Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, January 7, 2011

రాష్ట్రానికి 6 సూత్రాలు

కలిసి ఉంటే కలదు సుఖం ఆనందమయ రాష్ట్రానికి 6 సూత్రాలు

chidambaraహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: పది నెలల పాటు రాష్టమ్రంతటా పర్యటించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఎన్ని పేజీల నివేదిక ఇచ్చినా చిట్ట చివరకు రాష్ట్ర విభజన అనవసరం తేల్చింది. తాను చేసిన ఐదు సిఫారసులలో మూడు పరిశీలనార్హం కావని ముందుగానే ఒప్పుకున్న కమిటీ ఆరవ సిఫారసులో అటూ ఇటూ తిప్పి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ సిఫారసులో ఏమన్నదంటే...

‘తెలంగాణ ప్రాంతానికి సామాజిక, ఆర్థిక అభివృద్ధి, రాజ కీయ సాధికారత కలిగించటం, చట్టబద్ధమైన అధికారాలు కలిగిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవచ్చు...’ ఈ సిఫారసును అమలు చేయటం ద్వారా...జాతీయ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న సిఫారసు చేస్తున్నామని కమిటీయే స్పష్టంగా చెప్పింది. దృఢమైన రాజకీయ, పాలనా దక్షతల ద్వారా రాష్ట్రంలో మెజారిటీ ప్రజానీకాన్ని మెప్పించగలిగిన సిఫారసు అని పేర్కొన్నది. అంటే శాంతి భధ్రతలఅంశం తలెత్తితే కఠినంగా వ్యవహరించటం ద్వారా కాపాడవచ్చునని, అన్ని ప్రాంతాల నేతలను ఏదో ఒక రకంగా బుజ్జగించటం ద్వారా పాలనా దక్షతను చాటుకోవచ్చునని చెప్పిందన్న మాట.

అలాగే విద్య, పారిశ్రామిక, ఐటీ రంగాలలో నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరం విషయంలో మిగిలిన ప్రాంతాలలో ఉన్న సందిగ్ధతను తొలగించ వచ్చునని చెప్పింది. మూడు ప్రాంతాలకూ సమానంగా నీరు, నీటి పారుదల యాజమాన్యాన్ని అందించటం కోసం ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలన్నది. నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒక కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేయాలన్నది. ఇవి జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజానీకం లేవనెత్తిన అన్ని అంశాలకూ పరిష్కారం లభిస్తుందని చెబుతూ ఈ సిఫారసును అమలు చేస్తే రాష్ట్ర విభజన అవసరమే లేదన్న అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తం చేసింది. చివరగా ప్రస్తుత పరిస్థితిలో, అన్ని ప్రాంతాల ప్రజానీకం ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫారసు మాత్రమే చక్కటి పరిష్కార మార్గం అని చెప్పుకున్నది.

తానే అంగీకరించని మూడు...
krishఇక సిఫారసుల సారాంశం ప్రారంభంలో తానే చెప్పిన మూడు అంశాలు పనికిరావని కమిటీయే పేర్కొన్నది. అవి ఒకటి యథాతథ స్థితిని కొనసాగించటం, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకూ రెండు రాజధానులను ఏర్పాటు చేయటం, రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించి హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఏర్పాటు చేయటం... ఈ సిఫారసులపై వివరణ ఇస్తూ...మొదటి దానికి చాలా తక్కువ మంది అంగీకరిస్తారని, రెండవ దానికి అసలు సిఫారసు ఏమాత్రం సాధ్యం కాదని, మూడవ దానికి అసలు సమస్యకు పరిష్కారమే కాదని తానే చెప్పుకున్నది.

తెలంగాణకు న్యాయం జరిగింది...
రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రులుగా ఎక్కువ కాలం ఉన్నప్పటికీ వారికి ప్రధానమైన మంత్రి పదవులు దక్కలేదని పేర్కొన్నది. అలాగే భారీ, మధ్య తరహా, చిన్న నీటి పారుదల శాఖా మంత్రులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 20 మంది, కోస్తా ప్రాంతానికి చెందిన వారు 16 మంది, ఆరుగురు రాయలసీమ నుంచి పని చేశారన్నది. ఇలా చెప్పటం ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువకాలం నీటి పారుదల రంగంలో మంత్రులుగా పని చేసినా అభివృద్ధి జరగలేదని, దానికి తెలంగాణ వారే బాధ్యులంటూ పరోక్షంగా దెప్పి పొడిచింది. ఇక నివేదిక లోకి వెళ్తే కీలకమైన మంత్రి పదవుల విషయంలో తెలంగాణకు ఎలా న్యాయం జరిగిందో ఒక పట్టిక ద్వారా చెప్పుకొచ్చింది. ఇక కీలకమైన హోం, ఆర్థిక, రెవిన్యూ మంత్రులుగా ఉన్న వారిలో ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంతకాలం బాధ్యతలు నిర్వహించారో ఒక జాబితా ద్వారా తెలిపింది.

శ్రీకృష్ణ చిట్కాలు
telagn

1. యథాతథ స్థితిని కొనసాగించడం


2. తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం


3.రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించడం. హైదరాబాద్‌ను రాయలతెలంగాణలో అంతర్భాగంగా ఉంచడం


4. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. కోస్తా ఆంధ్ర, రాయలసీమతో హైదరాబాద్‌కు భౌగోళిక సంబంధం కొనసాగించడం

5.హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ. కొత్త రాజధానితో సీమాంధ్ర ఏర్పాటు చేయడం


6.ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉంచి తెలంగాణ అభివృద్ధికి రాజ్యాంగ ప్రతిపత్తిగల అభివృద్ధి మండలి ఏర్పాటు చేయడం

Take By: Suryaa.com


Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images, Srikrishna Commitee

Read more...

ఉంటే ఉంటా పోతే పోతా


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. కమిటీ సిఫారసులతో సంబంధం లేకుం డా 2009 డిసెంబర్‌9 ప్రకటణకు కట్టుబడి ఉండి పార్ల మెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ, తెలంగాణా కేంద్ర ప్రభుత్వ కాల యాపనను నిరసిస్తూ గురువారం జేఏసీ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. టీఆర్‌ఎస్‌ అధి నేత కేసీఆర్‌, బిజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులు ఈ ధర్నా కార్య క్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లా డుతూ ‘‘ ఉంటే ఉంటా..పోతే పోతా’’ తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేస్తా.. అవసరమైతే మళ్లీ దీక్ష చేస్తా... ‘‘తెలంగాణ బిడ్డలారా..మీ కడుపులో తలపెట్టి చెబు తున్నా, ఎవరూ కాల్చుకోవద్దు, మీరు సచ్చపోయి మమ్మ ల్ని సగం చంపవద్దు...తెలంగాణ వచ్చే వరకు మెండిగా పోరాటం చేస్తా’’ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రెండు ప్రాంతాలకు అనుకూలమని ఎరికి వారే చెప్పుకునే విధం గా ఉంది. 1956 ముందున్న ఆంధ్ర తెలంగాణ ప్రాతా లను ఏర్పాటు చేయాలన్నది ఒకటే కమిటీ నివేదికలో బా గుంది. మేం కోరుకునేది కూడా ఆదే. మిగతాకమిటీ నివేదిక అంతా చెత్తబుట్టలో పడేయాల్సిందే. అసలు శ్రీకృస్ణ కమిటీకి దమాక్‌ ఉందా? హైదరా బాద్‌ ఎవడబ్బ సొత్తు, హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికేనా మీరు ఇన్ని రోజులు వని చేసింది.

రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతూ మూడు బోర్డులు వేయాలట.. మేం ఎన్ని బోర్డులు చూడ లేదు...సమైక్యరాష్ట్రంలో మీరిచ్చిన హామీలు ఎన్ని నెరవేరాయి? ఇంకా మిమ్మల్ని మేం నమ్మే పరిస్థితిలో లేం.. ఇప్పటికయినా మొదటి మూడు సూచనలు అమలు సాధ్యం కాదని వారే చెప్పారు. ఆంధ్రాలో కలిసి ఉండటం అసాధ్యం అని గమనిం చింది. తెలంగాణ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేదంటే అటు ఆంధ్రా, ఇటు తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా బతగదు. ఇకపై తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ పిలుపు మేరకు ఐక్యంగా పోరాటాలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధులంతా రాజీనామాలు చేసి కేంద్రం మెడలు వంచుదామని, రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటం ఒక్కటే కేంద్ర ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కింద ప్రత్యామ్నా యాలు పనికిరావన్నారు.

పీఆర్పీ ఎమ్మెల్యే అనిల్‌ని తరిమికొట్టిన తెలంగాణ వాదులు
శ్రీకృష్ణ నివేదిక నివేదిక వెలువడగానే పీఆర్పీ ఎమ్మెల్యే అనిల్‌ (బాల్కొండ నియోజకవర్గం) ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జేఏసీ చేస్తున్న ధర్నా వద్దకు వచ్చారు. దీక్ష వద్దకు ఎందుకు వచ్చావు.. నీవు తెలంగాణ ద్రోహివి అంటూ తెలంగాణ వాదులు తిట్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, విద్యార్ధులు అతన్ని చెప్పులతో లతో కొడుతూ తరిమి కొట్టారు. కేసీఆర్‌, జేఏసీ నేతలు విద్యార్థులను వారించినా లాభం లేకపోయింది. ధర్నా వద్ద ఉన్న పోలీసు అధికారులు వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

Take By: Suryaa.com

Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Images, Hot Images, Srikrishna Committee,

Read more...

Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల

సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్దతిలో కృషి చేద్దామని కేంద్ర హోంమంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశంలో అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే కమిటీని ఏర్పాటు చేయటం అయ్యిందన్నారు.మిగతా పార్టీలో ఈ సమావేశానికి హాజరు కాకపోవటం బాధాకరమన్నారు. వారికి కూడా నివేదికను పంపించటం జరుగుతుందన్నారు.కమిటీ సభ్యులు నివేదికలో మొత్తం ఆరు ప్రతిపాదనలు చేసినట్లు చిదంబరం తెలిపారు.


నివేదిక ప్రతిపాదించిన ఆరు సూచనలు : 1. రాష్ట్రాన్ని యథాతథ స్థితి కొనసాగించటం

2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, - హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా చేయటం
రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు

3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర విభజించటం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణ భాగంలోనే ఉంచటం.

4. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, హైదరాబాద్ విస్తృత మెట్రో నగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కోసాంధ్ర, రాయలసీమకు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం కొనసాగించటం.

5 రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల పరిధి ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయటం, సీమాంధ్రకు కొత్త రాజధాని.

6 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయటం

Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images

Read more...

Options given by Srikrishna Committee on Telangana

Option 1

Maintain status quo

Option 2

Bifurcation of the State into Seemandhra and Telangana; with Hyderabad as a Union Territory and the two states developing their own capitals in due course

Option 3

Bifurcation of State into Rayala-Telangana and coastal Andhra regions with Hyderabad being an integral part of Rayala-Telangana

Option 4

Bifurcation of Andhra Pradesh into Seemandhra and Telangana with enlarge(including Mahabubnagar,Ranga Reddy, and Nalgonda) Hyderabad Metropolis as a separate Union Territory.

Option 5

Bifurcation of the State into Telangana and Seemandhra as in 1956 with Hyderabad as the capital of Telangana and Seemandhra to have a new capital

Option 6

Keeping the State united by simultaneously providing certain definite Constitutional/Statutory measures for socio-economic development and political empowerment of Telangana region – creation of a statutorily empowered Telangana Regional Council.

After listing these, the commission has rejected the first three as not being practical. Options four, five and six of the above are thus the options that the report presents as possible solutions to the Telangana issue.


Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images

Read more...

తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లు కడగడానికి రెడీ: కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష సమావేశం అవసరం లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. కేంద్రం తలచుకుంటే ఎవరి అభిప్రాయం అక్కర్లేదని అయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడమే కేంద్రముందున్న ప్రత్యామ్నయమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు రెండు వారాల వ్యవధి ఇస్తున్నామని, రాష్ట్ర ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోకుండా కేంద్రం కాలయాపన చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కమిటీ నివేదికపై రాజకీయ నిర్ణయమే ఫైనల్‌ అని, కమిటీ నివేదిక ఎన్ని పరిష్కారాలు సూచించినా రాష్ట్ర ఏర్పాట్లుపై కేంద్రానిదే తుది నిర్ణయమని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరాలని చూస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూలో నిల్చున్నారని ఆయనన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడగటానికి తాను రెడీ అని కేసీఆర్‌ అన్నారు.
Take By : Suryaa.com

Tag:

Read more...

తేల్చేనా.. నాన్చేనా? - ‘తెలంగాణ’పై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నేడే





‘తెలంగాణ’పై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నేడే



* వెల్లడికానున్న శ్రీకృష్ణ నివేదిక
* తెరవేస్తారా..? సాగదీస్తారా..? రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్
* శ్రీకృష్ణ నివేదికను అందించటమేనా..? నిర్ణయం తీసుకుంటారా?
* అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ దూరం
* పీఆర్పీ నో కామెంట్.. సీపీఐ తెలంగానం.. సీపీఎం సమైక్య నాదం
* హైదరాబాద్‌పైనే ఎంఐఎం దృష్టి
* కాంగ్రెస్‌లో ప్రత్యేక, సమైక్య వాదనలున్నా.. చివరికి హైకమాండ్ దారే
* అన్నిటికీ మించి కేంద్ర సర్కారు నిర్ణయమే కీలకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏడాది కాలపు ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలను తీవ్ర ఉత్కంఠలో పెట్టిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ.. వారం కిందట కేంద్రానికి సమర్పించిన నివేదికలోని అంశాలు గురువారం వెల్లడికానున్నాయి. ఈ నివేదికపై రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలక సమావేశం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగేదేమిటి? అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యం పాటిస్తోంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కీలకమైన నిర్ణయం జరుగుతుందా? లేక కేవలం నివేదికను అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వటం వరకే పరిమితం చేసి.. ఇవే పరిస్థితులు కొనసాగటానికి కారణమవుతారా? అనేది నేటితో తేలిపోనుంది.

రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రాలేమని ప్రకటించాయి. వీటి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉంటానని ప్రకటించింది. తెలంగాణలో కీలకమైన రాజకీయ పార్టీల్లో సగం పార్టీలు తిరస్కరించిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని రాష్టమ్రంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం నిరర్ధకమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కేంద్ర ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్క ప్రతినిధినే ఆహ్వానించకుండా భిన్నాభిప్రాయాలు వచ్చే విధంగా అనైతిక పద్ధతికి కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహాన్నిస్తోందంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కూడా అఖిలపక్ష ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించినా భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించినట్లు కాదంటూ ఏకాభిప్రాయం ప్రకటించిన పార్టీలను ఉదహరిస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం రెండోసారి కేసీఆర్‌ను ఆహ్వానించారు.

రెండోసారి పంపిన ఆహ్వానాన్ని కూడా కేసీఆర్ తిరస్కరిస్తూ.. అఖిలపక్ష కమిటీ సమావేశానికి రాలేమని ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఏర్పాటు చేసే అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నాయని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అటూఇటుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లటం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని.. ఈ సమావేశానికి తాము రావాల్సినంత అవసరమేమీ లేదనే కారణంతోనే గైర్హాజరవుతున్నామంటూ చంద్రబాబు లేఖ రాశారు.

అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధిగా సి.రామచంద్రయ్య ఒక్కరే హాజరుకానున్నారు. ఈయన కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పకుండా నివేదికను మాత్రమే పార్టీ తరఫున తీసుకోనున్నారు. ఒకవేళ అభిప్రాయం చెప్పాలని కేంద్రం కోరితే పార్టీలో చర్చించిన తర్వాతే పార్టీ వైఖరిని చెప్తామని మరింత గడువు కోరటానికి రామచంద్రయ్య హాజరవుతున్నారు. ఇక సీపీఎం ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి హాజరవుతున్నారు. నివేదిక ఇచ్చినా, అభిప్రాయం అడిగినా సమైక్యవాదాన్నే వీరు వినిపించనున్నారు. సీపీఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు జి.మల్లేష్ హాజరవుతుండగా.. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఏకాభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఎంఐఎం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఎమ్మెల్సీ ఖాద్రీ హాజరుకానున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయదలిస్తే హైదరాబాద్, మైనారిటీ అంశాలను వీరు ప్రస్తావించనున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ...
రాష్ట్ర రాజకీయ పార్టీల్లోకెల్లా కాంగ్రెస్‌లోనే తీవ్ర అనిశ్చితి, అయోమయ పరిస్థితి నెలకొనిఉంది. టీడీపీ తర్వాత.. అంతర్గతంగా అదేస్థాయిలో తెలంగాణ, సమైక్యాంధ్ర విషయాల్లో సొంతపార్టీ నేతల మధ్యనే అగాధం నెలకొంది. పుట్టినరోజు నాడే నిర్ణయాన్ని ప్రకటించినందున తెలంగాణకు అనుకూలంగానే పార్టీ అధినేత్రి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రాంత నాయకులు చెప్తున్నారు. రెండో ఎస్‌ఆర్‌సీయే పార్టీ విధానమని, రాష్ట్ర విభజనకు అంగీకరించబోరని సమైక్యవాద నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే పార్టీ పదవులే కాదు ఎలాంటి త్యాగాలనైనా చేస్తామని తెలంగాణ నాయకులు హెచ్చరిస్తుంటే.. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుండి నిష్ర్కమిస్తామంటూ సమైక్యవాద నాయకులు బెదిరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలు కావూరి, ఉత్తమ్‌లు అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించటం అంత ఈజీ కాదని కావూరి అంటే.. తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఉత్తమ్ ఉద్ఘాటించారు. రాష్ట్ర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ వంటివి అంతర్గతంగా నిట్టనిలువునా చీలిపోతున్న ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ దాదాపు 10 నెలల పాటు రాష్ట్రంలో అధ్యయనం చేసింది. కమిటీ చేసిన అధ్యయనం, సూచించిన పరిష్కారాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర రాజకీయవర్గాల్లోనే కాకుండా వ్యాపార, ఉద్యోగ, విద్యార్థులతో పాటు ప్రజానీకమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కమిటీలో ఏయే అంశాలు, పరిష్కారాలు చోటుచేసుకున్నాయనేది ఒక అంశమైతే దీనిపై కేంద్ర వైఖరేమిటన్నదే అన్నింటికన్నా అంతిమ ప్రాధాన్యతాంశం.


Tag: Sakshi, eenadu, News, Telangana, KCR, RajNews, AP,

Read more...

Wednesday, January 5, 2011

Maha Garjana NEW PICS















Tag: Images, Hot Image, Telangana Image, Telangana, KCR, BJP, TRS, PRP, News, AP

Read more...

All 165 MPs of NDA will support the Telangana bill : Gadkari

Bharatiya Janata Party (BJP) president Nitin Gadkari Tuesday said if the United Progressive Alliance (UPA) government tables a bill in parliament for formation of a separate Telangana state, the National Democratic Alliance (NDA) would wholeheartedly support it.

Addressing a public meeting organized by the party at Adilabad, Gadkari assured people of Telangana that the NDA was with them in realizing their dream of a separate state.

‘I have come to assure you that all 165 MPs of NDA will support the bill on Telangana if Sonia Gandhi (Congress president) fulfils her promise by tabling the bill,’ he said.

The BJP chief warned the government against suppressing the Telangana movement by using paramilitary forces. ‘It is shameful that the government which failed to tackle terrorism has deployed paramilitary forces in Telangana to suppress peaceful agitation,’ he said.

Gadkari said if any force was used against the students and other protestors in Telangana, NDA would not allow parliament to function during the budget session.

The BJP leader said the fight for a separate state of Telangana was the fight for self-respect by four crore people of the region.

He promised that Telangana would be on the top of its agenda if NDA comes to power in the next elections.

He was confident that NDA would come to power in the 2014 elections and it would take up the Telangana state formation immediately.

He said Telangana was on top the agenda of the NDA meeting to be held Wednesday.

Gadkari described the Srikrishna committee as ‘time pass’ committee and said it was constituted by the government to drag the Telangana issue.

‘This is the reason the BJP has decided not to attend the eight-party meeting convened by the centre on Jan 6,’ he said.

The BJP held the public meeting two days before the centre is to make public the report of the Srikrishna committee.

Read more...

RTI activists seek Srikrishna panel report details




http://timesofindia.indiatimes.com/city/hyderabad/RTI-activists-seek-Srikrishna-panel-report-details/articleshow/7198356.cms

HYDERABAD: Right to Information (RTI) activists in the city have filed a petition under the RTI Act with the ministry of home affairs at the Centre seeking to know the contents of the Srikrishna Committee report. Their stand? Well, citizens and not politicians should be the first to know about the committee's recommendations.

Activists have not only filed a petition but are also mobilising people from districts to do the same and have set a target of 200 RTI applications that they would mobilise. Ten RTI petitions have already been filed from Warangal alone. "We want them to share the contents of the committee recommendations with us before politicians get to look at it," said Rakesh Reddy Dubbudu, activist, who filed his application under the special clause listed under Section 7(1) of the RTI Act. According to the listed clause, any information which has the potential to affect lives and liberty of people at large, must be provided within 48 hours of the receipt of the request petition.

"The committee recommendations definitely concerns the life and liberty of the masses who have been actively involved in the movement. Therefore we, as citizens of the country, are better suited to get a copy of the submitted recommendations ahead of the politicians," said Dubbudu. If the activists do get a response to their petition in 48 hours (by Monday), they plan to circulate the content among the masses.

Filed with an objective to put to rest the speculations about the formation of a new state as is currently doing the rounds, this application can however be turned down by the PIO if he so decides. "If he thinks that this information does not hold enough ground, then it can be turned down, but the onus is on him to prove the same," said another RTI activist. Activists are hoping that the ministry's office will follow the RTI Act in letter and spirit and thereby furnish information under this special clause. Further, they argue that since the committee has worked with public money, it is then justified that people know what the contents of the report are.

RTI activists have also asked non-resident Indians to file similar applications in the Indian embassies located in their respective countries.

Read more...

ఆగదు నా తెలంగాణ పోరు

ఆగదు నా తెలంగాణ పోరు
అణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
ప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
అధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరు
అన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసం
ఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడు
ఇంకింత జోరు అందుకుంది
ఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...
ఆపగలను అన్నోడికి నా సవాల్...
- కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP