Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, March 11, 2011

More than 1 lakh arrested ahead of Million March

In an attempt to foil the march and to prevent people from reaching Hyderabad, police in Telangana districts on Wednesday took a large number of activists into preventive custody. More then one lakh people were arrested across Telangana, including 11,000 in the Hyderabad city.

The Governemt is doing every thing possible to prevent the march. Barricades have been put up in nine districts and on the outskirts of Hyderabad to prevent activists joining the protest. Police in Nizamabad, Warangal, Adilabad, Karimnagar, Medak and other districts have arrested scores of TJAC activists heading to Hyderabad to participate in the march.

On a petition by the organisers, the state human rights commission Wednesday directed police not to violate human rights while taking steps to foil the march.

Telanganites will take out two rallies one each from the Jubilee Bus Station and Sundarayya Vignana Kendra to Tank Bund.

The protesters will stage a sit-in for three hours from 1 pm to draw the attention of the central government to their demand.

TJAC chairman M. Kodandaram has condemned large-scale arrests in the Telangana districts.

“People can protest in Egypt and Tunisia but not in Hyderabad,” he asked.

Andhra Pradesh High Court on Tuesday declined to pass any orders to stop the march.

Telangana leaders of the ruling Congress party and main opposition Telugu Desam Party (TDP) are backing the march. Gaddar, students’ groups and lawyers’ organisations have also announced support. A group of TDP legislators also met Chief Minister N Kiran Kumar Reddy, urging him to ask police not to carry out arrests or suppress the peaceful protest.

Read more...

సత్తా చూపిన తెలంగాణా మార్చ్!

వాడెవడు వీడెవడు తెలంగాణకు అడ్దేవడు! తెలంగాణాని ఆపే దమ్ము ఎవడికుంది? బరికేడ్లకా , పోలిసులకా , దిమాక్ లేని కిరణ్ కుమర్లకా , అరవిర భయంకరుడు, రక్త పిపాసి అని చెప్పబడే అరవిన్దరవుకా, చంచ గిరి చేసే, దగుల్బాజీ సీమాంద్ర నాయకులకా..తెలంగాణా పేరు చెప్పుకుని పబ్బం గడిపే సత్తా లేని మన నాయకులక.

.అట్లాంటి అపోహలన్నిటికి ఇవాళ తెర తీసి నట్టయింది..ఏమనుకున్టున్రు తెలంగానోల్లంటే..దటిస్ తెలంగాణా! నేను లేకపోతె తెలంగాణాల ఉద్యమం నడువది అనుకున్న పెద్ద పెద్దోల్లందరికి లాగి చెంప మీద చెళ్ళున కొట్టినట్టయింది..రాజకీయ నాయకులకి దిక్కు దివాణం లేదన్న! నన్ను నమ్మున్ద్రి..ఇవాళ తెలంగాణా మార్చ్ చూడడం అంటే జీవితం లో ఎంత పెద్ద గొప్ప అనుభవమో చెప్పనికి ఒక్క మాట ఒస్తలే , ఏమి సంబూరాలు, సక్కని గుంపులు, డప్పులు, దరువులు..మైకులు లేకపాయే అని ఎం బాద లేదే, ఒక్కో గొంతు అందుకుందంటే ఇన సొంపైన పాటలు..

నిన్నటి నుంచి పొలీసుల ఓవర్ అక్స్యన్ చూస్తుంటే ఒకటే గుబులు, ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు , అర్రేస్తులు, దాదాపు అన్ని యునివర్సిటీ విద్యార్థులు , విద్యార్థి నాయకులు అర్రెస్ట్ అయినరు, ఉద్యమ కారులు అనుకున్నోల్లు దొంగల లెక్క దాసుకుని దాసుకుని వస్తున్నారు..నిన్నటినుంచి దాదాపు కర్ఫ్యూ వాతావరణం..ఎవడికి ఇబ్బంది పెట్టకుడదని అనుమతి ఇవ్వలేదని ముక్య మంత్రి గారు చెప్పడం చూస్తె చాన జాలేసింది..వీడు మంత్రి ఎట్లా అయిందో దయ చేసి ఎవరికన్నా అర్థం అయితే జర చెప్పుండ్రి..

ఎక్కడ లేని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి పట్నం ల ఒక్కడిని సక్కగా తిరగ నీయలే..రాత్రి అంత సరిగ్గా నిద్రనే లేదు, పొద్దున్న లేవగానే అన్ని ఊర్ల కెంచి ఫోన్లు, ఏడ కలుసుకుందాం అని..తోచిన కాడ కలుసుకున్డంలె అనుకున్నాం, డిపి రెడ్డి గారికి ఫోన్ చేసిన..అందరం ఆడనే కలుద్దమనుకున్న గాని, మధ్యలో ఆగి ఇంకొద్ది మంది మిత్రులని చూసి పోదామని హిమాయత్ నగర్ ల ఉన్నా , జమున పుష్కర్ కూడ వచ్చిందని తెలుసుకొని మాట్లాడిన, విమల, దేవకీ దేవి వాలు జర ఆటు పోయిన్రు, గమ్మతి ఏందంటే ఎవరికీ తెలవదు ఏడికి పోవాలనో, ఎట్లా పోవాలనో, మొత్తానికి అందరం అర్రేస్ట్లకు సిద్దమయే బయలు దేరినాము, నా కైతే నిన్నటి నుంచే ఇంటెలి జేంస్ వాడు తలకాయ తిన్తనే ఉన్నాడు, నువ్వు ఏడికి పోతున్నవ్, ఎంత మందిని తీస్క పోతున్నవ్..సంవత్సరం నుంచి అలవాటు అయింది కాబట్టి పెద్ద కష్టం కాలే వాడిని హండిల్ చేయడం..


..హిమాయత్ నగర్ రానికి ఒక్క కష్టాలు కావు, అన్ని చోట్ల పోలీసులు దార్లు మలుపుతున్నారు, చెప్పలేనంత బాద అయింది తమ్మి! నా హైదరాబాదుకు , నట్ట నడుమ ఉన్న నా ట్యాంక్ బండ్ కు రానికి ఇన్ని తిప్పలు , ఇన్ని బాధలని అని ఒక సారి దుక్ఖం ఒచ్చింది.. ఎక్కడి బతుకులు, ఏడికి వొచ్చినయి, వాని బొంద పెట్ట, ఇరాని చాయిలు పాయె, రోడ్డు మీద చాట్ బండిలు పాయె..సక్కని ఫుట్ పాత్ లు బోయి అమెరిక కంపనీలకు బజార్లన్నీ అమ్ముడు పాయె..ఒక్క షాపు చూడానికి కూడ మనసైత లేదు ఇయాల రేపు..ఎట్లనో మహేష్ కార్ల తీసుక పోత అన్నడు, నేను, భరత్, మహేష్ ఎన్నో గల్లిలు తిరిగి మొత్తానికి టాంక్ బండ్ చేరుకున్నాము.

చిన్న ఇరుకు ఇరుకు మెట్ల కెంచి ఒక్క సారి పైకి ఎక్కంగనే, ఒకటే సంతోషం ఎవరెస్ట్ ఎక్కినంత..హుస్సేన్ సాగర్ చల్ల గాలి పేయి కి తగలంగనే ఒక్కసారి ‘స్వేచ్చ’ గాలి చుట్టుకున్నట్టు అయింది, ఆంధ్రా కంపు వాసనలు, అరువు తెచ్చుకున్న మొహాలు, ప్రేమలు ఏవి కన పడ్త లేవు, సంకెళ్ళను తెంచు కున్న సంతోషం, గెలుపు మాదే అన్న ధీమా, చెవుల్లో మార్మోగుతున్న నినాదాలు..ఎవడబ్బా సొమ్మురా తెలంగాణా మాదిరా, కదిలిందిర తెలంగాణా , ఖబడ్ దార్ , ఖబడ్ దార్, ఔర్ ఎక్ ధక్కా , తెలంగాణా పక్కా…

గొంతులు చించుకుని అరుస్తున్నారు, స్వేచ్చా వాణి టాంక్ బండ్ అంతా మార్మోగుతున్నది, అది ఒక సెమినార్ కాదు, మీటింగ్ కాదు, ఒక నాయకుడు లేదు, ఎవరు ఏమైనా చేయొచ్చు, ఎక్కడికి అయిన పోవచ్చు.. అంతా నావోల్లె..అంత నా జాగనే..మొట్ట మొదటనే మా భూమి సంధ్యక్క గ్రూప్ కలిసింది, అక్క పాడుతుంటే అందరు డాన్స్ ఎసినం..సంధ్యక్క పాట గురించి చెప్పేదేముంది, రేపు చస్తా అనేతోడు కూడ లేచి డాన్స్ ఎస్తాడు..
మీ అందరి మీద ఒట్టేసి చెపుతున్నా , ఒక్క అన్ద్రోది మొకం కాన రాలే అంత మందిల..రేపు గిట్ల నా తెలంగాణాల అంద్రోలు లేకపోతె ఇంత బాగుంటదా ఏంది అనిపించింది.. తీరొక్క జెండాలు, పార్టీలు అక్కడక్కడ ఉన్నాయి,

లాయర్లు, విద్యార్థులు, సింగరేణి, టీచర్లు, వర్కర్లు..ఇకటి కాదు రెండు కాదు , చూడ నికి రెండు కండ్లు చాల్త లేవు..మరో వైపు మహిళ జాక్, జలజ పాట జోరుగా అందుకున్నది, మద్యల నేర్నాల కిషోర్, రామక్క బృందం బతుకమ్మ పాట పాడి మస్తు ఆడిపిన్చిన్రు..మస్తు ఎండల కూడ ఎవరు అలిసి పోతలే, దాదాపుగా అన్ని ఊర్ల నుంచి జనం వచ్చిన్రు, లొల్లి లొల్లి..నాకు తెలిసిన ప్రతి ఉద్యమ కార్య కర్త కనపడ్డారు..ఈ మద్యల అందరిని కలుసుడు అంటే తెలంగాణా మీటింగులే! ఇవే పెండ్లి పేరంటాలు..ముచ్చట్లు, వీర గాధలు ఒక్కొక్కరం ఎన్ని కష్టాలు పడి వచ్చినమో చెప్పుకొని మురిసి పోవుడు..ఇంతలనే రేవతి అక్క ఫోన్ చేసింది, ఏడికి రావాలే అని, చెప్పినం..తిరిగి తిరిగి ఎడినించి రానీయట్లేదని ఒక్కతె ఇంటికి పోయిందంట..

మస్తు బాద అయింది..రేవతి, ఒక ప్రొఫెస్సర్, తెలంగాణాల ఏదో ఒక పని చేస్తనే ఉంటది సైలెంట్ గా, రాస్తానే ఉంటది, మాట్లడతనే ఉంటది..ఇంత పెద్ద ఎత్తున మంది కదిలోస్తే చూడానికి దార్లు బందు బెట్టిన్రు, అట్లా ఎంత మంది ఎనక్కి పోయిన్రో బిడ్డలు, ఎంత చిన్న బుచ్చుకున్నారో, ..ఎవడబ్బ సొమ్మురా ఈ హైదరాబాద్? మా ఇంట్లకొచ్చి, మా హైదరాబాద్ చుట్టు ముళ్ళ కంచెలు కడతార..ఖబడ్ దార్ ఒక్కొక్కడికి గోరీలు కట్టే రోజులోచ్చిని..మంచిగా పొతే మంచిది, లేకపోతె ఎట్లా తోలాల్నో మావోల్లకి బాగా తెలుసు..


తెల్లని పాల పిట్ట ఓలే గద్దరన్న తెల్ల లాల్చి ఏసుకొని ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ అని అందరితోని పాడిపిస్తుండు, అయన చుట్టూ జనం మస్తుగున్నారు, ప్రతిజ్ఞ చేసింరు, ఒక్క మీడియా కూడా రాలే నాకు తెలిసి..అవును అయన పాడిపించి, ఆడిపించి, తెలంగాణాని రగిలిన్చోడే కాని మాటలు నేర్చిన రాజ కీయ నాయకుడు కాదు కదా..అయినా టీవి ని లెక్ఖ బెట్టినోడేవడు.

ఎవ్వని ఖుషి వానిదే, ఆడోల్లు ఒక తాన ఆడుతానే ఉన్నారు, ఎవరికీ వారు పాడతనే ఉన్నారు. ఇంతలో కాంగ్రెస్ నాయకులకి బుద్ది చెప్పి పంపింరని, ఇంకింత సంబురం..కష్ట పడి ఓట్లేసి, నాయకులను చేసి గెలిపిస్తే..కనీసం ఒక్క పర్మిషన్ కూడ ఇప్పించ లేరు, పరీక్ష వాయిదా వేయించ లేరు, డిజిపి తో మాట్లాడ లేరు..ఇంక సోనియా దాక ఎందుకులే ముచ్చట.. ఇంతకి వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి..అయినా అందరి నాయకులకి ఇదే గతి పడతాడని భయపడ్డాం , కాని ఎం కాలే..

దొంగలు బద్దంక పోలిసోల్లు ఒచ్చినట్టు మా నాయకులు లెట్ ఎంట్రి ఇచ్చింరు, ఎప్పటి లేక్ఖనే జర మంది కూదిన్రు, కాని అప్పటికే అందరికి తెలిసి పోయింది, ఇంక ఎక్కువ రోజులు నాటకాలు ఆడవని! ఇంకో వైపు చూస్తె హరీష్ రావు , ఇటల బోట్ల వస్తున్నారని విని మస్త మజా వచ్చింది, నయం ఇంక పైనుంచి రాలేదు, అయిన ఎక్కడి కష్టాలు మా నాయకులకి, ఎంత చెప్పిన తక్కువే వాళ్ళ గురించి..నవ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం ఆన్ థెం, ఇది ఏ రాజ కీయ పార్టీ కష్టమూ కాదు..కేవలం ప్రజా విజయం, పార్టీలు స్వార్థ పూరిత ఆలోచనలతో వెనక అడుగేస్తే , మేమున్నాం అనుకుంటూ ముందడుగు వేసేది ఎపుడు ప్రజలే..
అంత అయిపొయింది అనకుంటే కొంత మంది విగ్రహాలు ద్వంసం చేస్తున్నారని వార్త, కడుపు మండుతుంటే ఎం చేస్తారు, అయినా ఇది కూడా సీమ ఆంద్ర ప్రభుత్వం ఆడి పిస్తున నాటకం ఎందుకు కాకూడదు? అవును, నాలుగు విగ్రహాలు ద్వంసం అయితే అన్ద్రోల్లు గాంధి తాతకి పాలు అభిషేకం చేస్తున్నారు, కొవ్వొత్తుల ప్రదర్శన అంతా, టీవిలకి ఇంక పండగా, ఒక్క విగ్రహం పొతే ఇంత బాద పడితే , మా భాష, యాస, బతుకులు పోయినందుకు మేము ఎన్ని పాల సముద్రాలు అప్పు తెచ్చుకోవాలె? ఒక టీవి వాడు “మార్చిచ్చు” అంటడు, ఇంకోడు “రణ మార్చ్” అంటడు,

మరోడు “ఉద్యమమా ;విద్వంసమ” , “డెమ లిష్ మార్చ్ ” అన్ని చానళ్లల్ల చర్చలే చర్చలు..పొద్దున్నుంచి ప్రజలు ఎంత కష్టపడి తమ ఇంట్లకి తాము వచ్చి పోలిసోల్లని ఏడ బెట్టాల్నో ఆడ పెడితే, ఒక్కడు వేయడు, ఊర్ల కి పోతున్న వాళ్ళని అర్రేస్ట్లు చేసి చిత్ర హింసలు పెడితే పట్టించు కోరు, తెలంగాణా అంటే మావో ఇష్టులు అని పర్యాయ పదాలు వెతుక్కొంటే ఎట్లా, నేను ఎప్పుడో చెప్పిన, ప్రశ్నించే వాడే, అన్యాయాన్ని ఎదిరించే వాడే నక్ష లైట్ అయితే మేము నాలుగు కోట్ల మందిమి నక్ష లైట్లే..అసాంఘిక శక్తులు ఉన్నాయి అంటడు మా డిజిపి..మా భూములు గుంజుకొని, ఉద్యోగాలు గుంజుకొని, మమ్మల్ని దూర దేశాలకు పనికి పోయేటట్టు చేసిన మీరా , మేమా అసాంఘిక శక్తులు ?

అమ్మ , అయ్యలకి దూరమై, అంద మైన నా షహర్ , శౌహర్ కి దూరమయి బతుకుతున్నాం, మీరు దొంగలా మేమా? మా నాయకుల బొమ్మలు పెట్టలేదని బాద ఎక్కువైంది , ఏమ్చేస్తారు అన్న? కెమెరాలు పోయినాయ్ ఒకే, ఉంటె కూడ ఎం లాభం చెప్పు, ఒక్కటన్నా మా ఉద్యమం సక్కగుందని ఏసే తోల్లా ? అయినా మీరు ఏది ఎయాలనుకున్నారో అదే ఎసిన్రు, మా వోల్లాని బోను లో నిలబెట్టి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్రు..ఒక వేల ఇది మా వొల్లె చేసుంటే, ఇదే ఈ ఆంధ్రా మీడియా కి గుణ పాఠం..

ఎవడు ఏమి కూసినా, ఈ గడ్డ మాది, అన్ని అదికారాలు మావి, తెలంగాణా రోజు రోజు కి ముందుకి పోతున్నది, అడ్డం వస్తే మరి ఎం చేస్తాడో ఇవ్వాల చూడనే చూసిన్రు.సోనియమ్మ కళ్ళు తెరిచి నపుడే తెలంగాణా ఇచ్చేతట్టయితే మాకు ఏ రాజ కీయ పార్టీలు అవసరం లేదు, రోజు కో పానం పోతుందీ మా పిలగాల్లది, ఎం చేస్తావ్ కాపాడానికి? మీరందరినీ హంతకులుగా నిల బెడతాము..మీరు సక్కగా ఉంటె మాకు ఈ గతి ఎందుకు పడతది?

ప్రజలు ఒక్కటిగా ఉన్నారు, కొందరు నాయకులు ఉన్నారేమో అని అపోహలు పడుతున్నారు, అంత లేదు..నిస్వార్థం గా ప్రజలు ముందుకొచ్చి పోరాడుతున్నారు.. కుల మతాలకి అతీతంగా, అందరిని కలుపుకుందాం, రాజ కీయ పార్టీలను పక్కన పెడదాం, ప్రజా పోరాటాలని నిర్మిద్దాం.. కేంద్రం ఇయాల కదుల్తడి, నేషనల్ మీడియా వచ్చింది కదా..ఇంక ఎవడి రాజ కీయ ఎత్తుగడలు ఇపుడు అవసరం లేదు..ఆరంభ శూరత్వం! ఏమి లేదు..

“భయాన్ని జయిస్తే అతి ప్రమాద కరమైన శత్రువుని జయించి నట్లే” అని ఎవరో అన్నాట్లు, మేం జయిన్చాం, మాకు పోలిసులంటే భయం లేదు, రాజ కీయ నాయకులు అంటే ప్రేమ లేదు, మా ప్రాణాల్ని ఫణం గా పెట్ట కుండా, నువ్వు కూడ తెలంగాణా తెచ్చే టందుకు లాడాయికి సిద్దం కా తమ్ముడు..

ప్రాణం ఖరీదు చెప్ప గలరా? ఎస్, ఒక ప్రాణం ఖరీదు తెలంగాణా! ఒక ప్రాణం ఖరీదు ఒక రాజ కీయ నాయకుడి హత్య/బహిష్కరణ, కొత్త తరం కోసం అన్వేషణ..లేకపోతె పైన ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు మనల్ని క్షమించారు..

జోర్ సే బోలో , ప్యార్ సే బోలో జై తెలంగాణా!
డిల్లి మే బోలో గల్లి మే బోలో జై తెలంగాణా! 


Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs, million march,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

Wednesday, March 9, 2011

Parliament says ‘No-Entry’ for visitors from Telangana!

The Indian Parliament is not just barring a discussion on Telangana unrest but is literally barring everyone from the region, except MPs, from entering parliament. There is an invisible ‘No-Entry’ for all Telanganites even if you carry an authentication letter from the Chairman of the Lok Sabha House Committee (no less!), as were we.


After the SKC report so blatantly put in print the unconstitutional, irrational, biased arguments and the flawed details, many eminent people from the fields of constitution, law, economics, Irrigation, agriculture, public employment etc have filed in their critique on the report. I have in my personal capacity too, aired my opinion. TDF India took up the task of collating and publishing the core arguments in these critiques and thus came out with a book ‘Justice Srikrishna’s Injustice’. It is for the release of this book, I along with TDF India President D.P.Reddy, my friends Sujai and Dileep flew to New Delhi.


It is in this context we paid a visit to the Parliament to get into the visitors’ gallery. We were armed with a letter from the office of Chairman of the Lok Sabha House Committee and submitted that along with our ID cards for the mandatory check. However, the officer in the Parliament reception routed us to another officer once he came to know, from our ID cards, that we are from Hyderabad. The second officer dithered on one pretext or the other before he finally told he cannot let us in unless he gets to talk to the Chairman of House Committee himself. The chairman himself is a Lok Sabha MP and obviously he wasn’t in his office as the Parliament was in session. It was clearly a ploy to refuse entry for us. What surprised us was that Telangana MPs knew about this as they told us later in the day that no one from Telangana is allowed in as per Intelligence reports’ instructions. We were clearly told the IB suspects that Telanganites might jump from the visitors’ gallery onto the floor of Lok Sabha and disrupt the proceedings! So upon IB’s assessment, there is a blanket ban on Telanganites from entering the house.


So here is our system of governance that does not trust its own MPs! They issue the authentication letters and the officer at the Parliament reception rejects them! That reflects the state of things. Instead of a blanket ban, the MPs could have been just advised to issue the letters only if they are doubly sure the visitors would behave themselves. Instead, the Government found it easy to make the highest platform of democracy in India restricted for its own citizens. I am just wondering how many states/regions are blacklisted in this case. In addition to Kashmir, the whole of North East, anyone with a Muslim name, a Gorkha name, etc.


While this tamasha was on, the Lok Sabha was stalled for that day with 6 adjournments due to protesting TRS and Congress MPs. We could see on the TV monitor in the reception that KCR sat in the well of the house till the Lok Sabha was adjourned for next day. The Government was caught unawares by the protests that disrupted the day in the crucial budget session. It was especially embarrassed by its own Congress MPs sloganeering in the house ignoring the advice from their colleagues in Congress. Is that not enough of a lesson for the Congress Government? It better concentrate on the ‘attacks’ inside the house from its own party men rather than delude about ‘attacks’ from the visitors’ gallery. For, in days to come, these attacks within would get too close for comfort.

Thanks Amar for sharing

take By : simply telangana  

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

ఇక ‘అమ్మ’ దయ !

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులను ‘అమ్మ’ కరుణించింది. తెలంగాణ అంశంపై తాము స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వివరించేందుకు ఆమె అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న మంత్రులకు ఎట్టకేలకు ఈనెల 12న సోనియా దర్శనభాగ్యం లభించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పోర ాటాలు, ఉద్యోగుల సహాయ నిరాకరణ, మిలియన్‌ మార్చ్‌, టీఆర్‌ఎస్‌-టీడీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ వంటి అంశాలు తమను ఇబ్బందికి గురిచేస్తున్నాయని మంత్రులు సోనియా దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఆ మేరకు వారు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమవు తున్నారు.

ఇప్పటికే తమపై విపరీత మైన ఒత్తిళ్లు ఉన్నాయని, దానిని అధిగమించేందుకు ఇబ్బందులు పడవలసి వస్తోందని వారు సోనియాకు వివరించనున్నారు. ‘మేం మా కష్టాలు మేడమ్‌కు చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణకు అనుకూలంగా మేము కూడా ఏదో ఒకటి చేయక పోతే పార్టీ బతకదని స్పష్టం చేస్తాం. మేము ఉద్యమంలో వెనుకబడితే పార్టీ దెబ్బతింటుందని చెబుతాం. ఇక ఆమె దయ’ అని ఓ మంత్రి వ్యాఖ్యానిం చారు. ఇప్పటివరకూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్‌ కోసం చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారి పోయాయి. ఆమె వారిని కలవకుండా అహ్మద్‌పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీలతోనే మాట్లాడిస్తున్నారు. ఇటీవల సోనియాతో భేటీ కోసం నాలుగురోజులు ఢిల్లీలోనే మకాం వేసి, అమ్మ కరుణించక పోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరిగి రావలసి వచ్చింది.

అయితే, మంత్రులకు మాత్రం అలాంటి అవమానభారం లేకుండా స్వయంగా సోనియాగాంధీనే అపాయింట్‌మెంట్‌ ఖరారు చేయటంతో ఊపిరిపీల్చుకున్నారు. తమకు అపాయింట్‌మెంట్‌ దొరకడమే కష్టమని భావించామని, కానీ మేడమ్‌ కరుణించడం అదృష్టమంటున్నారు. ఇక అంతా అమ్మ దయేనని, ఆమె చెప్పిన దానిని చేయడమే తమ కర్తవ్యమం టున్నారు. ఇదిలాఉండగా, మంత్రుల పర్యటనలో గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన సబితా ఇంద్రారెడ్డి, దానం, ముఖేష్‌ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ మంత్రులకు చేసిన సూచనను వారంతా బేఖాతరు చేసినట్టయింది. కేవలం ఐదారుగురు మంత్రులు వెళితే సరిపోతుందని, ఆ మేరకు మీరు చొరవ తీసుకోవాలని జానారెడ్డిని కోరారు. అయితే, తామంతా సోనియాను కలవాల్సిందేనని, కొందరు మాత్రమే వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని మంత్రులు నిర్మొహమాటంగా చెప్పడంతో ఢిల్లీకి తెలంగాణ మంత్రులంతా వెళ్లడం ఖాయమయింది. తెలంగాణ అంశంలో సీఎం సూచనను పట్టించుకోవలసిన అవసరం లేదని పలువురు మంత్రులు స్పష్టం చేసినట్లు సమాచారం.

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

తెలంగాణ ఉద్యోగులకు చిదంబరం అపాయింట్‌మెంట్‌

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి కేంద్ర హోంమంత్రి చిదంబరం అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 11న చిదంబరంతో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ కానుంది.

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

Tuesday, March 8, 2011

సిద్దిపేటలో మిలీయన్‌ మార్చ్‌ చెక్‌పోస్టులు

సిద్దిపేట,మేజర్‌న్యూస్‌ః మిలియన్‌ మార్చ్‌ను వెళ్ళకుండా అడ్డుకునేందుకు గానూ పోలీసులు రాజీవ్‌ రహదారి పై చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజీవ్‌ ర హదారి గుండా వెళ్లే ప్రతి వాహానాన్ని తనిఖీ చేస్తూ ఎవరైనా మిలియన్‌మార్చ్‌కు వెళ్తున్నట్లు అనుమానం వస్తే పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మిలియన్‌మార్చ్‌కు వెళ్లకుండా ముందస్తుగానే అరెస్టు చేయనున్నట్లు డిఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. రాజీవ్‌ రహాదారి పై ప్రతి పది కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్టును ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్‌ రహదారి పై శనిగరం, పొన్నాల, కుకునూరుపల్లి, ప్రజ్ఞాపూర్‌, ఒంటిమామిడి, ముస్తాబాద్‌ రూట్లో రాఘవాపూర్‌,సిరిసిల్ల రోడ్‌లో గుర్రాలగొంది వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ప్రతి చెక్‌పోస్ట్‌ వద్ద 20 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read more...

మిలియన్‌ మార్చ్‌కు పూర్తి మద్దతు : నాగం

హైదరాబాద్‌ : ఈనెల 10న పోలిటికల్‌ జేఏజీ పిలుపునిచ్చిన మిలియన్‌మార్చ్‌కు టీడీపీ తెలంగాణ ఫోరం పూర్తి మద్దతునిస్తుందని ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధనరెడ్డి తెలిపారు. జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతో కలిసి నాగం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన బైక్‌ర్యాలిని ఇవాళ గన్‌పార్క్‌నుంచి ప్రారంభించారు. మిలియన్‌మార్చ్‌లో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తమ కార్యకర్తలకు సూచించినట్లు నాగం తెలిపారు. తెలంగాణ వచ్చేవరకు టీడీపీ టి.ఫోరం పనిచేస్తుందని నాగం స్ఫష్టం చేశారు.

Read more...

మిలియన్‌ మార్చ్‌ యథాతథం


Kodandaram

హైదరాబ్‌, మేజర్‌న్యూస్‌: టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన ‘మిలీనియం మార్చ్‌ టు హైదరాబాద్‌’పై ఉత్కంఠ వీడింది. ముందుగా ప్రకటించినట్టుగానే మార్చి 10వ తేదీన మిలియన్‌ మార్చ్‌ జరుగుతుందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ ప్రకటించారు. అయితే సమయం లోనే మార్పు చేశారు. మధ్యాహ్నం 1గంటకు ఈ ధర్నా ప్రారంభించి 4గంటల వరకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు ఇబ్బందులు కలుగ రాదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి పారు. నగరంలోని రెండు మూడు ప్రాంతాల నుండి భారీ ర్యాలీలుగా తరలివచ్చి ట్యాంక్‌బండ్‌పై ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ, స్రజాసంఘాలు, తెలంగాణ వాదులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

సోమవారం టీజేఏసీ కార్యాలయంలో జేఏసీ విస్తృత సా్థూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చి10 తేదీన జరిగే ఇంటర్‌ పరీక్ష వాయిదా వేసుకుంటామనిఇంటర్మీడియట్‌ బోర్డు హామీ ఇచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని ప్రకటించామని, కానీ తెలంగాణ ఉద్యమం పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున ఉద్యమ పంథాలో కొంత మార్పు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సహాయ నిరాకరణ కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రూపొందించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు స్వామీగౌడ్‌, దేవీప్రసాద్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌ గౌడ్‌, సి.విఠల్‌, అద్దంకి దయాకర్‌, టీఆర్‌ఎస్‌ నేత ఈటెల రాజేందర్‌, శ్రవ ణ్‌కుమార్‌, బీజే పీ నాయకులు అశోక్‌, సీపీఐఎమ్‌ఎల్‌ న్యూడెమక్రసీ నేత గోవర్ధన్‌, శేషు రాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

దేశం’లో... బుసలు !


Nagam
తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు మొదలయింది. తెలంగాణ తెలుగుదేశం నేతల ధిక్కార స్వరం పెరుగుతోంది. తెలంగాణపై పార్టీ అస్పష్ట వైఖరి వల్ల గందరగోళం ముదురు తోంది. మహానాడులో కూడా పార్టీ విధానం సవరించకపోవడం వల్ల తెలంగాణ నేతలు తమ పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల నేతలకు నచ్చచెప్పలేక సతమతమవుతున్నారు. ఇటు తన కళ్లెదుటేధిక్కారపర్వం కొనసాగిస్తున్న వారిపై చర్య తీసుకోలేక, అటు పూర్తిగా నియంత్రించలేక నలిగిపోతున్నారు.

సోమవారం శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షం లోనే సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలంగానం వినిపిం చడం ఒకరకంగా పార్టీని ధిక్కరించి, తిరుగుబాటు చేయడం గానే భావిస్తున్నారు. సోమవారం నుంచి సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఫోరం నిర్ణయాన్ని అనుసరించి ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు. అయితే, నాగం జనార్దన్‌రెడ్డి హటాత్తుగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న ప్లకార్డులు పట్టుకుని, పోడియం వద్దకు వెళ్లడం చర్చనీయాంశమయింది. నాగం నినాదాలు చేస్తున్నప్పుడు బాబు అక్కడే ఉండటం గమనార్హం.

కాగా, తెలంగాణ సమన్వయ కమిటీ ఎప్పుడో ఏర్పాటుచేసి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదని, కీలకమైన సమస్యలపైనా సత్వర నిర్ణయం తీసుకోకుండా, నాన్చివేత ధోరణి అవలంబిస్తే పరిణామాలు ఇదేవిధంగా ఉంటాయని ఓ సీనియర్‌ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీలో కౌంటర్‌ మెకానిజం లేకుండా పోయిందని, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీ అధ్యక్షుడే రెండు ప్రాంతాల వారిని కలిపి కాకుండా, విడిగా సమావేశాలు జరిపే పద్ధతికి తెరదించినప్పుడే పార్టీలో వాతావరణం మారుతుందని స్పష్టం చేస్తున్నారు.

సభ నుంచి బయటకు వచ్చిన నాగం, తెలంగాణకు పార్టీ అనుకూల వైఖరి ప్రకటించకపోతే తన దారి తాను చూసుకుంటానని, తాను ఎవరికీ భయపడేది లేదని, తనకు ప్రజలే ముఖ్యమని పరోక్షంగా బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తనకే ఎక్కువమంది మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత లాయర్ల జేఏసీలోనూ పాల్గొన్న నాగం తనతో అంతా కలసిరావాలని పిలుపునిచ్చారు.
నాగం ధోరణి పార్టీపై తిరుగుబాటుగానే నేతలు భావిస్తు న్నారు. తెలంగాణ అంశంపై తమ అధినేత ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి కూడా నాగం ఆయన ఉన్నప్పుడే కావాలని నినాదాలు చేయడం బట్టి.. తెలంగాణ అంశంపై బాబుతో తాడోపేడో తేల్చుకునేందుకే నాగం సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది. ఆ తర్వాత బాబు పిలిచినా వెళ్లిపోయారంటే నాగం భవిష్యత్తు వేరుబాటగానే ఉండే అవకాశాలున్నా యంటున్నారు.

Babu-sఅదే సమయంలో నాగం జనార్దన్‌రెడ్డిపై మెజారిటీ తెలం గాణ తమ్ముళ్లు తిరుగుబాటు చేయటం చర్చనీయాంశమ యింది. నిజానికి, నాగం జనార్దన్‌రెడ్డికి సొంత మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచే కనీస మద్దతు లేదు. అన్ని పదవులూ ఆయనకే ఇవ్వడాన్ని సొంత జిల్లా నేతలు చాలాకాలం నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నా బాబు దానిని లెక్కపెట్టలేదు. ప్రస్తుతం ఆయన పీఏసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఒకవైపు తెలంగాణ గురించి మాట్లాడుతూ మరోవైపు సమైక్యాంధ్ర ద్వారా వచ్చిన పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా ఎలా కొనసాగు తారంటూ రేవంత్‌రెడ్డి వంటి యువ ఎమ్మెల్యేలు నేరుగా నిలదీశారు. నాగం తమను అడ్డుపెట్టుకుని, సొంతంగా ఎదిగేందుకు యత్నిస్తున్నారని, అసలు ఆయనను తాము ఫోరం చైర్మన్‌గా గుర్తించేది లేదంటూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డం తిరుగుతున్నారు. నాగం ఒక్కరే మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడగా, ఆయనకు వ్యతిరేకంగా మోత్కుపల్లి నేతృత్వంలో మిగిలిన వారంతా హాజరయి నాగంపై ధ్వజమెత్తడం చూస్తే.. నాగం పార్టీలో ఒంటరి వారయ్యారన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

నాగం జనార్దన్‌రెడ్డి చాలాకాలం నుంచి సొంతబాటలోనే సాగుతున్నారు. ముగ్గురు, నలుగురితో భేటీ అయి, అదే నిర్ణయాన్ని ఫోరం నిర్ణయంగా ప్రకటించడాన్ని మెజారిటీ నేతలు అంగీకరించడం లేదు. ప్రధానంగా.. దేవేందర్‌గౌడ్‌ వర్గానికి, నాగం జనార్దన్‌రెడ్డికీ చాలాకాలం నుంచి పొగడం లేదు. గతంలో నాగం, పోచారం, కడియం, విజయరామారావు మాత్రమే భేటీ అయ్యేవారు. దానికి దేవేందర్‌గౌడ్‌, మోత్కుపల్లిని ఆహ్వానించేవారు కాదు. నాగం ధోరణి.. తమను తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేస్తోందన్న ఆగ్రహం దేవేందర్‌గౌడ్‌ వర్గీయుల్లో చాలాకాలం నుంచి ఉంది. నాగం ఒక్కరే తెలంగాణ కోసం పోరాడుతున్నట్లు, తాము మాత్రం బాబు చెప్పినట్లు నడుచుకుంటూ, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు నాగం ధోరణి ఉందని దేవేందర్‌ వర్గం మండిపడుతోంది.

దీనిపై వారంతా బాబుకు అనేకసార్లు ఫిర్యాదు చేశారు.నాగం జనార్దన్‌రెడ్డికి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చారని, అందుకే ఆయన ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. నాగం కంటే ముందు పార్టీలో చేరిన వారికే ఎక్కువ అన్యాయం జరిగిందని, అసలు నాగం ప్రతిపక్షంలో ఉండగా అన్ని పదవులు అనుభవించి, ఇప్పటివరకూ కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక్క బహిరంగ సభ నిర్వహించలేదని గుర్తు చేస్తున్నారు.

నిజానికి తెలంగాణ ఉద్యమం తర్వాత నాగం వ్యక్తిగతంగా నష్టపోయిందేమీ లేదని, అనేక రకాలుగా లాభపడ్డారని వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతామంటున్నారు. నాగం కంటే బడుగువర్గాలకు చెందిన షిండే లాంటి వారే ఎక్కువ నష్టపోయారని, అయినా వారంతా పార్టీ పక్షానే నిలిచారని గుర్తు చేస్తున్నారు. నాగం తానొక్కడినే తెలంగాణ కోసం పోరాడుతుంటే, పార్టీ నాయకత్వం, మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నట్లు ప్రవర్తించడం మెజారిటీ ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. దీనిపై సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌ కూడా ఇటీవల నాగంతో విబేధించారు.

నాగం మాత్రం మళ్లీ పార్టీలో చేరిన దేవేందర్‌గౌడ్‌కు బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, తన జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డిని తనకు వ్యతిరేకంగా ప్రోత్సహించడాన్ని సహించ లేకపోతున్నారు. తాను పార్టీ కోసమే మాట్లాడుతున్నానని, తాను తెలంగాణ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే పార్టీకి అంత లాభమని వాదిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా బాబు మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ, తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారంటూ ఆయన ఇటీవలి కాలంలో తన సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, నాగం పార్టీని వీడి వెళ్లరని పార్టీ నేతలు చెబుతున్నారు. నాగం మనస్తత్వరీత్యా ఆయన మిగిలిన పార్టీలలో ఇమడటం చాలా కష్టమంటున్నారు.

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆయనకు రాజకీయ గురువయినందున ఒకవేళ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే, కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా ఉన్నందున ఆ పార్టీలో చేరరని మరికొందరు వాదిస్తున్నారు. ఇక తన కంటే జూనియర్లు ఉన్న టీఆర్‌ఎస్‌లో నాగం కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తారనుకోవడం లేదంటున్నారు. అయితే, ఆయనకు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేవలం ఉనికి కోసమే పోరాటం తప్ప, ఆయనలో పార్టీ వీడాలనే యోచన లేదని కొందరు నేతలు వాదిస్తున్నారు. నిజానికి నాగం కంటే పార్టీని నష్టపరిచేవారు చాలామంది ఉన్నారని, వారికంటే బోళాగా మాట్లాడే నాగం తక్కువ ప్రమాదకారని వ్యాఖ్యానిస్తున్నారు.

minitstres‘మా పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మిగిలిన పార్టీల్లో ఉండదు. నోరున్న మా లీడర్ల కార్లను ఉద్యమకారులు ధ్వంసం చేస్తే కొత్తకార్లు కొనిస్తుంది. మా వాళ్లెవరైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తే వాళ్ల వెంట వచ్చే వారి తిండి ఖర్చులకూ పార్టీ నుంచి వసూలు చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినా వాళ్ల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగితే వాళ్లనూ నాయకత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది. ఎన్నికల్లో నిధులు కూడా ఇస్తుంది. ఇన్ని ఇచ్చి మళ్లీ పెద్ద పదవులిస్తుంది. ఇన్ని సౌకర్యాలు ఏ పార్టీ కల్పిస్తుంది చెప్పండ’ని ఓ సీనియర్‌ నేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాగా, సాయంత్రం బాబుతో భేటీ అయిన తెలంగాణ నేతలు నాగం వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నివాసంలో జరిగిన తెలంగాణ ప్రాంత నేతల సమావేశానికి 19 మంది ఎమ్మెల్యేలు, నల్గురు ఎమ్మెల్సీలు, ఒక పార్లమెంటు సభ్యుడు హాజరైనారు. హాజరైన ఎమ్మెల్యేలు వరుసగా మోత్కుపల్లి నర్సింలు, రేవంత్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎర్ర శేఖర్‌, వై. ఎల్లారెడ్డి, ఊకే అబ్బయ్య, కేఎస్‌.రత్నం, సీతక్క, గంప గోవర్ధన్‌, ప్రకాశ్‌ గౌడ్‌, తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, జైపాల్‌ యాదవ్‌, పి. రాములు, ఎస్‌. వేణుగోపాలాచారి, జోగి రామన్న, జి. నగేష్‌, పి. మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీల్లో బాలసాని లక్ష్మీనారాయణ, బి. వెంకటేశ్వర్లు, నర్సారెడ్డి, ఎంపి. రమేష్‌ రాథోడ్‌ ఉన్నారు. నాగం తెలంగాణ టీడీపీ మొత్తానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా వ్యవహరిస్తు న్నారని, ఆయనను నియంత్రించకపోతే తాము కూడా ఇబ్బందిపడవలసి వస్తుందన్నారు. సమన్వయ కమిటీ వేయాలని సూచించారు. మీకు చెప్పే చేస్తున్నానని మా దగ్గర చెబుతున్నారని, మీ దగ్గరోమాట, మాదగ్గరోమాట మాట్లా డుతున్నారని ఫిర్యాదు చేశారు.

అయినప్పటికీ, ఈ పరిస్థితిలో నాగం బయటకు వెళితే చెడు సంకేతాలు వెళతాయని, తాము ఆయనకు నచ్చచెబుతామని ఎమ్మెల్యేలు బాబుకు చెప్పారు. అందుకు ఆయన అంగీకరించారు. మీరంతా కలసి పార్టీని కాపాడతామంటే నేనెందుకు వద్దంటాను. వెళ్లి పరిస్థితి వివరించండి. నేను మీ స్వేచ్ఛకు అడ్డురావడం లేదు. ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చానో మీకూ తెలుసు. కానీ పార్టీ ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దానితో సీనియర్‌ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, వేణుగోపాలచారి, మహేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ సమావేశం ముగిసిన తర్వాత నాగం ఇంటికి వెళ్లారు.

మీ నాయకత్వంలోనే తెలంగాణ కోసం పోరాడదామని వారంతా జనార్దన్‌రెడ్డికి నచ్చచెప్పారు. ఫోరం ఆధ్వర్యంలోనే పోరాటాలు జరుపుదామని, చిన్న చిన్న విబేధాలు పక్కకుపెట్టి అంతా కలసి పోరాడదామన్నారు. మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న యోచన పార్టీకి గానీ, తమకు గానీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఉదయం జరిగిన ఘటనలపై నాగం మనస్తాపం వ్యక్తం చేశారు. తనను అవమానించారని వ్యాఖ్యా నించినట్లు సమాచారం. తాను పార్టీ కోసమే పోరాడుతున్నానని చెప్పారు. తాను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. దానితో నాగం కథకు తాత్కాలికంగా తెరపడినట్టయింది.

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

Monday, March 7, 2011

 http://voice2telangana.blogspot.com/


Navvu Karchu Patte
Prathi Note(Rupees) Meeda
Right Side Unna Gandhi Tho Paatu Left Side
JAI TELANGANA ani Rasina Taruvate Karchu Pettu.

Appudu INDIA Mothaniki Mana Aavedhana Ardham Avutundi.

Plz. Send this SMS to ALL Telangana People....

Don't take It Easy
Take It as Challenge


Jai Telangana

http://voice2telangana.blogspot.com/

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs, NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP