Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, December 13, 2011

నిప్పుల కుంపటిపై వైద్యం



- ఇరుకు గదుల్లో ప్రైవేట్ దవాఖానలు
- నిబంధనలకు పాతరేస్తున్న యాజమాన్యాలు
- అగ్నిమాపక వ్యవస్థల్లేని 400 ఆస్పవూతులు
- ప్రమాణాలకు దూరంగా 74 కార్పొరేట్ ఆస్పవూతులు
- ఫీజులు అధికం... ప్రమాణాలు శూన్యం
- రోగులకు భద్రత కల్పించడంలో విఫలం
- నగరంలో ఫైర్‌సేఫ్టీలేని ఆస్పవూతులు
- సర్కారీ ఆస్పవూతుల్లోనూ ఇదే వైనం


steath-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ నగరంలోని ఆస్పవూతుల్లో చికిత్స కోసం వెళుతున్నారా? జాగ్రత్త. మీరు అడుగులు వేస్తున్నది దవాఖానవైపు మాత్రమే కాదు.. మృత్యువు పొంచి ఉన్న వైద్య కుహరంలోకి కూడా! నిజం. ఇది నమ్మలేని నిజం! నగరంలో 80 శాతం ఆస్పవూతుల్లో నిర్దిష్ట అగ్నిమాపక వ్యవస్థలు లేవు. చిన్నా చితకా.. ఓ మోస్తరు.. కార్పొరేట్.. మొత్తం ఆరువేల పైచిలుకు ఆస్పవూతులు, రోగ నిర్ధారణ కేంద్రాలతో మెడికల్ హబ్‌గా విరాజిల్లుతున్న హైదరాబాద్ నగరం.. భద్రత కోణంలో మాత్రం కునారిల్లుతున్నది! 50 పడకల ఆస్పవూతులు 556 ఉంటే.. అందులో అగ్నిమాపక దళం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందినవి 149 మాత్రమే! సూటిగా చెప్పాలంటే 400కుపైగా ఆస్పవూతులు అగ్ని ప్రమాదాల అంచులో చికిత్స అందిస్తున్నాయి. 91 కార్పొరేట్ ఆస్పవూతుల్లో కేవలం 17 ఆస్పవూతులకు మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు ఉన్నాయి! ఈ ఆస్పవూతుల్లో ఏ క్షణమైనా అగ్నివూపమాదాలు చెలరేగేందుకు ఆస్కారం ఉంది. అదే సమయంలో తప్పించుకుపోయేందుకూ వీటిల్లో తగిన సదుపాయాల్లేవు! ఇది అధికారులు చెబుతున్నమాట! అవును.. కోల్‌కతాలో ఆస్పత్రి నిర్లక్ష్యం భారీ మూల్యం చెల్లించుకుంది.. అదే దిశగా.. హైదరాబాద్ అడుగులేస్తోంది!

హైదరాబాద్, డిసెంబర్ 12 ():కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ కార్పొరేట్ ఆస్పవూతిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 90 మందికిపైగా రోగులు మృత్యువాతపడటంతో మెడికల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఇక్కడ ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి తరహా ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్నవి 400కుపైగా ఉండటమే ఈ ఉలికిపాటుకు కారణం! ఫైర్‌సేఫ్టీ విషయంలో ప్రధానంగా నాలుగు ప్రమాణాలు ఉంటాయి. అవి.. రోడ్డుకు అందుబాటులో ఉండటం.. ఖాళీ స్థలం, బయటి నుంచి ఏర్పాటు చేసిన మెట్లు,అగ్ని మాపక వ్యవస్థ. వీటిలో సదరు 400 పైచిలుకు ఆస్పవూతుల్లో అన్నింటిలోనూ నూటికి నూరుశాతం లోపాలే ఉన్నాయి. ఆస్పవూతులకు వచ్చే రోగుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పవూతులు.. అగ్ని ప్రమాదాల నివారణ విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి.


hospetal2 talangana patrika telangana culture telangana politics telangana cinemaనగరంలోని ప్రైవేట్ దవాఖానల్లో మౌలిక వసతులు, అగ్నివూపమాదాలు సంభవిస్తే వాటి నివారణకు లేదా.. నష్టం తగ్గింపునకు ఉన్న అవకాశాలపై ( --T---- ) పరిశీలన చేయగా నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పూర్తి స్థాయి అనుమతులు తీసుకుని ఆస్పవూతులు నిర్మించిన ఉదంతాలు పదుల సంఖ్యలోనే కనిపించాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం అగ్నిమాపక వాహనం ఆస్పవూతికి చేరుకునే పరిస్థితులు కూడా అనేక చోట్ల లేకపోవడం దిగ్భ్రాంతి కల్గిస్తోంది. ఇలాంటి నిబంధనలు పాటించే వారు నగరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నారు.హైదరాబాద్ డీఎంహెచ్‌వో పరిధిలో ఉన్న మొత్తం 1421 ఆసుపవూతులలో 2010 ఫిబ్రవరికి ముందు ఏ ఆస్పవూతికీ ఎన్‌ఓసీ లేకపోవడం విశేషం. 2010లో ఇద్దరు నర్సులు, ఒక రోగి మరణానికి కారణమైన పార్క్ ఆస్పత్రి ఘటన అనంతరం ఈ ఆస్పవూతులకు హైదరాబాద్ డీఎంహెచ్‌వో నుంచి నోటీసులు జారీ చేశారు.

ఇందులో ఇప్పటి వరకు సుమారు 120 దవాఖానలు ఎన్‌ఓసీ సమర్పించి శాశ్వత రిజివూస్టేషన్ చేయించుకున్నాయి. 2010 మార్చిలో మొదట 37 ఆస్పవూతులకు, ఆ తరువాత 78 ఆస్పవూతులకు, 2010 ఏప్రిల్‌లో 18 ఆస్పవూతులకు ఒకసారి, 130 ఆస్పవూతులకు మరోసారి మొత్తం 326 ఆస్పవూతులకు నోటీసులు జారీ చేశారు. నగరాన్ని ఆనుకుని ఉన్న రంగాడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ సుమారు 750 ఆస్పవూతులు ఉంటే.. ఇందులో కేవలం 300 ఆస్పవూతులకు శాశ్వత రిజివూస్టేషన్‌లు లేవు. కొన్ని ఆస్పవూతుల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లోనే వైద్యం చేస్తున్నారు. కొందరు నివాస గృహాలనే ఆస్పవూతులుగా మార్చేశారు. మరికొందరు తాము నిర్మించిన బహుళ అంతస్థుల భవనాల్లో ఎలాంటి జాగ్రతలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

పార్క్ ఆసుపత్రి విషాదం
hospetal1 talangana patrika telangana culture telangana politics telangana cinemaనగరంలోని సోమాజిగూడలో ఉన్న పార్క్ ఆస్పవూతిలో 2010 ఫిబ్రవరి 2న జరిగిన అగ్నివూపమాదంలో నర్సులు రెస్సా, ఉషారాణితోపాటు రోగి మంగయ్య మృతి చెందగా, మరో 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ దామోదర్‌డ్డిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 278, 336, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ కూడా చేశారు. పార్క్ ఆస్పత్రి ప్రమాదం తరువాత మేల్కొన్న సర్కారు ఫైర్‌సేఫ్టీ నిబంధనలను కఠినతరం చేసింది. ముఖ్యంగా గ్రేటర్‌లో నిర్మించే భవంతుల్లో తప్పనిసరిగా ఈ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. 15 మీటర్ల ఎత్తుదాటిన వాణిజ్య భవనం, 18 మీటర్ల ఎత్తు దాటిన నివాస భవనాలను ఈ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆయా నిర్మాణాలకు బిల్డింగ్ కమిటీలో అనుమతులు ఇచ్చే సమయంలో అగ్నివూపమాద నివారణ చర్యలపై ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.

5 లక్షలతో ఫైర్‌సేఫ్టీ పరికరాలు
ఫైర్‌సేఫ్టీ పాటించాలంటే సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ఎవరూ ఎన్‌వోసీ తీసుకునేందుకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అయితే వాటిని తనిఖీ చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైర్‌స్టేషన్‌తో సంబంధం లేకుండానే అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారని స్థానిక ఫైర్ సిబ్బంది పేర్కొంటున్నారు.

అద్దె భవనాలతో ఇబ్బందే...
సొంత భవనాలు ఉన్నవారు ఫైర్‌సేఫ్టీ పరికరాలు అమర్చుకోగలుగుతున్నారు కానీ అద్దె భవనాలలో ఆస్పవూతులు నడుపుతున్నవాళ్లు మాత్రం నానాతంటాలు పడుతున్నారు. వీటి ఏర్పాటుకు భవనాల యజమానులు నిరాకరిస్తున్నట్లు పలు ఆస్పవూతుల నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రభుత్వాసుపవూతులలో అదే పరిస్థితి...
నగరలో సుమారు 106 ప్రభుత్వ ఆస్పవూతులు ఉన్నాయి. ఇందులో పది పెద్దాస్పవూతులు. ఉస్మానియా, గాంధీ, నయాపూల్, ఈఎన్‌టీ, ఛాతి ఆసుపత్రి, కింగ్‌కోఠి, సుల్తాన్‌బజార్, ఈఎస్‌ఐ, నీలోఫర్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, నిమ్స్ వంటి ఆస్పవూతులకే ఇప్పటికీ ఎన్‌ఓసీ లేదు.


చర్యలు తీసుకుంటాం
ఆస్పత్రి లోపల వసతులపై మాత్రమే మేము పరిశీలించి అనుమతి ఇస్తాం. ఇతర శాఖల నుంచి మిగిలిన అనుమతులు తీసుకోవాలి. అయినా అసౌకర్యాలపై ఫిర్యాదు వస్తే పరిశీలిస్తాం. వారిపై చర్యలు తీసుకుంటాం. నగరంలోని ఎన్‌ఓసీ లేని ఆస్పవూతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. చాలా ఆస్పవూతులకు ఇప్పటికీ శాశ్వత రిజివూస్టేషన్లు లేవు. కేవలం తాత్కాలిక రిజివూస్టేషన్లతోనే ఆస్పవూతులను నడిపిస్తున్నారు. వారందరికీ మరొకసారి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- డీఎంహెచ్‌వో పీ ఉమామహేశ్వరి

ఈ పరికరాలు తప్పనిసరి
భవనానికి హోస్‌రీల్, ఆటోమేటిక్ డిటెక్షన్ అండ్ అలారమ్ సిస్టమ్, ఎన్‌బీసీ నిర్దేశించిన భూగర్భ నీటి నిల్వ ట్యాంక్, ఒక ఎలక్షిక్టిక్ పంప్, ఫైర్ ఎక్స్‌ట్వింగిషర్, డౌన్ కమర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి. ఎలక్షిక్టికల్ ప్యానల్ సిస్టమ్ (మాన్యువల్ ఆపరేటెడ్) 900 ఎల్‌పీఎం టెర్రస్ పంప్, బ్యాటరీతో కూడిన ఎమ్జన్సీ లైటింగ్, ఫైర్ అలారమ్ సిస్టమ్ తదితర పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

నెల రోజుల గడువు..ఇక స్కూళ్లు, మాళ్లు కమిషనర్ కృష్ణబాబు
రాజధాని నగరంలోని ఆస్పవూతుల్లో నిర్దిష్టమైన అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు నెల రోజుల గడువు విధించారు. గడువులోగా పనులు మొదలుపెట్టకుంటే మూసివేతలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఆస్పవూతుల్లో అగ్నివూపమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. పలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పవూతులు, నర్సింగ్‌హోమ్‌లతోపాటు వివిధ ప్రైవేటు ఆస్పవూతుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరంలో అగ్నిమాపక వ్యవస్థ లేని ఆస్పవూతుల వివరాలు తెలియజేశారు. వీటిలో అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకోసం ఇప్పటికే అనేకమార్లు నోటీసులు జారీచేసినా వారిలో చలనం లేదన్నారు. అందుకే తాజాగా నెలరోజుల గడువిస్తూ రివైజ్డ్ నోటీసులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఫైర్‌సేఫ్టీ ఎన్‌ఓసీ లేకుంటే ఆస్పవూతుల రిజివూస్టేషన్‌లు ఉపసంహరిస్తామని హెచ్చరించారు. సెల్లార్ కబ్జాలు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచే వాటి కూల్చివేతలు చేపడతామని చెప్పారు. ఆస్పవూతుల అనంతరం షాపింగ్ కాంప్లెక్స్‌లు, విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని కృష్ణబాబు తెలిపారు. నగరంలో 1860 స్కూళ్లు, కాలేజీలకు అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు కోసం నోటీసులు ఇవ్వగా కేవలం 300స్కూళ్లు మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు సైతం కేవలం 25శాతం మాత్రమే ఫైర్‌సేఫ్టీ ఎన్‌ఓసీలు కలిగివున్నాయన్నారు.
hospetaltalangana patrika telangana culture telangana politics telangana cinema



Take By: T News - http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=52698

Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, News, Hospitals,   
 




Read more...

సెల్యులాయుడ్ స్మైల్



Zindagi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
‘హంటర్ వాలీ’ సినిమాలో ఒక్క ఉదుటున ఎగిరి గుర్రంపై కూర్చొని సవారీ చేసిన ‘నాడియా’ కాదు. సజల నయనాలతో తెర నిండా దుఃఖాన్ని నింపిన మీనాకుమారి కాదు. అద్భుతమైన సౌందర్యంతో ప్రేక్షకుల హృదయాలలో డ్రీమ్‌గర్ల్‌గా నిలిచిపోయిన హేమమాలినీ కాదు. కానీ అలాంటి ప్రత్యేకతలు లేకున్నా స్టార్‌గా ఎదిగింది స్మితా పాటిల్. ఎందుకంటే ‘సహజ నటన’ అనే ఒకే ఒక్క ప్రత్యేకత ఆమెకున్న అర్హత, ఆభరణం. నటనే ప్రధానంగా ఆరిపోని వెలుగులు చిమ్మిన తార స్మితాపాటిల్....

‘స్వాతంవూత్యానంతరం భారతీయ సినిమాల్లో అత్యుత్తమమైన వంద సినిమాలను ఎంపిక చేస్తే పావు భాగం ఆమె నటించిన చిత్రాలే ఎంపిక అవుతాయి’ స్మిత నటించిన సినిమాల పట్ల కొందరికున్న అభివూపాయం ఇది. అంతగొప్ప నటి ఆమె. స్మిత పేరు చెప్పగానే భూమిక, మంథన్, గమన్, చిదంబరం, ఆక్రోష్, చక్ర, అర్థ్, అర్థ్‌సత్య, మిర్చిమసాలా, దేబ్‌శిషు వంటి దృశ్య కావ్యాలు గుర్తుకువస్తాయి.

నవ్య ధోరణికి అండగా...
న్యూస్ రీడర్ నుంచి మరాఠీ థియేటర్ ఆర్టిస్టుగా మొదలైన ఆమె కెరీర్‌లో తొలిచిత్రం అరుణ్ కోప్‌కర్ డిప్లొమా కోసం తీసిన ‘తీక్షిశామాధ్యం’. ఆ తర్వాత శ్యామ్‌బెనెగల్ తీసిన చిత్రం ‘చరణ్‌దాస్ చోర్’(1975)లో. స్మిత నటిగా ఇండవూస్టీలోకి వచ్చిన సమయంలో భారతీయ నవ్య సినిమా ధోరణి ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. అప్పటి దాకా సత్యజిత్‌రే, మృణాల్‌సేన్ వంటి వారు నవ్య సినిమాను తమ భుజాలపై మోస్తుంటే, ఆ ఉద్యమానికి ఊతమిస్తూ శ్యామ్‌బెనెగల్, బుద్ధదేవ్‌దాస్, ఆదూర్, అరవిందన్, గౌతమ్‌ఘోష్ వంటి కొత్త తరం దర్శకులు రంగ ప్రవేశం చేశారు. వాళ్లకు ఓంపురి, సీర్‌ద్దీన్‌షా, షబానాలతో పాటు స్మితాపాటిల్ వంటి నటి తోడు కావడంతో భారతీయ నవ్య సినిమా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోగలిగింది.

ఎన్నో పాత్రలు.. ప్రశంసలు
అయితే స్మితాపాటిల్‌కు కలిసొచ్చిన అంశం... శ్యామ్‌బెనెగల్ దృష్టిలో పడటం. ఎందుకంటే ‘నిశాంత్’ (1975) చిత్రంలో నటించిన తరువాతే స్మిత పరిక్షిశమ దృష్టిలో పడిపోయింది. ఆ వెంటనే వచ్చిన మంథన్ (1976)లో హరిజన స్త్రీగా నటించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నది. గ్రామీణ జీవితానికి అద్దం పట్టిన ఈ చిత్రం డాక్టర్ కురియన్ ప్రారంభించిన శ్వేత విప్లవ నేపథ్యంలో అగ్రవర్ణాల- హరిజనుల నడుమ సామరస్యాన్ని నెలకొల్పడం ప్రధాన అంశంగా తయారైంది. ఈ సినిమాలో స్మిత నటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మంథన్ తర్వాత శ్యామ్‌బెనెగల్ తీసిన ‘భూమిక’ (1976)లో స్మిత నటన హిమాలయా శృంగాన్ని అందుకున్నది. స్వతంత్ర భావాలు గల యువతిగా, స్త్రీ వాదిగా తెరపై ఆమె ఒదిగిపోయింది. తొలితరం హిందీ- మరాఠీ చిత్రాల నటి హంసా వాడే ర్ (లోక్ శాయర్ రాంజోషి- 1947) జీవితకథే భూమిక చిత్రం. ఆ చిత్ర కథ ఏమిటంటే... ఆమె జీవితంలో నలుగురు మగాళ్లకు స్థానం ఉంటుంది. జీవితం గురించి సరైన అవగాహన లేని వయస్సులోనే తన తల్లి స్నేహితుడు, పర్సనల్ సెక్రటరీ(అమోల్‌పాలేకర్)తో వైవాహిక జీవితం విసుగు చెంది దర్శకుడి (అనంతనాగ్)తో కలిసి జీవిస్తుంది. అతనితోనూ ఇమడలేక, ఆ తర్వాత రచయిత(నసీర్)తో, మరికొంత కొంతకాలం ఓ ఫ్యూడలిస్టు (అవూమిష్‌పురి)తో కూడా కలిసి ఉంటుంది. ఎక్కడా ఇమడలేక చివరికి స్వతంవూతంగా బతుకు సాగించాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ చిత్రంలో అమోల్ పాలేకర్, స్మితలు పోటిపడి నటించారు. ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా ‘ఊర్వశి ’అవార్డు వచ్చింది. ‘ఆక్షికోష్’ చిత్రంతో ఆమె రెండోసారి ‘ఊర్వశి’ అవార్డు అందుకుంది.

పన్నెండేళ్లే...
సహజనటిగా స్మిత సాధిస్తున్న విజయాల పరంపర చూసిన సత్యజిత్‌రే వంటి మహాదర్శకులు సైతం ఆమె ఇంటి తలుపు తట్టారు. ఆయన దర్శకత్వంలో స్మిత ‘సద్గతి’, ‘పికూ’ చిత్రాలల్లో నటించింది. ఇలా వరుస సినిమాల్లో ఒకదానికొకటి విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తన సినీ జీవన జైత్రయావూతను కమర్షియల్ తారలకు తీసి పోకుండా కొనసాగించడం భారత సినీ పరిక్షిశమలో ఒక్క స్మితాకే సాధ్యమైంది.

మహేష్‌భట్ ముక్కోణపు ప్రేమకథతో తీసిన ‘అర్’్థ లో షబానా ఆజ్మీ భార్యగా నటిస్తే, స్మిత ప్రేయసిగా నటించింది. వివాహేతర సంబంధాల కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో ప్రియుడి పట్ల వెర్రి వ్యామోహం చూపే నటనతో ఆమె డామినేట్ చేసింది. స్మిత, షబానాలు ఈ సినిమాలో పోటీపడి నటించారు.

స్మిత నటించిన చిత్రాలల్లో ఇంకా ప్రస్తావించుకోదగిన వాటిలో చిదంబరం, నక్సలైట్, భిగిఫల్కే, అనోఖి రిస్తా, అమృత్, పేట్ ప్యార్ అవుర్ పాప్, వారిస్, అంబర్త...ఇలా చాలా చిత్రాలే ఉన్నాయి. 12 ఏళ్ల కాలంలో మొత్తం ఆమె నటించిన చిత్రాలు 85. వీటిలో హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి, మలయాళం, తెలుగు భాషల్లో ఉన్నవి. తెలుగులో ఆమె నటించిన చిత్రం ‘అనుక్షిగహం’.

పద్మశ్రీగా..
ఆర్ట్ సినిమాల్లోనే కాకుండా స్మిత ‘నమక్ హలాల్’, ‘శక్తి’, ‘బద్లే కి ఆగ్’, ‘ఆజ్ కి ఆవాజ్’ వంటి కమర్షియల్ చిత్రాల్లో నాయకిగా నటించి మెప్పించింది. స్మిత రెండుసార్లు జాతీయ అవార్డును, ‘అంబర్త’ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డు, కేంద్ర ప్రభుత్వ ‘పద్మశ్రీ’(1985)అవార్డులు అందుకున్నది. ప్యారిస్‌లో ఆమె చిత్రాలతో కూడిన రెట్రాస్పిక్టివ్ ఒకటి జరిగినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు కోస్టాగావూవిస్ స్మితను సన్మానించారు. సత్యజిత్‌రే తర్వాత ఇలాంటి గౌరవం అందుకున్న ఏకైక భారతీయ కళాకారిణి స్మితనే.

ఫ్యామిలీ నేపథ్యం
స్మితా పాటిల్ 1955లో పూనాలో మహారాష్ట్ర రాజకీయ నేత శివాజీరావ్ పాటిల్ ఇంట పుట్టింది. తండ్రితో ఆమె సంబంధాలు అంతంత మాత్రమే. తల్లి విద్య ఒక నర్స్. తల్లిదంవూడుల మధ్య సరైన అనుబంధం లేని కుటుంబ వాతావరణంలో నర్సింగ్ క్వార్టర్స్‌లో ఆమె పెరిగింది. ఆడపిల్లలా కాకుండా ఆత్మవిశ్వాసంతో అబ్బాయిలను సైతం హడపూత్తించేది. మగ రాయుడిలా మోటార్ బైక్ రైడింగ్ చేసేది. సెంట్ జేవియర్ కళాశాలలో చదివేందుకు బొంబాయి రావడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడే శ్యామ్‌బెనెగల్ స్మితను తొలిసారిగా చూశారు. సినీ నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడు అప్పటికే వివాహితుడైన రాజ్ బబ్బర్‌ని పెళ్లిచేసుకోవడం, తల్లి కావాలనుకోవడం, ఇండవూస్టీని విస్మయ పరిచింది. కానీ ‘కెరీర్‌కన్న మాతృత్వపు మాధుర్యమే గొప్పదని’ చెప్పింది స్మిత.

దురదృష్టం...
అయితే 1985లో మలయాళ చిత్రం ‘ చిదంబరం’ షూటింగ్‌లో ఉండగా ఆ చిత్రంలోని సహనటుడు గోపితో ‘నాకెంతో సమయం లేదు. వచ్చే ఏడాది డిసెంబర్31 తర్వాత నేను ఈ లోకంలో ఉండను. నా జీవిత కాలం ఒక ఏడాదేనని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు’ అని చెప్పింది. విచివూతమేమిటంటే... ఆ మాటలు అబద్ధం కాలేదు. ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చాక 1986 డిసెంబర్13న తన జీవన నాటకంలో పోషిస్తున్న భూమికను ముగించింది. భారతీయ సినిమాకే ఆమె మరణం ఎన్నటికి తీరని లోటైంది. స్మిత మరణించినప్పుడు భారతదేశంలోని అన్ని భాషల పత్రికలు ఆమెకు నివాళిగా సంపాదకీయాలు రాయడం గొప్ప విషయం.

చివరగా- ఎందరో సినీ విమర్శకులు స్మితను ప్రముఖ నటి షబానా ఆజ్మీతో పోల్చిన సందర్భాలున్నాయి. కాని ఎవ్వరితోను పోల్చనలవి కాని నటిమణీ ఆమె. వాస్తవిక సమాంతర చిత్రాల అభినేవూతిగా స్మితాపాటిల్ భారతీయ చిత్ర రంగంలో సృష్టించిన చరిత్ర మరెవ్వరికి సాధ్యం కాదు.

స్మిత అంటే ఒక హరిజన స్త్రీ..
ఓ గిరిజన మహిళ..
సగటు స్త్రీ....
గరీబ్ ముస్లిమ్ ఔరత్..
వేశ్యా పాత్రధారి..
ధైర్యశాలి...
ఇలా ఎలాంటి భూమికకైనా జీవం పోసే అరుదైన నటి స్మితాపాటిల్.
నేడు ఆమె వర్ధంతి
సందర్భంగా
ఈ నివాళి.


రిస్క్‌ను కూడా
స్మిత తన పాత్ర పోషణలో ఎంత శ్రద్ద తీసుకుంటుందో, ఆ పాత్రను పండించడానికి కూడా అంతగా రిస్కు తీసుకునేది. దేబ్‌శిశు సినిమా కె్లైమాక్స్ షూటింగ్ నాటి సంఘటనే దానికి సాక్ష్యం. ఈచివూతంలో సీత పాత్రలో స్మిత ఓ కలగంటుంది. ఆ కలలో కాళికగా మారి కత్తి చేత బట్టి ప్రతినాయకుడిని మట్టు బెడుతుంది. ఈ సన్నివేషం షూట్‌చేసే రోజున గాలి వానతో వాతావరణం అంతా అల్లకల్లోలంగా ఉండింది. దీంతో షూటింగ్ కుదరదని దర్శకుడు ఉత్పలేంద్ చక్రవర్తి చెప్పినా ఆ వాతావరణమే సన్నివేషానికి బలాన్నిస్తుందని మంచి బ్యాక్ డ్రాప్‌గా ఉంటుందని పట్టుబట్టి షూటింగ్ జరిపించింది. నిజంగా కూడా ఆ సన్నివేషమే సినిమాకి ప్రాణం పోసిందని విమర్శకులూ ప్రశంసించారు.

అమ్మను సినిమాల్లోనే చూస్తాను
‘మా అమ్మ నటనను నేను అమితంగా ఇష్టపడతాను. నేనామెను బయట ఎన్నడూ చూడలేదు. కాని సినిమాల్లోనే చూసుకుంటాను. సినిమాలు చూడటం ద్వారానే ఆమె నాకు తెలుసునన్న భావన కలుగుతుంది. ‘నమక్ హలాల్ ’ చిత్రంలో అమితాబ్‌తో కలిసి అమ్మ పాడిన ‘ఆజ్ రపట్ జాయేతో హమే న ఉఠయ్యో’ పాట నాకెంతో ఇష్టం’
-- ప్రతీక్ బబ్బర్ (స్మితాపాటిల్ కొడుకు)


‘నటనలో సున్నితత్వం, భావోద్వేగాల అభివ్యక్తీకరణలో నూతనత్వాన్ని ఆవిష్కరించిన స్మితా పాటిల్ భారతీయ సినిమాల్లో నటీమణుల అందానికి ఉన్న పూర్తి నిర్వచనాన్నే మార్చివేసింది’
-- గోవింద్‌నిహలని.

‘స్మితకు పెట్టని ఆభరణాలు ఆమె కళ్లు. కదలకుండానే అద్భుతమైన నాటకీయకతను పండిస్తుందామె. హావభావాలతో శృంగార రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన ఏకైక నటి స్మిత’
-- అమోల్ పాలేకర్.
Take By: T News

Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, స్మిత, Telangana News,

Read more...

Sunday, December 11, 2011

Why This Kolaveri di Song - Telangana Version

Why This Kolaveri di 

Telangana Version

Jai Telangana Jai Jai Telangana 

 

See this Video Clink This Link (YouTube)

 http://goo.gl/Nmmgl


Tags: Telangana Song, Free Telangana Songs, Free Songs Download, Telangana News, Telangana, Why This Kolaveri, Kolaveri Song, Kolaveri song free Download, Youtube,

 

Read more...

Friday, December 9, 2011

తెలుగు నేలపై తీరని కల

చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది
విద్వేష వాతావరణానికి వీడ్కోలు
సువర్ణాక్షరాలతో లిఖితమై ఉండే
2009 డిసెంబర్ 9 ప్రకటన
నిక్కమైన జలాల పంపిణీ
రాజధాని ఏర్పాట్లలో సీమాంధ్ర

bhanughf-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- కేంద్రం హామీ అమలై ఉంటే..తెలుగునేలపై మార్పులేంటి?
- కొత్త రాష్ట్రాల్లో సీఎంలు ఎవరు..
- జగన్ సీనేంటి? బాబు హవా ఏంటి..
- చిరంజీవి సత్తా ఏమిటి..
- కాంగ్రెస్ లాభం ఏమిటి..
- బొత్స, కిరణ్ భవిష్యత్తేంటి..
- జానాకు దక్కే హోదా ఏంటి..
- బడా కాంట్రాక్టర్లకు బాధేంటి?
- విస్తరించే నిర్మాణరంగం
- విస్తరించే అనుబంధ వ్యాపారాలు
- సీమాంధ్రలో రియల్‌బూమ్
- తెలంగాణలో నిరుద్యోగం మాయం
- నెరవేరి ఉండే స్వయం పాలన
- సంస్కృతీ సంప్రదాయాల వికాసం
- రెండుచోట్లా పారిశ్రామిక కారిడార్‌లు
- పారిశ్రామిక కేంద్రంగా సింగరేణి
- పుంజుకునే ప్రభుత్వ కార్యక్రమాలు

  Read More click this click 

http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=51599

Read more...

తెగిస్తేనే..తెలంగాణ

డిసెంబర్ 9 ప్రకటన
P-Chidambara-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ అంశంైపై విస్తృత స్థాయిలో చర్చించాం. ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చాక ముఖ్యమంత్రి రోశయ్యనూ సంప్రదించాం. అన్ని రకాలుగా చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రోశయ్యకు సూచించాం. నవంబర్ 29(కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజు) తర్వాత ఆందోళనకారులు, విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం. కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆయన సత్వరం దీక్ష విరమించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. తదుపరి ఆందోళనలకు స్వస్తి పలకాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం

డిసెంబర్ 23 ప్రకటన
2009 డిసెంబర్ 7న ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభివూపాయం వ్యక్తమైంది. ఆ భేటీ వివరాలను అందుకున్న తర్వాత డిసెంబర్ 9న ఇందుకు సంబంధించి కేంద్రవూపభుత్వం ప్రకటన కూడా చేసింది. అయితే ఈ ప్రకటన తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితి మారిపోయింది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు చీలిపోయాయి. రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ఇతరత్రా సంఘాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రవూపదేశ్‌లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించాల్సిన అవసరముంది. పరిపాలన, అభివృద్ధిపైన దృష్టి పెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశమివ్వాలి. తమ ఆందోళనలను విరమించి శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలని కేంద్రవూపభుత్వం ఆంధ్రవూపదేశ్‌లోని వివిధ ప్రాంతాల వారికి, అన్ని రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నది.’

బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ నిజాం ప్రభువు శృంఖాలలను తెగ్గొట్టుకునేందుకు పిడికిలి బిగించిన పోరుగడ్డ ఈ తెలంగాణ. భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకెళ్లి పాకిస్థాన్‌లో కలిపేందుకు సిద్ధమైన నిజాం నవాబుకు, ఆయన సైన్యం రజాకార్లకు ఎదురునిలిచి నిలబడింది ఈ గడ్డ. ఉద్యమస్ఫూర్తి, అన్యాయంపై తిరగబడే తత్వాన్ని అలవరుచుకున్న ఈ సమాజానికి స్వాతంత్య్రం లభించిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. విశాల ప్రయోజనాల మాటున సామ్రాజ్యవాద భావనలతో తెలంగాణను పెట్టుబడిదారులు అన్ని విధాలుగా కబ్జాచేశారు. 1969లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తూటాలతో అణిచేశారు.

ఆ తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు తెలంగాణ మరోసారి ఉద్యమనినాదాన్ని అందుకున్నది. ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు, ఉపాధ్యాయులు ఏకమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ముక్తకం నిరసించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పదేళ్ల పాటు అనేక విధాలుగా పోరాటాలు సాగిస్తూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పట్ల దాటవేత వైఖరిని అవలంబిస్తూ విపరీతమైన కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ ఆవిర్భావాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మద్దతుగా తెలంగాణ అంతటా మద్దతు పలుకుతూ రాస్తారోకోలు, ఆందోళనలు, బంద్‌లు, నిరాహారదీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ విషాదకరమైన రీతిలో యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే కేంద్రవూపభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అఖిలపక్షభేటీ జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకెలాంటి అభ్యంతరం లేదంటూ ఆ భేటీలో పాల్గొన్న టీడీపీ, పీఆర్పీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా స్పష్టం చేస్తూ లిఖితపూర్వక ప్రకటన ఇచ్చాయి. దీంతో డిసెంబర్ 9 రాత్రి పదకొండున్నరకు పార్లమెంటు సాక్షిగా కేంద్రవూపభుత్వం తరపున హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం కేసీఆర్ దీక్ష విరమించారు. చిదంబరం ప్రకటన విన్న వెంటనే యావత్ తెలంగాణ సంబరాల్లో మునిగిపోయింది. ఉస్మానియా, కాకతీయ సహా అన్ని తెలంగాణ ప్రాంత యూనివర్సిటీల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. అయితే ఈ సంబురం పట్టుమని పదిహేను రోజులు కూడా నిలవలేదు. తెలంగాణలో, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తూ వేలకోట్లు ఆర్జిస్తున్న పెట్టుబడిదారులైన సీమాంధ్ర నేతలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించారు.


dffsd-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

సీమాంవూధకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏకం చేసి రాజీనామాల డ్రామాను నడిపారు. సీమాంధ్ర ప్రాంతాల్లో అద్దె ప్రదర్శనలు చేయించి ఆందోళనల పర్వాన్ని రక్తి కట్టించారు. ఇందుకు సీమాంధ్ర మీడియా బాగా తోడ్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. డిసెంబర్ 9న ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు అవసరమంటూ డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకునే సరికి తెలంగాణ భగ్గుమన్నది. మరోసారి ఉద్యమబాట పట్టింది. తెలంగాణను డిమాండ్ చేస్తూ బలిదానాలు ఆగలేదు. మరోవైపు చిదంబరం అఖిలపక్షాలతో 2010 జనవరి5 న ఢిల్లీలో భేటీ నిర్వహించారు. ఆ తర్వాత విస్తృత సంప్రదింపుల పేరుతో జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఫిబ్రవరి 3న ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలోనే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం నడిపేందుకు అటు రాజకీయ పక్షాలను ఇటు ప్రజాసంఘాలను కలుపుకొంటూ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భవించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెగని ఉద్యమాలు నిర్వహించింది. వంటావార్పులు నిర్వహించింది. రైల్‌రోకోలు, బస్సురోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. రాజీనామాలు చేసి ఐక్యతను చాటి తెలంగాణ కాంక్షను చాటిచెప్పాలని జేఏసీ పిలుపునిచ్చింది. కానీ ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు వెనక్కి తగ్గాయి. తమ అవకాశవాదాన్ని మరోసారి చాటుకున్నాయి. కేవలం టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రమే ముందుకొచ్చాయి. 12 స్థానాల్లో వారు రాజీనామాలు చేసి 2010 జూలైలో ఉప ఎన్నికల్లో తలపడ్డారు. తెలంగాణ కాంక్ష కోసం పదవులు వదులుకొని నిబద్ధత చాటుకున్న ఆ పన్నెండు మందికి జనం బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో వారిని గెలిపించారు. మరోవైపు ఇదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల అభివూపాయాలు తీసుకున్నది. ఇటు తెలంగాణ, అటు సీమాంవూధలో పర్యటించింది. ప్రజాభివూపాయ సేకరణ చేసింది.

2010 డిసెంబర్ 30న 550 పేజీలతో 8 అధ్యాయాలతో కేంద్రవూపభుత్వానికి నివేదిక సమర్పించింది. కట్టె విరగొద్దు..పాము చావొద్దు..అన్న రీతిన సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని చూపలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లేదా విడగొట్టాలంటూ ఆరు ఆప్షన్లు చెబుతూ తెలంగాణ అంశాన్ని మరింత సంక్లిష్టపరిచింది. 2011 జనవరిలో ఈ నివేదిక వెలువడిన తర్వాత ఉద్యోగులు ఫిబ్రవరి నెలలో పదహారు రోజుల పాటు సహాయ నిరాకరణ చేశారు. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మార్చి 10న జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణలో అడుగడుగునా పోలీసులు విధించిన నిర్బంధాన్ని ఎదిరించి వేలాది మంది ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. అదిగో.. ఇదిగో.. అంటూ నయవంచన చేస్తూ ఉద్యమాన్ని అణిచివేస్తున్న ప్రభుత్వానికి ఉద్యమవేడి రుచి చూపారు. సీమాంధ్ర పాలక ఆధిపత్య చిహ్నాలైన విగ్రహాలను విరగ్గొట్టి నేలపాలు చేశారు. కొన్నింటిని హుసేన్‌సాగర్‌లోకి గిరా అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూనే ఉన్నాయి.

DSC_0086-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
మరోసారి తెలంగాణ జనం రోడ్లెక్కారు. జూన్ 19న హైదరాబాద్ నడివీధుల్లో వంటావార్పు చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కదలిక తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓ ప్రయత్నం చేశాయి. జూలై 4, 5 తేదీల్లో మొత్తం 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో వందమంది, 14 మంది ఎంపీలు, 20 మంది ఎమ్మెల్సీలు తెలంగాణను కోరుతూ రాజీనామాలు సమర్పించారు. కానీ ఆ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్, శాసనసభ స్పీకర్ ఆమోదించలేదు. తెలంగాణ ప్రజావూపతినిధులు చేసిన ఈ ప్రయత్నాన్ని కేంద్రం తన కుయుక్తులతో తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు మరోసారి తమ పోరాటపటిమను కనబరిచారు. సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సింగరేణి, ఆర్టీసీ, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. తెలంగాణలోని సబ్బండవర్ణాల వారు ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సమ్మెకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్టే దిగొచ్చి మళ్లీ కాలయాపన చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో అభివూపాయసేకరణ పూర్తి చేసిన కేంద్రం..ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కావాలంటూ కొత్త పాట పాడటం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉంది.

విద్యార్థిని పట్టిస్తే వంద!
తెలంగాణ మలి ఉద్యమానికి ఊపిరులూదిన ఉస్మానియా యూనివర్సిటీపై సీమాంధ్ర ప్రభుత్వం ఎంత కక్ష గట్టిందో ఇదో చిన్న ఉదాహరణ. 2009 డిసెంబర్ నెలలో కేసీఆర్ దీక్షకు విద్యార్థులు మద్దతు ప్రకటిస్తూ ఉద్యమబాట పట్టారు. మరోవైపు పోలీసులు క్యాంపస్‌లోకి మావోయిస్టులు ప్రవేశించారంటూ తప్పుడు ప్రచారం చేసి దొరికిన విద్యార్థిని దొరికనట్టుగా చితకబాదారు. హాస్టళ్లలోకి చొరబడి చావబాదారు. అంతేకాదు క్యాంపస్‌కు ఆనుకొని పక్కనే ఉన్న మాణికేశ్వర్‌నగర్‌లో కూడా విద్యార్థులను పట్టుకుపోయి వేధించేవారు. ఆ బస్తీలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను పట్టిస్తే వందరూపాయల చొప్పున ఇస్తామంటూ పోలీసులే బహిరంగంగా ప్రకటించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

వందల సంఖ్యలో ప్రత్యేక బలగాలను రప్పించి ఉస్మానియాలను ఓ బందీఖానలాగా మార్చివేశారు. విద్యార్థులతో సమావేశాలు పెట్టుకుంటున్నాం.. అనుమతివ్వండి.. అని అడిగిన ప్రతీసారి పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుం అనుమతి దక్కలేదు. ఆ నేపథ్యంలోనే 2010 జనవరి 3న జరిగిన విద్యార్థి గర్జన ఉస్మానియా విశ్వవిద్యాలయ చరివూతలోనే ఓ మైలురాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నా లెక్కచేయక లక్షన్నర మంది విద్యార్థులు గర్జనకు హాజరయ్యారు.

42 రోజుల సమ్మె
2010లో ఉద్యమాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే ఆ బాధ్యతను 2011లో ఉద్యోగులు తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ వరుసలో అందరికన్నా ముందు నిలబడింది సింగరేణి కార్మికులే. బొగ్గుబావుల్లోకి దిగకుండా, ఉత్పత్తిని నిలిపివేసి ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఆర్టీసీతో పాటు ఆర్టీసీ, ఎకై్సైజ్ అధికారులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. సచివాలయం స్తంభించిపోయింది. తెలంగాణలోని ఏ ఊరువాడలోనూ ప్రభుత్వ కార్యాలయం పనిచేయలేదు. 42 రోజుల్లో ఒక్కరోజంటే ఒక్క రోజుకూడా పనులు సాగలేదు.

29.11.2009 : తెలంగాణ కోసం ఆమరణ నిరాహార
march08-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదీక్ష చేప కరీంనగర్ నుంచి సిద్ధిపేటకు బయలుదేరిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను అలుగునూరు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం మున్సిఫ్ మెజివూస్టేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు. జైల్లోనే ఆమరణ దీక్ష ప్రారంభించిన కేసీఆర్.
09.12.2009 : భారత ప్రభుత్వం తరపున ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ’ ప్రారంభమవుతుందని చిదంబరం ప్రకటన.
23.12.2009 : ‘‘తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ పార్టీలు, సంఘాలతో విస్తృత చర్చలు అవసరం’’ అని రెండో ప్రకటన విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి చిదంబరం.
24.12.2009 : కళింగ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జేఏసీ మొట్ట మొదటి సమావేశం ఏర్పాటు. రెండు రోజుల తెలంగాణ బంద్‌కు పిలుపు.
03.01.2010 : ఉస్మానియా యూనివర్సిటీలో ‘తెలంగాణ విద్యార్థి మహాగర్జన’ సమావేశం. హాజరైన లక్షలాది మంది విద్యార్థులు.
28.01.2010 : తెలంగాణపై కమిటీ(శ్రీకృష్ణ) ఏర్పాటు చేస్తున్నట్లు చిదంబరం ముందస్తు ప్రకటన.
04.02.2010 : జాతీయ రహదారులపై వంటావార్పు కార్యక్షికమాలు.
14.02.2010 : 15 మంది తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలు. ఓయూలో రెచ్చిపోయిన పోలీసులు, విద్యార్థులు, మీడియాపై పాశవిక దాడి.
20.02.2010 : ఓయూ ఐకాస ‘అసెంబ్లీ ముట్టడి’ పిలుపు. సిరిపురం యాదయ్య ఆత్మహత్యాయత్నం, తర్వాత మరణం.
27.07.2010 : తెలంగాణలోని 12 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు.
30.07.2010 : ఉప ఎన్నికల ఫలితాలు విడుదల. రాజీనామా చేసిన 12 మంది ఎమ్మెల్యేల విజయం. 12 టీడీపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు.
16.12.2010 : వరంగల్‌లో మహాగర్జన సభ స్వామి అగ్నివేశ్ ప్రసంగం.
30.12.2010 : ఒక రోజు ముందుగానే కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
15.02.2011 : తెలంగాణ అంతటా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం.
0ou-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
10.03.2011 : ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ విజయవంతం.
19.05.2011 : టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా.
19.06.2011 : హైదరాబాద్‌లో వంటా వార్పు కార్యక్షికమం.
14.07.2011 : రైల్‌రోకో కార్యక్షికమం విజయవంతం.
21.07.2011 : పార్లమెంట్ సమీపంలో యాదిడ్డి ఆత్మహత్య. ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత
06.08.2011 : ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలు
13.09.2011 : నుంచి 24.10.2011 : సకలజనుల సమ్మె.
04.11.2011 : పీడీ యాక్టు కింద డాక్టర్ చెరుకు సుధాకర్ అరెస్టు, వరంగల్ జైలుకు తరలింపు.
08.04.2011 : చెరుకు సుధాకర్ విడుదలకు హైకోర్టు ఆదేశం.


Take By: T News

Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, Sima Andra, AP News, Political News, December 9,

Read more...

Thursday, December 8, 2011

సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన సెహ్వాగ్

ఇండోర్ : ఇండోర్ వన్డేలో భారత కెప్టెన్ వీరెంద్ర సెహ్వాగ్ వీర వీహరం చేస్తున్నాడు. హోల్కర్ స్టేడియంలో వెస్టీండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఆటగాడు వీరెంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేశారు. సెహ్వాగ్ 140 బంతుల్లో 201 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 23 ఫోర్లు, 6 సిక్స్‌లతో సెహ్వాగ్ చెలరేగాడు. సచిన్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్‌లతో 200 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 24, 2010లో గ్వాలియర్‌లో సచిన్ డబుల్ సెంచరీ చేశాడు.


Take By: T News


Tags:  Hyderabad, News, Sport News, Virender Sehawag,

Read more...

4th ODI: Virender Sehwag becomes 2nd batsman to slam 200 in ODIs

Indore: Virender Sehwag, captaining India in the absence of the rested MS Dhoni, has become only the second batsman in the world to breach the 200-mark in one-day cricket. The first was the inimitable Sachin Tendulkar, who scored a double ton last year.


Sehwag slammed 219 off 149 balls before falling to Kieron Pollard in the 47th over of the fourth ODI against the West Indies at Indore. He got to the 200 in 140 balls; the first 100 came in only 69 balls. He smashed 25 fours and seven sixes and also crossed 8,000 ODI runs during the knock.

This is Sehwag's 15th ODI century and answers all the critics that have been blaming the top-order's indifferent form and Sehwag's bad captaincy for India's 16-run loss to the Windies in the 3rd ODI at Ahmedabad.

Sachin Tendulkar got his 200 against South Africa at Gwalior in February 2010. Tendulkar had scored 200 not out off 147 balls to take India to 401/3 in that game.

Sehwag's feat, however, would not have been possible without a little help from West Indies skipper Darren Sammy, who dropped the Delhi batsman off a Ravi Rampaul delivery in the 38th over when Sehwag was batting on 170. But then what is a great Sehwag innings without the adventure?

Take By: ndtv

Tags: T News, hmtv, Hyderabad News, Hyderabad, Virender Sehwag India vs west indies Ind vs WI wiinind2011news


Read more...

అసమ్మతి మధ్య.. లోక్‌పాల్ ముసాయిదా ఆమోదం

-స్థాయీ సంఘం నివేదికపై16 మంది సభ్యుల వ్యతిరేకత
-కాంగ్రెస్ ఎంపీల నుంచీ వ్యతిరేకత
-రేపు పార్లమెంటుకు లోక్‌పాల్ బిల్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సభ్యుల అభ్యంతరాల మధ్య పార్లమెంటరీ స్థాయీ సంఘం లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను బుధవారం ఆమోదించింది. స్థాయీ సంఘం రూపొందించిన లోక్‌పాల్ ముసాయిదాపై సభ్యుల్లో ఏకాభివూపాయం కొరవడింది. 30 మంది సభ్యుల స్థాయీ సంఘంలో 16 మంది సభ్యులు ముసాయిదాపై అసమ్మతి వ్యక్తం చేశారు. బిల్లు నివేదికతో పాటు వారు తమ అసమ్మతి పత్రాలను అందజేశారు. లోక్‌పాల్ ముసాయిదాను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సభ్యుల్లో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉండటం అధికార పార్టీకి ఝలక్ ఇచింది. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి సన్నిహితుడైన మధ్యవూపదేశ్ ఎంపీ మందసౌర్ మీనాక్షి నటరాజన్ లోక్‌పాల్ పరిధిలోకి గ్రూప్ సీ ఉద్యోగులు, కేంద్ర విజిపూన్స్ కమిషన్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. నటరాజన్ డిమాండ్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పీటీ థామస్, దీపా దాస్‌మున్షి మద్దతు పలికారు. సభ్యుల అభ్యంతరాలపై స్థాయీ సంఘం చైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ ‘సభ్యులు వ్యక్తిగతంగా తమ అభివూపాయాలు వ్యక్తం చేయవచ్చు.

వారి అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని అన్నారు. కొన్ని అంశాలపై మాత్రమే సభ్యుల్లో అభ్యంతరాలు ఉన్నాయి కానీ, మొత్తం నివేదిక మీద కాదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐను తీసుకురావాలని అన్నా హజారే బృందం గట్టిగా పట్టుబడుతున్నా, స్థాయీ సంఘం సీబీఐను బిల్లు పరిధికి ఆవల ఉంచినట్లు తెలుస్తోంది. లోక్‌పాల్ అదుపాజ్ఞల్లో పనిచేయడానికి సీబీఐ కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు.

ప్రస్తుత వ్యవస్థను దెబ్బతీసేలా.. సిఫారసులా?: అన్నా బృందం
పార్లమెంటరీ స్థాయీ సంఘం రూపొందించిన లోక్‌పాల్ ముసాయిదాపై సామాజిక ఉద్యమనేత అన్నా హజారే బృందం భగ్గుమంది. స్థాయీ సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి పార్లమెంటు అంటే గౌరవం లేదని, అందుకే కిందిస్థాయీ పరిపాలన వ్యవస్థ, సిటిజన్ చార్టర్‌లను లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న పార్లమెంటు తీర్మానానికి వ్యతిరేకంగా ముసాయిదా రూపొందించారని మండిపడింది. అన్నా హజారే దీక్ష విరమణ సందర్భంగా పార్లమెంటు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Lokpal, 
 

Read more...

సలామ్.. సెలాక్! - లాటిన్‌లో కొత్త చరిత్ర.. అమెరికా సామ్రాజ్యవాదంపై యుద్ధభేరి


obama talangana patrika telangana culture telangana politics telangana cinema

-అస్తిత్వం, ఆర్థిక ప్రయోజనాల రక్షణకు ఏకమైన 33 లాటిన్ దేశాలు, రాజ్యాలు
-తొలి వేదిక వెనిజులా రాజధాని
-తదుపరి సదస్సు క్యూబాలో
-అమెరికా అధిపత్యం ఇక చాలు
-సమస్యలు మనమే పరిష్కరించుకుందాం
-ప్రపంచానికి మార్గదర్శకులమవుదాం
-సదస్సులో వెనిజులా అధ్యక్షుడు ఛావెజ్

కారకాస్, డిసెంబర్ 7:లాటిన్ దేశాలు కలిసికట్టుగా ఉండాలని లాటి్ అమెరికా విముక్త పోరాట యోధులు కాంక్షించిన 200 ఏళ్ల తర్వాత ఆ కల సాకారం అవుతోంది. ఇప్పటిదాకా అగ్రరాజ్యం అమెరికాకు పెరటిదొడ్డిగా ఉన్న పరిస్థితిని చాలించి.. అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు లాటిన్ సమాయత్తమవుతోంది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ 33 దేశాలు ఒక కూటమిగా ముందుకు వచ్చాయి. ఈ సంగతి.. భారతీయ మీడియాలో అంతగా ప్రాధాన్యం పొందకపోవడం విశేషం. కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ స్టేట్స్ (సెలాక్) ఏర్పాటుకు ఉద్దేశించిన ఈ సదస్సును మెక్సికో అధ్యక్షుడు ఫెలిప్ కాల్డెరాన్ డిసెంబర్ 2న ప్రారంభించారు. ‘‘మనం మన ప్రాంత ప్రయోజనాల కోసం ఐక్యత కోసం పని చేద్దాం.

బొలివార్ స్వాతంత్య్ర సమర సేనాని) సిద్ధాంతాలు లాటిన్ అమెరికా మొత్తానికీ ఉమ్మడి సిద్ధాంతాలే’’ అని ఆయన అన్నారు. ఈ సదస్సుకు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ స్వాగతం పలికారు. సైమన్ బొలివార్‌ను తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ లాటిన్ అమెరికా పట్ల అమెరికా అనుసరిస్తూ వచ్చిన విధానాలను దుయ్యబట్టారు. ‘‘మొత్తంగా లాటిన్ అడుగుతున్నది గౌరవం. నిజమైన స్వాత్రంత్య్రం మాత్రమే’’ అన్నారు. ‘‘సంకోచించేవాడు ఓడిపోతాడు’’ అన్న బొలివార్ మాటలను ఛావెజ్ ప్రస్తావించారు. మనం ఇంకా ఎంతకాలం ఇలా పాడుబడిన పెరడులా మిగలాలి? అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఐక్యత, ఐక్యత, ఐక్యత, ఐక్యత మాత్రమే మనల్ని విముక్తి చేస్తుంది. మనల్ని స్వతంవూతంగా మనగలిగేలా చూస్తుంది’’ అని ఛావెజ్ స్పష్టం చేశారు. ‘‘ఇకపై మన మధ్య ఎలాంటి ఘర్షణలూ వద్దు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మనం అందరం కలిసి ఒక మహా ‘మాతృభూమి’ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మనకు ఉన్న మాతృభూమి కూడా మిగలదు. 200 ఏళ్లపాటు అమెరికన్లు వాళ్ల చిత్తం వచ్చినట్లు మనల్ని పాలించారు. ఇక చాలు’’ అని అన్నారు. వెనిజులాలో ఛావెజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1045 కంపెనీలను జాతీయం చేశారు.

ఈ ఒక్క ఏడాదే 459 కంపెనీలను జాతీయం చేశారు. చమురు, విద్యుత్, సిమెంట్, ఉక్కు, టెలికమ్యూనికేషన్స్, ఆహార ఉత్పత్తి-పంపిణీ రంగాల్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. బహుళజాతి సంస్థలైన కోల్గేట్-పామోలివ్, పెప్సీ కోలా, నెస్ట్‌లే, కోకాకోలా, యూనిలీవర్ వంటి సంస్థలపై నిరంతర పర్యవేక్షణను ఛావెజ్ ఏర్పాటు చేశారు. ‘‘వెనిజులా ప్రజల జేబులు కొట్టేసేందుకు పెద్ద వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు మేం స్వాతంత్య్రం ఇవ్వం’’ అని ఛావెజ్ తేల్చి చెప్పారు. ఇదే అక్కడి విపక్షానికి కంటగింపుగా మారింది. ఇప్పటికే బొలీవియా వంటి దేశాల్లో జాతీయకరణలు జరుగుతున్నాయి. ఛావెజ్ నాయకత్వాన సెలాక్ రంగంలోకి దిగితే లాటిన్‌లో పెట్టుబడి రూపురేఖలు మారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే అమెరికా, దాని తైనాతీలకు సెలాక్ ఆవిర్భావం గుబులు రేపుతోంది.

తదుపరి సదస్సు క్యూబాలో
ఖబడ్దార్.. మీ దేశం మాకు కూతవేటు దూరంలోనే ఉంది.. అని అమెరికా హెచ్చరిస్తే.. అమెరికా కూడా మాకు కూతవేటు దూరంలోనే ఉందని అగ్రరాజ్యాన్ని దీటుగా హెచ్చరించగలిగిన చిన్న దేశం.. క్యూబా సెలాక్‌లో కీలక పాత్ర పోషిస్తుండటమే కాక.. వచ్చే సంవత్సరం జరిగే సెలాక్ సదస్సుకు ఆతిథ్యం కూడా ఇవ్వబోతున్నది. ఆ తదుపరి సదస్సు చిలీలో జరగబోతున్నది.

బలహీనపడుతున్న సామ్రాజ్యవాదం
అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు తిరోగమనంలో ఉన్న తరుణంలో, ఐరోపా యూనియన్ దాదాపు కుప్పకూలే దశలో ఉన్న సమయంలో సెలాక్ ఏర్పాటు జరిగింది. యావత్ ప్రపంచం సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో లాటిన్ అమెరికా ఖండం కదులుతోందని గార్షి యా చెప్పారు. ‘‘సిద్ధాంతాలు, పరిణామం, ప్రజలకు, మా నవ జాతికి సేవలు అందించే ప్రతిపాదనలతో మొత్తం ప్రపంచానికి లాటిన్ అమెరికా నాయకత్వం వహిస్తుంది’’ అని గార్షియా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘సెలాక్ ఏర్పాటు అనేది మానవ చరివూతలోనే గొప్ప దశకు శ్రీకారం. ఇలాంటిది మునుపెన్నడూ లేదు’’ అని లాటిన్ అమెరికాలో ప్రజాదరణ కలిగిన అమెరికా-గీగీఐ అనే మ్యాగజైన్ సంపాదకుడు లూయిస్ బిల్‌బావో రాశారు. మిగిలిన ఖండాలన్నీ అపకేంద్ర శక్తుల హింసతో అతలాకుతలమవుతున్న సమయంలో లాటిన్ ఖండం దూసుకుపోయే స్వభావంతో ప్రాంతీయ ఐక్యతకు వేదిక ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ సామ్రాజవాద దేశాల్లో ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండగా.. లాటిన్ అమెరికాలో ఆ ఛాయలు లేవని గుర్తు చేశారు. పెట్టుబడిదారీ సమాజం కు ప్పకూలుతున్న తరుణంలో 21వ శతాబ్దపు సోషలిజం.. అ న్న జండా కింద సమీకృతమవుతున్నదని ఆయన రాశారు.

అడుగడుగునా అడ్డుకున్న అమెరికా
సెలాక్ ఏర్పాటును అడ్డుకునేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. అమెరికా కీలు బొమ్మ, కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వరో యూరిబ్‌ను వాడుకుంది. వెనిజులా వెళ్లిన యూరిబ్.. అక్కడి ప్రభుత్వ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రాపకంలోని మీడియా సైతం అనేక యత్నాలు చేసింది. వెనిజులా ఈ ప్రాంతంలో వేరుపడిపోయిందన్న దుష్ర్పచారానికీ తెగించింది. ఇటీవల క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొంది పూర్తి స్వస్థతతో ఛావెజ్ తిరిగి పాలనా కార్యక్షికమాల్లో పాల్గొడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికలకు ఛావెజ్ దూరంగా ఉంటారన్న అమెరికా ఆశలనూ ఆయన అడియాస చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తాజా సర్వేల ప్రకారం ఛావెజ్‌కు 50శాతానికి పైగా ప్రజల మద్దతు ఉంది.

ఇదీ లాటిన్ ప్రాముఖ్యం
సెలాక్ దేశాల మొ త్తం స్థూల జాతీయోత్పత్తి కలిపితే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానంలో ఉంటుంది. ఇదీ లాటిన్ ప్రాము ఖ్యం. అంతేకా దు.. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న ప్రాంతమిది. ఆహారోత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో, ఇంధనం ఉత్పత్తిలో మూడవ స్థానంలోనూ నిలిచింది.

సెలాక్.. ఓ మహా కూటమి
ఇప్పటికే దక్షిణ అమెరికా ఖండంలో యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (యూఎన్‌ఏఎస్‌యూఆర్), బ్యాంక్ ఆఫ్ సౌత్ (దీనికి మొక్క ఉరుగ్వే ఆమోదం మాత్రమే రావాల్సి ఉంది. ఆ ఆమోదం వస్తే రెండువేల కోట్ల అమెరికా డాలర్లను అభివృద్ధి పనుల కోసం ఈ బ్యాంక్ వెచ్చించనుంది.) సహా కొన్ని మండళ్లు పని చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన సెలాక్.. వీటిని సైతం కలుపుకొని తన కార్యక్షికమాలను రూపొందించుకోనుంది. అంతేకాకుండా ప్రస్తుతం లాటిన్ దేశాల మధ్య వాణిజ్య వ్యవహారాలకు మధ్యేమార్గంగా వినియోగిస్తున్న డాలర్‌ను కూడా పూడ్చిపెట్టాలని బ్యాంక్ ఆఫ్ సౌత్ భావిస్తోంది. ఇదే కూటమిలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బొలివారియన్ అలయెన్స్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫ్ అవర్ అమెరికా(అల్బా) కూడా అంతర్భాగం కానుంది. ఈ కూటమిని క్యూబా, వెనిజులా సహా 9 లాటిన్ సోషలిస్టు దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.

సభ్య దేశాలు
అంటిగ్వా, బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలీజి, బొలీవియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, కోస్టారికా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, గ్రెనడా, గుయానా, హైతీ, హోండురాస్, జమైకా, మెక్సికో, నికరాగువా, పరాగ్వే, పెరు, పనామా, డొమినికా, సెయింట్ కిట్స్-నెవిస్, సెయింట్ విన్సెంట్-క్షిగెనడినెస్, శాంటా లూసియా, సురినేమ్, ట్రినిడాడ్ - టొబాగో, ఉరుగ్వే, వెనిజులా.

ఓఏఎస్‌కు సమాధి!
ఉత్తర అమెరికాలోని శక్తిమంతమైన రాజ్యాలు సంప్రదాయకంగా ఆధిపత్యం వహిస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌ను సమాధి చేసే క్రమంలో సెలాక్ తుది ఇటుకను పేర్చుతుందని ఇప్పటికే వాదనలు మొదలయ్యాయి. ఓఏఎస్‌లో అమెరికా గురుత్వాకర్షణ శక్తి స్పష్టంగా కనిపిస్తున్నందున అమెరికన్ దేశాల మధ్య ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ వ్యవస్థ ఒకటి ఏర్పడాలని ఇటీవలే ఈక్వెడార్ అధ్యక్షుడు రఫెల్ కొర్రియా చెప్పారు. 

‘‘మనం మన సమస్యలను మన ప్రాంతంలోనే చర్చించుకునేలా మనకు మరొక వ్యవస్థ కావాలి. అంతేకానీ మన సమస్యలపై వాషింగ్టన్(ఓఏఎస్ కేంద్ర కార్యాలయం)లో చర్చించుకోవడం కాదు. మన సంప్రదాయాలు, విలువలు అవసరాలు తొలగింపునకు గురైన చోటకాదు.’’ అని ఆయన చెప్పారు. బొలీవియా వైస్ ప్రెసిడెంట్ గార్షియా లినెరా.. అమెరికా జోక్యంలేకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకునేందుకు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేందుకు, ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా మన భవితను తీర్చిదిద్దుకునేందుకు ఈ సదస్సు జరుగుతోంది’’ అన్నారు.

Read more...

ఎఫ్‌డీఐలపై పీఛేముడ్



PRANAB talangana patrika telangana culture telangana politics telangana cinema -మెట్టుదిగిన యూపీఏ ప్రభుత్వం
-అందరి సమ్మతి వచ్చాకే నిర్ణయం
-లోక్‌సభలో ప్రణబ్‌ముఖర్జీ ప్రకటన
-స్వాగతించిన ప్రతిపక్షాలు
-ప్రజాభీష్ఠానికి తలొగ్గడం ఓటమికాదు
-ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్య
-పారిక్షిశామికవర్గాల్లో నిరుత్సాహం
-హర్షం వ్యక్తం చేసిన వ్యాపారులు
-ఇక సజావుగా పార్లమెంటు


ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం తోకముడించింది. పార్లమెంటులో ప్రతిపక్షాల పోరాటానికి ఫలితం దక్కింది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని కేంద్రం బుధవారం నాడు తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది. ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చేంతవరకూ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు తొలుత అఖిలపక్ష భేటీలో, అనంతరం లోక్‌సభలో ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ రాజ్యసభలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు ముక్తకం స్వాగతించాయి. ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గి ఉండాలన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్.. అలా తలొగ్గడం ఓడిపోయినట్లు కాదని అన్నారు. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐలను తీవ్రంగా వ్యతిరేకించిన యూపీఏ భాగస్వామ్య పక్షాలు తృణమూల్‌కాంక్షిగెస్, డీఎంకే హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై పారిక్షిశామికవర్గాలు నిరుత్సాహం ప్రకటించగా.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ , డిసెంబర్ 7:చిల్లర వర్తకంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనపై కేంద్రవూపభుత్వం తోకముడిచింది. స్వపక్ష, విపక్షాల వ్యతిరేకతకు తోడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు ప్రభుత్వం వెనక్కితగ్గింది. బుధవారం అఖిలపక్షభేటి అనంతరం...ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చే వరకూ నిలిపివేస్తున్నట్లుగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్‌ముఖర్జీ అధికారికంగా ప్రటించారు. రాజ్యసభలోనూ వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ ఇదే ప్రకటన చేశారు. బుధవారం ఉదయం జరిగిన అఖిలపక్షభేటిలో చిల్లర రంగంలో 51శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నట్టు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిని ప్రతిపక్షాలు ముక్తకం స్వాగతించాయి. అనంతరం ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈ విషయాన్ని లోక్‌సభలో అధికారికంగా ప్రకటించారు. ఎఫ్‌డీఐలను స్వాగతించాలన్న నిర్ణయాన్ని అమలుచేయడానికి ముందు ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంవూతులు, చిల్లరవర్తకులను, రైతులను కూడా సంప్రదించనున్నట్టు ప్రణబ్ వివరించారు.

ఆ విధంగా ఒక ఏకాభివూపాయం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఒక ముఖ్యమైన వివాదానికి తెరపడినటె్టైందని యూపిఏ భాగస్వామ్య పక్షాలైన తృణముల్, డీఎంకేలు హర్షం వ్యక్తం చేశాయి. ఇకనైనా సభ సజావుగా సాగుతుందని ఆశాభావన్ని వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా వాణిజ్యరాజధాని ముంబాయిలో రిటెలర్‌లు ప్రభుత్వ నిర్ణయంతో ఆనోందత్సవాలు జరుపుకున్నారు. పార్లమెంట్‌లో తొమ్మిదిరోజులుగా ఊపిరి సలుపవ్వని ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రభుత్వం, ఈ నిర్ణయంతో కొంత ఉపశమనం పొందినటె్టైంది. తదనంతరం ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఎస్పీ ,వామపక్షాలు పలు వాయిదాతీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, స్పీకర్ మీరాకుమార్ వాటిని తిరస్కరించడంతో బీఎస్పీకి చెందిన సభ్యులు అసంతృప్తితో సభనుండి వాకౌట్ చేశారు. ఈ విధంగా సభ శీతాకాల సమావేశాల్లో తొలిసారి ప్రశ్నోత్తరాల సమయంలోకి ప్రవేశించింది.

స్వాగతిస్తున్నాం: సుష్మ
ప్రభుత్వం తీసుకున్న ఎఫ్‌డీఐల నిలుపుదల నిర్ణయాన్ని పార్లమెంట్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్ స్వాగతించారు. ‘‘ప్రజాభీష్టానికి ప్రభుత్వం తలొగ్గి ఉండాలని.. అట్లా తలొగ్గడం ఓడిపోయినట్టు కాదని’’ ఆమె గుర్తుచేశారు. ప్రజాభివూపాయాన్ని విన్నందుకు ప్రభుత్వానికి, ముఖర్జీకి ఈ సందర్భంగా సుష్మా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ప్రజాస్వామిక శక్తుల విజయంగా ఆమె అభివర్ణించారు. అన్ని పక్షాలను సంప్రదించి ఒక కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

పూర్తిగా వెనక్కి తీసుకోవాలి:సీతారాం ఏచూరి
ఎఫ్‌డీఐల ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సీపిఎం డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఎఫ్‌డీఐల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. వారి అభివూపాయాలను తప్పకుండా పరిగణించాలని అన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం తలొగ్గేలా ఒత్తిడి తీసుకురాగలిగాము. ఈ విషయంలో ఏకాభివూపాయం ఏ విధంగానూ కుదరదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఈ ఘనత సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నదని, కానీ తమ పార్టీ 2004 నుండే ఈ పెట్టుబడులను అడ్డుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయంలో ఫ్యూచర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు ధరలను తగ్గించడంతో పాటు గోదాముల్లో నిలువ ఉన్న ఆహారధాన్యాలను విడుదల చేసి, ధరలను అదుపు చేయాలన్నారు.

ఎఫ్‌డీఐలు కావాల్సిందే : కావూరి
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతించాలని, దేశవూపజలు అదే కోరుకుంటున్నారని ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ పండ్లు కూరగాయల నిల్వకోసం కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలంటే లక్షకోట్లరూపాయలు అవసరమని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏ నిర్ణయమైన తీసుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఒక్క పార్టీకి చెందినది మాత్రమే కాదని, ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తృణముల్, డీఎంకెల అభివూపాయాన్ని కూడా పరిగ స్తుందని అన్నారు.

 Take By: T News

Tags: Telangana News, Hyderabad, Telangana, Lok Sabha, News, FDI in retail, foreign investment, retail sector, Indian economy,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP