Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, January 6, 2011

తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లు కడగడానికి రెడీ: కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష సమావేశం అవసరం లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. కేంద్రం తలచుకుంటే ఎవరి అభిప్రాయం అక్కర్లేదని అయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడమే కేంద్రముందున్న ప్రత్యామ్నయమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు రెండు వారాల వ్యవధి ఇస్తున్నామని, రాష్ట్ర ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోకుండా కేంద్రం కాలయాపన చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కమిటీ నివేదికపై రాజకీయ నిర్ణయమే ఫైనల్‌ అని, కమిటీ నివేదిక ఎన్ని పరిష్కారాలు సూచించినా రాష్ట్ర ఏర్పాట్లుపై కేంద్రానిదే తుది నిర్ణయమని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరాలని చూస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూలో నిల్చున్నారని ఆయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడగటానికి తాను రెడీ అని కేసీఆర్‌ అన్నారు.
Take By : Suryaa.com

Tag:

Read more...

తేల్చేనా.. నాన్చేనా? - ‘తెలంగాణ’పై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నేడే





‘తెలంగాణ’పై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నేడే



* వెల్లడికానున్న శ్రీకృష్ణ నివేదిక
* తెరవేస్తారా..? సాగదీస్తారా..? రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్
* శ్రీకృష్ణ నివేదికను అందించటమేనా..? నిర్ణయం తీసుకుంటారా?
* అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ దూరం
* పీఆర్పీ నో కామెంట్.. సీపీఐ తెలంగానం.. సీపీఎం సమైక్య నాదం
* హైదరాబాద్‌పైనే ఎంఐఎం దృష్టి
* కాంగ్రెస్‌లో ప్రత్యేక, సమైక్య వాదనలున్నా.. చివరికి హైకమాండ్ దారే
* అన్నిటికీ మించి కేంద్ర సర్కారు నిర్ణయమే కీలకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏడాది కాలపు ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలను తీవ్ర ఉత్కంఠలో పెట్టిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ.. వారం కిందట కేంద్రానికి సమర్పించిన నివేదికలోని అంశాలు గురువారం వెల్లడికానున్నాయి. ఈ నివేదికపై రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలక సమావేశం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగేదేమిటి? అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యం పాటిస్తోంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కీలకమైన నిర్ణయం జరుగుతుందా? లేక కేవలం నివేదికను అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వటం వరకే పరిమితం చేసి.. ఇవే పరిస్థితులు కొనసాగటానికి కారణమవుతారా? అనేది నేటితో తేలిపోనుంది.

రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రాలేమని ప్రకటించాయి. వీటి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉంటానని ప్రకటించింది. తెలంగాణలో కీలకమైన రాజకీయ పార్టీల్లో సగం పార్టీలు తిరస్కరించిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని రాష్టమ్రంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం నిరర్ధకమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కేంద్ర ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్క ప్రతినిధినే ఆహ్వానించకుండా భిన్నాభిప్రాయాలు వచ్చే విధంగా అనైతిక పద్ధతికి కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహాన్నిస్తోందంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కూడా అఖిలపక్ష ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించినా భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించినట్లు కాదంటూ ఏకాభిప్రాయం ప్రకటించిన పార్టీలను ఉదహరిస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం రెండోసారి కేసీఆర్‌ను ఆహ్వానించారు.

రెండోసారి పంపిన ఆహ్వానాన్ని కూడా కేసీఆర్ తిరస్కరిస్తూ.. అఖిలపక్ష కమిటీ సమావేశానికి రాలేమని ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఏర్పాటు చేసే అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నాయని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అటూఇటుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లటం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని.. ఈ సమావేశానికి తాము రావాల్సినంత అవసరమేమీ లేదనే కారణంతోనే గైర్హాజరవుతున్నామంటూ చంద్రబాబు లేఖ రాశారు.

అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధిగా సి.రామచంద్రయ్య ఒక్కరే హాజరుకానున్నారు. ఈయన కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పకుండా నివేదికను మాత్రమే పార్టీ తరఫున తీసుకోనున్నారు. ఒకవేళ అభిప్రాయం చెప్పాలని కేంద్రం కోరితే పార్టీలో చర్చించిన తర్వాతే పార్టీ వైఖరిని చెప్తామని మరింత గడువు కోరటానికి రామచంద్రయ్య హాజరవుతున్నారు. ఇక సీపీఎం ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి హాజరవుతున్నారు. నివేదిక ఇచ్చినా, అభిప్రాయం అడిగినా సమైక్యవాదాన్నే వీరు వినిపించనున్నారు. సీపీఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు జి.మల్లేష్ హాజరవుతుండగా.. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఏకాభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఎంఐఎం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఎమ్మెల్సీ ఖాద్రీ హాజరుకానున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయదలిస్తే హైదరాబాద్, మైనారిటీ అంశాలను వీరు ప్రస్తావించనున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ...
రాష్ట్ర రాజకీయ పార్టీల్లోకెల్లా కాంగ్రెస్‌లోనే తీవ్ర అనిశ్చితి, అయోమయ పరిస్థితి నెలకొనిఉంది. టీడీపీ తర్వాత.. అంతర్గతంగా అదేస్థాయిలో తెలంగాణ, సమైక్యాంధ్ర విషయాల్లో సొంతపార్టీ నేతల మధ్యనే అగాధం నెలకొంది. పుట్టినరోజు నాడే నిర్ణయాన్ని ప్రకటించినందున తెలంగాణకు అనుకూలంగానే పార్టీ అధినేత్రి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రాంత నాయకులు చెప్తున్నారు. రెండో ఎస్‌ఆర్‌సీయే పార్టీ విధానమని, రాష్ట్ర విభజనకు అంగీకరించబోరని సమైక్యవాద నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే పార్టీ పదవులే కాదు ఎలాంటి త్యాగాలనైనా చేస్తామని తెలంగాణ నాయకులు హెచ్చరిస్తుంటే.. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుండి నిష్ర్కమిస్తామంటూ సమైక్యవాద నాయకులు బెదిరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలు కావూరి, ఉత్తమ్‌లు అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించటం అంత ఈజీ కాదని కావూరి అంటే.. తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఉత్తమ్ ఉద్ఘాటించారు. రాష్ట్ర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ వంటివి అంతర్గతంగా నిట్టనిలువునా చీలిపోతున్న ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ దాదాపు 10 నెలల పాటు రాష్ట్రంలో అధ్యయనం చేసింది. కమిటీ చేసిన అధ్యయనం, సూచించిన పరిష్కారాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర రాజకీయవర్గాల్లోనే కాకుండా వ్యాపార, ఉద్యోగ, విద్యార్థులతో పాటు ప్రజానీకమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కమిటీలో ఏయే అంశాలు, పరిష్కారాలు చోటుచేసుకున్నాయనేది ఒక అంశమైతే దీనిపై కేంద్ర వైఖరేమిటన్నదే అన్నింటికన్నా అంతిమ ప్రాధాన్యతాంశం.


Tag: Sakshi, eenadu, News, Telangana, KCR, RajNews, AP,

Read more...

Wednesday, January 5, 2011

Maha Garjana NEW PICS















Tag: Images, Hot Image, Telangana Image, Telangana, KCR, BJP, TRS, PRP, News, AP

Read more...

All 165 MPs of NDA will support the Telangana bill : Gadkari

Bharatiya Janata Party (BJP) president Nitin Gadkari Tuesday said if the United Progressive Alliance (UPA) government tables a bill in parliament for formation of a separate Telangana state, the National Democratic Alliance (NDA) would wholeheartedly support it.

Addressing a public meeting organized by the party at Adilabad, Gadkari assured people of Telangana that the NDA was with them in realizing their dream of a separate state.

‘I have come to assure you that all 165 MPs of NDA will support the bill on Telangana if Sonia Gandhi (Congress president) fulfils her promise by tabling the bill,’ he said.

The BJP chief warned the government against suppressing the Telangana movement by using paramilitary forces. ‘It is shameful that the government which failed to tackle terrorism has deployed paramilitary forces in Telangana to suppress peaceful agitation,’ he said.

Gadkari said if any force was used against the students and other protestors in Telangana, NDA would not allow parliament to function during the budget session.

The BJP leader said the fight for a separate state of Telangana was the fight for self-respect by four crore people of the region.

He promised that Telangana would be on the top of its agenda if NDA comes to power in the next elections.

He was confident that NDA would come to power in the 2014 elections and it would take up the Telangana state formation immediately.

He said Telangana was on top the agenda of the NDA meeting to be held Wednesday.

Gadkari described the Srikrishna committee as ‘time pass’ committee and said it was constituted by the government to drag the Telangana issue.

‘This is the reason the BJP has decided not to attend the eight-party meeting convened by the centre on Jan 6,’ he said.

The BJP held the public meeting two days before the centre is to make public the report of the Srikrishna committee.

Read more...

RTI activists seek Srikrishna panel report details




http://timesofindia.indiatimes.com/city/hyderabad/RTI-activists-seek-Srikrishna-panel-report-details/articleshow/7198356.cms

HYDERABAD: Right to Information (RTI) activists in the city have filed a petition under the RTI Act with the ministry of home affairs at the Centre seeking to know the contents of the Srikrishna Committee report. Their stand? Well, citizens and not politicians should be the first to know about the committee's recommendations.

Activists have not only filed a petition but are also mobilising people from districts to do the same and have set a target of 200 RTI applications that they would mobilise. Ten RTI petitions have already been filed from Warangal alone. "We want them to share the contents of the committee recommendations with us before politicians get to look at it," said Rakesh Reddy Dubbudu, activist, who filed his application under the special clause listed under Section 7(1) of the RTI Act. According to the listed clause, any information which has the potential to affect lives and liberty of people at large, must be provided within 48 hours of the receipt of the request petition.

"The committee recommendations definitely concerns the life and liberty of the masses who have been actively involved in the movement. Therefore we, as citizens of the country, are better suited to get a copy of the submitted recommendations ahead of the politicians," said Dubbudu. If the activists do get a response to their petition in 48 hours (by Monday), they plan to circulate the content among the masses.

Filed with an objective to put to rest the speculations about the formation of a new state as is currently doing the rounds, this application can however be turned down by the PIO if he so decides. "If he thinks that this information does not hold enough ground, then it can be turned down, but the onus is on him to prove the same," said another RTI activist. Activists are hoping that the ministry's office will follow the RTI Act in letter and spirit and thereby furnish information under this special clause. Further, they argue that since the committee has worked with public money, it is then justified that people know what the contents of the report are.

RTI activists have also asked non-resident Indians to file similar applications in the Indian embassies located in their respective countries.

Read more...

ఆగదు నా తెలంగాణ పోరు

ఆగదు నా తెలంగాణ పోరు
అణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
ప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
అధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరు
అన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసం
ఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడు
ఇంకింత జోరు అందుకుంది
ఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...
ఆపగలను అన్నోడికి నా సవాల్...
- కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Read more...

Tuesday, January 4, 2011

సిద్దిపేట దీక్షలో 365 మంది

ప్రజాపోరాటానికి కేసీఆర్ ప్రతినిధి
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గౌరవంగా మెలగాలి
సత్యాగ్రహం గ్రామాల నుంచే ప్రారంభం కావాలి
-ఎమ్మెల్సీ చుక్కా రామయ్య
సిద్దిపేట దీక్షలో 365 మంది

సిద్దిపేట, న్యూస్‌లైన్: ప్రజా పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరు అంకిత భావంతో ముందుకు నడవాలని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేటలో తెలంగాణ దీక్షలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమానికి నాభిలాంటి సిద్దిపేటలో ప్రజలు మరోసారి తమ ఆకాంక్షలను దీక్షల ద్వారా చాటుతున్నారని కొనియాడారు. తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యగా చూడటం శోచనీయం అన్నారు. పోలీసు బెటాలియన్‌లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఎన్‌జీఓ, ఇంజినీర్ల బెటాలియన్‌లు సిద్ధమయ్యాయని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కాదని అరవై సంవత్సరాలుగా ప్రజల గుండె లోతుల్లోని బాధగా ఆయన అభివర్ణించారు.

తెలంగాణ ఉద్యమంపై లాఠీలు ఝుళిపించి, బాంబులేసి అణచివేయాలనుకుంటే అవివేకమని అన్నారు. డిసెంబరు 9 నాటి హోం మంత్రి ప్రకటన ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా పోరాటానికి కేసీఆర్ ఒక ప్రతినిధి అన్నారు. లక్ష్య సాధనకు దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకిత భావం అవసరమని అవన్నీ సిద్దిపేట ప్రజల్లో వున్నాయని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గౌరవంగా మెలగుతూ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని, ఇదే సందర్భంలో ఎలాంటి కామెంట్లు చేయవద్దని అన్నారు. ఈ నెల 26కు ముందే సత్యాగ్రహంతో సహాయ నిరాకరణ ప్రారంభించాలని, ఇది పట్టణాల కంటే గ్రామాల నుంచే ప్రారంభమయితే మరింత మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతకు మునుపు ఎమ్మెల్యే హరీష్‌రావుకు పూలమాల వేసి 365వ రోజు దీక్షలను ప్రారంభించారు.

పోరాడేటోళ్లకే కత్తి ఇవ్వాలి
తెలంగాణ కోసం పోరాడేటోళ్లకే కత్తి ఇవ్వాలి కాని, కత్తిని ఇతరులకిచ్చి హరీష్‌రావును కొట్లాడమంటే బావుండదని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తిప్పితిప్పి మళ్లీ మొదటికే తెచ్చిందని, ఇక విజయం సాధించే వరకు పోరాడాల్సిందేనన్నారు. ఉద్యమంలో నిరాశకు లోనుకాకుండా లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. పదవుల కోసం పాకులాడే నేతలను గల్లీల్లోకి రానియ్యవద్దన్నారు.

తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష
తెలంగాణ ఉద్యోగులు అణచివేత, వివక్షలకు గురవుతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగులు పెన్‌డౌన్‌కు సిద్ధమవుతారని స్పష్టం చేశారు.

గాంధీ మార్గంలో తెలంగాణ సాధన
మహాత్మా గాంధీ మార్గంలో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి విభజించి పాలించే విధానాన్ని అవలంబిస్తోందన్నారు. సిద్దిపేట జేఏసీ అధ్యక్షుడు పాపయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, టీఎన్‌జీవో నేతలు దేవిప్రసాద్, రాజేందర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, మోహన్‌లాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు 25 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతకు మునుపు రంగధాంపల్లిలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. సోమవారం దీక్షల్లో 365 మంది పాల్గొన్నారు. దీక్షా శిబిరంలో కవులు కవి సమ్మేళనం నిర్వహించి కవితా సుమసౌరభాలను వెదజ

Read more...

Thursday, December 30, 2010

SMS for Telangana

Welcome to Customer Care

Meeku "Karimnagar Kavalante 1 Nokkandi
Meeku "Hyderabad Kavalante 2 Nokkandi
Meeku "WArangal Kavalante 3 Nokkandi

Total TELANGANA Kavanlante SimaAndrola Peeka Nokkandi

Jai Telangana
Jai Jai TElangana



Free Send SMS Any Time - Any Were India or World (Any Country) and Earn money






Read more...

Tuesday, December 21, 2010

Chiranjeevi to abide by SKC’s report


Praja Rajyam president K. Chiranjeevi said he would stick to Srikrishna Committee report on Telangana and claimed that it was he who asked the Union home minister P. Chidambaram to constitute a committee to look into the Telangana issue.

He was speaking to media after taking a holy dip in Pranahita pushkarams at Arjunigutta and performing pinda pradanam to his father and forefathers.

Mr Chiranjeevi said the party would launch an agitation in Telangana over farmers problems and demanded the Centre to declare Pranahita-Chevella as national project.

Refuting suggestion that he was afraid to visit Telangana due to protests, Mr Chiranjeevi said was only staying away from tours in the region as he does not want to create unrest. He reminded that he was living in Hyderabad which is part of Telangana.

He hoped that the present government led by K. Kiran Kumar Reddy would complete its full term which is necessary to solve the problems faced by the people.

Mr Chiranjeevi maintained that he had respect for the culture and traditions of Telangana and love the people of this region and that is why he had taken part in pushkaralu.

He asserted that they had had never tried for ministerial berths and were interested only in the welfare of people and the development of the state.

He said he met Prime Minister Manmohan Dr Singh and requested him to ensure national status to the Pranahita-Chevella and Polavaram projects.


By:Simplytelangana

Read more...

చంద్రబాబు నయా అవతార్!


ఇదొక సంధి కాలం లాగ ఉంది, ఎవరు ఎపుడు ఎం చేస్తారో, ఏమి మాట్లాడతారో ఎవరికీ తెలియట్లేదు. హై టెక్ బాబు, సైబర్ బాబు గా పేరు గాంచిన చంద్రబాబు నాయుడు కూడ దీక్షలు చేస్తున్నాడు, అది కూడ రైతుల కోసం, ఇదొక మాయా బజార్ సైన్మా కాదు కదా, మామ నాటకం ఇస్తాడు, అల్లుడు ఏకంగా నిజంగా సైన్మా దీస్తాడు..వారెవ్వా! అపుడెపుడో తెలంగాణాల లొల్లి అయితుంటే బాబ్లి అన్నడు, అందరు అటు బోయిన్రు పాపం ఎవరికీ ఏంచేయాలో తోస్తలేదు మరి, ఎట్లా పోయిన పరువు కాపాడుకోవల్నో అసలు సమజ్ అయితలేదు. ఆయనని అర్జంటుగా ఇంటర్వ్యు చేయాలని బలమైన కోరిక కలుగుతుంది. బాబు అసలు వ్యవసాయం అంటే ఏందో తెలుసా? వ్యవసాయం అంటే మట్టి మనుషుల జీవితం, భూమి అంటే వారికి ప్రాణం, అందులోంచి కంపూటర్లు, చిప్లు కాదు, కూరగాయలు, పండ్లు, బియ్యం మొదలుగునవి పండును. మీ హయంలో రింగు రోడ్లు అని, హైటెక్ సిటీలని పడి పడి భూములు గుంజుకుని, ఇక్కడి భూములన్నీ మీరు, మీ బంధువులు, ఆంధ్ర మిత్రులు కలిసి దోచు కొని తింటిరి కదా. పడి పడి వరల్డ్ బాంకులో అప్పులు తెస్తిరి, మా మహిళలని అందలము ఎక్కిస్తామని , అప్పులు అలవాటు చేసి అదః పాతాలములో తోక్కిరి, ఇయాల మావోల్లు ఉక్కరి బిక్కిరి అయి చస్తున్టిరి కదా బాబు. అయ్యో! ఎంతపని జరిగింది అని ఏనాడు అయినా అనుకుంటిర? మీరు మీ పక్కన ఉండే మా పెద్దమనుషులు కాదు కాదు దద్దమ్మలు,9 అన్నేమో గాని , మా కెసిఆర్ అన్న మంచి పేర్లు పెడతాడు) అయన కడుపు సల్లంగుండ, ఆ భూమి దూరం అయిందని, కరెంటు అందలేదని మా మనుషులు నీ హయంలో ఎంతమంది చచ్చిపోయిన్రో చెప్పమంటావా? నువ్వు బొందపెట్టిన మీ మామగారు, మీదేసంలో బియ్యం పండుతాయని, వాటిని తెచ్చి మామీద రుద్దనీకి రెండు కిలోల బియ్యం పధకం పెట్టి, మా జొన్నలు, రాగులు, సజ్జలు, తైదలు, ఉలవలు ..మా తెలంగాణా పంటలన్నిటికి దూరం చేసిండ్రు.. అయి తిని మొత్తం రోగాల బారిన బడుతున్నాం బిడ్డ, అయినా మా మెదక్ జిల్లాల అక్కలు గివ్విటితోటి మస్తుగ వంటలు చేస్తున్రు. మీవోల్లకి అన్ని రైసు మిల్లులాయే, మాకేమో సావుల కోసం రేసులాయే, ఎంత పని చేస్తివి బిడ్డ బాబు , ఒక్క నాడన్న ఈ రైతులు గురుతుకు రాక పాయె.

మీ బతుకులేమో కాని బాగా జాలేస్తది సూస్తుంటే, సివరాకరికి ఉద్యమాలల్ల కూడ కాపి కొడ్తే ఎట్లనే అన్న ! మీ విద్యార్తులు కాపి కొడతారు, మీరు కూడా కాపి కొడతారు, అసలు తుపాకి గొట్టం తో తప్ప నీకు ఎపుడైనా జిందగీల, దేనికైనా దీక్ష చెయ్యాలని అనిపిచ్చింద ? నీకు నీ కులపోల్లు, ,మీ ప్రాంతపోల్లు ఎంతమంది వ్యవసాయంల ఆత్మ హత్యలు చేసుకున్రు తండ్రి? పురుగుల మందు , పెరుగన్నంలేక్క తిన్నరు ఎన్నడైనా మీవోల్లను లేక్కడిగితివా? కరెంటు కోసం రోడ్డుమీద పడ్డ మా వోల్లను, హైదరాబాదుల , నట్ట నడి బొడ్డున బషీర్ బాగ్ ల పిట్టల్లెక్క కాలిస్తివి కదా, ఒక్క సారి పానం విలువ ఏందో అలోచిస్తివా, ఎన్ని సావులు ఎన్నెన్ని సావులు నీ హయాంల, రక్తం మరిగిన పులి లెక్క, ఉద్యమాలని, ఉద్యమ కారులని పొట్టన బెట్టుకున్టివి కదనే . చేనేత చావులకి, రైతన్న చావులకి, మైక్రో చావులకి, పోలేపల్లి సావులకి, భూములు పోగొట్టుకుని సావులకి,సింగరేణి సావులకి, పాలమూరు లేబరు గోసలకి, ఉద్యోగాలు పోయి, ఆకలి సావులకి నువ్వు కారణం కాదా?

అవును తుఫాన్ వచ్చింది, మా పంటలు పోయినాయ్, మీకు కూడ పోయినాయ్ , బతుకులు ఆగమైతున్నాయ్, నిజమే, మా తెలంగాణకి ఇవన్ని మామూలే, సావులు సూసి సూసి మా బతుకులు మొద్దు బారినయ్, ఒక వైపు తెలంగాణా పేరు మీద ఒక సంవత్సరంల ఆరువందల సావులు, మరొక వైపు తుఫాను, కరువు కాటకాలు..అయినా మీ పబుత్వాలు, మీ పాలకులు, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? మీవోల్లు తలసుకుంటే ఎంతసేపు ఆదుకొవడం , ఆడుకొవడం? దీనికి ఇంత డ్రామాలు ఎందుకు తండ్రి? మల్ల తెలంగాణకి అడ్డం పడదామని అనుకొంటున్నావా? నువ్వు, నీ జేజమ్మలు ఎంతమంది వచ్చినా ఏమి చేయలేరు ఇపుడు..లగడపాటి దీక్షలు చూసినం, మీ విద్యార్తుల దీక్షలు చూసినం, నువ్వు కొంచెం తెలివైనోడివి కదా, ఏకంగా హైదరాబాద్లనే దీక్ష అంటున్టివి, లేకపోతె మల్ల సినిమా లెవెల్ల పారిపోయి రావలె కదా..అల్ ది బెస్ట్ ! నీకు రాజకీయ జీవితం ఇచ్చింది తెలంగాణా, మల్ల నీ నాటకాలకి ఈ ప్రాంతమే దిక్కు. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి రుణపడి ఉన్నవని గుర్తుకు పెట్టుకో..

డ్రామాల బాబు! ఇంక మేము చూడలేక పోతున్నాం , ఇంక చాలించు..మీ ప్రాంతానికి పోయి మల్ల ఎలక్షన్ల కి ప్లాన్లు ఏసుకో, ఎమన్నా ఎవరన్న మిగిలుంటే !

జై తెలంగాణా!


By:simplytelangana

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP