Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, October 17, 2011

గ్రూప్<ప్లా>ప్-2 - GROUP-II

సంగాడ్డి, అక్టోబర్ 16, : తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు రెండో రోజు అభ్యర్థుల హాజరు శాతం మరింత తగ్గింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-2, మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-3 పరీక్షలు కొనసాగాయి. పేపర్-2లో పాలిటీ, హిస్టరీ, పేపర్-3 ఎకనామి సబెక్టుకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 6,600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, నెట్ ద్వారా 3,772 మంది హాల్ టిక్కెట్లను పొందారు.

వీరిలో పేపర్-2 పరీక్షకు 2,560 మంది హాజరు కాగా, పేపర్-3 పరీక్షకు 2,547 మంది మాత్రమే హాజరవ్వడంతో 38.78 హాజరు శాతం నమోదైంది. సమైక్య పాలనలో తెలంగాణవాదులకు న్యాయం జరగదని వాదిస్తూ ఇక్కడి ప్రాంత అభ్యర్థులు 61.22 శాతం మంది ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరు కాలేదు.

కాగా, జిల్లా యంత్రాంగం మాత్రం 3,772 మంది అభ్యర్థులు రెండు, మూడో పేపర్లలకు 2,560 మంది హాజరయ్యారంటూ 67.8 హాజరు శాతం చూపించడం గమనార్హం. అయితే పరీక్ష అనంతరం అక్కడక్కడ కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు జై..తెలంగాణ నినాదాలు చేశారు. పరీక్షలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి చూపించేందుకే పరీక్షలు రాయలేదని కొంతమంది అభ్యర్థులు చెపారు.

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
గ్రూప్-2 పరీక్షల సందర్భంగా ఆదివారం కలెక్టర్ సురేశ్‌కుమార్ సంగాడ్డిలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మహిళ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాలికల, బాలుర ఉన్నత పాఠశాలు, తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ పరీక్షలను సజావుగా కొనసాగించేందుకు సహాకరించిన సిబ్బంది, పోలీసు, పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఉన్నారు.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, 

Read more...

దళితునిపై దానం దాదాగిరి.

- తెలంగాణవాదులపై రెచ్చిపోయిన మంత్రి
- నిరసన తెలిపినందుకు లాఠీతో వీరంగం...
- తెగబడ్డ మంత్రి అనుచరగణం
- దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు
- బూతుపురాణం వల్లించి.. స్కూటర్‌ను తన్ని..
- అక్కసు వెళ్లగక్కిన కార్మికమంత్రి దానం నాగేందర్
- టీఆర్‌ఎస్ నాయకుడిపై మూకుమ్మడి దాడి
- దానంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

danamF-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

పికెట్(హైదరాబాద్), అక్టోబర్ 16 :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఆదివారం రౌడీ అవతారమెత్తారు. తన అనుచరులతో కలిసి తెలంగాణవాదులపై దాడికి తెగబడ్డారు. పోలీసుల చేతుల్లో నుంచి లాఠీని లాక్కొని వీరంగం సృష్టించారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. అంతటితో ఆగకుండా స్కూటర్‌పై అక్కసును వెళ్లగక్కారు. కసి తీరా ఆ వాహనాన్ని తన్ని బూతు పురాణం వల్లించారు. దళిత యువకుడు, టీఆర్‌ఎస్ నాయకుడు శ్రవణ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నా వదలలేదు. ‘ఒరేయ్ నీ అ..’ అంటూ దుర్భాషలాడారు. అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూశారు. మంత్రి గూండాయిజానికి భీతిల్లిన జనం పరుగులు తీశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాజీనామా చేయాలని నిరసన తెలిపినందుకే మంత్రి ఇలా దాదాగిరి చేసి ఈస్ట్‌మాడ్‌పల్లిలో రెచ్చిపోయారు. మంత్రి దానం నాగేందర్ ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఈస్ట్ మారేడుపల్లిలో స్టార్ హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించేందుకు బయలుదేరారు.

8795-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఆయన రాకను తెలుసుకున్న కొందరు తెలంగాణవాదులు స్థానిక దేనాబ్యాంకు వద్ద వేచి ఉన్నారు. మంత్రి కాన్వాయ్ రాగానే అడ్డుకున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు మంత్రి కాన్వాయ్‌పైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. అంతే.. మంత్రి గారికి కోపం వచ్చింది. ఆయన అనుచరులకు మరింత కోపం వచ్చింది. వారు మూకుమ్మడిగా తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ నగర అధ్యక్షుడు వీర వల్లబ్ తదితరులు అక్కడే ఉన్న స్కూటర్‌ను బండరాళ్లతో ధ్వంసం చేశారు. వారికి తోడుగా మంత్రి దానం నాగేందర్ ఆ వాహనాన్ని కాలుతో తంతు కసితీర్చుకున్నారు. మంత్రి, ఆయన అనుచరులు సృష్టించిన బీభత్సానికి జనం పరుగులు తీశారు. టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహ యాదవ్, శ్రవణ్ అలియాస్ శేర్విన్‌లు కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. వారిపై కూడా మంత్రి అనుచరులు తెగబడ్డారు.

Kedi-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

దీంతో నర్సింహ యాదవ్ తప్పించుకొని వెళ్లగా దళిత యువకుడు, టీఆర్‌ఎస్ నేత శ్రవణ్ మాత్రం దొరికిపోయారు. శ్రవణ్‌పై మంత్రి, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. అంతటితో ఆగని మంత్రి అక్కడే ఉన్న పోలీసుల చేతిలో నుంచి లాఠీని లాక్కొని తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. దాడిలో గాయపడ్డ శ్రవణ్ భయంతో పరుగులు తీసి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నారు. అయినా మంత్రి వదలలేదు. ‘ఒరేయ్.. నీ అ..’ అంటూ బూతులు అందుకున్నారు. మళ్లీ దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చేతులుడిగి చూశారు. దాడిని ఆపలేకపోయారు. ‘నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. లేకుంటే నిన్ను సస్పెండ్ చేయిస్తా’నంటూ తుకారాంగేట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కిరణ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన హెల్త్ కేర్ సెంటర్‌ను ప్రారంభించి తిరిగి బయటకు వచ్చారు.

మంత్రి తీరుపై తెలంగాణవాదులు మండిపడ్డారు. ఆయను అడ్డుకొని నిరసన తెలిపారు. ‘మంత్రి స్థానంలో ఉండి మాపై దా చేస్తావా’ అంటూ మహిళలు, యువకులు నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి తుకారంగేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రౌడిషీటర్‌తో మంత్రి హల్‌చల్!
అడ్డగుట్టకు చెందిన డి.మోహన్‌పై గత బోనాల పండుగ సందర్భంగా కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. కాగా ఆదివారం రాష్ట్ర కార్మిక మంత్రి దానం నాగేందర్‌తో కలిసి తెలంగాణవాదులపై మోహన్ దాడికి దిగాడు. శ్రవణ్‌పై దాడికి పాల్పడిన మంత్రి దానంపై తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, 

Read more...

కాంగ్రెస్ ధోకా?

- ఘోషిస్తున్న తాజా పరిణామాలు
- సొంత పార్టీ నేతల ఆరోపణలతోబలపడుతున్న వాదనలు
- మళ్ళీ అదే తీరు...నేతలవి అవే మోసాలు!
- ఢిల్లీని ఒప్పించడంలో టీ నేతలు విఫలం
- వెల్లు విమర్శలు
- పరిస్థితి ఇలాగే కొనసాగితే..
-తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ?
 

హైదరాబాద్, అక్టోబర్ 16 :తెలంగాణపై మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. మంత్రులే తెలంగాణకు అసలు ద్రోహులు... ఇది మాజీ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి చేసిన ఆరోపణ! తెలంగాణ ప్రాంత నేత ఒకరికి అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి ఎర చూపుతున్నది. టీ ఉద్యమంలో మంత్రులు శకుని పాత్ర పోషిస్తున్నారు... ఇవి ఎమ్మెల్సీ కే యాదవడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు! కిరణ్‌కుమార్ సీల్డ్ కవర్ సీఎం. తెలంగాణ ఉద్యమాన్ని అణచేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేలు ఒకొక్కరికి కోటి చొప్పున సొమ్ము ముట్టింది...ఇది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎత్తిన తిరుగుబాటు ధ్వజం! ఇవి మచ్చుకు కొన్నే! కాంగ్రెస్‌లో

తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న నాయకులు, పార్టీ శ్రేణులు ఇంతకంటే ఘాటుగా స్పందించిన ఉదంతాలూ ఉన్నాయి. వీటన్నింటి సారాంశం ఒక్కటే! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మోసం చేస్తున్నది కాంగ్రెస్సే! అటు హస్తినలో, ఇటు రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ పెద్దలు కలిసి చేస్తున్న కుట్ర!

Janaredd-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ తన మోసాలకు మళ్ళీ తెలంగాణ ప్రాంత నేతలను పావులుగా వాడుకోజూస్తున్నట్లు టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహార శైలితో తేటతెల్లవుతున్నది. ఒక వైపు ఉద్యమంలో ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు ఉద్యమానికి తూట్లు పొడిచే రీతిలో వ్యవహరిస్తున్నారనడానికి వారి తాజా వ్యాఖ్యలే నిదర్శనమన్న విమర్శలు వెల్లు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తి కిరణ్ సర్కార్ పడిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఉద్యమం అంతిమ దశకు చేరుకున్న తరుణంలో పదవులు, ప్రలోభాల వలను టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై విసిరి, ఉద్యమం బలహీనపడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఢిల్లీ వెళ్ళిన వచ్చిన తరువాత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధిష్ఠానం వ్యూహాలతో తెలంగాణ ఉద్యమానికి చెక్ పెట్టేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు, అందులో భాగంగానే టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హైకమాండ్ జాదూను ప్రయోగిస్తూ వారు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేలా తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి, ఇప్పటి ఉద్యమానికి తేడా ఉన్నప్పటికీ అప్పుడు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడూ అలాంటి ఫార్ములాతోనే కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు వెళుతున్నదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. పదవులు, ప్రలోభాలతో టీ కాంగ్రెస్ నేతలను దారికి తెచ్చుకుని టీ ఉద్యమంపై నీళ్ళు చల్లేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిన్నటి వరకు టీ ఉద్యమంలో జోరుగా ముందుకు కదిలిన టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంగా చల్లబడిపోవడం, ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రకటన చేస్తుండడం, టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయాలతో విభేదించడం, సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తుండడం వంటివి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాల్లో భాగమేనని వినిపిస్తోంది.

తెలంగాణపై మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని, మంత్రులే తెలంగాణకు అసలు ద్రోహులని మాజీ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి చేసిన ఆరోపణలు, తెలంగాణ ప్రాంత నేత ఒకరికి అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి ఎర చూపుతున్నదని, టీ ఉద్యమంలో ఆ ప్రాంత మంత్రులు శకుని పాత్ర పోషిస్తున్నారంటూ ఎమ్మెల్యే కే యాదవడ్డి సంధించిన ఆరోపణలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసాల తీరు బయటపడుతున్నదని టీ వాదులు మండిపడుతున్నారు. టీ ఉద్యమం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే రైల్‌రోకో సందర్భంగా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారని, సీఎం కిరణ్ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చుతున్నారని ధ్వజమెత్తిన తీరు చూస్తుంటే తెలంగాణపై కాంగ్రెస్ తీరు ఏమిటో స్పష్టమవుతోందని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఎవవరు మోసం చేశారో ఇప్పటికీ వారు తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోయారు. ఇప్పుడు అలాంటి మోసాలు చేసే నేతలు చరివూతలో ద్రోహుల స్థానంలోనే ఉంటారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు.

ఐక్యంగా ముందుకు సాగిన రోజుల్లో సైతం టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ విషయంలో పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో సఫలం కాలేదు. మరో వైపు పార్టీ అధిష్ఠానం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఈ ప్రాంత నేతల మాటకు విలువ ఇచ్చే ప్రయత్నాలు చేయలేదనేది పార్టీ వైఖరి చూస్తుం స్పష్టమవుతోందని తెలంగాణవాదులంటున్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ఉద్యమంలో దూసుకుపోతూ ఆందోళన బాట పట్టినప్పటికీ ఈ ప్రాంత జనం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. వారి దృష్టిలో తెలంగాణ ద్రోి , తెలంగాణకు మోసం చేస్తున్నది కాంగ్రెస్సేననే భావం బలంగా పాతుకుపోయిందంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని చక్కదిద్దుకోక పోయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లోనే పార్టీని నడిపించినా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు లేక పోలేదని టీ వాదులంటున్నారు.


Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, 

Read more...

రభుత్వ నిర్బంధకాండకు నిరసనగా నేడు బంద్

- నేడు రైల్‌రోకో ఉండదు.. దాని స్థానంలో బంద్ పిలుపు
- త్వరలో చలో హైదరాబాద్.. జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడి
-నేతలను నిర్బంధించినా.. పోటెత్తిన జన ప్రవాహం
- రెండో రోజు రైల్‌రోకో దిగ్విజయం
- పది జిల్లాల్లో ఉద్యమ కూత
- పోలీసులే ప్యాసింజర్లుగాతెలంగాణ ఎక్స్‌వూపెస్
- ప్రయాణికులు 13 మందే.. మిగతా రైళ్లోనూ అదే తీరు
- ఆగని నిర్బంధం..715 మంది అరెస్ట్

- పొన్నం, జీవన్‌డ్డి, రాజయ్య, హరీశ్‌లకు జ్యుడీషియల్ రిమాండ్ విధింపు
n వివేక్, విజయశాంతి, కేటీఆర్, కవితకు బెయిల్

KNRR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅదే పోరు చైతన్యం! అదే ఉద్యమ హోరు! ఇది అచ్చమైన ప్రజా ఉద్యమం! ఉద్యమ నేతలందరినీ జైళ్లలో పెట్టినా.. అక్రమంగా నిర్బంధించినా.. జనమే నాయకత్వం వహించి రైల్‌రోకో రెండోరోజు ఆందోళన కార్యక్షికమాన్ని దిగ్విజయం చేసిన పోరాట స్ఫూర్తి! రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజా ప్రతినిధులను ద్రోహులుగా మార్చేసి కుట్రపూరితంగా కేసులు బనాయించినా.. మొక్కవోని తెగువను ప్రదర్శించింది తెలంగాణ ఉద్యమం! రాష్ట్ర సర్కారు వణికిపోయేలా.. హస్తిన పీఠం కలవరపడేలా.. ద్రోహులకు దిమ్మతిరిగేలా.. పది జిల్లాల్లోనూ పట్టాలపై ఉద్యమం కూతవేసింది. అదే సమయంలో నిర్బంధకాండకు వ్యతిరేకంగా సోమవారంనాడు తెలంగాణ బంద్‌కు సిద్ధమైంది.

రైల్‌రోకో రెండో రోజూ విజయవంతమైందని ప్రకటించిన రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం.. బంద్‌ను కూడా అదే ఉద్యమ స్పూర్తితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగానే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కోదండరాం చెప్పారు. మూడో రోజు రైల్ రోకో స్థానంలో ఈ పిలుపునిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మార్చ్ పేరుతో త్వరలో చలో హైదరాబాద్ కార్యక్షికమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Strike-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaరెండోరోజు రైల్‌రోకోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టాలపైకి వచ్చారు. అక్కడే వంటావార్పు చేసి, దుమ్మురేగేలా ధూంధాం నిర్వహించారు. తన నిర్బంధకాండను కొనసాగించిన సీమాంధ్ర సర్కారు... పెద్ద సంఖ్యలో అరెస్టులకు పాల్పడింది. తెలంగాణలో తెలంగాణ ఎక్స్‌వూపెస్‌నే నడిపించేశామని గొప్పలు చెప్పుకోబోయి అభాసుపాలైంది. తెలంగాణ ఎక్స్‌వూపెస్ పోలీసులే ప్రయాణికులవ్వగా సికింవూదాబాద్ నుంచి కాజీపేట చేరుకుంది. ఇందులో కేవలం 13 మంది ప్రయాణికులే ఉండటం సర్కారును నవ్వులపాలు చేసింది. దీనితో పాటు పలు రైళ్లను నడిపినా.. వాటిలోనూ దాదాపు ఇదే దృశ్యం కనిపించింది. రెండో రోజు కూడా అనేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా రైల్‌రోకో రెండో రోజు ఉద్యమం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 715 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అనేక మందిని ముందస్తుగానే అరెస్టు చేశారు.

రెండోరోజు అరెస్టయినవారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే విద్యాసాగర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. బందోబస్తు మద్య 50 ప్యాసింజర్ రైళ్లు, 43 దూర ప్రాంత రైళ్లు నడిచినట్లు అదనపు డీజీపీ (రైల్వేస్) వీస్‌కే కౌముది చెప్పారు. దాదాపు రైళ్లన్నీ ప్రయాణికులు లేకుండానే నడవడంతో రైల్వే స్టేషన్‌లు బోసిపోయి కనిపించాయి. తొలి రోజు రైల్‌రోకో సందర్భంగా అరెస్టయిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యమకారులను జ్యుడీషియల్ కస్టడీకి పంపగా.. కొందరికి బెయిల్ మంజూరైంది. కరీంగనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్‌డ్డి, వరంగల్ ఎంపీ ఎస్ రాజయ్య, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. మెదక్ ఎంపీ విజయశాంతికి బెయిల్ మంజూరు చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ వివేక్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులకు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, 

Read more...

Sunday, October 16, 2011

Cartoons

 


Take By: T News


Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP