Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, November 25, 2011

Sharad Pawar slapped for 'price rise', NCP workers protest in Maharashtra

New Delhi\Pune:  Union Agriculture Minister Sharad Pawar was today slapped by a man at the New Delhi Municipal Corporation (NDMC) centre in New Delhi. The incident occurred while the minister was leaving the premises after attending a literary function. The attacker, identified as Harvinder Singh, reportedly blamed Mr Pawar for rising prices of essential commodities.

"This is my answer to corrupt politicians," shouted the attacker as he took out his kirpan (small knife) and threatened to kill politicians. He was whisked away by security guards soon after and was subsequently arrested by the Delhi Police and taken to the Parliament Street police station. He has been charged with attempted suicide, assault and criminal intimidation. (See Pictures)

The attacker, incidentally, is the same person who slapped former telecom minister Sukhram inside the premises of a Delhi court, moments after he was sentenced to five years of rigorous imprisonment in a corruption case dating back to 1996.

"I was answering some questions by a group of journalists when I saw this man coming towards me and I thought he wanted to ask me a question. I don't know what his intention was. It is up to the police whether they want to press charges against him or not...I am no judge to forgive him," Mr Pawar, who is also the chief of the Nationalist Congress Party (NCP) which is a key ally of the Congress at the Centre, said reacting to the incident.


As soon as the news of the attack filtered in, there were reports of tension and sporadic violence in several parts of Maharashtra today. NCP workers blocked the Mumbai-Agra National Highway (NH4) near Nagpur to protest the attack. The party has also called for a Pune bandh tomorrow. There were reports of party workers blocking the city's Swargate area, as also reports of stone-pelting from the Talegaon industrial area. NCP activists also blocked traffic and shut down shops in Nagpur, Sholapur and Nashik. (Read)

In Mumbai, NCP activists forcibly shut shops in Dadar and Mulund for a while. They also held protests at a mall in the city. There have been no reports of violence though.

Urging his party activists to maintain calm following the attack, Mr Pawar said, "Let the law take its own course."

Expressing surprise at the attack, the minister said that he had no enemies and refused to blame any political party for the attack. (Watch)

Prime Minister Manmohan Singh, meanwhile, condemned the attack on Mr Pawar. "I don't know where this country is going," said Finance Minister Pranab Mukherjee on the incident.

Leaders cutting across political lines also condemned the attack on Mr Pawar. "This is wrong and whoever he is, must be punished. We are fighting over price rise, demonstrating on roads but we are not in favour of violence. Inflation should be curbed. We won't provoke anyone, that's our philosophy," said Samajwadi Party chief Mulayam Singh.

Mr Pawar's daughter and Lok Sabha MP Supriya Sule said the attack should not be publicised. "In a democracy, people have the right to protest but resorting to violent means is not the way."

Jammu and Kashmir Chief Minister Omar Abdullah also regretted the incident saying, "This is no civil behaviour, this conduct is not civil and can't be justified...it is inappropriate."

The Bharatiya Janata Party (BJP), while condemning the attack added that there was a sense of deep resentment among the people over soaring inflation. "First of all, we condemn what happened to Mr Sharad Pawar and perhaps there could have been proper preventive police action. But are the people of the country not in deep pain and distress because of price rise over three and a half years? That is the crucial question", said party spokesperson Ravi Shankar Prasad.

His comment came a just day after senior party leader and former finance minister Yashwant Sinha warned the government against growing anger among people because of rising prices. "The government was not ready to recognise inflation as a problem for the aam aadmi and it will not be surprising if price rise becomes a cause for violence," Mr Sinha had said.

His statement that continued price rise in the "absence" of any concrete steps may be becoming a reason for the people to vent their anger in the form of violence today came in for strong criticism from the Congress.

Veteran anti-corruption crusader Anna Hazare, meanwhile, reacting to the assault on the minister asked, "...only one slap?" Mr Hazare, though, hastened to add, "It's not right to physically attack anybody. I can understand he (the attacker) may have been angry but it's still not right. We are a democracy and this is not allowed."

Take By: NDTV



Read more...

మూడోరోజూ ధూంధాం

- లోక్‌సభలో ఆగని తెలం‘గానం’
- పోడియం వద్ద బైఠాయించిన కేసీఆర్, విజయశాంతి
- మద్దతు తెలిపిన టీ కాంగ్రెస్ ఎంపీలు
- తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన సభ
- టీ కాంగ్రెస్ ఎంపీలకు ప్రణబ్ మందలింపు
- తెలంగాణ ఇచ్చేదాకా ఇంతేనన్న నేతలు

KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 24 ():ప్రత్యేక తెలంగాణ అంశంపై లోక్‌సభ దద్దరిల్లింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పారీ ఎంపీ విజయశాంతి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నినాదాలతో ప్రతిధ్వనించింది. దీంతో మూడోరోజు గురువారం కూడా ఎలాంటి చర్చ జరగకుండానే లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. అధిక ధరలు, నల్లధనంపై చర్చకు అధికార, విపక్షాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ, తెలంగాణ అంశంపై ఆ ప్రాంత ఎంపీలు పట్టువీడకపోవడంతో సభలో నిరసనల పర్వం కొనసాగింది. తెలంగాణ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని గురువారం సభ ప్రారంభం కాగానే కేసీఆర్, విజయశాంతిలు పట్టుబట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నానని ప్రకటించగానే వారు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్లకార్డులను ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో అధిక ధరలపై చర్చ జరపాలని ఎస్పీ, ఆర్‌జేడీ, బీఎస్పీ సభ్యులు సైతం వెల్‌లోకి చొచ్చుకుపోయారు.వామపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిలుచుని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్పీకర్ సభను గంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా కేసీఆర్, విజయశాంతితో సహా టీ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌ల్లోనే నిరసన తెలిపారు. సభ మధ్యాహ్నం మరోసారి రెండుగంటల పాటు వాయిదా పడింది. అయితే భోజన విరామ సమయంలో స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అధికధరలు, నల్లధనం అంశంపై అధికార, విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. అధిక ధరలపై వామపక్షాలు ఇచ్చిన తీర్మానంపై గురువారం చర్చ చేపడితే, నల్లధనంపై సోమవారం నాడు బీజేపీ చర్చ నిర్వహించడానికి ఒప్పందం కుదిరింది. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే అధిక ధరలపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. అయితే అత్యంత ప్రాధాన్యత గల తెలంగాణ అంశంపై ముందు చర్చ చేపట్టాలని నినాదాలు చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు, టీ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ప్రకటించేదాకా సభను నడవనియ్యమని నినదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. అధిక ధరలపై చర్చ జరిగేలా సహకరించాలని సుష్మాస్వరాజ్, సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ తదితరులు కేసీఆర్‌కు విజ్ఙప్తి చేశారు. వారి విజ్ఞప్తును కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో సభ పూర్తిగా స్తంభించింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ఇన్నర్‌లాబీల్లో, సెంట్రల్ హల్‌లోనూ కేసీఆర్‌ను కలిసిన విపక్ష నేతలు కనీసం శుక్రవారమైన సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ తెలంగాణ వచ్చే దాకా తమ వైఖరి మారదని వారికి స్పష్టం చేశారు.

Take By: T News

Tags: Telangana News, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, Lok sabha, KCR, Telangana Songs, 




Read more...

ఒరిగిపోయిన పెద్దపులి

- మావోయిస్టు నేత మల్లోజుల ‘ఎన్‌కౌంటర్’
- కారడవుల్లో కిషన్‌జీ కాల్చివేత

- రెండ్రోజులుగా వెయ్యిమందితో వేట
- సంయుక్త బలగాల చక్రబంధం
- పాల్గొన్న సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, కోబ్రా
- మమత పాలనలో తొలి భారీ ఎన్‌కౌంటర్
- ముందురోజే పట్టి చంపారేమో: వరవరరావు
- కిషన్‌జీ గుర్తింపుకోసం బంధువును తీసుకెళ్ళాలని డిమాండ్
- ఎన్‌కౌంటర్‌పై హక్కుల సంఘాల అనుమానాలు
- ఘటనను ఖండించిన పలువురు నేతలు, మేధావులు


Kishanji talangana patrika telangana culture telangana politics telangana cinemaమావోయిస్టు ఉద్యమంలో పెను కుదుపు.. భారత విప్లవోద్యమానికి తీరని విఘాతం.. జంగల్ మహల్ అడవుల్లో ఆదివాసీలకు అండ దూరం..! కరీంనగర్ జిల్లా పెద్దపల్లి బిడ్డ.. బెంగాల్ ‘టైగర్’ మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు! తెలంగాణ తొలి ఉద్యమంలో పోరు కేక వేసిన గొంతు మూగబోయింది. తెలంగాణ నుంచి పోరు బావుటాను జంగల్‌మహల్‌దాకా విస్తరింప చేయడంలో కీలక భూమిక వహించిన ఉద్యమ దుర్గం ఒరిగిపోయింది. నిజమైన స్వాతంత్య్రాన్ని కాంక్షించి.. భారత విముక్తి కోసం రహస్యోద్యమాన్ని నిర్మిస్తున్న ఉద్యమకారుడి గుండెను సర్కారు తుపాకి గుళ్లు తూట్లు పొడిచాయి. 34 ఏళ్ల అజ్ఞాతవాసం ఆగిపోయింది. ఏళ్ల తరబడి సాగుతున్న వెతుకులాటలో.. నాలుగు రోజులుగా ముమ్మరమైన వేటలో సంయుక్త భద్రతాదళాలు ఎట్టకేలకు కిషన్‌జీని చంపాయి. మూడున్నర దశాబ్దాలుగా అనేక రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ శకం ముగిసిపోయింది. మార్క్సిస్టులు చేయలేని పనిని మమత సర్కారు పరిపూర్తి చేసింది. తెలంగాణ బిడ్డ ఇక లేడన్న విషయం తెలుసుకుని ప్రాంతం హతాశురాలైంది. ఏనాటికైనా కొడుకును చూస్తానని ఒకే ఒక్క ఆశతో ప్రాణం నిలుపుకొంటున్న ముసలి తల్లి.. కన్నీరు మున్నీరైంది!

కోల్‌కతా, నవంబర్ 24: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించిన మల్లోజుల కోటేశ్వరరావు మూడున్నర దశాబ్దాల కిందట (1975-76) అప్పటి విప్లవ విద్యార్థి సంఘం- రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. అనంతరం పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. పొలిట్‌బ్యూర్, కేంద్ర కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడైన ఆయన మావోయిస్టు పార్టీలో మూడో స్థానంలో పనిచేశారు. రెండున్నర దశాబ్దాలకు పైగా జార్ఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వహించారు. 2009 నుంచి ఆయన జంగల్‌మహల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. బెంగాల్‌లో ఇదివరకటి సీపీఎం ప్రభుత్వం, ఇప్పటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తూ వచ్చాయి. ఎన్నికలకు ముందు, గెలిచిన తర్వాత కొంతకాలం మావోయిస్టులతో మృదువుగానే వ్యవహరించిన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల కఠినవైఖరి అవలంబించారు. మధ్యవర్తులతో చర్చలు కొనసాగిస్తామంటూనే, హింసను వీడకుంటే అణచివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతను భద్రతాదళాలు హతమార్చడం సంచలనం కలిగిస్తోంది. తాజా పరిణామంతో బెంగాల్‌తోపాటు పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ కోసం ఎంతోకాలంగా వేటాడుతున్న భద్రతా దళాలు తాజాగా ఆయన సంచరిస్తున్నట్టుగా అనుమానిస్తున్న పశ్చిమబెంగాల్‌లోని అటవీ ప్రాంతాలను చుట్టుముట్టాయి. రెండురోజులుగా వెయ్యిమందితో కూడిన సంయుక్త బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇందులో సీఆర్‌పీఎఫ్ 184వ బెటాలియన్, 207 కోబ్రా బెటాలియన్, బీఎస్‌ఎఫ్, బెంగాల్ రాష్ట్ర పోలీసులు పాల్గొన్నట్లు సీఆర్‌పీఎఫ్ ధ్రువీకరించింది. బుధవారంనాడే ఉత్కంఠ పరిస్థితులు నెలకొనగా, కిషన్‌జీ తప్పించుకుపోయినట్లు భద్రతాదళాలు ప్రకటించాయి. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బురిసోల్ అటవీవూపాంతంలో గురువారం జరిగిన ‘జంగల్‌మహల్ ఎన్‌కౌంటర్’ అనంతరం ఆయన మరణించినట్లు వెల్లడించాయి. కిషన్‌జీ, ఆయనతోపాటు ఉన్న సుచిత్ర మహతో (ఇదివరలో మరణించిన ఒక మావోయిస్టు నాయకుడి భార్య), మరికొందరు కుష్బోని అడవిలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించినట్లు తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక దళం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కిషన్‌జీకి ఉన్న నాలుగంచెల భద్రతావలయాన్ని ఛేదించిన తర్వాత ఎన్‌కౌంటర్ జరిగినట్లు చెప్పారు. కుష్బోనికి దగ్గరలోని జంబోని పోలీసుస్టేషన్ పరిధిలో బురిసోల్ అడవిలో గురువారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం అక్కడ కనిపించిన మృతదేహాన్ని.. ఏకే 47 ఆయుధాన్ని బట్టి కిషన్‌జీదిగా గుర్తించినట్లు చెప్పారు.

kisan talangana patrika telangana culture telangana politics telangana cinema
సుచిత్ర, మరికొందరు తప్పించుకుపోయారని తెలిపారు. అంతకుముందు సంయుక్త భద్రతాబలగాలు గొసాయిబంద్ గ్రామ సమీపంలోనుంచి ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్, కిషన్‌జీ, సుచిత్ర రాసిన కొన్ని లేఖలు, మరికొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. మావోయిస్టు పార్టీలో మూడో స్థానంలో ఉన్న కిషన్‌జీ చనిపోవడం నక్సలైట్లకు పెద్ద దెబ్బ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఇదివరలో ఇదే స్థానంలో ఉన్న మావోయిస్టు నేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఆంధ్రవూపదేశ్‌లోని ఆదిలాబాద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల క్రితమే అడవిబాట పట్టిన మల్లోజుల కోటేశ్వర్‌రావు (కిషన్‌జీ) ఎన్‌కౌంటర్‌తో ఆయన పురిటిగడ్డ కరీంనగర్ జిల్లా శోకసంవూదంలో మునిగిపోయింది. దేశంలో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా ఉలిక్కిపడే జిల్లావాసులు, మరణించినవారు మల్లోజుల సోదరులు కాదని తెలుసుకున్నాక స్థిమితపడేవారు. కానీ ఇప్పుడు చనిపోయింది కిషన్‌జీ అని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.ఎన్‌కౌంటర్‌పై హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బెంగాల్‌లో మధ్యవర్తిత్వం వహిస్తున్న సుజాతోభద్రో ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తమ బృందంతో చర్చించాక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. సంయుక్తదళాలు కిషన్‌జీని బుధవారమే బంధించి చంపేసి ఉండవచ్చని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అనుమానం వ్యక్తం చేశారు. మమతాబెనర్జీ ప్రభుత్వం శాంతిచర్చలను దెబ్బతీసిందని, మోసం చేసిందని ఆయన విమర్శించారు. కిషన్‌జీని గుర్తించడానికి ఆయన మేనకోడలు దీపను తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. కిషన్‌జీ పెద్దన్న తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన తల్లి చాలా వృద్ధురాలు క్యాన్సర్ పేషంటని తెలిపారు. అందువల్ల పెద్దపల్లిలో ఉంటున్న మేనకోడలు దీపను విమానంలో తీసుకెళ్ళేందుకు కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు.

కిషన్‌జీ మృతి మావోయిస్టులపై పెద్ద ప్రభావమేమీ చూపదని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సూర్యకాంత మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఆయనను పట్టుకుంటే సంతోషించేవాడినని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. మావోయిస్టులకు ‘జాతి వ్యతిరేక’ శక్తుల మద్దతు ఉందని పేర్కొన్నారు. సంయుక్త దళాలకు ఇది పెద్ద విజయమని బెంగాల్ బీజేపీ శాఖ వ్యాఖ్యానించింది. 

Take By: http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=47940

Tags: Telangana News, T News, hmtv, tv9,  AP News, Political News, 
Kishenji deathMaoist leaderSuchitra MahatoJungalmahal encounter

Read more...

Thursday, November 24, 2011

Maoist leader Kishenji killed in West Bengal

Elusive Maoist leader Kishenji was on Thursday killed in an encounter with the joint forces at Burisole forest in West Midnapore district, a day after he narrowly escaped from there. 


The body of 58-year-old Molajula Koteswar Rao, better known as Kishenji, was found and identified after the “Jungalmahal encounter”, a top counter-insurgency force official said. 
 

After receiving specific information that he and some of his associates and Suchitra Mahato, the wife of a slain leader he was living with, were hiding in the Kushboni jungle, the area was cordoned off and an encounter ensued after breaking the four tiers of security that Kishenji had, the official said. 


It was from Kushboni forest that the Maoist Polit Bureau member, the second in-command of the outfit and in-charge of military operations in Jungalmahal since 2009, and Suchitra had eluded the joint forces on Wednesday. 


The encounter which began this morning at Burisole jungle in Jamboni police station area was close to Kushboni near the Jharkhand border. 


The official said Kishenji’s body was identified by the AK-47 rifle he was carrying. Suchitra and others fled. 


A laptop bag, some letters written by Kishenji and Suchitra and a few important documents were earlier seized by the joint forces from Gosaibandh village nearby. 

Read more...

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్‌కౌంటర్



Amint-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకోల్‌కత : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కిషన్‌జీని పోలీసలు కాల్చి చంపారు. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రం పశ్చిమ మిడ్నాపూర్‌లోని సాల్పోనీలో కిషన్‌జీని పోలీసులు కాల్చిచంపారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు కూడా ధృవీకరించారు. కుష్బునీ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందినట్లు తెలుస్తోంది. కిషన్‌జీ అసలు పేరు మల్లోజులు. మల్లోజులుతోపాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజులు మావోయిస్టు ఉద్యమంలో తొలితరానికి చెందిన వ్యక్తి. సిరిసిల్లలో ఇంటర్, కరీంనగర్‌లో డిగ్రీ చేశాడు. ఉస్మానియాలో న్యాయశాస్త్రం చదువుతూ మధ్యలో ఆపేశాడు. 1956 లో కిషన్‌జీ జన్మించారు. ఉద్యమంలో తిరుగులేని నేతగా మల్లోజుజుల కోటేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు. ఉద్యమంలో ఆయన రాజీలేని పోరాటం చేశారు. ప్రభుత్వాలు జనం గొంతు నొక్కినంతకాలం ఆయుధాలు వదలమని ఎన్నోసార్లు కిషన్‌జీ విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ కోసం కిషన్‌జీ తన జీవితాన్ని ధారపోసారని చెప్పవచ్చు. 1975లో ఆయన ఉద్యమంలోకి అడుగు పెట్టారు. కిషన్ జీ తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కిషన్‌జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్‌రావ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. కిషన్ జీ మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో ముప్పాళ్ల గణపతి తరువాత కిషన్ జీదే అగ్రస్థానం.

తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఓ నాటకమని, దాన్ని బహిష్కరించాలని కిషన్‌జీ గతంలో పిలుపునిచ్చారు. కమిటీల పేరుతో తెలంగాణ అంశాన్ని కేంద్రం అటకెక్కించిందని కిషన్‌జీ చెప్పారు. తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర నేతలు చేసిన రాజీనామాలను ఆయన పవర్ పాలిటిక్స్‌లో భాగమేనని చెప్పారు. 

Take By: http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=1&ContentId=47700

Read more...

ఒకే నినాదం జై తెలంగాణ

లోక్‌సభలో తెలంగాణం

- రెండోరోజూ కొనసాగిన నిరసనలు
- నేడు మళ్లీ టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
- తెలంగాణకు మద్దతిస్తాం.. కేసీఆర్‌కు శరద్‌పవార్ హామీ
- నల్లధనంపై నేడు చర్చ
- సర్కారు, బీజేపీ మధ్య అవగాహన
- సుష్మ, ప్రణబ్ ముఖర్జీ మంతనాలు
- రాత్రి పొద్దుపోయాక ఒప్పందం!
- ధరల పెరుగుదలపై సోమవారం చర్చ?



PPPp-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 23 (): అవినీతి, అధిక ధరలు, నల్లధనం అంశాలపై నిరసనలతో ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో రెండో రోజు కూడా తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. అధిక ధరలపై చర్చకు అనుమతినివ్వాలని వామపక్షాలు పట్టుపట్టగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఆ ప్రాంత ఎంపీలు పట్టువీడలేదు. బుధవారం సభ ప్రారంభమైనప్పటి నుంచి మరుసటి రోజుకు సభ వాయిదా పడేంతవరకూ తమ నిరసన కార్యక్షికమాలను కొనసాగించారు. అత్యం త ప్రాధాన్యం గల తెలంగాణ అంశాన్ని చర్చించాల్సిందేనని పట్టుబడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతితో పాటు కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయంలో తమ తమ స్థానా ల్లో నిలబడి నిరసన తెలిపిన ఎంపీలు, సభ అధికారిక కార్యక్షికమాలను అనుమతిస్తున్నానని స్పీకర్ మీరా కుమార్ ప్రకటించిన వెను తెలంగాణ అంశాన్ని చర్చించాలని పట్టుబట్టారు.

తామిచ్చిన వాయి దా తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్‌ను పదేపదే కోరారు. చర్చకు అనుమతి నిరాకరించడంతో వారిరువురూ వెల్‌లోకి వెళ్లి, తమ నిరసనను కొనసాగించారు. ‘పార్లమెంటులో తెలంగాణ బి ల్లును ప్రవేశపెట్టండి’ అని రాసి ఉన్న ప్లకార్డులతో కాం గ్రెస్ ఎం పీలు కూడా వెల్‌లోకి చేరారు. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌డ్డి, మందా జగన్నాథం, రాజయ్య, బలరాంనాయక్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, మధు యాష్కీ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేంత వరకు సభను కొనసాగనివ్వబోమని టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ వారితో జత కలిశారు. అదే సమయంతో అధిక ధరలపై చర్చించాలని లెఫ్ట్ సభ్యులు సైతం వెల్‌లోకి రావడంతో సభలో గందరగోళం నెలకొంది.

సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సభాపతి పదేపదే విజ్ఙప్తి చేసినప్పటికీ పరిస్థితులు కుదుటపడకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో తెలంగాణ నినాదాలు మారుమోగినంత సేపు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రేక్షక పాత్ర పోషించారు. తమ పార్టీ ఎంపీల చేతుల్లోని తెలంగాణ ప్లకార్డులు చదవటానికే పరిమితమైన వారు సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు. సభ వాయిదాతో తెలంగాణపై బుధవారం నాటి తమ వాయిదా తీర్మానం చర్చకు రాకపోవడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం మరో వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌కు అందించనున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల నాలుగున్నర కోట్ల ప్రజల్లో నెలకొన్న అశాంతి, ఆందోళన’’పై చర్చకు ఆ పార్టీ ఎంపీలు పట్టుపట్టనున్నారు. సభ ప్రారంభానికి ముందే ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. 600 మంది ప్రాణ త్యాగాలు గుర్తించైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు.

నేడు నల్లధనంపై చర్చ?
ఇదిలా ఉండగా.. నల్లధనంపై చర్చ విషయంలో ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. గురువారం వీరి మధ్య ఒక ఒప్పందం జరగనున్నట్లు సమాచారం. దీంతో గురువారం నుంచి సమావేశాలు సజావుగా సాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. నల్లధనం అంశంపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై గురువారం చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో సభా నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్న వామపక్షాలు.. తాజా పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

దీంతో ప్రత్యేకంగా ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తున్నాయి. ధరల పెరుగుదల అంశంపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. అటు డీఎంకే సభ్యులు డ్యామ్ 999 అనే త్రీడీ సినిమా విడుదలను అడ్డుకోవాలని పట్టుబట్టారు. ఎన్సీపీ సభ్యులు ఉల్లిపాయల ఎగుమతులపై పరిమితులు ఎత్తివేయాలని కోరుతూ తమ తమ స్థానాల్లో నిలిచి నినాదాలు చేశారు. ఈ అంశాలు కూడా తోడవడంతో బుధవారం నాడు ఉభయ సభల్లోనూ ఎలాంటి కార్యక్షికమాలు సాగలేదు. తీవ్ర గందరగోళ పరిస్థితులు కనిపించాయి.



Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News,
Lok Sabha,  

Read more...

తెలంగాణ కోసం ఎప్పుడో తీర్మానం చేశాం: పవార్

సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు చేరుకున్న టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణకు ప్రభుత్వ, మిత్రపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణకు మద్దతివ్వాలని కేసీఆర్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ తమకు తో డ్పాటునివ్వాలని కోరా రు. దానికి సానుకూలం గా స్పందించిన పవార్ తెలంగాణకు అనుకూలంగా తన వైఖరిని ఏనాడో స్పష్టం చేశానన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

తెలంగాణ ఇవ్వాలని సోనియాకు పవార్ గతంలోనే స్పష్టం చేశారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీలు ఇద్దరు ముగ్గురు సభ్యులున్న చిన్న పార్టీల నాయకులతో చర్చించారు. తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రక్రియలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో సెంట్రల్ హాల్‌కు చేరుకున్న టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ నిరసన కార్యక్షికమాలను సమీక్షించుకున్నారు. తాము రెండు రోజులుగా సభ లోపల, వెలుపల నిరసన తెలిపినా అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై వారు కొంత అసంతృప్తికి లోనయ్యారు. గత శీతకాల సమావేశాల మాదిరిగా పార్టీ పెద్దలు తమను సంప్రంతించి తెలంగాణపై ప్రకటన చేస్తారన్న నమ్మకంతో నిరసనలను కొనసాగించాలని భావించారు. అధిష్ఠానం ప్రతిస్పందనలను బట్టి నిరసన కార్యక్షికమాల తీవ్రత పెంచడమో తగ్గించడమో చేయాలని నిర్ణయించారు. ఎక్కడా పార్టీని ధిక్కరించేటట్లు వ్యవహరించకుండా తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలన్న తపనను వ్యక్త పరచాలని వారంతా నిశ్చయించుకున్నట్లు సమాచారం.

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP