Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telangana Kavitham. Show all posts
Showing posts with label Telangana Kavitham. Show all posts

Saturday, October 22, 2011

ఆమరణ దీక్ష మేము అడిగినామా..?



ఆమరణ దీక్ష మేము అడిగినామా..?
సాదిస్తున్నర... లేక సాగదీస్తున్నర...
మా పొయ్యింట్ల ఇంగ్లం ఎయ్యనియ్యకుండ
రెండ్రోజుల కొక్కన్ని కాటి గడ్డకు పంపుతున్నరు
ఒకని మూడొద్దులు చెయ్యకముందే
ఇంకోడు పాణందీసుకుంటుండు
ఒకని దినాలకు ఇంకోని శవ యాత్ర అడ్డమొచ్చే
కానీ...
ఒక లంగ గాని జిత్తుల మారి ఎత్తు మరిచిపోక ముందే
ఇంకొకడు దుశ్శాసనుల పొత్తు పెట్టుకుంటుండు
ఏం పరాశ్కమాడుతున్నర..?
ఒక దిక్కు సావొద్దు... బతికి సాదించుకుందాం అనుకుంట
ఇంకో దిక్కు నన్నెవడన్న ఆపితే ఆత్మ బలిదానం చేసుకుంట అననీకె
ఏం పీకావని... ఇంకేం పీకుతావని...

మస్తుగా జూసినం నీ లాంటి దొమ్మరోల్లను...
ఆమరణ దీక్ష అనే పదానికి అర్థం
ఒట్టు పెట్టుకున్న ఏ ఒక్కడు చెప్పలే ఇప్పటి దాక...
కట్టగట్టుకోని మీరందరు కూసొండి...
మిమ్ల ఆపనీకే ఎవడొస్తడో మేము కాపలగాస్తం...
మీరు సచ్చే దాక దగ్గరుండి సూసుకుంటం... నీళ్ళు, పండ్లు ఎవడు అందియ్యకుండా...
సచ్చిన మీ శవాల మీద
పాత శాట డప్పులు గొట్టుకుంట కాముని పున్నమి జేసుకుంటం

ఉందా దమ్ము... కూసుంటారా ఆమరణ దీక్షకు...?
తెలంగాణ ఒచ్చేదాక... లేక మీరు సచ్చే దాక...

-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి

Take By: Yuvatelangana - Email

Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, schools closed, TRS,




Read more...

Monday, October 17, 2011

వీర తెలంగాణా--విప్లవ తెలంగాణా -- మళ్లీ చరిత్ర పుటల్లోకి ఎక్కి తీరుతుంధీ


సకల జనుల సమ్మె
పోరాటం సాగుతూనే ఉంధీ
రోజులు గడిచిపోతున్నాయి
స్పంధించని  -- సోనియా--కాంగ్రెస్ ప్రబుత్వం

ఆకలి చావులు
ఆత్మ హత్యలు
వీర మరణాలు
నెత్తుటి మరకలు
అన్ని  ఆ ను భ వించాం
60 ఏండ్ల చరిత్ర లో----

స్వేచ్చలు లేవు
హక్కులు లేవు
నీళ్ళు లేవు-- నిధులు లేవు
ఉ ధ్యో గాలు లేవు---
ఎగతాళి
పరాయి తనం
భా ని సత్వం
అన్ని  భరించాం-- సహించాం
ఎంతకాలం-- మా కీ   తాకట్టు బ్రతుకులు ??
ఎప్పుడు విముక్తి ??  ఎన్నడు ?? ఇంకెన్నడు ???
 
క లీ క లీ  మనసులతో
కలవ రాం చెంధూ  తూ
బ త క లేక
ఛా వ లేక
భుగులు తో
ఆగాం అయిపోయేధి -- యెన్నాళ్ళు ??ఎన్ని ఏళ్లు  ???

అన్నలు-- ఆక్కలు
కార్మికులు-- కర్షకులు
వి ధ్యా ర్థు లు-- మే ధా వు లు-- లాయర్లు
కధం తొక్కుతూ
జై తెలంగాణా  -- పధం పాడుతూ
క ధీ లింధీ  తెలంగాణా
 
ప్రతి ఊళ్ళో
ప్రతి వాడాలో
 కొమరన్నలు
ఐ లమ్మ లు
కొమురాం భీమన్న లు
కాళోజీ లు
జనార్ధన రా వు లు
జయ శంకర్ లు ఉన్నారు
ఈధే మన ఆఖరి పోరాటం
కదలండి--పదండి ముంధుకు
అంటూ--పిలుస్తున్నారు--ఆశిసులు ఇస్తున్నారు

ఈ పోరాటం
ఈ యుద్దం
ఈ ఉద్యమం
ఈ తిరుగు బాటు
ఆగాధూ---

యిధి కాలే కడుపుల
స్వచ్చంధ పోరాటం
తెలంగాణా  సాధించే ధా క
గళం ఎత్తు  తాం
నెల కోరుగుతాం
మళ్లీ  తెలంగాణా సాయుధ  పోరాటం లా  ???
వీర విప్లవ తెలంగాణా
మళ్లీ చరిత్ర పుటల్లోకి ఎక్కి తీరుతుంధీ
తుధి విజయం
అప్పుడు-- ఇప్పుడు -- ఎప్పుడు    మన ధె
 
 
మోసం-- ధగా -- కుట్ర లు-- అన్యాయం- అణిచీవేతలు
తెలంగాణా జిల్లా  ల కు
కొత్త  పే ర్లు అవుతున్నాయి
కాంగ్రెస్ రాజ్యం లో
సోనియా రాజరికం లో

నెల రోజులు కావ  స్తుంధీ
ఇంకా
తెలంగాణా-- కాంగ్రెస్ రాజకీయం లో
కాంగ్రెస్ అధిష్టానం లో
ఫుట్ బాల్ లా----
గంట కోక మాట
రోజు కు ఒక వార్త ?? తేల్చక /???
 
ఇప్పటి కి
గెలుకుడు రాజకీయాల తో
అభద్దా పు వార్త ల తో
ఎగురు ఎగురు ముచ్చట్ల తో
కొత్త మోసాల కు --పన్నాగాలు పన్నుతూ
పాచికలు వేస్తూ----
మళ్లీ మాటల గారడీలు  ???

ఇప్పుడు
ఈ గిమిక్కులు పని చేయవు
నాలుగు కోట్ల గుండెల్లో రాజుకున్న మంటలు
తెలంగాణా వచ్చే ధా క చల్లారా వు
జాప్యం
లేనిపోని తీర్మానాలు
ప్రెసిడెంట్ పాలన
సమ్మె రోజులు -- సెలవు ధినాలు గా చూస్తాం
ఇక ఈ కూతలు వద్ధు

రాష్ట్రం లో
ఇపుడు నడుస్తుంధీ
ప్రజల రాజ్యం  కాధూ
కాంగ్రెస్ రజాకార్ల రాజ్యం
అపుడు పోరాడి విజయం సాధించాంera
ఇపుడు తెలంగాణా సాధించి తీరుతాం
జై జై తెలంగాణా
-----------------------------------------------------
బుచ్చి రెడ్డి
 
 
Take By: Yavatelangana - send Email


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed, TRS, Banswada, TRS win Banswada,
 

Read more...

Sunday, October 9, 2011

Telangana Kavitham,

 
this Image Click  ZOOM



Read more...

Saturday, October 8, 2011

లేచింధీ తెలంగాణా కదిలింధీ తెలంగాణా

లేచింధీ తెలంగాణా
కదిలింధీ తెలంగాణా
గళం విప్పింధీ తెలంగాణా
తి రు గ బడ్డ ధీ తెలంగాణా
పోరాడుతుంధీ తెలంగాణా--

మా అరుపులు-- మా కేకలు
మా ఊరేగింపులు
మా ని నా ధా లు
మా ప్ర ధ ర్ష న లు
మా నిరసన లు---రాస్త రోకులు-- బంధ్ లు
రోజులు గడుస్తున్నా
సకల జనుల సమ్మె ను
గుర్తించని కాంగ్రెస్ ప్రబుత్వం
తెలంగాణా తగల బడుతున్నా
స్పంధించని కాంగ్రెస్ కోర్ క మే టి
ఏధి ప్రజాసామ్యం ??? ఎక్కడ ఉంధీ ???

ఈ పోరు ఆ గ ధు
ఈ ఉద్యమం చల్లా ర ధు
తెలంగాణా గార్జిస్తుంధీ
ఎలాంటి బలి ధానాల కయినా
ప్రాణాలు ఇచ్చి అయినా
తెలంగాణా సాధించు కుంటాం అంటూ
సకల జనుల సమ్మె -
సాగుతూనే ఉంతుంధీ
ప్రజల కోరిక
పాలకులు గుర్తించ నంత కాలం
ఈ పోరు మందుతూనే ఉంటుం ధీ

కాంగ్రెస్ కోర్ కమెటి నేతలు
కళ్ళు తెరవండి
నిజాల్ని చూడండి
నాలుగు కోట్ల గుండె చప్పుళ్లు వినండి
ప్ర జా గర్జన-- తెలంగాణా గర్జన
తెలంగాణా సాదించే వరకు
మ్రోగుతూనే ఉంటుం ధీ

వాయిధాలు
కమెటి ల ఏర్పాట్లు-- పర్యటనలు
గిమిక్కులు
లాలూచీ ముచ్చట్లు
కళ్ళు బొల్లి వాగ్ధానాలు
ఏ ట్రిక్స్
ఇపుడు పని చేయవు
ఆ స్టేజ్ ధాటి పోయింధీ
మాకు మిగిలింధీ
ఒకటే ధారి---- వీర తెలంగాణా

సీమాంధ్ర నేతలు-
బెదిరింపులు వద్ధు
( తెలంగాణా ఇస్తే ఆంధ్ర లో కాంగ్రెస్ ఉం డ ధు )
మా బ్రతుకుల ను శాసించకండి
మా నోర్ల ను నొక్కేయ కండి
మా హక్కుల ను కాల రాయ కండి
ఇంకా దోపిడీ లు-- మోసాలు వద్ధు
వలస పాలన మాకోద్ధూ
మా పాలన మాకు కావాలి
మాకు విముక్తి కావాలి
మంచిగా వీడి పో ధాం
2 తెలుగు రాష్ట్రాలు గా కలిసి బ్రతుకుధామ్

రోజులు గడిచినా
పేగులు మా డి నా
గొంతులు బొంగురు పోయినా
రాష్ట్రం లో పాలన స్థంబించి పోయినా
ఊపు అంధు కుంటున్న ఉద్యమం
రోజు కోక మలుపు తిరుగుతూ---
సాగుతూనే ఉంటుం ధీ--- ఆగాధూ

లేచింధీ -- వీర తెలంగాణా
పిడి కి లు ఎత్తి కదిలింధీ -- విప్లవ తెలంగాణా
తీరుగ బడి౦ ధీ తెలంగాణా
ఈ పోరాటం లో
తుధి విజయం మాధే
ఆధె సత్యం -- అధె నిజం
జై జై తెలంగాణా

------------------------------------
బుచ్చి రెడ్డి

Read more...

Thursday, October 6, 2011

రాయమని నా పెన్ను ఉరుకులాడినా నా తెలంగాణ ఇంట్ల పీనుగుంటే

రాయమని నా పెన్ను ఉరుకులాడినా
నా తెలంగాణ ఇంట్ల పీనుగుంటే
రాయనీకె నా మనసొప్పుత లేదు...
ఎడమ చేతి పిడికిలి లాగ కుడి చేతిలో పెన్నుగూడ 
బిర్రుగ బిగుసుకుంది... సుక్కవెట్టనీకే కూడా కదలక
కన్నీటి సుక్కలతో కాయితం తడిశిపోతుంది...
ఏం రాయాలి "మీ" గురుంచి..?
ఆత్మ బలిదానం చేసిన వీరులనా..? 
అంతరాత్మ ను జయించలేని పిరికోల్లనా..?
అన్ని మరిచి... 
అన్నదమ్ములను అమ్మ నాన్నను 
అయిన వారిని కాని వారిని...
ఆగమైన ఆ గుండెలను...
ఆత్మ వంచన చేసుకోమంటిరి
వినూత్న రూపాలలో తెలంగాణ ప్రజానీకం
నిరసన తెల్పుతున్నదనీ
ఇంకే కళ మీకు లేనట్టు... రానట్టు... 
చావే ఒక కళ అనుకుంటిరనా..?
అటికే కింది మషి బొట్టు దిష్టి సుక్కలాగ
నీ సావుతో సకల జనుల సమ్మెకు దిష్టి తీస్తిరనా..?
తెలంగాణ ఇండ్లల్ల ఏడుపు పెడబొబ్బలు కరువైనవనుకుంటిరనా..?
ఇంతటి త్యాగం ఇంకెవడు చెయ్యలేడనుకుంటిరనా..?
ఊరి బయటి బొందల గడ్డ మీద మీకు కన్ను పడ్తదని
పాపం... ఏ ఊరు కలగంటది రా..?
ఇట్ల సచ్చినోల్లకు పిండంబెడ్తే 
తెలంగాణ నల్ల రేగట్ల పండిన అన్నం మెతుకుగూడ
నారాజ్ అయితదేమో...
ఆగరా ఇంకా..? ఈ సావులు ఆపరా ఇంకా..?
ఆలోచించుండ్రి...
ఆగం కాకుండ్రి...
మమ్లను ఆగం జెయ్యకుండ్రి...
                    -- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి

Read more...

Saturday, June 25, 2011

Eulogy on Prof. Jayashankar : ఏమైతవు నువ్వు నాకు

ఓయే సారు ఏమైతవు నువ్వు నాకు
నవ్వి ఊకుంటవు నువ్వే చెప్పాలన్నట్టు
తొవ్వపోటీ కలిస్తే బాటసారి వనుకున్న
ముందుపడి ఏదుర్కుంతే మాటకారి వనుకున్న
భాషని వెక్కిరిస్తే ఊకోవద్దు అని
ఎకసెక్కలు ఆడేటోని భాషణే ప్రశ్నిశ్టివి
పట్టుమని పది మంది నీ వెంటలేకపోయిన
కోట్లమంది ప్రజలని ఏకం చేస్తివి
ఆ పదం పలికితే నిషేధం అన్న తాన
అనకపోతే నిషేధం అనేటట్టు చేసి
నా బతుకంత తెలంగాణది అని
నవ్వుతూ పోరాడినట్టు
నడక నేర్పి, నడత నేర్పి
బక్కటోని చేతికి హక్కు బల్లెం ఇచ్చి
బలిమిటి చేకూర్చిన నువ్వు
ఇక సెలవు, నమేస్తే తెలంగాణ అంటే
జయశంకరు సారు నీ పక్కన ఉండడని
నమ్మిన విలువలు ఉంటాయని తెలిసి
ఏమైతవు నువ్వు నాకు అని ప్రశ్నిస్తే
అదే నవ్వు, పూల వాన కురిసినట్టు

Read more...

Thursday, March 17, 2011

ధ్వంస’ గౌరవం

ధ్వంస’ గౌరవం

——————–
తెలుగు  భాషాభిమానులార…తెలంగాణా  వీరులారా
విగ్రహాలం  కాదు  మేము.. ..నిగ్రహం  కోలిపోఇన  జాతి  రత్నాలం
దంద్వ నీతి చూడలేక ….’ధ్వంస’ గౌరవం కోరినం
మా  విముక్తి కి  మీకిదే  మా  క్రుతజ్ఞాతాభివందనం ….
‘హుస్సేన్’ గౌరవార్ధం ‘కుతుబ్  షా’ నిర్మించిన వారిది పైన
తెలుగు  జాతి  కి  చిహ్నాల  మైతిమి …తెలంగాణా  పోరు కి  సాక్షాల  మైతిమి …
వీర  చెరిత్ర కి  చెరమగీతం  పాడుతుంటే…
ఎర్ర ప్రగడ , ‘ఎర్రని’  కళ్ళ తో  తెలిపిన  ‘ప్రగాడ ‘ సానుభూతి  ఒకవైపు ….
దాశరథి  ‘తెలంగాణా  దాహార్ది ‘ కి  ఇంకా  నీల్లందకుంటే …
కన్నీటి  సాగరం  ఐన ‘హుస్సేన్  సాగర్’  ఒక  వైపు …
అభాగ్యుల  ‘భాగ్య  రెడ్డి ‘ దౌర్భాగ్యం చూసి ….
బావురు మన్న  బమ్మెర  పోతన  పోరు  ఒక  వైపు …
తోటి  మన్నెం  వీరుడు  కొమరానికి  చోటు  లేదాయే  అని
అల్లూరి  ఆక్రందన  ఒకవైపు ….
అమాయకుల  ఆత్మార్పనల  తో .. ఆత్మక్షోభ  ఒక  వైపు
స్వార్ధ  రాజకీయాల ….రాక్షసత్వం  ఒక  వైపు ..
నిలవలేము  ఇంక గౌతాముని (బుద్దిని) నీడలో …
నిమర్జన  మైతిమి  తెలంగాణా  పోరులో !!

— సుధీంద్ర భార్గవ

Read more...

‘మేధావి ‘ కి దారుణం జరిగింది

మేధావి ‘ కి దారుణం  జరిగింది

————————————–
దారుణం జరిగింది … దారుణం జరిగింది
నేడు మేధావికి మెదడు కరువయ్యింది
దారుణం జరిగింది ….దారుణం జరిగింది
పదవి మొహం  పెరిగి,  తెలివి తేలికయి  గాలికెగిరింది
కులపిచ్చి గజ్జి  హెచ్చి …. ‘మేధావి’ రూపు దాల్చి
తెలంగాణా కు తెగులయ్యి తగులుకుంది .
తిరగ బడ్డ బిడ్డ దెబ్బ కొడితే… తల బొప్పి కట్టి బుద్ది  ఆవిరయ్యింది  !! నేడు !!
ఓ మేధావి …
సంస్కరణల స్మరణ ఘోష చేద్దువే …
ప్రజాభిప్రాయం పట్టదా??
తెలంగాణా సంస్కరణ గిట్టదా???
బడుగు జీవి బతుకు చూడు
బతుకే పోరుగ మారిన తీరు చూడు
పొలికేక పెట్టింది పొలిటికల్  JAC
ఉద్యమ బాట పట్టింది ఉద్యోగ JAC
విజ్రుమ్భించేనా ….విద్యార్థి JAC ….
విలవిల్లాడును  చూడు వలస నాయకత్వం
కాసుకొమ్ము ……..ఇది అక్షర సత్యం
ఆవేశం రాక కాదు..
ఆత్మార్పణ మా షోకు గాదు….
గాంధేయం మా మార్గం…. అహింస మా ఆయుధం
ఆత్మ గౌరవం మే  ధ్యేయం…స్వపరి  పాలనే  లక్ష్యం
సంకుచితం వీడి …మెదడుకు సాన పెట్టుకో
పంతం మాని …ప్రజా నాడి  జాడ తెలుసుకో
‘మేధావి’ పేరు …సార్థకం చేసుకో !!!!
—- సుధీంద్ర భార్గవ

Read more...

Friday, March 11, 2011

అణువణువునా అనిచేసినా  ఆగదు నా తెలంగాణ పోరు
ప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
అధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరు
అన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసం
ఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడు
ఇంకింత జోరు అందుకుంది
ఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...
ఆపగలను అన్నోడికి నా సవాల్...
                                        - కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి

By: Email-

Read more...

Sunday, February 27, 2011

In the Loving Memory of My Brave Brothers – by Syed AbdulMuqtadir

జై తెలంగాణ నినాదంతొ ధరిత్రి దద్దరిల్లింది
జిత్తుల మారి నాయకుల గుండె గుభేల్ మన్నది
నవ రాష్ట్రొద్యమానికి పునాది వేసిన మగధీరులకు
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు
కన్న తల్లి కోసం ఉద్యమించిన సాహసులకు జొహార్లు
ఎన్నొ దీక్షలు ఇంకెన్నెన్నొ ఉద్యమాలు చెసిన ధీరులను
కొనలేక,లొంగ దీసె దారి లేక, మభ్య పెట్టె మార్గం లేక
ఆశ చూపి నమ్మించి మృత్యు వాత పెట్టింది ప్రభుత్వం
అన్ని ఆఫర్లు కాలదన్ని తెలంగాణకు సై అన్నరు
ప్రాణాలిచ్చారు కాని ఆశయాన్ని వదల లేదు
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు
నా హక్కులు దొచుకున్నోన్ని నేనొదిలి పెట్టను – అరేయి 
మందీ మార్బలంతొ వచ్చి నన్ను బెదిరింప జూడకు
నేనొక్క కీకేస్తినంటె గుండె పలిగి సస్తవు
ప్రాణాలిచ్చీతందుకు మేమెప్పుడయినా సిధ్ధమే
నీ నెత్తుటి దాహం తీర్చనికి మేమంతా సిద్ధమె
తెలంగాణ సాధనకు శవాలె మెట్లయితె
మా నెత్తురుతో నీ దాహార్తి తీరుతుందంటె
కాల్చరా ముందు నన్ను, ఒక్క మెట్టు పెరుగుతుంది
నా తెలంగాణ ఒక్క మెట్టు నా వాళ్ళకు  దగ్గరవుతది
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు
కన్న భూమి పునరుధ్ధరణకు రక్త తర్పణమే ముఖ్యమైతె
నా ప్రతి రక్తపు బొట్టు నా తల్లి కోసం ఇలాగె చిందిస్తాను
అమ్మా నీ కొసం నా ప్రాణమె బలి హారం
తల్లి తెలంగాణ నీ కోసం అన్ని ఒదులుకుంటాము
ఇదే నా ప్రమాణం, ఇదే మా ప్రమాణం
నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళూ ఎందరో అమరజీవులు
వాళ్ళందరి సాక్షిగా నీకు స్వతంత్రం తెప్పిస్తాం
అమ్మా తెలంగాణా నీకు స్వతంత్రం తెప్పిస్తాం
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు 
జై తెలంగాణ , జై జై తెలంగాణ

Read more...

Telangana Intifada

ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వస్తుందన్నా , ఇధిగిధిగోవచ్చింధక్కా
మండు తున్నా అత్మల్లో రగులుతున్న జ్వాలాల్లో
బడబాజ్ఞుల్లో రుధిరాగ్నుల్లొ
పోరు మంటల వెలుగుల్లో, జ్వలిస్తున్న ఆశల్లో
కసిగ కసికసిగ,వడిగా వడివడిగా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచీంద్తమ్మి , ఇధిగిధిగో వఛిన్ధి సెల్లె
మా అమరుల ఆత్మ ఘోష మీకిప్పుడు మృత్యు ఘోషమా అమరుల ఆత్మ ఘోష మీకిప్పుడు మృత్యు ఘోష
మా వన్నె ౦  సురేంధ ర్ మొదలు మా ముస్తఫా అన్న వరకు
రక్తం చిందీంచి, అగ్గిలో బుగ్గి అయ్యీ  మా  ధిక్కు సూస్తుంటే
ఆర్తితో ఆగడుతో, కోపంతో రోషంతో
కధన్ తొక్కి యాదగిరి నర్సిమ్మలు ఉగ్రులై, రుద్రులై
దిక్కులు పిక్కటి ల్ల , లాంకోలు దద్ధరిల్ల పోరు గంట మోగిస్తుంటే
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచిందమ్మా , ఇధిగిధిగో వచ్చిందయ్యా
మన ద్రోహుల మట్టుబెట్టి, జగన్ ధన్దు చుట్ట బెట్టి
కావూరి హిల్స్ చడును చేసి, లాం కొను లంకల ధించి
జయభేరి బూర తీసి, రాయపాటి రంగు తీసి
సీయమ్ల, గవర్నర్ల మర్యాదగా సాగనంపి
లజ్జ లేని మన మంత్రుల గున్ పార్క్‌ల వంగబెట్టే
లాంగ్ మార్చ్ వచ్చిందయ్యా, ఇమ్మినెంట్లీ విమోచనయ్యా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచిందమ్మా , ఇధిగిధిగో వచ్చిందయ్యా
గౌలీగుడ గళ్లీలో, గుల్ జార్  హౌస్ సందులో
మధీన మండ్ల ల్లో , హుస్సైని అలం బురుజుల్లో
ఫీల్‌ఖానా అడుగుల్లో, బెగమ్ బజార్ నగవుల్లొ
ఆడిక్కమెట్ సదువుల్లొ, మాంకాలమ్మ పూజల్లో
భాగులతో, చెరువులతో అలరారిన మా నేల
ఈజిప్ట్ లలను , లిబియా లను, ట్యూనీషియా లను
అగ్రాణించుకున్న నేల,ఆఫ్రికన్ కేవల్రీ ఉన్న నే ల ,
ఇరానీయన్ల కన్న నే ల
కాయస్థులు, కన్నడిగులు, మరాటీలు
తమిళులు రాజస్థానీలు , మన ముస్లిం భాయీలు
కలిసి మేలిసి ఆలయ్ భలాైలు ఇచుకున్న నేల
అసలు సిసలు మా  నేల హైధారభాధు మా స్వేధం, మా స్వంతం
మరి అహంతో, మధంతో  ఇంకా ధోచుకొనే ధాహంతో కాదంటే
అధె లాల్ దర్వాజా నుండి మీ అసెంబ్లీ అని కులుకుతున్న మా హైధెరబాధు టౌన్ హాల్ వరకు
కత్తులను చేతబట్టి మీ కుత్తుకలు ఉత్తరీయా
ఎగిసి ఎగిసి పడుతున్న తెలంగాణ ఇంతిఫాదా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచింధీ భై, ఇధిగిధిగోవచ్చింది బహెన్
Jai Telangana
Bala Yugandar

Take By : Simply telangana

Read more...

Tuesday, February 15, 2011

“రాయిని గూడెం” ! ఉద్యమ రవ్వలు !!!

“రాయిని గూడెం” ! ఉద్యమ రవ్వలు !!!
——————————————
కప్పం కోసం, కత్తుల కవాతు నడిపిన
సామ్రాజ్యవాద రాజుని, ఊరవతలికి తరిమిన
‘తెలంగాణ’ ఆత్మగౌరవ ప్రతీకలైన
సమ్మక్క సారలమ్మ వారసులు వాళ్ళు !

బతుకులు చల్లగుండాలని, అమ్మలకు నిలువెత్తు
‘బంగారం’ మొక్కే ‘అబలలు’ వాళ్ళు !
నెలల ముంగటనే ‘పోరుగడ్డ’ ను
పోలీసు బందికాన చేసిన ‘సజ్జనార్’ డయ్యర్ల
నిర్బంధాన్ని నిలువునా బద్దలుగొట్టిన
నిలువెత్తు ‘రాణి రుద్రమ్మలు’ !!

అధికారమదంతో బలిసిన ‘సీమాంధ్ర’ సర్కారుకు
ఒంట్ల వణుకు తెప్పించిన, నేటి పోరుబిడ్డలు !!
ఇనుప బూట్ల చప్పుళ్ళు, వేలాడే తుపాకులు
బలిసిన శరీరాల పోలీసులు
అధికార పార్టీ గుండాల ‘హస్త’దిగ్భందనాలు
గొంతెత్తిన ఆకాంక్షతో పటాపంచలు చేసిన
కాళోజిగడ్డ బిడ్డలు వాళ్ళు !!
గుండెలనిండా ఒకే శ్వాస ‘తెలంగాణ’
ఒకే ఆయుధం, ఒకే ఆశయం
‘జై తెలంగాణ’, ‘జై జై తెలంగాణ’

- వంశీ కృష్ణ

take By: Simply telangana

Read more...

Friday, February 4, 2011

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే….. నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే !

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే

పంతొమ్మిది వందల అరవై తొమిది నుండి ||2||
ఇగ ఇస్తం ఆగ ఇస్తం అని మీరు చెప్పుతుండ్రు ||2||
ఇచ్చుడేమో దేవుడెరుగు తేచినదంతా దోచుకుండ్రు||2||
ఇచుడెందో తెచ్చుడేందో చీకట్ల చిందులేందో||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా

ఉస్మానియా క్యాంపస్లా ఉద్యమాలు రేగుతుంటే||2||
కాలేజి పోరగాల్ల కాలు చేతులిరుగుతుంటే ||2||
పుట్టకొకడు చేట్టుకొకడు పిట్టలోలె రాలుతుంటే||2||
ఉలుకు లేదు పలుకులేదు ఓదార్పు యాత్ర లేదు||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న

డిసెంబెర్ నేలమోతం దిష్టి బొమ్మలైనారు||2||
డిల్లి నుండి గల్లిదాక గాజులేసి తిరిగిండ్రు ||2||
సుద్దపూసలోలె మీరు సాపనేక్కి కూసుండ్రు||2||
నీళ్ళు ఉన్న కాడ మీరు నీలాడతనంటారు ||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న

Thanks Vinodh Kumar Mandhala for sharin

take By: simply telangana

Read more...

లాఠీలు తూటాలు తెలంగానని ఆపలేవు

కొట్టండిరా బాగ కొట్టండి
మా తలలు చిట్లేటట్టు
ఇన్ని రొజులుగా మిమ్మల్ని
నమ్మినందుకు మా మెదళ్ళు పగిలెటట్టు
కొట్టండి..లాఠీలు కాదు దుడ్డు కర్రలతో
ఒక్కళ్ళు కాదు పదిమంది కొట్టండి
బొక్కలు ఇరిగెటట్టు

మాకు ఈ శాస్తి కావలసిందె
మాకు గుడిసె కూడ లేకుండా
మీరు మా జాగల బంగ్లాలు కట్టుకున్నపుడు
చెమటోడ్చి దగ్గరుండి కాపల
కుక్కల్లెక్క గూర్ఖా లైనము
ఇదెం అన్యాయం అని ఎన్నడూ అడుగలె
ఆ మంచితనం మచ్చుకైన లెకుండా
పొయెదాక కొట్టండి

మా నీళ్ళు మీరు తోల్క పొతుంటే
అంతా మావొల్లే అని మర్యాదగా
ఉర్కొని మట్టి పని చేసుకుంటెందుకు
మూటముల్లె సర్దుకొని
ముంబయి, దుబై పొయినము ,నీళ్ళు లేక
బొర్లు ఎసుకొని బొర్ల బడి
బతుకులు ఆగం చెసుకున్నం
చావులని చల్లంగ చూసినం
నర నరాల్లొంచి ఈ మర్యాద
పొయెదాక కొట్టండి

కింద మిద బడి గింత చదువు
చదువుకుంటె కొలువులొస్తయిలె అని
ఆశ పడ్డం, ఎడినుంచొ వచ్చి
గద్దలొలె తన్నుకు పొతె
మా రాజకీయ నాయకులు
కాపాడుతరులె అని
కోటి ఆశలు పెట్టుకొని
ప్రతిసారి నమ్మినం
మా నమ్మకాలు అన్ని
నాశనం అయెటట్టు కొట్టండి

పాఠాలు నేర్సుకునే మా పిల్లల మీద
బలగాలు దింపి
బాష్ప వాయువులు ఎయండి
హక్కులు అడిగినపుడల్లా
తూటాలతో పిట్టలను
కాల్చినట్లు కాల్చండి..

రాజకీయ నాయకుల్లార
మా శవాలను తివాచిల్లాగ
పరచుకొని వాటిపై
మా రక్త మాంసాలను
అమ్ముకొని సంపాదించిన
సొమ్ములు, పదవులు ఎంజాయ్ చేస్కుంట
ఆంధ్రా నాయకుల
తొత్తులుగా మారి
మా పై జరుగుతున్న విద్వంసాన్ని
ఆహ్లాదంగా ఆస్వాదించండి

సిగ్గు లజ్జ లేని
శవ రాజకీయాలను చేసె
నాయకుల్లారా మీరు
ఈ తెలంగాన గడ్డ బిడ్డలైనందుకు
మా చావులు, మా పై విరిగిన లాఠీలు
చిందిన రక్తం, మిమ్మల్ని
కదిలించనందుకు,
మీ మౌనాన్ని చూసి
మమ్మల్ని మెమె అసహ్యించుకుంటున్నం

రాపిడిలొ పుట్టేవి అగ్గి రవ్వలే
పిల్లిని పట్టుకొని కొడితే అయ్యేది పులే
ఇక్కడ రక్తంలో అమాయకత్వం ఉంది
అట్లనే విప్లవం కూడా ఉంది
బ్రిటీష్ రాజరికపు గోడలను,
దొరల గడిలను
రజాకార్ల అరాచకాలను
కూల్చిన రక్తం
గుండుకు గుండె పెట్టిన ధైర్యం
అన్యాయాన్ని భరించ లేక
ప్రాణాలను కూడ లెక్ఖ చెయని యువ రక్తం

ఈ అణచివేతలు , ఊచ కోతలు
హింసలు విద్వంసాలు
తెలంగానని ఆపలెవు
మంచితనాన్ని , అమాయకత్వాన్ని
అణచివేస్తే వచ్చే ఆవేశాన్ని
దాని రూపాలని
అంచనా వెయలేవు
సైన్యాన్ని దింపితె
అక్కడ జరిగేది యుద్దమే
మర్యాద తప్పితే
మారణ హొమమే
మానవత్వాన్ని, మంచిని మరిస్తే
తయారయేది మానవ బాంబులే
శాంతి కావాల్న?
అశాంతి కావాల్నా తేల్చు కోండి

సుజాత సురేపల్లి


Take By: simply telangana

Read more...

9/17 Special : తెలంగాణా సమర గీతం

ఈ రేయి, ఆ రాయి చిరునవ్వుల పాపాయి
కదిలాయి, పాడాయి ఒక స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం ||2||

పల్లె కదిలింది, పిల్లా కదిలింది ||2||
పడచు కదిలింది, పడతీ కదిలింది
అది చూసిన నవాబులకు
నర నరాన, ఖన ఖనాన
ఉద్భావిందే బయోత్పాతం…… అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం

చుక్క పొడచింది, చినుకు రాలింది ||2||
మొక్క మొలచింది, మానై వెలసింది
ఆ నీడలో, జడి వానలో
యుగ యుగాన, తర తరానా
వినుపించు అనునిత్యం ఆ ప్రళయ గీతం….. అదే స్వేచా గీతం
ఆ గీతం పాడింది నవాబులకు చరమ గీతం
మరువలేము మనమెప్పుడు తెలంగాణా సమర గీతం

Thanks Vinodh Kumar Mandhala for sharing


take BY: simply telangana

Read more...

Wednesday, January 5, 2011

ఆగదు నా తెలంగాణ పోరు

ఆగదు నా తెలంగాణ పోరు
అణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
ప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
అధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరు
అన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసం
ఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడు
ఇంకింత జోరు అందుకుంది
ఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...
ఆపగలను అన్నోడికి నా సవాల్...
- కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP