Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, November 23, 2011

లోక్‌సభకు తెలంగాణ ఝలక్!

- చర్చ కోసం పట్టుబట్టిన కేసీఆర్, విజయశాంతి
- సంఘీభావం ప్రకటించిన ఇతర సభ్యులు
- స్తంభించిన లోక్‌సభ.. రెండు సార్లు వాయిదా
- పరిస్థితి సద్దుమణగక.. నేటికి వాయిదా
- వాయిదాతో చర్చకు రాని టీఆర్‌ఎస్ తీర్మానం
- చర్చకు నేడు మరో నోటీసు
- తెలంగాణకు మద్దతిచ్చిన బీఎస్‌పీ, విపక్షాలు
- గాంధీ విగ్రహం వద్ద టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన


KCR-telangana-Newsa talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 22 ():ధరల పెరుగుదల, నల్ల ధనం, అవినీతి, తెలంగాణ అంశాలతో లోక్‌సభ మొదటి రోజు సమావేశాలు దద్దరిల్లాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్య మంగళవారం నాడు ప్రారంభమైన సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన సమయానికి కూడా గందరగోళం కొనసాగడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం భయపడిన విధంగానే తెలంగాణ అంశంలో విపక్షాలన్నీ ఏకమవ్వగా, సొంత పార్టీ ఎంపీలు సైతం ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఒక్క సమాజ్‌వాది పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ తెలంగాణకు మద్దతిచ్చాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని స్పీకర్ మీరా కుమార్‌కు టీఆర్‌ఎస్ వాయిదా తీర్మాన నోటీసు అందించింది. దానిపై చర్చకు పట్టుబడుతూ ఆ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. తెలంగాణ అంశంపై చర్చకు అనుమతించేంతవరకు సభను కొనసాగనిచ్చే ప్రసక్తే లేదంటూ సభను స్తంభింపజేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వీరితో బీఎస్పీ ఎంపీలు గొంతు కలిపారు. కేసీఆర్‌ను బీ ఎస్పీ పార్లమెంటరీ పక్ష నేత దారాసింగ్ చౌహాన్ ప్రత్యేకంగా కలిసి తెలంగాణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. తెలంగాణపై చర్చకు స్పీకర్ అనుమతించని పక్షంలో టీ ఎంపీలకు సంఘీభావంగా వెల్‌లోనే నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు బీఎస్పీ ఎంపీ ఒకరు చెప్పారు. అదే క్రమంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో టీ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.

ఆరు వందల మంది చేసిన ప్రాణ త్యాగాలను గుర్తించైనా తెలంగాణ హామీని నిలబెట్టుకోవాలని ఎంపీలు వివేక్, రాజయ్య, మధుయాష్కీ, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌డ్డి, బలరామ్ నాయక్, పొన్నం ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సహా వివిధ అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. సభ రెండు సార్లు వాయిదా పడినప్పటికీ పరిస్థితులు కుదుటపడనందున బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే బుధవారం నాడు సభలో తెలంగాణపై చర్చను కోరుతూ స్పీకర్‌కు టీఆర్‌ఎస్ మరో నోటీసు ఇవ్వనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల 700 మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న అంశంపై చర్చించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టుబట్టనున్నారు. సభ వెలుపల కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మహాత్ముని విగ్రహం వద్ద ప్ల కార్డులు ప్రదర్శించారు.

తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే: లాలు

lallu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaటీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాకతో సభలోనే కాదు సభ వెలుపలా తెలంగాణ సందడి నెలకొంది. పార్లమెంటు ప్రాంగణంలో, సెంట్రల్ హాల్‌లో ఆయనకు తారసపడ్డ వివిధ పార్టీల ఎంపీలు జై తెలంగాణ అంటూ తమ సంఘీభావాన్ని తెలిపారు. మరీ ముఖ్యంగా శివసేన, జేడీ(యూ), అకాలీదళ్, బీజేడీ తదితర పార్టీల నాయకులు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ తెలంగాణకు మద్దతిస్తుందన్నారు. ‘తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే’ అని లాలూ అన్నారు. బీజేపీ సభ్యులు సైతం తమ సంఘీభావాన్ని తెలిపారు. అదే సమయంలో కేసీఆర్‌ను కలిసిన ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపారు. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారట కదా.. అని వాకబు చేశారు. తెలంగాణలో అన్ని పక్షాలు మద్దతిస్తున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీకి అభ్యంతరం ఎందుకని అసంతృప్తిని ప్రదర్శించారు.

తాత్సారం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇదే వైఖరి కొనసాగితే తెలంగాణలో పార్టీ గల్లంతు కావడం తప్పదని అన్నారు. సభ లోపలా, వెలుపలా మంగళవారం నాటి తెలంగాణ పరిణామాలను నిశితంగా గమనించిన ఓ రాజకీయ విశ్లేషకుడు, ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే అన్ని పార్టీలు ఏకక్షిగీవంగా అమోదిస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటికే బలహీనమైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టడమా లేక పార్టీని భూస్థాపితం చేసుకోవడమా అన్నది కాంగ్రెస్ పెద్దలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాతైనా తెలంగాణ రావాల్సిందేనన్న వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నందున కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆ పార్టీ నాయకుల చేతిలోనే ఉందని అన్నారు.


Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, Rajasabha, Loksaba, 

 

Read more...

Untold story of ISHRATH MURDER ?

New Delhi, Ahmedabad, November 22 :Truth out despite govt's bid to derail Ishrat probe Though it got many opportunities to find the truth, the state police failed to find out whether the encounter in whichIshrat Jahan and three others were killed was fake or not. It needed an SIT appointed by the Gujarat high court to uncover the truth about the criminal role of the Ahmedabad crime branch.

In fact, the state police tried every possible means to cover up the truth. The cover-up started right from the time when the first FIR was lodged by the Detection of Crime Branch (DCB) against Ishrat and three others after the encounter on June 15, 2004.
The investigation of the case was closed by the DCB after it concluded that no other accused could be traced after the encounter in which the four people were killed.During that period, investigating officers continued to change periodically and none of them apparently tried to find out whether the encounter was genuine or not.

The DCB had claimed at the time that Ishrat Jahan, her friend Javed Sheikh and two Pakistani nationals were on a mission to eliminate chief minister Narendra Modi. They had entered Gujarat in a blue Tata Indica car and were intercepted by the police near Kotarpur Water Works where they were killed in an exchange of gunfire, the DCB had said.

Another opportunity to uncover the truth came when sub-divisional magistrate (SDM) Gaurav Prajapati started the mandatory enquiry in the case as the four people had been killed in an encounter.

The SDM conducted the enquiry for a couple of years but stopped after he was transferred. The state police got another opportunity in 2009 when Justice KS Jhaveri of the Gujarat high court constituted a special investigation team (SIT) under the chairmanship of senior IPS officer Pramod Kumar and two other IPS officers, Mohan Jha and JK Bhatt. However, the SIT was unable to find out the truth.

After this, the Supreme Court handed over the case to the Gujarat high court and asked a two-judge bench to look into the mater afresh. The bench then dissolved the first SIT and constituted another one to investigate the case.

Interestingly, all of a sudden the state government showed great interest in finding out the truth about the controversial encounter. It requested the high court to hand over the inquiry to the Special Task Force (STF) headed by retired Supreme Court judge, Justice MB Shah.
The government made the proposal even after the SIT under the chairmanship of Karnal Singh of Delhi police had already been constituted. However, the high court did not entertain the government's proposal after Mukul Sinha and IH Saiyad, counsels for Gopinath Pillai and Shamima Kausar, respectively, raised strong objections.

Even on Monday, when the high court-appointed SIT stated in its report that the encounter was not genuine, the counsels of the state government submitted that the state police should be given the task to investigate the case further.

Gujarat police staged encounters to protect ‘ Modi from terrorists’

D. P. Bhattacharya/ Gandhinagar

THE LATEST revelation by the Special Investigation Team ( SIT), formed by the Gujarat High Court to investigate the Ishrat Jahan fake encounter case, has put the spotlight back on the charges of systematic extra- judicial killings by the state police between 2003 and 2006 to bolster the image of chief minister Narendra Modi.

Over 20 persons were killed during this period. The police’s “ reason” for gunning down most of these people, including Ishrat Jahan and Pranesh Pillai, was that they were terrorists visiting Gujarat to assassinate Modi.

The trend started with Samirkhan Pathan, who was killed in custody, with the cops alleging that he was trying to attack them on November 22, 2002. Sadik Jamal Mehtar was killed on January 13, 2003, near Galaxy theatre in Ahmedabad. Allegedly, the scooter mechanic from Bhavnagar had come to murder Modi as part of an LeT conspiracy.

Then it was the turn of Ishrat Jahan, Javed Sheikh ( Pranesh Pillai), Zeeshan Johar and Amjad Ali Akbarali Rana, who were killed in the Naroda area of Ahmedabad around 4 am on June 15, 2004.

They had allegedly conspired to murder Modi. It was followed by the encounter of Sohrabuddin Sheikh in the morning of November 26, 2005, near the Narol crossing in Ahmedabad, since he too had allegedly come to bump off the chief minister. His wife Kausarbi was killed three days later and his accomplice, Tulsiram Prajapati, fell to police bullets on December 28, 2006.

On January 7, 2006, the Gandhinagar police gunned down Rahim Qasim Sumra, the notorious gangster from Saurashtra, in a late- night encounter. No policeman was hurt in the exchange of fire by Sumra and two of his accomplices, who allegedly fled from the spot. Then four unknown Muslim youth were killed on March 17, 2006, at Vatva ( Ahmedabad) as they were allegedly part of a larger terrorist conspiracy to kill Modi.

Gujarat anti- terrorist squad ( ATS) chief D. G. Vanzara — of the Sohrabuddin killing notoriety — had ordered most of these killings. But Vanzara did not work in isolation and had a team of trigger- happy cops to give him company.

At least eight persons were killed between October 2002 and June 2004 in four encounters in Ahmedabad alone for the same reason. It is now alleged by rights activists that the then joint director of IB Rajendra Kumar used to tip off Vanzara for such encounters.

“ As the chief of state intelligence during that period, all the IB inputs I have seen were against Muslims, with nothing against Hindu groups who were wreaking havoc in the state,” Gujarat’s former DGP R. B. Shreekumar said.

Gujarat’s former top cops maintain that Rajendra Kumar, during his posting at Chandigarh, had come close to Modi, who was then a BJP general contact in charge of Punjab, Haryana and Himachal Pradesh.

“ There has obviously been an unholy nexus between the state police and the Central IB in carrying out these fakencounters… and the role of officials like Rajendra Kumar needs to be thoroughly examined,” noted activist Teesta Setalvad said.

BLOODSTAINS ON THE KHAKI:

D. G. Vanzara: Vanzara was deputy commissioner of police, Ahmedabad, at the time of Ishrat Jahan encounter. He was known as a ‘ supercop’ and encounter specialist in the Gujarat police. A triggerhappy Vanzara is presently in jail for the fake encounter of Sohrabuddin Sheikh and his wife Kauser Bi. He was arrested by the Gujarat CID in April, 2007. The IPS officer was known to be close to Modi N. K. Amin: According to an FIR lodged by the police after the encounter, then ACP Narendra Amin was waiting for the car carrying Ishrat and others at the Naroda Chowkadi. He followed the vehicle. When it took a turn towards airport road from Naroda- Himmatnagar crossing, he asked ACP Singhal to intercept the car.

He first ordered the commandos to fire at the tyre of the car and then at the ‘ terrorists’ P. P. Pandey: Then Joint Commissioner of Police, P. P. Pandey received a tip- off through his ‘ private sources’ at 11 p. m. on June 14, 2004, that a blue Indica carrying the ‘ terrorists’ — Ishrat Jahan, Javed Sheikh and two others — had left Mumbai with arms and ammunition to assassinate CM Narendra Modi. It was on Pandey's information that six police teams were sent to Narol Cross Road, CTM crossroads, Naroda, S. T. workshop, Naroda- Himmatnagar railway crossing, Indira Bridge and Vishala circle to intercept the car G. L. Singhal: G. L. Singhal, used to be an assistant commissioner of police with the state terror squad, which is now known as the anti- terrorist squad.

Singhal still heads the ATS. While Justice Tamang report names 21 police officials in connection with the murder of Ishrat Jahan and four others, it has refrained from detailing the role of any of the officials. The list of the accused also includes lower rung officials like Tarun Barot, J. G. Parmar, D. H. Goswami, B. A. Chavda, K. M. Vaghela, R. I. Patel, K. S. Desai and C. J. Goswami

During the hearing of the case earlier this year, the state government had to face the high court's wrath over the transfer of top police officers including GL Singhal, PP Pandey and Tarun Barot. These police officers were suspected of influencing the witnesses of the case. When the state government delayed in transferring these policemen, the high court initiated contempt proceedings against it.

Satish Verma, joint commissioner of police (traffic) and member of the SIT, also had to face harassment when he seized some vital documents related to the case from the Forensic Science Laboratory. After that, a petition was filed against Verma by an official of the FSL.

SETBACKS TO CM MODI :

BEST BAKERY CASE:

As many as 14 people were killed at Best Bakery by a mob in the 2002 Godhra riots. A Vadodara fast track court acquitted all 21 accused on June 27, 2003, after key witness and complainant Zahira Sheikh ( in pic) turned hostile. The Supreme Court, however, ordered retrial in a court outside Gujarat on August 1, 2003, on a special petition by the NHRC. Zahira, in an affidavit before the apex court, said she was made to retract her statement under duress.

BILKIS BANO CASE:

She was gang- raped in the Radhikpur village of Dahod district and 14 members of her family were killed in the Godhra riots. After a local court dismissed the case against her assailants, Bilkis Bano approached the NHRC and petitioned the Supreme Court seeking a retrial. The apex court granted the motion, directing the CBI to take over the investigation and transferred the case out of Gujarat. In January 2008, 11 men were sentenced to life imprisonment for the rape and murders.

AMIT SHAH ARREST:

The Gujarat minister of state for home, was a close confidante of chief minister Narendra Modi. He was arrested in July this year, in connection with the Sohrabuddin encounter case, after the Supreme Court transferred the probe into the case to the CBI and the trial to a court outside Gujarat.

HAREN PANDYA CASE:

All 12 accused in the murder of former Gujarat home minister Haren Pandya were acquitted by the Gujarat High Court. The case was probed by the CBI and it was claimed that the accused murdered Pandya on March 26, 2003, to avenge the killings of Muslims in the Godhra riots.

SETTING UP OF THE SIT:

The Supreme Court appointed the SIT to probe into at least nine Godhra- riots related cases on March 26, 2008, after complaints of complicity of the state police in various cases.
Incidentally, it was Verma who had concluded in the first first phase of the inquiry itself that the encounter did not appear to be genuine.
Gujarat police staged encounters to protect ‘ Modi from terrorists’

D. P. Bhattacharya/ Gandhinagar

THE LATEST revelation by the Special Investigation Team ( SIT), formed by the Gujarat High Court to investigate the Ishrat Jahan fake encounter case, has put the spotlight back on the charges of systematic extra- judicial killings by the state police between 2003 and 2006 to bolster the image of chief minister Narendra Modi.

Over 20 persons were killed during this period. The police’s “ reason” for gunning down most of these people, including Ishrat Jahan and Pranesh Pillai, was that they were terrorists visiting Gujarat to assassinate Modi.

The trend started with Samirkhan Pathan, who was killed in custody, with the cops alleging that he was trying to attack them on November 22, 2002. Sadik Jamal Mehtar was killed on January 13, 2003, near Galaxy theatre in Ahmedabad. Allegedly, the scooter mechanic from Bhavnagar had come to murder Modi as part of an LeT conspiracy.

Then it was the turn of Ishrat Jahan, Javed Sheikh ( Pranesh Pillai), Zeeshan Johar and Amjad Ali Akbarali Rana, who were killed in the Naroda area of Ahmedabad around 4 am on June 15, 2004.
They had allegedly conspired to murder Modi. It was followed by the encounter of Sohrabuddin Sheikh in the morning of November 26, 2005, near the Narol crossing in Ahmedabad, since he too had allegedly come to bump off the chief minister. His wife Kausarbi was killed three days later and his accomplice, Tulsiram Prajapati, fell to police bullets on December 28, 2006.

On January 7, 2006, the Gandhinagar police gunned down Rahim Qasim Sumra, the notorious gangster from Saurashtra, in a late- night encounter. No policeman was hurt in the exchange of fire by Sumra and two of his accomplices, who allegedly fled from the spot. Then four unknown Muslim youth were killed on March 17, 2006, at Vatva ( Ahmedabad) as they were allegedly part of a larger terrorist conspiracy to kill Modi.

Gujarat anti- terrorist squad ( ATS) chief D. G. Vanzara — of the Sohrabuddin killing notoriety — had ordered most of these killings. But Vanzara did not work in isolation and had a team of trigger- happy cops to give him company.

At least eight persons were killed between October 2002 and June 2004 in four encounters in Ahmedabad alone for the same reason. It is now alleged by rights activists that the then joint director of IB Rajendra Kumar used to tip off Vanzara for such encounters.

“ As the chief of state intelligence during that period, all the IB inputs I have seen were against Muslims, with nothing against Hindu groups who were wreaking havoc in the state,” Gujarat’s former DGP R. B. Shreekumar said.

Gujarat’s former top cops maintain that Rajendra Kumar, during his posting at Chandigarh, had come close to Modi, who was then a BJP general contact in charge of Punjab, Haryana and Himachal Pradesh.

“ There has obviously been an unholy nexus between the state police and the Central IB in carrying out these fakencounters… and the role of officials like Rajendra Kumar needs to be thoroughly examined,” noted activist Teesta Setalvad said.
HUNGER FOR MEDALS CONSUMED 4 LIVES
ISHRAT JAHAN
She was a second year Bachelor of Science student at Mumbai's Guru Nanak Khalsa College. She was the second of seven siblings.

Her lower middle class family, hailing from Bihar, lived in the Rashid compound in the Muslim- dominated area of Mumbra in Thane district in Mumbai.

Ishrat’s father Mohammad Shamim Raza was the proprietor of a Mumbai- based construction company called Asian Constructions while her mother, Shamima, worked with a medicine packaging company in Vashi.

In 2002, Shamim died and Shamima had to give up her job to raise her seven children.
With the eldest, Zeenat, married, it came upon Ishrat to take care of her family. She taught tuition to children from the Bombay Municipal Corporation school and did embroidery work to support her family.

JAVED GHULAM SHEIKH ALIAS PRANESH KUMAR PILLAI :

Ishrat’s family first met Javed in 2004, when she did not have any work, through a neighbour — Rashid. Javed had worked for Ishrat’s father’s construction company. He struggled in Mumbai for some time before moving to Pune. He came from an upper class home in Alleppey, Kerala. Originally known as Pranesh Pillai, he converted to Islam in mid- 1990s. After shifting to Pune, he told his family that ran a small travel agency but his family couldn’t confirm what his real business was. According to Ishrat’s family, he travelled to the Middle East several times. Ishrat went to Pune with him and used to send money back home. Ishrat’s family says that she used to manage Javed’s perfume shop in Pune

JISHAN JOHAR AND AMJAD ALI RANA:

Very little is known about the two other men— Jishan Johar and Amjad Ali Rana— shot dead by the Ahmedabad crime branch with Ishrat Jahan and Javed Sheikh.
Nobody came to claim their bodies and they were given a quiet burial by the state. Metropolitan magistrate S. P. Tamang’s inquiry report asserted that they, alleged to be Lashkar operatives from Pakistan, were Indians, but it gave no evidence to substantiate the claim.

Amjad Ali Akbar Ali Rana, 25, also went by the names of Babbar, Salim alias Rajkumar while 17- year- old Jishan was called Abdul Ghani, alias Salim, according to the Centre’s affidavit before the Gujarat High Court. Their ages were determined by medical investigations.

Tamang observed that the police provided no evidence to prove their identity, and “ perhaps the crime branch officials had named them”. A photograph was recovered from Rana’s pocket with ‘ Salim’ written in English behind it. Johar’s identity card with a Pakistan address was recovered from his dead body.

Read more...

Tuesday, November 22, 2011

ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు

  •  పారిక్షిశామికవేత్తల భేటీలో సీఎం కిరణ్
    • వచ్చే నాలుగేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు
    • డిసెంబర్‌లో ప్రధాని చేతుల మీదుగా
    • లక్షమందికి నియామక పవూతాలు


హైదరాబాద్, నవంబర్ 21(): రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలిపారు. రాజీవ్ యువకిరణాల్లో భాగంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో 15లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం అమలుపై సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో సీఎం పలువురు పారిక్షిశామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు సచివాలయంలో రాజీవ్ విద్యా ఉపాధి కల్పనా మండలి (రీక్యాప్) మొదటి సమావేశం జరిగింది. చదువుకునే సమయంలోనే ఉపాధికల్పనకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. డిసెంబర్‌లో లక్ష మందికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేతులమీదుగా నియామకపవూతాలు అందజేస్తామని ప్రకటించారు. జనాభాలో 70 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పారిక్షిశామికవేత్తలను కోరారు.

రాజీవ్ యువకిరణాలు పథకాన్ని స్వాగతించిన పారిక్షిశామికవేత్తలు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనకు విభాగాల వారీగా ప్రభుత్వానికి, పారిక్షిశామికవేత్తలకు మధ్య సమావేశాలు జరిగితే కచ్చితమైన అవగాహన ఏర్పడుతుందని వారు అభివూపాయపడ్డారు. పరిక్షిశమ అవసరాలకు తగ్గట్లు అభ్యర్థులకు అవసరమైన శిక్షణను ఇచ్చేలా ఐటీఐ, పాలిటెక్నిక్‌లలలో మార్పులు జరగాలన్నారు. ఈ సమావేశంలో జీఎంఆర్, జీవీఆర్, ఇన్ఫోసిస్8లాంటి అగ్రసంస్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన 50 కంపెనీల యజమానులు పాల్గొన్నారు. తమకు అత్యవసరంగా 20వేల మంది ఉద్యోగుల అవసరముందని వస్త్రవ్యాపారులు తెలుపగా, రాజీవ్ యువ కిరణాల కింద లక్షకుపైన ఉద్యోగాలిస్తామని ఫార్మా రంగం ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతాడ్డి, రఘువీరాడ్డి, సునీతాలక్ష్మాడ్డి, మహీధర్‌డ్డి, వట్టివసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, రాజీవ్ యువకిరణాలు సీఈఓ కేసీడ్డిలతో పాటు వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News ryk, ryk.cgg.gov.in  

Read more...

టార్గెట్ చిదంబరం

- రాజీనామా చేసేవరకు మాట్లాడనివ్వం
- సభలోనూ బాయ్‌కాట్ చేస్తాం
- వామపక్షాలతో పరస్పర సహకారం
- ఎన్డీయే కూటమి నిర్ణయం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై
- అద్వానీ నివాసంలో మిత్రపక్ష నేతల భేటీ
- సభను అడ్డుకోవడానికే బీజేపీ ఎత్తులు: కాంగ్రెస్
- నేటి నుంచి శీతాకాల సమావేశాలు

chidambram talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 21:కేంద్ర హోంమంత్రి చిదంబరంను లక్ష్యంగా చేసుకొని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ముప్పేటదాడి చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నిర్ణయించింది. 2జీ కుంభకోణంలో చిదంబరాన్ని బాధ్యుణ్ని చేస్తూ, ఆయన రాజీనామాకు పట్టుబట్టనుంది. సభలో చిదంబరాన్ని మాట్లాడనివ్వవద్దని, ఆయనను బాయ్‌కాట్ చేయాలని నిశ్చయించింది. 2జీ కుంభకోణం జరిగినప్పుడు ఆర్థికమంవూతిగా ఉన్న చిదంబరం రాజీనామా చేయాల్సిందేనని, ఆయన రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించేవరకు ఆయనను బాయ్‌కాట్ చేస్తామని ఎన్డీయే స్పష్టం చేసింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతల భేటీ జరిగింది. శరద్‌యాదవ్, మనోహర్ జోషి, అనంత్ గీతే, నరేశ్ గుజ్రాల్, శివానంద తీవారి, బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితర నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2జీ కుంభకోణంలో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పు వాయిదా వేసిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించింది. ‘2జీ కుంభకోణంలో రాజాకు సమానంగా చిదంబరానికి బాధ్యత ఉంది. ప్రధాని రాజా రాజీనామాను ఆమోదించారు. కానీ చిదంబరం రాజీనామాను మాత్రం కోరడం లేదు.

చిదంబరం రాజీనామాను ఆమోదించేవరకు పార్లమెంటులో ఆయనను బాయ్‌కాట్ చేస్తాం. ఆయనను మాట్లాడనీవ్వం’ అని రాజ్యసభ ప్రతిపక్ష ఉప సభా నాయకుడు ఎస్‌ఎస్ అహ్లూవాలియా తెలిపారు. గతంలో జార్జ్ ఫెర్నాండెజ్ విషయంలో కాంగ్రెస్ ఇదే తరహాలో నిరసన తెలిపింది. తెహెల్కా వెలుగులోకి తెచ్చిన నకిలీ ఆయుధ ఒప్పందాలపై ఓ కమిషన్ విచారణ జరుపుతుండగానే, వాజ్‌పేయ్ కేబినెట్‌లోకి ఆయనను తిరిగి రక్షణ శాఖ మంత్రిగా తీసుకోవడాన్ని నిరసిస్తూ.. ఫెర్నాండెజ్ సభలో మాట్లాడటానికి లేచిన ప్రతీసారి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇప్పుడు అదే నిరసనన ఎన్డీయే పునరావృతం చేయనుంది. చిదంబరం మాట్లాడటప్పుడు వాకౌట్ చేయకుండా, ఆయననుమాట్లాడనివ్వమని అహ్లూవాలియా స్పష్టం చేశారు. నల్లధనం, ధరల పెరుగుదల అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాల విషయంలో వామపక్షాలు, ఎన్డీయే నేతలు పరస్పరం సహకరించుకుంటాయని బీజేపీ నేతలు తెలిపారు. ‘సభలో ప్రవేశపెట్టబోయే తీర్మానాల గురించి ఇరువురం చర్చించకొని, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం. తీర్మానాలపై విపక్షాలు ఉమ్మడిగా తమ వాదాన్ని వినిపించనున్నాయి’ అని అహ్లూవాలియా స్పష్టం చేశారు. అయితే ఎన్డీయే-వామపక్షాల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం గురించి తమకు తెలియదని సీపీఎం చెబుతోంది. ఈ విషయంలో బీజేపీ నేతలకు సీపీఐ నేత గురుదాస్‌గుప్తా హామీ ఇచ్చారని, వామపక్షాలు పెట్టబోయే ధరల పెరుగుదల తీర్మానానికి బీజేపీ మద్దతివ్వడం సాధారణ విషయంగానే చూస్తున్నామని తెలిపింది. గ్రామీణ భారతానికి సంబంధించిన అంశాలను సభలో లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది.

ఆంధ్రవూపదేశ్, మహారాష్ట్రలలో పత్తి రైతుల ఆత్మహత్య, ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, ధాన్యం సేకరణ సరిగ్గా చేపట్టకపోవడంతో వరి రైతుల దుస్థితి తదితర అంశాలను ఎన్డీయే సభలో లేవనెత్తనుంది. పౌర అణు బాధ్య త చట్టంలో తెచ్చిన కొత్త నిబంధనల అంశాన్ని కూడా ప్రస్తావించనున్నామని, పార్లమెంటు విశ్వాసం తీసుకోకుండానే తెచ్చిన కొత్త నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల అంశాన్ని లేవనెత్తునున్నామని వెల్లడించింది. అంతుకుముందు అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గం భేటీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అధికార యూపీఏ సర్కారును పలు అంశాలపై ఎండగ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కాంగ్రెస్ ఎదురుదాడి
చిదంబరాన్ని లక్ష్యంగా చేసుకోవాలన్న ఎన్డీయే నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్డీయే ఈ ఎత్తులు వేస్తోందని ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అగ్ర నేతలు సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సభలో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని, సభ సజావుగా సాగేందుకు, ముఖ్యమైన బిల్లులు ప్రభుత్వం ఆమోదించేలా సహకరించాలని సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ బన్సల్ విపక్షాలను కోరారు.


Read more...

U.P. House votes for split

Uttar Pradesh Chief Minister Mayawati addressing a press conference regarding a proposal for creation of four states, in Lucknow last week. Photo: PTI
Uttar Pradesh Chief Minister Mayawati addressing a press conference regarding a proposal for creation of four states, in Lucknow last week.


Uttar Pradesh Chief Minister Mayawati on Monday moved a resolution in the Vidhan Sabha for splitting the State into Purvanchal, Bundelkhand, Avadh Pradesh and Pashchim Pradesh and it was passed by voice vote amid pandemonium. The House was adjourned sine die within 20 minutes after the winter session began. 

The resolution went through as members of the Samajwadi Party and the Bharatiya Janata Party stormed the well. The adjournment stunned the two parties, as they had served a no-confidence notice against the government and demanded a discussion. Nor was there any discussion on the resolution, though it was supported by the Rashtriya Lok Dal. 

Before the resolution was moved, a vote-on-account for the first four months of 2012-13 was passed by voice vote. The winter session was to have lasted for two days, and the decision of the Business Advisory Committee was read out by Speaker Sukhdev Rajbhar. However, after the vote-on-account and the 
resolution were passed, he adjourned the House sine die at 12.35 p.m. 

Barring five minutes after the House assembled, the entire question hour was lost. When the House re-assembled at 12.20 p.m. for zero hour, the rest of the proceedings were concluded in 15 minutes, before the curtains were down on the session, possibly the last of the 15th Vidhan Sabha. 

U.P. to send resolution to Centre soon
 
The Central government was being asked to reorganise Uttar Pradesh into Purvanchal, Bundelkhand, Avadh Pradesh and Pashchim Pradesh, Chief Minister Mayawati said while reading out the resolution in the Vidhan Sabha on the issue. She defended her move saying her government had fulfilled its responsibility in people's interest. 

After the resolution was passed, Parliamentary Affairs and Finance Minister Lalji Verma urged the Speaker that the passage of the vote-on-account be taken as a vote of confidence in the government. This, too, was passed by a voice vote 

Ms. Mayawati later told journalists that the resolution would soon be sent to the Centre. She rejected the Opposition charge that the decision was an election stunt. 

She parried a question whether the division would form her Bahujan Samajwadi Party's agenda for the Assembly elections due next year. She said the reorganisation was necessary for development. 

The House got off to a stormy start when it assembled for question hour, with Samajwadi Party members demanding the dismissal of the government and BJP members trooping into the well.
While the BJP said it had no confidence in the government, the Samajwadi Party said the government was in a minority. 

As bedlam prevailed, the Speaker adjourned the House till 12.20 p.m.
The commotion continued when the session resumed after question hour, before the House was adjourned. 

Talking to journalists, Leader of the Opposition Shivpal Singh Yadav accused the government of violating the Constitution as the no-confidence motion was not put up for discussion. 

“In a minority”
 
He said the government was in a minority and the people did not want any division of the State. 

He later led a Samajwadi Party delegation to Governor B.L. Joshi and demanded that a special session of the Assembly be convened, and the proposal be put to vote. 

BJP Legislature Party leader Om Prakash Singh said the decision to table the resolution was ill-intentioned, as it was passed without any discussio



Read more...

తిరుగులేని మాయాస్త్రం విభజనం

-కామ్ ఖతం.. ఖేల్ షురూ
- యూపీ విభజన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
- ప్రతిపక్షాల ‘అవిశ్వాసం’ ముందుకు రాకమునుపే
   పావులు కదిపిన సీఎం మాయావతి
- సభలో గందరగోళం.. స్పీకర్‌పైకి కాగితపు ఉండలు
- మూజువాణితో తీర్మానం ఆమోదం
- ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం: మండిపడ్డ ప్రతిపక్షాలు
- జనం కోసమే.. ఆకాంక్షల మేరకే: తిప్పికొట్టిన సీఎం
- ఎన్నికల్లో ప్రజలు ప్రతిస్పందిస్తారని వ్యాఖ్య



mayavathi talangana patrika telangana culture telangana politics telangana cinemaలక్నో, నవంబర్ 21:ఉత్తరవూపదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం ప్రతిపక్షాలను ఊహించనిరీతిలో దెబ్బకొట్టారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావించగా, రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలన్న తీర్మానాన్ని ఆమె సోమవారం శాసనసభలో మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదావేయడంతో ప్రతిపక్షాలు బిత్తరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ముఖ్యమంత్రి చర్య దారుణమని, రాజ్యాంగ నియమాలను అనుసరించలేదని ములాయం సహా కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ, బీజేపీ నేత ముఖ్తార్ అబ్వాస్ నక్వీ తీవ్రంగా ప్రతిస్పందించారు.

మాయావతి చర్యను ప్రజాస్వామ్య హత్యగా, రాజకీయ డ్రామాగా, పక్కదారిపట్టించే ఎత్తుగడగా అభివర్ణించారు. సభ కార్యకలాపాలను రద్దుపరచి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అందుకు ఒక విధానాన్ని అనుసరించాలని పలు పార్టీలు పేర్కొన్నాయి. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న మాయావతికి అనూహ్యంగా ఎస్పీ మాజీ నేత, ములాయం మాజీ సన్నిహితుడు అమర్‌సింగ్ నుంచి మద్దతు లభించింది. ఆయన మాయావతి పక్షం నిలిచారు. సోషలిస్టు రాంమనోహర్ లోహియా కూడా చిన్న రాష్ట్రాలవైపేనని పేర్కొన్నారు. ములాయం వ్యాఖ్యలతోపాటు ప్రతిపక్షాల విమర్శలను మాయావతి తోసిపుచ్చారు. వీటికి ఎన్నికల్లో ప్రజలు ప్రతిస్పందిస్తారని, సరైన బదులిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చిన్న రాష్ట్రాల డిమాండ్‌కు అనుకూలంగా మాయావతి ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

ఉత్తరవూపదేశ్‌ను పూర్వాంచల్ (తూర్పు యూపీ), హరిత్ ప్రదేశ్ (పశ్చిమ యూపీ), బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ) అనే నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలని ఆమె నిర్ణయించుకున్నారు. తన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనందునే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రతిపక్షాల నినాదాలు, కేకల మధ్య ఉద్రిక్త పరిస్థితిలో ప్రారంభమయ్యాయి.

మాయావతి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు బీజేపీ, ఎస్పీ ప్రయత్నించాయి.బీజేపీ సభ్యులు స్పీకర్ ముందుకు దూసుకురాగా, ఎస్పీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి సభలో పూర్తి మెజారిటీ ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి లాల్జీ వర్మ ప్రకటించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. గందరగోళం మధ్య స్పీకర్ సుఖ్‌దేవ్ రాజ్‌భర్ ప్రశ్నోత్తరాల కార్యక్షికమాన్ని మధ్యాహ్నం 12.20 వరకు వాయిదా వేశారు. సభ మళ్ళీ ప్రారంభం కాగానే, ముఖ్యమంత్రి మాయావతి సమక్షంలో ఎస్పీ, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు. సభ మధ్యలోకి దూసుకొచ్చారు. సభ్యులు స్పీకర్‌పైకి కాగితపు ఉండలు విసురుతుంటే మార్షల్స్ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో సభ 2012-13 సంవత్సరానికి సంబంధించిన మొదటి నాలుగు నెలల ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదం పొందింది. ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత ప్రమోద్‌తివారీ ఆరోపించారు.

ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరగాలనే విభజనను కోరుతున్నట్లు ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాన్ని విడదీసే తీర్మానం ఆమోదం పొందింది. ఇది బీఎస్పీ రాజకీయ ప్రతిపాదన కాదు. మా ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోనందునే మేమిలా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రయోజనార్థం విడదీసే చర్య చేపట్టి ఉత్తరవూపదేశ్ శాసనసభ తన విధిని నిర్వర్తించింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘సముచిత రీతిలో ఉత్తరవూపదేశ్, ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం అవసరం’’ అని ఆమె స్పష్టం చేశారు. తన ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్న సమాజ్‌వాదీ, బీజేపీల వాదనను ఆమె తోసిపుచ్చారు.

అది ఆధారరహితమని కొట్టిపడేశారు. ‘‘బీఎస్పీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శ రాజకీయ దురుద్దేశపూరితమైనది. బలహీనపరచాలనే ప్రయత్నమది. చీలికను ప్రతిపక్షాలు అంగీకరించవు.. ఎందుకంటే- అవి రాష్ట్ర ప్రగతిని కోరుకోవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అక్కడ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామాలిచ్చారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం కూడా మైనారిటీలో పడిందని అనందుకుని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మాయావతి మండిపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఎంపీలు అవినీతి ఆరోపణలతో జైలు ఊచల వెనుక ఉన్నారు. కాంగ్రెస్‌గానీ, ఇతర పక్షాలుగానీ కేంద్రంలోని ప్రభుత్వం మైనారిటీలో ఉందని అనడం లేదు’’ అని ఆమె అన్నారు.

రాష్ట్రాన్ని విడదీయాలన్న ప్రతిపాదన రాజకీయపరమైనదన్న ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. శాంతిభవూదతల క్షీణత, అభివృద్ధి మందగమనం నుంచి దృష్టి మళ్ళించేందుకే ఇలా చేశారన్న విమర్శలను ఆమె కొట్టి పడేశారు. ‘‘ఉత్తరవూపదేశ్ ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు బదులిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

నియంతృత్వం.. మాయావతి హిట్లర్

ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలన్న తీర్మానాన్ని మాయావతి ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేయడాన్ని, శాసనసభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆమె నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ ఈ పరిణామంపై ప్రతిస్పందిస్తూ మాయావతిని హిట్లర్‌తో పోల్చారు. మాయావతి నియంతృత్వ పాలనాతీరుకు ఇది మరో దృష్టాంతమని బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తీర్మానాన్ని ఆమోదించడం దిగ్భ్రాంతికరమైన చర్య అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయమంత్రి ఆర్‌పీఎన్ సింగ్ పేర్కొన్నారు. మాయావతి ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిందని వ్యాఖ్యానించారు.

యూపీ చీలితే.. లాభమెవరికి? నష్టమెవరికి?
ఉత్తరవూపదేశ్ విడిపోతే రాజకీయంగా లబ్ధి పొందేది, నష్టపోయేది ఏయే పార్టీలనేది ఇప్పుడు చర్చనీయమవుతోంది. బీఎస్పీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాయావతి లబ్ధిపొందుతారనేది స్పష్టం. ఆమెకు బలమైన ఓటు బ్యాంకయిన దళితులు రాష్ట్రమంతా సమంగానే విస్తరించి ఉన్నారు. అందువల్ల ఆమె భారీగా లాభపడే అవకాశముంటుంది.

ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి కీలకమైనవి 8.7శాతం ఉన్న యాదవుల ఓట్లు. అవి అన్ని ప్రాంతాల్లో సమంగా లేవు. తూర్పు యూపీలో, ఎటావాలో ఎక్కువున్నాయి. రాష్ట్రీయ లోక్‌దళ్ పశ్చిమ యూపీలో హరిత్ ప్రదేశ్‌ను కోరుకుంటోంది. జాట్లు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆ పార్టీ ప్రయోజనం పొందవచ్చు. బీఎస్పీలాగే కాంగ్రెస్‌కు కూడా అన్ని ప్రాంతాల్లో ప్రభావమున్నప్పటికీ, అది చాలా స్వల్పం. అందువల్ల లబ్ధి చేకూరకపోవచ్చు. తూర్పు యూపీలో రాజ్‌పుత్, బ్రాహ్మణుల కారణంగా బీజేపీ ప్రభావముంటుంది.

ఏ పార్టీ బలమెంత?ఉత్తరవూపదేశ్‌లోని మొత్తం 404 అసెంబ్లీ స్థానాల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 219 సీట్లున్నాయి. ఎస్పీకి 88, బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 20, ఆర్‌ఎల్‌డీకి 10, ఆర్‌ఎస్‌పీకి 1, ఇండిపెండెంట్లకు 9స్థానాలున్నాయి. మరో 8 ఖాళీగా ఉన్నాయి.







Read more...

Monday, November 21, 2011

అబ్బుర పరిచిన ‘మహాయోధ’

రవీంవూదభారతి, నవంబర్ 20 (): చరివూతకారులు చెబుతున్నట్లుగా వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి కాదని, ఝల్కారీబాయి నిజమైన వీరనారి అని చెబుతూ రవీంవూదభారతిలో ఆదివారం ప్రదర్శించిన ‘మహాయోధ’ నాటకం సభికులను కట్టిపడేసింది. ఈ నాటక ప్రదర్శనను ఆద్యంతం ఉత్కం ప్రేక్షకులు వీక్షించారు. ఝల్కారీబాయి ధీరత్వాన్ని, పోరాటపటిమను చూసి వారు విస్మయానికి లోనయ్యారు. ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయిగా ద్విపావూతాభినయం చేసిన రైల్వే ఉద్యోగి సత్యవాణి నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ నాటకానికి సౌదా అరుణ దర్శకత్వం వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్థానంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడింది ఝల్కారీబాయి అని నేటి ప్రపంచానికి తెలియజేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నత కుటుంబంలో జన్మించి ప్రాణాలకు భయపడి, ఆమె పోలికలతోనే ఉన్న ఝల్కారీ బాయిని రక్షణగా ఏర్పాటు చేసుకున్న విషయం భారత సైనికులకు కూడా తెలియదని వివరించారు. ఝాల్కారీబాయి స్వగ్రామంలోని ఆదివాసుల ద్వారా వివరాలు సేకరించి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని దర్శకురాలి భర్త సౌదా మీడియాకు తెలిపారు.

మీడియాను దూషించిన సౌదా..
మహాయోధ నాటక ప్రదర్శనను చిత్రీకరిచేందుకు పలు చానళ్ల ప్రతినిధులు రవీంవూదభారతికి వచ్చారు. విరామ సమయంలో వారు నాటకంపై ప్రముఖుల అభివూపాయాలను సేకరిస్తుండగా.. ‘మీకు బుద్ధి, జ్ఞానం ఉందా.. మీపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ మీడియాపై దర్శకురాలి భర్త సౌదా విరుచుకుపడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు నాటక ప్రదర్శనను బహిష్కరించారు.

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News 

Read more...

ముగిసిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈరోజు వరకు జరిగిన 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ముగిసాయి. కార్యక్రమానికి ముఖ్య అథితిగా గవర్నర్ నరసిహన్ వచ్చారు. బంగారు ఏనుగులను
బెస్ట్ ఇండియా స్క్రీన్‌ప్లే -( సంజయ్ చౌహన్) అయామ్ కలాం,
ఉత్తమ బాలల దర్శకుడు - (బంట్యానాయక్) హమారీ దునియా,
ఉత్తమ లఘు చిత్రం- నైన్‌అండ్‌హఫ్ ఇయర్ గుడ్‌బాయ్,
ఉత్తమ ఫీచర్ ఫిలీంగా - ద క్రొకోడైల్స్ స్ట్రయిట్ బ్యాక్,
ద్వితయ ఉత్తమ ఫీచర్ ఫిలీం - జాతీయ విభాగంలో- దేక్ ఇండియన్ సర్కస్,
ఉత్తమ స్క్రీన్‌ప్లే అంతర్జాతీయ స్థాయి - ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ హఫ్ హాలాండ్,
ఉత్తమ ఫీచర్ ఫిలీం అంతర్జాతీయ స్థాయి - మెడో,
ద్వితియ ఉత్తమ చలన చిత్రం అంతర్జాతీయ స్థాయి - అ అగ్లీ డిక్లీస్,
ఉత్తమ ద్వితియ లఘు చిత్రం - దుబాల్,
బెస్ట్ డైరక్టర్ -ఉమేష్ వినాయక్ కులకర్ణీ- వీర్ చిత్రానికి బంగారు ఏనుగులు గెలుచుకున్నారు.

Read more...

నేడు ఢిల్లీకి కేసీఆర్

తెలంగాణపై జాతీయ, ప్రాంతీయ నేతలతో భేటీ
KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 20 (): టీఆర్‌ఎస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవనున్నారని సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపే పార్టీలతో కలిసి పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై ఇందులో చర్చిస్తారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీ ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసినా.. కేంద్రం పూర్తి స్థాయిలో స్పందించలేదు. దీనికి తోడు తెలంగాణ వాదులు, టీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. తెలంగాణకు అనుకూలంగా 30కి పైగా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవల సొంత పార్టీ నేతలతో తెలంగాణ విషయంపై చర్చలు జరిపింది. ప్రస్త్తుతం మరికొన్ని పక్షాలతో కూడా చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది. కాగా, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకుండా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణవాదులు మండి పడుతున్నారు.

ఇదే సమయంలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటం, బీజేపీ తెలంగాణ విషయంలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ పార్లమెంట్‌లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ముందుగా బీజేపీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తెలంగాణవాదులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తివేయక పోగా.. టీ ఉద్యమకారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌లో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంట్ సమావేశాలు కూడా వాడివేడిగా సాగే అవకాశం ఉంది.


Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, KCR,

 

Read more...

రేపటి పూట మరో మాట!

- గత కృషి, భవిష్యత్ కార్యక్షికమంపై వివరణ
- పార్లమెంటు సమావేశాలు గట్టెక్కేందుకే.. తెలంగాణపై చర్చ రచ్చ కాకూడదనే..
- విపక్షాలు రాద్ధాంతం చేయకముందే ఒకటి రెండు రోజుల్లో ప్రకటన
- అది కూడా చిదంబరం నోటి నుంచే
- చిన్న రాష్ట్రాల డిమాండ్ల ప్రస్తావన
- విపక్ష, స్వపక్ష దాడిని తప్పించుకునేందుకు వ్యూహ రచనలో కేంద్ర ప్రభుత్వం!


parlament-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 20 ():మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ విషయంలో కేంద్రం నుంచి ఒక ప్రకటన రానున్నదా? రాష్ట్ర విభజనపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతున్న యూపీఏ ప్రభుత్వం.. ఈ సమావేశాలను సజావుగా సాగించుకునేందుకు మధ్యేమార్గాన్ని అనుసరించనున్నదా? పూటకో ప్రకటన చేస్తూ రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణాన్ని కొనసాగిస్తోందని కేంద్రంపై మండిపడుతున్న విపక్షాలను శాంతపర్చేందుకు.. విపక్షాలతో గొంతు కలుపుతున్న అధికార పక్ష సభ్యుల ఆగ్రహాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు పాచిక వేయనున్నదా? అవుననే అంటున్నాయి ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు! తెలంగాణ అంశంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున రగడ జరగనున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. ఈ అడ్డంకిని అధిగమించేందు కు ఒక ప్రకటన చేయనున్నదని తెలుస్తున్నది. ఇది తెలంగాణపై నిర్ణయాత్మక అడుగు కాకపోయినా.. తక్షణ గండం గట్టెక్కేందుకే ఉద్దేశించారని చెబుతున్నారు. తెలంగాణ విషయం లో ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న హోం మం త్రి చిదంబరం తాజా ప్రకటన చేయనున్నారని తెలుస్తున్నది.

సెగల నేపథ్యంలోనే..
ఇప్పటికే వివిధ ఆందోళన రూపాలతో తీవ్ర స్థాయికి చేరిన తెలంగాణ ఉద్యమం.. ఇటీవలి సకల జనుల సమ్మెతో జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది! దీంతో కంగాత్తిన కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్యమాన్ని శాంతపర్చేందుకు అనేక పాచికలు వేసింది. తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లోపే ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ.. అవన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయింది. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తూ సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ ఇప్పుడప్పుడే తెలంగాణ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఉద్యమక్షిశేణుల్లో మరింత ఆగ్రహం రాజుకుంది! ఈ సెగలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా తాకుతాయన్న ఆందోళనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకే మరో ప్రకటన వెలువడనున్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ ఎంపీలు, మద్దతిస్తున్న పార్టీలు సంతృప్తి చెందినా.. చెందక పోయినా తెలంగాణ అంశం ఈ సమావేశాల్లో పదే పదే ప్రస్తావనకు రాకుండా చూసుకోవడమే యూపీఏ ఉద్దేశంగా కనిపిస్తోంది. సమావేశాలు ప్రారంభమైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం తనకు తానుగా తెలంగాణపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ సమస్య పరిష్కారానికి గత సమావేశాల నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అన్న దానిపై కూడా కొంత స్పష్టతనిచ్చి తెలంగాణ అంశాన్ని దాట వేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో యూపీ విభజన నేపథ్యంలో తెరమీదకొచ్చిన చిన్న రాష్ట్రాల డిమాండ్లను, ఎస్సార్సీని ప్రస్తావించి సంక్లిష్ట తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయాన్ని కోరనుంది. మొత్తంగా చూస్తే తెలంగాణపై సభలో గందరగోళం నెలకొనే పక్షంలో ప్రతిపక్షాలతో సహా మిత్ర పక్షాలు కూడా అధికార పార్టీ వైపే వేలెత్తి చూపనున్నాయి. గతంలో కూడా తెలంగాణ సహా వివిధ అంశాల కారణంగా గందరగోళం ఏర్పడి.. ప్రభుత్వం తాను అనుకున్న అజెండాను సభలో చర్చించలేక పోయింది. సమయం లేకపోవడం వల్ల కొన్ని బిల్లులు పార్లమెంటు గడపతొక్కనే లేదు. మరి కొన్ని బిల్లులపై కొంత చర్చ జరిగినా అవి అమోదానికి నోచుకోలేదు. వాటితో పాటు కొత్త బిల్లులకు ఈ సమావేశాల్లో అమోదముద్ర వేయించు కోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతు సమస్యలు, ధరల పెరుగుదల, దెబ్బ తిన్న ఆర్థిక రంగం, నల్ల ధనం తదితర కీలకాంశాలపై సాగనున్న సుదీర్ఘ చర్చను దాటుకొని అనుకున్న సభా కార్యక్షికమాలను ఎలా పూర్తి చేసుకోవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్న కేంద్రానికి తెలంగాణ అంశం మరింత అవరోధాన్ని సృష్టించనుంది. దీంతో ప్రత్యామ్నాయాలతో ఏదో ఒక రకంగా పార్లమెంటు సమావేశాలను సజావుగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై విధాన నిర్ణయ దిశగా అధికారిక ప్రకటన కానప్పటికీ విసృ్తతాభివూపాయం ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రధాని చెప్పిన రీతిలోనే కేంద్ర హోం మంత్రి చిదంబరంతో మరో ప్రకటన చేయించాలని చూస్తోందని సమాచారం.


Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP