులు దగా పడుతున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బంది లేక, మందుల్లేక, అధునాతన యంత్రసామగ్రి ఉన్నా.. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించే దిక్కులేక కునారిల్లుతున్నాయి. అదే సమయంలో ఖరీదైన వైద్యానికి పెట్టిందిపేరైన కార్పొరేట్ వైద్యశాలలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అక్కడ వైద్యం ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు గతంలో ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు.. దాంతో కొంతకాలం పాటు ఆ ఆస్పవూతులు ఈగలు తోలుకున్న పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ప్రభుత్వ పుణ్యమాని ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పవూతులను కాపాడేందుకు, పోషించేందుకు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లు స్థాయిలో వాటికి బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు గుప్పెడు రోగాలకు మాత్రమే కోట్లలో ఉంటున్నది తప్పించి.. ప్రజల తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన, ఏరియా, జిల్లా ఆస్పవూతులపైనా ఉండటం లేదని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

(, హైదరాబాద్)ఈ ఆర్థిక సంవత్సరం మందుల కోసం ప్రభుత్వం రూ.310 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.112కోట్లు గ్రీన్ చానల్ కింద ఇస్తామని నాలుగు నెలలక్షికితం చెప్పింది. ఇప్పటికీ రూపాయి కూడావిడుదలచేయలేదు. మందులు సరఫరా చేసే అనేక సంస్థలు కోర్టు కేసుల్లో ఉన్నాయి.వీటిని పరిష్కరించాలని ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాసినా ప్రభుత్వంగానీ, ఏజీ గానీ శ్రద్ధ పెట్టడం లేదని అధికారులే అంటున్నారు. మందుల పంపిణీలో అవినీతిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మందులు జిల్లా కేంద్రాల్లోని గోడౌన్లలో ఉండడంతో అక్కడికి మందుల కోసం వెళ్లేవారిని రూ.2వేల నుండి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మందులు అయిపోయినా పీహెచ్‌సీల్లోని సిబ్బంది మందులకోసం జిల్లా కేంద్రాలకు వెళ్లడం లేదనే వాదన ఉంది.

ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల కొన్ని సలహాలు కూడా చేశారు.అవి.. 1.మందుల కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా నేరుగా పీహెచ్‌సీల నుండి ఇండెంట్ తెప్పించడం. 2.శస్త్ర చికిత్సకు అవసరమైన సామాక్షిగికి ప్రతినెలా ముందుగానే ఇండెంట్ పెట్టడం. 3.ఆస్పవూతులకు సరఫరా చేసిన మందుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆస్పవూతుల్లో అందే సేవలపై ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఆన్‌లైన్‌లో సమాచారం ఉంచాలి.4.ఆస్పవూతుల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను బోర్డుల రాయాలి. కానీ.. వీటిని ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు.

మూలపడిన మెషినరీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పవూతుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువైన సామాగ్రి ఉంది. ఇందులో రూ.450కోట్ల విలువైన మెషినరీని ప్రస్తుతం వాడటం లేదు.చిన్నచిన్న రిపేర్ల వల్ల ఇవి మూలపడ్డాయి. ఈ బాధ్యత నిర్వహించాల్సిన ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో యంత్రాలు పని చేయక రోగులు ప్రైవేటు ఆస్పవూతులకు వెళ్లి ఆస్తులు కరిగించుకునే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.

కార్పొరేట్‌తో దోస్తానా
సొమ్ములుం ఆస్పత్రి గడప తొక్కనిచ్చేది అన్న రీతిలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పవూతులు వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాగం, పర్యవేక్షణ, తనిఖీ, నిఘా వంటివి ఏమాత్రం లేకపోవడంతో కార్పొరేట్ ఆస్పవూతులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. ఇక్కడ వసూలు చేసే చార్జీలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకే రకమైన రోగానికి, పరీక్షకు పలు ఆస్పవూతులు పలు రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయి. చికిత్సతో రోగం కుదిరినా.. ఈ బిల్లులు చూసి వారి గుండెలు గుభేల్మంటున్న పరిస్థితి ఉందన్నవాదన ఎప్పటినుంచో ఉంది. రాజధాని పరిధిలో దాదాపు 2200ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పవూతులున్నాయి.ఇందులో 1500 ఆస్పవూతులకే అనుమతులున్నాయని తెలుస్తోంది. వివిధ సేవల చార్జీల వివరాలను నోటీసు బోర్డులో పేర్కొనాల్సి ఉంది. చాలా ఆస్పవూతుల్లో ఇవి కనిపించవు.

ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు పొందిన కారణంగా తమ ఆస్పవూతుల్లో పదిశాతం రోగులకు ఉచిత సేవలు అందిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రం ఇస్తాయి. ఇలా రాయితీలు, సబ్సిడీలు పొందిన ఆస్పవూతుల్లో ఏ ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతున్న దాఖలాలు లేవు. అపోలో ఆస్పత్రి సహా అనేకం ఇదే బాటలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రభుత్వం నుండి రూ.200కోట్ల విలువైన భూమిని సాధారణ ధరకు తీసుకుంది. ఇది ట్రస్టు ఆస్పత్రి కనుక తెలంగాణతో పాటు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారూ విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా తెలంగాణ నుండి ఒక్కరు కూడా డైరెక్టర్ కాలేదు. కేర్ ఆస్పత్రి యాజమాన్యం గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ను ఆసరాగా చేసుకుని, అవే ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేస్తూ, ఫౌండేషన్‌కు చూపిస్తూ డబ్బులు దండుకుంటోందనే ఆరోపణలున్నాయి.

కనిపించని తనిఖీలు
ఏటా రాష్ట్రంలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో రూ.7వేలకోట్లకు పైగా ప్రైవేటు ఆస్పవూతుల జేబుల్లోకి వెళ్తున్నాయని అంచనా. కార్పొరేట్ ఆస్పవూతుల వ్యవహారాలను జిల్లా డీఎంహెచ్‌వో తనిఖీ చేయాలి. కొన్ని తనిఖీ బృందాలూ ఉండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ఆస్పవూతిలోనూ తనిఖీలు జరగడంలేదని నిపుణులు అంటున్నారు. నెలనెలా మామూళ్లు అందడంతోనే అధికారులు నిమ్మకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. మందుల షాపుల్లోనూ తనిఖీలు లేవు. నాశిరకం మందుల అమ్మకాలను నిరోధించేందుకు డ్రగ్ కంట్రోల్ అథార్టీ ఉన్నా.. తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో మెడికల్ షాపుల్లో జరిగే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని అంటున్నారు.

కార్పొరేట్ శ్రీ
అందరికీ మెరుగైన వైద్యం పేరుతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ.. కార్పొరేట్ ఆస్పవూతులకు కల్పతరువుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 2007లో ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా కార్పొరేట్ ఆస్పవూతుల్లో ఈగలు తోలుకునే పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ఆరోగ్యశ్రీ రాకతో కార్పొరేట్ ఆస్పవూతులు నేడు ధనికులకంటే పేదలతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.3593కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.2853కోట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పవూతులకు,మిగిలిన రూ.740 కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు బిల్లులు చెల్లించారు. కార్పొరేట్ ఆస్పవూతులకు ఇచ్చిన డబ్బును ప్రభుత్వ ఆస్పవూతుల కోసం ఖర్చు చేసి ఉంటే మళ్లీ ప్రభుత్వ ఆస్పవూతులు జీవం పోసుకునేవని అధికారులు,మేధావులుఅంటున్నారు.ఒకసంస్థ చేసిన సర్వేలో రూ.2వేల కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు ఖర్చు చేస్తే కార్పొరేట్‌కు దీటుగా పనిచేస్తాయని, పూర్తిగా ఉచిత సేవలందించవచ్చని పేర్కొంది.

అయినా.. కార్పొరేట్‌కు దోచిపెట్టడానికే ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ కింద ఇంకెన్ని కోటె్లైనా ఇచ్చేందుకు సిద్ధమని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీలో అక్రమాలకూ అంతూపొంతూ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పవూతులుఅవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి బిల్లులు దండుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాకు హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌పై ఆరోగ్యశ్రీ ట్రస్టు క్రిమినల్ కేసులు పెట్టింది. గాంధీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎన్‌వీఎన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ సెంటర్‌పై ఈ నెల 15న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ ఐపీసీ 406-42కింద క్రిమినల్ కేసు పెట్టారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, అనవసరమైన హెర్నియా శస్త్రచికిత్సలు చేసి ప్రజలను మోసం చేశారని రిపోర్టులో తేలిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆరోగ్యశ్రీ పరిధిలో అనేకం జరుగుతున్నాయి.

DRRR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసర్కార్ వైద్యం పూర్తిగా నిర్వీర్యం కావడానికి ప్రభుత్వాలే కారణం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కార్పొరేట్ ఆస్పవూతులు ప్రైవేటు రంగంలోకి వచ్చాయి. దీనికి ముందు వైద్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. రాష్ట్రంలో మొదటి పౌరుడు గవర్నర్ నుండి మామూలు వ్యక్తి వరకు ప్రభుత్వ ఆస్పవూతికి వచ్చి అత్యుత్తమ చికిత్స చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ రానురాను కేటాయింపులు తగ్గిస్తూ కావాలనే ప్రభుత్వ వైద్యాన్ని సర్కారు నిర్వీర్యం చేసింది. ప్రభుత్వమే మందులు, పరికరాల కొరత సృష్టించడం మొదలు పెట్టింది. కార్పొరేట్ రంగం ఆవిర్భవించాక ప్రభుత్వ ఆస్పవూతులకు బడ్జెట్ పెంచాల్సింది పోయి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రైవేటు సెక్టార్‌లో ఇన్స్యూన్స్ చేయించి ప్రోత్సహించింది.
- డాక్టర్ నర్సయ్య, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు

తమిళనాడులో ఏ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ ఆస్పవూతుల్లో వైద్యం చేయించుకుంటారు. ఆ పరిస్థితి గతంలో మన రాష్ట్రంలోనూ ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే కావాలని కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తూ సీమాంధ్రవ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త కార్పొరేట్ ఆస్పవూతులొచ్చి కోట్లు దండుకుంటున్నాయి. పేదలకు 20శాతం ఉచితవైద్యం చేస్తామని చెప్పి వచ్చిన వాళ్లు ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. లాబీయింగ్‌తో మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్న డబ్బుతోనే ప్రభుత్వ ఆస్పవూతులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వైద్యం చేస్తామంటే ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? నమ్మకం పోయింది కనుకే ప్రభుత్వ ఆస్పవూతులు నిర్వీర్యం అవుతున్నాయి.
- డాక్టర్ రమేష్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
Take By: T News

Read more...

Wednesday, January 18, 2012

Don't spy on Muslims, says Achuthanandan

Don't spy on Muslims, says Achuthanandan
Thiruvananthapuram, January 17 : Opposition leader V.S. Achuthanandan Tuesday blasted the Kerala government for allegedly spying the email accounts of Muslim leaders.
 
The Marxist leader accused Chief Minister Oommen Chandy of "following in the footsteps of Narendra Modi". 

"We wish to know if P.V. Abdul Wahab and Abdul Samad Samadhani, both belonging to the Indian Union Muslim League, have terrorist connections?" asked Achuthanandan. 

On Monday, news surfaced that the intelligence department here was allegedly spying on the email accounts of 189 Muslim leaders, including journalists and politicians.

Chandy has asked Additional Director General of Police (Intelligence) T.P. Senkumar to probe the allegation.

State IUML general secretary K.P.A. Majeed said: "Let the report come out, and then we will react to it."

The Kerala Union of Working Journalists condemned the tracking of emails and tapping of telephones of journalists.

Take By: Siasat News

Read more...

టెట్టా .. డీఎస్సీనా (TET / DSC)

- రెండింటిలో ఏదో ఒకటే.. అధ్యయనంపై ప్రభుత్వ యోచన
- మంత్రి పార్థసారధి వెల్లడి.. ఈ డీఎస్సీకి వర్తింపు డౌటే !
- టెట్‌పై అభ్యర్థుల్లో వ్యతిరేకత.. శాస్త్రీయత లేదంటూ ఆందోళన


హైదరాబాద్, జనవరి 17 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పై రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జాతీయ విద్యా, ఉపాధ్యాయ శిక్షణా మండలి మార్గదర్శకాల మేరకు టెట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. దేశ వ్యాప్తంగా లేని టెట్ రాష్ట్రంలో ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో ఏమాత్రం శాస్త్రీయత లేకుండా ప్రభుత్వ ఆలోచనలను బలవంతంగా రుద్దుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఎంపికకు అభ్యర్థుల వడపోతకు ప్రభుత్వం ఎలాగూ డీఎస్సీ నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలో టెట్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభ్యర్థుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా డీఎస్సీ, టెట్‌లలో ఏదో ఒక పరీక్ష నిర్వహించేలా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పి. పార్థసారధి తెలిపారు. అలా కాకుంటే ఈ రెండు పరీక్షలు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలా? అనేది అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే టెట్ రెండు సార్లు నిర్వహించారు. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు కూడా విద్యాశాఖ రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీకి టెట్ వర్తింపజేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం యోచన బాగానే ఉన్నప్పటికీ ఈ అధ్యయనం పూర్తి చేయటం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించే కొత్త డీఎస్సీకి ఇది వర్తించే అవకాశం కనిపించటం లేదు. డీఎస్సీ రాత పరీక్షకు అర్హతలు ఇప్పటికే విద్యాశాఖా ప్రకటించింది.

సివిల్స్‌స్థాయి ప్రమాణాలా..!
భారత సర్వీసులు, గ్రూప్-1 ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షా ప్రమాణాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపికకు పెట్టడంతో అభ్యర్థులు హడపూత్తి పోతున్నారు. సివిల్స్ ఎంపికకు డిగ్రీ కలిగి ఉండి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు మూడు అంచెలు దాటి వసే ్త అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపిక అవుతారు. ఉపాధ్యాయులకు సైతం ఇదే స్థాయిలో ఎంపిక ప్రక్రియ ఉంది. ప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, డీఎస్సీ మూడు అంచెలు దాటి రావాల్సి ఉంది. దీంతో అభ్యర్థులు సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ కావల్సిన పరిస్థితి నెలకొంది.

శాస్త్రీయత లేదు..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ కూడా శాస్త్రీయంగా లేదు. ఇందులో ప్రధానంగా భాషా పండితులు తెలుగు, హిందీ విషయాన్ని బోధిస్తారు. కానీ వీరికి టెట్ పరీక్షలో సోషల్ సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలడగటం ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇందులో సోషల్ సబ్జెక్టుకే అధిక మార్కులు ఉండటం గమనార్హం. సాధారణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలో సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. కానీ టెట్‌కు మాత్రం 60 శాతం మార్కులు సాధిస్తేనే డీఎస్సీకి అర్హత సాధించినట్లు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు సాధించాలని నిర్ణయించటం శాస్త్రీయంగా లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయుల ఎంపికకు ప్రభుత్వం టెట్ పరీక్ష ఐచ్చికంగా పెట్టుకుంటే బాగుండేది.

లేదా సాధారణ డిగ్రీ, పీజీ మాదిరిగానే 35 శాతం మార్కులు పెట్టి టెట్ పాసైతేనే డీఎస్సీకి అర్హులు అన్నా బాగుండేది. కానీ ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా టెట్ నిర్వహిస్తుండటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more...

స్పెషల్ బాంబ్!

- ఇంధన సర్దుబాటు చార్జీల మోత
- డిస్కమ్ ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం
- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసిన కమిషన్
- హైకోర్టు తీర్పుకు లోబడి 2008-09 ఎఫ్‌ఎస్‌ఏ అమలు
- 2009-10 ఎఫ్‌ఎస్‌ఏ ఫిబ్రవరి నుంచి వసూలు
- విద్యుత్ వినియోగదారులపై రూ. 3038 కోట్ల పరోక్ష వడ్డన
- యూనిట్‌కు 35 నుంచి 40 పైసల భారం


bulb1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 17 (: గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. వచ్చే ఫిబ్రవరి నెలనుంచి ఎఫ్‌ఎస్‌ఏ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్దేశించింది. మంగళవారం రాత్రి పదిగంటల వరకు కసరత్తు జరిపి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఈఆర్సీ ఈ ఆదేశాలు జారీచేసింది. గత రెండేళ్లకు సంబంధించి సరాసరిగా ప్రతి యూనిట్‌పై 35 నుంచి 40 పైసల చొప్పున ఇంధన సర్దుబాటు భారం పడనుంది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి న ప్రతిపాదనల్లో ఈఆర్సీ రూ.3038 కోట్ల మేరకు ఆమోదం తెలిపింది.

2008-09 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు రూ.3,141.97 కోట్ల ఎఫ్‌ఎస్‌ఏను ప్రతిపాదించగా ఈఆర్సీ రూ. 1,638.82 కోట్లకు ఆమోదం తెలిపింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు 1,480కోట్లు ప్రతిపాదించగా ఈఆర్సీ మాత్రం రూ.1,400కోట్లకు సర్దుబాటు చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో వ్యవసాయ వినియోగదారులు మినహా మిగతా వినియోగదారులపై సగటున 2008-09 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క యూనిట్‌పై 33.88పైసల చొప్పున, 2009-10 ఆర్థిక సంవత్సరంలో 44.05 పైసల చొప్పున అదనపు భారం పడనుంది. రెండు సంవత్సరాలకు సంబంధించి గృహ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ (ఎఫ్‌ఎస్‌ఏ) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.

గత సెప్టెంబర్‌లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ముఖ్యమంవూతికి నివేదిక అందజేసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల ఇంధన సర్దుబాటు ఛార్జీల మొత్తం దాదాపు రూ.577కోట్లను సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరడ్డి ప్రకటించడంతో మిగతా వినియోగదారులు (నాన్ డొమెస్టిక్) హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసును గత సెప్టెంబర్‌లో హైకోర్టు బెంచ్ విచారించి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు, ప్రభుత్వానికి చురకలు పెట్టింది. దాంతో 2008-09 ఇంధన సర్దుబాటు చార్జీల అమలు అంశం హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటుందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఏను వినియోదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి మనోహరరాజు ‘T’కు వెల్లడించారు.

Take By : T News

Read more...

గెలుపు ఎవరిది? (Who is Win)

ఆజాద్‌తో కిరణ్ సుదీర్ఘ భేటీ
మంత్రుల జాబితాపై చర్చ?
శాఖలపైనా మంతనాలు!

సీఎం మాటను మన్నించిన ఆజాద్?
పునర్వ్యవస్థీకరణకు ఓకే
బొత్సను తప్పించే అవకాశం
ముందే బొత్సతో మాట్లాడిన ఆజాద్
నేనుంటేనే పార్టీకి మంచిది
ఆజాద్ ముందు బొత్స వాదన
సమన్వయ కమిటీలో ఉన్నారుగా..
నచ్చజెప్పిన రాష్ట్ర ఇన్‌చార్జ్
సీఆర్‌తో మొదలైన కిరికిరి

ఆయనపై సీఎం విముఖత?


పూర్తి ప్రక్షాళనతో సొంత టీమ్ కోసం కిరణ్
మార్పులకు బ్రేక్ కోసం బొత్స ఫైట్
హస్తినాపురంలో జోడెద్దుల మంతనాలు

కేబినెట్‌లో మాకూ చోటివ్వండి... సీనియర్ ఎమ్మెల్సీల డిమాండ్
తెరపైకి వచ్చిన తెలంగాణ ఖాళీలు
రెండు డిమాండ్ల వెనుక సీఎం?

Kiran205-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 17 (): విస్తరణ రాజకీయం హస్తినకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఎడతెగని చర్చల్లో మునిగిపోయింది. మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి తనకంటూ ఒక జట్టును కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలి... కొందరు సీనియర్లకు ఉద్వాసన పలికి, కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రాంతాల మధ్య సమతుల్యం సాధించాలి.. ఇది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి యోచన! పార్టీని, ప్రభుత్వాన్ని ఆపత్కాలంలో ఆదుకున్న చిరు బ్యాచ్‌కు తక్షణమే మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి.. ఇతర మంత్రుల శాఖలను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చరాదు.. ఇది పీసీసీ చీఫ్ మనోగతం! ఇద్దరు నేతలూ రెండు వాదాలతో ఢిల్లీలో అడుగుపెట్టడంతో కాంగ్రెస్‌లో సమస్యల కొలిమి మరోసారి రాజుకున్నట్లయింది. దీనికి తోడు ఎమ్మెల్సీగా ఉన్న సీ రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండటంతో మేమే తక్కువా? అంటూ ఎమ్మెల్సీలు సైతం తిరగబడుతుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. పునర్వ్యవస్థీకరణే జరిగితే తెలంగాణ కోటాలో ఏర్పడిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాజాగా మంత్రి పదవుల డిమాండ్‌ను లేవనెత్తడం దీనికి నిదర్శనం.

మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. విమానాక్షిశయం నుంచి నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాను పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నదీ ఆయనకు మరోసారి వివరించారు. ప్రధానంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు శాఖల కేటాయింపుపై వారిరువురూ సుదీర్ఘంగా చ ర్చించారని తెలిసింది. సీఎం తెచ్చిన కొత్త మంత్రుల జా బితా, వారి కేటాయించాలనుకుంటున్న శాఖలపై ఈ చర్చ సాగినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్నందున ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొని, పాలనాపరంగా మరింత దూకుడుగా వ్యవహరించగలిగే కొంతమంది మంత్రులు కావాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. సుమారు గంటన్నరకు పైగా జరిగిన భేటీలో సొంత టీం ఏర్పాటుకు తనకు స్వేచ్ఛనివ్వాలన్న సీఎం విన్నపాన్ని ఆజాద్ అమోదించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో కాలం లేకపోవడంతో పాత టీంను మార్చాలన్న ఆయన ప్రతిపాదనకు ఆజాద్ ఓకే చెప్పినట్లు తెలిసింది. తనకు తలనొప్పిగా మారిన పీసీసీ అధ్యక్షుడు బొత్స, శంకపూరావులను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఎంతో కాలంగా సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఈ దఫా ఫలించేటట్లు కనిపిస్తున్నాయి. పీఆర్‌పీ నుంచి చిరంజీవి ప్రతిపాదిస్తున్న సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాస్‌రావుకు స్థానం కల్పించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సను తప్పించాల్సిందేనని ఆజాద్‌ను కిరణ్ ఒప్పించారని అంటున్నారు. సీఎం ప్రతిపాదనను ముందే గుర్తించిన ఆజాద్.. కిరణ్ తనను కలవడానికి ముందే బొత్సను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. మధ్యాహ్నం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పిస్తున్న అంశాన్ని బొత్సకు తెలియపరిచారని సమాచారం.

అయితే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి తాను మంత్రిగా కొనసాగితేనే ఉపయోగకరమని బొత్స వాదించినట్లు తెలిసింది. అయితే దీనికి ఆజాద్ సుముఖత చూపించలేదని తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ఇప్పటికే తన అధ్యక్షతన సమన్వయ కమిటీ పనిచేస్తున్నదని, దానిలో మీరు కూడా సభ్యులైనందున అక్కడ పార్టీ అభివూపాయాలను సీఎం దృష్టికి తీసుకురావచ్చని ఆజాద్ సూచించారని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో లోపాలను సైతం ఎత్తిచూపొచ్చని, దానికి మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం లేదన్న ధోరణిలో బొత్సను ఆజాద్ ఒప్పించినట్లు సమాచారం. మంత్రి శంకపూరావును కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం రూపొందించిన జాబితాపై అభివూపాయం తెలపడానికి అందుబాటులో ఉండాలని బొత్సను ఆజాద్ కోరినట్లు తెలిసింది. తాను రూపొందించిన జాబితాపై ఆజాద్‌తో ఆమోద ముద్ర వేయించుకున్న కిరణ్.. సోనియాతో బుధవారం భేటీ అయి.. ఆమె అనుమతి తీసుకుని రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.

ఎవరి ప్రయోజనాలు వారివే!
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), కోమటిడ్డి వెంకట్‌డ్డి (నల్గొండ) తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం కేబినెట్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి రెండు ఖాళీలు ఉన్నాయి. వీటిని ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యతను పాటించాలంటే ఈ రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఖాళీలను తాజా విస్తరణలో భర్తీ చేయాలని వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి మంగళవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్సీలు ఉండగా వారిని కాదని పీఆర్పీ ఎమ్మెల్సీ రామచంవూదయ్యకు మంత్రిపదవి ఎలా ఇస్తారని అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే.. ఎమ్మెల్యేలు ఉత్తంకుమార్‌డ్డి, దామోదర్‌డ్డి, గండ్ర వెంకటరమణాడ్డి, మల్లు భట్టి విక్రమార్క్‌లకు దక్కవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రి శంకపూరావును తొలగించాల్సి వస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు మంత్రిపదవి ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీల విషయానికి వస్తే డీ శ్రీనివాస్, పాలడుగు వెంకవూటావు, మహ్మద్ జానీ, రుద్రరాజు పద్మరాజు, ఇంద్రసేన్‌డ్డి, జగదీశ్వర్‌డ్డి, భూపాల్‌డ్డి, భానువూపసాద్ మంత్రిపదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో పాలడుగు, పద్మరాజు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌డ్డి, టీజీ వెంక మల్లు భట్టివిక్షికమార్క ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ ఢిల్లీ వెళ్ళారు.

తెలంగాణ ఉద్యమ వాతావరణం కొంత చల్లబడటంతో పాటు రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, యువతకు అనేక పథకాలు, కార్యక్షికమాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నందున ఇదంతా తన గొప్పతనంగా కిరణ్ చెప్పుకుంటున్నారు. వీటిని చూపి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కిరణ్.. మొత్తంగా ప్రభుత్వంలో తన పట్టుపెంచుకునేందుకు పావులు కదిపారని సమాచారం. తనకు అడ్డంకిగా ఉన్న మంత్రులు బొత్స, శంకపూరావు, డీఎల్ వంటి సీనియర్లను కూడా కేబినెట్ నుంచి తొలగించుకోవాలని కిరణ్ ఆరాట పడుతున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్ ఆలోచనలను ముందే పసిగట్టిన బొత్స తదితరులు కిరణ్‌కు వ్యతిరేకంగా అధిష్ఠానానికి సవివరంగా నివేదికలు పంపినట్లు సమాచారం.

పథకాల్లో డొల్లతనాన్ని వారు ఆ నివేదికలో పొందుపర్చారని తెలిసింది.మంత్రివర్గంలోకి రామచంవూదయ్యను తీసుకోవడంపై సీఎం సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు వంగా గీత, బండారు సత్యానందరావు తదితరులతో భేటీ కావడం పీఆర్పీ వర్గాల్లో కలకలం రేపింది. పీఆర్పీ నేతల్లో చీలికి తెచ్చేందుకు సీఎం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రుల శాఖల మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుండడంతో మంత్రులు ఆర్ వెంకట్‌డ్డి, ఏరాసు ప్రతాప్‌డ్డి, సబితా ఇంద్రాడ్డి, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్ధసారధి, మహిధర్‌డ్డి, రఘువీరాడ్డి, పీ విశ్వరూప్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణాడ్డి పలువురు ఎమ్మెల్సీలు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పులి ఉప ఎన్నిక సందర్భంగా మంత్రిపదవికి రాజీనామా చేసిన వైఎస్ వివేకానందడ్డి కూడా కిరణ్‌ను కలిశారు.

హస్తినకు ఆశావహుల క్యూ
మంత్రి వర్గంలో భారీ మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్న వార్తలతో రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఆశావహులు హస్తినబాట పట్టారు. మంత్రులు ఏరాసు, శైలాజానాథ్, చీఫ్ విప్ కొండ్రు మురళి, డిప్యూటీ స్పీక్ మల్లు, ఎమ్మెల్యేలు గండ్ర, ముత్యండ్డి, మస్తాన్‌వలీ తదితరులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం జరుగుతుందన్న వార్తలతో అసంతృప్తులు రగులుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అందరూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఈ నేపథ్యంలోనే మంత్రులు రాష్ట్ర నేతలను కోరుతున్నారు.

మా సంగతేంటి?
ఎమ్మెల్సీ కోటా నుండి రామచంవూదయ్యకు మంత్రి వర్గంలో స్థానం దాదాపు ఖరారు కావడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అధిష్ఠాన తీరును తప్పుబడుతున్నారు. తాము మంత్రి పదవి అడిగినప్పుడు ఎమ్మెల్సీలకు అవకాశం లేదన్న పార్టీ పెద్దలు ఇప్పుడు ఏ రకంగా రామచంవూదయ్యకు పదవి కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వదలుచుకుంటే పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన తనకివ్వాలని పాలడుగు కోరుతున్నారు. ఇదే విషయంపై ఆజాద్‌తోపాటు పార్టీ కోర్‌కమిటీ సభ్యులనూ ఆయన కలవనున్నారు. ఎమ్మెల్సీలు బాషా, పద్మరాజు, రంగాడ్డి తదితరులు కూడా ఇదే వాదనతో ఢిల్లీ పెద్దలను కలువనున్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP