Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, December 2, 2011

పంజా పవర్



pawan-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaపవన్‌కళ్యాణ్ చిత్రం వస్తోందంటే అందరిలోనూ ఆసక్తే. రాబోయే ‘పంజా’ చిత్రానికైతే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కారణం ఈ చిత్రంలో ఆయన విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తుండటమే. ప్రస్తుతం నిర్మాణమవుతున్న క్రేజీ హీరోల చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్‌తో టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో తెరకెక్కిన ‘పంజా’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపుగా యాభై కోట్ల బిజినెస్ జరుపుకోవడం తెలుగు చిత్ర పరిక్షిశమలో సంచలనంగా మారింది.

నైజామ్ ఏరియా హక్కులు (దాదాపుగా)14 కోట్లకు అమ్ముడుపోగా సీడెడ్ ఏరియా పంపిణీ హక్కుల కింద ఈ చిత్రం 6.5 కోట్ల వసూలు చేసిందట. నెల్లూరు: 1.4 కోట్లు, కృష్ణ: 2 కోట్లు, గుంటూరు: 3 కోట్లు, వైజాగ్: 3 కోట్లు, ఈస్ట్ గోదావరి: 2.4 కోట్లు, వెస్ట్‌గోదావరి: 2 కోట్లు యుఎస్‌ఎ: 3 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే విస్మయపరుస్తోంది. ఇవి కాక ఓవర్సీస్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ మొత్తంగా కలిపి దాదాపుగా 12 కోట్లు కొల్లగొట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా కలిపితే పవన్‌కళ్యాణ్ ‘పంజా’ చిత్రం విడుదలకు ముందే 50 కోట్లు వసూలు చేసిందని, విడుదలయ్యాక బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విశేషం.

Take By: T News


Tags: T News, hmtv, tv9,  Cinema, Images, sex, hot images, Movies,  Tollywood, Bollywood, Hollywood, Dacanwood, Paanja, Pavankanlyan

Read more...

అవినీతి.. భారత్



parliment-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema అంతర్జాతీయ సూచీలో 95వ స్థానం
మూడేళ్లుగా దిగజారుతున్న ర్యాంకు.. గత ఏడాది 87వ స్థానంలో..
చైనా, శ్రీలంకల కన్నా ఇక్కడే ఎక్కువ.. పాక్‌తో పోలిస్తే మెరుగు
వరుస కుంభకోణాలు, నేతల అరెస్టులు.. కారణాలు!


న్యూఢిల్లీ, డిసెంబర్ 1:భారతదేశంలో అవినీతి భూతం నానాటికీ పెట్రేగుతోంది. లంచాలకు మరిగి, ప్రజాసేవ అటకెక్కించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు దేశంలో కొదువే లేకపోవడంతో అవినీతి హద్దూఅదుపు లేకుండా విజృభిస్తోంది. ఓవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపే లోక్‌పాల్ కోసం సామాజిక ఉద్యమనేత అన్నా హజారే నాయకత్వంలో జోరుగా ఉద్యమం సాగుతున్నా, అవినీతిని ఎంతమాత్రం సహించం, కూకటివేళ్లతో పెకిలిస్తామని జాతీయస్థాయిలో నేతలు ఉపన్యాసాలు దంచుతున్నా, దేశంలోని అవినీతిపరులు తొణకుండా, బెణకుండా తమ పని తాము సాగిస్తున్నారు! చేయి తడిపితేనా.. అమ్యామ్యాలు ముట్టితేనే సర్కారీ కార్యాలయాల్లో పనులు సాగుతున్నాయి! అవినీతిలో ఆరితేరిన రాజకీయ నాయకులు రోజుకో భారీ కుంభకోణంతో దేశంలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇక మన దేశంలో అవినీతి ఎలా తగ్గుముఖం పడుతోంది? ఈ జ్యాఢ్యాన్ని నియంవూతించే విషయంలో మన ప్రతిష్ట ఎలా మెరుగుతోంది?? అందుకే 183 దేశాలతో టాన్స్‌పన్సీ ఇంటేర్నేషనల్ రూపొందించిన అంతర్జాతీయ అవినీతి సూచి(కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)లో భారత్ 95వ స్థానంలో నిలిచింది. అవినీతి నియంవూతణ విషయంలో భారత్ ర్యాంకు క్రమంగా దిగజారుతోంది. అవినీతి విషయంలో 10 మార్కులకు గాను భారత్ 3.1 మార్కులను మాత్రమే సాధించింది. 2007లో అత్యధికంగా 3.5 మార్కులు తెచ్చుకున్న భారత్ ఆ ఏడు 180 దేశాల సీపీఐలో 72వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్రమంగా మన ర్యాంకు దారుణంగా పడిపోతూ వస్తోంది. అవినీతిని నియంవూతించడంలో వ్యవస్థ తీరు నానాటికీ తీసికట్టుగా ఉందని ప్రజలు భావించడమే ఇందుకు కారణం. గత ఏడాది ఈ జాబితాలో 87వ స్థానంలో నిలిచిన మన దేశం ఈ ఏడాది ఎనిమిది స్థానాలు దిగజారింది. పొరుగు దేశాలు చైనా(75 ర్యాంకు), శ్రీలంక (86)ల కన్నా ఎంతో వెనుకబడిన ఇండియా.. 134వ స్థానంలో ఉన్న దాయాది పాకిస్థాన్‌తో పోలిస్తే మెరుగు అనిపించుకుంది. ప్రభుత్వ రంగాల్లో అవినీతి గురించిన వివరాల ఆధారంగా సీపీఐ వివిధ దేశాలకు ర్యాంకులను నిర్ధారిస్తోంది. ఇందుకోసం నిపుణులైన అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల నుంచి సంక్లిష్ట ప్రక్రియ ద్వారా సమాచారం సేకరిస్తోంది.

13 అధ్యాయనాల ఆధారంగా భారత ర్యాంకును నిర్ణయించారు. దేశం పనితీరుపై ప్రపంచబ్యాంకు నివేదిక, ఇనిస్టిట్యూషనల్ అసెస్‌మెంట్, వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఒపినియన్ సర్వే, గ్లోబల్ ఇన్‌సైట్ ఇచ్చిన రిస్క్ రేటింగ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పన్సీ రూపొందించిన తాజా జాబితాలో 9.5 మార్కులతో న్యూజీల్యాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్, ఫిన్‌ల్యాండ్‌లు నిలిచాయి. అస్థిరత, అంతర్గత సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న సోమాలియా, ఉత్తర కొరియా, మయున్మార్, అఫ్గానిస్థాన్‌లు అట్టడుగు స్థానానికి పరిమితమయ్యాయి. దిమ్మతిరిగే కుంభకోణాలు వెలుగు చూస్తుండటం, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్లు అరెస్టవ్వడం, అవినీతి పీచమణచడం కోసం లోక్‌పాల్ ఉద్యమం జోరుగా సాగుతుండటం.. మన దేశ ర్యాంకు దిగజారడానికి కొద్దిస్థాయిలో దోహదపడొచ్చునని ట్రాన్స్‌పన్సీ ఇంటర్నేషనల్ ఇండియా బాధ్యులు తెలిపారు.

కుదిపేసిన కుంభకోణాలు..
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ మధ్యకాలంలో దేశాన్ని వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో, సామాన్యుడి ఊహకందని రేంజ్‌లో లక్షల కోట్ల రూపాయాల కుంభకోణాలు వెలుగుచూశాయి. 2జీ నుంచి ఓటుకు నోటు వరకు అన్నీ ప్రజల్లో గుబులు రేపిన కుంభకోణాలే. ఆ వివరాలు..

2జీ స్పెక్ట్రం స్కాం:
2జీ కేటాయింపులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి, వారి నుంచి ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలపై ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంతో రూ.1.76 లక్షల కోట్లు నష్టపోయిందన్న కాగ్ నివేదికతో దేశం దిమ్మెరపోయింది. ఈ స్కాంలో టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో సహా ముఖ్య ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ ప్రముఖులు నిందితులుగా ఉన్నారు

ఓటుకు నోటు:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaయూపీఏ-1 ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కడం కోసం ఎంపీలను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచిందని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నోట్ల కట్టలు ప్రదర్శించడంతో సంచలనం సృష్టించింది. ఈ స్కాంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీవీసీ నియామకంపై నిరసనలు:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaకేంద్ర విజిపూన్స్ కమిషనర్‌గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడం కూడా కేంద్రంలోని యూపీఏ సర్కారును తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. కేరళలో పామోలిన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజే థామస్‌ను సీవీసీగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన దిగిపోక తప్పలేదు. ఇది కేంద్రానికి ఎదురుదెబ్బగా మారింది.

ఆదర్శ్ కుంభకోణం:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaముంబైలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ్ సోసైటీలో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ, ఆర్మీ అధికారులు ప్లాటు పొందడం కోసం నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ స్కాం దెబ్బతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కామన్ క్రీడల కుంభకోణం:
suresh talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రతిష్ఠాత్మక కామన్ క్రీడల నిర్వహణ విషయంలో ఆది నుంచి అక్రమాలు వెలుగుచూశాయి. చివరి క్షణం వరకు పనులు కొనసాగడం, వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు, అసలు క్రీడలు సజావుగా జరుగుతాయా అన్న ఉత్కంఠ మధ్య.. ఎలాంటి అవాంతరం లేకుండా ఈ క్రీడలు ముగిశాయి. అయితే కామన్ క్రీడల నిర్వహణలో జరిగిన ఎన్నో అక్రమాలు వెలుగుచూడడంతో కామన్ క్రీడల చైర్మన్ సురేశ్ కల్మాడీ జైలు పాలయ్యారు. మరికొందరు నిర్వాహకులు కూడా అరెస్టయ్యారు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News  

Read more...

నల్లచట్టాలతో ఉద్యమాన్ని ఆపలేరు



kcr-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema- అణచివేయాలనుకుంటే మరింత తీవ్రం
- సీఎం కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారు
- తెలంగాణ మంత్రులకు చీమూ నెత్తురు లేదు
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
- చెరుకు సుధాకర్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్


(-వరంగల్):ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి నియంతలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని సహించలేక ప్రభుత్వం నల్ల చట్టాలతో అణచాలని చూస్తోందని మండిపడ్డారు. అణచివేయాలనుకుంటే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రముఖ వైద్యుడు చెరుకు సుధాకర్‌ను ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసిందని తప్పుపట్టారు. ఆయన ఆరోగ్యం ఏమీ బాగాలేదని, ఆయనను ప్రభుత్వం తక్షణమే బేషరతుగా విడుదల చే యాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి, నాసా కేసు మోపడంతో వరంగల్ జైలుకు పంపిన డాక్టర్ చెరుకు సుధాకర్‌ను ఇటీవల అనారోగ్యం కారణంగా ఎంజీఎం ఆసుపవూతికి తరలించారు. ఆసుపవూతిలో ఉన్న ఆయనను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి, వరంగల్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి ఉన్నారు.

అనంతరం మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘చెరుకు సుధాకర్‌ను అర్ధరాత్రి అరెస్టు చేయడంతో మా ఎమ్మెల్యేలందరూ తెలంగాణ మంత్రులను కలిస్తే 10 నుంచి 15 రోజు ల్లో విడుదల చేస్తామన్నరు. తెలంగాణ కోసం ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమం చేస్తున్న వ్యక్తిని అదీ పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం ఏమిటని వారే ఆశ్చర్యపోయారు. ఆయన విడుదలకు సహకరిస్తామన్నారు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు. తెలంగాణ మం త్రులకు చీమూనెత్తురు, సిగ్గూ శరం ఏమాత్రం లేవు’’ అని ఆయన ఈ ప్రాంత మంత్రులపై, వారి చేతకానితనంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అరెస్టులతో అడ్డుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చూస్తే అంతకన్నా అవివేకం ఏమీ ఉండదని ఆయన విమర్శించారు. నల్గొండలో ప్రజావైద్యుడిగా పేరున్న చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంతో మమేకమై తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారని, అలాంటి వ్యక్తిపై నల్లచట్టాలు, నాసాలు ప్రయోగిస్తే వాటికి తెలంగాణవాదులు ఎవ్వరూ భయపడేదిలేదన్నారు. చెరుకు సుధాకర్‌ను ఎలా విడుదల చేసుకోవాలో తమకు తెలుసునని, రాష్ట్ర హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గూశరం లేకుండా చీమూనెత్తురు లేకుండా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము ఉద్యమిస్తే 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం హామీనిచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని, ఎటువంటి కేసులు పెట్టి, ఎంత భయానక వాతావరణం సృష్టించాలని చూసినా తెలంగాణ భయపడేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. చెరుకు సుధాకర్‌ను ఆస్పత్రి నుంచి తొందరగా జైలుకు పంపాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, సీనియర్ నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, ముత్తిడ్డి యాదగిరిడ్డి, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంటతడి పెట్టిన కేసీఆర్
వరంగల్ రూరల్: వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించిన పార్టీ అధినేత కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. సుధాకర్ ఆరో గ్య పరిస్థితిని చలించిపోయా రు. ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘‘అన్నా నువ్వేం భయపడొద్దు.. నీకు, నీ కుటుంబానికి మేము న్నాం. నీ వెనకాల యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభు త్వం బేషరతుగా విడుదల చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమం ఆగదు
మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు ఉద్యమకారులపై ఎన్ని నాసా కేసులు పెట్టినా వెనుకకు తగ్గేది లేదని, తెలంగాణ ఉద్యమం కొసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌లో పోలీసు నిర్బంధంలో ఉన్న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించేందుకు గురువారం వెళుతూ మార్గమధ్యంలో మేడిపల్లి పరిధిలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణవాదులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పోరాడుతున్నవారిపై దుర్మార్గమైన దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపె సభను జరుగనివ్వబోమని, శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపె ఉద్యమించాలని కోరారు. తెలంగాణ ఉద్య మం చల్లబడిందనే సీమాంధ్ర నేతల ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్షికమంలో రంగాడ్డి జిల్లా టీఆర్‌ఎస్ కార్యదర్శి పంగ మహేందర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నత్తి మైసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చర్ల ఆంజనేయులు, బింగి జంగయ్యయాదవ్, ఏర్పుల వెంక మేకల వెంక చంద్రశేఖర్, పన్నాబాయ్, సునీల్, సంపత్, యాదగిరి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News
  


Read more...

Wednesday, November 30, 2011

ఆర్థిక మంత్రిగా మహిళకు చాన్స్! - రచ్చబండలో సీఎం వ్యాఖ్యలు

కూకట్‌పల్లి, నవంబర్ 29 (): రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలను మహిళకు అప్పగించాల్సిన విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆర్థిక విషయాలన్నీ మహిళలే చూసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక బాధ్యతలను కూడా ఆడవారికి అప్పగిస్తే మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందంటూ తన అభివూపాయాన్ని వెల్లడించారు. ఆర్థిక శాఖను మహిళకు కేటాయించే అంశాన్ని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్షికమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు మరింత ప్రాధాన్యతనిచ్చేందుకు, ప్రతి సంక్షేమ పథకానికి మహిళలనే అర్హులుగా గుర్తిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌కు మంత్రి పదవి బీసీ కోటా కింద ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఎంపీ సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్షికమంలో మంత్రులు సబితా ఇంద్రాడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌డ్డి, కిచ్చనగారి లకా్ష్మడ్డి, రాజిడ్డి, రాజేందర్, ప్రసాద్‌రావు, ఎంఎల్‌సీ రాజాడ్డి, పాల్గొన్నారు.


Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,

Read more...

స్కాలర్ ‘షిప్’ ముంచేశారు!



- అందాల్సిన దరఖాస్తులు 13 లక్షలు
- ఇప్పటివరకు అందినవి 5 లక్షలే!
- బ్యాంక్ అకౌంట్లు రానివారు 4 లక్షలు
- సర్టిఫికెట్లు, అకౌంట్ల అటాచ్‌తోనే తంటా!
- సవాలక్ష ఆప్షన్లు.. సతాయిస్తున్న ఈ-పాస్ సర్వర్
- నేటితో గడువు పూర్తి.. ఆందోళనలో విద్యార్థులు
- గడువు పెంచకుంటే ఏడున్నర లక్షల మందికి నష్టం

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు రాష్ట్ర సర్కారు పన్నిన ‘ఆన్‌లైన్ దిగ్బంధం’లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటున్నారు. సవాలక్ష నిబంధనలు, షరతులు విధించి.. ఎన్నో ఆంక్షలు పెట్టడంతో ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో విద్యార్థులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. బ్యాంకు అకౌంట్లు తీసి, అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు సాధించి.. ఇంట్నట్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల సంగతి సరేసరి. ఏ సదుపాయం అందుబాటులో లేని వారు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఏటికి ఎదురీదటాన్ని తలపిస్తోంది. దీంతో గడువు ముగుస్తున్నా ఇప్పటివరకు అర్హులైన విద్యార్థుల్లో సగం కూడా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. మొత్తం 13 లక్షల మంది విద్యార్థులలో 5లక్షల మంది స్కాలర్‌షిప్ దరఖాస్తులు అందాయి.

బుధవారం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. దీంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన గ్రామీణ, పేద విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే, తాము దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువును మరో 15 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరగకపోతే.. ఏడున్నర లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమయ్యే ప్రమాదం పొంచివుంది.


GGGG-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ నవంబర్ 29 ():రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీరు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. కొత్త దరఖాస్తులు స్వీకరించే విషయంలో ఈ పాస్ వెబ్‌సైట్‌లో పెట్టిన విపరీతమై అప్షన్లు బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 865 కరువు మండలాలను ప్రకటించి రైతులపై సానుభూతి ప్రదర్శిస్తున్నట్లు చెప్పుకుంటూనే.. మరోవైపు అన్నదాతల పిల్లల చదువులకు చేదోడువాదోడుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కట్టడి చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి స్కాలర్‌షిప్ మొత్తాలను తగ్గించుకునేందుకు ప్రయత్నంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్కాలర్‌షిప్ దరఖాస్తులపై ఆంక్షలు విధించి తక్కువ దరఖాస్తులు వచ్చేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.

సంక్షేమ రంగానికి కేటాయించే నిధుల్లో భారీగా కోతలు విధించి.. పరోక్షంగా చర్యలు తీసుకుంటూ పేద విద్యార్థులను దొంగదెబ్బ తీస్తోంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అనేక మార్పులు చేసింది. కోర్సుల ఫీజులను తగ్గించడం, సర్టిఫికెట్ల కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేయడం వంటి చర్యలకు దిగిన సర్కారు బడుగు, బలహీనవర్గాల విద్యార్థులనూ వదిలిపెట్టడం లేదు. వారిని ఉన్నత చదువులకు దూరం చేసేలా అనేక షరతులు విధిస్తోంది. గతేడాది వరకు లేని ఆప్షన్లను ఈ ఏడాది ఈపాస్ వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టి విద్యార్థులను నానా అగచాట్లకు గురిచేస్తోంది. బ్యాంకు అకౌంట్లు రాకపోవడం, బ్యాంకర్లు జీరో బ్యాలెన్సు అకౌంట్లు ఇవ్వడానికి ససేమిరా అనడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్నట్ సదుపాయం అందుబాటులో ఉండకపోవడం, కుల, ఆర్థిక ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఎక్కడలేని జాప్యం జరగడంతోపాటు ఇవన్నీ సమకూరినా దరఖాస్తు చేసుకుందామంటే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్న చందంగా సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నారు.

దీంతో 2011-12 విద్యా సంవత్సరానికి గాను 13 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటివరకు కేవలం 5.35 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు బుధవారం ముగుస్తోంది. దీంతో ఇటు విద్యార్థుల్లో, అటు అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించకుంటే దాదాపు ఏడున్నర లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.

బ్యాంకు ఖాతాలతోనే తంటా
గతంలో కాలేజీలకే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు వేళ్లేవి. దీంతో జరుగుతున్న అవకతవకలను అరిక ఈపాస్ వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. ఇవి విద్యార్థులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు దరఖాస్తులు రావాల్సిన దానికంటే చాలా తక్కువ రావడంతో అధికారులూ ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడుందనేదానిపై ఆరా తీస్తున్నారు. గతంలో ‘నమస్తే తెలంగాణ’లో స్కాలర్‌షిప్‌లకు అకౌంట్ దెబ్బ పేరుతో ప్రచురితమైన వార్తకు ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమాండ్ పీటర్ స్పందిస్తూ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించాలని కలెక్టర్లకు లేఖ కూడా రాశారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినా జిల్లాల్లో బ్యాంకర్ల నుంచి సరైన స్పందన కరువైందని అధికారులే చెబుతున్నారు.

కనీసం రూ. 500 నుంచి వెయ్యి రూపాయల డిపాజిట్ చేస్తేనే బ్యాంకులు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు ఒప్పుకుంటున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఒక్కసారిగా 13 లక్షల అకౌంట్లు కొత్తగా తెరవాల్సి రావడంతో ఇది బ్యాంకు అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. కట్టలుకట్టలుగా అకౌంట్ల కోసం దరఖాస్తులు వస్తుండటంతో చేసేదేం లేక వారం నుంచి పది రోజుల వరకు షెడ్యూల్ బ్యాంక్‌లు సమయం తీసుకుంటున్నాయి. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు బ్యాంకు అకౌంట్ నెంబర్ లేకపోవడం వల్లే ఆగిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్లకు లేఖ రాసిన నేపథ్యంలో విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు వచ్చేలా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ ప్రయత్నం గతంలోనే చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని విద్యార్థులంటున్నారు.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇప్పించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందని తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే ఈ విషయమై కలెక్టర్లకు లేఖలు రాసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని భావిస్తున్నారు. మరోవైపు రాష్ర్టవ్యాప్తంగా కుల, ఆర్థిక ధ్రువీకరణ సర్టిఫికెట్లతోపాటు, పదో తరగతి వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే నింపాల్సి ఉండటంతో ఏ చిన్న తప్పు దొర్లినా దరఖాస్తును మళ్లీ మొదటి నుంచి నింపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అదే సమయంలో ధ్రువీకరణ పత్రాలతో పాటు, పదో తరగతి మెమో, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇతర పత్రాలు కూడా ఆన్‌లైన్‌లోనే అటాచ్ చేయాల్సి ఉండటంతో దరఖాస్తులు ఓకే అవ్వడానికి సమయం పడుతోందని విద్యార్థులంటున్నారు. కొత్తగా ఏర్పాటైన ఇంటర్మీడియట్ కాలేజీల విద్యార్థులకు మరో చిత్రమైన సమస్య ఎదురవుతోంది. కొత్త కాలేజీల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరు నేరుగా దరఖాస్తులు కాలేజీల్లో అందజేస్తున్నట్లు సమచారం. అక్కడి నుంచి దరఖాస్తులు పీడీ కార్యాలయానికి వస్తాయని అధికారులంటున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేందుకు మరో 15 రోజుల గడువు పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదంవూడులు కోరుతున్నారు.

ఒక్క దరఖాస్తుకు గంట సమయం
ఈ సమస్యలకు తోడు గత మూడు రోజుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ఈపాస్ వెబ్‌సైట్ సర్వర్ బాగా నెమ్మదించినట్లు సమాచారం. జిల్లాల నుంచి దరఖాస్తులు పంపడానికి గంటల తరబడి సమయం తీసుకుంటోందని విద్యార్థులంటున్నారు. మధ్యాహ్నం సమయంలోనైతే ఒక్క దరఖాస్తును నింపడానికి గంటలకు పైగా సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. మూడురోజుల నుంచీ మరీ ఎక్కువ సమయం తీసుకుంటోందని చెబుతున్నారు. గడువు దగ్గరపడుతున్న కొద్దీ జిల్లాల నుంచి ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే వారి సంఖ్య వేలల్లో పెరుగుతోందని, ఇందువల్లే సర్వర్ డౌన్ అవుతుందని అధికారులంటున్నారు. ఇంట్నట్ గంటల తరబడి కూర్చోవడం వల్ల తమకు డబ్బులు కూడా అదనంగా ఖర్చువుతోందని విద్యార్థులు వాపోతున్నారు.


Read more...

నిప్పురవ్వ నిజామాబాద్

-ఉద్యమాల పురిటిగడ్డ
-పొరక దొరల నేతృత్వంలో పల్లెల్లో మార్పు

nzb052-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema(నిజామాబాద్)తెలంగాణలోని పది జిల్లాల్లో చిన్నదైన జిల్లా నిజామాబాద్. కానీ.. పౌరుషంలో మాత్రం మేటిగా నిరూపించుకుంటోంది. యావత్ తెలంగాణలోనే కాక.. రాష్ట్రం మొత్తాన్నీ ప్రభావితం చేయగలిగిన నాయకత్వం ఎదగడం ఈ జిల్లా విశేషం. 33 ఏళ్ల క్రితమే నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం నీడలో ఇందూరుగడ్డపై సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వీరోచితమైన పోరాటాలే జరిగాయి. జంగల్, జమీన్ కోసం పొరక దొరల పేరిట రాంచందర్, ప్రసాద్ నాయకత్వంలో లక్ష కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అటవీ పల్లెల్లో అగ్గిరాజుకుంది. జంగ్లాత్ అధికారుల దౌర్జన్యాలను, పల్లెల్లో పటేల్, పట్వారీ పెత్తనం, పంచాయతీల పేరిట దండుగుల వసూళ్ల దందాను రూపుమాపారు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు చరమగీతం పాడారు. ఇప్పటికీ ఆ పోరు వారసత్వంతో నిజమాబాద్ జిల్లా నిప్పురవ్వలా ఉద్యమసెగలు తాకిస్తూనే ఉంది.

టీడీపీ కంచుకోటలు తునాతునకలు
నిజాం నవాబు పిలుపుతో వడివడిగా వచ్చి అగ్గువ సగ్గువకు భూములను కొనుక్కొని నిజాంసాగర్ కాలువల పొంట వెలసిన తెలంగాణ సెటిలర్లు టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల గెలుపోటములను నిర్దేశించగలిగిన స్థాయికి ఆ సామాజిక శ్రేణులు ఎదిగాయి. ఫలితంగానే టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి మునుపు జిల్లాలో టీడీపీ అడ్డా భిఠాయించగలిగింది. స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు, తెలంగాణ అంతటా తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ కారణంగా 2004 ఎన్నికల్లో వై.ఎస్ రాజకీయ అనివార్యతలో భాగంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు సమీకరణ 2004 ఎన్నికల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసింది. 9 నియోజకవర్గాల్లో మూడింటిని టీఆర్‌ఎస్, మిగిలిన ఆరింటిని కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీకి అసెంబ్లీలో నిజామాబాద్ నుంచి ప్రాతినిథ్యమే లేకుండాపోయింది.

ఆ నాలుగేళ్లకు ఉప ఎన్నికల పుణ్యమా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మండవ వెంక గెలువడంతో ఒక స్థానంపై పచ్చజెండా ఎగిరింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో పొసగిన పొత్తుతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బాగానే రాజకీయ లబ్ధి పొందింది. టీఆర్‌ఎస్ మద్దతుతో ఐదు స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఆ సంబరం ఎంతోకాలం మిగల్లేదు. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ధిక్కరించి బాన్సువాడ గడ్డపై టీడీపీకి పెద్దదిక్కయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఉద్యమ సారథిగా పేరు తెచ్చుకున్న టీఆర్‌ఎస్‌లో చేరి.. 50 వేల మెజార్టీతో గెలిచారు. కామాడ్డి డివిజన్‌లో టీడీపీలో బలమైన నాయకుడిగా ఎదిగిన గంప గోవర్ధన్ సైతం తెలంగాణ కోసం గులాబీ గుడారంలో చేరారు. ఎమ్మెల్యే పదవికి ఆయన చేసిన రాజీనామా ఆమోదం పొందింది. మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన టీడీపీ జిల్లాలో రాజకీయ ప్రాభవాన్ని రోజురోజుకు కోల్పోతూనే ఉంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పలేని ఇరకాట పరిస్థితి కారణంగా జిల్లాలో టీడీపీ నిర్మాణపరమైన నష్టాన్ని చవిచూస్తోంది.

అందరూ పెద్దోల్లే - అయినా ఎవరికి వారే
20 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతున్న ఉద్దండులే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్నారు. మర్రి చెన్నాడ్డి హయాం నుంచి మొదలుకొని కిరణ్‌కుమార్ కేబినెట్‌లోనూ ఇందూరు రాజకీయ ఉద్దండులు ఒక వెలుగు వెలుగుతూనే ఉన్నారు. చెన్నాడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్, సంతోష్‌డ్డి, షబ్బీర్ అలీ గతంలో చక్రం తిప్పినవారే. ఐదేళ్లు స్పీకర్‌గా సురేష్‌డ్డి సైతం రాష్ట్ర రాజకీయాల్లో స్థిరపడ్డారు. ఇప్పటికీ డీ శ్రీనివాస్ 10జనపథ్‌తో సన్నిహిత సంబంధాలను కలిగిఉన్నారు. ఫలితంగానే వరుస పరాజితుడైనప్పటికీ, ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో షబ్బీర్ అలీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కోటరీలో చోటుకలిగిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎంపీ మధుయాష్కీ గౌడ్‌లు రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకపావూతనే పోషిస్తున్నారు. ఇలా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఉద్దండులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయికి ఎదిగారు. కానీ ఈ నేతల మధ్య ఆధిపత్యపోరు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీఎస్, సుదర్శన్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు పలు సందర్భాల్లో జిల్లా యంత్రాంగానికి తలనొప్పి తెచ్చిపెట్టింది.

కేరాఫ్ హైదరాబాద్
పార్టీ ఆవిర్భావం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉంది. ప్రాంతాలకు అతీతంగా అంతటా టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణమే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు కలిగిన జుక్కల్, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్ లాంటి ప్రాంతాల్లో సైతం ప్రజలు గులాబీ జెండాను మోసేందుకు సిద్ధంగానే ఉన్నారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. 520 సర్పంచ్ స్థానాలను, 228 ఎంపీటీసీ స్థానాలను, 23 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోగలిగింది. 36 స్థానాల్లో 19 స్థానాలను గెలిచి జిల్లాపరిషత్‌పై గులాబీ జెండాను రెపపలాడించారు. అప్పటి నుంచి మొదలైన తెలంగాణ రాజకీయ ప్రస్థానం ఇందూరు గడ్డపై సంప్రదాయ రాజకీయ పార్టీలను చావుదెబ్బ తీసింది. మూడు గంటల్లో జిల్లా అంతటా కలియతిరిగేందుకు వీలుగా ఉన్న భౌగోళిక స్వరూపం సైతం అంతగా ఆర్థిక వనరులు లేని తెలంగాణ ఉద్యమ రాజకీయ ప్రస్థానానికి కలిసొచ్చిన అవకాశంగా చెప్పుకోవచ్చు. కానీ నిజామాబాద్‌లో నాయకత్వ లోపాలే టీఆర్‌ఎస్‌కు శాపంగా పరిణమించాయన్న వాదన ఉంది.

పార్టీకి జవసత్వాలు పోయాల్సిన కీలక బాధ్యత కలిగిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు కేరాఫ్ హైదరాబాద్‌గా ఉండడమే అసలు సమస్యగా మారింది. స్థానికంగా అందుబాటులో లేని నియోజకవర్గ నాయకత్వం వల్ల పార్టీ వ్యవస్థాగతమైన వ్యవహారాలు అంతగా సాగడంలేదన్న విమర్శ ఉంది. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ ఇన్‌చార్జిలు మినహా మిగతా వారంతా హైదరాబాద్‌లోనే నివాసం. పార్టీ కార్యక్షికమాలప్పుడు చుట్టంచూపుగా వచ్చి వంటి కారణాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

కమలం శ్రేణుల కదనోత్సాహం
2009 సాధారణ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలవడం కమలం ్రే ణుల్లో సరికొత్త కదనోత్సహానికి దోహదపడింది. యెండల లక్ష్మీనారాయణ వరుస విజయాల పరంపర నీడలో జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అడుగులేస్తోంది. కేసీఆర్ నిరాహారదీక్షల సందర్భంగా ఎగిసిన ఉద్యమాన్ని వేదికగా చేసుకొని బీజేపీ సంస్థాగతంగా పటిష్టత కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉద్యోగుల సహా య నిరాకరణ, సకల జనుల సమ్మె వంటి మలి విడత పోరాటాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని పెంచుకొని పార్టీ శ్రేణులను క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా మార్చింది.

న్యూ డెమోక్షికసీలో నూతనోత్తేజం
ప్రజా సమస్యలపై పనిచేస్తున్న న్యూ డెమోక్షికసీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లడాయి నూతనోత్తేజాన్ని ఇస్తోంది. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లో మాత్రమే కొంతమేరకు ప్రభావితం చూపగలిగిన స్థాయిలో ఉన్న ఆ పార్టీ మలితరం తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వెలుగు వెలుగుతోంది. మిలిటెన్సీ ఎత్తుగడలతో తెలంగాణ ఉద్యమ శక్తుల మెప్పును పొందుతోంది. రచ్చబండ సభల సందర్భంగా వందలాది మంది పోలీసుల కళ్లుగప్పి జై తెలంగాణ నినాదాలతో కిరణ్ సర్కారు ప్రతినిధులకు ఇందూరు గడ్డపై చెమటలు పట్టించారు.

లడాయిలో సీపీఐ చురుకైన పాత్ర
గతంలో ప్రజా సమస్యలపై సభలు, సమావేశాలకే పరిమితమైన సీపీఐ జిల్లాలో మలితరం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషిస్తోంది. తెలంగాణ డిమాండ్‌పై కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్షికమాల్లో సాయుధ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, రక్తం చిందించగలిగిన తెగింపును ఆ పార్టీ నాయకత్వ శ్రేణులు అనేకసార్లు ప్రదర్శించాయి. మిలిటెన్సీ స్వరూ పం కలిగిన కార్యకలాపాలతో తెలంగాణ ఉద్యమంలో సీపీఐ ప్రత్యేకతను చాటుకుంది.

ఇరకాటంలో సీపీఎం
తెలంగాణ ఉద్యమం ఉప్పెనైన తరుణంలో సీపీఎం నీళ్లు, పింఛన్ల కోసమని ఆందోళనల పేరిట తెలంగాణకు పోటీ కార్యాచరణతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పదేళ్లుగా అస్థిత్వం కోసం ఆరాటపడుతున్న సీపీఎం జిల్లాలో బలంగా నాటుకుపోయిన తెలంగాణ ఆకాంక్ష ముందు వెల ఈ పరిస్థితి ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతోంది. దశాబ్దాల తరబడి జిల్లాలో పని చేస్తున్నప్పటికీ సీపీఎంకు జిల్లాలో గ్రామస్థాయి ప్రజావూపతినిధి, పట్టణాల్లో బస్తీస్థాయి ప్రజావూపతినిధి లేకపోవడం గమనార్హం.

Read more...

చిల్లర కొట్టేస్తారు! (FDI Retail)

ఎఫ్‌డీఐలు తథ్యమన్న ప్రధాని పార్లమెంటు నడుస్తుండగానే బయట తేల్చిచెప్పిన మన్మోహన్

- ఎఫ్‌డీఐలపై దద్దరిల్లిన పార్లమెంట్
- ఆరో రోజూ ఆగని విపక్షాల నిరసన
- అఖిలపక్ష సమావేశం విఫలం
- మన్మోహన్‌తో మాట్లాడి చెబుతా
- పార్టీల నేతలతో ప్రణబ్‌ముఖర్జీ
- ఈలోపే తెగేసి చెప్పిన ప్రధాని
- ఎఫ్‌డీఐలు వద్దే వద్దు
- విపక్షంతో గొంతు కలిపిన తృణమూల్
- మరో భాగస్వామి డీఎంకేదీ అదే మాట


‘ఇదేం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై అన్నీ ఆలోచించాం. ఎఫ్‌డీఐలు దేశానికి
లాభదాయకమని మేం గట్టిగా నమ్ముతున్నాం. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా సామాన్యుడికి ప్రయోజనం కలుగుతుంది. నిత్యావసరవస్తువులు చవకకే లభిస్తాయి.
ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంతేకాదు గ్రామీణ మౌలిక సదుపాయాలనుఅభివృద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయోత్పత్తుల్లో వృథాను అరికట్టొచ్చు. రైతులు
తమ పంటలకు సరైన గిట్టుబాటుధరలు పొందొచ్చు’
- కాంగ్రెస్ యువ నేతల సదస్సులో ప్రధాని
మన్మోహన్

0FDI-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
భారత చిల్లర దుకాణ మార్కెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇకపై చెల్లు చీటీ ఇచ్చేయనుంది. ఇప్పటికే సూపర్ మార్కెట్‌ల పేరుతో మరణశయ్యను సిద్ధం చేసిన సర్కారు.. ఇప్పుడు ఇదే రంగంలోకి ఎఫ్‌డీఐల రూపంలో దేశీయ చిల్లర వర్తకానికి ఉరి బిగించేందుకు సిద్ధమైంది. చిల్లర వర్తకంలో చిల్లర కొట్టేసేందుకు విదేశీ కంపెనీలకు రెడ్‌క్పాట్ పరచనుంది. పార్లమెంటులో విపక్షాలు వరుసగా ఆరో రోజూ ఎఫ్‌డీఐలను ముక్తకం వ్యతిరేకించినా.. అనంతరం ప్రణబ్ చొరవతో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ పునరుద్ఘాటించినా సర్కా రు ససేమిరా అన్నది. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ సభను సాగనిచ్చేది లేదని అఖిలపక్ష సమావేశంలో అన్ని విపక్ష పార్టీలూ భీష్మించాయి. దీంతో ప్రధానితో మాట్లాడి మళ్లీ మీ వద్దకు వస్తానని ప్రణబ్ చెప్పిన కాసేపటికే మన్మోహన్ అత్యుత్సాహానికి పోయారు.

దాదాపుగా విధాన ప్రకటన అన్నంత స్థాయిలో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎవరు కాదన్నా చిల్లర వర్తకంలోకి 51శాతం విదేశీ పెట్టుబడులు వచ్చి తీరుతాయని కాంగ్రెస్ యువ నేతల సదస్సులో సంకేతాలు ఇచ్చారు. ఇది ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. పైగా ఇది సామాన్యులకు మేలు కల్గిస్తుందని, వస్తువులన్నీ చౌక ధరలకే లభిస్తాయని వాదించారు. ఈ విధానం దేశానికి లాభదాయకమని చెప్పారు. చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులపై సాక్షాత్తూ సొంత పార్టీ ఎంపీలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి మైండ్‌సెట్ మార్చేందుకు బుధవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియా గాంధీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా యూపీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న తృణమూల్, డీఎంకేలు ఈ విషయంలో విపక్షంతో గొంతు కలిపాయి.

SSSSS-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవల్సిందేనని స్పష్టం చేశాయి. ఇప్పటికే గత ఆరు రోజులుగా ఎఫ్‌డీఐల అంశంపై సభలో రగడ జరుగుతూ వస్తున్నది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలు వస్తే దేశవ్యాప్తంగా చిన్న దుకాణదారులు మాయమవుతారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతాయని ఇతర దేశాల ఉదాహరణలను ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ మార్కెట్‌ల పేరుతో దేశీయ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన అవకాశం చిల్లర వర్తకానికి తీవ్రంగా చేటు చేస్తోందని, అదే ఇప్పుడు విదేశీ కంపెనీలు సైతం అడుగు పెడితే చిల్లర వర్తకం దేశంలో మరణించడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ వర్తకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయినా ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ఎఫ్‌డీఐలను స్వాగతించేందుకే సిద్ధపడుతున్నది. పలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు సైతం ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇది ఏ దిశగా మళ్లుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక గతంలో అణు ఒప్పందాన్ని ఆమోదించుకున్న తీరులోనే ఆరు నూరైనా ఎఫ్‌డీఐలను స్వాగతిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News

Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,
Parliament logjam, FDI in retail, Opposition parties  

Read more...

Tuesday, November 29, 2011

తగ్గనున్న పెట్రోల్ ధర

- లీటర్‌పై రూ.1.02 తగ్గే అవకాశం
- అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్లనే

petrol-pump-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
న్యూఢిల్లీ, నవంబర్ 28: గడిచిన ఏడాదిన్నరగా వినియోగదారుడిపై పెట్రో భారాలు మోపిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం ధరలు తగ్గించడానికి సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ.1.02 తగ్గే అవకాశం ఉందని చమురు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. పెట్రోల్ ధరలపై ఈ నెల 30న జరిగే సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.66.42. ఈ నెల 16న లీటర్ పెట్రోల్‌పై రూ.2.22 తగ్గించిన విషయం తెలిసిందే. నవంబర్ నెల మొదటి పదిహేను రోజులలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 115.85 డాలర్లు, రెండో పదిహేను రోజులలో బ్యారెల్ ధర 107 డాలర్లకు తగ్గింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పెరిగినప్పటికీ పెట్రోల్ ధరలు తగ్గడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 2010 జూన్‌లో నియంవూతణ ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకొకసారి చమురు కంపెనీలు పెట్రో ధరలపై సమీక్ష జరుపుతున్నాయి. 2009 జనవరి తర్వాత పెట్రో ధరలు తగ్గించడం ఇది రెండొసారి.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News  

Read more...

కేంద్ర దళాల్లో కొలువుల జాతర

 - 90 వేల కానిస్టేబుళ్ల భర్తీ
- డిసెంబర్ 3న నోటిఫికేషన్



న్యూఢిల్లీ, నవంబర్ 28: 

కేంద్ర సాయుధ దళాల్లో త్వరలో 90 వేల కానిస్టేబుళ్ల పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయేనుంది.

ఈ నియామకాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపట్టనుంది.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేనెల 3వ తేదీన ఎస్‌ఎస్‌సీ విడుదల చేయనుంది.

గ్రూప్-బీ నాన్ గెజిటెడ్, గ్రూప్-సీ నాన్ టెక్నికల్ పోస్టుల నియామకానికి ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహించనుంది.

ఆస్సాం రైఫిల్స్‌లో  8,724, 
బీఎస్‌ఎఫ్‌లో 16,484, 
సీఐఎస్‌ఎఫ్‌లో 10,240, 
ఎస్‌ఎస్‌బీలో 5,864, 
ఐటీబీపీలో 7,180 
కానిస్టేబుళ్ల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. 

వచ్చే ఏడాది అక్టోబర్ 31 కల్లా భర్తీ చేయాలని ఎస్‌ఎస్‌సీ భావిస్తోంది.




Read more...

వీఆర్వో,వీఆర్‌ఏ పోస్టులకు 7న నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను డిసెంబర్ 7న జారీ చేయనున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 29. జనవరి 30న రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలు ఫిబ్రవరి 15న విడుదల చేసి, అదే నెల 24లోపు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తామని తెలిపారు. అయితే వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి సర్కార్ మాట తప్పింది. వీఆర్‌ఏ పోస్టులు గౌరవ వేతనంతో కూడిన కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే. 1172 వీఆర్‌వో పోస్టులు మాత్రమే శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు.


Take By: T News


Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET,  

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP