Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, November 27, 2011

ఉద్యమానికి ‘భాగ్య’నగరం

 HYD1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 26 (: భిన్నత్వంలో ఏకత్వం అన్న నానుడిని సొంతం చేసుకున్న హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నాటి నగర చారివూతక వైభవం నేటికీ గుభాళిస్తోంది. 1857 సిపాయిల తిరుగుబాటు రోజుల్లోనే.. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన నగరం. సుల్తాన్‌బజార్‌లో వీరత్వానికి చిహ్నంగా కనిపిస్తోన్న తుర్రేబాజ్‌ఖాన్ అమర స్తూపం నేటి తెలంగాణ ఉద్యమానికి ైధైర్యాన్ని నింపుతోంది. శస్త్ర చికిత్సలో అత్యంత ముఖ్యమైన అనస్థీషియా (మత్తు మందు)ను కనిపెట్టిన వైద్యుడు డా.మల్లయ్య, బడుగుల కోసం తాపవూతయపడ్డ కె.కృష్ణస్వామిముదిరాజ్.. ఇలా ఒక్కరేమిటి? వందల సంఖ్యలో ఎందరో మహనీయులు నడయాడిన నేల ఇది. పట్టెడన్నం కోసం పట్నమొచ్చిన ఎవరినైనా అక్కున చేర్చుకుంది. దేశ విదేశీయులనూ తన పొత్తిళ్లల్లో దాచుకుంది. మార్వాడీలు, గుజరాతీలు, బీహారీలు..ఇలా మినీ భారతం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ప్రత్యక్షంగా లక్షలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి భాగ్యనగరం ఉపాధి కల్పిస్తోంది.

ఎంత మందినో భాగ్యవంతులుగా తీర్చిదిద్దింది. అందరూ హైదరాబాదీలతో సమ్మిళితమై హాయిగా బతుకుతున్నారు. కానీ వలసాధిపత్యం కలిగిన సీమాంవూధకు చెందిన కొందరు పెత్తందార్లు మాత్రం జులుం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముల్కీ.. నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ వంటి ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ భాగ్యనగరం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1969లో పునాదులను పటిష్టంగా నిర్మించడంలో నగరవాసుల పాత్ర ఎనలేనిది. తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన ఘనత నగరవాసులకే దక్కుతుంది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నాటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన 369 మందిలో సింహభాగం హైదరాబాదీయులే. ఈ క్రమంలోనే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ఉద్యమానికి ఆలయంగా మారింది. మలి విడత తెలంగాణ ఉద్యమానికి కూడా హైదరాబాద్ కేంద్రమైంది.

కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు
Congress5-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రేటర్ హైదరాబాద్‌లో అధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరుతో పార్టీకి నష్టం చేకూరుతోంది. తెలంగాణ ఉద్యమం పట్ల అంటీముట్టనట్లుగా నాయకులు వ్యవహరిస్తుండటంతో కూడా పార్టీ పట్ల ప్రజలు విముఖత చూపుతున్నారు. ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్, గోషామహల్ నుంచి గెలుపొందిన మూల ముఖేష్‌గౌడ్, కంటోన్మెంట్ నుంచి విజయం సాధించిన శంకర్‌రావు, మహేశ్వరం నుంచి జయకేతనం ఎగురవేసిన సబిత మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. కాగా రెండు పర్యాయాలు సికింవూదాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఎటువంటి పదవిని దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌కు చెందిన మంత్రులు, ఎంపీ మధ్యన ఆధిపత్యపోరు చోటుచేసుకుంది. వీరంతా పైకి కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నా, ఎవరికి వారు అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

టీడీపీలో గ్రూపుల లొల్లి
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరపైకి తీసుకురావడంతో టీడీపీకి ప్రజలు క్రమంగా దూరమవుతున్నారు. ఇక గ్రూపు రాజకీయాలు తోడవ్వడంతో గ్రేటర్ టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారుతోంది. 1983లో జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని విజయఢంకా మోగిస్తే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2002లో మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో కొంత వరకు పార్టీ కేడర్‌ను కాపాడుకోగలిగింది. ప్రస్తుతం గ్రేటర్ టీడీపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా నియోజవర్గాల ఇన్‌చార్జీల ఎంపిక నిలిచిపోయింది. ఇక జనచైతన్య యాత్రల్లో గ్రూపు తగాదాలతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజవర్గాల్లో ఎవరికి వారు తామే నియోజవర్గ ఇన్‌చార్జిలుగా అన్నట్లుగా గ్రూపులు కట్టుకుంటున్నారు. ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నగరంలో పాదయాత్ర చేసినా కొందరు నాయకులు మినహా కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదరు. ఒకనాడు కళకళలాడిన టీడీపీ ఇప్పుడు వెళ చెప్పవచ్చు.

బీజేపీకి జీవం పోసిన ఉద్యమం
Bjp2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రేటర్‌లో పూర్తిగా చతికిలపడిపోయిన భారతీయ జనతాపార్టీకి తెలంగాణ ఉద్యమం మళ్లీ జీవం పోసింది. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కలహాలతో బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడంతో పార్టీ నిర్వీర్యం అయ్యింది. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో ఉద్యమం ఆ పార్టీకి కలిసొచ్చింది. గ్రేటర్‌లో రెండు నియోజక వర్గాలకే పరిమితమైన బీజేపీకి ఉద్యమం, బీజేపీ జాతీయ నేత అద్వానీ రథయావూతతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. గ్రేటర్‌లో ఒక ఎమ్మెల్యే, ఐదుగురు కార్పొరేటర్లకు పరిమితమైన బీజేపీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు విశ్వవూపయత్నం చేస్తున్నారు.

పుంజుకుంటున్న ఎంబీటీ
పాతనగరంలో మజ్లీస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్షికమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు మజ్లిస్ బచావ్ తహెరిక్ (ఎంబీటీ) సత్తా చాటుతోంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ వాదంతో మైనార్టీ వర్గాలను ప్రభావితం చేస్తోంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రెండోసారి ఈ పార్టీ కన్వీనర్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. మైనార్టీల్లోని పలు గ్రూపుల మధ్య విభేధాలకు ఆజ్యం పోస్తున్న మజ్లిస్ వ్యవహారాలు ఎంబీటీకి బలం చేకూరుస్తున్నాయి.

ఉద్యమంతో సీపీఐకి ఊపిరి
CPI1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవామపక్ష పార్టీలలో సీపీఐ తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ఉద్యమం సీపీఐకి బాగా కలిసొచ్చింది. పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నుంచి మళ్లీ కేడర్ బలోపేతం చేసుకునే దిశగా పార్టీ కార్యక్షికమాలు రూపొందించుకుంటోంది. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. సీపీఎం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో గ్రేటర్‌లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

ఉనికి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యత్నాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. అధినేత జగన్ చరిష్మాతో పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు సమస్యగా మారింది. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ప్రకటించకపోవడం, పటిష్టమైన కేడర్ లేకపోవడం కూడా పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయవూపకాష్ నారాయణ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఓటమి భయంతో అక్టోబర్‌లో జరిగిన కేపీహెచ్‌బీకాలనీ డివిజన్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యంపార్టీకీ ప్రజల ఆదరణ కరువై బొక్కబోర్లాపడింది. ప్రజాక్షేవూతంలోఎక్కువ కాలం నిలవలేక జెండా ఎత్తేయడంతో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు.

పట్టుబిగిస్తున్న టీఆర్‌ఎస్
TRS2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్‌లో క్రమంగా పట్టుబిగిస్తోంది. ఉద్యమానికి కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. కేసీఆర్ ఆమరణ దీక్ష తరువాత నగరంలోని తెలంగాణవాదం బయటపడింది. మిలియన్‌మార్చ్, ఓయూ విద్యార్థుల ఉద్యమం టీఆర్‌ఎస్‌కు స్ఫూర్తినిచ్చింది. సకలజనుల సమ్మెనాటికి అది మహోధృతంగా మారి టీఆర్‌ఎస్‌కు కొండంత అండగా నిలిచింది. విద్యావంతులు, ఉద్యోగులు, యువతరం తెలంగాణవాదంతో టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడుతున్నారు. ఇటీవల నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి ఒకవైపు హరీష్‌రావు, మరోవైపు కేటీఆర్‌లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. విభిన్న సంస్కృతుల కలయికతో ఉన్న నగరంలో రాష్ట్ర సాధన కోసం ఇచ్చిన ప్రతి పిలుపుకు ప్రజలు స్పందించి తెలంగాణవాదాన్ని చాటిచెప్పారు. సీమాంధ్ర వలసవాదులు ఉన్న కొన్ని ప్రాంతాలలో తప్ప హైదరాబాద్‌లో తెలంగాణవాదం బలంగానే ఉంది. ఇటీవల కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ నియోజవర్గాల్లో నిర్వహించిన పాదయావూతలకు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందననే ఇందుకు సాక్ష్యం.

నిర్ణయాత్మక శక్తిగా మజ్లిస్
మైనార్టీల ప్రతినిధిగా ముద్రపడిన ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఆరంభంలో కేవలం మున్సిపల్ ఎన్నికలకు పరిమితమైన మజ్లిస్, ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానం కూడా దక్కించుకుని గ్రేటర్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆ పార్టీకి చెందిన దివంగత నేత సలావుద్దీన్ ఒవైసీ ముందుచూపు, అసదుద్దీన్ ఒవైసీ దూరదృష్టితో ఎంఐఎం రాజకీయ ప్రాబల్యం క్రమంగా పెరిగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో సైతం 42 కార్పొరేటర్ స్థానాలను దక్కించుని నిర్ణయాత్మకశక్తిగా మారింది. అయితే ఒంటెత్తు పోకడల నేపథ్యంలో ఎంఐఎంపై మైనార్టీలో వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అత్యధికంగా మైనార్టీలు కోరుతుండటంతో ఆ పార్టీ చిక్కుల్లో పడింది. పాత నగరం అభివృద్ధి పై కపట ప్రేమతో వ్యవహరించడం కూడా స్థానిక మైనార్టీ ఒటర్లకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షగా భాగస్వామ్యం అవుతున్న జమాతే ఇస్లామియా, ఇతరత్రా మైనార్టీ సంఘాల కూటమిలు మజ్లీస్ పార్టీకి ధీటూగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. .

Take By: T News http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News 
 

Read more...

గిరిజన సంక్షేమ శాఖలో 700 పోస్టుల భర్తీకి ఓకే

 -ట్రైటా దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పసుపులేటి
 
ఎల్బీనగర్, నవంబర్ 26 (: గిరిజన గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. శనివారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం(ట్రైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో 700 పోస్టులను భర్తీ చేయ డానికి అనుమతి లభించిందని, 1900 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చేందుకు టీచర్లు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ళ సర్వీసును పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను మంత్రి బాలరాజు సన్మానించారు. ట్రైటా అధ్యక్షుడు టి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రైటా ప్రధాన కార్యదర్శి బి.సీతామనోహర్‌రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Take By: T News


Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Kirankumar Reddy,




Read more...

ఉన్నది ఉన్నట్టు రాయండి

- పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సీఎం కిరణ్‌కుమార్‌డ్డి
- ప్రజాస్వామ్య విలువలకు వేదికలు కావాలి: మండలి చైర్మన్ చక్రపాణి
- జర్నలిస్టుల కోసం 13 రకాల అవార్డులు: డీకే అరుణ
- ఘనంగా ఐజేయూ ఏడో ప్లీనరీ
- హాజరైన సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులు

amar1 talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 26 ():విలేకరులు వార్తలను వార్తల్లాగా రాయడం లేదని, వ్యక్తిగత అభివూపాయాలను జోడించి వార్తారచన చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అభివూపాయపడ్డారు. ఎలక్షిక్టానిక్, ప్రింట్ మీడియాలలో ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా రావడం లేదన్నారు. వార్తలకు వ్యాఖ్యానాలను కలిపి ప్రచురిస్తున్నారని, దాంతో ప్రధానమైన అంశం పక్కదారి పడుతున్నదని, అసందర్భమైన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. విలేకరులు వార్తారచనలో నిజాలు, నిజాయితీకి, ప్రమాణాలు, విలువలకు, ప్రాధాన్యం ఇచ్చి విశ్వసనీయతను పెంచుకోవాలని, అభివూపాయాలను సంపాదకీయాల్లోనే వ్యక్తీకరించాలని సూచించారు. పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపాలని, రుగ్మతలపై పాలకులు దృష్టి సారించే విధంగా అవి చేసే విమర్శల్లో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు. ఇమేజ్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఏడో ప్లీనరీ ప్రారంభ సదస్సులో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్షికమంలో సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బీ వెంక తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం చైర్మన్ కే శ్రీనివాస్‌డ్డి, ఐజేయు ప్రధాన కార్యదర్శి డీ అమర్, ఐజేయు జాతీయ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సిన్హా, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌డ్డి, ఐజేయు నాయకులు అమర్‌నాథ్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. తెలుగు పత్రికా రంగంలోని సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులతో సభాస్థలి కిటకిటలాడింది. హెచ్‌ఎంటీవీ సీఈఓ కే రామచంవూదమూర్తి, సీనియర్ సంపాదకులు వెంకవూటావు, ఆంధ్రజ్యోతి మాజీ డిప్యూటీ ఎడిటర్ ఉపేంద్రబాబు, హన్స్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి, జీ 24 గంటలు చానెల్ సీఈఓ శైలేశ్‌డ్డి తదితర ప్రముఖ జర్నలిస్టులు, సంపాదకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

amartalangana patrika telangana culture telangana politics telangana cinemaఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు పత్రికలు, చానళ్లు విశ్వసనీయతను కోల్పోయాయని, ఏ ఒక్క పత్రికపైన ప్రజలకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. సర్క్యులేషన్, టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడమే ధ్యేయంగా పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయన్నారు. తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ.. శాశ్వత ప్రయోజనాలు, విలువలను విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో విలేకరులు రాసిన వార్తలను, యాజమాన్యాలు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. విలేకరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం సమంజసం కాదని సీఎం వ్యాఖ్యానించారు. చానళ్లు, కొన్ని సంఘటనలను జుగుప్సాకరంగా ప్రసారం చేస్తున్నాయని, కొన్ని దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు ఎలక్షిక్టానిక్ మీడియా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్లకు పత్రికలు వేదికలు కావాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయం చేయడం వల్ల రైతులు కష్టాలపాలవుతున్నారని, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై రైతులు దృష్టి సారించాలని తాను చెప్పిన మాటలను వక్రీకరించి శీర్షికలను ప్రచురించారని ఆయన మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రచ్చబండలో నలుగురు ప్రశ్నిస్తే, దానిని తాటికాయంత అక్షరాలతో రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు ఏ పత్రికను, ఏ చానల్‌ను నమ్మడం లేదని, రెండో పత్రిక, రెండో చానల్‌ను చూసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు ప్రతికలు దర్పణం కావాలని చైర్మన్ పేర్కొన్నారు.

సమాచార శాఖ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా 13 రకాల పురస్కారాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్షికమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఐజేయు అధ్యక్షులు ఎస్‌ఎన్ సిన్హా మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్రికలు, చానళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కే శ్రీనివాస్‌డ్డి మాట్లాడుతూ ఐజేయు సాధించిన విజయాలను, తదుపరి కార్యాచరణను, వేజ్‌బోర్డు విధానాలను వివరించారు.

Read more...

ప్రత్యేక ‘ఆంధ్రా’ మండళ్లు

- సెజ్‌లలోనూ సీమాంవూధులదే హవా
- రాజధాని చుట్టూ వారిదే ఆధిపత్యం
- 10కిపైగా సీమాంధ్ర పెట్టుబడిదారులవే
- సత్యం, మేటాస్, శ్రీని, అనంత్, నవయుగ, ల్యాంకో, ఇందు... ఇదో చాంతాడు
- అభివృద్ధి ముసుగులో భూములు స్వాహా
- లొసుగుల పునాదులపై రియల్ దందా
- ల్యాంకోహిల్స్, ఎమ్మార్, ఐటీ పార్కులే నిదర్శనాలు
- పాలకులకు కాసుల వర్షం

real105-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపేరుకు అవి ప్రత్యేక ఆర్థిక మండళ్లు! కానీ తరచి చూస్తే అవి ప్రత్యేక ఆంధ్ర మండళ్లు! సత్యం, మేటాస్, శ్రీని, అనంత్, నవయుగ, ఇందు... చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తేలుతుంది. నయా ఆర్థిక విధానాల అమలు క్రమంలో కార్మిక హక్కులను కాలరాస్తూ.. భారీ మినహాయింపులు పొందుతూ సెజ్‌లు పుట్టుకొచ్చాయి. సెజ్‌ల చట్టంలో లొసుగులు ఆధారం చేసుకుని అసలు సంగతి పక్కనపె రియల్‌దందా మొదలు పెట్టాయి. పోగుపడిన సంపదను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న సీమాంధ్ర బడాబాబులకు ఈ సెజ్‌లు వరంగా పరిణమించాయి. వారి ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తోడవడంతో సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి అంతే లేకుండా పోయింది. ఇప్పుడు సెజ్‌లంటే సీమాంవూధుల ఆధిపత్యమే కనిపించే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో అదే అభివృద్ధిగా నాడు చంద్రబాబు నాయుడు అనంతరం వైఎస్ రాజశేఖర్‌డ్డి ఉద్ఘోషించారు. ఆ అభివృద్ధి ఫలాలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని చూస్తే.. అక్కడా సీమాంవూధులే కనిపిస్తున్నారు.

( హైదరాబాద్) ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలోనూ సీమాంధ్ర హవా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఉన్న సెజ్‌లే కాకుండా.. ఇటీవల ప్రారంభమైన సెజ్‌లలోనూ వారిదే ఆధిపత్యం. సెజ్‌ల పేరుతో భూములు స్వాహా చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు.. నిబంధనల్లో లొసుగులను ఆధారం చేసుకుని రియల్ వ్యాపారం చేస్తున్నారు. సెజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనూ సెజ్‌లు వచ్చాయి. ఆ సమయంలో ఎక్కువగా ఐటీ రంగం ఊపులో ఉండడం వల్ల ఐటీ సెజ్‌లు ఎక్కువగా వెలిశాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 73 సెజ్‌లుండగా వాటిలో పూర్తిగా ఆంధ్రవూపదేశ్ ఇండవూస్టియల్ ఇన్‌వూఫావూస్టక్చర్స్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నవి 17, ఏపీఐఐసీ భాగస్వామిగా ఉండి ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవి 29, పూర్తిగా ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవి 25 ఉన్నాయి. వీటిలో పూర్తిగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్నవాటికి ప్రైవేటు వ్యక్తులతో సంబంధం ఉండదు. అయితే, ఏపీఐఐసీ సహకారంతో ప్రైవేటు డెవలపర్స్ భాగస్వామ్యంతో ఏపీఐఐసీ అభివృద్ది చేసేవాటిలో, ప్రైవేటు డెవలపర్స్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నవాటిలోనే సీమాంవూధులు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు.

ఏపీఐఐసీ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న సెజ్‌లలో హైదరాబాద్ చుట్టుపక్కల.. అంటే రంగాడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న సెజ్‌ల సంఖ్య 19. వీటిలో ఎక్కువ భాగం ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులకు చెందిన కంపెనీలు పెట్టుకునే సెజ్‌లదే. వీటిలో పక్కాగా సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన సెజ్‌లు కూడా ఉన్నాయి. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఉన్న ప్రతి సెజ్‌లోనూ పరోక్షంగా సీమాంధ్ర బడాబాబులకు వారి ద్వారా పాలకులకు లాభం జరిగింది. వీటిలో జరిగిన అక్రమాల్లో ఏపీఐఐసీ వాటా తగ్గించి భూములు అందినకాడికి లాక్కోవడం, మిగతావి అమ్ముకుని జేబులో వేసుకున్నారని ఇటీవల వెలుగు చూసిన అక్రమాలే చెబుతున్నాయి.

ఇవికాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైవేటు డెవలపర్స్ డెవలప్ చేస్తున్న సెజ్‌లు చాలా ఉన్నాయి. వీటిలో శేరిలింగంపల్లిలోని ఏపీ టెక్నో ప్రాజెక్ట్ ప్రైవేట లిమిటెడ్ (24.70 ఎకరాలు, ఐటీ), బహదూర్‌పల్లిలోని సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ (25.98, ఐటీ), సీఎంసీ లిమిటెడ్ (50 ఎకరాలు), సంఘీ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ (202.40, ఐటీ), మేటాస్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ సెజ్ లిమిటెడ్ (15.92 ఎకరాలు, ఐటీ), రుద్రదేవ్ ఇన్ఫోపార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (12.25 ఎకరాలు, ఐటీ), మహవీర్ సై్క స్క్రాపర్స్ (56.27ఎకరాలు, ఐటీ), మేటాస్ ప్రాపర్టీస్ (73 ఎకరాలు, ఐటీ), శ్రీని ప్రాపర్టీస్ (66ఎకరాలు, ఐటీ), నవయుగ లీగల్ ఎస్టేట్స్ (25 ఎకరాలు, ఐటీ), జెన్‌ప్యాక్ట్ ఇండియా (50ఎకరాలు,ఐటీ), వివో బయోటెక్ లిమిటెడ్ (27ఎకరాలు), ఎస్2 టెక్ లిమిటెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (25ఎకరాలు, ఐటీ),

జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (251ఎకరాలు, ఏవియేషన్), ఇన్‌ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ (296 ఎకరాలు, ఐటీ), దేవ్ భూమి రియల్టర్స్ (25ఎకరాలు, ఐటీ), అనంత్‌టెక్నాలజీస్ (25 ఎకరాలు, ఐటీ), గోద్రేజ్ రియల్‌ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (34 ఎకరాలు, ఐటీ), లహరి ఇన్‌వూఫావూస్టక్చర్స్ (25 ఎకరాలు,ఐటీ), బయాలజికల్ ఈ లిమిటెడ్ (25ఎకరాలు, బయోటెక్ సెజ్), మధుశీల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (25 ఎకరాలు,ఐటీ) సెజ్‌లున్నాయి. వీటిలో కొన్ని జాతీయ,అంతర్జాతీయ కంపెనీలకు చెందిన సెజ్‌లుండగా సత్యం, మేటాస్, నవయుగ, జీఎంఆర్ ఇంటర్నేషనల్, అనంత్ టెక్నాలజీస్, శ్రీని ప్రాపర్టీస్, బయలాజికల్ ఈ లిమిటెడ్ లాంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన సెజ్‌లూ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ డెవలపర్ భూమి సమకూర్చుకున్న అనంతరం కేంద్రవూపభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సెజ్‌గా నోటిఫై చేస్తుంది. వీటిలో కంపెనీల రాక, నిర్వహణ, పర్యవేక్షణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ చూస్తుంటారు. ఇలా ఏపీఐఐసీ భాగస్వామ్యం, ప్రైవేటుకు చెందిన సెజ్‌లన్నింటికీ సెజ్ చట్టం 2005 కిందే అన్ని రకాల రాయితీలు, ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటారు.

ఇదీ సెజ్ చట్టం
పరిక్షిశమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికిగాను భారత ప్రభుత్వం 2005లో స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టాన్ని (సెజ్ యాక్ట్) రూపొందించింది. అప్పటి వరకు ఫారన్ ట్రేడ్ పాలసీ కింద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం సమగ్ర విధివిధానాలతో స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టం-2005 తయారైంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల బిల్లు మే 2005లో పార్లమెంటు ఆమోదం పొందింది. 2006 ఫిబ్రవరి 10 నుంచి ఇది అమలులోకి వచ్చింది.పలు రంగాలకు చెందిన పరిక్షిశమలను ప్రోత్సహించడానికి కొంత భూమిని ప్రభుత్వమే డెవలపర్‌కు అప్పగిస్తుంది.
ఆ ప్రదేశంలో పరిక్షిశమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రాయితీలు ఇస్తాయి.

ఇది ఒక పద్ధతి కాగా, మరో పద్ధతిలో సొంత భూమి కలిగి ఉన్న ప్రైవేటు డెవలపర్ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని రకాలు పరిశీలించిన మీదట ఆ ప్రదేశాన్ని సెజ్‌గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. దేనిని ఉద్దేశించి ఆ సెజ్ పెట్టుకున్నారో అందులో వచ్చే పరిక్షిశమలన్నింటికీ రాయితీలు సెజ్ చట్టం 2005 ప్రకారం రాయితీలు కల్పిస్తారు. సెజ్‌లో వచ్చే పరిక్షిశమలకు మొదటి 5 సంవత్సరాల పాటు 100% ఆదాయం పన్ను మినహాయింపు, తర్వాతి 5 సంవత్సరాలకు 50 శాతం ఆదాయ పన్ను మినహాయింపు, డ్యూటీ ఫ్రీ దిగుమతులు, మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మినహాయింపు,

ఎలాంటి పరిమితులు లేకుండా గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి సంవత్సరానికి 500 మిలియన్ డాలర్ల రుణం తీసుకోవడానికి అనుమతి, అమ్మకపు పన్ను మినహాయింపు, సేవా పన్ను మినహాయింపు, రాష్ట్రాల సేవా పన్ను మినహాయింపుతో పాటు సె్ నుంచి జరిగిన ఎగుమతులపై వచ్చిన ఆదాయంపై 10ఏళ్ల పాటు మినహాయింపులాంటి ఎన్నో భారీ రాయితీలు సెజ్ డెవలపర్‌కు కల్పిస్తారు. ఇన్ని రాయితీలతో పాటు ఎన్నో లొసుగులున్న సెజ్ చట్టాన్ని చూస్తే పెట్టుబడిదారుపూవరికైనా నోరూరుతుంది. అందులోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎక్కడ రాయితీలుంటే అక్కడ వాలిపోతుంటారు.

సెజ్‌ల ముసుగులో రియల్ వ్యాపారం
సాధారణంగా సెజ్‌లలో ప్రాసెసింగ్ ప్రదేశం, నాన్ ప్రాసెసింగ్ ప్రదేశం ఉంటాయి. వీటిలో నాన్ ప్రాసెసింగ్ ప్రదేశంలో సెజ్‌లో ఉద్దేశించిన కంపెనీలు రాకముందే వాటితో సంబంధం లేకుండా కమర్షియల్ కాంప్లెక్సులు, రెసిడెన్షియల్ టవర్లు, థియేటర్లు, రిక్రియేషన్ క్లబ్‌లు, రెస్టాంట్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు, కార్లసర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు భూముల విలువ ఎక్కువగా ఉండే రంగాడ్డి జిల్లాలో సెజ్‌ల పేరుతో భూమి తీసుకొని వాటిలో ఎలాంటి కంపెనీలు రాకముందే ఇళ్లు నిర్మించి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. లాంకోహిల్స్ టెక్నాలజీ ప్రైవేట్ పార్క్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉదంతాలు ఇందుకు నిదర్శనం.

ఇవి ఐటీ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెజ్‌లని చాలా మందికి తెలియదు. కంపెనీల రాకకంటే ముందే ఇక్కడ వెలసిన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గోల్ఫ్‌కోర్సులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం... వాటిని అమ్ముకునేందుకు ఫక్తు రియల్‌ఎస్టేట్ కంపెనీల మాదిరిగా ప్రచారం ఇవన్నీ తెలిసిందే. లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హి్ టెక్నాలజీ పార్క్, సీమాంధ్ర పాలకులందరి హస్తమున్న ఎమ్మార్ టౌన్‌షిప్ హిల్స్‌పై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా సెజ్ చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల రంగాడ్డి, మెదక్‌జిల్లాల్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను సెజ్‌ల ముసుగులో కాజేసి సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు కలిసి తెగనమ్ముకుంటున్నారు.


Read more...

Saturday, November 26, 2011

తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ అవే ప్రకంపనలు

- ఐదో రోజూ అదే తీరు
- సోమవారానికి వాయిదా
- వెల్‌లోకి దూసుకెళ్ళిన కేసీఆర్, విజయశాంతి
- ప్లకార్డులతో టీ కాంగ్రెస్ ఎంపీల నినాదాలు
- ఆజాద్ సూచన బేఖాతరు
- తెలంగాణే ముఖ్యం.. బలికాలేమని స్పష్టీకరణ
- తెలంగాణ ప్రాధాన్యం వివరించిన టీ ఎంపీలు


KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 25 (టీన్యూస్):పార్లమెంటును వరుసగా ఐదో రోజూ తెలంగాణ ప్రకంపనలు కుదిపేశాయి. గత నాలుగు రోజులుగా తెలంగాణ నినాదాలతో హోరెత్తిన లోక్‌సభ శుక్రవారం కూడా దద్దరిల్లింది. తెలంగాణ అంశంపై నిర్మాణాత్మక చర్చ జరగనంతవరకు స్పీకర్ పోడియాన్ని వీడేదిలేదంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి పట్టుపట్టడంతో సభ సోమవారానికి వాయిదాపడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ ప్రాంత ఎంపీలు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టగా, రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర పక్షాలు గళమెత్తాయి. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ టీ కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాధం, రాజయ్య, పొన్నం ప్రభాకర్, వివేక్, మధు యాష్కీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తుంటే, టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడులపై చర్చ జరగాల్సిందేనని విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మొదటిసారి వాయిదా పడింది. సభ పునఃవూపారంభమైన తర్వాత, శరద్ పవార్‌పై జరిగిన దాడికి విచారం వ్యక్తం చేసిన స్పీకర్, దానిపై చర్చను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనపై జరిగిన దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు.

Read More


http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=3&ContentId=48176 




Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9,  Sima Andra, AP News, MP, Political News , Lok Sabha

Read more...

Grear Cartoon ----------------- JustThinsk !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Read more...

14 కొత్త మునిసిపాలిటీలకు సీఎం ఆమోదం

హైదరాబాద్, నవంబర్ 25(): రాష్ట్రంలో 14 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌డ్డి శుక్రవారం అమోదం తెలిపారు. రాష్ట్రంలో 57 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. వీటిలో అన్ని రకాల పరిశీలనలు పూర్తయిన తర్వాత 49 మున్సిపాలిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 26 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 23లో 14 మున్సిపాలిటీలకు సీఎం తాజాగా పచ్చజెండా ఊపారు. మెదక్‌లోని గజ్వేల్, నల్లగొండలోని దేవరకొండ, శ్రీకాకుళంలోని టెక్కలి, తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, విశాఖలోని యలమంచిలి, నర్సీపట్నం, నెల్లూరులోని ఆత్మకూరు, సూళ్లూరుపేట, కడపలోని మైదుకూరు, కర్నూలులోని నందికొట్కూరు, ఆళగడ్డ, ఆత్మకూరు, కృష్ణా జిల్లాలోని నండికొండ, ఉయ్యూరులు కొత్త మునిసిపాలిటీలు ఏర్పడనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వారం రోజులో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 9 మున్సిపాలిటీలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Sima Andra, AP News,  Political News, 
 

Read more...

జన్మభూమికి జననేత...

-పెద్దపల్లికి రానున్న కిషన్‌జీ భౌతికకాయం
-రెండు రోజుల్లో వచ్చే అవకాశం
-స్వయంగా ప్రకటించిన బెంగాల్ సీఎం మమత
-ఏర్పాట్లు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ సీఎస్
-భౌతికకాయం ఎప్పుడొచ్చేదీ తెలిశాకే అంత్యక్షికియలపై నిర్ణయం
-కిషన్‌జీ అన్న ఆంజనేయులు వెల్లడి
-బంధువులు, సన్నిహితుల రోదనలతో బ్రాహ్మణవీధి
-కోల్‌కతా చేరుకున్న కోటన్న అన్న పిల్లలు
-మిడ్నాపూర్‌లో భౌతికకాయం.. గుర్తించేందుకు వెళ్లిన దీప, ప్రదీప్, వీవీ
-నేడు పోస్టుమార్టం జరిగే అవకాశం: బెంగాల్ డీజీపీ పుర్కాయస్థ వెల్లడి
-సుచిత్ర కోసం ముమ్మరంగా వేట..మిడ్నాపూర్‌లో జాడలు!


dead-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకోల్‌కతా, మిడ్నాపూర్, నవంబర్ 25 :బెంగాల్ అడవుల్లో ఎన్‌కౌంటరయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన ఆంధ్రవూపదేశ్‌లోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలించనున్నారు. బెంగాల్‌లో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆయన భౌతికకాయాన్ని ఆంధ్రవూపదేశ్‌కు పంపించనుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘మృతదేహాన్ని పంపుతాం’’ అని మమత చెప్పారు. కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన స్వరాష్ట్రానికి పంపుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆమె పై విధంగా స్పందించారు. కిషన్‌జీ మృతదేహాన్ని కోల్‌కతాకు తీసుకువచ్చి, ఇక్కడి నుంచి ఆంధ్రవూపదేశ్‌కు పంపనున్నట్లు అదనపు డీజీపీ ఎస్ పుర్కాయస్థ చెప్పారు. అంతకు ముందు కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన అన్న కుమార్తె దీప, కుమారుడు ప్రదీప్ గుర్తించనున్నారు. ఇందుకోసం వారు ఆంధ్రవూపదేశ్ నుంచి శుక్రవారం కోల్‌కతా చేరుకున్నారు. వీరి వెంట విరసం నేత వరవరరావు కూడా ఉన్నారు. ప్రస్తుతం కిషన్‌జీ భౌతికకాయం మిడ్నాపూర్ సదర్ ఆస్పవూతిలో ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన బురిసోల్ గ్రామం నుంచి తొలుత ఝర్‌క్షిగామ్ ఆస్పత్రి మార్చురీకి కిషన్‌జీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడి నుంచి మిడ్నాపూర్‌కు పంపారు. భౌతికకాయాన్ని గుర్తించేందుకు వరవరరావుతో కలిసి దీప, ప్రదీప్‌లు శుక్రవారం రాత్రే మిడ్నాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. పోస్టుమార్టం జరిగిన తర్వాత కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబీకులకు అప్పగించనున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం రెండు రోజులు పడుతుందని అంటున్నారు. బహుశా ఆదివారం లేదా సోమవారం కిషన్‌జీ మృతదేహం వస్తుందని భావిస్తున్నారు.

ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత అంత్యక్షికియలపై ఒక ప్రకటన చేస్తామని కోటేశ్వరరావు అన్న ఆంజనేయులు తెలిపారు. పెద్దపల్లిలోని ఆయన నివాసం అంతా కోటేశ్వరరావు, ఆయన తమ్ముడు వేణుగోపాల్ సోపతిగాళ్లతో నిండిపోయింది. కోటన్నగా పిలుచుకునే కోటేశ్వరరావు ఇక లేరన్న సంగతి తెలుసుకుని వచ్చిన మల్లోజుల స్నేహితులు, బంధువులతో పెద్దపల్లిలోని బ్రాహ్మణ వీధి విషణ్ణవదనం దాల్చింది. కోటేశ్వరరావు అన్న అంజనేయులు, ఆయన కొడుకు సంతోష్‌లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ బూటకమని, న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొడుకు మరణవార్తను తట్టుకోలేకపోయిన తల్లి మధురమ్మ మంచం పట్టారు. పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. కొడుకు ఆఖరి చూపుల కోసం కన్నీరుమున్నీరవుతూ ఎదురు చూస్తున్నారు. కాగా, కోల్‌కతాకు కిషన్‌జీ భౌతికకాయాన్ని తీసుకువచ్చే సమయంలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేయనున్నట్లు డీజీపీ పుర్కాయస్థ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి, మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మొదటి పది మంది వీవీఐపీల భద్రతను మరింత పెంచనున్నట్లు పుర్కాయస్థ చెప్పారు. పోస్టుమార్టం శనివారం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సమర్ ఘోష్ ధ్రువీకరించారు.

కిషన్‌జీ బంధువులతో మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని ఆంధ్రవూపదేశ్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందుకోసం ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే.. సాధారణ ప్రొసీజర్లు ఉంటాయని చెప్పారు. పోస్టుమార్టం ఎక్కడ జరపాలనే విషయంలో ఇంకా ఆలోచన చేస్తున్నామని హోం శాఖ కార్యదర్శి జీ డీ గౌతమ చెప్పారు. పోస్టుమార్టం జరిగేటప్పుడు ఒక ఫోరెన్సిక్ బృందం ఉంటుందని, అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని కోటేశ్వరరావు అన్న ఆంజనేయులు రక్త నమూనాలను స్థానిక పోలీసులు సేకరించారు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన అప్రమత్తతలో భాగంగా కిషన్‌జీ స్వగ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికోసం కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దింపారు. కిషన్‌జీ భౌతికకాయాన్ని గుర్తించి, స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వరవరరావు, దీపారావు, ప్రదీప్ ఆంధ్రవూపదేశ్ నుంచి శుక్రవారం ఉదయం బయల్దేరి కోల్‌కతా చేరుకున్నారు. వారితో పాటు పలువురు మావోయిస్టు సానుభూతిపరులు కూడా వచ్చారు. కిషన్‌జీని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపే ముందు ఆయనను చిత్ర హింసలకు గురి చేశారని వరవరరావు ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కిషన్‌జీని అమానుషంగా చిత్రహింసలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆయన శరీరంపై అనేక లోతైన గాయాలు ఉన్నాయి. పట్టుబడిన 24 గంటల తర్వాత ఆయనను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం నిబంధనల ప్రకారం ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక రాజకీయ కార్యకర్తగా పరిగణించి ఆయన భౌతికకాయాన్ని గౌరవవూపదంగా ఆయన కుటంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

తొలుత వరవరరావు, ఆయన వెంట వచ్చిన వారిని కోల్‌కతా విమానాక్షిశయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. కొంత వాగ్వాదం తర్వాత వారిని నగరంలోకి అనుమతించారు. ఇదిలా ఉండగా.. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శితో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప్రమత్తతను ప్రకటించారు. మరోవైపు.. తప్పించుకున్న మహిళా మావోయిస్టు సుచిత్ర కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో దొరికిన ఒక పర్స్.. సుచివూతదిగా భావిస్తున్నారు. దీంతో తాజా వేటను భద్రతా దళాలు ప్రారంభించాయి. సుచిత్ర కోసం సీఆర్పీఎఫ్‌కు చెందిన 167, 184వ బెటాలియన్‌లు, సీఐఎస్‌ఎఫ్, కోబ్రా దళాలు దాదాపు వెయ్యి మంది కూంబింగ్ జరుపుతున్నారు. ఈ ఆపరేషన్‌లో పోలీసు జాగిలం బ్రునో కూడా ఉంది. గాయపడిన మావోయిస్టులు చికిత్స కోసం వస్తారనే ఆలోచనతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పవూతుల వద్ద నిఘా పెట్టారు. కిషన్‌జీని నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపారని మావోయిస్టు పార్టీ బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకాష్ కూడా ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా శని, ఆదివారాల్లో రెండు రోజుల బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చారు.

అది బూటకపు ఎన్‌కౌంటరే..
కిషన్‌జీ బూటకపు ఎన్‌కౌంటర్‌లోనే మరణించారని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు విమర్శించాయి. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ఏకంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సీపీఐ నేత గురుదాస్‌దాస్ గుప్తా లేఖ రాశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత మోహన్‌సింగ్ కూడా ఇదే అభివూపాయం వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని మమత ప్రభుత్వం గతంలో ఆజాద్ ఎన్‌కౌంటర్‌ను తలపించేలా కిషన్‌జీని హతమార్చిందని సీపీఐ ఎంఎల్ నేతలు రాజ్ కుమార్ సింగ్, కృష్ణ అధికారి పాట్నాలో ఆరోపించారు. జంగల్‌మహల్లో స్థానికుల మద్దతుతోనే మల్లోజుల ఎన్‌కౌంటర్ జరిగిందని బెంగాల్ నటి అపర్ణాసేన్ అభివూపాయం వ్యక్తం చేశారు.

మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించండి:కేసీఆర్
కిషన్‌జీ భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు బేషరతుగా అప్పగించాలని ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కిషన్‌జీ భౌతికకాయాన్ని కరీంనగర్ జిల్లాలోని ఆయన స్వగృహనికి తరలించే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. 

Take By: T News

Tags: Telangana News,  AP News, Political News, Kishenji deathMaoist leaderSuchitra MahatoJungalmahal encounter
 

Read more...

Friday, November 25, 2011

‘డ్యామ్ 999’ ప్రదర్శనపై నిషేధం - Dam 999

- తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు
- సుప్రీంకు వెళ్లే యోచనలో సినిమా దర్శకుడు


dam talangana patrika telangana culture telangana politics telangana cinemaచ్నై, నవంబర్ 24: వివిధ రాజకీయ పక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వివాదాస్పద చిత్రం ‘డ్యామ్ 999’ ప్రదర్శనపై నిషేధం విధించింది. కేరళతో సంబంధాలు దెబ్బతింటాయని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ముల్లపెరియార్ డ్యామ్ ఇతివృత్తంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చిత్ర దర్శకుడు సోహన్ రాయ్ వెల్లడించారు.

ఈ నిషేధంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, సినిమాల విషయంలో ఇలా వ్యవహరించకూడదని అభివూపాయపడ్డారు. కేరళలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో డ్యామ్ పరిసర ప్రాంతాలలో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా కేంద్రాన్ని అభ్యర్థించారు. కొత్త డ్యామ్ నిర్మాణం విషయంలో సహకరించవలసిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు బుధవారం ఒక లేఖ రాశారు. కొత్త డ్యామ్ ఆలోచన చేయకూడదని కేరళకు సూచించాల్సిందిగా ప్రధానిని కోరారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో నెలకొని ఉన్న ఈ డ్యామ్ 116 ఏళ్ల క్రితం నిర్మించారు. కేరళలో ఉన్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దక్షిణ తమిళనాడు జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తుంది. దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి 999 ఏళ్లు న్యాయపరంగా హక్కు ఉంటుంది.

Take By: T News


Tags: T News, hmtv, tv9,  Cinema, Images, sex, hot images, Movies,  Tollywood, Bollywood, Hollywood, Dacanwood,
డ్యామ్ 999, Dam 999,
 

Read more...

‘ప్రీపెయిడ్ ఆటోలు’ వచ్చేశాయ్!

హైదరాబాద్, నవంబర్ 24 (): సికింవూదాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ ఆటోలను గురువారం నుంచి ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రీపెయిడ్ ఆటో బూత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీపెయిడ్ ఆటోలతో ప్రయాణికులకు రక్షణ ఉంటుందన్నారు. నగర పోలీస్8 కమిషనర్ ఎకే ఖాన్ మాట్లాడుతూ 1989, 1990లలో ప్రీపెయిడ్ ఆటోలను ప్రారంభించినప్పటికీ వివిధ కారణాలతో సక్సెస్8 కాలేదని గుర్తు చేశారు. సికింవూదాబాద్ నుంచి ప్రవేశపెడుతున్న ఈ ప్రీపెయిడ్ ఆటోలకు మొదటి 3 కిలోమీటర్ల వరకు రూ.30, రాత్రి వేళలో రూ.40గా నిర్ణయించారు
 

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, tv9,  Sima Andra, AP News, MP, Political News, Hyderabad News, Hyderabad, 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP