Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, February 17, 2011

సహాయం బంద్ గురువారం నుంచే తెలంగాణ ఉద్యోగుల నిరాకరణం

సహాయం బంద్
గురువారం నుంచే తెలంగాణ ఉద్యోగుల నిరాకరణం
చర్యలు తీసుకుంటే ప్రతిఘటిస్తాం
సర్కారుకు హెచ్చరిక

సీమాంధ్ర సిబ్బందీ సహకరించాలి
ఎమ్మెల్యేలు, మంత్రులూ పాల్గొనాలి: స్వామిగౌడ్
ఈగవాలినా ఊరుకోం: కేసీఆర్
సహకరించాలని డీఎస్‌కు జేఏసీ వినతి
సహకరిస్తాం: తెలంగాణ టీడీపీ
ప్రతి పౌరుడూ పాల్గొనాలి: యాష్కీ





హైదరాబాద్, ఫిబ్రవరి 16 : ఉద్యోగులూ ఉద్యమబాట పట్టారు. తెలంగాణ కోసం రణం తప్పదని తేల్చి చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనన్న డిమాండ్‌తో గురువారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెడుతున్నారు. రాష్ట్ర రాజధాని సహా మొత్తం తెలంగాణ జిల్లాలన్నింటిలోని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు.. ఇలా ఏ ఒక్కచోటా పనిచేసేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో.. ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని, మాట తప్పితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని టీఎన్జీవో నేతలు హెచ్చరించారు.

ఉద్యమంపై ప్రభుత్వ స్పందనను బట్టే తమ విధానం కూడా ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో బుధవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, విఠల్, దేవీప్రసాద్, మధుసూదన్‌రెడ్డి కలిశారు. తమ ఉద్యమానికి సహకరించాలని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టించాలని డీఎస్‌ను కోరారు. ఆ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు.

పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకం ఉద్యమం చేస్తుంటే.. వారు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకునే తాము మౌనంగా ప్రేక్షకపాత్రలో ఉండలేమని స్వామిగౌడ్ చెప్పారు. తాముకూడా గురువారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. గురువారం నుంచి విధులకు హాజరై ఉద్యోగులు సంతకం చేస్తారే కానీ, విధులు నిర్వహించబోరని స్వామిగౌడ్ ప్రకటించారు.

ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగానే నిరసన తెలియజేస్తామని, వ్యవస్థను కుప్పకూల్చబోమన్నారు. తమ ఉద్యమానికి సహకరించాలని సీమాంధ్ర ఉద్యోగులను కోరారు. తమ సీట్లలో కూర్చుని పని చేయవద్దని, తమ మనోభావాలను, ప్రయత్నాలను దెబ్బతీయవద్దని స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామిక విలువలు చెడిపోకుండా, వ్యవస్థలు పాడుకాకుండా, పేదలకు నష్టం కలగకుండా తమ నిరసన తెలియజేయాలని డీఎస్ సూచించినట్టు ఆయన చెప్పారు.

'మా నిరసన ప్రజల కోసం. తెలంగాణ యువకులకు ఉద్యోగాల కోసం. మా బతుకుతెరువు, నదులు, నిధుల కోసం. కాబట్టి ఇందులో ప్రజలెవరినీ ఇబ్బంది పెట్టే ప్రశ్నే ఉండదు' అని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని భావిస్తున్నామని, ప్రభుత్వం దానిని భగ్నం చేస్తే ఉద్యోగుల మధ్య గొడవలు ఆరంభమవుతాయని శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేయాలని, మంత్రులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని విఠల్ కోరారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నేతలు కోరినన్ని రోజులు సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తామని స్వామిగౌడ్ ప్రకటించారు. సహాయ నిరాకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ఉద్యోగులకు సహకరించాలన్నారు.

మరోవైపు.. ఉద్యోగుల ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. సహాయ నిరాకరణలో పాల్గొనే ఉద్యోగులను వేధించినా.. వారిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని, సర్కారును కూల్చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. చీమూ నెత్తురు ఉన్న ప్రతీ తెలంగాణ పౌరుడూ సహాయ నిరాకరణలో పాల్గొనాల్సిందేనని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు.

ఉద్యోగులపై కేసులు పెడితే ప్రత్యక్ష పోరుకు దిగుతామని హెచ్చరించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం నుంచే తమ సహాయ నిరాకరణ మొదలవుతుందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులది ఆషామాషీ నిర్ణయం కాదని, తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని ఉద్యోగులు చేస్తుండడం అద్భుతమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి అన్నారు.

Read more...

Tuesday, February 15, 2011

“రాయిని గూడెం” ! ఉద్యమ రవ్వలు !!!

“రాయిని గూడెం” ! ఉద్యమ రవ్వలు !!!
——————————————
కప్పం కోసం, కత్తుల కవాతు నడిపిన
సామ్రాజ్యవాద రాజుని, ఊరవతలికి తరిమిన
‘తెలంగాణ’ ఆత్మగౌరవ ప్రతీకలైన
సమ్మక్క సారలమ్మ వారసులు వాళ్ళు !

బతుకులు చల్లగుండాలని, అమ్మలకు నిలువెత్తు
‘బంగారం’ మొక్కే ‘అబలలు’ వాళ్ళు !
నెలల ముంగటనే ‘పోరుగడ్డ’ ను
పోలీసు బందికాన చేసిన ‘సజ్జనార్’ డయ్యర్ల
నిర్బంధాన్ని నిలువునా బద్దలుగొట్టిన
నిలువెత్తు ‘రాణి రుద్రమ్మలు’ !!

అధికారమదంతో బలిసిన ‘సీమాంధ్ర’ సర్కారుకు
ఒంట్ల వణుకు తెప్పించిన, నేటి పోరుబిడ్డలు !!
ఇనుప బూట్ల చప్పుళ్ళు, వేలాడే తుపాకులు
బలిసిన శరీరాల పోలీసులు
అధికార పార్టీ గుండాల ‘హస్త’దిగ్భందనాలు
గొంతెత్తిన ఆకాంక్షతో పటాపంచలు చేసిన
కాళోజిగడ్డ బిడ్డలు వాళ్ళు !!
గుండెలనిండా ఒకే శ్వాస ‘తెలంగాణ’
ఒకే ఆయుధం, ఒకే ఆశయం
‘జై తెలంగాణ’, ‘జై జై తెలంగాణ’

- వంశీ కృష్ణ

take By: Simply telangana

Read more...

అసెంబ్లీ సమావేశాలు స్తంబింపచేస్తాం

పాల్వంచ, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో అధికార, ప్రధానప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత, సిద్దిపేట ఎ మ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామ ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపును టీడీపీ తిరస్కరించడమే దీనికి నిదర్శనమన్నారు.సోమవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అవిశ్వాసానికి సమ్మతించిన టీడీపీ అధినేత చంద్రబాబు..

ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా అవిశ్వాసానికి ముందుకు రాకపోవడం వెనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్ర దాగిఉందన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడంతోపాటు, అన్నిరోజులూ శాసనసభను స్తంభింపచేస్తామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న సీపీఐ ఎమ్మెల్యేలు కూడా తమతో కలిసిరావాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీపీఎం పునాదులు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే కదలడం మొదలైందని, ఇప్పటికైనా పంథా మార్చుకోకుంటే.. ఆ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదన్నారు.

Read more...

నేడుకోర్‌ కమిటీతో టి - కాంగ్రెస్‌ భేటీ


cwcన్యూఢిల్లీ/హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానున్నది.పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కోర్‌ కమిటీ సభ్యులు చిదంబరం, ఎ.కె.ఆంటోని, అహ్మద్‌ పటేల్‌, వీరప్ప మొయిలీ పాల్గొనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోతే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ ఉండదని, అదే విధంగా కాంగ్రెస్‌ నేతలు రాజకీయ జీవితానికి చమరగీతం పాడాల్సి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోర్‌ కమిటీ సభ్యులకు తెలియజేయనున్నారు.

తెలంగాణకు సానుకూలంగా ప్రకటన చేయక పోతే ఇక రాజీనామాలే తప్ప మరో గత్యంతరం లేదని వారు కోర్‌ కమిటీకి స్పష్టం చేయనున్నారు. అంతకు ముందు సోమవారంమధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాయంత్రం సీడబ్ల్యూసీ సభ్యుడు, ఎంపి డాక్టర్‌ కె.కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఢిల్లీ పెద్దలతో చర్చించాల్సిన విషయా లు, తెలంగాణలో పార్టీ పరిస్థితి వంటి ఆంశాలపై చర్చించారు. ఆ తరువాత కేకే చోరవతోనే సోని యా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేతో రాత్రి 7 గంటల ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.

దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు తెలంగాణలో పార్టీ పరిస్థితిని, తమకు ఎదురవుతున్న సమస్యలను, ప్రతిపక్షాలు, ప్రత్యేకించి టిఆర్‌ఎస్‌, తెలంగాణ వాదుల దాడులను పటేల్‌కు వివరించినట్లు సమాచారం. 2009 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు కోరినట్లు తెలిసింది. అలాగే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను పార్టీ అధినేత్రి సోనియాకు వివరించే వరకు ఢిల్లీని వదిలేది లేదని వారు స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరతామని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

ఈ మేరకు పార్టీ ఎంపీలు కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుం టున్నారని వారు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉండగానే పటేల్‌ పార్టీ అధినేత్రి సోనియాకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంగళవారం కోర్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధినేత్రి సోనియా పటేల్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఆ తరువాత పటేల్‌ ఈ సమాచారాన్ని కోర్‌ కమిటీ సభ్యులకు చేరవేయ డమే కాకుండా మంగళవారం భేటికి సిద్ధంగా ఉం డాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. కోర్‌ కమిటీ సమావేశం తరువాతే పరిస్థితులను బట్టి టిజిసి నేతలకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ లభించే అవకాశాలున్నట్లు ఎఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.

కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ కి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృం దం ఒకటి సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. ఈ బృందంలో 25 మంది ఎమ్మెల్యేలు, ఏడుగు రు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 32మంది ఉన్నారు.ఢిల్లీ బయలు దేరి వెళ్ళడానికి ముందు తమను కలిసిన మీడియా ప్రతినిధులతో పలువురు ఎమ్మె ల్యేలు మాట్లాడారు. ఎవరిఒత్తిళ్ళకు తలొగ్గి తాము ఢిల్లీకి వెళ్ళడం లేదని వరంగల్‌ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ ఇవ్వాల్సిందేనని అధిష్ఠానాన్ని కోరుతా నని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ ఎమ్మె ల్యే టి.నర్సారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ వెళ్ళి తెలం గాణ కోసం పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తా మని అన్నారు. తెలంగాణ ఇవ్వక పోతే పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగే ప్రమాదం ఉందని వివరిస్తా మని చెప్పారు. స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య మాట్లాడుతూ తెలంగాణపై పార్టీ అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకే హస్తిన వెళుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల అధిష్ఠానం సానుకూలంగా దిగిరాక పోతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తాము అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలోనే కార్యచరణ రూపొందించు కుంటామని

take By: Suryaa

Read more...

Monday, February 14, 2011

¤Äª½x-„çÕ¢-{Õ©ð ¦ãjª¸Ã-ªá²Äh
¤ÄKd ‚Ÿµ¿y-ª½u¢©ð 'šÇ®ýˆ-¤¶òªýqÑ: ê®Ô-‚ªý


£jÇŸ¿-ªÃ-¦ÇŸþ Ð ÊÖu®ý-{Õœä
“X¾Åäu¹ Åç©¢-’ú ªÃ†¾Z ²ÄŸµ¿Ê Â¢ “X¾¦µ¼Õ-ÅŒy¢Åî ÅÜî-æXœî Åä©Õa-¹ע-ŸÄ-«ÕE, ¤Äª½x-„çÕ¢{Õ ¦œçbšü ®¾«Ö-„ä-¬Ç© ®¾¢Ÿ¿-ª½s´¢’à ÅÃÊÕ ®Ôp¹ªý ¤òœË§ŒÕ¢ «Ÿ¿l ¦ãjª¸Ã-ªá-²Äh-ÊE ÅçªÃ®¾ ÆŸµ¿u-¹~×©Õ ê®Ô-‚ªý “X¾Â¹-šË¢-Íê½Õ. ‚C-„ê½¢ Åç©¢-’ú ¦µ¼«-¯þ©ð -‚-§ŒÕ-Ê «ÖšÇx-œ¿ÕÅŒÖ ê¢“Ÿ¿, ªÃ†¾Z “X¾¦µ¼ÕÅŒy ÂêÃu-©-§ŒÖ©ðx X¾E-Íä-®¾ÕhÊo …Ÿîu-’¹Õ-©¢Åà ¨¯ç© 17 ÊÕ¢* åX¯þ-œö¯þ ŸÄyªÃ ®¾£¾É§ŒÕ EªÃ-¹-ª½-º©ð ¤Ä©ï_-Ê-œÄ-EÂË ®ÏŸ¿l´-«Õ-§ŒÖu-ª½E, „ÃJÂË ÅçªÃ®¾ ®¾¢X¾Üª½g «ÕŸ¿lÅŒÕ “X¾Â¹-šË-®¾Õh¢-Ÿ¿E ÅçL-¤Äª½Õ. ’âDµ ÍŒÖXÏÊ ¦Ç{-©ð¯ä ®¾£¾É§ŒÕ EªÃ-¹-ª½º …¢{Õ¢-Ÿ¿E ÅçL-¤Äª½Õ. “X¾¦µ¼ÕÅŒy ¤Ä©ÊÊÕ X¾ÜJh’à ®¾h¢Gµ¢-X¾-èä-²Äh-«ÕE, …Ÿîu-’¹Õ-©ÊÕ ‡²Ät, OÕ²Ä ÍŒšÇd© æXª½ÕÅî “X¾¦µ¼ÕÅŒy¢ „äCµ¢*, ƒ¦s¢-Ÿ¿Õ-©Â¹× ’¹ÕJ-Íä-§ŒÖ-©E ÍŒÖæ®h Åëá ֮͌¾Öh ­ª½Õ-Âî-¦ð-«Õ-¯Ãoª½Õ. éªj©äy ÅŒC-ÅŒª½ ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy ®¾¢®¾n©ðx X¾E-Íä-®¾ÕhÊo …Ÿîu-’¹Õ©Õ Â¹ØœÄ åX¯þ-œö¯þ Íä§ŒÕ-œÄ-EÂË «á¢Ÿ¿ÕÂ¹× «ÍÃa-ª½-¯Ãoª½Õ. Åç©¢-’ú „çáÅŒh¢ ‰Â¹u-¬Á-ÂËh’à ¹C-L-«-®¾Õh¢Ÿ¿¯Ãoª½Õ. ²ÄyÅŒ¢“ÅŒu ®¾¢“’ëբ 骢œ¿Õ ÅŒªÃ©ðx •J-T¢-Ÿ¿E, 1857©ð NX¶¾-©-„çÕi¯Ã 1947©ð ²ÄCµ¢-ÍŒÕ-¹×-¯Ão-«Õ-¯Ãoª½Õ.

…Ÿîu-’¹Õ-©Â¹× ®¾¢X¶ÔÕ-¦µÇ«¢: ‚C-„ê½¢ 75 …Ÿîu’¹, …¤Ä-ŸµÄu§ŒÕ, ÂÃJt¹ ®¾¢X¶¾Ö© “X¾A-E-Ÿµ¿Õ©Õ ê®Ô-‚-ªýÅî ¦µäšÌ ƧŒÖuª½Õ. ®¾£¾É§ŒÕ EªÃ-¹-ª½ºÂ¹× ÆÊÕ-®¾-J¢-ÍÃ-LqÊ «Üu£¾Ç¢åXj “X¾ŸµÄ-Ê¢’à ͌Ja¢Íê½Õ. …Ÿîu-’¹Õ-©Â¹× ®¾¢X¶ÔÕ-¦µÇ-«¢’à ÅçªÃ®¾ ÅŒª½-X¶¾ÛÊ “’ë֩ðx ÍçjÅŒÊu Âê½u-“¹-«Ö©Õ, ªÃuM©Õ, ®¾¦µ¼©Õ Eª½y-£ÏÇ-²Äh-«ÕE ê®Ô-‚ªý Íç¤Äpª½Õ. ÅŒ«Õ ¤ÄKd©ð ‹ šÇ®ýˆ-¤¶òªýq \ªÃp{Õ Íä²Äh-ÊE „ç©x-œË¢-Íê½Õ. “X¾B >©Çx©ð ¨ šÇ®ýˆ-¤¶òªýq …Ÿîu-’¹Õ-©Â¹× ®¾£¾Ç-¹-J-®¾Õh¢-Ÿ¿E æXªíˆ-¯Ãoª½Õ. …Ÿ¿u-«Õ¢©ð ¤Ä©ï_¢-{ÕÊo …Ÿîu-’¹Õ-©åXj “X¾¦µ¼ÕÅŒy¢ \„çÕi¯Ã ÍŒª½u©Õ B®¾Õ-¹ע˜ä, ƺ-*-„ä-§ŒÖ-©E ֮͌¾Öh ÅÃÊÕ ­ª½Õ-Âî-¦ð-ÊE, «Õªî-²ÄJ D¹~ ÍäX¾-œ¿-ÅÃ-ÊE, ¨²ÄJ ÍŒÕ{Öd 50 „ä© «Õ¢CE \ªÃp{Õ Í䮾Õ-ÂíE D¹~ Íä²Äh-ÊE ê®Ô-‚ªý ÍçXÏp-Ê{Õx ®¾«Ö-Íê½¢. ®¾£¾É§ŒÕ EªÃ-¹-ª½-ºÅî ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy¢ È*aÅŒ¢’à CT-«-®¾Õh¢-Ÿ¿E ‚§ŒÕÊ Dµ«Ö «u¹h¢ Íä®Ï-Ê{Õx ®¾«Ö-Íê½¢.

…Ÿ¿u«ÕÂê½Õ-©Â¹× X¾Ÿî-Êo-ŌթÕ: “X¾Åäu¹ Åç©¢-’ú ªÃ†¾Z¢ ²ÄCµ¢-ÍŒÕ-¹×Êo ÅŒªÃyÅŒ “X¾®¾ÕhÅŒ¢ …Ÿ¿u-«Õ¢©ð ¤Ä©ï_¢-{ÕÊo …Ÿîu-’¹Õ-©¢-Ÿ¿-JÂÌ X¾Ÿî-Êo-ÅŒÕ©Õ Â¹Lp-²Äh-«ÕE, „ÃJÂË ê¢“Ÿ¿ “X¾¦µ¼ÕÅŒy …Ÿîu-’¹Õ-©Åî ®¾«Ö-Ê¢’à „äÅŒ-¯Ã©Õ ƒ«y-œ¿¢-Åî-¤Ä{Õ ®¾«Õ-ª½-§çÖ-Ÿµ¿Õ-©Õ’à „ÃJE ’¹ÕJh-²Äh-«ÕE ê®Ô-‚ªý £¾ÉOÕ ƒ*a-Ê{Õx ®¾«Ö-Íê½¢.

œÎ‡®Ôq …¤Ä-ŸµÄu-§Œá-©Â¹× Æ¢œ¿: 2008 œÎ‡®Ôq ŸÄyªÃ E§ŒÖ-«Õ-¹-„çÕiÊ …¤Ä-ŸµÄu-§Œá©Åî “X¾¦µ¼ÕÅŒy¢ Æ“åX¢-šË-®ý-†ÏXý æXª½ÕÅî „çšËd-ÍÃ-ÂËJ Íäªá¢-ÍŒÕ-¹ע-šð¢-Ÿ¿E ê®Ô-‚ªý ‚ªî-XÏ¢-Íê½Õ. „ÃJÂË éª’¹Õu-©ªý …Ÿîu-’¹Õ-©Åî ®¾«Ö-Ê¢’à „äÅŒ-¯Ã©Õ ƒ„Ãy-©E, DEåXj ÅÃÊÕ «áÈu-«Õ¢“A Â˪½-ºý-¹×-«Ö-ªý-éª-œËfÂË ©äÈ ªÃ²Äh-ÊE ÅçL-¤Äª½Õ. «áÈu-«Õ¢“A ®¾p¢C¢-ÍŒ-¹-¤òÅä ƒ¢C-ªÃ-¤Äª½Õˆ «Ÿ¿l Ÿµ¿ªÃo ÍäŸÄl-«ÕE, ÅÃÊÕ Â¹ØœÄ Ÿµ¿ªÃo©ð ¤Ä©ï_¢-šÇ-Ê-¯Ãoª½Õ. ®¾¦µ¼©ð ‡©Çx-骜Ëf ‡„çÕt©äu \ÊÕ’¹Õ ª½O¢-Ÿ¿-ªý-骜Ëf, ¤ÄKd EèÇ-«Ö-¦ÇŸþ >©Çx ƒ¯þ-͵ÃJb ¦Ç¦Ö-ªÃ«Û, ¦ðŸµ¿¯þ E§çÖ-•-¹-«ª½_ ƒ¯þ-͵ÃJb †¾ÂÌ©ü, …¤Ä-ŸµÄu§ŒÕ ®¾¢X¶¾Õ¢ ¯äÅŒ «ÕºË-¤Ä-©ü-骜Ëf ÅŒC-ÅŒ-ª½Õ©Õ ¤Ä©ï_-¯Ãoª½Õ.

¯äœ¿Õ ¤ÄKd-©Åî ®¾«Ö-„ä¬Á¢.. …Ÿîu’¹ ®¾¢X¶¾Ö© ¯äÅŒ ²ÄyNÕ-’õœþ:®¾£¾É§ŒÕ EªÃ-¹-ª½-ºåXj ÅçªÃ®¾ «ÕŸ¿lÅŒÕ B®¾Õ-Âî-«-œÄ-Eê ê®Ô-‚-ªýÅî ®¾«Ö-„ä-¬Á-„çÕi-Ê{Õx Åç©¢-’ú …Ÿîu’¹ ®¾¢X¶¾Ö© ¯äÅŒ ²ÄyNÕ-’õœþ OÕœË-§ŒÖÅî Íç¤Äpª½Õ. ÅÃ«á ƒX¾p-šËê ¦µÇ•¤Ä ¯Ã§ŒÕ-¹×-©ÊÕ Â¹L-¬Ç-«ÕE, ²ò«Õ-„ê½¢ ÅçŸä¤Ä, Ââ“é’®ý, ®ÔXÔ‰ ¤ÄKd-©ðxE Åç©¢-’ú ¯Ã§ŒÕ-¹×-©ÊÕ Â¹©-«-¦ð-ÅŒÕ-Êo{Õx Íç¤Äpª½Õ. ®ÔXÔ‡¢ ¯Ã§ŒÕ-¹×-©ÊÕ Â¹ØœÄ «ÕŸ¿lÅŒÕ Æœ¿Õ-’¹Õ-ÅÃ-«Õ-¯Ãoª½Õ. “X¾¦µ¼ÕÅŒy¢ ƺ-*-„ä-§ŒÕ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-*¯Ã, “X¾ÅÃu-«Öo§ŒÕ \ªÃp{Õx Íä®Ï¯Ã ƢŌ-ª½ÕuŸ¿l´¢ ÅŒX¾p-Ÿ¿E å£ÇÍŒa-J¢-Íê½Õ. “¹«Õ-P-¹~º ÍŒª½u©Õ B®¾Õ-¹ע˜ä ÅÃ«á ®ÏŸ¿l´¢’à …¯Ão-«ÕE, …Ÿîu-’Ã©Õ ¤òªá¯Ã …Ÿ¿u«Õ¢ ‚æX “X¾®¾ÂËh ©äŸ¿-¯Ãoª½Õ. ®¾«Ö-¬Ç-EÂË £¾É•-éªjÊ Åç©¢-’ú …Ÿîu-’¹Õ© ®¾¢X¶¾Õ¢ ¯äÅŒ©Õ ®Ï.N-ª¸½©ü, ŸäO “X¾²ÄŸþ, ¡E-„Ã-®ý-’õœþ, X¾ŸÄt-ÍÃJ, ¡Ÿµ¿-ªý-ªÃ«Û Ÿä¬ü-¤Ä¢-œä©Õ «ÖšÇx-œ¿ÕÅŒÖ Â¹F®¾¢ ¬Ç®¾-Ê-®¾-¦µ¼©ð Åç©¢-’ú ªÃ†¾Z \ªÃp{Õ Â¢ BªÃtÊ¢ åXœËÅä ÅÃ«á ®¾£¾É§ŒÕ EªÃ-¹-ª½-ºåXj X¾ÛÊ-ªÃ-©ð-ÍŒÊ Íäæ®-„Ã-@Áx-«Õ-¯Ãoª½Õ. ®Ô«Ö¢“Ÿµ¿ “¤Ä¢ÅŒ …Ÿîu-’¹Õ©Õ Â¹ØœÄ ®¾£¾Ç-¹-J¢-ÍÃ-©E, ‚{¢-ÂÃ©Õ Â¹L_¢-ÍŒ-«-Ÿ¿lE N•cXÏh Íä¬Çª½Õ.

Read more...

ఆంధ్రా ఉద్యోగులను అడ్డుకోండి


అసెంబ్లీలోని తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ పిలుపు

ఉద్యోగులపై ఈగ వాలనివ్వం
అధికారుల భరతం పట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు
ప్రతి జిల్లాకు 500 మంది పార్టీ సైనికులు
ఉద్యమ ఉద్యోగులను సమరయోధులుగా గుర్తిస్తాం
రాష్ట్రం వచ్చాక పదోన్నతులు.. కేంద్ర ప్రభుత్వ పేస్కేళ్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 13 : ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా, శాసనసభ సమావేశాలను అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. "శాసనసభలో మొత్తం 400 మంది ఉద్యోగులున్నారు. వీరిలో సగం సీమాంద్రులు. మీరు 180 మంది వరకూ ఉన్నారు. అంటే.. ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని అడ్డుకోవచ్చు. దీంతో, మొత్తం ఉద్యోగులు విధులు నిర్వర్తించలేని పరిస్థితి వస్తుంది.

ఉద్యోగుల సహకారం లేకుండా శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఎలా నిర్వహిస్తారో చూద్దాం'' అని శాసనసభలోని తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం జరగనున్న సహాయ నిరాకరణకు సహకరించాలని అభ్యర్థిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, కె.శ్రీనివాసగౌడ్, సి.విఠల్ నేతృత్వంలో పలు సంఘాల నేతలు ఆదివారం కేసీఆర్‌ను కలిశారు.

అలాగే, నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు, పీఆర్‌టీయూ నేత రవికిరణ్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణపై శాసనసభను స్తంభింపజేస్తామని, తాను పార్లమెంటులో స్పీకర్ పోడియం వద్ద కూర్చుంటానని చెప్పారు. ఇక తాడో పేడో తేల్చుకుంటామని, నూరు శాతం విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.

ఈనెల 17 నుంచి పాలనను స్తంభింపజేస్తామని ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయని, సహాయ నిరాకరణలో పాల్గొనే ఉద్యోగులపై ప్రభుత్వం దురుసుగా ప్రవర్తిస్తే పెన్‌డౌన్ సమ్మె చేయాలని జేఏసీలోని సంఘాలు నిర్ణయించాయని చెప్పారు. "ఉద్యోగులకు ఎటువంటి భయమూ అవసరం లేదు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఈగ వాలనియ్యం. వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది.

ఉద్యోగులను వేధిస్తే, వారిపై ఎస్మా ప్రయోగిస్తే 60 వేల మంది కార్యకర్తలతో నేనే మళ్లీ 'ఆమరణ నిరాహార దీక్ష' చేపడతా. ఏ ఒక్క ఉద్యోగినైనా అరెస్టు చేసినా, వేధించినట్లు తెలిసినా... తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ మరుక్షణమే 'మెరుపు దీక్ష'ను మొదలుపెడతా. ప్రభుత్వం మెడలు వంచుతా. ఉద్యోగులను అరెస్టు చేసినా, వేధించినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. అత్యవసర సర్వీసులనూ స్తంభింపజేద్దాం. రాష్ట్రం మొత్తం స్తంభించిపోతుంది'' అని కేసీఆర్ హెచ్చరించారు.

తమ జీతాలు, డిమాండ్ల కోసం కాకుండా ప్రజల డిమాండ్ మేరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని, చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. గతంలో జరిగిన ఉద్యమం సందర్భంగా ఆమోస్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించారని, ఈసారి అటువంటి సంఘటనలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "కార్యాలయాల్లో మీరు, బయట మేము సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వం ఎలా దిగి రాదో చూద్దాం'' అని పిలుపునిచ్చారు.

ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులను వేధించే అధికారుల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా 'టాస్క్‌ఫోర్స్' బృందాలను, జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఉస్మానియా విద్యార్థులు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, సభ్యులు టాస్క్‌ఫోర్స్‌ల్లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. వీరితోపాటు స్థానికంగా కూడా ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటవుతాయని తెలిపారు.

ఉద్యోగులపై వేధింపులు ప్రారంభమైతే ఈ 'టాస్క్‌ఫోర్స్' బృందాలు రంగంలోకి దిగుతాయని, ప్రతి జిల్లాకు 500 మంది సుశిక్షితులైన పార్టీ సైనికులను పంపుతామని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంతోపాటు ఆ తర్వాత జరగాల్సిన పునర్నిర్మాణంలో కూడా ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిస్తామని, రాష్ట్ర సాధన తర్వాత వారికి పదోన్నతులు ఇవ్వడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేళ్లను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగులకు సంఘీభావంగా ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. "తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. ఒక్క హైదరాబాద్ నగరంపైనే కిరికిరి పెడుతోంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మనం కూడా ఇప్పుడే గట్టిగా ఉండాలి. కార్యాలయాల్లో మీరు, బయట మేము ఉద్యమిద్దాం'' అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్రం రూ.63 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండేదని, ఇప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్‌లో 70 శాతానికిపైగా నిధులు ఈ ప్రాంతం నుంచే వస్తున్నాయని చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనులు 11 శాతంగా ఉంటారని, దాంతో, వారికి రాజకీయ ప్రాతినిథ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. పీజీలు, బీఈడీలు చేసి టీచర్లు అయిన వారిని అప్రెంటిస్ పేరిట ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందని, వెట్టి చాకిరీ చేయించుకుంటోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. 2008 డీఎస్సీలో ఎంపికైన వారికి అప్రెంటిస్‌షిప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నానని, అప్పటికీ స్పందించకపోతే మిత్రులను కలుపుకొని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు.

ప్రభుత్వానిదే బాధ్యత: జేఏసీ నేతలు
తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో సీమాంధ్ర, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అధికారులతో విధులను నిర్వర్తింపజేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని జేఏసీ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాదరావు, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ ఆరోపించారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు.

ఎలాగైనా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని, తద్వారా, శాంతిభద్రతలను సాకుగా చూపి ఉద్యోగులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. వారితోపాటు ఉద్యోగ సంఘాల నేతలు సయ్యద్ సలీముద్దీన్, ఎంబీ కృష్ణయాదవ్, జేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి తదితరులు కేసీఆర్‌ని కలిశారు.

తెలంగాణ భవన్ వద్ద అమరవీరుల ఐక్యవేదిక కార్యకర్తల నినాదాలు
అమరవీరుల ఐక్యవేదిక కార్యకర్తల నినాదాలు, వాటికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో తెలంగాణ భవన్ వద్ద ఆదివారం కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల కుటుంబాలకు చెల్లని చెక్కులు ఇచ్చారని, అమర వీరులను అడ్డు పెట్టుకుని కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంటోందని ఐక్యవేదికకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద నినాదాలు ఇచ్చారు. వారికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కొంత దూరం వారిని తరిమికొట్టారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుని జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

take BY: AndhraJyothi

Read more...

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ?


రాష్ట్ర విభజన సమస్యకు త్వరలో తెరపడ నుందా? రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధంగానే ఉందా? హైదరాబాద్‌పైనే సంశయిస్తోందా? హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని గా మారనుందా?.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే తెరపైకి రాకతప్పదు.ఆదివారం జరిగిన ఉద్యోగుల జేఏసీ సమా వేశంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా లోతుగానే కనిపిస్తున్నాయి. ‘తెలంగాణ కచ్చితంగా వచ్చితీరు తుంది. అయితే హైదరాబాద్‌ మీదే కిరికిరి ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. రాష్ట్ర విభజన ప్రక్రియకు కేంద్రప్రభుత్వం సుముఖంగానే ఉందని, హైదరాబాద్‌ అంశంపైనే యుపీఏ సర్కారు తర్జనభర్జన పడుతోందన్న విషయం కేసీఆర్‌ చెప్పకనే చెప్పినట్టయింది.

అయితే.. కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఢి ల్లీలో సైతం హైదరాబాద్‌ను రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలన్న అంశానికే కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ వ్యాఖ్య లు దాదాపు అదేమాదిరిగా ఉండటంతో రాష్ట్ర విభజనపై కేసీఆర్‌ యుపీఏ చాలాకాలం నుంచి టచ్‌లోనే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.సాంకేతికంగా రెండు రాష్ట్రాలను విడగొట్టి నప్పటికీ, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేయటం వల్ల రెండు ప్రాంతాల వారినీ సంతృప్తి పరచవచ్చన్న యోచన చాలాకాలం నుంచి కేంద్రం మదిలో మెదులుతూనే ఉంది. దానివల్ల అందరి మనోభావాలను సంతృప్తి పరిచినట్టవుతుం దని అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌లో స్వతహాగా జన్మించిన తెలంగాణ వారి సంఖ్య అత్యల్పమని, ఇటు తెలంగాణ గానీ, అటు సీమాంధ్ర నుంచి గానీ వలస వచ్చిన వారే ఎక్కువగా ఉన్నందున స్థానిక సమస్య ఉత్పన్నం కాదని, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ప్రతి పాదనను ఆమోదిస్తారన్న ఆశాభావంతో కేంద్ర సర్కారు ఉంది. ఇవన్నీ కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసని ఢిల్లీ వర్గాలు తెలుసు.కాగా, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అంశంపై ఆంధ్ర-తెలంగాణ ప్రజలను మానసి కంగా సిద్ధం చేయడానికే కేసీఆర్‌ ఇలాంటి ప్రచారాన్ని లేవనెత్తినట్లు కనిపిస్తోంది.

ఇకపై కేసీఆర్‌ ప్రసంగించే వివిధ వేదికలపై హైదరాబాద్‌ రాజధానిపైనే కిరికిరి ఉందన్న తన వ్యాఖ్యలను కొనసాగించడం ద్వారా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయనున్నారన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవు తోంది.అయితే, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా జరుగుతోంది. రక్షణ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, వరంగల్‌ను తెలంగాణ రాజధానిగా, విజయవాడను ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ప్రకటించే యోచన కూడా కేంద్రం మదిలో లేకపోలేదంటున్నారు.

take BY: Suryaa.com

Read more...

Friday, February 11, 2011

ఆఫీస్‌కొచ్చినా పనిచేయరు తెలంగాణ డిమాండ్‌తో 17 నుంచి ఉద్యోగుల ఆందోళన సహాయ నిరాకరణ సన్నాహకంగా నేడు ధర్నా అరెస్టయినా ఆగకుండి రెండంచెల నాయకత్వం ప్రత్నామ్న

హైదరాబాద్, ఫిబ్రవరి 10 : తెలంగాణలో సమ్మె వాతావరణం అలముకుంటోంది. ఈ నెల 17 నుంచి మొదలయ్యే 'సహాయ నిరాకరణ' ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చినా విధులు నిర్వహించరు. అయితే, ఉద్యమ ప్రభావాన్ని సాధ్యమైన మేర తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిందిగా ప్రభుత్వం వివిధ శాఖల అధిపతులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు ఉద్యమ సన్నాహకాల్లో భాగంగా జంట నగరాల్లోని 10 వేల మంది ఉద్యోగులు శుక్రవారం జీహెచ్ఎంసీ వద్ద 'మహాధర్నా' నిర్వహించనున్నారు.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే 'తెలంగాణ' బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో చేపట్టనున్న ఈ ఆందోళన గురించి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. 'ఒక్క ఫైలు కూడా కదలకూడదు. ప్రభుత్వ సమాచారాలనూ చేరవేసే ప్రసక్తి లేదు. మంత్రుల ప్రోటోకాల్స్, పర్యటనలను పట్టించుకోరాదు' అని ఉద్యోగులకు పిలుపునిచ్చినట్లు జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. సీమాంధ్రకు ఆర్టీసీ బస్సులను నడపవద్దని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చామన్నారు

. ప్రజలు, సీమాంధ్ర ఉద్యోగులు, పార్టీలు తమకు సహకరించాలని వారు విఙ్ఞప్తి చేశారు. అలాగే మంత్రుల, ఉన్నతాధికారుల వాహనాలను నడపరాదని ప్రభుత్వ డ్రైవర్లు నిర్ణయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా అడ్డుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉపాధ్యాయులు రెండోదశ జనగణనకు వెళ్లిపోవడంతో తరగతులు సరిగా జరగని నేపథ్యంలో మిగిలిన టీచర్లు కూడా విధులకు నిరాకరిస్తే తమ పరిస్థితి ఏమిటని వచ్చేనెలలో పరీక్షలు రాయడం ఎలాగని విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.

ఏదేమైనా పారిశుధ్యంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖల్లో అత్యవసర సేవలు మినహా 17 నుంచి పౌర జీవనం స్తంభించనుంది. ఫలితంగా తెలంగాణలో రోజుకు రూ.50 కోట్ల వంతున ప్రభుత్వాదాయం పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్సైజ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగుతున్నందువల్ల మద్యంపై వసూళ్లనూ కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ నష్టాన్ని నివారించుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం తమను అరెస్టు చేసినా ఉద్యమ ఊపు ఆగకుండా ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలో దిగేలా అగ్రనేతలు వ్యూహం సిద్ధం చేశారు.


take BY: Andhrajyohti

Read more...

సిఎం రచ్చబండను నిరసిస్తూ న్యాయవాదుల విధుల బహిష్కరణ-ధర్నా

వరంగల్‌ లీగల్‌ మేజర్‌ న్యూస్‌ః జిల్లాకు రచ్చబండ కార్యక్రమంలో పేరుతో వస్తున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను నిరసిస్తూ జిల్లా న్యాయవాదులు కోర్టుగేట్లు మూసివేసి గురువారం విధులు బహిష్కరించారు.అనంతరం ధర్నాకు దిగారు. రచ్చబండ వద్దు... తెలంగాణా ముద్దు.. జై తెలంగాణ...జైజై తెలంగాణ... అంటూ నినాదాలు చేసిన వందలాది మంది న్యాయవాదులు కోర్టు ప్రధాన గేట్లు మూసివేసి గేట్ల ముందు బైఠాయించారు. అనంతరం జిల్లా కోర్టు ముందు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వద్దిరాజు గణేష్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సిఎం కిరణ్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఎన్నికుట్రలు, కుతంత్రాలు పన్నినా ఉద్యమం ఆగదని ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు. తమకు రచ్చబండ లాంటి జిమ్మిక్కుల కార్యక్రమాలు వద్దని కేవలం తెలంగాణ కావాలన్నారు. ప్రజలు రచ్చబండ వద్దని నిర్వహిస్తున్నా పోలీసు బలగాలతో బలవంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. ఎంతో మంది పోలీసులను పెట్టినా తెలంగాణ వాదులు రచ్చబండను రచ్చచేశారని అన్నారు. అనంతరం జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చిల్లా రాజేంద్రప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఎం. సహోదర్‌రెడ్డి పలువురు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు మాట్లాడారు.

పోలీసులతో వాగ్వాదం - తోపులాట
సిఎం రాకను నిరసిస్తూ జిల్లా ప్రధాన గేట్లు మూసివేసిన క్రమంలో సుబేదారి సిఐ వెంకటేశ్వరబాబు తమ బలగాలతో అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాదులకు, సిఐకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టు గేట్లు తీయాలని సుబేదారి సిఐ అనగా నిరసనలో భాగంగానే గేట్లు మూసి వేసామని న్యాయవాదుల విషయంలో సుబేదారి సిఐ చూపిస్తున్న అత్యుత్సాహం పనికిరాదని నినదించారు. పోలీస్‌ గోబ్యాక్‌... ప్రజాస్వామ్య దేశమా... పోలీసుల రాజ్యమా... అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సిఐ వెంకటేశ్వరబాబు తమ బలగాలతో కోర్టు గేట్లు బలవంతంగా తీయడానికి ప్రయత్నించారు.

కానీ న్యాయవాదులు అడ్డుకొని గేట్ల ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొంత తోపులాట జరిగింది.వందలాది మంది న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు బలగాలను తీసుకొని వెంటనే వెళ్లి పోవాలని సి వెంకటేశ్వరబాబుపై మండిపడ్డారు. పోలీసుల బలగాల రాకతో రక్షణ వలయంగా ఏర్పడ్డ న్యాయవాదుల ఉదృతికి తగ్గిన పోలీసులు వెనుకడుగు వేశారు. అనంతరం తమ బలగాలను తీసుకొని సిఐ అక్కడి నుండి వెళ్లిపోయారు.

take BY: Suryaa

Read more...

ఆపరేషన్‌ కేసీఆర్‌




ప్రజారాజ్యం పార్టీ విలీనంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం మరో అడుగు ముందుకేసి, టీఆర్‌ఎస్‌ను కూడా తనలో విలీనం చేసుకుని, అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులేస్తోంది. ఆ మేరకు కేసీఆర్‌ను ఒప్పించే బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీని వాస్‌కు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అంశంపై గురువారం సోనియా తనను కలసిన డీఎస్‌తో సుదీర్ఘంగా చర్చించారు. విశ్వస నీయ సమాచారం ప్రకారం.. జగన్‌ నిష్ర్కమణ, తిరుగుబాటుతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అని శ్చితి దిశగా సాగుతున్న ఆందోళనకర వాతావరణం నుంచి బయటపడేందుకు, పీఆర్పీని తాజాగా తనలో విలీనం చేసుకుని సీమాంధ్రలోఒకింత ఊపిరిపీల్చుకున్న నాయకత్వం... తాజాగా తెలంగాణలో బలం ఉన్న టీఆర్‌ఎస్‌ను సైతం విలీనం చేసుకుని సీమాంధ్ర, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.

అందులో భాగంగా.. గురువారం తనను కలసిని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించాలని ఆమె డీఎస్‌ను ఆదేశించారు.

sonia-cతెలంగాణ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉందని, అయితే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేసేం దుకు కేసీఆర్‌ను అంగీకరింపచేయాలని మేడమ్‌ డీఎస్‌ను ఆదేశించారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల వరకూ కేసీఆర్‌ను మౌనంగా ఉండాలని, ఆ తర్వాత హైద రాబాద్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటుచేసి, రాష్ట్రాన్ని విభజిస్తా మని కేసీఆర్‌కు హామీ ఇవ్వాలని డీఎస్‌ ఆదేశించారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ను విలీనం చేసిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు, పార్టీలో కీలక పదవులు అప్పగిస్తామని చెప్పాలన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలో అనుకోని పరిస్థితిలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటే, సర్కారును గట్టెక్కించా లని కేసీఆర్‌ను కోరాలని సోనియా డీఎస్‌ను ఆదేశించారు. ఈ అంశంపై అహ్మద్‌పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్పమొ యిలీతో చర్చించాలని ఆదేశించారు. కేసీఆర్‌తో చర్చించి, విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియను పక్కకుపెడితే.. కాంగ్రెస్‌ తెలంగాణను ఇస్తే సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామని, కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ ఇస్తే బర్కాస్‌ కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ వ్యవహారం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యా నిస్తున్నాయి. దానికితోడు తెలంగాణ ఇచ్చి తాము టీఆర్‌ ఎస్‌కు ఎందుకు క్రెడిట్‌ ఇస్తామని, అందువల్ల టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాహాటం గానే వ్యాఖ్యానించిన విషయం విస్మరించకూడదు. స్వయం గా డీఎస్‌ సైతం తమకు ఎవరి అవసరం ఉంటే వారితో మాట్లాడతామని, కేసీఆర్‌తో కూడా మాట్లాడమని వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.

నిజానికి... కేసీఆర్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిపై చాలాకాలం నుంచీ గురి ఉందన్న వ్యాఖ్యలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నవే. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జన్మదినం సందర్భంగా సోనియా స్వయంగా ఫోన్‌ చేసి అభినందలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్‌ వెంటనే చిన్నారెడ్డికి ఫోన్‌ చేసి, తాను ఇక కాంగ్రెస్‌లో చేరి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తీసుకుం టానంటూ అక్కడ తాను విందు ఇచ్చిన జర్నలిస్టుల సమక్షంలో చెప్పిన విషయం చర్చనీయాంశమయింది.

అయితే.. ఢిల్లీలో జరుగుతున్న విలీన ప్రక్రియ ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ నేత వినొద్‌కుమార్‌ కొట్టివేసినా, కేసీఆర్‌ గతంలో అనేక సందర్భాల్లో అనుసరించిన వైఖరి పరిశీలిస్తే దీన్ని కొట్టిపారేయడానికి లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు వార్తలను ఖండించిన కేసీఆర్‌ ఆ తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009 నాటి ఎన్నికల ముందు టీడీపీతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపైనా ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత మహాకూటమిలో భాగస్వామిగా మారారు.

గతానుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్‌లో విలీనంపై టీఆర్‌ఎస్‌ వాదన కూడా అదేవిధంగా ఉందంటున్నారు. పీఆర్పీ అధినేత చిరంజీవి సైతం తన పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందన్న వార్తలపై పలుమార్లు అగ్గిరాముడ య్యారు. తిరిగి ఆయనే గత ఆదివారం స్వయంగా ఢిల్లీకి వెళ్లి. సోనియా సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

take BY: Suryaa.com

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP