Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, October 25, 2011

Telangana employees call off strike



The 42-day-old strike by the Telangana Employees Joint Action Committee (TEJAC) came to an end after the government conceded all its nine major demands following a hard bargain.

It signed a memorandum of understanding with the government in the presence of Chief Minister N. Kiran Kumar Reddy and agreed that the employees would resume duty from Tuesday. The MoU was preceded by marathon negotiations that commenced at 12 noon and concluded at the Chief Minister's Camp Office here late in the night. 

The TEJAC leaders later met Telangana Joint Action Committee (TJAC) chairman M. Kodandaram, who claimed that the employees had only suspended their agitation. Finance Minister Anam Ramnarayan Reddy, a member of the Cabinet sub-committee holding discussions with the strikers, however, announced that they had decided to call off their strike. 

Earlier, the TEJAC leaders — K. Swamy Goud, Srinivas Goud, Vithal, Deviprasad, and Narender Rao — held talks with Chief Secretary Pankaj Dwivedi and later with the Group of Ministers headed by Deputy Chief Minister C. Damodar Rajanarsimha. 

The government made it clear that the demand for a separate Telangana was within the Centre's purview and the Chief Minister had already conveyed the sentiments of the people during his recent visit to New Delhi. The government agreed to treat the employees' absence during the strike period as “on duty,” and appropriate leave including half-pay leave would be sanctioned. The demand would, however, be considered after taking the Advocate-General's advice. 

The government said it had enforced the ‘no work, no pay' principle. However, to avoid hardship to employees in view of the coming festivals, a special advance would be granted to the extent of salary lost on account of participation in the strike but subject to a maximum of one month's salary. The amount would be recovered subsequently. 



Read more...

కంగుతిన్న సర్కార్ కరెంటోళ్ళ సమ్మెతో..; షాక్..షాక్

- జేఏసీ నేత రఘు దీక్షకు మద్దతు
- జనంతో కిటకిటలాడిన విద్యుత్ సౌధ
- తరలివచ్చి అండగా నిలిచిన ఉద్యమకారులు
- నేడు దీక్ష విరమణ

eetala-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 24 : విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
కో ఆర్డినేటర్ కే రఘు చేపట్టిన 72 గంటల దీక్షకు విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఈ దీక్ష తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని మరింతగా రగిలించి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. సకల జనుల సమ్మెలో ప్రధాన భూమిక పోషిస్తున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మధ్య చీలిక తీసుకువచ్చే ఇంధనశాఖ ఉన్నతాధికారుల కుట్రలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష ఆశించినదానికంటే ఎక్కువగా సత్ఫలితాలనందిస్తోంది. వివిధ పక్షాల, ప్రజాసంఘాల నేతలు, ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించి ఈ వేదికగా తెలంగాణ సమాజానికి తమ అభివూపాయాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగంలో ఉద్యోగులు ఈ విధంగా సుదీర్ఘ దీక్షకు పూనుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సమ్మె విరమణ అంశంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో కాకుండా, కేవలం ఉద్యోగసంఘాలతోనే చర్చలు జరపాలని విద్యుత్ ఉన్నతాధికారులు కుట్రపూరితంగా ఉద్యోగుల మధ్య విభజన తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు రఘు దీక్షతో విఫలమయ్యాయి. ఖైరతాబాద్ విద్యుత్‌సౌధలో జేఏసీ నేత రఘు చేపట్టిన 72 గంటల దీక్షా విజయవంతమయ్యేందుకు జేఏసీ నేతలు ఏ జానయ్య, మోహన్‌డ్డి, స్వామిడ్డి, ముస్తాక్ తదితరులు ముందుకొచ్చారు. దీక్షాశిబిరం గత రెండు రోజులుగా తెలంగాణవాదులకు ప్రధాన కేంద్రంగా మారింది. దాంతో రఘు దీక్షను భగ్నం చేసేందుకు సర్కారు పన్నిన కుయుక్తులు సైతం విఫలమయ్యాయి. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు రఘు తన మూడురోజుల దీక్షను విరమించనున్నారు.

gaddar-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త రఘు 72 గంటల నిరాహార దీక్షలో భాగంగా మూడవ రోజు ఉదయం 9గంటల నుంచే పరామర్శల తాకిడి పెరిగింది. తెలంగాణలోని పది జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. జిల్లాల నుంచి తరలివచ్చిన వే మందితో విద్యుత్‌సౌధ ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. విద్యుత్ ఉద్యోగులతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ జేఏసీల నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు రాజకీయ నాయకులు కూడా భారీగా తరలిరావడంతో జనంతో నిండిపోయింది. సెక్యూరిటీగా ఉన్న పోలీసులు విద్యుత్‌సౌధకు ఒకవైపున ఉన్న గేట్‌ను పూర్తిగా మూసివేశారు. విద్యుత్‌సౌధ కార్యాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు సాయంత్రం వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గద్దర్ పాటలతో, సంధ్య ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది.

కాంగ్రెస్ నాయకులు కేశవరావు వచ్చిన సందర్భంలో ఉద్యోగులు వ్యతిరేకంగా నినాదాలు చేయగా నిర్వాహకులు వారిని శాంతింపజేశారు. ఈ కార్యక్షికమంలో విద్యుత్ ఉద్యోగుల ఎంపీటీసీఎల్ చైర్మన్ తిరుపతిడ్డి, కో-కన్వీనర్ మోహన్‌డ్డి, సీపీడీసీఎల్ చైర్మన్ జానయ్య, ప్రజావూఫంట్ నాయకుడు వేదకుమార్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్, డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ నర్సయ్య, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి మల్లికార్జున్, న్యూ డెమోక్షికసి నాయకురాలు ఝాన్సీ, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు అమానుల్లాఖాన్, ఆర్టీసీ జేఏసీ నేత సలీం, వివిధ జిల్లాల ప్రతినిధులు వెంకట్‌నర్సింహాడ్డి, కరెంట్‌రావు, జగన్, యాదగిరి, నిత్యకళ్యాణం, లక్ష్మినారాయణ, పూర్వం చందర్‌రావు, లక్ష్మణ్, కృష్ణయ్య తదితరులు ప్రసంగించారు.

పత్రికలు, మీడియా ఏ పక్షం?
ప్రజా ఉద్యమంలో పత్రికలు, మీడియాలు ఏ పక్షం వహిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి సీమాంధ్ర మీడియా, పత్రికలు దుష్ర్పచారం సాగిస్తున్నాయి. ఉద్యమంవల్ల విద్యార్థుల చదువులు నాశనం అవుతున్నాయని, పేద ప్రజల బతుకు ఆగమౌతుందని, సింగరేణి కార్మికుల సమ్మె వల్ల తెలంగాణ రైతుల పంటలు ఎండుతున్నాయని మొసలి కన్నీరు కార్చడం సీమాంధ్ర మీడియా చేస్తున్న దగా, మోసానికి నిదర్శనం. ఈ సీమాంధ్ర పత్రికలు అసలు దీనికి కారణమైన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిపోయి, ఉద్యమాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అద్భుతమైన ఉద్యమం సాగుతుంటే, తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొంటుంటే కలాలను ఎవరిపై ఎక్కుపెట్టారు?

మహిళలను రాజ్యాంగ విరుద్ధంగా రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పాలకులను, పోలీసులను ఎందుకు ప్రశ్నించలేదు? శవాల మీద ప్రమాణాలు చేసిన మంత్రులు ప్రజాఉద్యమంలో కలిసి రావాల్సిన మంత్రులు మాట మరిచి ముఖ్యమంవూతికి సేవలు చేస్తున్న తెలంగాణ ప్రాంత మంత్రులను ప్రజపూవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. చిదంబరం, ప్రణబ్‌లకు మధ్య ఏర్పడ్డ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి సమయం తీసుకున్న సోనియాగాంధీకి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షపై చర్చించడానికి సమయం దొరకడం లేదా?

ద్రోహుపూవ్వరో తేలింది
kodanda-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసకలజనుల సమ్మె తెలంగాణ ద్రోహులు ఎవ రో బయటపెట్టింది. రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎవరి వైఖరి ఏమిటో సకలజనుల స మ్మె స్పష్టం చేసింది. సమ్మె తెలంగాణ సమాజాన్ని మాత్రం ఐక్యంగా చేయగలిగింది. ఇది గొప్ప విజ యం. ఇంతకాలం మౌనం గా ఉన్న కేంద్ర ప్రభుత్వం చర్చలు, కోర్ కమిటీల సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోకతప్పదన్న స్థాయికి వచ్చింది. సమ్మె తగ్గుముఖం పడుతుందని ఎవరూ అధైర్యపడొద్దు. సమ్మె అనేక రూపాలుగా రూపాంతరాలు చెందుతూ రోజురోజుకూ ఉధృతం అవుతుంది. ఎవరికీ ఇబ్బంది కావద్దని కొంత విరామం ఇచ్చాం.

అవసరమైతే ఏ క్షణమైనా రావడానికి సింగరేణి, ఆర్టీసీ, ఉపాధ్యాయులు వంటి వర్గాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు నలుగురి కోసం సహాయపడే మనసత్వం ఉన్నవారే తప్ప కుట్రలు, కుతంవూతాలకు పాల్పడేవారు కాదు. విద్యుత్ ఉద్యోగులు ధైర్యంగా ఉండాలి. మీ వెంట నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఉందనే విషయాన్ని గమనించాలి. జేఏసీ ఎప్పటికీ మీ వెంటే నిలబడుతుంది. మంగళవారం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో చర్చించి ఒక కార్యాచరణను ప్రకటిస్తాం.



Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC

Read more...

పది డిమాండ్లకు అంగీకరించిన సర్కార్ - ఇదీ ఒప్పందం

-సమ్మె మాత్రమే ఆగింది... ఉద్యమం ఆగలేదు
- సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తట్టి లేపింది
- సమ్మె ఉధృతం చేసే విధంగా భవిష్యత్తు కార్యాచరణ
- అందుకే తాత్కాలిక వాయిదా: కోదండరాం


జెండాలన్నీ పక్కనపెట్టి ఉద్యమంలో కలిసొచ్చిన సంఘాలన్నింటికీ
ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఎప్పుడు ఉద్యమంలోకి రావాలని
పిలుపునిచ్చినా ఉద్యోగులుగా సంపూర్ణ మద్దతు తెలుపుతాం



Swamy-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema1) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి ఉంది. అయితే ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రజల సెంటిమెంట్‌ను ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్రానికి వివరించారు.

2) సహాయ నిరాకరణ సమయంలో కుదుర్చుకున్నట్లుగా తెలంగాణలోని ఉద్యోగాల భర్తీపై రిటైర్డ్ హైకోర్టు జడ్జీ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటుకు అంగీకారం. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అందుబాటులో లేకుంటే రిటైర్డ్ జిల్లా కోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు.

3) సమ్మె సమయంలో ఉద్యోగులపై ప్రయోగించిన ఎస్మాను తొలగించడం. సమ్మె కాలంలో కొన్ని శాఖల్లో ప్రయోగించిన ఎస్మాను అంశాల ఆధారంగా తొలగించడం.

4) ఉద్యోగులపై పెట్టిన క్రిమినల్ కేసుల ఎత్తివేత. ప్రత్యక్షంగా పాల్గొనని కేసులను వెంటనే ఎత్తివేతకు అంగీకారం.

5) జీవో 17జైపకారం ఉద్యోగులపై ప్రయోగించిన నోవర్క్, నోపే పై అడ్వకేట్ జనరల్‌ను సంప్రదించి ఉద్యోగులకు సానుకూలంగా తగిన చర్యలు తీసుకోవడం

6) సమ్మె కాలంలో జరిగిన డిప్యూ బదిలీలను సానుభూతితో వ్యవహరించి వెనక్కి తీసుకోవడం. తిరిగి పాత స్థానంలోనే ఉద్యోగాలు ఇవ్వడం.

7) 13.9.2011నుండి సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు హాఫ్ పే లీవ్ కింద సమ్మె కాలన్ని లెక్కించాలి. జీవో 177 కోర్టు పరిధిలోనిది కనుక అడ్వకేట్ జనరల్ సూచనల అనంతరం హాఫ్ పే లీవ్‌ను మంజూరు చేయడం.

8) సమ్మె కాలంలో లక్షలాది మంది ఉద్యోగులో విధులకు దూరంగా ఉన్నారు కనుక వేతనాలు రాక పండుగలు కూడా జరుపుకోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే పండుగల నేపథ్యంలో ఒక్కొక్క ఉద్యోగికి వారి ఒక నెల వేతనాన్ని అడ్వాన్స్‌గా చెల్లించడానికి అంగీకారం. ఇచ్చిన అడ్వాన్స్‌ను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది తెలంగాణ జెఎసీని సంప్రదించిన అనంతరం నిర్ణయం

9) సమ్మె కాలంలో తొలగించబడిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరిగి విధులకు తీసుకోవడం.

10) మంగళవారం (25.10.011)నుండి ఉద్యోగులు విధులకు హాజరుకావడం


Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC

Read more...

ఉద్యోగ సంఘాల సమ్మె..వాయిదా

- పది డిమాండ్లకు అంగీకరించిన సర్కార్
- టీ ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం
- నేటి నుంచి విధులకు హాజరు


CM-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 24 :తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెను ఉద్యోగులు 42వ రోజున ప్రభుత్వ హామీతో తాత్కాలికంగా వాయిదా వేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 12 గంటలపాటు ఎడతెగని విధంగా సాగిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఉద్యోగుల పది డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. మధ్యలో ఒకసారి డిమాండ్లను పరిశీలించే విషయంలో ప్రభుత్వానికి, మంత్రివర్గ ఉప సంఘానికి, ఉన్నతాధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో చర్చలకు బ్రేక్ పడిన ప్రకటించారు. తరువాత ప్రభుత్వమే దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. ఉదయం సచివాలయ సర్వీసెస్ సెక్రటరీ చర్చల కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు స్వామిగౌడ్‌కు, శ్రీనివాస్‌గౌడ్‌కు, దేవీవూపసాద్‌కు, విఠల్‌కు, సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు నరేందర్‌రావుకు ఆహ్వానం పంపారు. మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి చేరుకున్న నాయకులు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపారు.

పలు అంశాలపై అంగీకారం కుదరకపోవడంతో మధ్యలో కొద్దిసేపు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీ చర్చించారు. అనంతరం మరోసారి మంత్రివర్గ ఉప సంఘంతో చర్చలు జరిపిన ఉద్యోగసంఘాల నాయకులు ఉన్నతాధికారుల వైఖరి పట్ల అసహనానికి లోనయ్యారు. చర్చలు ఒకానొక దశలో విఫలమవుతున్నట్లుగానే సంకేతాలందాయి. మధ్యలో మళ్లీ ఉపముఖ్యమంవూతితో సీఎస్ చర్చించిన తరువాత ఉద్యోగుల 10 డిమాండ్లపై ప్రత్యేకంగా డ్రాఫ్ట్‌ను రూపొందించారు. ఈ డ్రాఫ్ట్‌పై ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు, ఉన్నతాధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. మొత్తానికి డ్రాఫ్ట్ రూపొందించకముందు ఒకసారి ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. డ్రాఫ్ట్‌కు ఓకే అంటేనే చర్చలు అని డిమాండ్ పెట్టడంతో అధికారులు అంగీకరించారు. అనంతరం మంత్రివర్గ ఉప సంఘంతో చర్చలు ముగిశాక సీఎం క్యాంప్ కార్యాలయం వేదికయింది. అక్కడ మంత్రివర్గ ఉప సంఘ సభ్యులైన దామోదర రాజనర్సింహతోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరాడ్డి, కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ హాజరయ్యారు.

అక్కడకు చేరుకున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సీఎంతో చర్చలు జరిపారు. దాదాపు గంటలకు పైగా సాగిన చర్చలో సీఎం అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించడంతో అక్కడే డ్రాఫ్ట్‌పై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సంతకాలు చేశారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరిన జేఏసీ ప్రతినిధులు పొలిటికల్ జేఏసీ కార్యాలయానికి చేరుకుని అక్కడ సమ్మె వాయిదా ప్రకటన చేశారు.

కక్షసాధింపు ఉండదు : ఆనం
సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై ఎలాంటి కక్ష సాధింపు ఉండబోదని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణడ్డి చెప్పారు. సీఎంతో చర్చలు ముగిశాక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతిపాదించిన డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రధానంగా ఎవరైనా ఉద్యోగులు పర్సనల్‌గా ఏదైనా కేసులో అరెస్టు అయితే వారిపై కేసుల ఆధారంగా విచారణ చేస్తామని, ఆందోళనలో పాల్గొనకున్నా కేసులు నమోదైనవారిపై కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.

అదే సమయంలో ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పటికే ఉద్యోగులు బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోలేదని, రాబోయే పండుగలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఉద్యోగులకు ఉండే సగంరోజు సెలవుల్లో సమ్మె కాలాన్ని మినహాయించుకుంటామని తెలిపారు. సీఎం సమక్షంలో ఉద్యోగ సంఘాల ఛైర్మన్ స్వామిగౌడ్ సమ్మె విరమణ పత్రాలపై సంతకాలు చేశారని చెప్పారు. మంగళవారం నుంచి అందరూ విధులకు హాజరవుతారని, విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి మొదలైందని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చొరవతోనే ఉద్యోగులు సమ్మె విరమించారని కార్మికశాఖ మంత్రి దానం మీడియాతో చెప్పారు. డిమాండ్లను పరిష్కరించే విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.



Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC

Read more...

Monday, October 24, 2011

టీఉద్యోగసంఘాల చర్చలు సఫలం

హైదరాబాద్: ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు చేపట్టిన చర్యలు సఫలమయ్యాయి. ఉద్యోగులు పెట్టిన డిమాండ్లలో తొమ్మిదింటిని ప్రభుత్వం అంగీకరించింది.

డిమాండ్ల అంగీకారం, సమ్మె విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. 42 రోజుల సమ్మెకాలానికి మొత్తం జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.

రేపటినుంచి ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు.

177 జీవో నిలిపివేతకు ప్రభుత్వం అంగీకరించింది. జీవో ఎత్తివేతపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. సమ్మెకాలాన్ని ఆన్‌డ్యూటీగా ప్రకటించింది. ఉద్యోగులపై కేసులు ఎత్తేసేందుకు అంగీకరించింది.

స్వామిగౌడ్‌పై జరిగిన దాడిపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చింది.
సమ్మె కాలంలో తొలగించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామన్నారు.



Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha TEJAC,
T activists

Read more...

Bangkok - Dubai Emirates flight makes emergency landing in Hyderabad


 


An Emirates A380 from Bangkok, bound for Dubai, made an emergency landing at the Rajiv Gandhi International Airport (RGIA) in Hyderabad after the pilots detected a technical snag early on Sunday. 

The Emirates aircraft EK385, with 481 passengers on board, touched down at 03:45 hrs. A full contingent of fire tenders, ambulances and support staff was on standby to provide emergency assistance. 

The aircraft, which was flying over central India, was diverted and permitted to land in RGIA. The Airport Rescue Fire Fighters (RFF) upgraded themselves rom CAT-9 to CAT-10 category to ensure safe landing of the aircraft. 

The aircraft has been towed to the parking bay and passengers have been sent to Dubai on alternative aircraft. While 80 passengers boarded a Hyderabad – Dubai Emirages flight (EK527), another special flight was operated by Emirates later in the day.

A few more will fly on Sunday evening to their destination.
The RGIA is capable to handle Code-F aircraft movements. 

Interestingly, today's incident is the third time an Airbus A-380s touched down on the Shamshabad tarmac. The first was a ferry flight in October 2008. In June 2011, a Sydney - Dubai commercial aircraft (EK-413) landed because of a medical emergency.


Take By: Thehindu


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, Emergency landing, Emirates emergency landing, A380


Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP