Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, October 14, 2011

Great Cartoons

 
 Take By: T News


Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

Read more...

టీ కాంగ్రెస్‌లో ఊసరవెల్లులు!

- దూసుకుపోతున్న ఎంపీలు
- దూరమవుతున్న ఎమ్మెల్యేలు
- అవమానాపూదురైనా పదవుల్లోనే టీ మంత్రులు
- టీ నేతలపై సీఎం వలతో ఉద్యమంలో వెనకడుగు?
- కల్లోలం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 13  :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీ కాంగ్రెస్ నేతల ఉద్యమబాట అటకెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిద్దరు మినహా టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కోసం జోరుగా ఉద్యమిస్తూ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీవ్రతరం చేస్తుండగా, మరో వైపు టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేలు, టీ మంత్రుల తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలలో కూడా నలుగురైదుగురు మినహాయించి మిగతావారందరూ ఉద్యమంలో ఉన్నట్లు నటిస్తూనే అటు సీఎంకు జై కొడుతూ ఇటు ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రలోభాలకు గురవుతూ ఊసర మాదిరిగా రంగులు మార్చుతున్నారని తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. అవమానాలు ఎదుర్కొంటూనైనా టీ మంత్రులు పదవుల్లో కొనసాగేందుకు ఇష్టపడుతున్నారే తప్ప పదవులను వదులుకుని ఉద్యమబాటలో పయనించేందుకు ససేమిరా అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి టీ కాంగ్రెస్ నేతలను దారికి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విఫలయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.

దీనికి భిన్నంగా అటు అధిష్ఠానం, ఇటు సీఎం వైపు నుంచి ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు వచ్చినా టీ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఉద్యమంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెబుతూ దూసుకు పోతున్నారు. టీ కాంగ్రెస్ ఎంపీల్లో సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్ మినహాయించి మిగతా ఎంపీలు అందరూ మొదటి నుంచి తెలంగాణ పోరులో ఒకే మాట, ఒకే బాటకు కట్టుబడి ఉన్నారు. అంతే కాకుండా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు తాజాగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి ఒత్తిడి తెచ్చారు. సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఉద్యోగులకు, సమ్మె నేపథ్యంలో తెలంగాణవాదులు చేపడుతున్న కార్యక్షికమాలకు పూర్తి మద్దతునిస్తున్నారు. అంతే కాకుండా ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రైల్ రోకోలో స్వయంగా పాల్గొంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణపై హైకమాండ్ ప్రకటన చేసే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు.

ఎంపీల పోరాట స్ఫూర్తికి భిన్నంగా ఉంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి. ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో దిగి జోరుగా దూసుకుపోతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం గడికో మాట, పూటకో రంగు మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యమంలో పాల్గొనడం మాట అలా ఉంచితే కనీసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తమ పదవులను వదులుకోవడానికి కూడా వారు ససేమిరా అంటున్నారు. సమిష్టి నిర్ణయాలతో ఐక్యంగా ఉద్యమిద్దామంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజావూపతినిధులు టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ సభ్యులుగా ఉన్నారు. కానీ.. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదు.

దీనిపై తెలంగాణవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విధులకు హాజరు కావద్దని టీకాంక్షిగెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తే.. దాన్ని మంత్రులు బేఖాతరు చేశారు. సీఎం మాటకు తలొగ్గి కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణపై ప్రకటన రాక పోతే మంత్రి పదవులు, పార్టీకి గుడ్‌బై చెప్పాలని స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆవేశంగా ఢిల్లీ వెళ్లిన నేతలు.. అక్కడ పార్టీ అధిష్ఠానం ముందు పిల్లులైపోయారు. తమ పార్టీ పెద్దలను కలిసినప్పుడు కనీసమైన హెచ్చరిక చేయడానికి కూడా సాహసించలేదు. పైగా సకల జనుల సమ్మె విరమించేందుకు ప్రయత్నించడని అభ్యర్థించి వచ్చారు. అంతే తప్ప తెలంగాణపై ప్రకటన రాక పోతే పదవులకు రాజీనామా చేస్తామని ఎక్కడా హెచ్చరించలేకపోయారు. టీ మంత్రుల్లో జూపల్లి కృష్ణారావు, కోమటిడ్డి వెంకట్‌డ్డి చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణ కోసం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించి, ప్రజలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు.

మిగతా మంత్రులు మాత్రం పదవులను అంటిపెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆగ్రహావేశాలు తెలంగాణవాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి. టీ మంత్రుల్లో దామోదర రాజనర్సింహ, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ మినహా మిగతా మంత్రులు తెలంగాణ పేరుతో సమావేశమవుతున్నప్పటికీ ప్రభుత్వం దిగివచ్చేలా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో, పదవులను వదులుకుని ప్రజల పక్షానా నిలబడటానికి ఏ మాత్రం ఇష్టపడకుండా పరోక్షంగా కిరణ్ సర్కార్‌కు సహాయపడుతున్నారని ఉద్యమక్షిశేణులు మండిపడుతున్నాయి. మరోవైపు టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేల తీరు రంగులు మార్చే ఊసర తరహాలో ఉందంటూ టీ వాదులు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడానికి సైతం ముందుకు రావడం లేదు. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), సోమారపు సత్యనారాయణ (రామగుండం) తెలంగాణ కోసం రెండవ సారి తమ రాజీనామాలు సమర్పించగా, మిగతా ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాల మాటే ఎత్తొద్దంటున్నారు. సీఎం కిరణ్ ప్రయోగిస్తున్న ప్రలోభాల అస్త్రానికి వీరు తలొగ్గినట్లు వారి తీరు చూస్తుంటే తెలుస్తోందని పార్టీ వర్గాల్లో విమర్శలు వెల్లు

నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఆర్థిక, ఇతర ప్రయోజనాలను ఎరగా విసురుతున్న సీఎం.. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్యమ బాట నుంచి తప్పించి, తనవైపు తిప్పుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఉద్యమంలో చురుకుగా కనిపించిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు తెరచాటుకు వెళ్ళిపోయారు. సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడటం, రాజీనామాలపై వెనక్కి వెళ్ళడం, సీఎంపై పొగడ్తల జల్లు కురిపించేందుకు జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తుండడం, టీ ఉద్యమంలో మెత్తపడటం, టీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయాలను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తుండడం వంటి చర్యలు చూస్తుంటే టీఎమ్మెల్యేలపై సీఎం ప్రలోభాలు తీవ్రంగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలంగాణవాదులు అంటున్నారు. 13 మంది టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం భారీ స్థాయిలో ముడుపులు అందించి, ప్రలోభాలకు గురి చేశారంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా చేసిన ఆరోపణలు టీ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.

సీబీఐ ద్వారా దర్యాప్తు చేయిస్తే ఆధారాలతో నిరూపించేందుకు తాను సిద్ధమంటూ కేటీఆర్ విసిరిన సవాలుతో టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భుజాలు తడుముకుంటున్నారన్న వాదన వినిపిస్తున్నది. గాలి, జగన్ వ్యవహరాలపై దర్యాప్తులో సీబీఐ పాత్రతో ఇప్పటికే రాజకీయ నేతలకు గుబులు పుట్టుకుంది. గత రెండు రోజులుగా కొందరు టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేలు సకల జనుల సమ్మె విరమించుకోవాలని, విద్యా సంస్థలను మినహాయించాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ సీఎంకు అనుకూలంగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రలోభాల మంత్రం వారిపై బాగానే పనిచేసినట్లు కనిపిస్తోందని తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు.

Take By: T News


Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

Read more...

డీజీపీ.. బెదిరింపులు సరికాదు

-హింసకు దిగితే తిరుగుబాటు తప్పదు
- జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య

rail-roko-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 13 (టీ న్యూస్) : ప్రజలను హింసిస్తే తిరుగుబాటు తప్పదని, సర్కార్ పతనమవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కో-చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య హెచ్చరించారు. రైల్‌రోకోలో పాల్గొంటే జీవిత ఖైదు విధిస్తామని డీజీపీ దినేష్‌డ్డి బెదిరించడం దారుణమన్నారు. రైల్వే చట్టంలో లేని కొత్తవాదాన్ని డీజీపీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జేఏసీ కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సమ్మెను హింసాత్మకంగా మార్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15,16,17 తేదీల్లో రైల్‌రోకో కార్యక్షికమం యథావిధిగా సాగుతుందన్నారు. విద్యా సంస్థలను సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇచ్చిన గడువుపై విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. ఆయనకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.ఈ సందర్భంగా రైల్‌రోకో వాల్ పోస్టర్‌ను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు.

ktr-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema దమ్ముంటే ఖాకీ దస్తులు వదిలేసి రా: కేటీఆర్
డీజీపీ దినేష్‌డ్డి బెదిరింపులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘డీజీపీ.. దమ్ముంటే ఖాకీ దుస్తులు వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. మాతో పోరాడాలి’ అని సవాల్ విసిరారు. గురువారం పాతబస్తీలోని పురాణాహవేలీలోని సిటీ సివిల్ కోర్ట్ జ్యుడీషియల్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ నిర్వహించిన వంటావార్పు కార్యక్షికమంలో ఆయన పాల్గొన్నారు. డీజీపీ సీమాంవూధులకు చెంచాగిరీ చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన రాజకీయ నేతలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఆయనకు అంత దురదగా ఉంటే వచ్చి ఖద్దరు దుస్తులు వేసుకుని రాజకీయాల్లోకి రావాలి. అప్పుడు చూసుకుందాం. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మంచి మంచి తుర్రుంఖాన్‌లను చూశాం. నీ ఆటలు మా వద్ద సాగవు’ అని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్షికమంలో జ్యుడీషియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సుబ్బయ్య, పాతబస్తీ టీఆర్‌ఎస్ నేత ఇనాయత్ అలీభాఖ్రీ, న్యాయవాదులు మాణిక్‌వూపభు గౌడ్, తిరుమల రావు, జయవూపకాశ్, శ్రీరంగారావు, శ్రీధర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు,

vijayashanthi-telangana-New talangana patrika telangana culture telangana politics telangana cinema రైల్‌రోకో చేసి తీరుతాం: విజయశాంతి
‘రైల్‌రోకో చేసి తీరుతాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. తొలుత నేనే రైలు ఆపుతా. రైలు ఆపితే జీవితఖైదు అని డీజీపీ చెప్పడం తప్పు అని టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి గురువారం ప్రశ్నించారు. డీజీపీ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నాయకులు స్పందించాలన్నారు. ఎందరు డీజీపీలు వచ్చినా 15 నుంచి రైల్‌రోకో ఆగదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. సీఎం తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజల కోపాగ్నికి గురికాక తప్పదని హెచ్చరించారు. రైల్‌రోకో చేస్తే జీవిత ఖైదు విధిస్తామని డీజీపీ మాట్లాడ్డం చట్టాన్ని ఉల్లంఘించడమేనని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ కో-చైర్మన్ సి.అశోక్‌కుమార్ యాదవ్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి డీజీపీ పోస్టులోకి వచ్చిన వ్యక్తి చట్టాల గురించి వల్లించడం విచివూతంగా ఉందన్నారు. ఉద్యమకారులను డీజీపీ సోయిలేకుండా బెదిరిస్తున్నారని న్యూడెమొక్షికసీ నేత కె.గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ అణచివేతకు సీఎం తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని డీజీపీ దినేష్‌డ్డి చేసిన వ్యాఖ్యలపై మానవ హక్కుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయని వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్, కార్యదర్శి కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.


Take By: T News


Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

Read more...

పొంచి ఉన్న కరెంట్ షాక్

- పేద, మధ్యతరగతిపై రూ.1,500 కోట్ల భారం?
- 300 లోపు యూనిట్లకు 50 పైసలు పెంపుదల?
- ఉధృత ఉద్యమాల దృష్టి మళ్లించే కుట్ర!
- విద్యుత్ చార్జీల పెంపుదలకు సర్కారు కసరత్తు
- గృహ వినియోగదారులపైనే అధిక భారం
- రైతులకు ఉచిత కరెంటుకు మంగళం
- వ్యవసాయ పంపుసెట్లపై నియంవూతణ
- కుటీర పరిక్షిశమలు, దోభీఘాట్‌లకు యూనిట్‌కు కనీసం రూ.3లు
- మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో టీఓడీ చార్జీలు
- వీధి దీపాల వెలుగులకు కత్తెర
- మైనర్ పంచాయతీలు, పీడబ్ల్యూఎస్‌లకు పెరగనున్న టారిఫ్
- ప్రీ పెయిడ్ మీటర్లపై వెనుకడుగు
- ఇకపై మీటర్‌లకూ అద్దె కట్టాలి!

mady-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, అక్టోబర్ 13 :రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఉచిత విద్యుత్ సేవలు పొందుతున్న సుమారు 29.3 లక్షల వ్యవసాయ కనెక్షన్లను ఇకపై నియంవూతించే చర్యలు చేపడుతున్నది. అత్యధికంగా విద్యుత్ వాడకాన్ని సాగించే మల్టీప్లెక్స్‌లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను టైమ్ ఆఫ్ ది డే (టీఓడీ) సేవల పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నది. విద్యుత్ వాడకంలో ఎక్కువ దుర్వినియోగం అవుతున్నదన్న సాకుతో వీధి దీపాలు, మైనర్ పంచాయతీల్లో విద్యుత్ దీపాలు, తాగునీటి పథకాలు (పీడబ్ల్యూఎస్) వంటి వాటిల్లో కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రస్తుతం ఉన్న టారిఫ్‌ను మూడు రెట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. కుటీర పరిక్షిశమలు, రజకుల దోభీఘాట్‌లకు యూనిట్‌కు కనీసం మూడు రూపాయల చొప్పున చార్జీలు, సింగిల్ పాయింట్ సర్వీసులకు ఒకే టారిఫ్ అమలు చేయాలని యోచిస్తున్నది.


ఆంధ్రవూపదేశ్ విద్యుత్ నియంవూతణ సంస్థ (ఏపీఈఆర్సీ)కు నవంబర్‌లోగా విద్యుత్ సంస్థలు టాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లు), రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సిన వార్షిక ఆదాయ వ్యయ నివేదికలు(ఏఆర్‌ఆర్) రూపకల్పన యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. ఇప్పటికే పంపిణీ సంస్థలు తమ ప్రతిపాదనలను ఏపీ ట్రాన్స్‌కోకు అందజేశాయి. డిస్కమ్‌ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ట్రాన్స్‌కో కొన్ని ప్రయివేటు ఏజెన్సీలతో క్రోడీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా ఏఆర్‌ఆర్‌లలో పొందుపర్చుకునే విధంగా మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈసారి కరెంటు చార్జీలను పెంచడం ఖాయమని అధికారవర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.

గృహ వినియోగంపై యూనిట్‌కు 50 పైసల భారం?
ప్రధానంగా గృహ వినియోగదారులపైనే కరెంటు భారం వేయాలనే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందులోనూ 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వర్గాలనే ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. కనీసం యూనిట్‌కు 50 పైసల చొప్పున చార్జీలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. చార్జీల పెంపుదల ద్వారా రూ,1,500కోట్ల అదనపు భారాన్ని ప్రజానీకంపై మోపేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో దాదాపు 2.3 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వాటిలో డొమెస్టిక్ కేటగిరీలో సుమారు 1.8కోట్ల కనెక్షన్లున్నాయి. వీటిల్లో 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య దాదాపు 1.6కోట్లు ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న చార్జీల పెంపుదల ప్రతిపాదనలు వీరినే లక్ష్యం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం 0-50 యూనిట్ల స్లాబ్‌కు ఉన్న రూ.1.45ల టారిఫ్‌ను రూ.1.95లకు పెంచనున్నది.

ఉద్యమాల దృష్టి మరలించేందుకే
రాష్ట్ర ప్రజానీకం దృష్టి అంతా తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె ఉద్యమం వైపు ఉండడం, సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే కరెంటు చార్జీలను పెంచడం ద్వారా ఉద్యమాల తీవ్రతను మళ్లించేందుకు రాష్ట్ర సర్కార్ కుట్ర పన్నుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పేద, మధ్యతరగతి వినియోగదారులపై గత తొమ్మిదేళ్ళుగా విద్యుత్ భారం మోపేందుకు ఎవ్వరూ సాహసించలేదు. రెండేళ్ళ క్రితం (రోశయ్య హయాంలో) 500 యూనిట్ల వినియోగానికి పైబడిన వర్గాలకు మాత్రం చార్జీలను పెంచారు.

ఉచిత కరెంటుకు ఉరి
వ్యవసాయరంగానికి ఉచిత కరెంటు పథకం ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం అధికారికంగా రాష్ట్రంలో 29.3లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ వర్తిస్తున్నది. అనధికారికంగా క్రమబద్ధీకరణ కోసం మరో 5లక్షల వరకు వ్యవసాయ కనెక్షన్లు ఎదురుచూస్తున్నాయి. అయితే వీటిలో తెలంగాణ జిల్లాల్లో బోరుబావులపై వ్యవసాయం అధారపడి ఉండడంతో వ్యవసాయ కనెక్షన్ల క్రమద్ధీకరణ కూడా తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటున్నది. ఉచిత విద్యుత్‌కు సబ్సిడీ భారం పెరిగిపోతుందనే నెపంతో వ్యవసాయ కనెక్షన్లకు సాంకేతిక అంశాలను అంటగడుతూ ఉచిత కరెంటుకు మంగళం పలికేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని తెలుస్తున్నది.

ఇందుకు సాంకేతికంగా 5హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 3వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నది. ప్రస్తుతం రైతులు 5హెచ్‌పీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వాడుతున్నారని, కొన్ని చోట్ల 15హెచ్‌పీ మోటార్లను కూడా వాడుతున్నారని, వాటి వల్ల విద్యుత్ వాడకం పెరిగిపోతుందని, తద్వారా సర్కారుపై సబ్సిడీ భారం పెరిగిపోతుందని చెబుతూ రైతన్నలపై సర్కారు నెపం వేస్తున్నది. ఈ క్రమంలోనే ఇకపై కేవలం 5హెచ్‌పీ కలిగిన 3సర్వీసులకు మాత్రమే ఉచిత విద్యుత్ వర్తించేలా మార్పులు తేవాలనుకుంటున్నది.

ఇకపై టీఓడీ చార్జీలు
మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు వంటి హెచ్‌టీ-కమర్షియల్ (కేటగిరి-2) సర్వీసులకు టైమ్ ఆఫ్ ది డే (టీఓడీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు చేస్తున్నదని సమాచారం. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్) సాధారణ రేట్ల కన్నా కనీసం ఒక రూపాయి అదనంగా వసూలు చేసేందుకు టీఓడీ విధానం ఉపకరిస్తుంది. ముఖ్యంగా పీక్ అవర్స్ అంటే ఉదయం 6గం. నుంచి 9 గం. మధ్య, సాయంత్రం 6 గం. నుంచి రాత్రి 9 గం. మధ్య విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల, ఆ సమయాల్లో విద్యుత్ వినియోగానికి అదనంగా ఒక రూపాయి వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ భారాన్నిమోయలేని వారు ఆ సమయాల్లో కరెంటు వాడకాన్ని తగ్గించుకుంటారనేది విద్యుత్ సంస్థల ఆలోచన. ఇందు కోసం నేషనల్ బిల్లింగ్ ప్లాన్ (ఎన్‌బీపీ)లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎన్‌బీపీలో చదరపు గజానికి ఎంత లైటింగ్ ఉండాలి? ఆఫీసుల్లో పగటి వేళ ఎంత లైటింగ్ ఉండాలి? వాణిజ్య సముదాయాల్లో లైటింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా చార్టెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిల్లింగ్ సర్వీసెస్ ఇంజనీర్స్ (సీఐబీఎస్‌ఈ) అధ్యయనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

తాగునీటి పథకాలపై భారం?
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలపై మూడింతల కరెంటు భారం పెరగనుంది. నిర్దేశించిన దాని కంటే ఎక్కువ విద్యుత్ వాడకం జరుగుతుందని, ఫలితంగా ఎంతో విలువైన విద్యుత్ వృథా అవుతున్నదనే అభివూపాయంతో సర్కారు ఉంది. మైనర్ పంచాయితీల్లో తాగునీటి పథకాల(పీడబ్ల్యూఎస్)కు ప్రస్తుతం అమలు చేస్తున్న రేట్లను మూడింతలు పెంచే విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని సమాచారం. పీడబ్ల్యూఎస్ కరెంటు వాడకానికి ప్రస్తుతం యూనిట్‌కు 0.70పైసలు ఉండగా, దానిని కాస్తా రూ.2లకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

వీధి దీపాల వెలుగులకు కత్తెర
పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు వీధి దీపాల (కేటగిరీ-6) విద్యుత్ వినియోగంపై ప్రస్తుతం ఉన్న రేట్లను పునఃపరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటులోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదనేది విద్యుత్ సంస్థల అభివూపాయం. దీంతో ఎక్కడ పడితే అక్కడ, అవసరాలకు మించి లైటింగ్ అనే అంశాలపై ఒక కొలమానం ఉండాలనే కొత్త అంశాన్ని విద్యుత్ సంస్థలు తెరపైకి తీసుకువస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా కేంద్రా లు, గ్రేడ్‌ల వారీగా మున్సిపాలిటీలలో జనాభా ఆధారంగా వీధి దీపాల వినియోగం ఉండాలని సూచిస్తున్నాయి.

ప్రీ-పెయిడ్ మీటర్లకు స్వస్తి
సెల్ ఫోన్ సేవల మాదిరిగా వినియోగదారుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసేందుకు ప్రి-పెయిడ్ మీటర్ సర్వీసెస్‌లు అందించలేమని విద్యుత్ సంస్థలు రెగ్యులేటరీ కమిషన్‌కు నివేదిస్తున్నాయి. సెల్‌ఫోన్ కంపెనీలకు ఉన్నటువంటి సదుపాయాలు డిస్కమ్‌లకు లేవని, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇప్పట్లో తాము సమకూర్చలేమంటూ చేతులు ఎత్తేస్తున్నాయి. బిల్లింగ్‌లో ప్రి-పెయిడ్ మీటర్ క్లాజ్‌ను తొలగించాలని ఈఆర్సీని కోరుతున్నాయి.

మున్ముందు కరెంటు మీటర్లకు అద్దెలు?
కరెంటు మీటర్ల అందించినందుకు వాటిపై నెలసరి అద్దెలు వసూలు చేసే అధికారం కల్పించాలని డిస్కమ్‌లు ఈసారి ప్రతిపాదిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఎల్‌టీ సర్వీసు కనెక్షన్ మంజూరుకు వసూలు చేస్తున్న రుసుము కేవలం దరఖాస్తు రుసుము, డెవలప్‌మెంట్ చార్జీలకే సరిపోతున్నదని, మీటర్ బిగించినందుకు డిస్కమ్‌లకు అదనపు ఆదాయం లేకపోవడంతో వాటితో నిమిత్తం లేకుండా మీటర్ రెంట్(మీటర్ అద్దె) వసూలుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. గృహ వినియోగదారుల నుంచి నెలకు రూ.10ల నుంచి రూ.15లు మీటర్ అద్దెగా వసూలు చేసుకునేందుకు, సీటీ మీటర్ సర్వీసులకు రూ.110లు, హెచ్‌టీ మీటర్ సర్వీసులకు రూ.700ల చొప్పున అద్దె వసూలు అధికారాలు కల్పించాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈఆర్సీని కోరనున్నాయని తెలిసింది.

Take By: T News


Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP